Koala
-
అయ్యో! ఎంత విషాదం: గుండె పగిలిందంటున్న నెటిజనులు
మాట్లాడటం మినహా, మనుషులకుండే అన్ని భావోద్వేగాలు ప్రపంచంలోని అన్ని ఇతర జీవుల్లోనూ సహజమే. ఆకలి దప్పికలతోపాటు, కోపం,శోకం, దుంఖం ఇలా అన్ని ఫీలింగ్స్ ఉంటాయి. తాజాగా జీవిత సహచరుడిని కోల్పోవడాన్ని మించిన విషాదం మరొకటి ఉండదు. అలా ఒకచెట్టుకింద, ప్రేయసిని కోల్పోయి విలపించిన కోలా హృదయ విదారక వీడియో ఒకటి నెట్టింట తెగషేర్ అవుతోంది. సౌత్ ఆస్ట్రేలియన్ వాలంటీర్ కోలా రెస్క్యూ గ్రూపు ఈ కోలాని గుర్తిచింది. అక్కడ చనిపోయిన ఆగ కోలాను పట్టుకుని మగ కోలా విలపిస్తోంది. ఇది చాలా హృదయ విదారకంగా ఉంటూ ఈ టీం ఈ వీడియోను సోషల్‌మీడియాలో షేర్ చేసింది. ఈ జంటను చూసినప్పుడు గుండె పగిలిందన్నారు కోలా రెస్క్యూ అధికారి హార్ట్లీభావోద్వేగానికి లోనయ్యారు. అత్యంత విషాదకరమైన వీడియో. గుండె పగిలిపోయింది.. నా కళ్లలోనూ నీళ్లు తిరుగుతున్నాయంటూ చాలామంది కమెంట్ చేశారు. ఈ వీడియో ఇప్పటికే 12 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకుంది. A koala mourning its female friend who has passed , holding and hugging her pic.twitter.com/zLO9JZE3Ox — Science girl (@gunsnrosesgirl3) February 23, 2024 కాగా ఆస్ట్రేలియా తూర్పు ప్రాంతంలోని యూకలిప్టస్ అడవుల్లో ఇవి కనిపిస్తాయి. యూకలిప్టస్ ఆకులు తింటాయి. ఈ ఆకులే వాటి ఏకైక, ప్రధాన ఆహారం. అంతేకాదు ప్రపంచంలోనే రోజుకు 22 గంటలు నిద్రించే జంతువు. తమ జీవితకాలంలో ఒక్కసారి కూడా నీళ్లు తాగవు. అందుకే వీటిని 'నో డ్రింక్' జంతువు అని కూడా అంటారు. ఆకుల్లో ఉండే తేమే వీటికి ఆధారం. -
వైరల్: క్రిస్మస్ చెట్టు మీద కోలా
కాన్బెర్రా: రేపే క్రిస్మస్ పండుగ. ఇప్పటికే ఎంతో మంది క్రిస్మస్ చెట్లను అందంగా అలంకరించి పెట్టుకున్నారు. ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌కు చెందిన కుటుంబం కూడా క్రిస్మస్ చెట్టును బెలూన్లు, లైట్లు, స్టార్లతో అందంగా రెడీ చేసింది. అయితే ఏదో పని మీద ఇంటిసభ్యులు మధ్యాహ్నం బయటకు వెళ్లారు. ఇంతలో ఎలా వచ్చిందో ఏమో కానీ ఓ కోలా ఇంట్లో దూరి అది నిజమైన చెట్టు అనుకుని దాన్నే అంటిపెట్టుకుంది. తిరిగి ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు కూడా దాన్ని చూసి మొదట ఏదో బొమ్మ అని భ్రమ పడ్డారు. (చదవండి: అనకొండకు చిక్కి.. ప్రాణాల కోసం విలవిల) కానీ అది నిజమైన కోలా అని అర్థం కావడంతో ఆశ్చర్యానికి లోనయ్యారు. వీరిని చూసి భయపడ్డ కోలా చెట్టు దిగి రావడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. తర్వాత రెస్క్యూ బృందం రంగంలోకి దిగి కోలాను తీసుకుని అడవిలో వదిలిపెట్టారు. ఈ సంఘటన గురించి ఆ కుటుంబంలోని పదహారేళ్ల అమ్మాయి మాట్లాడుతూ.. 'అది నిజమైన చెట్టు కాదు, పాతది కూడా. అయినా సరే కోలా ఆ చెట్టు ఆకులను నమలడానికి ప్రయత్నించింది. కానీ అది ప్లాస్టిక్ అని అర్థం కావడంతో వాటిని తినడం ఆపేసింది' అని చెప్పింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. (చదవండి: వైరల్: వధువు పాదాలను మొక్కిన వరుడు..) -
వందకు పైగా జీవులను కాపాడిన శునకం
కాన్బెర్రా: బేర్.. మామూలు శునకం కాదు.. వంద జంతువులను కాపాడిన వీర శునకం. "పది మందిని కాపాడటం కోసం మన ప్రాణం పోయినా సరే" అన్న వాక్యాన్ని అక్షరాలా పాటిస్తోంది. గత ఏడాది ఆస్ట్రేలియాలో అడవుల్లో కార్చిచ్చు మొదలైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నేటి వరకు మంటల్లో చిక్కుకున్న వందకు పైగా కోలాలను ఈ కుక్క ప్రాణాలకు తెగించి కాపాడింది. అయితే మొదట్లో దీనికున్న ఒబెసివ్ కంపల్సివ్ వ్యాధి కారణంగా కనీసం ఆడుకోడానికి కూడా పంపించేవారు కాదు. కానీ తర్వాత దీన్ని ఓ యూనివర్సిటీ వారు అక్కున చేర్చుకుని దానికి ప్రమాదాల సమయంలో ఇతరులను ఎలా కాపాడాలో తర్ఫీదు ఇచ్చారు. అలా కార్చిచ్చు అంటుకున్న సమయంలో దీని సేవలను వినియోగించుకున్నారు డ్రోన్ల ద్వారా చెట్టు, పుట్టల్లో దాక్కున్న కోలాలను గుర్తించి వాటిని రక్షించేందుకు బేర్‌ను పంపించేవారు. (ఆస్ట్రేలియాను రక్షించేదెవరు?) అలా చుట్టుముట్టుతున్న మంటలను ఏమాత్రం లెక్క చేయకుండా పరుగెత్తుకుంటూ వెళ్లి గాయపడిన కోలాలను కాపాడింది. ప్రస్తుతం దీని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రతి ఒక్కరూ దాని సాహసానికి నీరాజనాలు పలుకుతున్నారు. ఇదిలా వుండగా గతేడాది జూన్‌లో ప్రారంభమైన కార్చిచ్చు ఈయేడు మార్చికి చల్లారింది. ఇప్పటివరకు పద్దెనిమిది మిలియన్ల హెక్టార్ల అగ్గి బుగ్గగ్గవగా 5,900 ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. కోట్లాదిమంది నిరాశ్రయులయ్యారు. మంటల్లో చిక్కుకున్న లక్షలాది జంతువులు బూడిదగా మారాయి. అయితే ఇప్పటికీ అడవిలో ఇంకా ఎన్నో జంతువులు ఆకలితో చివరి దశలో ఉన్నాయని రక్షణ బృందంలోని ఓ సహాయకుడు పేర్కొన్నాడు. వాటిని కనుగొని సరైన ఆహారాన్ని అందించి ఆ తరువాత తిరిగి అడవి ఒడిలోకి పంపిస్తామని తెలిపాడు. (చెలరేగిన మంటలు.. భయంతో పరుగులు) -
వైరల్ : వాటిని కాపాడి నిజమైన హీరోలయ్యారు
-
వైరల్ : వాటిని కాపాడి నిజమైన హీరోలయ్యారు
సిడ్నీ : ప్రస్తుతం ఆస్ట్రేలియాను కార్చిచ్చు అతలాకుతులం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దేశంలోనే పలు రాష్ట్రాలకు కార్చిచ్చు అంటుకొని వేలాది జంతువులు బలైపోయాయి. ఆస్ట్రేలియాలోని కంగారు ఐలాండ్ కూడా కార్చిచ్చు భారీన పడింది. ఈ ఐలాండ్‌లోనే కోలా అనే జంతువులు తమ జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. తాజాగా ఇద్దరు టీనేజర్లు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కోలాలను కాపాడి తమ కారులో భద్రపరిచి మానవత్వాన్ని చాటుకున్నారు. ఎవరు ఏమైతే మాకేంటి అన్న ధోరణిలో వెళ్తున్న ప్రస్తుత సమాజంలో ఏదో ఒక మూల మానవత్వం అనేది ఇంకా మిగిలేఉందని మీకా,కాలేబ్లు నిరూపించారు. అయితే ఇదంతా వారి కజిన్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియో కారులో వారు కాపాడిన సుమారు 20 కోలాలు ఉన్నట్లు తెలిసింది. ఆ వీడియోతో పాటు ఒక సందేశాన్ని కూడా జత చేశాడు. 'ఈరోజు మీకా, కాలేబ్లు చేసిన పని నాకెంతో నచ్చింది. కార్చిచ్చు అంటుకున్న కంగారు ఐలాండ్‌లో తమ ప్రాణాలకు తెగించి కోలాను కాపాడడం నిజంగా అద్భుతం. వారు కాపాడిన కోలాలు ఇప్పుడు సురక్షితంగా ఉన్నాయంటూ. మా కజిన్స్ చేసిన పనికి ప్రభుత్వం మెచ్చుకుంటుందేమో చూడాలి' అంటూ అతను పేర్కొన్నాడు. మీకా, కాలెబ్లు కలిసి దాదాపు 20 కోలాలను కాపాడారు. కంగారు ఐలాండ్‌లో మళ్లీ సాధారణ పరిస్థితులు వచ్చేవరకు కోలాను తామే పెంచుకుంటామని స్పష్టం చేశారు. మొత్తం 14 సెకన్ల నిడివి ఉన్న వీడియో ప్రసుత్తం వైరల్‌గా మారింది. తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆ మూగ జీవాలను కాపాడి నిజమైన హీరోలయ్యారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
వైరల్ : ప్రాణాలకు తెగించి కోలాను కాపాడింది
న్యూసౌత్ వేల్స్ : ఆస్ట్రేలియా తూర్పు కోస్తా ప్రాంతంలో ప్రారంభమైన కార్చిచ్చు సిడ్నీ నగరం సబర్బన్ ప్రాంతాలను పాకి ప్రజలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. వెయ్యి కిలోమీటర్ల పరిధిలోని దాదాపు 1,50,000 హెక్టార్లలో అడవులను ఆవహించిన కార్చిచ్చు ఇప్పటికి తగలబడుతూ భయానక వాతావరణాన్ని సృష్టిస్తుంది. తాజాగా ఆస్ట్రేలియాలోని తూర్పు ప్రాంతంలో ఉన్న అడవిలో మంటల్లో చిక్కుకున్న ఎలుగుబంటి జాతికి చెందిన కోలాను ఒక మహిళ ప్రాణాలకు తెగించి కాపాడిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. కాగా, బుధవారం న్యూ సౌత్ వేల్స్ ప్రాంతంలో ఉన్న అటవీ ప్రాంతంలో బారీగా కార్చిచ్చు అంటుకొని 110 అడుగుల ఎత్తులో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో చెట్ల పొదళ్లకు కార్చిచ్చు అంటుకోవడంతో కోలా తప్పించుకోవడానికి ప్రయత్నించగా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న టోనీ డోహర్తి అనే మహిళ చెట్ల పొదల్లో చిక్కుకున్న కోలాను చూసి దానిని కాపాడడానికి పరిగెత్తింది. దానిని మంటల నుంచి బయటికి తీసి తను వేసుకున్న షర్ట్‌ను విప్పి మంటలను అదుపు చేసేందుకు దాని చుట్టూ కప్పి కారు దగ్గరికి తీసుకువచ్చారు. కోలాకు ఆహారం పెట్టి నొప్పి తెలియకుండా ఉండేందుకు నీరు చల్లారు. తర్వాత దానిని పూర్తిగా బ్లాంకెట్‌తో కప్పి ప్రథమ చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న కోలా శరీరం బాగా కాలిపోవడంతో పరిస్థితి విషమంగానే ఉంది. ప్రసుత్తం ఈ వీడియో వైరల్‌గా మారి నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటుంది. టోనీ డోహర్తి చేసిన పనికి ప్రపంచవ్యాప్తంగా ఆమె ఒక యోధురాలు అంటూ ప్రశంసిస్తున్నారు. తనకు ఏమైనా పర్వాలేదు ఎలాగైనా కోలాను కాపాడాలని ఆమె చేసిన ప్రయత్నాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. -
పార్క్‌లో వికృతచర్య.. నెటిజన్లు ఫైర్
సిడ్నీ : ఆస్ట్రేలియాలోని ఓ పార్క్‌లో దారుణం చోటు చేసుకుంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వికృతచర్యకు పాల్పడ్డారు. ఏ మాత్రం జాలి లేకుండా మూర్ఖంగా, అనాగరికంగా వ్యవహరించారు. ఓ కోవాలా(ఎలుగు బంటి రూపంలో ఉండే చిన్న ప్రాణి. ఉడుతలకుండే జుట్టు మాదిరిగా వీటి జుట్టు ఉంటుంది)ని చంపడమే కాకుండా కర్కశంగా దానిని ఓ పోల్‌కు శీలలతో బిగించారు. దీనిపై ఆస్ట్రేలియాలోని సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగుతోంది. జంతు ప్రేమికులు ఈ ఘటనపై తీవ్రంగా మండిపడుతున్నారు. ముఖ్యంగా కోవాలా రెస్క్యూ క్వీన్‌లాండ్(కేఆర్క్యూ) దీనిపై తీవ్రంగా స్పందిస్తోంది. బ్రిస్బేన్‌కు 175 కిలోమీటర్ల దూరంలోని జింపీకి సమీపంలో బ్రూలూ పార్క్ లుకౌట్ అనే పార్క్ ఉంది. అక్కడో పిక్నిక్ సెంటర్ కూడా కలదు. అయితే, అక్కడి చెట్లు, స్తంబాలను కోవాలు సరదాగా అప్పుడప్పుడు ఎక్కుతుంటాయి. అయితే, తొలుత అంతా అది పోల్‌పై ఎక్కిందని అనుకున్నారు. కానీ, స్పష్టంగా పరిశీలించగా దానిని చంపి పోల్‌కు స్క్రూలతో బిగించి పెట్టారని గుర్తించారు. దీనిపై కేఆర్క్యూ అధికారులు స్పందిస్తూ 'ఇప్పటి వరకు తుపాకులను ఉపయోగించి కోవాలాను కొంతమంది దుండగులు చంపడం చూశాం. కానీ, ఈ కోవాలాను చంపిన వారు అసలు మనుషులే కాదు. ఇలా జరగడం తొలిసారి. సమాజం ఎంత చెడుగా మారుతుందో ఈ సంఘటన పెద్ద ఉదాహరణ. ఈ సంఘటన చూస్తేనే మనసు చివుక్కుమంటోంది' అంటూ వ్యాఖ్యానించారు. కాగా, దానిని అంతక్రూరంగా చంపినవారిని అరెస్టు చేసి అంతకంటే క్రూరమైన శిక్ష వేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఆస్ట్రేలియాలో కోవాలాలకు గత కొంతకాలంగా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ జంతువులు ఆస్ట్రేలియాలో కంగారుల మాదిరిగానే ప్రత్యేకం. -
టైరును రాసుకుంటూ.. 16కిమీ ప్రయాణించి
ఆడిలైడ్ : ప్రపంచంలో అంతరిస్తున్న అరుదైన జీవుల జాబితాలో ఆస్ట్రేలియాకు చెందిన కొఆలా ఉంది. అయితే అనుకోకుండా ప్రమాదాన్ని కొరితెచ్చుకొని తృటిలో ప్రాణాపాయస్థితి నుంచి తప్పించుకుంది ఓ ఆడ కొఆలా. ఆడిలైడ్ శివారు ప్రాంతంలో పార్కింగ్ స్థలంలో ఆగిన ఓ కారు టైరు పైన ఉన్న ఆక్సల్ను పట్టుకుంది. ఇది గమనించకుండానే కారు యజమాని తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. దాదాపు 16 కిలో మీటర్లు వెళ్లిన తర్వాత బయట నుంచి శబ్ధం రావడంతో కారు ఆపి చూసే సరికి వెనక టైరు వద్ద కొఆలా ఉండటాన్ని గమనించాడు. వెంటనే రెస్క్యూ టీంకు సమాచారం అందించాడు. తీవ్రగాయాలతో అరుస్తున్న కోఆలాను టైర్ తీసి రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు. కొఆలాను బయటకు తీసిన తర్వాత దాని వెంట్రుకల నుంచి కాలిన వాసనను గమనించానని ఫౌనా సంరక్షణ స్వచ్ఛంద సంస్థకు చెందిన జేన్ బ్రిస్టర్ తెలిపారు. ప్రయాణంలో ఉన్న కారు టైరుకు అతిదగ్గరగా ఉండటంతో రాపిడి జరిగి కొఆలా వెంట్రుకలు కొద్ది భాగం కాలిపోయాయి. అయితే సరైన సమయంలో డ్రైవర్ స్పందించి కారు ఆపడంతో పెనుప్రమాదం తప్పింది. స్పల్పగాయాల నుంచి కొఆలా కోలుకున్న తర్వాత దాన్ని తీసుకువెళ్లి అడవిలో వదిలి పెట్టారు. ప్రపంచ వ్యాప్తంగా కేవలం లక్ష కొఆలాలు మాత్రమే ఉన్నట్టు ఆస్ట్రేలియన్ కొఆలా ఫౌండేన్ తెలిపింది. తృటిలో ఈ అరుదైన జీవి ప్రాణాపాయం నుంచి బటయ పడటంతో జంతు ప్రేమికులు ఆనందం వ్యక్తం చేశారు.