ఒక కూతురి తండ్రిగా ఆ బాధేంటో నాకు తెలుసు: అభిషేక్ బచ్చన్ | Abhishek Bachchan moved to tears on KBC 16 | Sakshi
Sakshi News home page

Abhishek Bachchan: కూతురి తండ్రిగా ఆ బాధేంటో నాకు తెలుసు: అభిషేక్ బచ్చన్

Published Thu, Nov 21 2024 5:15 PM | Last Updated on Thu, Nov 21 2024 5:55 PM

Abhishek Bachchan moved to tears on KBC 16

బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్‌ ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్‌పతి -16 సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ రియాలిటీ షోలో ఆయన కుమారుడ్ అభిషేక్ బచ్చన్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తన రాబోయే చిత్రం ఐ వాంట్ టూ టాక్ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈ  షోలో పాల్గొన్నారు. ఆయనతో పాటు దర్శకుడు సుజిత్ సిర్కార్, రచయిత అర్జున్ సేన్ ఈ ఎపిసోడ్‌లో భాగమయ్యారు.

ఈ సందర్భంగా అభిషేక్ తన మూవీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సుజిత్ ఐ వాంట్ టు టాక్ పూర్తి కథను చెప్పలేదని..  అర్జున్ జీవితం, అతని ప్రయాణం గురించి మాత్రమే మాట్లాడారని.. అదే తనకు నచ్చిందని తెలిపారు. ఈ కథలో కేవలం వంద రోజులు మాత్రమే తండ్రి బతుకుతాడని తెలిసిన ఆయన కూతురు ఏంటీ చచ్చిపోతున్నావా?  నా పెళ్ళిలో డాన్స్ చేస్తావా? అని అమాయకంగా ‍‍అడుగుతుంది. ఆ బాధను దిగమింది తాను చనిపోనని.. పెళ్లిలో నృత్యం చేస్తానని తన కూతురికి మాట ఇస్తాడు తండ్రి.. అదే ఆ తండ్రి జీవిత లక్ష్యం.. ఈ స్టోరీనే ఐ వాంట్ టూ టాక్‌ మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

ఈ సందర్భంగా ఒక తండ్రిగా కుమార్తెతో ఉండే ప్రేమ, అను బంధాన్ని అభిషేక్ బచ్చన్‌ గుర్తు చేసుకున్నారు.  ఈ కథ నిజంగా నా హృదయాన్ని తాకిందని.. తండ్రి మాత్రమే కుమార్తె భావోద్వేగాన్ని అర్థం చేసుకుంటారని అభిషేక్ అన్నారు. ఆరాధ్య నా కుమార్తె, షూజిత్‌కు ఇద్దరు కుమార్తెలు.. మేమంతా 'గర్ల్ డాడ్స్'.. అందుకే ఆ భావోద్వేగాన్ని  అర్థం చేసుకున్నామని తెలిపారు. అర్జున్ తన కూతురికి చేసిన వాగ్దానం కోసం ఆ తండ్రి చేసే పోరాటం గొప్పదన్నారు. ఒక తండ్రిగా ఆ నిబద్ధత మాటల్లో చెప్పలేనిదని అభిషేక్ బచ్చన్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అర్జున్‌ కథను విని అభిషేక్ ఎమోషనలయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement