Aaradhya Bachchan
-
స్కూలు యాన్యువల్ డే : ఆరాధ్య సందడి, ముద్దుల్లో ముంచెత్తిన ఐశ్వర్య
ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షిక దినోత్సవం వేడుకల్లో స్టార్ కిడ్స్ సందడి చేశారు. బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ కుమార్తె ఆరాధ్య, బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్‌కాన్ చిన్న కుమారుడు అబ్ రామ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.గురువారం (డిసెంబరు 19) జరిగిన ఈ ఈవెంట్లో ఆరాధ్య బచ్చన్ తన షోను అందర్ని కట్టి పడేసింది. ఆమె నటనకు ఐశ్వర్య, అభిషేక్‌తోపాటు, తాత అమితాబ్ బచ్చన్ కూడా గర్వంతో ఉప్పొంగి పోయారు. ముఖ్యంగా మాజీ ప్రపంచ సుందరి ఐశర్య తన కుమార్తె నటనకు ఫిదా అయిపోయింది. ఈమెమరబుల్ మూమెంట్స్‌ను కెమెరాలో బంధిస్తూ కనిపించింది. ఆ తరువాత ఆరాధ్యను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ముద్దులతో ముంచెత్తింది.And Aaradhya’s final bow - trust her parents to cheer the loudest as always pic.twitter.com/phf29fiGG3— Bewitching Bachchans (@TasnimaKTastic) December 19, 2024మరోవైపు భార్యబిడ్డలను ఇలా చూసిన అభిషేక్ మురిసిపోయారు. ఇక మనవరాలు క్రిస్మస్ ప్రదర్శనకు గర్వంతో చిరునవ్వులు చిందించారు అమితాబ్. షో ముగియగానే ప్రేక్షకుల కరతాళ ధ్వనులు మిన్నంటాయి. అలాగే తన కుమారుడు అబ్రామ్ ప్రదర్శనకు షారూఖ్‌ఖాన్ కూడా ఉత్సాహంగా క్లాప్స్ కొట్టారు. మురిపెంగా వీడియోలు తీసుకుంటూ కనిపించారు. కరీనా సైఫ్ అలీఖాన్, దంపతుల కుమారుడు కూడా తైమూరు కూడా అద్భుత ప్రదర్శనతో అలరించాడు. ఈ వార్షికోత్సవ వేడుకులకు సంబంధించిన వీడియోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.మరోవైపు ఆరాధ్య పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమంలో ఐశ్వర్య, అభిషేక్ జంటగా కనిపించడం, ఇద్దరూ అమితాబ్‌ను వేదికపైకి జాగ్రత్తగా తీసుకెళ్లిన దృశ్యాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఐశ్వర్య, అభిషేక్ విడాకులు తీసుకోబోతున్నారనే పుకార్లకు పూర్తిగా చెక్ పడినట్టైంది. < View this post on Instagram A post shared by mamaraazzi (@mamaraazzi) -
ఆ విషయంలో ఐశ్వర్యకి థ్యాంక్స్: అభిషేక్ బచ్చన్
‘‘నేను బయటకు వెళ్లి సినిమాలు చేస్తున్నానంటే అది నిజంగానే నా అదృష్టం. మా కుమార్తె ఆరాధ్య యోగక్షేమాలను నా భార్య ఐశ్వర్యా రాయ్ చూసుకుంటూ ఇంట్లోనే ఉంటోంది. ఆ విషయంలో తనకు థ్యాంక్స్ చెబుతున్నాను’’ అని హీరో అభిషేక్ బచ్చన్ అన్నారు. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ–‘‘కుటుంబం విషయంలో ఐశ్వర్య ఎంతగానో సపోర్ట్ చేస్తుంది. ఆమె వల్లే నేను సినిమాలపై పూర్తీగా దృష్టి పెడుతున్నాను. ఈ రోజుల్లో పిల్లలు కూడా తమ తల్లిదండ్రులతో ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నారు.నేను పుట్టిన తర్వాత మా అమ్మ జయా బచ్చన్ సినిమాలు మానేశారు. భర్త, పిల్లలు, కుటుంబానికి ఎక్కువ సమయం ఇవ్వాలని ఆమె అనుకుని ఆ నిర్ణయం తీసుకున్నారు. మా నాన్న అమితాబ్ బచ్చన్ సినిమాలతో బిజీగా ఉండి రాత్రి ఏ సమయంలో ఇంటికి వచ్చినా సరే.. నా గదిలోకి వచ్చి నన్ను చూసి వెళ్లేవారు. ఎన్ని పనులు ఉన్నప్పటికీ నా స్కూల్లో జరిగే ప్రతి ఫంక్షన్ కు, నా బాస్కెట్ బాల్ cటీలకు నాన్న వచ్చేవారు. తల్లిదండ్రులుగా మనం పిల్లలకు స్ఫూర్తిని ఇవ్వాలి. అలాగే వారి నుంచి ప్రేరణ ΄పొందాలి. ప్రపంచంలోని తల్లిదండ్రులపై నాకు అమితమైన గౌరవం ఉంది.తల్లి బాధ్యతలు మరెవరూ చేయలేరు. తండ్రికి కూడా ఎంతో ప్రేమ, బాధ్యతలు ఉంటాయి. కానీ వాటిని పైకి చూపించడు. వయసు పెరిగేకొద్దీ పిల్లలకు తండ్రి ప్రేమ అర్థమవుతుంది’’ అని చె΄్పారు అభిషేక్. కాగా అభిషేక్ బచ్చన్ , ఐశ్వర్యా రాయ్ 2007లో వివాహం చేసుకున్నారు. వీరు విడాకులు తీసుకోనున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా అభిషేక్ బచ్చన్ మాటలతో ఆ వార్తలకు చెక్ పడిందని బాలీవుడ్ టాక్. -
తల్లిని కెమెరాలో బంధిస్తున్న ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య (ఫోటోలు)
-
ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య ఎంత ఎదిగిపోయిందో! (ఫోటోలు)
-
ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
బాలీవుడ్ నటి ఐశ్వరరాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ తల్లి అయ్యాక కూడా ఆమె అదే గ్లామర్‌ని మెయింటెయిన్ చేస్తూ యువ హీరోయిన్లకు తీసిపోని విధంగా ఉంటుంది. ఆమె కూతురు ఆరాధ్య కూడా తల్లి అందాన్ని పుణికి పుచ్చుకున్నట్లు ఆకర్షణీయంగా ఉంటుంది. స్టైయిలిష్ దుస్తులతో కెమెరాకి చిక్కి అభిమానులను ఖుషీ చేస్తుంటుంది. ఇటీవల్ల ఏ వేడుకలోనైన ఈ క్యూట్ మామ్ అండ్ డాటర్స్ ఇద్దరు కలిసే సందడి చేస్తున్నారు. ఫ్రాన్స్ వేదికగా ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు సెలబ్రిటీలు ఈ ఈవెంట్‌కు హాజరై సందడి చేస్తున్నారు. ఆ వేడుకలో పాల్గొనేందుకు బయలు దేరుతూ మంబై ఎయిర్‌పోర్ట్‌లో ఇలా కెమెరాకు చిక్కారు తల్లికూతుళ్ల ద్వయం. అయితే ఆమె చేతికి బ్యాండేజ్ వేసుకుని కనిపించడంతో ఆమెకు ఏమైందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇక కూతురు ఆరాధ్య తల్లి చేతికి గాయం అయ్యిందని ఆమె టోట్ బ్యాగ్‌ని తాను తీసుకుని అమ్మకు కాస్త ఉపశమనం కలిగించింది. తల్లి కూతుళ్లు ఇద్దరు మంచి స్టయిలిష్ డ్రెస్‌లతో స్టన్నింగ్ లుక్‌లో కనిపించారు. ఐశ్వర్య ఫ్యాంటుపై లూయిస్ విట్టన్ ట్రెంట్ కోట్లో అబ్బరపర్చగా, ఆరాధ్య నల్లటి ఫ్యాంటుపై తెలుపు స్పీకర్లతో కూడిన స్వెట్షర్ట్లో ఉంది. ఇక్కడ ఐశ్వర్య గూచీ బ్లాక్ లెదర్ టోట్ బ్యాగ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ బ్రాండ్ బ్యాగ్ ధరలు అత్యంత ఖరీదైనవి. ఇక్కడ ఐశ్వర్యరాయ్ బ్యాగ్ టోట్ ధర ఏకంగా రూ. 80, 000/ పలుకుతుందట. ఈ కేన్స్ ఈవెంట్లో ఎప్పుడూ స్పెషల్ అట్రాక్షన్‌గా ఐశ్వర్య రాయ్ నిలుస్తుంటుంది. ఆమెను భారతదేశంలోని కేన్స్ రాణి అని చెప్పొచ్చు. అంతేగాదు ఆమె అభిమానులు 2024 కేన్స్‌లో ఐశ్వర్యరాయ్ లుక్ ఎలా ఉంటుందా అని ఆత్రతగా ఎదురుచూస్తున్నారు. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) (చదవండి: మిస్ యూఎస్ఏ విజేతల వరుస రాజీనామాలు! రీజన్ ఏంటో చెప్పిన తల్లులు) -
ఐశ్వర్య కూతురేనా? గుర్తుపట్టలేకుండా ఉందే..
అందాల తార ఐశ్వర్యరాయ్- బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ దంపతుల గారాలపట్టి.. ఆరాధ్య. ఐశ్వర్య ఎక్కడికి వెళ్లినా ఆమెతో పాటే వెళ్తుంది ఆరాధ్య. అటు ఐష్ కూడా కూతురి స్కూల్ ఈవెంట్స్‌కు తప్పక హాజరువుతుంది. ఇక అనంత్ అంబానీ ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు బాలీవుడ్ తారలు హాజరైన సంగతి తెలిసిందే! అందులో బచ్చన్ ఫ్యామిలీ కూడా ఉంది. అభిషేక్, ఐష్, ఆరాధ్య ఈ సెలబ్రేషన్స్‌ను తెగ ఎంజాయ్ చేశారు. గెటప్ మార్చింది.. అయితే ఎప్పుడు చూసినా నుదుటిపై జుట్టు ఉండేలా హెయిర్‌కట్ చేసుకునే ఆరాధ్య ఈసారి మాత్రం లుక్కు మార్చింది. నుదుటన పాపిట తీసి హెయిర్ లీవ్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆరాధ్య గెటప్ చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. 'ఆ నుదుటి మీద కురులు(బ్యాంగ్స్) లేకపోతే ఆరాధ్య ఎంత బాగుందో.. ఈ పిల్ల అచ్చం ఆమె అమ్మలాగే ఉంది.' అచ్చం తల్లిలాగే.. 'యవ్వనంలో ఐశ్వర్య ఎలా ఉండేదో.. సేమ్ టు సేమ్.. అలాగే ఉంది. ఇంత క్యూట్‌గా ఉన్న పాప ఎందుకని అలా బ్యాంగ్స్తో తన ముఖాన్ని దాచుకుందో..', 'ఏంటి ? ఈమె ఆరాధ్యనా? నిజంగా గుర్తుపట్టలేకున్నాం. తన కొత్త హెయిర్‌స్టైల్ చాలా బాగుంది. ఎంతో ఎదిగిపోయినట్లుగా కనిపిస్తోంది' అని కామెంట్లు చేస్తున్నారు. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ 2007లో వివాహం చేసుకున్నారు. వీరికి 2011 నవంబర్ 16న ఆరాధ్య జన్మించింది. Look at my two girls 😍 they look so beautiful 😻 #AishwaryaRaiBachchan #AishwaryaRai pic.twitter.com/hDE73iuXzQ — AISHWARYA RAI 💙 (@my_aishwarya) March 3, 2024 The family ❤️. Beautiful #AishwaryaRai with Aradhya pic.twitter.com/h4O8HWs4TE — अपना Bollywood🎥 (@Apna_Bollywood) March 4, 2024 చదవండి: తెలుగు సినిమాల్లో కనిపించట్లే.. అవకాశాలు రావడం లేదా? -
హైకోర్టును ఆశ్రయించిన అమితాబ్ మనవరాలు!
బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ మనవరాలు, అభిషేక్-ఐశ్వర్యరాయ్‌ల ముద్దుల తనయ ఆరాధ్య బచ్చన్ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించింది. తన ఆరోగ్యంపై తప్పులు కథనాలను ప్రసారం చేస్తున్న యూట్యూబ్ చానళ్లపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ అంశంపై నేడు(ఏప్రిల్ 20) హైకోర్టులు విచారణ జరిగింది. 11 ఏళ్ల వయసు ఉన్న ఆరాధ్యపై కొన్ని యూట్యూబ్ చానళ్లు తరచూ తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నాయి. ఆమెను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. తన కూతురుపై వచ్చిన తప్పుడు కథనాలపై గతంలో అభిషేక్ మీడియా ముందే ఆగ్రహం వ్యక్తం చేశారు. సెలబ్రెటీల పిల్లలను ట్రోల్స్ చేయడం సరికాదని, అలాంటి వారిని క్షమించొద్దని అన్నారు. అయినా కూడా ట్రోల్స్ తగ్గలేదు. దీంతో ఆరాధ్య నేరుగా హైకోర్టుని ఆశ్రయించింది. ఆరాధ్య ఆరోగ్యానికి సంబంధించిన వీడియోలను షేర్ చేయకుండా యూట్యూబ్ చానళ్లను న్యాయస్థానం నిషేదించినట్లు తెలుస్తోంది. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ 2007లో వివాహం చేసుకున్నారు. వీరికి 2011 నవంబర్ 6న ఆరాధ్య జన్మించింది. -
కూతురి పెదాలపై ముద్దు.. ఐశ్వర్యపై నెటిజన్స్ ఫైర్
బాలీవుడ్ స్టార్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ ముద్దుల కూతురు, లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ మనువరాలు ఆరాధ్య బచ్చన్ బర్త్‌డే నేడు(నవంబర్ 16). ఈ సందర్భంగా ఐశ్యర్య రాయ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. కుమార్తెకి ఆ విధంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడాన్ని నెటిజన్స్ తప్పుబడుతున్నారు. (చదవండి: సినిమాలకు బ్రేక్.. స్టార్ హీరో అనూహ్య నిర్ణయం) ఇంతకీ ఐష్ పెట్టిన పోస్ట్ ఏంటంటే.. కూతురు బర్త్‌డేని పురస్కరించుకొని ‘నా ప్రేమ.. నా ప్రాణం.. ఐ లవ్ యూ ఆరాధ్య’ అని పేర్కొంటూ ఆరాధ్యతో కలిసి ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో ఆరాధ్యకి ఐశ్వర్యరాయ్ లిప్ కిస్ ఇస్తూ కనిపించింది. కూతురి బుగ్గలపై, నుదుటిపై కాకుండా పెదవులపై ముద్దు పెట్టడాన్ని కొంతమంద నెటిజన్స్ తప్పుబడుతున్నారు. ఇది మన సంస్కృతి కాదు. వెస్ట్రన్ కల్చర్ అని, పబ్లిసిటీ కోసం ఇంత నీచంగా ఫొటోలు పెట్టాలా..? అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరికొంత మంది మాత్రం ఆ ఫోటోలో తప్పే ఏముంది? అని తిరిగి ప్రశ్నిస్తున్నారు. ‘బిడ్డపై తల్లికున్న స్వచ్ఛమైన ప్రేమ అది. ప్రతి విషయాన్ని వక్రదృష్టితో చూడడం మానండి' అని కామెంట్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) -
నన్ను ట్రోల్ చేయండి.. నా కూతురి జోలికొస్తే ఊరుకోను: హీరో
Abhishek Bachchan Lashes Out At Trolls Attacking Daughter Aaradhya: సాధారణంగా సెలబ్రిటీలకు సంబంధించి ఏ వార్తైనా క్షణాల్లో వైరలవుతుంది. వారితో పాటు వాళ్ల ఫ్యామిలీపై కూడా జనాల అటెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొన్నిసార్లు ఇబ్బందిగానూ అనిపిస్తుంది. తమ అంచనాలకు తగ్గట్లు వారితో ఏమాత్రం మార్పులు కనిపించినా జనాలు తెగ ట్రోల్ చేసేస్తుంటారు. తాజాగా ఇలాంటి పరిస్థితే బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్‌లకు సైతం ఎదురైంది. ఇటీవలె కూతురు ఆరాధ్యతో కలిసి మాల్దీవులకు వెళ్లిన బచ్చన్ ఫ్యామిలీ ఎయిర్‌పోర్ట్‌లో మీడియా కంట పడింది. ముఖ్యంగా ఆరాధ్య నడకపై అందరి ఫోకస్ వెళ్లింది. ఐశ్వర్య ఎప్పుడూ కూతురి చేయి పట్టుకొనే నడిపించడం, ఆరాధ్య వంకరగా నడుస్తుందంటూ సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. తాజాగా ఓ సినిమా ప్రమోషన్లో పాల్గొన్న అభిషేక్ బచ్చన్.. తన కూతురి నడకపై చేస్తున్న ట్రోల్స్‌పై స్పందించారు. నేను పబ్లిక్ ఫిగర్‌ని. నన్ను ఎంతైనా ట్రోల్ చేయండి పడతాను. కానీ నా కూతుర్ని అనేడానికి మీకు హక్కు లేదు. దమ్ముంటే ఆ మాటలు నా ఎదురుగా వచ్చి అనండి అంటూ ట్రోలర్స్‌కి గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ప్రస్తుతం అభిషేక్ చేసిన ఈ కామెంట్స నెట్టింట వైరల్‌గా మారాయి. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
చుట్కీ నడక చూడండి.. 'సెలబ్రిటీ కిడ్' వీడియో వైరల్
సినీ సెలబ్రిటీలు ఏం చేసిన నెటిజన్స్ ఓ కంట కనిపెడుతూ ఉంటారు. వారు ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? ఏం తింటున్నారు? అంటూ వెతుకుతారు. వారిని ఎంకరేజ్ చేయడానికి అన్నట్లుగా సోషల్ మీడియా ఎలాగు ఉంది. సామాజిక మాధ్యమాల్లో సెలబ్రిటీల ప్రవర్తన, విధానం, వేషధారణ కొంచెం భిన్నంగా కనిపించిన తమదైనా రీతిలో ఆడేసుకుంటున్నారు. సెలబ్రిటీలే కాకుండా వారి పిల్లలపై కూడా ఇలాగే స్పందిస్తారు నెటిజన్లు. తాజాగా బాలీవుడ్ దివా ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ కుమార్తె ఆరాధ్య నడకపై నెటిజన్స్ తమదైన శైలిలో ట్రోలింగ్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) ఇటీవల అభిషేక్, ఐశ్వర్య బచ్చన్ దంపతుల కుమార్తె ఆరాధ్య 10వ పుట్టినరోజును మాల్దీవుల్లో సెలబ్రేట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఐశ్వర్య రాయ్ బచ్చన్ తన కూతురుతో కలిసి ముంబైకి తరిగివచ్చారు. వారు తిరిగివచ్చిన తర్వాత కొన్ని రోజులకు తన తల్లితో కలిసి నడుస్తున్న చిన్నారి ఆరాధ్య వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. అంతే, నెటిజన్ల దృష్టి చిన్నారి నడకపై పడ్డాయి. ఆరాధ్య క్యాట్ వాక్‌పై ఓ నెటిజన్ 'చుట్కీ నడక చూడండి' అని నవ్వుతున్న ఎమోజీస్ పెట్టింది. 'ఆమె నడకకు ఏమైంది??' అని మరొకరు కామెంట్ పెట్టారు. ఇదిలా ఉంటే మరోవైపు, 'తనకు 10 ఏళ్లు మాత్రమే. కొంచెం దయచూపండి' అని ఒక యూజర్ స్పందించారు. 'ఆమెను ఎగతాళి చేయడంతో మనం ఎంత దిగజారిపోయామో తెలుస్తోంది' అని ఇంకొకరు ఆరాధ్యవైపు నిలబడ్డారు. చదవండి: ఆరాధ్య పదో బర్త్‌డే.. మాల్దీవుల్లో బచ్చన్ ఫ్యామిలీ చిల్లింగ్ -
Aaradhya Birthday:ఆరాధ్య పదో బర్త్‌డే.. మాల్దీవుల్లో బచ్చన్ ఫ్యామిలీ చిల్లింగ్
బాలీవుడ్ కపుల్ అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ కుమార్తె ఆరాధ్య ముగ్గురు మాల్దీవుల్లో చిల్ అవుతున్నారు. నవంబర్ 13న ఈ ముగ్గురు ముంబై విమానాశ్రయంలో కెమెరాలకు చిక్కారు. అభిషేక్, ఐశ్వర్య నుదిటిపై తిలకంతో క్యాజువల్స్ వేర్స్‌లో కనిపించారు. బచ్చన్ వంశం కుటుంబ సెలవుల కోసం మాల్దీవులకు వెళ్లినట్లు తెలిసిందే. ఈ దంపతుల కుమార్తె ఆరాధ్య నవంబర్ 16న 10 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. అయితే కూతురు బర్త్‌డేను మాల్దీవుల్లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by AishwaryaRaiBachchan (@aishwaryaraibachchan_arb) ఐశ్వర్య రాయ్ మాల్దీవుల దీవుల్లో చిల్ అవుతున్న దృశ్యాన్ని ఇన్‌స్టా గ్రామ్‌లో పంచుకున్నారు. ఆ స్నాప్‌ను షేర్ చేసి, 'సన్ బ్రీజ్ అండ్ ప్యారడైజ్' అని క్యాప్షన్ ఇచ్చారు. అభిషేక్ కూడా దీవుల నుంచి ఒక చిత్రాన్ని షేర్ చేస్తూ 'మేల్కొల్పడానికి చెడు దృశ్యం కాదు' అంటూ రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by Abhishek Bachchan (@bachchan) గత సంవత్సరం, 2020లో, ఐశ్వర్య సోషల్ మీడియాలో ఆరాధ్యతో ఉన్న ఒక అందమైన స్నాప్‌ను షేర్ చేశారు. అందులో, " నా జీవితపు సంపూర్ణ ప్రేమ, నా ప్రియమైన దేవదూత ఆరాధ్యా.. నేను నిన్ను ఎప్పటికీ, నిత్యం, అనంతంగా ప్రేమిస్తాను. నేను తీసుకుంటున్న ప్రతి శ్వాస నీకోసమే అయినందుకు దేవుడికి కృతజ్ఞతలు. గాడ్ బ్లెస్ యూ లవ్' అంటూ 9వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆరాధ్య నవంబర్ 16, 2011లో జన్మించింది. -
నీ కూతురి చేయి ఎప్పుడు వదులుతావు?
ఐశ్వర్యరాయ్‌కు ఆరాధ్య ఒక్కతే కూతురు ప్రస్తుతానికి. ఐశ్వర్యరాయ్‌కు ఆరాధ్యే కూతురు. ఐశ్వర్యారాయ్ ఆరాధ్యను అనుక్షణం తన కూతురు అనుకుంటూ ఉంటుంది. ఏమిటి.. చెప్పిందే చెప్తున్నాం అనుకుంటున్నారా? ఐశ్వర్యరాయ్ బయట ఎక్కడ కనిపించినా కూతురి చేయి పట్టుకోకుండా కనిపించదు. లేదా కూతురి చేతిని వదలకుండా పట్టుకుని ఉంటుంది. దీని మీద ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తాజాగా ముంబై ఎయిర్‌పోర్టులో కూడా కూతురి చేతిని పట్టుకునే కనిపించింది. ‘నీ కూతురి చేతిని నువ్వెప్పుడు వదిలిపెడతావ్?’ అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఏం జరిగిందంటే మణిరత్నం సినిమా కోసం గత మూడు నాలుగు వారాలుగా ఐశ్వర్యా రాయ్ తన భర్త, కూతురుతో చెన్నైలో ఉంది. షూటింగ్ పని అయ్యాక రెండు రోజుల క్రితం ముంబై ఎయిర్పోర్ట్ చేరుకుంది. బయటికొచ్చే సమయంలో యధావిధిగా కూతురి చేతిని పట్టుకుని ఉంది. ఎయిర్‌పోర్టులో నుంచి బయటకు వచ్చి కారు ఎక్కే వరకు ఆరాధ్య చేతిని ఆమె వదల్లేదు. వారిద్దరి వెనుక అభిషేక్ బచ్చన్ నడుస్తూ కనిపించాడు. ఆరాధ్యకు ఇప్పుడు 9 ఏళ్లు. తొమ్మిదేళ్ల అమ్మాయి తనకు తానుగా ఆడొచ్చు. పరిగెత్తుకుంటూ వచ్చి కార్ ఎక్కవచ్చు. లేదా అటూ ఇటూ దిక్కులు చూస్తూ నడవొచ్చు. కాని ఐశ్వర్య ఇవేమి అలౌ చేయదు. కూతురి చేయి తన చేతిలో ఉండాల్సిందే. ఇప్పుడే కాదు. ఆరాధ్య తో ఆమె ఎప్పుడు బయటకు వచ్చినా, ఆరాధ్య స్కూల్‌కు ఆరాధ్యతో వెళ్లినా ఐశ్వర్య తన కూతురి చేతిని విడువదు. దీనిపై నెటిజన్లు కామెంట్లు చేస్తూ వస్తున్నారు. ‘ఐశ్వర్య చాలా పొసెసివ్’ అని ఒకరంటే ‘ఐశ్వర్య చాలా ప్రొటెక్టివ్’ అని ఒకరన్నారు. ‘అయ్యో... ఆ అమ్మాయి చేయి వదలొచ్చు కదా’ అని ఒకరంటే ‘కూతురికి ఎన్నేళ్లు వస్తే ఆమె చేయి వదులుతుందో’ అని మరొకరన్నారు. పిల్లల పెంపకంలో చేయి పట్టుకుని నడిపించడం ఉంటుంది.. చేయి వదిలి నేర్పించడం ఉంటుంది... ఐశ్వర్య ఈ దారిని ఎందుకు ఎంచుకుందో అనేవారు ఉంటారు. మరోవైపు ఆరాధ్య ఎప్పుడు బయటకు వచ్చినా పాపరాజిలు తమ కెమెరాలతో వెంటబడుతుంటారు. ఆమె చేయి వదిలితే వారు పలకరిస్తే ఏం మాట బయటకు వస్తుందో అదెక్కడికి దారి తీస్తుందోనని ఆమె అనుకుంటూ ఉండొచ్చా? లేదా భద్రత రీత్యా పాప చేయి వదలదా? ఏమో. కాని ఆమెలా అనునిత్యం పిల్లల చేయి పట్టుకుని కనిపించే బాలీవుడ్ సెలబ్రిటీలు లేరు. -
ఆస్పత్రిలో చేరిన ఐశ్వర్యరాయ్, ఆరాధ్య
ముంబై : కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యి హోం ఐసోలేషన్‌లో ఉంటున్న ఐశ్వర్యరాయ్(46), ఆమె కుమార్తె ఆరాధ్య(8) శుక్రవారం ఆస్పత్రిలో చేరారు. వైరస్ లక్షణాలు స్పల్పంగా కనిపించడంతో నిన్న సాయంత్రం ముంబైలోని నానావతి ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని ఆస్పత్రి వర్గాలు ధృవీకరించాయి. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా ఈనెల 12 ఐశ్వర్యర్యాయ్, ఆరాధ్యకు కరోనా సోకిన విషయం తెలిసిందే. వైరస్ లక్షణాలు లేకపోవడంతో గత అయిదు రోజులుగా వైద్యుల సూచనతో వారు ఇంట్లోనే హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. (ఐశ్వర్య రాయ్, ఆరాధ్యలకు కరోనా పాజిటివ్) మరోవైపు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, ఆయన కొడుకు సైతం జూలై 11న కరోనా బారిన పడి నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కరోనా తేలినప్పటి నుంచి బిగ్‌బీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తమ ఆరోగ్య సమాచారాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. తాము త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్న అభిమానులు, సన్నిహితులందరికి బిగ్‌బీ ట్విటర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. (కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై అభిషేక్ ట్వీట్) -
ఇక చాలు.. ఆపేయండి!
బీ టౌన్ స్టార్ కిడ్స్ తైమూర్ అలీఖాన్, అబ్రామ్ ఖాన్, ఆరాధ్య బచ్చన్, మిషా కపూర్లకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగే వేరు. వీరి ఫొటోలు షేర్ చేస్తే చాలు లక్షల్లో లైకులు వచ్చిపడతాయి. అందుకే ఈ చోటా సెలబ్రిటీలు కనబడగానే క్షణం ఆలస్యం చేయకుండా ఫొటోగ్రాఫర్లు కెమెరా కన్నును క్లిక్‌మనిపిస్తారు . ఇక పేరెంట్స్‌తో కలిసి బుల్లి స్టార్స్ కనబడితే పండుగ చేసుకునే పాపరాజీలు వివిధ భంగిమల్లో వారిని ఫొటోలో బంధించేందుకు ఉత్సాహం చూపిస్తారు. అయితే ఈ తతంగమంతా బచ్చన్ల రాజకుమారి ఆరాధ్యకు విసుగు తెప్పించింది. మాటిమాటికీ ఫోజులివ్వమని అడగటమే కాకుండా వెనుక నుంచి కూడా తనను ఫొటోలు తీయడానికి ప్రయత్నించడంతో ఫొటోగ్రాఫర్లకు క్యూట్ కౌంటర్ ఇచ్చింది. అసలు విషమయేమిటంటే.. ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ- శ్లోకా మెహతాల వివాహం శనివారం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు అంతర్జాతీయ ప్రముఖులు, క్రీడా దిగ్గజాలు సహా దాదాపు బాలీవుడ్ తారగణమంతా తరలి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆదివారం నాటి రిసెప్షన్ వేడుకకు తల్లిదండ్రులు ఐశ్వర్య-అభిషేక్ బచ్చన్‌లతో కలిసి ఆరాధ్య బచ్చన్ కూడా హాజరైంది. ఇందులో భాగంగా ఫొటోలు దిగే క్రమంలో నవ్వుతూ ఫొటోలకు ఫోజులిచ్చింది. అయితే పదే పదే సేమ్ పొజిషన్లో ఉండాలని చెప్పడం, స్టేజ్ దిగుతున్న క్రమంలో కూడా ఫొటోలు తీయడంతో చిర్రెత్తుకొచ్చిన ఆరాధ్య.. ‘ఇక చాలు.. ఆపేయండి’ అంటూ ఫొటోగ్రాఫర్లకు స్వీట్ షాక్ ఇచ్చింది. దీంతో అక్కడ నవ్వులు విరబూశాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. View this post on Instagram #Bachchan Family at #AkashAmbani Shloka Mehta’s Wedding Reception . . . #Aishwarya #aishwaryarai #aishwaryaraibachchan #abhishekbachchan #amitabhbachchan #ranbirkapoor #anushkasharma #deepikapadukone #priyankachopra #katrinakaif #sonamkapoor #jacquelinefernandez #salmankhan #aliabhatt #shahrukhkhan #shraddhakapoor #longines #ranveersingh #bollywood #magezine #pinkvilla #bollywoodstyle #TBWORLD2018 #بالیوود #بالیوود_ایران #تبلیغات #بالیوود_پارس #آیشواریا_رای A post shared by Aishwarya Rai Queen (@aishwarya_rai_queen) on Mar 10, 2019 at 12:02pm PDT -
పిచ్చి పనులు మానుకోండి!
పాపులారిటీ, రీడర్లను ఆకర్షించడం కోసం అసత్యాలు ప్రచారం చేస్తే సహించేది లేదని బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ఓ ప్రైవేట్ వెబ్‌సైట్‌ను హెచ్చరించారు. పారిస్ టూర్ ముగించుకుని ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అభిషేక్- ఐశ్వర్యలు తీవ్రంగా గొడవ పడ్డారంటూ సదరు వెబ్సైట్ కథనాన్ని రూపొందించడంతో పాటు.. ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో వైరల్‌గా మారడంతో అభిషేక్ దృష్టికి వచ్చింది. ఈ విషయంపై స్పందించిన అభిషేక్.. ‘ దయచేసి తప్పుడు కథనాలు ప్రచారం చేయడం మానుకోండి. ఎప్పటికప్పుడు ఏదో ఒక వార్త ద్వారా ప్రజలను ఆకర్షించాలనుకుంటారు కదా. ఒకవేళ అవి ఎవరికైనా ఉపయోగకరమైనవి అనుకుంటేనే ప్రచురించండి. అంతేతప్ప ఇలాంటి పిచ్చి పనులు చేయకండి’ అంటూ ట్వీట్ చేశాడు. అభిషేక్ హెచ్చరికతో స్పందించిన సదరు వెబ్సైట్ వెంటనే అభిషేక్- ఐశ్వర్యల వీడియోను డెలిట్ చేసింది. వీడియోలో ఏముందంటే.. ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అనంతరం తన గారాల పట్టి ఆరాధ్య చేయి పట్టుకునేందుకు అభిషేక్ ప్రయత్నించగా.. చేతిని వెనక్కి లాక్కున్న ఆరాధ్య తల్లి ఐశ్వర్యను గట్టిగా హత్తుకుంది. ఐశ్వర్య కూడా ఆరాధ్య చేయి వదలకుండా అభిషేక్ వెనకాలే నడిచింది. ఆ సమయంలో అభిషేక్ కాస్త కోపంగా కనిపించడంతో.. ఇరువురి మధ్య తీవ్ర గొడవ జరిగిందంటూ సదరు వెబ్సైట్ వార్తలు ప్రచారం చేసింది. With due respect. Please refrain from making up false stories. I understand the need to continously post, but would really appreciate it if you could do so responsibly and without mischievous intent. Thank you. — Abhishek Bachchan (@juniorbachchan) July 23, 2018 -
విజయాన్ని ఆశిస్తూ ఆమె కొనసాగుతూనే ఉంది...
గత ఏప్రిల్ నెలకు అభిషేక్ బచ్చన్‌కు ఐశ్వర్యరాయ్‌కు వివాహం జరిగి 11 ఏళ్లు నిండాయి. ఈ పెళ్లి జరుగుతున్నప్పుడు చాలా మందికి చాలా సందేహాలే ఉన్నాయి. ఇది ఎంత కాలం సాగుతుందో చూద్దాం అనుకున్నవారు ఉన్నారు. విడాకుల పుకార్లు పుట్టించినవారూ ఉన్నారు. కాని ఐశ్వర్యరాయ్ బచ్చన్ కోడలిగా నటిగా తల్లిగా భార్యగా సమర్థంగా తన జీవితాన్ని నిర్వహించుకుంటూ వస్తోంది.ఇక్కడ ఫొటోలో కనిపిస్తున్నది భర్త అభిషేక్, కుమార్తె ఆరాధ్యలతో ఐశ్వర్య. నాలుగురోజుల క్రితం ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాష్ అంబానీ ప్రీ ఎంగేజ్మెంట్ పార్టీలో భర్త, కుమార్తెతో ఆమె హుషారుగా కనిపించింది.గతంలో వీరు విడిపోతారని పుకార్లు వచ్చినప్పుడు ‘అభిషేక్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అతడు సరదాగా ఉంటాడు. నవ్విస్తాడు. సర్దుబాట్లు, ఇచ్చి పుచ్చుకోవడాలు ఉండొచ్చు. పెళ్లంటే అదే. కొన్ని విషయాల్లో అనంగీకారం ఉన్నా అతడు నా భర్త, నా బిడ్డకు తండ్రి’ అని అందామె.‘నేను ఆమెను ఎంత ప్రేమిస్తానో ఆమెకు తెలుసు. ఆమె నన్నెంత ప్రేమిస్తుందో నాకు తెలుసు. కనుక మీడియా వాళ్లకు మేత కోసం మేమిద్దరం విడిపోలేము’ అని అభిషేక్ అన్నాడు. అయితే పెళ్లయ్యాక ఆమెకు నటన పరంగా తగిన అవకాశాలు రాలేదు. రజనీకాంత్‌తో నటించిన ‘రోబో’నే ఆమె ఖాతాలో ఉన్న పెద్ద హిట్. ఆ తర్వాత నటించిన మణిరత్నం ‘రావణ్’, అక్షయ్ కుమార్ ‘యాక్షన్ రీప్లే’, పాకిస్తాన్ ఖైదులో ఉన్న సరబ్జిత్ కథ ఆధారంగా తీసిన ‘సరబ్జిత్’ ఆమెకు విజయం ఇవ్వలేదు. చివరకు క్లోజ్‌ఫ్రెండ్ కరణ్ జొహర్ ‘అయ్ దిల్ హై ముష్కిల్’లో ఒక పాత్ర ఇస్తే అందులో శృతి మించిన శృంగారం ఉండేసరికి ప్రేక్షకులు ఆమెను అంగీకరించలేకపోయారు. ఈ నేపథ్యంలో ఆమె తాజా సినిమా ‘ఫన్నేఖాన్’ ఆగస్టు 3న విడుదల కానుంది. అనిల్ కపూర్, రాజ్‌కుమార్ రావ్‌లతో పాటు ఐశ్వర్యా రాయ్ కూడా ఇందులో ముఖ్యపాత్ర. రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా నిర్మాణంలో అతుల్ మంజ్రేకర్ దర్శకత్వంలో తయారైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులలో కుతూహలం రేపుతోంది. గృహిణిగా ఉండటంతో పాటు నటిగా ఉండటం కూడా తనకు ముఖ్యం అని భావిస్తున్న ఐశ్వర్య ఈ సినిమాతో హిట్ కొట్టి మళ్లీ ఒకసారి తన ప్రాభవాన్ని నిరూపిస్తుందని ఆశిద్దాం. -
అమితాబ్.. మీ కంటే ఆరాధ్య బెటర్
సాక్షి, ముంబై: ముక్కుసూటి మనిషి అయిన దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్‌కు నాన్చటం తెలీదు. ఏ విషయంపైన అయినా సరే చాలా ఓపెన్‌గా మాట్లాడుతుంటారు. ట్వీటర్లో ఆయన చేసే పోస్టులు కూడా సరదాగా. తాజాగా అవెంజర్స్ ఇన్ఫినిటీ చిత్రాన్ని చూసిన ఆయన ఓ ట్వీట్ చేశారు. ‘సర్.. తప్పుగా అనుకోకండి. అవెంజర్స్ సినిమా చూశా. కానీ, సినిమా చూస్తున్నంత సేపు ఏం జరుగుతుందో ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు’ అంటూ సరదాగా ఓ ట్వీటేశారు. దానికి స్పందించిన అవెంజర్స్ ఫ్యాన్స్ ఆయనికి కౌంటర్ ఇచ్చే యత్నం చేశారు. ‘అవెంజర్స్ సిరీస్‌లో వరస బెట్టి సినిమాలన్నీ చూస్తే మీకు అసలు విషయం అర్థమౌతుంది’ ఆయన ఓ వ్యక్తి ట్వీట్ చేయగా.. ‘ ఈ విషయంలో మీ కంటే మీ మనవరాలు ఆరాధ్య బెటర్. ఆమెకు సినిమా బాగా అర్థమై ఉంటుంది’ అంటూ మరో వ్యక్తి సెటైర్ పేల్చాడు. చిన్న పిల్లలకు ఆ సూపర్ హీరోస్ గురించి బాగా తెలుసని, కాబట్టి మీ ముద్దుల మనవరాలిని అడిగి కథ మొత్తం తెలుసుకోవాలని మరో వ్యక్తి ట్వీట్ చేశారు. సరదాగా మెగాస్టార్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 1.5 బిలియన్ డాలర్ల వసూళ్లు చేసిన ఈ చిత్రం ఇండియాలో రూ.230 కోట్లు వసూలు చేసింది. ఇన్ఫినిటీ స్టోన్స్ సాయంతో సగం విశ్వాన్ని నాశనం చేయాలని యత్నించే థానోస్, అతన్ని అడ్డుకునేందుకు అవెంజర్స్ చేసే పోరాటలతో ఇన్ఫినిటీ వార్ తెరకెక్కింది. T 2803 -T 2003 - अच्छा भाई साहेब , बुरा ना मानना , एक पिक्चर देखने गाए , 'AVENGERS' ... कुछ समझ में नहीं आया की picture में हो क्या रहा है !!!🤪🤪🤪🤪🤪🤪🤪😠😠😠 — Amitabh Bachchan (@SrBachchan) 13 May 2018 -
నేనూ అందరిలాంటి అమ్మనే..!
సాక్షి, ముంబై : బయటి ప్రపంచానికి తానొక టాప్ హీరోయిన్ అయినా.. తన బిడ్డ దగ్గర ఒక సాధారణ తల్లి మాత్రమే.. వృత్తి విషయంలో ఎంత బిజీగా ఉన్నా తన బిడ్డకు కావాల్సిన ఆనందాలను ఎక్కడా దూరం చేయడంలేదు. అందరి అమ్మల్లాగే పార్కులకు, షాపింగ్‌లకు, స్కూల్‌కు తీసుకెళుతున్నారు. ఆమె ఎవరో కాదు బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యరాయ్. తాజాగా ఓ ప్రముఖ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్య్వూలో తన కూతురు ఆరాధ్య గురించి చెబుతూ తెగ సంబరపడిపోయారు ఐశ్వర్య. ఆరాధ్య ఇంకా చిన్న పిల్లేనని, తన పని ఒత్తిడి ఆరాధ్యపై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నానని తెలిపారు. ప్రస్తుతం షూటింగ్‌లు తగ్గించుకొని కూతురితోనే ఎక్కువగా సమయం గడిపేందుకు ఇష్టపడతానని చెప్పారు. ఆరాధ్యపై ఎక్కువగా మీడియా ఫోకస్ పడకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ప్రస్తుతం రాకేశ్ ఓంప్రకాశ్ దర్శకత్వంలో ‘ఫ్యానీ ఖాన్’ సినిమాలో నటిస్తున్న ఐష్, రోహన్ సిప్పీ దర్శకత్వంలో ఓ బోల్డ్ థ్రిల్లర్ చేసేందుకు అంగీకరించారు. -
గిర్రు.. గిర్రున...
ముద్దుల కూతురు ఆరాధ్యా బచ్చన్‌తో కలసి ఐశ్వర్యా రాయ్ రంగుల రాట్నంలో గిర్రున తిరిగారు. తల్లీకూతుళ్లిద్దరూ హాయిగా నవ్వుతూ ఎంజాయ్ చేశారు. భార్య, కూతురు ఎంజాయ్ చేస్తోంటే అభిషేక్ బచ్చన్ ఆనందపడిపోయారు. ఇటీవల ఆరాధ్య బర్త్‌డే జరిగింది. పార్టీలో పాల్గొనే పిల్లల ఎంజాయ్మెంట్ కోసం అభిషేక్ రంగుల రాట్నం తెప్పించారు. మరి.... జెయింట్ వీల్ అంటే భయమో? ఏమో? అభిషేక్ మాత్రం ఎక్కలేదు. -
దుమ్మురేపిన చిన్నారి మెగా వారసులు!
తమ పిల్లలు వేదికనెక్కి.. ఆడిపాడుతుంటే ఏ తల్లిదండ్రులు మాత్రం మురిసిపోరు! వారి ముద్దుముద్దు చిందులు చూసి.. సంతోషంతో, చప్పట్లతో కెరింతలు కొట్టకుండా ఉండగలరా తల్లిదండ్రులు. తాజాగా బాలీవుడ్ మెగాస్టార్ వారసురాలు చిన్నారి ఆరాధ్య, పర్ఫెక్టనిస్ట్ ఆమిర్ ఖాన్ చిన్న కొడుకు ఆజాద్ స్కూల్ వార్షికోత్సవం సందర్భంగా తోటి విద్యార్థులతో కలిసి వేదికను ఎక్కి ప్రదర్శన ఇచ్చారు. ముంబైలోని ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో వీళ్లు చదువుతున్నారు. Aaradhya's annual day performance was so cute! She's certainly got the moves haha! pic.twitter.com/qq4feoQj0P — Bewitching Bachchans (@TasnimaKTastic) January 7, 2017 ఇలా ఆరాధ్య, ఆజాద్ ఒకేసారి వేదికను ఎక్కి తోటి చిన్నారులతో కలిసి 'కూ..కూ.. చిక్‌చిక్' అంటూ అదరగొట్టే ప్రదర్శన ఇచ్చారు. స్టార్ కిడ్స్ కావడంతో అందరి దృష్టి వీరి మీద నిలిచింది. అంతేకాకుండా ఆరాధ్య తల్లిదండ్రులు ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్.. ఆజాద్ తండ్రి ఆమిర్ ఖాన్ స్వయంగా వచ్చి.. వీరి ప్రదర్శన చూసి పులకించిపోయారు. ప్రేక్షకులతో కలిసి ఆనందంలో కెరింతలు కొట్టారు. చిన్నారి బుజ్జాయిలు కన్నుల పండువగా ప్రదర్శన ఇస్తుంటే చూసి మురిసిపోయారు. పారిశ్రామికవేత్త ముకేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ కూడా పిల్లల ప్రదర్శన చూసి ఆనందించారు. ఈ వేడుక వీడియోలు తాజాగా బచ్చన్ అభిమాని ట్విట్టర్ పేజీ ఒకటి వెలుగులోకి తెచ్చింది. ఎంతో క్యూట్‌గా ఉన్న వీరి ప్రదర్శన చూసి నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. Abhishek and Aishwarya enjoying Aaradhya's annual day function pic.twitter.com/G0JkHAPA2a — Bewitching Bachchans (@TasnimaKTastic) January 7, 2017 Aishwarya being a proud mum takes videos of Aaradhya as she's on stage pic.twitter.com/QbbgggbDdZ — Bewitching Bachchans (@TasnimaKTastic) January 7, 2017 Abhishek goes to meet Aaradhya and her friends whilst Aishwarya takes their photos pic.twitter.com/MY9JOryIpH — Bewitching Bachchans (@TasnimaKTastic) January 7, 2017 -
అమ్మానాన్నలకు ధీటుగా..!
పంచామృతం: ఆస్తి, పేరు ప్రఖ్యాతులు... ఇవి కేవలం సంపాదించుకునేవే కాదు, వారసత్వంగా కూడా వస్తాయి. ఇలాంటి వారసత్వం పుట్టుకతోనే పిల్లల్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది, అందరిలోనూ ఆసక్తిని పెంపొందిస్తుంది. ప్రస్తుతం ఇలాంటి ఫేమ్‌తో ముద్దులొలుకుతున్న పిల్లలు కొందరున్నారు. వాళ్లు ఏం చేసినా సంచలనమే అవుతోంది. తల్లిదండ్రులకు ఉన్న పేరు ప్రఖ్యాతులే వీళ్లకున్న క్రేజ్‌కు ప్రధాన కారణం. అలా ఇంకా ఏమీ సాధించకుండానే అమ్మనాన్నలకు ధీటైన ప్రచారాన్ని, ఫేమ్‌ను పొందుతున్న కొందరు పిల్లలు వీళ్లు. ఆరాధ్య బచ్చన్ బహుశా మన దేశంలో ఏ సెలబ్రిటీల పిల్లలకూ రాని స్థాయిలో ప్రచారం పొందిన పాపాయి ఆరాధ్య. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ మనవరాలిగా, ఒకనాటి విశ్వసుందరి ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ల పుత్రికగా ఆరాధ్య పట్ల ఎనలేని క్రేజ్ మొదలైంది. అసలు ఐశ్వర్యరాయ్ ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచే ఈ పాపాయి పట్ల ఆసక్తి మొదలైంది. పుట్టిన కొత్తలో ఆరాధ్య ఫోటోలు ఎప్పుడెప్పుడు బయటకు వస్తాయా.. అని దేశంలో ఎంతో మంది ఎదురు చూశారు. ఇప్పటికీ అభిషేక్, ఐశ్వర్యల వెంట ఆరాధ్య కనిపించిందంటే వందల కెమెరాలు క్లిక్మంటాయి. అర్జున్ టెండూల్కర్ అర్జున్ టెండూల్కర్ అడుతున్న స్కూల్ మ్యాచ్‌లకు కూడా ప్రత్యేక గుర్తింపు దక్కుతోంది. స్కూల్‌స్థాయి మ్యాచ్‌లలో అర్జున్ఎలా ఆడుతున్నాడు, ఎంత స్కోర్ చేస్తున్నాడు, అతడి బ్యాటింగ్తీరు తెన్నులు ఎలా ఉన్నాయి.. అనే అంశాల గురించి అంతర్జాతీయ స్థాయి క్రికెట్ ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. ఇంత వరకూ అర్జున్ ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు కూడా ఎక్కడా ఆడింది లేదు. అయినా అతడి ఆటతీరు గురించి ఇంతటి ప్రచారం అంటే దానికి తండ్రి సచిన్ టెండూల్కర్ నేపథ్యమే కారణం. జార్జ్ అలెక్స్ లూయిస్ బ్రిటన్ రాజవంశానికి చెందిన ప్రిన్స్ విలియమ్, క్యాథరీన్ల తనయుడు. ఇప్పుడు ప్రపంచంలోని క్రేజీయెస్ట్ చిల్డ్రన్స్‌లో జార్జ్ ఒకరు. ఇతడి జననం కూడా ప్రపంచం దృష్టిని బాగా ఆకట్టుకొన్న అంశమే అయ్యింది. క్యాథరీన్ యువరాజుకు జన్మనిచ్చిందనే విషయం తెలియగానే బ్రిటన్ మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. దాదాపు ఏడాది వయసున్న జార్జ్ మీడియాకు ఒక సూపర్ సెలబ్రిటీ. క్రూజ్, రోమియా బ్రిటన్ సాకర్ స్టార్ బెక్‌హమ్‌కు మొత్తం నలుగురు పిల్లలు. ముగ్గురు తనయులు, ఒక తనయ. వీరిలో చిన్న వాళ్లు రోమియో, క్రూజ్‌లు ఇప్పుడు చైల్డ్ సెలబ్రిటీలుగా చెలామణిలో ఉన్నారు. బెక్‌హమ్‌కు ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నా... పిల్లల వల్ల మాత్రం మరింత గుర్తింపు లభిస్తోంది. మొన్నటి సాకర్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ చూడటానికి ఎంతో మంది ప్రసిద్ధ వ్యక్తులు వచ్చినా వీక్షకుల గ్యాలరీలో అర్జెంటీనా జెర్సీలు ధరించి వచ్చిన బెక్‌హమ్ పిల్లలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అదీ వారికున్న క్రేజ్. సూరి క్రూజ్ టామ్ క్రూజ్, కేటీ హోమ్స్ల ఆరేళ్ల దాంపత్య బంధానికి ప్రతిరూపం సూరి. అమ్మనాన్నల గ్లామర్‌ను పుణికిపుచ్చుకున్న సూరి అంటే పాశ్చాత్య ప్రపంచానికి ఎనలేని క్రేజ్. నెలల వయసు నుంచే సూరికి గొప్ప ఫేమ్ వచ్చింది. ఇక కాస్తనడక నేర్చాక టామ్, కేటీల వెంట ఎక్కడైనా సూరి కనిపించిందంటే... ఫోటోగ్రాఫర్లకు పండగే! సూరి పక్కన ఉందంటే... టామ్‌ను, కేటీని పట్టించుకొనే వాళ్లు తక్కువ మంది అవుతారు. ఎందుకంటే అందరి కళ్లూ ఆ పాప మీదే ఉంటాయి. ఆన్లైన్లో సూరి ఫ్యాన్ కమ్యూనిటీలకు కొదవే లేదు! తల్లిదండ్రులకున్న ఫేమ్‌తో తనకున్న ఆకర్షణ శక్తితో ప్రపంచంలోనే అత్యంత క్రేజీయెస్ట్ చైల్డ్‌గా పేరు తెచ్చుకొంది సూరి. -
నా మనుమరాలికి నా జీన్సే వచ్చాయి!
అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్‌లకు ఆరాధ్య పుట్టినప్పట్నుంచీ అమితాబ్‌కి మనవరాలే లోకమైపోయింది. తీరిక సమయంలో ఎక్కువ శాతం ఆరాధ్యతో ఆడుకోవడానికే కేటాయిస్తున్నారు బిగ్ బి. మనవరాలి ముచ్చట్లను అందరితో పంచుకోవడానికి తెగ ఆరాటపడుతున్నారు. తాజాగా బ్లాగ్‌లో ఆయన ఆరాధ్య ముచ్చట్లను పోస్ట్ చేశారు. ‘‘మనుమలు, మునిమనుమలకు ఎక్కువ శాతం తాతల జీన్స్ వస్తాయి. అందుకు ఉదాహరణ నేను, అభిషేకే. నిజానికి మా అమ్మానాన్న అంత ఎత్తు కాదు. కానీ... మా అమ్మగారి నాన్న, మా తాత అయిన సర్దార్ ఖజాన్సింగ్ సూరి ఆరడుగుల ఎత్తు. ఆయన జీన్స్ నాకొచ్చాయి. నా ఎత్తు ఆరు అడుగుల రెండు అంగుళాలు. అలాగే మా అబ్బాయి అభిషేక్ కూడా ఆయన పోలికే. వాడు ఆరు అడుగుల మూడంగుళాలు. చిన్నప్పుడు అభిషేక్.. తన వయసున్న పిల్లలందరి కన్నా పొడుగ్గా ఉండేవాడు. నా కుమార్తె శ్వేతా బచ్చన్ కూడా అంతే. ఇప్పుడు అదే పోలిక ఆరాధ్యకు కూడా వచ్చింది. పాప కూడా తన వయసున్న పిల్లలందరిలోకీ హైట్’’ అని పేర్కొన్నారు అమితాబ్. -
అమ్మ అంత అందంగా...
‘ఆ భగవంతుడు మాకిచ్చిన వరం మా కూతురు ఆరాధ్య’ అని ఓ సందర్భంలో ఐశ్వర్యరాయ్ ఎంతో మురిపెంగా చెప్పారు. ఈ నెల 16న ఆరాధ్య పుట్టినరోజు వేడుకను సన్నిహితుల మధ్య ఘనంగా జరిపారు అభిషేక్, ఐశ్వర్య. పాపకు రెండేళ్లు పూర్తయ్యాయి కాబట్టి.. ఇక నటిగా ఐష్ రీ-ఎంట్రీకి సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఐష్ కూడా ఆ సన్నాహాల్లోనే ఉన్నారట. మరోవైపు ఇటీవల తన తల్లిదండ్రులు వృందారాయ్, కృష్ణరాజ్, సోదరుడు ఆదిత్య, అతని భార్యతో కలిసి కూతుర్ని తీసుకుని ఐష్ దుబాయ్ వెళ్లారట. ‘హ్యాపీ న్యూ ఇయర్’ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్న అభిషేక్‌బచ్చన్ మాత్రం ఈ ట్రిప్‌ని మిస్ అయ్యారు. పుట్టింటివాళ్లతో హాయిగా గడిపి ఐష్ ముంబయ్ వచ్చారు. మామూలుగా ఈ అందాల సుందరి పబ్లిక్‌లోకి వస్తే.. కొన్ని కెమెరాలు ఆమెను వెంటాడతాయి. పైగా, కూతుర్ని తీసుకొని బయటకు వచ్చారంటే, ఈ తల్లీకూతుళ్లను కెమెరాలో బంధించడానికి ఫొటోగ్రాఫర్లు తాపత్రయపడతారు. ఈ క్రమంలో ఇటీవల దుబాయ్ ట్రిప్ ముగించుకుని ఐష్ ముంబయ్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్న సమయంలో కొంతమంది ఫొటోలు తీశారు. ఆ ఫొటోల్లో క్యూట్‌గా ఉన్న రెండేళ్ల ఆరాధ్యని చూస్తే.. అచ్చం అమ్మలా మంచి అందగత్తె అవుతుందని అందరూ అనుకున్నారు. -
ఆరాధ్యకు రెండేళ్లు.. ఘనంగా పుట్టినరోజు వేడుకలు
బాలీవుడ్ బుజ్జాయి ఆరాధ్యకు రెండేళ్లు నిండాయి. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ బచ్చన్ల ముద్దుల కుమార్తె, అమితాబ్ బచ్చన్ మనవరాలు అయిన ఆరాధ్య పుట్టినప్పుడు ప్రపంచవ్యాప్తంగా అదో పెద్ద సంచలనాత్మక వార్త అయ్యింది. ఈనెల 16వతేదీ శనివారం నాడు ఆ బుల్లి ఆరాధ్య రెండో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ రోజు ఆరాధ్యకు అభినందనలు అందించినందుకు, బహుమతులు పంపినందుకు అందరికీ కృతజ్ఞతలు చెబుతూ అభిషేక్ బచ్చన్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాల కుమారుడు.. ఆరాధ్య స్నేహితుడు అయిన వియాన్ రాజ్ కుంద్రాను కూడా ఈ పుట్టిన రోజు వేడుకలకు ఆహ్వానించారు. ''హేపీ బర్త్‌డే ఆరాధ్యా.. నన్ను పిలిచినందుకు థాంక్యూ. చాలా సరదాగా అనిపించింది. నేను మొట్టమొదటి చాక్లెట్ కూడా ఈరోజు తినేశాను. ష్.... అమ్మకు చెప్పద్దు'' అని వియాన్ రాజ్ కుంద్రా అన్నట్లుగా అతడి తరఫున తల్లిదండ్రులు ట్వీట్ చేశారు. ఆరాధ్య తొలిసారిగా కాన్స్ చిత్రోత్సవంలో తన తల్లితో పాటు కలిసి ఈ సంవత్సరం పాల్గొన్న విషయం తెలిసిందే. -
ఐష్ మనసు వెన్న
ముంబై: పుట్టినరోజు వచ్చిందంటే చాలు. ఎక్కువశాతం మంది భారీ పార్టీలు ఏర్పాటుచేసి విలాసంగా గడిపేస్తారు. విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసేస్తారు. అయితే అమితాబ్ బచ్చన్ కోడలు, బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ మాత్రం అలా చేయలేదు. క్యాన్సర్ వ్యాధిపీడితులకు విరాళాలు అందజేసి తనలోని మానవతను చాటుకుంది. తన 40 పుట్టినరోజు ఈ సందర్భంగా ఐశ్వర్యరాయ్ మాట్లాడుతూ ‘నాకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. దీపావళి పండుగ సమయంలోనే నా పుట్టినరోజు రావడం యాదృచ్ఛికం. ఇది వేడుకలు జరుపుకునే సమయం. ఈ జీవితాన్ని ప్రసాదించిన నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. ఈ జీవితంలో నేను ఎన్నో పొందా. ప్రతి ఏడాది ఇదేవిధంగా క్యాన్సర్ వ్యాధిపీడితులకు సహాయమందిస్తున్నా. ఈ ఏడాది కొంత నగదు అందజేశా. ఇకముందు కూడా ఇలాగే చేయాలనుకుంటున్నా. నా తల్లిదండ్రులు నాకు నేర్పింది ఇదే’ అని అంది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య ఈ నెల 1న పుట్టినరోజు జరుపుకుంది ఐశ్వర్యరాయ్. కుమార్తె ఆరాధ్య తనకు పెద్ద వరమని 2007లో సహనటుడు అభిషేక్ బచ్చన్‌ను వివాహమాడిన ఐశ్వర్య ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ‘ఆరాధ్యే నా ప్రపంచం’అని పేర్కొంది.