Jeans
-
వన్ లెగ్డ్ జీన్స్..! ఇదేం ఫ్యాషన్ ట్రెండ్..
ఫ్యాషన్ ట్రెండ్ అనేది నిరంతరం మారుతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడూ లేటెస్ట్ ట్రెండ్ వచ్చేస్తుంటుంది. అయితే కొన్ని ఫ్యాషన్ డిజైన్లు చూస్తే అబ్బా ఇదేం ఫ్యాషన్ అని నెటజన్లు మండిపడేలా ఉంటాయి. అసలు వాటిని ఎలా ధరిస్తారురా బాబు అనే ఫీలింగ్ వచ్చేస్తుంటుంది కూడా. అయితే వాటి ధర చూస్తే అంత పలుకుతుందా అని నెటిజన్లు షాక్ అయ్యేలా ఉంటాయి. అలాంటి ఫ్యాషన్ ట్రెండ్ ప్రస్తుతం నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. ఇదేం పిచ్చి ఫ్యాషన్ అని తిట్టుకుంటున్నారు నెటిజన్లు. నిజంగా ఇది స్టైలిష్ ఫ్యాషనా..? లేక తెలియక ఏదో అలా డిజైన్ చేశారా..? అని నెట్టింట చర్చించుకుంటున్నారు. ఫ్రెంచ్ లగ్జరీ లేబుల్ కోపర్ని కలెక్షన్‌కి సంబంధించిన డిజైనర్‌వేర్ వన్ లెగ్డ్ జీన్స్ గురించి ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ క్రిస్టీ సారా వీడియో రూపంలో తన అభిప్రాయాన్నిషేర్ చేసింది. దీంతో ఈ డిజైనర్‌వేర్ నెట్టింట హాట్‌టాపిక్ మారింది ఇది. ఆ వీడియోలో ఆమె భర్త సడెన్‌గా ఎంటర్ అయ్యి ప్రస్తుతం దీన్ని ఎవ్వరూ ధరించడం లేదని అన్నారు. అయితే సారా మాత్రం ఈ డిజైన్ నచ్చింది కానీ కాస్త పెద్ద సైజు కావాలన్నారు. అయితే దీని ధర మాత్రం రూ. 38 వేలు పైనే పలుకుతోందని తెలిపింది.తక్కువలో దొరికితే ఇలాంటి డిజైన్లు ట్రై చేయగలమని తన అభిప్రాయాన్ని పంచుకుంది. కానీ నెటిజన్లు మూవీలో ఫన్ కోసం నటులు వేసుకున్నారనుకున్నాం. ఇది కూడా ఓ ఫ్యాషన్‌నే అంటూ మండిపడ్డారు. అసలు ఎలా ధరించి బయటకు రాగలరు. ఏ ఫ్యాషన్ అయినా చూసేవాళ్లకు, మనకు కూడా కంఫర్ట్ ఉండాలి కదా అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Kristy Sarah Scott (@kristy.sarah) (చదవండి: సమ్మర్లో స్లిమ్‌గా మారడం ఈజీ..! ఎలాగంటే..) -
పొట్టిగా ఉండే అమ్మాయిలు స్కర్ట్స్ వేసుకోవద్దా? ఇవిగో ట్రిక్స్ అండ్ టిప్స్
వినాయక చవితి, దసరా, బతుకమ్మ సంబరాలు ముగిసాయి. ఇక దీపావళి సందడి షురూ కానుంది. ఏ పండగఅయినా భక్తి, ముక్తితోపాటు కొత్తబట్టలు, అందంగా ముస్తాబు కావడం ఈ హడావిడి ఉండనే ఉంటుంది. ముఖ్యంగా వెలుగుల పండుగ దీపావళికి ఆరడుగల అందగాళ్లు, చందమామ లాంటి ముద్దుగుమ్మలు ట్రెండీగా, ఫ్యాషన్‌గా మెరిసిపోవాలని ఆరాటపడతారు. ఆరడుగులు అంటే గుర్తొచ్చింది.. పొట్టిగా ఉన్నామని..లావుగా ఉన్నామని తమకు ఏ డ్రెస్ సూట్ కాదు అని చాలామంది అమ్మాయిలు దిగులు పడుతూ ఉంటారు. పొట్టిగా ఉండటం మన తప్పు కాదు. కానీ మన శరీరారినిక తగ్గట్టు దుస్తులను ఎంచుకుంటే స్పెషల్ బ్యూటీగా మెరిసిపోవడం ఖాయం. అదెలాగో చూసేద్దామా! ఫ్యాషన్ ట్రిక్స్పొడవుగా మారడానికి మ్యాజిక్ సొల్యూషన్ ఏమీ లేదు, కానీ పొడుగ్గా కనిపించేలా కొన్ని ఫ్యాషన్ ట్రిక్స్ ఉన్నాయి. ఫ్యాషన్‌కి స్లైల్కి ఖచ్చితమైన నియమాలేవీ లేవు. శరీర రంగును బట్టి, బాడీకి తగ్గట్టుగా కలర్‌ను ఎంచుకుంటే చాలు. చక్కని ఫిట్టింగ్, డ్రెస్సింగ్ స్టైల్లో ఒక చిన్న మార్పు ఎలిగెంట్ లుక్‌ను ఇస్తుంది.జీన్స్, టీషర్ట్ ఎలాంటి వారికైనా ఇట్టే నప్పుతాయి. మ్యాచింగ్ కలర్స్ చాలా ముఖ్యం. మాక్సీ స్కర్ట్స్ లేదా డ్రెస్‌లు పొడవాటి అమ్మాయిలకు మాత్రమే బాగుంటాయి అనే అపోహను నమ్మవద్దు. మల్టిపుల్ లేయర్డ్ స్కర్ట్స్ కాకుండా మంచి కట్ స్కర్టులు ఎంచుకోండి. పొడవు స్కర్ అయితే టక్-ఇన్ టీ-షర్టుతో, కట్ జాకెట్‌తో ,హై హీల్డ్ షూ వేసుకుంటే లుక్ అదిరిపోతుంది.నిలువుగీతలు ఉన్న డ్రెస్‌లు పొడవుగా కనిపించేలా చేస్తాయి.కుర్తా లేదా చీర ధరించినపుడు సౌకర్యవంతమైన హైహీల్స్ వాడండి. అంతేకాదు డ్రెస్‌కు తగ్గట్టు , స్టైలింగ్ టిప్స్ పాటించాలి. ఉదాహరణకు క్లచ్‌లు, క్రాస్ బాడీ పర్సులు , చిన్న బ్యాగ్‌లు బెస్ట్ ఆప్షన్. మరీ పెద్దబ్యాగుల జోలికి అస్సలు వెళ్లవద్దుకుర్తీలకు, లేదా చీరల బ్లౌజ్లకు హైనెక్, రౌండ్ నెక్ కాకుండా, వీ నెక్, డీప్ నెక్, డీప్ రౌండ్ నెక్ లాంటివి ఎంచుకోండి. వర్టికల్ అప్పీల్‌కోసం ప్లంగింగ్ v-నెక్లైన్ టాప్‌లను ధరించండి. దీంతో పొడవుగా కనిపించడమే కాదు, సన్నగా కూడా కనిపిస్తారు.చిన్న ప్రింట్లు, సింపుల్ ఎంబ్రాయిడరీ ఔట్ ఫిట్ చూడడానికి బావుంటాయి. భారీ ఎంబ్రాయిడరీ, చీర పెద్ద పెద్ద అంచులున్న చీరలు అన్ని అకేషన్స్‌కు నప్పవు.ఎథ్నిక్ వేర్ కోసం పొడవాటి జాకెట్ స్టైల్ లెహెంగా లేదా సల్వార్ సూట్లకు దూరంగా ఉండండి. ఇదీ చదవండి : ఉద్యోగులకు దీపావళి కానుకగా ఏకంగా బెంజ్‌కార్లు, అంతేనా?! -
ఆ దేశంలో జీన్స్ బ్యాన్..పొరపాటున ధరిస్తే అంతే సంగతులు..!
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నియంతృత్వ పాలన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాలన ప్రజా రంజకంగా కంటే ప్రతి చిన్న విషయంపైనా ఆంక్షలు విధిస్తూ నిరంకుశత్వ ధోరణితో పాలన సాగిస్తాడు కిమ్. అక్కడ ప్రజల జీవిన విధానం దగ్గర నుంచి ధరించే దుస్తులపై కూడా ఆంక్షలు ఉంటాయి. 'స్వేచ్ఛ' అన్న పదానికి సంకేళ్లు వేసేలా ఉంటుంది అక్కడ ప్రజల జీవన విధానం. విచిత్రమేమిటంటే దీన్ని తమ జాతీయతను గౌరవించడమని సగర్వంగా చెప్పుకుంటుంది ఉత్తర కొరియా. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే..జీన్స్ అంటే ఎంత క్రేజ్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశ విదేశాల్లో యువత ఎంతో ఇష్టంగా ఫ్యాషన్ ట్రెండ్‌గా ధరిస్తుంది. అలాంటి జీన్స్‌ని ఉత్తర కొరియా బ్యాన్ చేయడమే గాక ధరించటాన్నే నేరంగా, ముప్పుగా చూస్తుంది. ఇలా ఎందుకంటే..!ఉత్తరకొరియ జీన్స్‌ని ఎందుకు బ్యాన్ చేసిందంటే..రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 20వ శతాబ్దంలో కొరియా రెండు వేర్వేరు దేశాలుగా విడిపోయింది. దక్షిణ, ఉత్తర కొరియాలుగా విడిపోయింది. ప్రతి దేశం అమెరికాతో ప్రభావితమవుతుంది. అది ఆహార్యం, విద్య, ఫుడ్, టెక్నాలజీ పరంగా ప్రతి ఒక్క అంశంలోనూ ఆ దేశం ప్రభావం ఉంటుంది. అయితే అందుకు విరుద్ధం ఉత్తరకొరియా ఉంటుంది. ఇక్కడ దక్షిణ కొరియా అమెరికాకి మిత్ర దేశంగా ఉంటే..ఉత్తర కొరియా మాత్రం అమెరికాకి పూర్తి వ్యతిరేకి. అంతేగాదు ఆ దేశానికి సాన్నిహిత్యంగా ఉన్న ప్రతిదీ కూడా తనకి వ్యతిరేకం అన్నంతగా ఆ దేశాన్ని వ్యతిరేకిస్తుంది ఉత్తర కొరియా. అందులో భాగంగానే పాశ్చాత్య సంస్కృతి ప్రభావం తన దేశంపై పడటాన్ని అస్సలు ఇష్టపడదు ఉత్తర కొరియా. అందులోని జీన్స్ అమెరికాకి సంబంధించిన ఫ్యాషన్ శైలి. ఇది ఉత్తర కొరియా దృష్టిలో ఫ్యాంటు కాదు పాశ్చాత్య వ్యక్తిత్వం, స్వేచ్ఛ, తిరుగుబాటుకి చిహ్నంగా పరిగణిస్తుంది. అందువల్లే ఉత్తర కొరియా దేశ సంస్కృతికి అనుగుణంగా, క్రమశిక్షణ విధేయతకు పెద్ద పీఠవేసేలా ఆహార్యం ఉండాలని నొక్కి చెబుతుంది. ఈ జీన్స్ అనేది జస్ట్ ఫ్యాషన్ కాదు అంతకు మించి తీవ్రమైన ముప్పుగా పరిణిస్తుంది. అందువల్లే ఉద్యోగాలు, ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలోనూ ఎక్కడ కూడా ప్రజలు జీన్స్ ధరించకూడదు. తమ దేశ సంప్రదాయానికి అనుగుణంగానే ఉండాలి. ఇది పాలనకు అత్యంత ముఖ్యమని ఉత్తర కొరియా విశ్వసించడం విశేషం. అంతేగాదు దీన్ని ఆ దేశం స్వచ్ఛమైన సామ్యవాదానికి అనుగుణంగా ఉండేలా చేయడమని విశ్వసిస్తోంది. ఈ జీన్స్‌ని తిరగుబాటుకు, ధిక్కారానికి చిహ్నంగా పేర్కొంటుంది. అందువల్లే తమ ప్రజలు ఈ నియమాన్ని ఉల్లంఘించకుండా ఉండేలా దుస్తుల కోడ్‌ని అమలు చేయడమే గాక వీధుల్లో అందుకోసం పోలీసుల చేత పెట్రోలింగ్ నిర్వహిస్తోంది కూడా. ఒకవేళ ఎవ్వరైన జీన్స్ ధరించి కనబడితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనవల్సి ఉంటుంది. ముఖ్యంగా జరిమానా, బహిరంగ అవమానం లేదా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అక్కడ అధ్యక్షుడు కిమ్ తన పాలనపై పట్టు కోసం ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన చిన్న చిన్న విషయాలపై కూడా ఆంక్షలు వేస్తూ నియంతలా పాలన చేస్తుంటాడని స్థానిక మీడియా పలు కథనాల్లో పేర్కొంది కూడా. (చదవండి: స్పేస్‌లో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్..అన్ని రోజులు ఉండిపోతే వచ్చే అనారోగ్య సమస్యలు?) -
టీషర్ట్స్, చిరిగిన జీన్స్‌తో రావొద్దు.. విద్యార్థులకు కళాశాల ఆదేశాలు
ముంబై: ఇటీవల కళాశాల క్యాంపస్ ఆవరణలో హిజాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ నిలిచిన ముంబైలోని ఓకళాశాల తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు కళాశాలకు టీషర్ట్స్, చిరిగిన జీన్స్‌తో రావడాన్ని నిషేధించింది. కొత్త డ్రెస్ కోడ్‌ను విధించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.టీవలే కళాశాలలో విద్యార్థులు హిజాబ్ ధరించడాన్ని నిషేధించిన చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషనల్ సొసైటీ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. కళాశాలకు వచ్చే విద్యార్థులు సాంస్కృతిక అసమానతల్ని సూచించే దుస్తులతో రావొద్దని ఆదేశించింది. ముంబైలో ఈ సొసైటీ నిర్వహిస్తోన్న ఎన్జీ ఆచార్య , డీకే మరాఠే కళాశాలల్లో చిరిగిన జీన్స్, టీషర్టులు, జెర్సీలతో వస్తే విద్యార్థులను అనుమతించబోమని స్పష్టం చేసింది. విద్యార్థులు తప్పనిసరిగా ఫార్మల్, డీసెంట్ దుస్తుల్లో మాత్రమే కళాశాలకు రావాలని ఆదేశించింది.‘విద్యార్థులు క్యాంపస్‌లో ఉన్నప్పుడు ఫార్మల్, డీసెంట్ దుస్తులు ధరించాలి. వారు హాఫ్ షర్ట్ లేదా ఫుల్ షర్ట్ , ప్యాంటు ధరించవచ్చు. అమ్మాయిలు భారతీయ లేదా పాశ్చాత్య దుస్తులను ధరించవచ్చు. విద్యార్థులు మతాన్ని లేదా సాంస్కృతిక అసమానతలను చూపించే ఎలాంటి దుస్తులూ ధరించకూడదు. జీన్స్, టీషర్టులు, రివీలింగ్ డ్రెస్సులు, జెర్సీలు ధరించి వస్తే అనుమతించబోము’ అని నోటీసుల్లో పేర్కొంది. ఈ నోటీసును కళాశాల గేటుకు అంటించింది.అయితే ఈ నిబంధనలపై పలువురు విద్యార్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త డ్రెస్ కోడ్ గురించి తమకు తెలియదని, జీన్స్, టీ షర్టులు ధరించి ఉండడంతో కాలేజీలోకి రానివ్వడం లేదని కొందరు విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు..కాగా ఇదే కళాశాల గతంలో తమ ప్రాంగణంలో హిజాబ్, నఖాబ్, బుర్కా, స్టోల్స్, క్యాప్‌లు, బ్యాడ్జీలపై నిషేధం విధించింది, దీనిపై విద్యార్థులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అయితే కాలేజీ తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకునే ప్రసక్తే లేదని న్యాయమూర్తులు ఎఎస్ చందూర్కర్, రాజేష్ పాటిల్‌లతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది. -
పాత జీన్స్ ప్యాంటులతో స్లీపింగ్ బ్యాగ్‌లు..ఒక్కో జీన్స్‌కి ఏకంగా..!
మన ఉపయోగించే బట్టల వల్ల కాలుష్యం ఏర్పడుతుందని తెలుసా..!. ఏటా వేల బట్టలు చెత్త కుప్పలుగా దర్శనమిస్తున్నాయి. వాటిని కాల్చడం వల్ల మరింత కాలుష్యం ఏర్పడుతుంది. అవి మట్టిలో కలిసిపోయేందుకు చాలా టైం పడుతుంది. ఈ సమస్య పరిష్కారం కోసం పర్యావరణవేత్తలు పలు మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు కూడా. ముఖ్యంగా జీన్స్ లాంటి దుస్తులు అంతతేలిగ్గా మట్టిలో కలిసిపోవు. పైగా దీని తయారీ కోసం ఎన్ని నీళ్లు ఖర్చుఅవుతాయో వింటే షాకవ్వుతారు. అలాంటి పాత జీన్స్ రీసైకిల్ చేసి ఉపయోగపడేలా చక్కగా రూపాందిస్తున్నాడు 16 ఏళ్ల యువకుడు. అంతేగాదు పర్యావరణ సంరక్షణలో తన వంతు పాత్ర పోషిస్తూ అందిరిచేత శెభాష్ అని ప్రశంలందుకుంటున్నాడు. అతనెవరంటే..ఢిల్లీకి చెందిన 16 ఏళ్ల నిర్వాన్ సోమనీ మన ఇంట్లో ఉండే దుస్తులు, వాటికి ఉపయోగించే రంగులు వల్ల ఎంత కాలుష్యం ఏర్పడతుందో తెలుసుకున్నాడు. అదీగాక ఏటా ఈ దుస్తులు వ్యర్థాలు ఎంతలా కుప్పలుగా పేరుకుపోతున్నాయో గమనించాడు. పర్యావరణ సమస్యకు చక్కటి పరిష్కారం చూపించ్చేలా ఏదైనా చేయాలనుకున్నాడు. అలా అతడి దృష్టి జీన్స్ దుస్తులపై పడింది. అప్పుడే.. ఒక్కో జీన్స్ తయారీకి ఏకంగా పదివేల లీటర్లు అవుతుందని, తెలుసుకుని షాక్ అవ్వుతాడు. ఐదు జతల జీన్స్‌కి ఏకంగా 50 వేల లీటర్ల అవుతాయా అని విస్తుపోయాడు. అంత నీటిని ఖర్చు చేస్తున్న ఈ జీన్స్‌లు సౌకర్యవంతంగా వినియోగించేలా రీ సైకిల్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ క్రమంలోనే ప్రాజెక్ట్ జీన్స్ పేరుతో స్లీపింగ్ బ్యాగ్‌లు తయారు చేయడం ప్రారంభించాడు. కొన్ని కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులు సహాయంతో నిర్వాణ్ వేల జతలు జీన్స్‌లు సేకరించాడు నిర్వాన్. వాటితో దాదాపు 900 స్లీపింగ్ బ్యాగ్‌లను రూపొందించాడు. అవి ఎవరికీ ఇస్తారంటే..ఢిల్లీలో చలికాలంలో రోడ్లపై నిద్రించే నిరాశ్రయులకు స్లిపింగ్ బ్యాగ్‌లు అందిస్తున్నాడు నిర్వాన్. సాధారణంగా మనం వారికి దుప్పట్లు ఇస్తుంటాం. అయితే అది పరిష్కారం కాదు. అవి కొంతకాలం తర్వాత చిరిగిపోతాయి. నిద్రపోయేలా పరుచుకుని పడుకోవడం కుదరదు కూడా. దీంతో ఈవిషయమై లోతుగా ఆలోచించి మరీ ఇలా స్లీపింగ్ బ్యాగ్‌లు రూపొందించాడు. అవి బెడ్ మాదిరిగా ఉండి..దాని లోపల పడుకోవచ్చు. ఎలా అంటే.. పడుకునే బెడ్ కమ్ దుప్పటిగా ఉంటుంది. ఇది వారికి సౌకర్యవంతంగా, ఎక్కువకాలం మన్నికగా ఉంటుంది. మిగతా దుస్తులు కంటే జీన్స్ చాలా దృఢంగా ఉంటుంది. అంత ఈజీగా చీరగదు కాబట్టి నిరాశ్రయులకు, అభాగ్యులకు ఇది బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నాడు నిర్వాన్. తనకు ఈ ఆలోచన రావడానికి కారణం వాళ్లమ్మ దుస్తుల దుకాణమేనని చెబుతున్నాడు. అక్కడ చాలా మెటీరియల్‌లు కుట్టగా చాలా దుస్తుల వేస్టేజ్ వస్తుంది. వాటిలో కొంత మేర ఏదో రకంగా ఉపయోగిస్తాం. మిగతా చాలా వరకు వేస్ట్ అయ్యేది. దాన్ని ఉపయోగిస్తూ ఏదైనా చేయగలనా అనుకున్నాను అలా ఈ స్లీపింగ్ బ్యాగ్‌లు తయారు చేసినట్లు వివరించాడు. గతేడాది టర్కీలో భూకంపం వచ్చి నిరాశ్రయులుగా మారిన ప్రజల కోసం దాదాపు 400 స్లీపింగ్ బ్యాగ్‌లను అందజేశాడు నిర్వాన్. మన అలమార్లో వృధాగా పడి ఉన్న జీన్స్‌ని అతడి కంపెనీకి అందజేస్తే మన వంతుగా పర్యావరణ సంరక్షణలో బాధ్యత తీసుకున్నట్లే అవుతుంది. ఈ పర్యావరణ కోసం అందరూ ఇలాంటి పలు కార్యక్రమాలు చేసి మన పుడమతల్లిని కాలుష్యం కోరల నుంచి కాపాడుకుందాం!.(చదవండి: ఆరు తరాలు, 185 మంది సభ్యులు..ఇప్పటికి ఒకే ఇంటిలో..) -
జీన్స్, టీషర్ట్స్ వేసుకు రావొద్దు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ అధికారులు, వారి పరిధిలో పనిచేసే సిబ్బంది ఇక నుంచి జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు ధరించి విధులకు హాజరు కావొద్దంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ తరహా వస్త్రధారణ సంస్థ గౌరవానికి భంగం కలిగించేలా ఉందంటూ సంస్థ ఎండీ సజ్జనార్ అభిప్రాయపడ్డారు. ఇక నుంచి విధుల్లో ఆ తరహా వస్త్రధారణ కూడదంటూ ఆదేశాలు జారీ చేశారు.డ్రైవర్లు, కండక్టర్లకు ’ఖాకీ’.. మిగిలిన వాళ్లు ఇష్టమొచ్చినట్టుగా!ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు ఖాకీ డ్రెస్‌లో కనిపిస్తారు.. బస్టాపులు, బస్టాండ్లలో ఉండే సూపర్వైజర్లు తెల్లరంగు దుస్తుల్లో ఉంటారు.. కానీ, డిపోలు, ఇతర ఆర్టీసీ కార్యాలయాల్లో ఉండే అధికారులకు యూనిఫాం అంటూ లేదు. డ్రెస్ కోడ్ కూడా లేకపోవటంతో ఇంతకాలం క్యాజువల్ వస్త్రధారణ తో విధులకు హాజరవుతున్నారు. దీన్ని పెద్దగా పట్టించుకునేవారు లేకపోవటంతో, రంగురంగుల డ్రెస్సులు, జీన్స్ ప్యాంట్లు, టీ షర్డులు ధరించి వస్తున్నారు.కొందరు ఉన్నతాధికారులు కూడా ఈ తరహా వస్త్రధారణతో విధుల్లో కనిపిస్తున్నారు. తాజాగా దీన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తీవ్రంగా పరిగణించారు. ఇటీవల ఆయన తరచూ అధికారులతో గూగుల్ సమావేశాలు నిర్వహిస్తు న్నారు. కొన్ని సందర్భాల్లో డిపో స్థాయి సిబ్బందితో కూడా ఆన్లైన్ సమావేశాల్లో ముచ్చటిస్తున్నారు. చాలా సందర్భాల్లో ఉన్నతాధికారులు మొదలు డిపో స్థాయి సిబ్బంది వరకు జీన్స్ ప్యాంట్లు, టీ షర్టుల్లో కనిపిస్తున్నారు. ఇది ఆయనకు చికాకు తెప్పించింది.ఫార్మల్ డ్రెస్సుల్లోనే రావాలని ఆదేశాలుదేశంలోనే పేరున్న రవాణా సంస్థలో ఇలా ఇష్టం వచ్చిన వస్త్రధారణతో అధికారులు, సిబ్బంది విధుల్లో పాల్గొనటాన్ని ఆయన తప్పుపట్టారు. ఇదే విషయాన్ని ఆయన ఈడీ ‘అడ్మిన్) దృష్టికి తీసుకెళ్లారు. ఈమేరకు తాజాగా ఈడీ (అడ్మిన్) లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేశారు. సంస్థకు ఉన్న పేరు, డిపో కార్యాలయాల గౌరవానికి వారి డ్రెస్సింగ్ భంగంగా ఉందంటూ ఆయన అందులో అభిప్రాయపడ్డారు. ఇక నుంచి గౌరవప్రదంగా ఉండే ఫార్మల్ డ్రెస్సుల్లోనే అధికారులు విధుల్లో కనిపించాలని తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఆయా అధికారుల పరిధిలో పనిచేస్తున్న సిబ్బందికి కూడా ఇది వర్తిస్తుందని అందులో పేర్కొన్నారు.యూనిఫాంలో కనిపించని స్పష్టతఆర్టీసీ బస్సు డ్రైవర్లు, కండక్టర్లు ఖాకీ యూనిఫాంలో కనిపిస్తారు. కొన్ని బస్సుల్లో నీలి రంగు యూనిఫాం ఉంటోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విషయంలో దృష్టి సారించింది. ఆర్టీసీలో అతిపెద్ద సమ్మె విరమణ తర్వాత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంలో సిబ్బంది యూనిఫాంపై ప్రస్తావించారు. మహిళా కండక్టర్లకు యాప్రాన్ అందజేస్తామని చెప్పి.. ఆ యాప్రాన్ ఏ రంగులో ఉండాలో నిర్ధారించేందుకు ఓ కమిటీ వేశారు.రెండు మూడు సమావేశాలు నిర్వహించిన తర్వాత, మెరూన్ రంగులో ఉండే యాప్రాన్‌ను సిఫారసు చేశారు. ఆ మేరకు ఓ ప్రముఖ కంపెనీకి వస్త్రం కొనుగోలు ఆర్డర్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆ యాప్రాన్ కూడా కనిపించటం లేదు. డ్రైవర్లు, కండక్టర్లకు యూనిఫాం కూడా కొన్నేళ్లపాటు సరఫరా కాలేదు. వారికి ఖాకీ బదులు మరో రంగు ఇవ్వాలన్న అంశం కూడా తెరమరుగైంది. -
T Shirts And Jeans Ban: విద్యాశాఖ సంచలన నిర్ణయం.. ఇకపై జీన్స్, టీషర్ట్లు బ్యాన్!
పాట్నా: బీహార్ విద్యాశాఖ జీన్స్, టీషర్ట్ పై నిషేధాన్ని విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, ఇతర సిబ్బంది జీన్స్, టీషర్ట్ ధరించటంపై నిషేధాన్ని విధించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. వివరాల ప్రకారం.. విద్యాశాఖ కార్యాలయాల్లో పని చేసే సిబ్బంది జీన్స్, టీషర్ట్ వంటి క్యాజుబల్స్ ధరించి రాకూడదని ఆదేశించింది. ‘ఉద్యోగులు ఇష్టం వచ్చినట్లుగా దుస్తులు ధరించి ఆఫీసుకు వస్తున్నారు.ఇటువంటి దుస్తులు ధరించి రావటంవల్ల కార్యాలయాల సంస్కృతి దెబ్బతింటోందని’ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపింది. ఇలాంటి దుస్తులు ధరించడం పనిచేసే సంస్కృతికి విరుద్ధమని తెలిపారు. కాబట్టి అధికారులు, ఉద్యోగులందరూ విద్యా శాఖ కార్యాలయాలకు అధికారిక దుస్తులలో మాత్రమే రావాలి. విద్యా శాఖ కార్యాలయాల్లో ఫ్యాషన్ ట్రెండీ వంటి దుస్తులు, ముఖ్యంగా జీన్స్, టీ-షర్టులు బ్యాన్ చేస్తున్నట్లు తెలిపింది. ముఖ్యంగా, సరన్ జిల్లా జిల్లా మేజిస్ట్రేట్ ఏప్రిల్‌లో ప్రభుత్వ ఉద్యోగులందరూ ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ ఆదేశాలను తప్పక పాటించాలని కోరింది. ఫార్మల్ డ్రెస్‌లు ధరించాలని, గుర్తింపు కార్డులు తీసుకెళ్లాలని పేర్కొంది. కాగా బీహార్ ప్రభుత్వం, 2019లో, రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగుల ర్యాంక్‌లతో సంబంధం లేకుండా జీన్స్, టీ-షర్టులు ధరించడాన్ని నిషేధించిన సంగతి తెలిసిందే. లైట్ కలర్ లో ఉన్న దుస్తులను మాత్రమే ధరించాలని ఉద్యోగులను ఆదేశించింది. చదవండి: అక్కడకు రాగానే రైళ్లలో లైట్లు బంద్.. విచిత్రమో, విడ్డూరమో కాదు! -
ఆ ఒక్కపని చేస్తే చాలు.. జీన్స్ ఉతకనవసరం లేదు!
దుస్తులు మన జీవితంలో ప్రధానభాగం. రోజువారీ జీవితంలో వీటి పాత్ర ఎంతో కీలకం. అయితే పురుషులకు, మహిళలకు వేర్వేరు రకాల దుస్తులు ఉంటాయనే సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ రోజుల్లో అటు పురుషులు, ఇటు మహిళలు జీన్స్ ధరిస్తున్నారు. రఫ్ అండ్ టఫ్‌గా ఉపయోగించేందుకు అనుకూలంగా ఉన్నందునే జీన్స్‌పై అందరూ మోజు పెంచుకుంటున్నారు. ట్రావెలింగ్ మొదలుకొని రోజువారీ ఆఫీసు వినియోగానికి సైతం అందరూ జీన్స్ వినియోగిస్తున్నారు. జీన్స్ ధారణ మనిషికి మంచి లుక్‌నిస్తుంది. కొందరు జీన్స్‌ను తరచూ ఉతుకుతుంటారు. అయితే ఇది సరైన విధానం కాదని నిపుణుల చెబుతుంటారు. జీన్స్‌ను జాగ్రత్తగా కాపాడుకునేందుకు దానిని ఫ్రిజ్‌లో ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. జీన్స్‌ను ఫ్రిజ్‌లో ఉంచడం వలన ఏమి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. జీన్స్‌ను తరచూ ఉతకడం వలన ఆ దుస్తులకు హాని కలుగుతుంది. ప్రపంచానికి తొలిసారి జీన్స్ పరిచయం చేసిన ప్రముఖ కంపెనీ లెవీస్ వెబ్సైట్లో తెలిపిన వివరాల ప్రకారం జీన్స్‌ను ఎప్పుడూ ఉతకకూడదు. చాలా అవసరమైతే తప్పు దానిని ఉతకవద్దు అని పేర్కొన్నారు. అయితే జీన్స్‌ను ఉతకకుండా దానిని శుభ్రపచడం ఎలా అనే సందేహం మనలో తలెత్తుతుంది. జీన్స్‌ను ఉతికితే ఆ దుస్తుల మెటీరియల్ పాడయిపోతుంది. అలాగే జీన్స్‌ను ఉతకడం వలన నీరు కూడా వృథా అవుతుంది. లెవీస్ సీఈఓ చిప్బర్గ్ తెలిపిన వివరాల ప్రకారం నూతన జీన్స్‌ను కనీసం 6 నెలల తరువాతనే వాష్ చెయ్యాలి. అయితే జీన్స్‌ను.. దానికి అతుక్కునే బ్యాక్టీరియా నుంచి కాపాడేందుకు దానిని రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచాలి. ఉదయాన్నే ఫ్రిజ్‌లో నుంచి జీన్స్‌ను బయటకు తీసి, ఎండలో లేదా స్వచ్ఛమైన వాతావరణంలో ఉంచాలి. ఫలితంగా అది బ్యాక్టీరియా రహితంగా మారుతుంది. అప్పుడు దానిని తిరిగి ధరించవచ్చని నిపుణులు చెబుతున్నారు. -
18 ఏళ్లుగా జీన్స్ ప్యాంట్లను ఉతకని మహిళ.. ఒక్క మరక కూడా లేదట..!
లండన్: జీన్స్ ధరించే వారు ఒకట్రెండు సార్లు వేసుకున్న తర్వాత కచ్చితంగా వాటిని వాష్ చేస్తారు. కానీ ఓ మహిళ మాత్రం 18 ఏళ్లుగా తన రెండు జీన్స్ ప్యాంట్లను ఉతకలేదట. ఆపై అవి ఇంకా కొత్త వాటిలాగే ఉన్నాయని చెబుతోంది. కొన్నప్పుడు ఎలా ఉన్నాయో, ఇప్పుడు అలాగే ఉన్నాయంటోంది. దీంతో సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చ మొదలైంది. ఇంగ్లాండ్ యార్క్‌షైర్‌కు చెందిన ఈ మహిళ పేరు సాండ్రా విల్లిస్. 18 ఏళ్ల క్రితం ఓ జత ఎంఎస్ డెనిమ్ జీన్స్ ప్యాంట్లను కొనుగులు చేసింది. అయితే ఏడాదికి ఒక్కసారి మాత్రమే వాటిని ధరిస్తోందట. వాటిపై ఒక్క మరక కూడా లేకపోవడంతో వాష్ చేయాలనిపించడం లేదట. ఈమె సెంటు బాగా వాడటంతో జీన్స్ కూడా చెమట వాసన రావడం లేదట. ఇక ఎందుకు ఉతకడం అనుకుని వాటిని అలాగే ఉంచుతోంది. దీంతో ఆ జీన్స్ ప్యాంట్లు చెక్కు చెదరకుండా అలాగే కొత్తగా ఉన్నాయని చెబుతోంది సాండ్రా. ఇంకో రెండేళ్లు కూడా వాటిని ఉతకనంటోంది. 20 ఏళ్లు జీన్స్ ఉతకకుండా రికార్డు సృష్టించాలనుకుంటోంది. ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. జీన్స్ ప్యాంట్‌ను ఉతక్కుండా 20 సార్లు వేసుకుంటారా? నేనైతే ఒకట్రెండు సార్లు ధరిస్తే వెంటనే వాష్ చేస్తా.. అని పలువురు నెటిజన్లు అంటున్నారు. అసలు మీరు జీన్స్‌ను ఎందుకు ఉతకడం లేదు? అని మరో యూజర్ ప్రశ్నించాడు. దీనికి సాండ్రా బదులిస్తూ.. తాను జీన్స్‌ను ఉతకకపోయినప్పటికీ వాటిని శుభ్రంగా తూడుస్తానని చెప్పారు. అందుకే అవి కొత్తగా ఉన్నాయని పేర్కొన్నారు. నిజంగా వాటిని ఉతకాలని అన్పించినప్పుడు వాష్ చేస్తానని చెప్పుకొచ్చారు. అంతే కాదు తన వద్ద చాలా జతల జీన్స్ ఉన్నాయని, అందుకే వీటిని ఏడాదికి ఒక్కసారే ధరించినట్లు వివరించారు. వాటిపై ఏమైనా మరకలు పడితే అప్పుడు కచ్చితంగా వెంటనే వాష్ చేస్తానన్నారు. ఇప్పుడు మాత్రం అవి చాలా కొత్తగానే ఉన్నాయన్నారు. చదవండి: వణికిపోతున్న ప్రజలు.. పొంచిఉన్న ముప్పు.. ఒకవేళ అదే జరిగితే పరిస్థితేంటి? -
సముద్ర జలాల్లో ‘జీన్స్’ కాలుష్యం.. కేవలం ఏడుసార్లు వాడి పడేస్తున్నారు
ఫ్యాషన్ ప్రపంచంలో ‘జీన్స్’కు ఉన్న క్రేజే వేరు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వీటిని ధరించడానికి ఎంతో ఇష్టపడతారు. అబ్బాయిలు, అమ్మాయిలు అయితే సరేసరి. పాశ్చాత్య దేశాల్లో వీటి హవా అంతాఇంతా కాదు. ఈ కారణంగానే ఏటా ప్రపంచవ్యాప్తంగా రెండు బిలియన్ల కంటే ఎక్కువ జతల జీన్స్ అమ్ముడవుతున్నాయి. ప్రతి సెకనుకు 73 యూనిట్ల విక్రయాలు జరుగుతున్నాయంటే మాటలు కాదు. మార్కెట్లో కొత్త పోకడలు, చౌక ధరల కారణంగా వీటి వినియోగం ఇంత ఎక్కువగా ఉంటోంది. అయితే, ప్రజల మనసులను దోచుకోవడంలోనే కాదు.. వాతావరణ కాలుష్యంలోనూ జీన్స్ పరిశ్రమ తీసిపోవడంలేదు. సాక్షి, అమరావతి: జీన్స్ పరిశ్రమ కారణంగా మహా సముద్రాలు సైతం కలుషితమవుతున్నాయి. దాదాపు అర మిలియన్ టన్నుల మైక్రోఫైబర్లు (మూడు మిలియన్ బ్యారెళ్ల చమురుకు సమానం) ఏటా సముద్రాల్లోకి చేరుతున్నాయి. ఫలితంగా సాగర జలాలు విషపూరితంగా మారుతున్నాయి. ఇటీవల కాలంలో దుస్తుల్లో ఎక్కువగా వాడుతున్న సింథటిక్ పాలిస్టర్, నైలాన్, యాక్రిలిక్ (పాలిమర్ రంగులు)లను నీటిలో కడగడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇవి నీటిలో కుళ్లి నాశనం అవడానికి 200 ఏళ్లు పడుతుంది. దీనివల్ల జీన్స్‌లోని ప్లాస్టిక్ మైక్రోఫైబర్లు సముద్ర జలాలను కప్పేసినట్లు గుర్తించారు. యూఎన్ నివేదికల ప్రకారం ఫ్యాషన్ పరిశ్రమ 20 శాతం కలుషిత నీరు, 10 శాతం కర్బన ఉద్గారాలను ఉత్పత్తి చేస్తోంది. ఇది విమానాలు, సముద్ర రవాణా ద్వారా వెలువడే ఉద్గారాల (గ్రీన్హౌస్ వాయువులు) కంటే ఎక్కువగా ఉంటోంది. దేశంలోని భారతియార్ విశ్వవిద్యాలయంలో టెక్స్టైల్స్, దుస్తుల డిజైన్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ అముత కరుప్పచామి విశ్లేషణ ప్రకారం.. పత్తిని అధికంగా ఉత్పత్తి చేసే చైనా, భారత్‌తో పాటు, అమెరికాలో కూడా రసాయనాలను విరివిగా వినియోగించడం కూడా నీటి కాలుష్యాన్ని పెంచుతోందని చెబుతున్నారు. ఒక జత జీన్స్ తయారీకి 7,500 లీటర్ల నీరు సాధారణంగా.. దుస్తులన్నింటికీ అద్దకం, ఇతర ప్రక్రియల కోసం భారీగా మంచినీటిని ఉపయోగిస్తారు. ప్రతి టన్ను వ్రస్తానికి రంగు వేయడానికి దాదాపు 200 టన్నుల మంచినీరు అవసరం. ఇందులో ఒక జత బ్లూజీన్స్ తయారీకి 7,500 లీటర్ల నీటిని వినియోగిస్తున్నారు. ఇది సగటు వ్యక్తికి ఏడేళ్లపాటు అవసరమయ్యే తాగునీటితో సమానం. అలాగే, యూఎన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ప్రకారం ఫ్యాషన్ పరిశ్రమ ఏటా 93 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని ఉపయోగిస్తుంది. ఈ నీటితో ఐదు లక్షల మంది జీవితకాల దాహార్తిని తీర్చవచ్చు. మరోవైపు.. దుస్తుల వినియోగంలోనూ మానవుల్లో తీవ్ర నిర్లక్ష్యం కనిపిస్తోంది. కొద్దికాలానికే వాడిపడేస్తూ..: ప్రపంచవ్యాప్తంగా ఒక ఏడాదిలో 5,300 మిలియన్ టన్నుల నూలు తయారవుతోంది. దీంతో ఏటా 80 బిలియన్ల కొత్త దుస్తులు ఉత్పత్తి అవుతున్నాయి. అయితే యూఎన్ ఎని్వరాన్‌మెంట్ ప్రోగ్రామ్ భాగస్వామి అయిన ఎల్లెన్ మకార్తుర్ ఫౌండేషన్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకనుకు ఒక ట్రక్కులోడు వ్రస్తాలను చెత్తలో పడేస్తున్నారు లేదా కాల్చేస్తున్నారు. నిపుణుల అంచనా ప్రకారం గడిచిన దశాబ్దంలో దుస్తుల ఉత్పత్తి రెట్టింపు అయింది. కానీ, వీటిలో 70 శాతం దుస్తులను ప్రజలు కొద్దిరోజులకే వాడిపడేస్తున్నారు. సగటున పాశ్చాత్య దేశాల్లో ఏడుసార్లు మాత్రమే ధరించి పడేస్తున్నారు. అదే ఇక్కడ ఒక కుటుంబం ఏటా 30 కిలోల దుస్తులను పడేస్తోంది. కొలరాడో పరిశోధన విశ్వవిద్యాలయం ప్రకారం.. కేవలం 15 శాతం దుస్తులను మాత్రమే రీసైకిల్ లేదా విరాళంగా అందిస్తున్నారు. ఇది మరింతగా పెరిగితే ఫ్యాషన్ పరిశ్రమ కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. స్లో అండ్ సస్టైనబుల్ ఫ్యాషన్.. కోవిడ్–19 తర్వాత ప్రజల దృక్పథంలో మార్పువస్తోంది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాషన్ పరిశ్రమ స్లో అండ్ సస్టైనబుల్ ఫ్యాషన్ ట్రెండ్ వైపు మళ్లుతోంది. ఇటువంటి సస్టైనబుల్ బ్రాండ్లు డజన్ల కొద్దీ మార్కెట్లోకి వచ్చాయి. ఇవి బట్టల తయారీకి ఆర్గానిక్ మెటీరియల్స్‌ను ఉపయోగిస్తున్నాయి. అయితే, ఇవి ఖరీదైనవిగా ఉన్నాయి. ఇందులో దుస్తులకు ఆర్గానిక్ రంగులనే వాడుతున్నారు. ప్రజల్లోనూ రీసైక్లింగ్ క్రేజ్ క్రమంగా పెరుగుతోంది. దుస్తుల్ని వివిధ దశల్లో చాలాసార్లు ఉపయోగించేలా అవగాహన వస్తోంది. మన దేశంలో ఇలా.. ఇక వివిధ మార్కెట్ అధ్యయనాల ప్రకారం భారతీయ డెనిమ్ (జీన్స్) మార్కెట్ కొన్నేళ్లుగా వార్షిక వృద్ధి రేటు సగటున 8–9 శాతం వరకు కొనసాగిస్తోంది. ఇది 2028 నాటికి రూ.91,894 కోట్లకు చేరుకుంటుందని అంచనా. మరోవైపు.. పాశ్చాత్య దేశాల మాదిరిగా కాకుండా, భారత్‌లో ప్రతి వ్యక్తికి సగటు జీన్స్ వినియోగం చాలా తక్కువగా ఉంది. ఇక్కడ ప్రస్తుతం సగటున ఒక వ్యక్తికి 0.5 జీన్స్ మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి వ్యక్తికి ఒక జత జీన్స్ ఉండాలంటే సంవత్సరానికి మరో 700 మిలియన్ జతల జీన్స్ అవసరమని అంచనా. అలాగే, ఓ సర్వే ప్రకారం 2023లో 59 శాతం మంది భారతీయులు గత సంవత్సరం కంటే ఎక్కువ జీన్స్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. -
165 ఏళ్లనాటి జీన్స్.. జస్ట్ రూ.94 లక్షలే!
పూర్తిగా మాసిపోయినట్లు కనిపిస్తున్న ఈ జీన్స్ రేటుఎంతో తెలుసా? రూ. 94 లక్షలు!! ఎందుకింత రేటు అంటే.. ఈ జీన్స్ ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనవి. 1857లో అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన ఓ నౌకలో ఇవి లభించాయట. అంటే 165 ఏళ్లనాటి జీన్స్ అన్నమాట. ఇది లెవీస్ట్రాస్ కంపెనీ తయారుచేసిన జీన్స్ అని కొందరు.. కాదని మరికొందరు అంటున్నారు. ఎవరు తయారుచేస్తేనేం.. ఇప్పటివరకూ లభించినవాటిల్లో ఇవే అత్యంత పురాతనమైనవి కనుక.. తాజాగా అమెరికాలో జరిగిన వేలంలో ఈ జీన్స్ 1,14,000 (భారతీయ కరెన్సనీలో 94 లక్షలు) డాలర్లకు అమ్ముడుపోయాయి. చదవండి: ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాము ఇదే.. ఒక్క కాటుకు 100 మంది ఫసక్.. -
విధిపై యుద్ధం! గద్దించాలనుంది.. కానీ గొంతు పెగలడంలేదు
ఉమ్మడి కుటుంబం.. ఇంటినిండా జనం.. అనుబంధాల గుమ్మం..అనురాగాల కాపురం.. విధి వికృతం..మేనరికం శాపమో..పేదరికం పాపమో.. విధిపై యుద్ధం చేయాలనుంది.. వైకల్యం వెక్కిరిస్తోంది..గద్దించాలనుంది..గొంతు ఉన్నా పెగలడంలేదు. కష్టాలను ఎదురీదుతామని విన్నవించుకోవడం తప్పా..వినలేని దైన్యం వారిది. రాయదుర్గంలోని నేసేపేటలో నివాసముంటున్న దొడగట్ట గంగమ్మ కుటుంబాన్ని చూస్తే గుండె తరుక్కుపోతుంది. శ్రమను నమ్ముకున్న ఈ కుటుంబంలో ఏకంగా నలుగురు బధిరులు ఉన్నారు. జీవన పోరాటం సాగిస్తూ కుటీర పరిశ్రమ కోసం చేయూత కోరుకుంటున్నారు. రాయదుర్గం: రాయదుర్గంలోని నేసేపేటలో నివాసముంటున్న దొడగట్ట గంగమ్మ కుటుంబంపై విధి చిన్నచూపు చూసింది. ఈమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానం. అందులో ఒక కుమారుడు దేవేంద్ర, కుమార్తె తిప్పక్క పుట్టుకతోనే మూగవారు. ఎదిగే కొద్దీ వినికిడి శక్తినీ కోల్పోయారు. దేవేంద్రకు సమీప బంధువైన నాగవేణితో వివాహమైంది. వీరికి రాధ, సంజయ్, పల్లవి సంతానం. వీరిలో సంజయ్‌కు మూగ, చెవుడు, అవయవలోపం ఉంది. పల్లవి కూడా మూగ, చెవుడుతో బాధపడుతోంది. వీరు పదో తరగతి వరకు చదువుకున్నారు. తిప్పక్కకు వివాహమైనప్పటికీ భర్తతో మనస్పర్థల నేపథ్యంలో తల్లి వద్దే ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది. గంగమ్మ మరో కుమార్తె వివాహమై మెట్టినింటికి వెళ్లిపోయారు. మొత్తం మీద తొమ్మిది మంది సభ్యులు గల ఈ ఉమ్మడి కుటుంబంలో నలుగురు మూగ, చెవుడు, వైకల్యంతో బాధపడుతున్నారు. సైగలతోనే సంభాషణ.. గంగమ్మ కుమారుడు దేవేంద్ర, కుమార్తె తిప్పక్క, మనవడు సంజయ్, మనవరాలు పల్లవి సైగలతోనే సంభాషిస్తుంటారు. అవతలి వారికి వీరి భాష అర్థం కాకపోతే కాగితంపై రాసి చూపుతారు. కుటుంబ సభ్యులు, బంధువులు వేరేచోట ఉన్నపుడు వారితో అవసరం ఉంటే వాట్సాప్ వీడియో కాల్‌ను ఉపయోగించుకుంటున్నారు. కుటీర పరిశ్రమ కోసం వినతి.. దేవేంద్ర తన భార్య నాగవేణితో కలిసి ఇంట్లోనే కుట్టుమిషన్ పెట్టుకుని పీస్ వర్క్‌పై జీన్స్‌ప్యాంట్లు కుడుతూ జీవనం సాగిస్తున్నారు. ఈ మధ్యనే కుమార్తె పల్లవికి కూడా కుట్టుమిషన్‌లో శిక్షణ ఇస్తున్నాడు. కుమారుడు సంజయ్ తనకు చేతనైన మేరకు తల్లిదండ్రులకు సహకారం అందిస్తున్నాడు. తల్లికి వృద్ధాప్య పింఛన్, దేవేంద్రకు వికలాంగుల పింఛన్ అందుతోంది. దేవేంద్ర సోదరి తిప్పక్కకు సెపరేట్ రేషన్‌కార్డు ఉన్నందున ఆమెకు పింఛన్ వస్తోంది. దీనితోనే అందరూ బతుకుబండి లాగుతున్నారు. అరకొర సంపాదనతో అవసరాలు పూర్తిస్థాయిలో తీరడం లేదు. పీస్ వర్క్ కాకుండా సొంతంగా వర్క్ ఆర్డర్ తెచ్చుకుని కుట్టివ్వడం ద్వారా సంపాదనను మరింత పెంచుకోవడానికి కుటీర పరిశ్రమ ఏర్పాటు కోసం తమకు బ్యాంకు ద్వారా రుణం ఇప్పించాలని దేవేంద్ర దంపతులు కోరుతున్నారు. ప్రతి క్షణం కుంగిపోతున్నాం నాకు ముగ్గురు సంతానం. అందులో ఇద్దరు మూగ వారిగా జన్మించారు. కుమారుడికి కూడా ఇద్దరు పిల్లలు మూగ, చెవుడు, వైకల్య లోపంతో జన్మించడం బాధేస్తోంది. ఆ దేవుడు మాకే ఎందుకు ఇలా చేశాడని ప్రతిక్షణం కుంగిపోతున్నాం. అయినా బతుకుపోరాటం కొనసాగిస్తున్నాం. ఇంటి నిండా జనం. అయినా నిశ్శబ్దం. సైగలతోనే సహజీవనం. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదని కోరుకుంటాం. – గంగమ్మ, కుటుంబ పెద్ద (చదవండి: పులినే చంపగల శునకం.. ఖరీదులో కనకం...) -
ఏముంది భయ్యా ఆ జీన్స్ ప్యాంట్లో.. 60 లక్షలు పెట్టి మరీ కొన్నావ్!
వస్తువులు పాతవయ్యే కొద్దీ వాటిని పక్కన పెట్టడం సహజం. వాటి విలువ తగ్గడం, ఆ స్థానంలో కొత్తవి రావడం, పాడైపోవడం లాంటి కారణాలతో పక్కన పెట్టేస్తాం. ఇదంతా ఒక వైపే. మరో వైపు చూస్తే.. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ దశాబ్దాల కాలం నాటి వస్తువుల కోసం కోట్లు పెడుతుంటాం. ఎందుకంటే కొన్ని వస్తువులు ఎంత పాతవైతే అంత విలువ పెరుగుతుంది. అందుకే కొంతమంది అలాంటి వాటి కోసం వేచి చూస్తుంటారు. వేలంలోకి రాగానే భారీ నగదు చెల్లించి సొంతం చేసుకుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి మెక్సికోలో చోటు చేసుకుంది. అమ్మో.. ఈ ప్యాంటు ధర రూ.60 లక్షలా! అమెరికాలోని న్యూ మెక్సికోలో జరిగిన వేలంలో 1880ల నాటి లెవీ జీన్స్ జత $76,000కి( భారత కరెన్సీ ప్రకారం రూ.60 లక్షల పైమాటే) అమ్ముడైంది. శాన్ డియాగోకు చెందిన 23 ఏళ్ల పాతకాలపు దుస్తుల వ్యాపారి కైల్ హౌపెర్ట్ ఇటీవల జరిగిన వేలంలో ఈ జీన్స్ ప్యాంటును కొనుగోలు చేశాడు. అయితే, హౌపెర్ట్ కొనుగోలుదారుల ప్రీమియంతో కలిపి మొత్తం $87,400 చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై హౌపెర్ట్ మాట్లాడుతూ "నేను ఇప్పటికీ ఒకరకంగా అయోమయంలో ఉన్నాను, ఆ ప్యాంట్‌ను కొనుగోలు చేసినందుకు నాకే ఆశ్చర్యంగా ఉంది" అని చెప్పారు. అతను పాతకాలపు దుస్తుల కంపెనీ డెనిమ్ డాక్టర్స్ యజమాని జిప్ స్టీవెన్సన్తో కలిసి జీన్స్‌ను కొనుగోలు చేశాడు. వేలంలో పలికిన దీని ధరలో ఇప్పటికే 90 శాతాన్ని హౌపెర్ట్ చెల్లించాడు. View this post on Instagram A post shared by Golden State Vintage (@goldenstatevtg) చదవండి: యూజర్లకు బంపరాఫర్.. రూ.10కే మూడు నెలల సబ్స్క్రిప్షన్! -
Fashion Tips: వర్షాకాలంలో ఈ దుస్తులు అస్సలు వద్దు! ఇవి వాడితే బెటర్!
Comfortable Wardrobe Ideas For Monsoon: అసలే ముసురు. అలాగని వెచ్చగా ఇంట్లో మునగదీసుకుని పడుకుందామంటే చదువులెలా సాగుతాయి? ఉద్యోగాలెలా చేస్తాం? రెయిన్ కోటు తగిలించుకునో గొడుగేసుకునో బయటికి వెళ్లక తప్పదు. అయితే మనం ధరించే దుస్తులు మాత్రం వానకు తగ్గట్టు లేకపోతే అసౌకర్యం తప్పదు మరి. అలాకాకుండా ఈ వానలకు ఎలాంటి దుస్తులయితే బాగుంటుంది, యాక్సెసరీస్ ఏవి బాగుంటాయి... చూద్దాం. వర్షాకాలంలో యువతరం బట్టల గురించి శ్రద్ధ తీసుకోవాలి. ఇక కాలేజీకి వెళ్లే విద్యార్ధులకు దీని పట్ల మరింత శ్రద్ధ అవసరం. ఎండల్లో పల్చని రంగులు వాడినప్పటికీ ఇప్పుడు ముదురు రంగులు వాడటం ఉత్తమం. ఎందుకంటే వాతావరణం డల్‌గా ఉంటుంది కాబట్టి ముదురు రంగు దుస్తులు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. అలాగని భారీగా ఉండకూడదు. తేలికపా వి అయితేనే మంచిది. వాటిలో తెలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడం ఈ కాలంలో ఎంతో శ్రేయస్కరం ఇవి బాగుంటాయి! ►కాటన్, సింథటిక్ ఫ్యాబ్రిక్ వంటి దుస్తులను వాడటం మంచిది. ►సాయంకాలం సమయంలో ఫ్రాక్స్, అనార్కలీ బాగుంటాయి. ►స్కిన్ టైట్, లెగ్గింగ్స్ కూడా బాగుంటాయి. ►అదే విధంగా చీరలు, చుడిదార్లు ధరించే వారు శాండిల్స్, షూస్ వంటి వాటిని వేసుకుంటే మంచిది. ►హ్యాండ్ బ్యాగులు చిన్న సైజులో కాకుండా, కాస్త పెద్దవిగా ఉన్నవి అయితేనే నయం. ఇవి వద్దు! ఇలా చేస్తే మేలు! ►మరో విషయం ఏమిటంటే... వర్షాకాలం లో పారదర్శకంగా అంటే ట్రాన్స్పరెంట్గా ఉండే దుస్తులకు దూరంగా ఉండటం ఉత్తమం. ►బట్టలు పొడిగా వుంచుకోవాలి. తడి వల్ల బ్యాక్టీరియా త్వరగా చేరుతుంది. అందుకే ఎక్కువసేపు తడిగా వుండకూడదు. ►తెలుపు రంగు బట్టలకు మురికి పట్టిందంటే తొందరగా వదలదు. ►ఏ చిన్న మరక పడ్డా అల్లంత దూరానికి కూడా కనిపించి అసహ్యంగా వుంటుంది కాబట్టి ముదురు రంగు బట్టలు వాడితే మంచిది. ►ముసురు తగ్గాక దుప్పట్లు, రగ్గులు, బొంతలు, దిళ్లు, పరుపులు, మందపాటి బట్టలను కాసేపు అలా ఎండలో వేస్తే బావుంటాయి. వాసన కూడా రాదు. ►శరీరం ఎప్పుడూ సాధారణ ఉష్ణోగ్రతలో వుండేలా చూసుకోవాలి. ►శరీర ఉష్ణోగ్రత పడిపోయినప్పుడు క్రిములు దాడి చేసే ప్రమాదం ఎక్కువ. ►వానాకాలం అన్నాళ్లూ బయటికెళ్లేటప్పుడు గొడుగు/రెయిన్‌కోట్ వెంట వుండాలి. ►వర్షాకాలంలో ఎక్కువగా మేకప్ వేసుకోకపోవడమే మంచిది. జీన్స్ అసలే వద్దు! ►ఈ కాలంలో జీన్స్ జోలికి వెళ్లకూడదు. మరీ ముఖ్యంగా టైట్ జీన్స్ అసలు వద్దు. ►అలాగే వర్షాకాలంలో స్లిప్పర్స్ కంటే షూ వాడడం బెటర్. లేదంటే శాండిల్స్ అయినా ఫరవాలేదు. ►స్లిప్పర్స్ వేసుకుంటే మాత్రం బట్టలపై బురద మరకలు పడి అసహ్యంగా కనిపిస్తాయి. ►అంతేకాకుండా బురదగా ఉన్న ప్రదేశంలో చెప్పులు వేసుకుని నడిస్తే జారిపడే అవకాశం ఉంది. చదవండి: Nazriya Nazim Saree Cost: నజ్రియా ధరించిన ఈ చీర ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! స్పెషాలిటీ? -
రెండో పెళ్లి చేసుకోబోతున్న 48 ఏళ్ల స్టార్ హీరో..
నిర్మాత త్యాగరాజన్ కొడుకుగా ఇండస్ట్రీలో ఇంట్రీ ఇచ్చి తనకుంటూ గుర్తింపు సంపాదించుకున్న హీరో ప్రశాంత్. జీన్స్, దొంగ దొంగ, జోడీ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రశాంత్ రామ్‌చరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కోలీవుడ్‌లో స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్సంపాదించుకున్న ప్రశాంత్ ప్రస్తుతం అంధాదూన్ రీమేక్‌లో నటిస్తున్నాడు. అయితే తాజాగా ఈయనకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. త్వరలోనే ప్రశాంత్ రెండో పెళ్లి చేసుకోనున్నట్లు కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఈ ఏడాది చివర్లో ఆయన వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తుంది. కాగా 2005లో వ్యాపారవేత్త కూతురు గృహలక్ష్మితో ప్రశాంత్ పెళ్లి జరిగింది. వీరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. మనస్పర్థల కారణంగా పెళ్లయిన మూడేళ్లకే వీరు విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న ప్రశాంత్ తాజాగా వారి కుటుంబానికి పరిచయం ఉన్న అమ్మాయిని పెళ్లాడనున్నాడట. త్వరలోనే ఈ వార్తలపై మరింత క్లారిటీ రానుంది. -
శంకర్ పిలిచి ఆఫర్ ఇస్తే ఆ హీరో నో చెప్పాడట, ఆ తర్వాత చూస్తే బ్లాక్‌బస్టర్ హిట్
సెన్సెషనల్ డైరెక్టర్ శంకర్‌తో సినిమా అంటే ఏ హీరో వద్దనడు. ఎందుకంటే ఆయన సినిమాలన్ని భారీ స్థాయిలో ఉంటాయి. కొత్త కొత్త టెక్రాలజీ శంకర్ తన సినిమాల్లో వాడతారు. అందుకే శంకర్ సినిమా అంటే చాలా ప్రేక్షకుల అంచనాలన్ని డబుల్ అయిపోతాయి. అలాంటి దర్శకుడు శంకర్ పిలిచి ఆఫర్ ఇస్తే ఓ హరో చేయనని చెప్పాడట. ఇంతకి ఆ హీరో ఎవరూ, అసలు విషయేంటో ఓసారి చూద్దాం. కమల్ హాసన్‌తో భారతీయుడు మూవీ తీసి భారీ హిట్ కొట్టిన డైరెక్టర్ శంకర్ ఆ తర్వాత సినిమాలు పెద్దగా ఆడలేదు. దీంతో కొంత గ్యాప్ తీసుకున్న ఆయన జీన్స్ కథ సిద్ధం చేసుకున్నాడు. చదవండి: విడాకులపై సుమంత్ ఆసక్తికర కామెంట్స్, ఇప్పుడది కామన్.. ఒకే పోలికతో ఉన్న ఇద్దరు అబ్బాయిలు ఓకే అమ్మాయిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది అన్న పాయింట్‌ని తీసుకొని విజువల్ వండర్‌గా జీన్స్ మూవీని తెరకెక్కించారు శంకర్. ముందుగా ఈ సినిమాకి హీరోగా అబ్బాస్‌ని అనుకున్నాడట ఆయన. అందుకే అబ్బాస్‌ను ప్రత్యేకంగా కలిసి కథ వివరించాడట. అయితే అప్పటికే ప్రేమదేశం మూవీ భారీ సక్సెస్ కావడంతో అబ్బాస్ సినిమాల పరంగా ఫుల్ బిజీ అయిపోయాడు. ఆ సమయంలో దాదాపుగా ఓ పది సినిమాలకి కమిట్మేంట్ ఇచ్చాడట. అందుకే శంకర్ ఆఫర్‌ని రిజెక్ట్ చేశాడట అబ్బాస్. ఇదిలా ఉంటే అదే సమంయలో శంకర్ ఖాతాలో భారతీయుడు తప్పితే మరో భారీ హిట్ లేదు. చదవండి: ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమవుతున్న ‘బంగార్రాజు’!, ఎక్కడంటే.. అప్పుడే ప్రేమదేశం మూవీ భారీ విజయంతో మంచి ఫాంలో ఉన్న అబ్బాస్, అప్పుడప్పుడే కెరీర్లో నిలదొక్కుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో అబ్బాస్, శంకర్‌తో సినిమా చేసేందుకు సాహసం చేయలేదని అప్పట్లో గుసగుసలు వినిపించాయి. ఇక అబ్బాస్ నో చెప్పడంతో అదే మూవీ హీరో అజిత్‌ని అనుకున్నాడు శంకర్. కానీ కాల్షీట్ల కారణంగా జీన్స్ మూవీని పక్కన పెట్టాడు అజిత్.. చివరికి జీన్స్ స్క్రీప్ట్ ప్రశాంత్ దగ్గరికి వెళ్ళింది. అప్పటికే ప్రేమికుడు, ప్రేమదేశం మూవీ ఆఫర్ లని మిస్ చేసుకొని బాధపడుతున్న ప్రశాంత్‌కి ఇది మంచి ఆఫర్. అందుకే అప్పటికే కమిట్ అయిన ఏడు సినిమాలను కూడా కాదనుకొని శంకర్‌కు డేట్స్ ఇచ్చాడట హీరో ప్రశాంత్. 4 ఏప్రిల్ 1998 సంవత్సరం విడుదలైన జీన్స్ మూవీ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళంలో కంటే తెలుగులోనే ఈ సినిమా సూపర్ హిట్ కావడం విశేషం. ఐశ్వర్యరాయ్‌ని ఎనిమిదో వింతగా చూపిస్తూ ప్రపంచంలోని ఏడు వింతలను ఆయా ప్రదేశాల్లో చూపిస్తూ ‘పూవుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం’ అనే పాటను చిత్రీకరించాడు శంకర్. ఈ ఒక్క పాట కోసం ఏకంగా మూడు కోట్లు ఖర్చు చేశారాయన.. అప్పట్లో దీని గురించి ఇంటర్నేషనల్ మీడియా కూడా రాసింది. ఈ సినిమా తర్వాత ఐశ్వర్యరాయ్ ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. -
జీన్స్, టీషర్ట్స్ లవర్స్‌కు షాకింగ్ న్యూస్...!
జీన్స్, టీ షర్ట్స్ అంటే యువతకు విపరీతమైన మోజు. ఏదైనా షాపింగ్ మాల్స్‌కు వెళ్లినప్పుడు మనలో ఎక్కువగా ఫ్రీఫర్ చేసేది జీన్స్, టీషర్ట్సే...! కాగా రానున్న రోజుల్లో జీన్స్, టీషర్ట్స్ ధరలకు రెక్కలు వచ్చేలా ఉన్నాయి.దీనికి కారణం ప్రపంచవ్యాప్తంగా కాటన్ ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, షిప్పింగ్ కంపెనీలు కాటన్ రవాణాకు భారీగా ఛార్జీలను వసూలు చేస్తుండటంతో కాటన్ ధరలు విపరీతంగా పెరిగాయి. చదవండి: భారీ డిస్కౌంట్లతో ముందుకువస్తోన్న షావోమీ..! సుమారు రూ. 75 వేల వరకు తగ్గింపు..! భారత్‌తో సహా, అమెరికా లాంటి దేశాల్లో పత్తి పంటకు భారీ సమస్యలు తలెత్తడంతో కాటన్ దిగుబడి తగ్గిపోయింది. అంతేకాకుండా చైనా, మెక్సికో దేశాలు రికార్డు స్ధాయిలో కాటన్‌ను కొనుగోలు చేస్తున్నాయి. గత ఏడాది నుంచి ఈ దేశాల నుంచి అమెరికా పూర్తిగా దిగుమతులను నిలిపివేసింది. భారీ మొత్తంలో కాటన్‌ను కొనుగోలు చేసి కృత్రిమ కొరతను సృష్టించేలా చైనా ముందుకు సాగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గత పదేళ్లలో తొలిసారి కాటన్ ఫ్యూచర్స్ పౌండ్ (సుమారు 453 గ్రాములు)కు ఒక డాలర్‌కు చేరింది. అంతర్జాతీయంగా కాటన్ ధరలు పెరగడంతో పలు జీన్స్, టీ షర్ట్స్ కంపెనీలు త్వరలోనే భారీగా ధరలను పెంచేందుకు సిద్దమైతున్నట్లు తెలుస్తోంది. కాటన్ ధరల పెరుగుదల లివైస్ స్ట్రాస్లాంటి పెద్ద కంపెనీలకు భారీ ఎత్తున్న ప్రభావితం చేస్తున్నాయి. న్యూయర్క్‌లో డిసెంబర్ నెలలో కాటన్ షిప్పింగ్ ఛార్జీలు ఒక పౌండ్‌కు 3.6 శాతం పెరిగి 1.0155 డాలర్లకు చేరుకుంది. 2011, నవంబర్ తర్వాత ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. ఈ ఏడాది మొత్తంగా ధర 28 శాతం పెరిగింది. ఎందుకైనా మంచిది ఈ పండుగ సీజన్లో ఓ నాలుగైదు జీన్స్ ఎక్కువ కొనుక్కోవడం మంచిందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చదవండి: Netflix: ఓటీటీలో సినిమా, వెబ్సిరీస్లేకాదు..గేమ్స్ కూడా..! -
జీన్స్‌ను నెలకు ఒక్కసారే ఉతకాలంట.. కారణమేంటంటే
న్యూఢిల్లీ: సైన్స్ అభివృద్ధి చెందుతున్న కొద్ది మనిషికి సౌకర్యాలు పెరిగాయి. ప్రతిదీ చేయి దగ్గరకు వస్తుంది.. ఇక మన శారీరక శ్రమను తగ్గించే ఎన్నో ఆవిష్కరణలు వచ్చాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గ్రైండర్లు, మిక్సీలు, వాషింగ్ మెషీన్లు. వీటి వల్ల మహిళలకు ముఖ్యంగా ఉద్యోగం చేసే ఆడవారికి పని సులువు అయ్యింది.. సమయం కూడా చాలా కలసి వస్తుంది. అయితే ఈ పరికరాల వల్ల మనిషికి లాభమే కానీ పర్యవరణానికి చాలా కీడు జరుగుతుంది. ముఖ్యంగా మన సౌకర్యం కోసం వాడుతున్న ఫ్రిజ్‌ల వల్ల ఓజోన్ పొరకు చాలా నష్టం వాటిల్లుతుందని ఇప్పటికే శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇప్పుడు తాజాగా ఈ కోవలోకి మరోకటి వచ్చి చేరింది. అది వాషింగ్ మెషీన్. మనల్ని బట్టలుతికే శ్రమ నుంచి తప్పించని వాషింగ్ మెషీన్‌ను తరచుగా వాడటం వల్ల పర్యావరణం మీద తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుంది అటున్నారు నిపుణులు. భూమిని పరిరక్షించుకోవాలని భావిస్తే.. వాషింగ్ మెషిన్ వాడకాన్ని తగ్గించమని సూచిస్తున్నారు. ఆ వివరాలు.. (చదవండి: ఉన్నట్టుండి వాషింగ్ మిషిన్ ఢాం!! అని పేలింది..) తాజాగా సోసైటీ ఆఫ్ కెమికల్ ఇండస్ట్రీ తన నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. సమాజంలో ఎక్కువ మంది చాలా తరచుగా.. అంటే ప్రతి రోజు వాషింగ్ మెషీన్‌ను వాడుతున్నారని.. దీనివల్ల పర్యావరణం మీద చాలా ప్రతికూల ప్రభావం ఉంటుందని ఈ నివేదక వెల్లడిస్తుంది. మీరు వాషింగ్ మెషీన్లో బట్టలు ఉతికే ప్రతిసారి, మిలియన్ల మైక్రోఫైబర్లు నీటిలోకి విడుదల అయ్యి మహాసముద్రాలలోకి ప్రవేశిస్తాయి. మైక్రోఫైబర్లు ప్లాస్టిక్ చిన్న తంతువులు. ఇవి పాలిస్టర్, రేయాన్, నైలాన్ వంటి సింథటిక్ ఫ్యాబ్రిక్ల నుంచి వెలువడతాయి. మహాసముద్రాలలో ప్లాస్టిక్ కాలుష్యానికి ఇవి ఒక ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీన్ని నివారించాలంటే.. నెలకు ఒక్కసారి మాత్రమే వాషింగ్ మెషీన్ వాడమని నిపుణులు ఈ నివేదికలో సూచించారు. అంటే జీన్స్ ప్యాంట్స్‌ని నెలకు ఒకసారి.. జంపర్స్ని పదిహేను రోజులకు ఒకసారి.. పైజామాలను వారానికొకసారి ఉతకాలని తెలిపారు. అలానే లోదుస్తులను ప్రతి రోజు శుభ్రం చేసుకోవాలని.. అది మెషీన్లో కాకుండా సాధారణ పద్దతుల్లో ఉతుక్కోవాలని సూచించారు. టీ షర్ట్స్, టాప్స్ వంటి వాటిని ఐదు సార్లు.. డ్రెస్‌లను ఆరు సార్లు ధరించిన తర్వాత ఉతకాలని సూచించారు నిపుణులు. ఇలా చేయడం వల్ల టైమ్, మనీతో పాటు దుస్తులు కూడా ఎక్కువ కాలం మన్నుతాయని తెలుపుతున్నారు. బట్టలు తక్కువ సార్లు ఉతకడం వల్ల కరెంట్, నీటి వినియోగం తగ్గుతుంది. డిటర్జెంట్ల వాడకం తగ్గడం వల్ల తక్కువ సార్లు రసాయనాలు వాడినట్లు అవుతుంది. ఫలితంగా భూమికి మేలు చేసినవారం అవుతాం అంటున్నారు నిపుణులు. (చదవండి: వాషింగ్ మెషీన్లో బుసలు కొట్టిన నాగుపాము, వీడియో హల్చల్) "వాషింగ్ మెషీన్లను కనిపెట్టడానికి ముందు, బట్టలు ఉతకడం అనేది శ్రమతో కూడుకున్నది, అలసటగా ఉండేది. అయితే వాషింగ్ మెషీన్లు వచ్చాక ఈ శ్రమ తగ్గింది. ఉతకడం ఎక్కువయ్యింది. దీన్ని తగ్గిస్తే.. మనం మనతో పాటు మనం నివసించే గ్రహం కూడా బాగుంటుంది" అని ఫ్యాషన్ రివల్యూషన్ గ్రూప్ సహ వ్యవస్థాపకుడు , ఓర్సోలా డి కాస్ట్రో తెలిపారు. చదవండి: జీన్స్ వేసుకుని అలా వద్దు.. ఎందుకో తెలుసా? -
పాకిస్తాన్ ఆంక్షలు...నో జీన్స్ అండ్ టైట్స్
ఇస్లామాబాద్: కొన్ని ఇస్లామిక్ దేశాల్లో మహిళా వస్త్రధారణ పై ఆంక్షలు విధించడం సాధారణం. అఫ్గనిస్తాన్‌లో తాలిబన్లు కూడా కో ఎడ్యుకేషన్ నిషేధిస్తూ పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసింది. తాజాగా పాకిస్తాన్ కూడా అదే తరహలో ప్రజల భావప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ ఫెడరల్ డైరక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్(ఎఫ్‌డీఈ) మహిళా ఉపాధ్యాయులను టైట్స్, జీన్స్ ,పురుష ఉపాధ్యాయులను జీన్స్, టీ షర్ట్స్ ధరించకూడదంటూ ఆంక్షలు జారీ చేసింది. అంతేకాదు మహిళలు/పురుష ఉపాధ్యాయులు ఎలాంటి దుస్తులు ధరించాలో ఎఫ్‌డీఈ నిర్ణయించింది. పాకిస్తాన్లో అన్ని విద్యాసంస్థలలోని బోధన/బోధనేతర సిబ్బంది వ్యక్తిగత శుభ్రతను పాటిస్తూ తాము సూచించిన నియమాలను పాటించేలా చూడాల్సిందిగా ప్రధానోపాధ్యాయులను ఆదేశించింది. -
ఇకపై నో జీన్స్, నో టీ షర్ట్స్.. సీబీఐ ఆదేశాలు
న్యూఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైస్వాల్ అధికారులకు, సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇకపై కార్యాలయంలోని అధికారులు జీన్స్, టీషర్ట్స్,స్పోర్ట్స్ షూస్, వేసుకోకూడదని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని ఇకనుంచి ప్రతీ ఒక్కరూ వీటిని పాటించాలన్నారు. దీని ప్రకారం సీబీఐలో పని చేసే పురుషులు ఇకపై షర్ట్స్, ఫార్మల్ ప్యాంట్లు, ఫార్మల్ షూస్ వేసుకోవాలి. అలాగే నీట్‌గా షేవ్ చేసుకోవాలి. ఇక మహిళా అధికారులైతే చీరలు, సూట్లు, ఫార్మల్ షర్ట్స్, ప్యాంట్లు మాత్రమే వేసుకొని కార్యాలయాలకు రావాలి. ఈ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించేలా చూడాలని దేశవ్యాప్తంగా ఉన్న సీబీఐ శాఖల అధిపతులకు తెలిపారు. చదవండి: వ్యాక్సిన్ వేసుకుంటే.. బిర్యానీ, బైకు, బంగారం.. ఎక్కడో తెలుసా? -
జీన్స్ వద్దన్న సీఎం! బరాబర్ వేస్తానంటున్న బిగ్‌బీ మనవరాలు
అమ్మాయిల వస్త్రధారణపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరత్ సింగ్ రావత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే! చిరిగిపోయిన జీన్స్ వేసుకుని ఎక్స్పోజింగ్ చేయడం, వాటిని ధరించడం స్టేటస్ సింబల్‌గా భావించడం దురదృష్టకరమని, ఇది సంస్కృతిని దెబ్బ తీయడమేనని పేర్కొన్నారు. అమ్మాయిలు, అబ్బాయిలన్న తేడా లేకుండా పోటీపడి మరి స్కిన్ షో చేయడాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. అమ్మాయిలు ఎలాంటి బట్టలు వేసుకోవాలో కూడా మీరు చెప్పాలా? అంటూ నెటిజన్లు మండిపడ్డారు. తాజాగా బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలీ సైతం సీఎం వ్యాఖ్యలపై ఒంటికాలిన దిగ్గున లేచింది. "మా వస్త్రధారణ మార్చే ముందు మీరు మీ ఆలోచనలను మార్చుకోండి. ఎందుకంటే మీరు సమాజానికి ఇస్తున్న సందేశాలు మమ్మల్ని మరింత షాక్‌కు గురి చేస్తున్నాయి" అంటూ సీఎం వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ పెట్టింది. అంతే కాదు తను జీన్స్ ధరించిన ఫొటోను షేర్ చేస్తూ "నేను సగర్వంగా ఈ జీన్స్‌ను ధరిస్తాను" అని చెప్పుకొచ్చింది. చదవండి: చిరిగిన జీన్స్ ధరించడంపై ఉత్తరాఖండ్ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు -
జీన్స్ వేసుకుని అలా వద్దు.. ఎందుకో తెలుసా?
రఫ్ అండ్ టఫ్‌గా ఉపయోగించడానికి అనువైనవి కావడంతోపాటు సౌకర్యమూ ఉండటం వల్ల జీన్స్ ప్యాంట్స్ పట్ల యువతీయువకుల్లో మాత్రమే గాక ప్రజలందరిలోనూ వాటి పట్ల మక్కువ ఎక్కువ. అయితే జీన్స్ ప్యాంట్ల వల్ల కలిగే అనర్థాలపై జరిగిన అధ్యయనాల్లోని ఒక అంశం కాస్తంత ఆందోళన గొలిపేదిగా ఉంది. జీన్స్ వేసుకొని కింద కూర్చోవడం, అందునా జీన్స్ ప్యాంట్లు తొడిగి బాసిపట్లు వేయడం (సక్లముక్లం వేసి కూర్చోవడం) ఆరోగ్యానికి అంత మేలు కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. జీన్స్ ప్యాంట్ తొడుక్కొని ఇలా కూర్చోవడం వల్ల కండరాలు, నరాలు దెబ్బతింటాయనీ, ఇది మరీ విషమిస్తే ఒక్కోసారి జీన్స్ ప్యాంట్లతో బాసిపట్లు (సక్లంముక్లం) వేసుకుని కూర్చునేవారు అస్సలు నడవలేని పరిస్థితి కూడా వచ్చేందుకు అవకాశముందని హెచ్చరిస్తున్నారు. వ్యాయామం చేసే సమయంలోనూ జీన్స్ వేసుకొని ‘స్క్వాటింగ్’ అస్సలు చేయవద్దని హెచ్చరిస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ ‘జర్నల్ ఆఫ్ న్యూరాలజీ, న్యూరోసర్జరీ, సైకియాట్రీ’ అనే మెడికల్ జర్నల్‌లోనూ ప్రచురితమయ్యాయి. చదవండి: స్త్రీల దుస్తులకూ వయసుంటుందా? -
‘మహా’నిర్ణయం.. ఉద్యోగులకు డ్రెస్ కోడ్
ముంబై: అన్నింటా ఫ్యాషన్ కోరుకునే నేటి పరిస్థితుల్లో మహారాష్ట్ర ప్రభుత్వం తన ఉద్యోగుల వస్త్రాధారణపై ఆంక్షలు విధించింది. ఇకపై రాష్ట్ర ప్రభుత్వ, కాంట్రాక్టు ఉద్యోగులు జీన్స్, టీషర్ట్, స్లిప్పర్స్ ధరించడంపై నిషేధం విధిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. డ్రెస్ కోడ్ అమలులో భాగంగా ఉద్యోగులెవరూ విధి నిర్వహణలో డీప్, వింత వింత రంగుల్లో ఎంబ్రాయిడరీతో ఉన్న దుస్తులు, రంగుల చిత్రాలు ఉన్న దుస్తులు ధరించరాదని స్పష్టం చేసింది. రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా సంప్రదాయ వస్త్రాలనే ధరించాలని సర్కారు సర్క్యులర్ విడుదల చేసింది. మహిళా ఉద్యోగులు శారీ, సల్వార్, చుడీదార్-కుర్తా లేక కుర్తా-ప్యాంటు లేక షర్ట్ ధరించాలని, అవసరమనకుంటే దుపట్టా ధరించవచ్చని సర్క్యులర్‌లో పేర్కొంది. స్లిప్పర్స్‌కు బదులు చెప్పల్స్, శాండిల్స్ లేక షూస్ ధరించవచ్చని తెలిపింది. పురుషులు తప్పనిసరిగా ప్యాంట్లు, షర్ట్స్ ధరించాలని వెల్లడించింది. షూస్, శాండిల్స్ ధరించాలని చెప్పింది. ఇక చేనేత కార్మికులను పోత్సహించే ఉద్దేశంతో... ఉద్యోగులు వారంలో ఒకసారి ఖాదీ దుస్తులను ధరించవచ్చని తెలిపింది. ప్రజలకు సేవ చేయాల్సిన ఉద్యోగులు పద్ధతిగా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం చెప్పుకొచ్చింది. దుస్తులను బట్టి పని విధానం ఆధారపడుతుందని తెలిపింది. -
పార్టీ లేదా పని.. దేనికైనా ‘డెనిమ్’
న్యూఢిల్లీ: దేశంలో వినియోగం పడిపోయిందని వింటున్నాం.. కానీ కొన్నింటికి డిమాండ్ బ్రహ్మాండంగా ఉంది. వాటిల్లో డెనిమ్ కూడా ఒకటి. పార్టీ అయినా, పనికి అయినా, క్యాజువల్ అయినా.. డెనిమ్ వస్త్రాలను ధరించేందుకు ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. తక్కువ ధర, సౌకర్యం, కొత్త కొత్త డిజైన్లు ఇవన్నీ దీనికి కారణం. గడిచిన దశాబ్ద కాలంలో జీన్స్ మార్కెట్ పరిమాణం మూడొంతులు పెరిగి రూ.21,993 కోట్లకు చేరుకుందని యూరో మానిటర్ అనే సంస్థ నివేదిక తెలియజేసింది. ముఖ్యంగా 2018లో ఈ మార్కెట్ 14 శాతం వృద్ధి చెందింది. 2009 తర్వాత ఒక ఏడాదిలో ఈ స్థాయి వృద్ధి నమోదు కావడం మళ్లీ ఇదే. గత కొన్నేళ్లుగా డెనిమ్ అమ్మకాలు ఏటా 9–11 శాతం స్థాయిలో పెరుగుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ బ్రాండ్లు అయిన జరా, హెచ్అండ్ఎం, జాక్ అండ్ జోన్స్, గ్యాప్ గత దశాబ్దంలో మార్కెట్ వృద్ధికి తోడ్పడ్డాయి. యువతే ప్రోత్సాహకం ‘‘మిలీనియల్స్ (1980–2000 మధ్య జన్మించిన వారు) కారణంగా పనిచేసే చోట సంస్కృతి మారిపోవడం, యువతకు డెనిమ్ ఏకరీతి వస్త్రధారణ కావడం ఈ సంస్కృతికి దారితీసింది. దీంతో ఇదొక మెగా ట్రెండ్‌గా మారింది’’ అని లెవిస్ ఇండియా ఎండీ సనీవ్ మొహంతి పేర్కొన్నారు. ఈ సంస్థ 2018–19లో అమ్మకాలను 25% పెంచుకుని రూ.1,104 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ‘‘ఫ్యాషన్ నుంచి డెనిమ్ ఎప్పటికీ బయటకు వెళ్లలేదు. ఇప్పుడు అవగాహన మరింత పెరిగింది. వేగంగా అమ్ముడుపోయే వాటికి బదులు విశ్వసనీయ బ్రాండ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు’’ ఫ్యూచర్ రిటైల్ జాయింట్ ఎండీ రాకేశ్ బియానీ పేర్కొన్నారు. ఫ్యూచర్ రిటైల్ దేశవ్యాప్తంగా తనకున్న రిటైల్ దుకాణాల పరిధిలో ఏటా కోటి వరకు జీన్స్‌ను విక్రయిస్తోంది. ఫార్మల్ వస్త్ర ధారణకు బదులు స్మార్ట్ క్యాజువల్స్ను ధరించే ధోరణి కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లలో గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతోందని ఈ రంగానికి చెందిన వారు చెబుతున్నారు. ముఖ్యంగా బోటమ్‌వేర్ (నడుము కింద ధరించే వస్త్రాలు) విషయంలో డెనిమ్కు బలమైన డిమాండ్ ఉన్నట్టు స్పైకర్ సీఈవో సంజయ్ వఖారియా తెలిపారు. ఎంపికలెన్నో... మోనోక్రోమ్ డెనిమ్, అథ్లీష్యూర్ డెనిమ్, ఫ్లేర్డ్ డెనిమ్, హైవెయిస్ట్ ఫిట్, క్యారట్ఫిట్ నుంచి గతంలో నడిచిన క్లాసిక్ క్యాలిఫోర్నియన్ ఫిట్, మైనింగ్ జీన్స్ వరకు... వినియోగదారులకు జీన్స్ విషయంలో విస్తృతమైన శ్రేణి అందుబాటులో ఉండడం వారికి సౌకర్యంగానూ, ఈ మార్కెట్ వృద్ధికి ఊతంగానూ ఉంటోంది. డెనిమ్స్కు సంబంధించి రంగులు, ఫిట్టింగ్, డిజైన్లు, కొత్త స్టయిల్స్ విషయంలో కంపెనీలు ఎన్నో ఆవిష్కరణలు తీసుకొస్తున్నట్టు లైఫ్‌స్టయిల్ ఇంటర్నేషనల్ ఎండీ వసంత్‌కుమార్ అన్నారు. ‘‘అప్పారెల్, లైఫ్‌స్టయిల్ విభాగంలో వినియోగం మందగించని విభాగాల్లో డెనిమ్ కూడా ఒకటి. ఈ ఏడాది కూడా దీనికి డిమాండ్ ఎక్కువగానే ఉంది’’ అని అరవింద్ లైఫ్ స్టయిల్ బ్రాండ్స్ సీఈవో జే సురేష్ పేర్కొన్నారు. ఇతర విభాగాల్లో అమ్మకాలు క్షీణించినప్పటికీ.. అన్ని బ్రాండ్లలోనూ డెనిమ్ వస్త్రాల అమ్మకాలు స్థిరంగా 10–15 శాతం మధ్య పెరుగుతున్నట్టు ఆయన చెప్పారు. -
టాప్ స్కర్ట్
చూస్తే రెగ్యులర్ టాప్‌కి భిన్నంధరిస్తే స్కర్ట్ టాప్ అయిన చందంపేరు ఫ్లెయిర్ పాంచో మరో పేరు ఫ్లెయిర్ కేప్.సమ్మర్‌కి సరైన స్టైలిష్ ఎంపికఈ స్కర్ట్ మోడల్ టాప్‌ని అటు జీన్స్ ఇటు స్కర్ట్ మీదకూ ధరించవచ్చు. సూపర్ స్టైలిష్ కితాబులు పొందవచ్చు. రెగ్యులర్ టాప్‌లతో బోర్ కొడితేగౌనులా ఉండే ఈ మోడల్ టాప్‌ని ఇప్పుడే ధరించవచ్చు. ►అందమైన ఎంబ్రాయిడరీ, ఫ్రంట్ అండ్ బ్యాక్ డార్జిలింగ్ లేస్‌లు, 3డి ఫ్లవర్స్, కుచ్చుల అంచులు.. కొత్త మోడల్లో ముస్తాబు అయిన ఈ నయా టాప్స్ అతివలను అమితంగా ఆకర్షిస్తున్నాయి. ►ఇవి నూటికి నూరు శాతం ఖాదీ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన టాప్స్. సమ్మర్‌కి కూల్ ఎఫెక్ట్‌ని ఇస్తాయి. ఈవెనింగ్ పార్టీకి కలర్‌ఫుల్ లుక్‌నిస్తాయి. -
ఇక ఆఫీస్‌కు నో జీన్స్-టీ షర్ట్
జైపూర్ : రాజస్థాన్ లేబర్ డిపార్ట్మెంట్ జారీ చేసిన సర్క్యులర్ ప్రస్తుతం వివాదస్పదంగా మారింది. ఇక మీదట ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చే సమయంలో జీన్స్, టీ షర్ట్ వంటి అభ్యంతరకరమైన దుస్తులు ధరించ కూడదని సర్క్యులర్‌లో పేర్కొంది. ఈ నెల 21న లేబర్ కమిషనర్ గిర్రియాజ్ సింగ్ కుష్వాహా ఈ సర్క్యులర్‌ను జారీ చేశారు. ఈ విషయం గురించి గిర్రియాజ్ ‘కొంతమంది ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చేటప్పుడు జీన్స్, టీ షర్ట్ లాంటి అభ్యంతరకర దుస్తులు ధరించి వస్తున్నారు. ఇలాంటి దుస్తులు ధరించి విధులకు హాజరవ్వడం అంటే వారు తమ ఉద్యోగానికి, ఆఫీస్‌కు మర్యాద ఇవ్వనట్లే. ఈ పరిస్థితిని మార్చడం కోసం ఈ నోటీస్‌ను జారీ చేయాల్సి వచ్చింది. ఇక మీదట ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చేటప్పుడు ప్యాంట్, షర్ట్ మాత్రమే ధరించే రావాలి’ అన్నారు. అయితే ఈ నోటీస్ గురించి ఇంతవరకూ ఉద్యోగుల నుంచి తనకు ఎటువంటి ఫీడ్‌బ్యాక్ అందలేదని తెలిపారు. ఈ విషయం గురించి ‘ఆల్ రాజస్థాన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్’ ప్రెసిడెంట్ గజేంద్ర సింగ్ మాట్లాడుతూ ఈ నోటీస్‌ను వ్యతిరేకిస్తున్నట్లు వెల్లడించారు. జీన్స్, టీ షర్ట్ ధరించడం అభ్యంతకరం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఇలాంటి సర్వీస్ రూల్స్ రాష్ట్రంలో ఎక్కడా లేవు. ఈ నోటీస్‌ను విత్‌డ్రా చేసుకోవాల్సిందిగా కమిషన్‌ను కోరాతామని చెప్పారు. -
పతంజలి జీన్స్ వచ్చేస్తున్నాయ్..
న్యూఢిల్లీ : ఎఫ్ఎంసీజీ మార్కెట్‌ను ఓ కుదుపు కుదిపేసిన అనంతరం పతంజలి ఆయుర్వేద్ సంస్థ వస్త్ర మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివరి వరకు ‘పరిధాన్’ పేరుతో క్లాతింగ్(వస్త్ర) బ్రాండ్‌ను లాంచ్ చేయనున్నట్టు పతంజలి ఎండీ, సహ వ్యవస్థాపకుడు ఆచార్య బాలకృష్ణ చెప్పారు. వస్త్రాలను ఇన్‌హౌజ్‌లోనే థర్డ్ పార్టీ ద్వారా తయారు చేయిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కొత్త వ్యాపారాల నిర్వహణ కోసం నోయిడాలో ఓ బృందాన్ని కూడా ఏర్పాటుచేసినట్లు చెప్పారు. వీటి కోసం ఎక్స్‌క్లూజివ్‌గా మెట్రో, నాన్-మెట్రో నగరాల్లో 100 స్టోర్లను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.పతంజలి పరిధాన్ బ్రాండ్ కింద పిల్లల దుస్తులు, యోగా దుస్తులు, స్పోర్ట్స్‌వేర్, టోపీలు, బూట్లు, టవల్స్, దుప్పట్లు, యాక్ససరీస్ వంటి 3000 రకాల వస్తువులను విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అంతకముందే యోగా గురువు బాబా రాందేవ్ వెల్లడించారు. వీటిలో ముఖ్యంగా స్వదేశీ జీన్స్ ఉండనున్నట్టు, భారతీయ సంప్రదాయాలకు అనుగుణంగా స్వదేశీ జీన్స్‌ను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘జీన్స్ అనేది వెస్టరన్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్‌తో మనం రెండింటిన్నీ అనుసరించవచ్చు. ఒకటి వారిని బాయ్‌కాట్ చేయడం లేదా వాటిని స్వీకరించడం. కానీ దేశీయ సమాజం నుంచి పూర్తిగా నిర్మూలించలేం ఎందుకంటే జీన్స్ చాలా పాపులర్ అయ్యాయి. దీంతో వెస్టరన్ మాదిరిగా కాకుండా.. పూర్తిగా స్వదేశీ సంప్రదాయాలకు అనుగుణంగా ఈ జీన్స్‌ను తయారుచేస్తున్నాం’ అని బాలకృష్ణ కూడా ఓ సందర్భంలో చెప్పారు. దీంతో ఈ జీన్స్ ఎలా ఉండబోతుందోనని వినియోగదారుల్లో ఆసక్తి మొదలైంది. మొత్తానికి ఏడాది చివర్లోనే ఈ జీన్స్ మార్కెట్లోకి రానున్నట్లు బాలకృష్ణ తాజాగా వెల్లడించారు. -
జీన్స్ తొడిగిన అమ్మాయిని ఎవరైనా పెళ్లాడతారా?
గోరఖ్‌పూర్ : బీజేపీకి చెందిన మరో కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్.. మహిళల వస్త్రధారణపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఇరుకునపడ్డారు. ‘జీన్స్ తొడుక్కొని పెళ్లిమండపంలోకి వచ్చే ఏ అమ్మాయినైనా అబ్బాయిలు పెళ్లాడతారా?’ అని విద్యార్థులను ప్రశ్నించారు. గోరఖ్‌పూర్ మఠానికి అనుబంధంగా నూతనంగా ఏర్పాటుచేసిన విద్యా సంస్థ శంకుస్థాపన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్యాంటు తొడిగినోడు మతగురువు అవుతాడా? కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి హోదాలో విద్యాసంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సత్యపాల్.. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘జీన్స్ ప్యాంటు వేసుకునే ఒకడొచ్చి ‘నేను మతగురువుగా ఉంటాను’ అంటే మనం అంగీకరిస్తామా? ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోం. అదేవిధంగా వధువు జీన్స్ ధరించి పెళ్లి మండపంలోకి వస్తే ఏ అబ్బాయైనా చచ్చినా ఆమెను పెండ్లి చేసుకోడు’ అని సింగ్ వ్యాఖ్యానించారు. అదే వేదికపై సీఎం యోగి.. కేంద్ర మంత్రి సత్యపాల్ సింగ్ ప్రసంగించిన వేదికపైనే యూపీ సీఎం యోగి ఆదిత్యానథ్ ఆసీనులై ఉండటం గమనార్హం. యోగి.. ప్రధాన అర్చకుడిగా ఉన్న గోరఖ్‌పూర్ మఠానికి అనుబంధంగా నడిచే మహారాణా ప్రతాప్ శిక్షా పరిషత్(ఎంపీఎస్పీ) విద్యాలయం శంకుస్థాపన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
నమ్మండి.. కొత్త ట్రెండ్ ఇదేనండీ!
