నా మనుమరాలికి నా జీన్సే వచ్చాయి! | Aaradhya Bachchan Grandfather jeans says amitabh bachchan | Sakshi
Sakshi News home page

నా మనుమరాలికి నా జీన్సే వచ్చాయి!

Published Wed, Oct 29 2014 11:33 PM | Last Updated on Sat, Sep 2 2017 3:34 PM

నా మనుమరాలికి నా జీన్సే వచ్చాయి!

నా మనుమరాలికి నా జీన్సే వచ్చాయి!

 అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్‌లకు ఆరాధ్య పుట్టినప్పట్నుంచీ అమితాబ్‌కి మనవరాలే లోకమైపోయింది. తీరిక సమయంలో ఎక్కువ శాతం ఆరాధ్యతో ఆడుకోవడానికే కేటాయిస్తున్నారు బిగ్ బి. మనవరాలి ముచ్చట్లను అందరితో పంచుకోవడానికి తెగ ఆరాటపడుతున్నారు. తాజాగా బ్లాగ్‌లో ఆయన ఆరాధ్య ముచ్చట్లను పోస్ట్ చేశారు. ‘‘మనుమలు, మునిమనుమలకు ఎక్కువ శాతం తాతల జీన్స్ వస్తాయి. అందుకు ఉదాహరణ నేను, అభిషేకే. నిజానికి మా అమ్మానాన్న అంత ఎత్తు కాదు. కానీ... మా అమ్మగారి నాన్న, మా తాత అయిన సర్దార్ ఖజాన్‌సింగ్ సూరి ఆరడుగుల ఎత్తు.
 
 ఆయన జీన్స్ నాకొచ్చాయి. నా ఎత్తు ఆరు అడుగుల రెండు అంగుళాలు. అలాగే మా అబ్బాయి అభిషేక్ కూడా ఆయన పోలికే. వాడు ఆరు అడుగుల మూడంగుళాలు. చిన్నప్పుడు అభిషేక్.. తన వయసున్న పిల్లలందరి కన్నా పొడుగ్గా ఉండేవాడు. నా కుమార్తె శ్వేతా బచ్చన్ కూడా అంతే. ఇప్పుడు అదే పోలిక ఆరాధ్యకు కూడా వచ్చింది. పాప కూడా తన వయసున్న పిల్లలందరిలోకీ హైట్’’ అని పేర్కొన్నారు అమితాబ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement