![Bollywood iconic Actress Vimi Tragic story Stardom to Heartbreaking End](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/tragicstory-vimmi.jpg.webp?itok=EphSb4gK)
జీవితం పట్ల అవగాహన, క్రమశిక్షణ లేకపోతే మన సంపాదించిన కీర్తి ప్రతిష్టలు, వేల కోట్ల సంపద అన్నీ హారతి కర్పూరంలా కరిగిపోతాయి. సక్సెస్ ఒక్కటే సరిపోదు. జీవితం పట్ల స్పష్టత ఉండాలి. కీర్తి ప్రతిష్టలైనా, కోట్ల రూపాయల సంపద అయినా చివరిదాకా నిలుపుకునే కనీస అవగాహన, సత్తా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు, సినీతారల విషయంలో ఇది చాలా అవసరం. ఎదురు దెబ్బలు, అవమానాలు తప్పవు. మరీ ముఖ్యంగా మహిళలైతే అప్రమత్తంగా లేకపోతే పరిస్థితి మరింత దుర్భరంగా మారిపోతుంది. ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగి, విలాసవంతమైన జీవితాన్ని గడిపి, చివరికి అనాథలా మిగిలిన ఒక తార జీవితం గురించి తెలుసుకుందాం.
ఆమె ఒక గ్లామర్ హీరోయిన్. అద్భుతమైన అందం, ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రెజెన్స్ చక్కని నటన. తన అందం అభినయంతో, సినీ ప్రేక్షకుల హృదయాలను దోచుకుని సిల్వర్ స్క్రీన్ క్వీన్ గా ఒక పేరు దక్కించుకుంది. నటిగా అనేక విజయాలు, కోట్ల ఆస్తి కట్ చేస్తే 34 ఏళ్ల వయసులోనే అనాథలా ఈ ప్రపంచం నుంచి సెలవు తీసుకుంది. ఆమె బాలీవుడ్ నటి విమ్మీ (Vimi).
1943లో సిక్కు కుటుంబంలో జన్మించింది. చదువుకుంటున్న రోజుల్లోనే ఆల్ ఇండియా రేడియోలో పాటలు కూడా పాడేది.ముంబైలో సోఫియా కాలేజీలో సైకాలజీ చదివింది. బీఆర్ చోప్రా హాజరవుతారని తెలిసి, రవి తన కొడుకు పుట్టినరోజు పార్టీకి విమ్మీని, ఆమె భర్తను ఆహ్వానించాడు. ఈ పార్టీలో విమ్మీని చూసిన ప్రఖ్యాత ప్రముఖ నిర్మాత బీఆర్ చోప్రా ఆమెను బాలీవుడ్‌కు పరిచయం చేశాడు. 1967లో తీసిన హమ్‌రాజ్ చిత్రంలో ఆనాటి ఇద్దరు అగ్ర తారలు సునీల్ దత్ ,రాజ్ కుమార్ సరసన కొత్త హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రమే బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. బాలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. చాలా తక్కువ సమయంలో విమ్మీ పాపులారీటీ సాధించింది. ఆబ్రూలో అశోక్ కుమార్, పతంగాలో శశి కపూర్ వంటి అగ్ర తారలతో సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. 1960లలో ఒక పెద్ద స్టార్ హీరోయిన్ నిలిచింది. ఒకానొక దశలో బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరిగా నిలిచింది.
