Stardom
-
తొలి సినిమాతో స్టార్లుగా మారిన హీరోయిన్లు
ఎంతోమంది స్టార్ హీరోయిన్ అవ్వాలని ఇండస్ట్రీలోకి అడుగుపెడతారు..కానీ ఆ అదృష్టం కొందరికే కలిసొస్తుంది. మొదటి సినిమాతోనే కొందరు కనుమరుగైతే, మరొకందరు మాత్రం ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్లుగా మారుతున్నారు. నటన, అందం సహా అదృష్టం కూడా కలిసొచ్చి మొదటి సినిమాతోనే స్టార్డంను సందించుకుంటున్నారు. అలా టాలీవుడ్లో డెబ్యూ మూవీతోనే స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన హీరోయున్లు ఎవరో చూద్దాం. కృతిశెట్టి..మొదటి సినిమాతోనే బంపర్ హిట్ అందుకున్న ఈ భామ ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. ఉప్పెనతో బేబమ్మగా అలరించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది. చూడచక్కని అందంతో కుర్రాల మతులు పోగొడుతుంది ఈ మంగళూరు బ్యూటీ. ఛలో సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ రష్మిక మందన్నా. ఈ సినిమా హిట్ కావడంతో ఈ అమ్మడికి స్టార్స్‌తో జతకట్టే అవకాశాలు వచ్చాయి. దీంతో అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇటు తెలుగు, కన్నడ చిత్రాలతో పాటు బాలీవుడ్‌లోనూ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఏకంగా అమితాబ్ బచ్చన్ సినిమాలోనే అవకాశం దక్కించుకొని మోస్ట్ పాపులర్ హీరోయిన్గా నిలిచింది. ఆర్ఎక్స్100 సినిమాతో సూపర్ హిట్ కొట్టిన హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. సాధారణంగా బోల్డ్ కంటెంట్‌తో డెబ్యూగా రావడంటే సాహసమనే చెప్పాలి. అలాంటి ధైర్యమే చేసింది ఈ పంజాబీ భామ. వచ్చీ రావడమే సూపర్ హిట్ అందుకొని విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మొదటి సినిమాతోనే బంపర్ హిట్ అందుకొని టాలీవుడ్లో దూసుకుపోతుంది. సినిమాలతో పాటు హాట్ ఫోటో షూట్లతో టాక్ ఆఫ్ ది టైన్గా హైలెట్ అవుతోంది ఈ ముద్దుగుమ్మ. నాగ చైతన్య హీరోగా గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఏ మాయ చేసావే. ఈ సినిమాతో సమంత హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే సూపర్‌హిట్ అందుకొని స్టార్ హీరోయిన్ అయ్యింది. డెబ్యూ మూవీతోనే తన ఫర్మార్మెన్స్ ఏంటో రుజువు చేసింది ఈ చెన్నై చిన్నది. ఏ మాయ చేసిందో గానీ టాలీవుడ్లో స్టార్ హీరోలకు సమానంగా అవకాశాలు దక్కించుకుంది. తొలి సినిమాలో నటించిన నాగచైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. అర్జున్‌రెడ్డి సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ డం సందించుకున్న హీరో-హీరోయిన్లు విజయ్ దేవరకొండ, షాలినీ పాండే. ఈ ఒక్కసినిమాతో విజయ్ దేవరకొండ పాన్ఇండియా లెవల్లో ఫ్యాన్స్‌ని సంపాదించుకుంటే, షాలినీ పాండేకి మంచి గుర్తింపు దక్కింది. డెబ్యూ హీరోయిన్గా షాలినీ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అయితే అనుకున్నంతగా ఆమెకు అవకాశాలు రాలేదు. దీంతో ప్రస్తుతం వర్కవుట్లు చేస్తూ స్లిమ్‌గా తయ్యారయ్యింది. నితిన్ హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన సినిమా జయం. ఈ సినిమాతో హీరోయిన్గా పరిచయం అయ్యింది సదా. ఈ మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో వేరే చెప్పక్కర్లేదు. తొలి సినిమాతోనే బంపర్ హిట్‌ను ఖాతాలో వేసుకొని సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ చిన్నది. జయం అనంతరం టాలీవుడ్లో వరుస అవకాశాలు దక్కించుకొని కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్గా చలామణి అయ్యింది. అల్లు అర్జున్-పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం దేశముదురు. ఈ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన భామ హన్సిక. డెబ్యూ మూవీతోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది హన్సిక. తొలి సినిమాతోనే అందంతో క్రుర్రాల మతులు పొగొట్టింది ఈ బ్యూటీ. అంతేకాకుండా దేశ ముదురు చేసే సమయానికి హన్సిక టెన్త్ క్లాస్. దీంతో షూటింగ్లో పాల్గొంటూనే ఎగ్జామ్స్ రాసింది. ఉదయ్‌కిరణ్, రీమా సేన్ చిత్రం మూవీతో జంటగా నటించారు. ఈ సినిమా అప్పట్లోనే ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో వేరే చెప్పక్కర్లేదు. తొలి సినిమాతోనే రీమాసేన్ స్టార్ హీరోయిన్ అయిపోయిది. ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు దక్కించుకొని ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. -
ఇలా కూడా ఫేమస్ అయిపోవచ్చా!
సామాజిక మాధ్యమాల్లో అందరి దృష్టిని ఆకర్షించి స్టార్డమ్ పొందాలంటే ఆషామాషీ కాదు. అది కేవలం సినిమా నటులకో, క్రీడాకారులకో, ధనవంతులకో లేదా కాస్త చక్కనిరూపం ఉన్నవాళ్లకో సాధ్యమైన పని.. ఈ జాబితాలో లేకుండా పేరు సంపాదించాలంటే మాత్రం కష్టమైన పనే. అయితే తనకు ఇలాంటి అడ్డంకులేవీ లేవని అయినప్పటికీ తాను పేరు గడించానంటోంది పోలాండ్లోని వార్సాకు చెందిన అమ్మాయి. ఆమె పేరు నటాలియా గుట్కివిజ్. నటాలియా అందరి లాంటి సాదాసీదా 20 ఏళ్ల అమ్మాయి. ఇన్‌స్ట్రాగామ్‌లో కేవలం 443 పోస్టులు మాత్రమే చేసింది. కానీ ఒక లక్ష మంది ఫాలోవర్లను నటాలియా సంపాదించుకుంది. ఇదేలాగంటే సోషల్ మీడియాలో తన ఫొటోను పోస్ట్ చేసే ప్రతిసారీ ముఖం కనిపించకుండా జాగ్రత్త పడడమే. నటాలియా కళ్లు, పెదవులు లేదా వెనుక భాగమో కనిపించేలా మాత్రమే తను ఫొటో లను పోస్టు చేసేది. కాబట్టి తన ఎలా ఉంటుందో ఎవరికీ ఇంతవరకు తెలీదు. దీంతో ఆ అమ్మాయి ఎలా ఉంటుందా అనే ఆసక్తి అందరికీ నెలకొంది. నటాలియాను ఫాలో అయ్యేవారందరూ తన తదుపరి ఫొటోలో అన్నా పూర్తి ఫొటోను పోస్టు చేయకపోతుందా అంటూ కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తుంటారు. కానీ తాను మాత్రం ఫొటోను పోస్టు చేసిన ప్రతిసారి తన ముఖాన్ని కొంచెం కొంచెం మాత్రమే కనిపించేలా ఫోజులిస్తూ ఆసక్తి రేకెత్తిస్తోంది. చూద్దాం నటాలియా ఎప్పుడూ తన పూర్తి రూపాన్ని బహిర్గతం చేస్తోందో. ఇక మీరు కూడా ఆమెలా వినూత్నంగా ఆలోచించి మరో మార్గంలో గుర్తింపు పొందడానికి ప్రయత్నించండి. -
అలాంటివారిలో తారక్ ఒకడు- నాగ్
'సోగ్గాడే చిన్ని నాయన' సూపర్ హిట్ అవ్వడంతో మాంచి ఊపు మీదున్న టాలీవుడ్ మన్మధుడు నాగార్జున 'ఊపిరి' తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఊపిరి సినిమా గురించి మాట్లాడుతూ నాగార్జున.. యువ హీరో జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కార్తీ పాత్రకు ముందుగా ఎన్టీఆర్ ను అప్రోచ్ అయ్యామని, అతడు కూడా ఊపిరిలో నటించేందుకు ఆసక్తి చూపించారని చెప్పారు. కానీ డేట్స్ సర్దుబాటు అవ్వక తారక్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని తెలిపారు. అయితే తారక్ ను ఆ పాత్రకు ఎంచుకోవడం పూర్తిగా తన నిర్ణయమేనని నాగ్ చెప్పారు. ఇంకా మట్లాడుతూ.. 'నేనెప్పుడూ మా పిల్లలకు కూడా సలహా ఇస్తుంటాను.. మంచి సబ్జెక్ట్స్ ఎంచుకుంటే అవే స్టార్ డమ్ ను తీసుకొచ్చిపెడతాయని. అయినా 30 ఏళ్ల లోపు స్టార్ డమ్ అందుకున్న నటులు చాలా అరుదు, అలాంటివారిలో తారక్ ఒకడు. పవన్ కల్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్ లు కూడా 30 ఏళ్ల తర్వాతే స్టార్ డమ్‌ను చవిచూశారు' అంటూ తారక్ మీదున్న ప్రత్యేక అభిమానాన్ని బయటపెట్టారు కింగ్ నాగార్జున. అలాగే నాగ చైతన్య, జూనియర్ ఎన్టీఆర్ లతో గుండమ్మ కథ 'రీమేక్' ఆలోచనలు కూడా నాగార్జునకు ఉన్నట్లు టాక్. -
కొత్త హీరో సరసన?
గాసిప్ కథానాయికలకు స్టార్డమ్ వచ్చాక కొత్త హీరోల సరసన, అప్‌కమింగ్ హీరోల సరసన నటించడానికి అంతగా ఇష్టపడరు. కానీ సమంత మాత్రం ఇలాంటి విషయాలు పట్టించుకోరేమో. తమిళనాట హాస్య నటునిగా మంచి పేరు సంపాదించి, ఇప్పుడిప్పుడే హీరో పాత్రలు వేస్తున్న శివకార్తికేయన్ సరసన కథానాయికగా నటించడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కోలీవుడ్ వర్గాలు గుసగుస. -
ఐ డోంట్ వాంట్!
‘టిప్ టిప్ బర్సా పానీ...’ అంటూ ఆనాడు టెంపరేచర్ రైజ్ చేసిన రవీనాటాండన్ ఉన్నట్టుండి ఆ జ్ఞాపకాలు నెమరేసుకుంది. తాను ఎంత స్టార్‌డమ్‌ను ఎంజాయ్ చేసినా ఏ నాడూ అనవసరపు సంచలనాలకు పోలేదని గుర్తు చేసుకుంది. ఇప్పుడు కూడా ఆ అవసరం లేదంటోండి. ‘నా భర్త బిజినెస్‌మ్యాన్. బాగా సంపాదిస్తాడు. సినిమాలు చేయకపోయినా ఇబ్బంది లేదు. మా అబ్బాయి ఊడిపోయే పళ్లు చూసుకొంటూ అయినా కాలం గడిపేస్తా’ అంటూ చెప్పుకొచ్చింది రవీనా. ఈ సొట్ట బుగ్గల అమ్మడు ప్రస్తుతం ‘బాంబే వెల్వెట్’లో చేస్తోంది. -
అలియా చక్కర్!
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే కాన్సెప్ట్ వినడానికి బానే ఉంటుంది గానీ... ఆచరణలోకి వచ్చేసరికే తేడా కనిపిస్తున్నట్టుంది బాలీవుడ్ భామలకు. స్టార్డమ్ ఉండగానే క్యాష్ చేసుకోవాలనుకున్న తారలు ఓవర్‌లోడ్‌తో సెట్స్‌లోనే చక్కర్లు వచ్చి పడిపోతున్నారు. నిన్న ప్రియాంక చోప్రా, తాజాగా అలియాభట్ బెడ్ ఎక్కిందట. యూకే, పోలండ్ల్లోని గడ్డకట్టే చలిలో ‘షాన్‌దార్’ సినిమా షూటింగ్ చేసిన అలియా... ముంబైకి వచ్చేసరికి జ్వరం, విపరీతమైన కడుపునొప్పితో మంచం పాలైందట. -
సదా మీ సేవలో..
చీకటి వెలుగుల జీవితంలో అందరూ కోరుకునేది వెలుగే. ఆ జిలుగు నీడలో పదిమందినీ ఆహ్వానించే వారు కొందరే ఉంటారు. అలాంటి వారి గురించి పదిమందికీ తెలిస్తే.. మరెందరి హృదయూల్లోనో సేవాభావం వెలుగు చూస్తుంది. సమాజం కోసం మీరు చేతులు కలిపి.. చేసిన చేతల వివరాలు మాకు తెలియుజేయండి. మీకు స్ఫూర్తిగా స్టార్‌డమ్‌కి సేవను జోడించి తనదైన శైలిలో స్పందిస్తున్న సినీ నటి సమంత ‘సిటీప్లస్’లో వెలుగుచూసే కథనాలకు బాసటగా నిలుస్తానంటోంది. మీరు చేయూల్సిందల్లా.. ఓ సంస్థ ద్వారా, వ్యక్తిగతంగా మీరు చేస్తున్న సేవల వివరాలను వూకు మెయిల్ చేయుండి. వాటిని ‘సిటీప్లస్’లో ప్రచురిస్తాం. వీటిలో ఉన్నతమైన వాటిని ఎంపిక చేసి.. సదరు సేవా సంస్థలు, వ్యక్తులను సమంత పలకరిస్తారు. ఒక్క సమంత మాత్రమే కాదు.. సేవ చేసే హృదయూలను అభినందించడానికి మరెందరో సెలబ్రిటీలు ముందుకు రానున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు చేస్తున్న చారిటీ వివరాలు మెయిల్ టు sakshicityplus@gmail.com -
స్టార్ డమ్ కోసం భయపడను!
ముంబై: సినిమా ఇండస్ట్రీలో స్టార్ డమ్ ను కోల్పోతానన్న భయం లేదు అంటోంది పొడుగుకాళ్ల సుందరి దీపికా పదుకునే. ఆ హోదా ఎప్పటికైనా చేజారిపోయేదేనని.. అందుకోసం భయపడటం దేనికని ప్రశ్నిస్తోంది. బాలీవుడ్ లో 'ఓం శాంతి ఓం' చిత్రంతో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న దీపికా పదుకునే ఆపై వెనుదిరిగి చూడలేదు. ఆ తరువాత వచ్చిన 'సావారియా' చిత్రం దీపికా క్రేజ్ ను మరింత పెంచింది. అనంతరం గత సంవత్సరం వచ్చిన 'చెన్నై ఎక్స్ ప్రెస్', 'యే జవానీ హై దీవానీ', రేస్-2 చిత్రాలు ఆమె ప్రతిభకు మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం 'ఫైండింగ్ ఫెనీ' చిత్రం విడుదలకు సిద్ధంగా నేపథ్యంలో ఆమె మీడియాతో ముచ్చటించారు. 'తనకు స్టార్ హోదాపై నమ్మకం లేదని ఈ అమ్మడు తేల్చిచెప్పేసింది. అది ఏదో ఒక రోజు కోల్పోక తప్పదని వేదాంత ధోరణిని ప్రదర్శించింది. 'మీరు స్టార్ డమ్ ను కోల్పోతున్నానని ఆందోళనలో ఉన్నారా'?అన్న ప్రశ్నకు దీపికా పై విధంగా స్పందించింది. తాను చేసే పనిలో నిబద్ధతను మాత్రమే కోరుకుంటానని, ఆ పని మనకు ఎంత సురక్షితంగా ఉందన్నది మాత్రమే ఆలోచిస్తానని దీపిక స్పష్టం చేసింది. ఈ నెలలో ఒక వారం వ్యవధిలో దీపికా-సోనమ్ కపూర్ ల చిత్రాలు విడుదలకు రంగం సిద్ధమైన నేపథ్యంలో ఇరువురి మధ్య పోటీ నెలకొందని బాలీవుడ్ వర్గాలు విశ్లేషించడంతో ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. -
హాలీవుడ్ అందగాడు దుబారాకు నో చెప్పాడు
సంపాదించడం కన్నా దాన్ని కాపాడుకోవడమే కష్టం. మరి కోట్ల కొద్దీ ఆస్తులున్న సెలబ్రిటీలు, కార్పొరేట్లు.. సరదాల కోసం విచ్చల విడిగా ఖర్చు చేసేస్తుంటారా? పొదుపు మంత్రం పఠిస్తుంటారా? అందరూ విజయ్ మాల్యాల్లా ఉంటారా... లేక అజీమ్ ప్రేమ్‌జీని అనుసరిస్తారా?వారి మనీ మేనేజిమెంట్ ఎలా ఉంటుంది? హాలీవుడ్ స్టార్, టైటానిక్ సినిమా ఫేం.. లియొనార్డో డి కాప్రియో తన మనీని ఎలా మేనేజ్ చేస్తారు? ఆయన ఖర్చులెలా ఉంటాయి? దేన్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంటారు? రంగ స్థలం నుంచి సినిమాల్లోకి వచ్చిన డికాప్రియో ఆస్తి ప్రస్తుతం దాదాపు రూ.1200 కోట్లు. ఇక తన మనీ మేనేజ్మెంట్ గురించి ఆయనేమంటారంటే... ‘చిన్నతనంలో అడ్వర్టైజ్మెంట్లు, టీవీ సీరియల్స్ చేశా. కాస్త పెద్దయ్యాక కొన్ని చిన్నా, చితకా సినిమాలు చేసినా, టైటానిక్తోనే నాకు స్టార్డమ్, ఆఫర్లు, సంపద అన్నీ వచ్చాయి. డబ్బొస్తోంది కదాని మనీ మేనేజ్మెంట్ విషయంలో ఎప్పుడూ అశ్రద్ధ చేయలేదు. చేయను కూడా. నేను భారీ ఖర్చుల జోలికెళ్లను. ప్రైవేట్ జెట్లలో తిరగను. నా దగ్గర ఇప్పటికీ ఒకే ఒక్క కారు(టయోటా ప్రియస్) ఉంది. డబ్బు నాకు చాలా ముఖ్యం. ఎందుకంటే.. డబ్బుంటే నచ్చిన పాత్రల్ని మాత్రమే ఎంచుకునే స్థైర్యం ఉంటుంది. అంతేకాదు... మరింత డబ్బు సంపాదిస్తే.. ఏదో రోజు మరింత మంది ప్రజలకు, పిల్లలకు మరింత మేలు చేసే అవకాశం వస్తుంది. అందుకే నేను పెద్దగా ఖర్చు చేయను. పెట్టుబడుల విషయానికొస్తే... షేర్ మార్కెట్ల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటాను. రియల్ ఎస్టేట్‌లో బాగానే ఇన్వెస్ట్ చేశా. అలాగే మొబిల్ అనే ఇంటర్నెట్ స్టార్టప్ కంపెనీలోను, హైబ్రిడ్ కార్లు తయారు చేసే ఫిస్కర్ ఆటోమోటివ్ కంపెనీలోనూ ఇన్వెస్ట్ చేశాను. ఆర్థిక భద్రత ఉంది కాబట్టి ధైర్యంగా సినిమాలనూ ప్రొడ్యూస్ చేస్తున్నాను. ఈ మధ్యే విడుదలైన ‘ది వోల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్’కు సహనిర్మాతగా ఉన్నా. నా వరకు నేను పర్యావరణానికీ మేలు చేయాలనే ఉద్దేశంతో ఇంటికి సౌర విద్యుత్ అమర్చాను. ఇలాంటి పొదుపు చర్యలు పాటిస్తూనే.. సాధ్యమైనంత వరకూ వన్యప్రాణుల సంరక్షణ వంటి సేవా కార్యక్రమాల కోసం విరాళాలు ఇస్తుంటాను.’ -
నాన్న అంత నేను ఎదగలేను: అభిషేక్
బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ కొడుకునే అయినా.. తాను మాత్రం ఆయన ఎదిగినంత ఎత్తులకు ఎప్పటికీ ఎదగలేనని అభిషేక్ బచ్చన్ అన్నాడు. అందుకే నాన్నతో పోల్చుకోవడం మానేసి, తన సొంత ప్రమాణాలు పెట్టుకుంటానంటున్నాడు. నాలుగు దశాబ్దాల కెరీర్లో 180కి పైగా చిత్రాల్లో నటించిన అమితాబ్, ఇప్పటికీ వెండితెరతో పాటు, బుల్లితెర మీద కూడా కోట్లాది మంది అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. ''71 ఏళ్ల వయసులో కూడా ఆయన బాలీవుడ్లో అత్యంత బిజీ నటుల్లో ఒకరు. పరిశ్రమ ఎలా కావాలంటే అలా మారిపోతూ.. ట్రెండును ఫాలో కావడంలో అమితాబ్‌ను మించినవాళ్లు లేరు. ఎవరైనా పరిమితులు పెట్టుకుంటారు గానీ, ఆయనకు మాత్రం ఆకాశమే హద్దు. ఆయన అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ కూడా తారాపథంలోనే ఉంటారు. అందువల్ల ఆయన స్థాయిని అందుకోవడం కలలో కూడా జరగని పని. అందుకే నా సొంత లక్ష్యాలు పెట్టుకున్నా'' అని అభిషేక్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.