
కొత్త హీరో సరసన?
గాసిప్
కథానాయికలకు స్టార్‌డమ్ వచ్చాక కొత్త హీరోల సరసన, అప్‌కమింగ్ హీరోల సరసన నటించడానికి అంతగా ఇష్టపడరు. కానీ సమంత మాత్రం ఇలాంటి విషయాలు పట్టించుకోరేమో. తమిళనాట హాస్య నటునిగా మంచి పేరు సంపాదించి, ఇప్పుడిప్పుడే హీరో పాత్రలు వేస్తున్న శివకార్తికేయన్ సరసన కథానాయికగా నటించడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కోలీవుడ్ వర్గాలు గుసగుస.