గత కొన్నాళ్లుగా బచ్చన్ ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. విడాకుల రూమర్స్ దీనికి కారణం. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య విడిపోనున్నారనే టాక్ బాలీవుడ్‌లో గట్టిగా వినిపిస్తుంది. ఇందుకు నిమ్రత్ కౌర్ అనే నటి కారణమని అంటున్నారు. ఇందులో నిజమేంటనేది పక్కనబెడితే అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ ఒకేసారి 10 ఫ్లాట్స్ కొనుగోలు చేయడం చర్చనీయాంశంగా మారిపోయింది.
(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 23 సినిమాలు)
ప్రభాస్ 'కల్కి'లో ఆశ్వద్ధామగా అదరగొట్టేసిన అమితాబ్.. గత కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్‌లో భారీగా పెట్టుబడి పెడుతున్నారు. ఈ క్రమంలోనే ముంబైలోని ములంద్ ఏరియాలోని ఒబెరాయ్ రియల్టీ, ఒబెరాయ్ ఎటెర్నియాలో 10 ఫ్లాట్స్ ఒకేసారి కొనుగోలు చేశారు. వీటి ధర రూ.24.95 కోట్లు అని తెలుస్తోంది. అక్టోబర్ 9న రిజిస్టేషన్ జరిగిన ఈ కొనుగోలు కోసం కోటిన్నర వరకు స్టాంప్ డ్యూటీ కూడా చెల్లించారట.
ఈ పదింటిలో ఆరు అభిషేక్ పేరు మీద రిజిస్టర్ చేయించగా.. నాలుగింటిని అమితాబ్ పేరుపై రిజిస్టర్ చేయించారు. ఇకపోతే గత 20 ఏళ్లలో బచ్చన్ ఫ్యామిలీ దాదాపు రూ.200 కోట్ల మేర రియల్ ఎస్టేట్ కోసం డబ్బు పెడుతున్నారు. లాభాలు ఆర్జిస్తున్నారు. మరోవైపు పలు సినిమాలతో తండ్రికొడుకు ఫుల్ బిజీగా ఉన్నారు. విడాకులు రూమర్స్ కావొచ్చు, ఫ్లాట్స్ కొనడం కావొచ్చు, ఏదో రకంగా బచ్చన్ ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తూనే ఉంది.
(ఇదీ చదవండి: 'నరుడి బ్రతుకు నటన' సినిమా రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment