నాన్న అంత నేను ఎదగలేను: అభిషేక్ | Can't reach the stardom that dad achieved: Abhishek Bachchan | Sakshi
Sakshi News home page

నాన్న అంత నేను ఎదగలేను: అభిషేక్

Published Tue, Dec 17 2013 11:03 AM | Last Updated on Sat, Sep 2 2017 1:42 AM

నాన్న అంత నేను ఎదగలేను: అభిషేక్

నాన్న అంత నేను ఎదగలేను: అభిషేక్

బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ కొడుకునే అయినా.. తాను మాత్రం ఆయన ఎదిగినంత ఎత్తులకు ఎప్పటికీ ఎదగలేనని అభిషేక్ బచ్చన్ అన్నాడు. అందుకే నాన్నతో పోల్చుకోవడం మానేసి, తన సొంత ప్రమాణాలు పెట్టుకుంటానంటున్నాడు. నాలుగు దశాబ్దాల కెరీర్లో 180కి పైగా చిత్రాల్లో నటించిన అమితాబ్, ఇప్పటికీ వెండితెరతో పాటు, బుల్లితెర మీద కూడా కోట్లాది మంది అభిమానులను అలరిస్తూనే ఉన్నారు.

''71 ఏళ్ల వయసులో కూడా ఆయన బాలీవుడ్లో అత్యంత బిజీ నటుల్లో ఒకరు. పరిశ్రమ ఎలా కావాలంటే అలా మారిపోతూ.. ట్రెండును ఫాలో కావడంలో అమితాబ్ను మించినవాళ్లు లేరు. ఎవరైనా పరిమితులు పెట్టుకుంటారు గానీ, ఆయనకు మాత్రం ఆకాశమే హద్దు. ఆయన అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ కూడా తారాపథంలోనే ఉంటారు. అందువల్ల ఆయన స్థాయిని అందుకోవడం కలలో కూడా జరగని పని. అందుకే నా సొంత లక్ష్యాలు పెట్టుకున్నా'' అని అభిషేక్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement