బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలు, అభిషేక్-ఐశ్వర్యరాయ్‌ల ముద్దుల కూతురు ఆరాధ్య బచ్చన్ (Aaradhya Bachchan) మరోసారి ఢిల్లీ హైకోర్టుని(Delhi High Court) ఆశ్రయించింది. గతేడాదిలో తన ఆరోగ్యంపై తప్పుడు కథనాలను ప్రసారం చేసిన యూట్యూబ్ చానళ్లపై చర్యలు తీసుకోవడంతో పాటు ఆ కథనాలను తొలగించాలని హైకోర్టును ఆశ్రయించారు. ఆరాధ్య పిటిషన్‌పై కోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ క్రమంలో గూగుల్‌కు నోటీసులు జారీ చేసింది. గతంలో ఆమె ఫిర్యాదు చేసినప్పుడు ఆ వీడియోలను తొలగించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయినా, కొన్ని వెబ్‌సైట్లతో పాటు పలు సోషల్‌మీడియా ఖాతాలు వాటిని పాటించలేదు. దీంతో ఆమె మరోసారి కోర్టును ఆశ్రయించింది.
(ఇదీ చదవండి: ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్)
గతేడాదిలో ఆరాధ్య బచ్చన్ ఆరోగ్యంపై తప్పుదోవ పట్టించే వార్తలను యూట్యూబ్ వేదికగా ప్రసారం చేశారు. ఆరాధ్య బచ్చన్ తీవ్ర అనారోగ్యంతో ఉన్నారని, ఆరాధ్య ఇక లేరంటూ కొన్ని యూట్యూబ్ ఛానళ్లు ప్రచారం చేశాయి. దీంతో ఆమె తండ్రి అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan) వ్యాజ్యం వేశారు. ఈ అంశంపై విచారణ జరిపిన కోర్టు తీవ్రంగా స్పందించింది. పిల్లల గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం చాలా తప్పు అని, ఇలాంటి చర్యలు సమాజంలో అనారోగ్యకరమైన వక్రబుద్ధిని ప్రతిబింబిస్తుందని కోర్టు తెలిపింది. సమాజంలోని ప్రతి చిన్నారిని గౌరవంగా చూడటంతో పాటు వారి ఆరోగ్యానికి సంబంధించి తప్పుదోవ పట్టించే సమాచారం వ్యాప్తి చేయడాన్ని చట్టం ఎట్టిపరిస్థితిల్లోనూ సహించదని కోర్టు పేర్కొంది.
ఇలాంటి వీడియోలు గూగుల్ దృష్టికి వచ్చినప్పుడు వాటిని తక్షణమే తొలగించాలని న్యాయస్థానం తెలిపింది. అయితే, కొన్ని ఇంకా నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో తన తండ్రితో పాటు ఆరాధ్య నేరుగా హైకోర్టుని ఆశ్రయించడంతో గూగుల్‌కు మరోసారి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ప్రస్తుత పిటిషన్‌పై విచారణ మార్చి 17న జరగనుందని తెలిపింది. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ 2007లో వివాహం చేసుకున్నారు. వీరికి 2011 నవంబర్ 6న ఆరాధ్య జన్మించింది.
Comments
Please login to add a commentAdd a comment