Heartbreaking
-
వరద విధ్వంసం.. హృదయ విదారక దృశ్యాలు (ఫోటోలు)
-
ఆమెకు 25.. అతడికి 42.. బాయ్‌ఫ్రెండ్‌తో సబలెంక (ఫొటోలు)
-
అయ్యో! ఎంత విషాదం: గుండె పగిలిందంటున్న నెటిజనులు
మాట్లాడటం మినహా, మనుషులకుండే అన్ని భావోద్వేగాలు ప్రపంచంలోని అన్ని ఇతర జీవుల్లోనూ సహజమే. ఆకలి దప్పికలతోపాటు, కోపం,శోకం, దుంఖం ఇలా అన్ని ఫీలింగ్స్ ఉంటాయి. తాజాగా జీవిత సహచరుడిని కోల్పోవడాన్ని మించిన విషాదం మరొకటి ఉండదు. అలా ఒకచెట్టుకింద, ప్రేయసిని కోల్పోయి విలపించిన కోలా హృదయ విదారక వీడియో ఒకటి నెట్టింట తెగషేర్ అవుతోంది. సౌత్ ఆస్ట్రేలియన్ వాలంటీర్ కోలా రెస్క్యూ గ్రూపు ఈ కోలాని గుర్తిచింది. అక్కడ చనిపోయిన ఆగ కోలాను పట్టుకుని మగ కోలా విలపిస్తోంది. ఇది చాలా హృదయ విదారకంగా ఉంటూ ఈ టీం ఈ వీడియోను సోషల్‌మీడియాలో షేర్ చేసింది. ఈ జంటను చూసినప్పుడు గుండె పగిలిందన్నారు కోలా రెస్క్యూ అధికారి హార్ట్లీభావోద్వేగానికి లోనయ్యారు. అత్యంత విషాదకరమైన వీడియో. గుండె పగిలిపోయింది.. నా కళ్లలోనూ నీళ్లు తిరుగుతున్నాయంటూ చాలామంది కమెంట్ చేశారు. ఈ వీడియో ఇప్పటికే 12 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకుంది. A koala mourning its female friend who has passed , holding and hugging her pic.twitter.com/zLO9JZE3Ox — Science girl (@gunsnrosesgirl3) February 23, 2024 కాగా ఆస్ట్రేలియా తూర్పు ప్రాంతంలోని యూకలిప్టస్ అడవుల్లో ఇవి కనిపిస్తాయి. యూకలిప్టస్ ఆకులు తింటాయి. ఈ ఆకులే వాటి ఏకైక, ప్రధాన ఆహారం. అంతేకాదు ప్రపంచంలోనే రోజుకు 22 గంటలు నిద్రించే జంతువు. తమ జీవితకాలంలో ఒక్కసారి కూడా నీళ్లు తాగవు. అందుకే వీటిని 'నో డ్రింక్' జంతువు అని కూడా అంటారు. ఆకుల్లో ఉండే తేమే వీటికి ఆధారం. -
అనుకున్నామనీ జరగవు అన్నీ...కన్నీళ్లు పెట్టించే లవ్ స్టోరీ!
కొన్ని ప్రేమ కథలు హృద్యంగా ఉంటాయి. మరికొన్ని ప్రేమ కథలు కన్నీరు పెట్టిస్తాయి. అలాంటి వాటిల్లో ఒక జంట ప్రేమ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరి ప్రేమికుల్లాగానే ఎన్నో కబుర్లు చెప్పుకుంది ఈ జంట. అందమైన జీవితాన్ని కలగంది. నిశ్చితార్థాన్ని కూడా చేసుకున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే బావుండేది... కానీ విధి మరోలా ఉంది. మాయదారి మహమ్మారి వారి ప్రేమ కథను విషాదాంతం చేసింది. హీథర్, డేవిడ్ మోషెర్ 2015లో స్వింగ్ డ్యాన్స్ క్లాస్‌లో కలుసుకున్నారు. తొలుత చూపులు, ఆ తర్వాత మాటలు కలిసాయి. కొన్ని నెలల డేటింగ్ తరువాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. బంధువులు, సన్నిహితుల మధ్య నిశ్చితార్థ వేడుకను నిర్వహించుకున్నారు. 2017, డిసెంబర్ 30 తమ పెళ్లి ముహూర్తంగా ఖాయం చేసుకున్నారు. అయితే ఇక్కడే వారి జీవితాల్లో పెద్ద అలజడి రేగింది. హీథర్‌కు చాలా ప్రమాదకరమైన ట్రిపుల్-నెగటివ్ రొమ్ము కేన్సర్ నిర్ధారణ అయింది. అంతే..అంతా తారుమారు. టెస్ట్‌లు, కీమోథెరపీలతో ఆసుపత్రులు చుట్టూ తిరగడమే సరిపోయింది. కనెక్టికట్‌లోని హార్ట్‌ఫోర్డ్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ హాస్పిటల్లో తన ప్రియురాలు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య పోరాడుతోంది. మరోవైపు ఉబికి వస్తున్న కన్నీళ్లను అదుముకుంటూ ఆసుపత్రి బెడ్ పైనే ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమె కోరిక మేరకు ఆసుపత్రి బెడ్ పెళ్లి వేదికగా మారింది. ఆసుపత్రి సిబ్బంది, కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్న సరిగ్గా ఏడాదికి ప్రియురాలిని వివాహం చేసుకున్నాడు. పంటి బిగువున శారీరక బాధను భరిస్తూ భర్తగా మారిన ప్రియుడిని ప్రేమతో ఆలింగనం చేసుకున్న ఆ చేతులు 18 గంటల తరువాత అచేతనంగా మిగిలి పోయాయి. భర్తను చూస్తూ శాశ్వత నిద్రలోకి జారిపోయింది హీథర్. మరో విషాదం ఏమిటంటే పెళ్లి చేసుకోవాలనుకున్న డిసెంబరు 30నే ప్లాంట్స్విల్లే కాంగ్రెగేషనల్ చర్చిలో హీథర్ మోషర్ అంత్యక్రియలు ముగిసాయి. 2018లో అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. నాన్ ఈస్తటిక్ థింక్స్ అనే ట్విటర్ హ్యాండిల్ ఈ స్టోరీని ట్విటర్లో మళ్లీ షేర్ చేసింది. కేవలం 14 గంటల్లోనే 17 మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. This woman got married in a hospital hours before she died of cancer 😢 pic.twitter.com/vKcVQPKaaK — non aesthetic things (@PicturesFoIder) January 29, 2024 -
Turkey–Syria Earthquake: 24 వేలు దాటిన భూకంప మృతుల సంఖ్య
అంకారా/న్యూఢిల్లీ: తుర్కియే(టర్కీ), సిరియాలో భూకంప మృతుల సంఖ్య ఏకంగా 24,000 దాటింది. సహాయక చర్యలతోపాటు శిథిలాల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. భీకర భూకంపం సంభవించి 100 గంటలు గడిచిపోయింది. శిథిలాల కింద మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. కొందరు సజీవంగా బయటపడడం ఊరట కలిగిస్తోంది. తుర్కియేలో శిథిలాలను తొలగిస్తుండగా శుక్రవారం ఒక్కరోజే 100 మందికిపైగా బాధితులు ప్రాణాలతో బయటకు వచ్చారు. కొన్నిచోట్ల హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. తీవ్రమైన చలిలో ఆకలి బాధలతో ప్రాణాలు నిలుపుకొనేందుకు వారుపడిన కష్టాలు వర్ణనాతీతం. శిథిలాల కింద ఇరుక్కుపోయి, బయటపడే మార్గం లేక కేవలం మూత్రం తాగి ఆకలిదప్పులు తీర్చుకున్నామని బాధితులు చెబుతుండడం కన్నీరు పెట్టిస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. తుర్కియేలో అంత్యక్రియల కోసం తీసుకొస్తున్న మృతదేహాలతో ఇప్పటికే శ్మశానాలు కిక్కిరిసిపోతున్నాయి. చాలా సమయం వేచి చూడాల్సి వస్తోందని మృతుల బంధువులు చెబుతున్నారు. ఈ భూకంపం ‘ఈ శతాబ్దపు విపత్తు’ అని తుర్కియే అధ్యక్షుడు తయీఫ్ ఎర్డోగాన్ వ్యాఖ్యానించారు. భూకంపం వల్ల తీవ్రంగా నష్టపోయిన తుర్కియేకు దాదాపు 95 దేశాలు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. సిరియా అధ్యక్షుడు బషర్ అసద్, ఆయన భార్య అస్మా శుక్రవారం అలెప్పో యూనివర్సిటీ ఆసుపత్రిలో భూకంప మృతులను పరామర్శించారు. భూకంపం సంభవించినప్పటి నుంచి ఆయన బహిరంగంగా కనిపించడం ఇదే మొదటిసారి. 75,000 మంది నిరాశ్రయులు భూకంపం వల్ల తుర్కియేలో ఇప్పటిదాకా 18,900 మంది మరణించారని, దాదాపు 75,000 మంది గాయపడ్డారని తుర్కియే డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వెల్లడించింది. ఇళ్లు కూలిపోవడంతో 75,000 మందికిపైగా జనం నిరాశ్రయులైనట్లు అంచనా వేస్తున్నామని తెలిపింది. సిరియాలో భూకంపం కారణంగా 3,300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం ధ్రువీకరించింది. రెండు దేశాల్లో కలిపి ఇప్పటివరకు 22,000 మందికి పైగా బలైనట్లు తెలుస్తోంది. తుర్కియేలో 12,000 దాకా భవనాలు నేలమట్టం కావడమో లేక దెబ్బతినడమో జరిగిందని మంత్రి మురాత్ కరూమ్ చెప్పారు. తుర్కియే ప్రజలకు అండగా ఉంటాం: మోదీ ‘ఆపరేషన్ దోస్త్’లో భాగంగా తుర్కియేలో భూకంప ప్రభావిత ప్రాంతాల్లో మన దేశ సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం తెలిపారు. రిలీఫ్, రెస్క్యూ ఆపరేషన్లలో చురుగ్గా పాల్గొంటున్నాయని చెప్పారు. సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రాణాలను, ఆస్తులను కాపాడడానికి మన బృందాలు కృషి చేస్తూనే ఉంటాయని ట్విట్టర్లో వెల్లడించారు. ఈ సంక్షోభ సమయంలో తుర్కియే ప్రజలకు భారత్ పూర్తిస్థాయిలో అండగా నిలుస్తుందని మోదీ హామీ ఇచ్చారు. -
హృదయ విదారకం.. ఒంటరిగా ఏడూస్తూ ఉక్రెయిన్ వీడుతున్న బాలుడు
ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మంగళవారానికి 13వ రోజుకు చేరుకుంది. రెండు దేశాల మధ్య భీకర పోరు కొనసాగుతూనే ఉంది. అయితే ఉక్రెయిన్ నుంచి పౌరులు తరలిపోయేందుకు వీలుగా కొన్ని మార్గాల్లో రష్యా తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో వేల మంది సైనికులు, వందలాది పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. యుద్ధ భయంతో లక్షలాది మంది దేశం విడిచి పొరుగు దేశాలైన పోలాండ్, హంగేరీ, రోమేనియాకు పోటెత్తుతున్నారు. ఉన్న ఉరిని వదిలి కట్టుబట్టలతో సరిహద్దులు దాడుతున్నారు. ఈ క్రమంలో ఎన్నో హృదయ విదారక దృశ్యాలు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోలు గుండెలను పిండేస్తున్నాయి. తాజాగా ఓ బాలుడు దేశం వదిలి వెళ్లిపోతున్న దృశ్యం అందరినీ కలచివేస్తోంది. రష్యా దాడులకు భయపడి ఉక్రెయిన్ సరిహద్దులో ఒంటరిగా ఏడ్చుకుంటూ వలస పోతున్నాడు. ఇందుకు సంబంధించి వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. చదవండి: రష్యా అరాచకం.. ఉక్రెయిన్‌పై 500 కిలోల భారీ బాంబు ప్రయోగం The little boy in tears crosses the border alone with a plastic bag in his hand. ☹️❤️ #Ukraine #Ukrainian #StopPutinNOW pic.twitter.com/A90i0rTNPU — Eurovision Croatia 🇭🇷 (@esccroatia) March 7, 2022 శనివారం రోజు బాలుడు తన భుజంపై ఓ బ్యాగ్, అందులో బొమ్మను మోసుకుంటూ ఉక్రెయిన్ నుంచి పోలాండ్లోని మెడికాకు నడుచుకుంటూ వెళుతూ కనిపించాడు. అయితే బాలుడు ఒక్కడే వెళుతున్నాడా, ముందు వెనక తన వాళ్లు ఎవరైనా ఉన్నారా, ఆ అబ్బాయి ఎవరనే విషయాలపై స్పష్టత లేదు. దీన్ని చూసిన నెటిజన్లు.. బాలుడి పరిస్థితి చూస్తుంటే జాలేస్తోందని, కంటతడి పెట్టించే వీడియో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చదవండి: Ukraine War: కాల్పుల విరమణ వేళ.. విరుచుకుపడుతున్న రష్యా బలగాలు కాగా ఉక్రెయిన్‌పై రష్యా వరుస దాడులతో అనుక కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. తల్లి, తండ్రి, పిల్లలు తలో దిక్కులో చిక్కుకుపోయారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడం వల్ల 1.7 మిలియన్లకు పైగా ప్రజలు దేశం విడిచి వెళ్లవలసి వచ్చిందని ఐక్యరాజ్యసమితి అధికారులు తెలిపారు. ఇక రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో అత్యంత వేగంగా పెరుగుతున్న శరణార్థుల సంక్షోభం పరిస్థితి ఇదేనని ఐరాస పేర్కొంది. -
గుండెలు బరువెక్కేలా, కళ్లు చెమ్మగిల్లేలా..
Giraffe Death In Kenya: ఆరు జిరాఫీలు.. నీటి కోసం గట్లు, గుట్టలు, చెట్లు, పుట్టలు.. అడవంతా తిరిగాయి. ఒంట్లో సత్తువ నశిస్తున్నా, నిలబడటానికి కూడా ఓపిక లేకున్నా దాహం తట్టుకోలేక వెతికాయి. కాస్త దూరంలో ఏదో బురదలా కనిపించగానే నీళ్లుంటాయని పరుగున అక్కడికెళ్లాయి. అంతే.. ఆ బురదలోనే చిక్కుకుని నీరు లేక గొంతెండి.. తిండిలేక పేగులు మండి చనిపోయాయి. (చదవండి: హృదయ విదారకం.. చనిపోయిన తల్లి ఫోటోతో వధువు కన్నీళ్లు) గుండెలు బరువెక్కేలా, కళ్లు చెమ్మగిల్లేలా ఉన్న ఈ సంఘటన కెన్యాలోని సబూలీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఇటీవల జరిగింది. ఈ ఫొటోలను డిసెంబర్ 10న తీశారు. కొంతకాలంగా కెన్యా ఉత్తర ప్రాంతంలో వర్షాల్లేక కరువు పరిస్థితులు నెలకొన్నాయి. నీటి కోసం ఆ ప్రాంతంలోని ప్రాణులు అల్లాడుతున్నాయి. ఈ ఆరు జిరాఫీలు చనిపోయిన ప్రాంతానికి దగ్గర్లోని గరిస్సా కౌంటీలో 4 వేలకు పైగా జిరాఫీలున్నాయని, నీరు దొరక్కపోతే వీటికీ ప్రమాదం తప్పదని అక్కడి మీడియా చెబుతోంది. (చదవండి: అగ్ని పర్వతం బద్దలై.. బూడిదగా మారి‘నది’) -
హృదయాలను కదిలిస్తున్న ఫోటో..
కుటుంబంలో ఎవరికైనా కాన్సర్ వ్యాధి సోకితే అది ఆ కుటుంబం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. వ్యాధి తీవ్రతపై ఆందోళనతోపాటు, వైద్యానికయ్యే భారీ ఖర్చు, కీమో థెరపీ, దుష్ప్రభావాలు లాంటివాటిపైనే ఎక్కువగా మాట్లాడుకుంటాం. కానీ వీటన్నిటికి మించిన మరో కీలక విషయం వుందంటూ ఒకతల్లి తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు ఈ మహమ్మారి బారిన పడితే, వారి తోబుట్టువులు అనుభవించే వేదన, బాధ వర్ణనాతీతమంటూ ఒక ఫోటోను షేర్ చేశారు. హృదయాలను ద్రవింపచేస్తున్న ఈ ఫోటో ప్రపంచవ్యాప్తంగా వేలాది నెటిజనుల కంట తడి పెట్టిస్తోంది. అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన కైట్లిన్ బర్జ్ (28) ఈ ఫోటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. లింఫోబ్లాస్టిక్ లుకేమియాతో బాధపడుతున్న తన కుమారుడు బెకెట్ బర్జ్ (4) పై బెకెట్ స్ట్రాంగ్ అనే ఫేస్బుక్ పేజీలో తన భావాలను రాసుకొచ్చారు. అతని 5 సంవత్సరాల సోదరి ఆబ్రే బెకెట్ ఎంత దయతో సేవ చేస్తోందో, అతనికి వచ్చిన వ్యాధిపై అయోమయానికి గురి అవుతూ ఎంత ఆందోళన చెందుతోందో తెలిపారు. ఇంత చిన్న వయసులో తన పాపకు ఇవన్నీ ఎందుకు అనుభవంలోకి వచ్చేలా చేసామో కూడా ఆమె వివరణ ఇచ్చారు. ముఖ్యంగా తోబుట్టువులను అనారోగ్యంతో ఉన్నవ్యక్తికి దూరంగా ఉంచకూడదనీ, వారి పూర్తి మద్దతు, సహకారం అవసరం అని తెలిపారు. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, పరిస్థితులతో సంబంధం లేకుండా మనకు ఎంత ప్రేమ ఉందో, ఎంత జాగ్రత్త తీసుకుంటున్నామో వారికి తెలియాలని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆబ్రే తన సోదరుడికి నిజంగా ఎంతో సేవ చేసింది. ఏం జరుగుతోందో పూర్తిగా అర్థం కానప్పటికీ ..నిరంతరం అతణ్ని కంటికి రెప్పలా కాపాడుకుంది. నమ్మశక్యం కాని బంధం వారిద్దరిదీ. బెకెట్‌కు వ్యాధి సోకడం చాలా బాధగా ఉన్నప్పటికీ, వారిద్దరికి ఒకరిపై మరొకరికి ఉన్న స్వచ్ఛమైన ప్రేమ, ఆప్యాయత చాలా సంతోషాన్నిస్తోందని ఆమె రాసారు. -
ఫేస్బుక్లో ఆ ఫోటో ప్రత్యేక ఆకర్షణ
కాళ్ళకు కనీసం చెప్పులు కూడ లేవు. రద్దీగా ఉండే ప్రాంతంలో రోడ్డు పక్కన ఫుట్ పాత్ పై ఓ కార్డుబోర్డు బాక్సు పై కూర్చొని చాలా శ్రద్ధగా హోంవర్క్ చేసుకుంటోందా బాలిక. పక్కనే ఆమె సోదరి... ఇద్దరూ నలిగి.. మాసిపోయిన పైజమాలు ధరించి, మట్టి కొట్టుకు పోయిన ముఖాలతో కనిపించడం ఫిలిప్పీన్ కు చెందిన జేమ్స్ కో అనే ఫోటో గ్రాఫర్ ను ఆకట్టుకుంది. వెంటనే ఆ ఇద్దరు బాలికలను క్లిక్ మనిపించాడు. వారి వివరాలను అడిగి తెలుసుకున్నాడు. అంతటితో ఊరుకోలేదు. ఆ ఫోటోను ఫేస్ బుక్ లో కూడ పోస్ట్ చేశాడు. ఇప్పుడా ఫోటో ఫేస్ బుక్ లో ప్రత్యేక ఆకర్షణగా మారింది. పన్నెండు వేలకు పైగా లైక్ లు కూడ వచ్చాయి. సియెలో కంజేల్స్ తన సోదరి జెనలిన్... ఆ ఇద్దరు బాలికలూ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు కూడ తీక్షణంగా తమ తమ నోట్ ప్యాడ్స్ లో హోం వర్క్ చేసుకుంటూనే ఉన్నారు. వారికి దూరంగా లిండా గోంజేల్స్ అనే మహిళ వీధిలో కూర్చొని ఉంది. ఆమె బహుశా వారికి తల్లి అయి ఉండొచ్చు. సియెలో తన చేతిలోని నోట్ పుస్తకంలో అక్షరాలు దిద్దుతోంది. మరొక పుస్తకంలో లెక్కలు ప్రాక్టీస్ చేస్తూ కెమెరాలకు ఫోజిచ్చింది. అయితే ఆ ఫోటోలోని వివరాలను బట్టి వారి కుటుంబ పరిస్థితులను అంచనా వేయొచ్చు. ఫోటోను చూసిన ఓ ఫేస్ బుక్ యూజర్ మాత్రం ఈ విషయంలో స్పందించాడు. ''ఆ బాలికలు ఎవరో తెలియదు. కానీ వారికి చదువుపట్ల ఉన్న శ్రద్ధనుమాత్రం ప్రశంసించాలి. వారి చదువుకు కావలసిన సహాయం స్వచ్ఛంద సంస్థలుగాని, ప్రభుత్వం గాని అందించి ఆదుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను" అంటూ తన కామెంట్ ను పోస్ట్ చేశాడు. గతంలో కూడా ఇటువంటి ఒక దృశ్యం ఎందరినో ఆకర్శించింది. మెక్ డొనాల్డ్ రెస్టారెంట్ కిటికీ సందుల్లోంచి వచ్చే వెలుగుల్లో చదువుకుంటున్న డానియెల్ కాబెరెరా అనే మూడోక్లాసు చదువుతున్న తొమ్మిదేళ్ళ చిన్నారి స్థితిని కూడ ఫిలిప్పీన్స్ కెమెరాలో బంధించారు. మెడికల్ స్టూడెంట్ జాయిస్ టొర్రెఫ్రాంకా తీసిన ఫొటోగ్రాఫ్ ను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. దీంతో ఆ చిన్నారి పరిస్థితికే కాదు... అంత చిన్న వయసులో అతడు చదువుపై చూపిస్తున్న శ్రద్ధకు అంతా ముగ్ధులయ్యారు. లక్షలకొద్దీ ఆర్థిక సాయం అందించారు. ఓ చిన్న ఫోటో అతడి జీవితంలో ఎంతో మార్పును తెస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. మరిప్పుడు ఈ బాలికలకు కూడ అటువంటి సహాయం అందాలని ఆశిద్దాం.