మరోవైపు ముంబైలాంటి వంటి విశ్వనగరంలో పుట్టి పెరిగినప్పటికీ,పాశ్చాత్య దుస్తులు ధరించడం , మేకప్ వేసుకొని విమ్మీ సినిమాల్లోకి రావడం ఇరుకుటుంబాలకీ నచ్చలేదు. దీనికి హమారాజ్‌సినిమా సమయంలో భర్తతో గొడవలు ఇది విమికి భారీగా నష్టం కలిగించింది.ఆమెతో మళ్ళీ పనిచేయడానికి నిరాకరించడం ఆమెకు భారీగా నష్టం కలిగించింది. అలాగే ఆమె భర్త అగర్వాల్ జోక్యంకారణంగా దర్శక నిర్మాతలు దూరంగా ఉండేవారు. క్రమంగా ఆమె స్టార్‌డమ్ తగ్గడం ప్రారంభమైంది. అలా పదేళ్ల కాలంలోనే ఆమె జీవితం తారుమారైపోయింది. 1970ల ప్రారంభం నాటికి, విమ్మీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పేలవంగా నిలిచాయి. దీంతో చిన్న చిన్న అతిధి పాత్రలు గుర్తింపు లేని నృత్య ప్రదర్శనలకు పరిమితమైపోయింది.
విమ్మీ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టే సమయానికే ఒక పారిశ్రామికవేత్త కుమారుడు శివ్ అగర్వాల్ (Shiv Agarwal)తో పెళ్లి అయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఒక పక్క వృత్తి జీవితం చాలా హ్యాపీగా సాగుతుండగా, వ్యక్తిగత జీవితం మాత్రం చాలా బాధాకరంగా పరిణమించింది. తీవ్రమైన గృహహింను ఎదుర్కొంది. దీంతో భర్తనుంచి విడాకులు తీసుకుంది. నమ్మిన మరో మనిషి దారుణంగా మోసం చేయడంతో దయనీయ పరిస్థితులలోకి జారిపోయింది. జాలీ అనే చిన్న నిర్మాతతో సంబంధంలోకి ప్రవేశించింది. కానీ ఇది మరో పీడకలగా మారుతుందని ఊహించలేకపోయింది. బాధలో ఉన్న విమ్మీని అక్కున చేర్చుకోలేదు సరికదా అనేక రకాలుగా వేధింపులకు గురిచేశాడు. ఆర్థికంగా దోచుకున్నాడు. విమ్మీ సొమ్మునంతా వాడుకోవడం మాత్రమే కాదు ఆమెను బలవంతంగా వ్యభిచారంలోకి దింపాడనే వార్తలు కూడా వినిపించాయి అప్పట్లో.
చదవండి: భారీ వేతనమిచ్చే ఉద్యోగాన్ని వదిలేసి.. ఐపీఎస్ అయ్యిందిలా!
విషాదకరమైన ముగింపు
అయితే తన జీవితాన్ని పునర్నిర్మించుకునే ప్రయత్నంలో, విమ్మీ కోల్‌కతాలో విమి టెక్సటైల్ పేరుతో వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించింది. దురదృష్టవశాత్తూ అదీ విఫలమైంది. నష్టాలతో దివాలా తీసింది. మరోవైపు అప్పలు ముంచుకొచ్చాయి. ఇక లాభం లేక దాన్ని అమ్మేయవలసి వచ్చింది. ఈ అవమాన భారంతో మానసికంగా దెబ్బతింది. మద్యానికి అలవాటు పడింది. ఇదే ఆమె ఆరోగ్యాన్ని నాశనం చేసింది. చేతిలో చిల్లిగవ్వ లేని పరిస్థితిలో 1977న ఆగస్టు 22న అతి చిన్న వయసులో, విమ్మీ కాలేయ సమస్యలలో తనువు చాలించింది. దహన సంస్కారాలు నిర్వహించే దిక్కులేదు వెండి వెలుగుల్లో అకాల కీర్తి, దాని స్వభావాన్ని విషాదాంతాన్ని గుర్తు చేసిన మరో ఉదంతం ఏమింటే..ఆమె చనిపోయిన తర్వాత ఆమె భౌతిక కాయాన్ని ఒక తోపుడు బండిపై తరలించాల్సి రావడం.
ఇదీ చదవండి: Birthright Citizenship మరోసారి బ్రేక్: భారతీయులకు భారీ ఊరట
Comments
Please login to add a commentAdd a comment