టోక్యో : ‘అన్నవస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయాయట’ అన్న చందంగా పాపులారిటీ కోసం పాకులాడి ఉన్న పేరు కూడా ఖరాబ్ చేసుకున్నడు డిజైనర్ మెయికో బాన్. ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకునే ఫ్యాషన్ ఇండస్ట్రీకి తానేంటో చూపిద్దామని ఆయన చేసిన ప్రయత్నం తీవ్ర విమర్శలపాలైంది. ‘తొంగ్ జీన్స్’ పేరుతో బాన్ రూపొందించిన ఈ దుస్తుల్ని ఇటీవల టోక్యోలో జరిగిన అమెజాన్ ఫ్యాషన్ వీక్‌లో ప్రదర్శించారు. ఫస్ట్‌లుక్‌లోనే చూపరులకు కిరాక్ పుట్టించింది తొంగ్ జీన్స్. అటు సోషల్ మీడియాలోనూ దీనిపైనే చర్చ. ‘తొంగ్ జీన్స్.. డెనిమ్ పరువును మంటగలిపింది’ అని ఒకరు, ‘నమ్మండి.. ఇప్పుడిదే కొత్త ట్రెండ్.. అన్న వార్త చూసిన వెంటనే ఫోన్‌ను తగలబెట్టి, ఆఫ్రికా బయలుదేరా’ అని మరొకరు, ‘దేవుడి దయ.. ఇలాంటి జీన్స్ వేసుకునే అదృష్టం నాకు లేదు’ అని ఇంకొకరు.. ఇలా వందలమంది తొంగ్ జీన్స్‌పై చలోక్తులు విసురుతున్నారు. కాగా, డిజైనర్ బాన్ మాత్రం ‘ఫ్యాషన్ ఇండస్ట్రీకి ఏం కావాలో నేను అదే ఇచ్చాను’ అని గర్వంగా చెప్పుకుంటున్నారు! -
ఫ్యామిలీ ఫ్యామిలీ జీన్స్‌లోనే...
‘‘అదిరేటి డ్రెస్ మేవేస్తే.. బెదిరేటి లుక్కు మీరేస్తే... దడ’ అనే ‘భారతీయుడు’ సినిమాలోని సాంగ్ గుర్తుందా..? నేటి ట్రెండ్‌కి ఆ సాంగ్ సరిగ్గా సూటైపోతుంది కదూ..! వేసిన డ్రెస్ అదిరిపోయేలా ఉంటే... చూసేవాళ్ల చూపులు బెదరక ఏంచేస్తాయి.? మోడల్ అంటే జీన్స్.. జీన్స్ అంటే మోడల్ అన్నట్లుగా సాగిపోతోంది నేటి యువత. ‘నీట్‌గా, టైట్‌గా.. నాలుగు గొలుసులు వేలాడేసుకుని... రెండు చిరుగులు ఉన్న జీన్స్ వేసుకుంటే ఆ లుక్కే వేరు బాసూ! అంటున్నారు ట్రెండ్ సెటర్స్. నిజమే ఆ లుక్కే వేరు. ఒక్క జీన్స్‌తో పోష్ లుక్. పాపులర్ లుక్ రెండూ వచ్చేస్తాయి. అమ్మాయికైనా, అబ్బాయికైనా అతికినట్లు సూటయ్యే జీన్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా చాలా క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. అందుకే కొందరు ఫ్యాషన్ ట్రెండాభిమానులు ఫ్యామిలీ ఫ్యామిలీనే జీన్స్‌లో తళుకుమంటున్నారు. ట్రెండ్ ఫాలోవర్స్ మనసుని ఇంతగా దోచుకున్న జీన్స్‌కు కూడా ఓ రోజుందని మీకు తెలుసా? దాని వెనుకు ఉన్న కథా కమామీషు తెలుసుకుందామా? సేఫ్టీ జీన్స్ అమ్మాయిలు జీన్స్ వేస్తే... ఆడిపోసుకునే ఛాందసులకు, అహంభావులకు ఇప్పుడు చెప్పబోయే విషయం మింగుడు పడకపోవచ్చు. కానీ, ఇది నిజం. అసలు డెనిమ్(జీన్స్) డే ఎందుకు వచ్చిందంటే... రోమ్‌లో 1992లో జరిగిన ఓ అత్యాచార ఆరోపణ కేసులో అమ్మాయి ధరించిన టైట్ జీన్స్ కారణంగానే ఆమె రక్షించబడిందని తేలింది. దీంతో అమ్మాయిలంతా తమను తాము రక్షించుకోవడానికి టైట్ జీన్స్లనే వాడేవారు. అలా ఏప్రిల్ 26 జీన్స్ డేగా ప్రపంచదేశాల అమ్మాయిలు ఎంతో అనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు. రక్షణ కోసం రూపొందిన టైట్ జీన్స్ రానురానూ రంగులద్దుకుని లేటెస్ట్ ట్రెండ్‌ను సృష్టిస్తోంది. కంఫర్ట్ కాస్తా కామన్‌గా... ఇక జీన్స్ కథను తిరగేస్తే... 16 శాతబ్దంలో ఫ్రాన్స్, ఇటలీ దేశాల్లో నావికులు తమ పనులకు అనువైన డ్రెస్‌గా జీన్స్‌ను ఎంచుకునేవారట. తరువాత 1873 సమయంలో నెవాడాలోని జాకబ్ డేవిస్ అనే ఓ దర్జీ.. లెవీ స్ట్రాస్ అనే వ్యాపారితో కలిసి డెనిమ్ జీన్స్‌ను మార్కెట్లోకి విరివిగా తెచ్చాడు. దాంతో అప్పటి పిల్లలు, రైతులు, మెకానిక్స్ అంతా జీన్స్ వేసుకోవడానికే ఎక్కువ మక్కువ చూపేవారు. కాలక్రమేణా రంగులు, మెరుపులు, పూసలు, లేసులు కలుపుకొని మోడల్ ట్రెండ్‌లో జీన్స్ ఓ వెలుగు వెలుగుతోంది. కేవలం ప్యాంట్ మాత్రమే కాకుండా అదే క్లాత్‌తో టాప్స్, కోట్స్ కూడా మార్కెట్లో హల్ చల్ చేస్తున్నాయి. జిల్ జిల్ మెగ జీన్ ప్రతీ ఏటా 45 కోట్ల జీన్స్ అమెరికా నుంచి ప్రపంచానికి ఎగుమతి అవుతున్నాయి. 50 శాతం జీన్స్ ప్రత్యేకంగా చైనా, ఇండియా, బంగ్లాదేశ్‌ల కోసమే తయారవు తున్నాయి. సుమారు 80 కిలోల పత్తితో 225 జతల జీన్స్ తయారు చేయవచ్చు. నిజానికి రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా సైనికులు ‘బ్లూ కలర్ జీన్స్’నే వేసుకునే యుద్ధం చేశారు. ఆ సమయంలోనే తొలిసారిగా మిగిలిన ప్రపంచానికి బ్లూ కలర్ జీన్స్ పరిచయమైంది. లెగ్గింగ్స్ దెబ్బతగిలి... జీన్స్‌కు యూత్‌లో ఎంత క్రేజ్ ఉన్నా.. పోటీ మాత్రం తప్పలేదు. ట్రెండ్‌కు తగ్గట్టుగా యువత మనసును దోచుకున్న లెగ్గింగ్స్ జీన్స్‌ను కాస్త వెనక్కి తోశాయనే చెప్పాలి. విపరీతంగా జీన్స్ వాడే అమ్మాయిలు... రూట్ మార్చి లెగ్గింగ్స్ కొనుగోళ్లపై ఆసక్తి చూపడంతో 2013–14 సమయంలో జీన్స్ క్రేజ్ కొంత తగ్గింది. ఇదంతా ఫ్యాషన్ ట్రెండ్‌లో జీన్స్‌కు తాత్కాలిక విరామం మాత్రమే. కొత్త హంగులతో జీన్స్ మళ్లీ పుంజుకుని సత్తా చాటుకుంటున్నాయి. -
యూపీ కాలేజీల్లో జీన్స్, టీ–షర్ట్‌లకు నో!
-
యూపీ కాలేజీల్లో జీన్స్, టీ–షర్ట్‌లకు నో!
-
యూపీ కాలేజీల్లో జీన్స్, టీ–షర్ట్‌లకు నో!
లక్నో: ప్రభుత్వ విభాగాలను ప్రక్షాళన చేస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దూసుకుపోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు తదితర చోట్ల పాన్ మసాలా, గుట్కాలను నమలడం, పొగతాగడాన్ని యోగి నిషేధించడం తెలిసిందే. తాజాగా ప్రభుత్వ, ప్రభుత్వ సాయంతో నడిచే కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులు, ఇతర సిబ్బంది.. జీన్స్, టీ–షర్ట్లు వేసుకుని విధులకు హాజరవ్వరాదంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది వస్త్రధారణ పద్ధతిగా, విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలని ప్రభుత్వం పేర్కొంది. విద్యార్థులకు ఎలాగూ యూనిఫాం ఉంటుందనీ, ఉపాధ్యాయుల వస్త్రధారణ కూడా పద్ధతిగా ఉంటే, విద్యార్థులు వారిని అనుసరిస్తారని ఉన్నత విద్యా శాఖ అధికారి ఒకరు పేర్కొన్నారు. -
జీన్స్, టీషర్ట్స్‌తో రావొద్దు.. మొబైల్ వాడొద్దు
⇔ టీచర్లకు లక్నో డీఈవో ఆదేశాలు లక్నో: విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులు పిల్లలకు ఆదర్శంగా నిలవాలని, ఆహార్యంలో మరింత హుందాగా ఉండాలని ఉత్తరప్రదేశ్‌లోని లక్నో జిల్లా విద్యాధికారి టీచర్లకు సూచించారు. టీచర్లెవరూ ఇకపై టీషర్ట్లు, జీన్స్ ప్యాంట్లు ధరించి పాఠశాలకు రావొద్దని ఆదేశించారు. ‘వృత్తి గౌరవం పెంచేలా ఉపాధ్యాయుల వస్త్రధారణ ఉండాలి.. అందుకే అటువంటి దుస్తులను ధరించి పాఠశాలలకు రావొద్దు' అంటూ ఆదేశాల్లో పేర్కొన్నారు. దీనిపై ఉన్నతాధికారులతో తాను మాట్లాడతానని చెప్పారు. అంతేకాకుండా పనివేళల్లో మొబైల్ ఫోన్స్ వినియోగించడం మంచిది కాదని, పాఠశాల ఆవరణ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, అన్ని పాఠశాలలో తప్పనిసరిగా ఉదయం పూట ప్రార్థన జరిగేలా చూడాలని పేర్కొన్నారు. పాఠశాలలకు సమీపంలో పాన్‌మసాలా, సిగరెట్లు విక్రయించే దుకాణాలు కనిపిస్తే వెంటనే వాటిని మూసివేయించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు పాఠశాలలకు జీన్సు ధరించి రావొద్దంటూ గతేడాది హరియాణా ప్రభుత్వం కోరిన సంగతి తెలిసిందే. -
జీన్స్... లుక్ మార్చేద్దాం
న్యూలుక్ సౌకర్యంతో పాటు స్టైలిష్ లుక్ తెచ్చే జీన్స్, జెగ్గింగ్స్ని నేటి యువత బాగా ఇష్టపడుతుంది. వీటిలో షార్ట్స్, మోకాళ్ల కిందవరకు ఉండే త్రీ బై ఫోర్త్, మడమల దాకా ఉండే ప్యాంట్స్... రకరకాల మోడల్స్ లభిస్తున్నాయి. అయితే, రంగు మాత్రం ఒకే విధంగా ఉంటుంది. ఈ ప్లెయిన్ జీన్స్ లుక్ మార్చేయాలంటే... ►వివిధ రకాల డిజైన్లలో కాటన్ బార్డర్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. లేదంటే వాడని చీరలు, దుపట్టాల అంచులను ఈ డిజైన్స్‌కి వాడచ్చు. ఫొటోలో చూపిన విధంగా జీన్స్ ప్యాంట్ బాటమ్‌కి (రెండు కాళ్లకి) ఈ బార్డర్ని జత చేస్తే చాలు. ►ఇందుకు పూర్తి కాంట్రాస్ట్ కలర్ ఉన్న డిజైన్స్ ఎంచుకుంటే బాగుంటుంది. ►ప్యాంట్ కాలుకి ఒక వైపు మాత్రమే ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన ప్యాచ్ జత చేసినా సరే లుక్ పూర్తిగా మారిపోతుంది. ►ప్యాంట్ కింది భాగంలో జత చేసిన అంచు భాగానికి దారాలతో అల్లిన కుచ్చులను కూడా కుట్టవచ్చు. ఇది మరో ప్రధాన ఆకర్షణగా మారిపోతుంది. ►అంచుభాగంలో మరో క్లాత్‌కు బదులుగా కాంట్రాస్ట్ రంగులతో ఇలా ఫ్యాబ్రిక్ పెయింట్ వేసినా చూడముచ్చటగానూ, స్టైలిష్‌గా ఉంటుంది. -
ఆ కాలేజీలో జీన్స్, లెగ్గిన్స్ నిషేధం!
కేరళ : తిరువనంతపురంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో బాలికల డ్రస్ కోడ్‌పై ప్రత్యేక ఆదేశాలు జారీఅయ్యాయి. జీన్స్, లెగ్గిన్స్, ఇతర శబ్దాలు చేసే ఆభరణాలు ధరించి విద్యార్థులు కాలేజీకి రావడానికి వీల్లేదని, డ్రస్ కోడ్‌లో భాగంగా వాటిని నిషేధిస్తున్నట్టు పేర్కొంది. కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ గురువారం ఈ సర్క్యూలర్‌ను జారీచేశారు. రెగ్యులర్ అటెండెన్స్, ఫైనల్ ఇంటర్నెల్ మార్కులపై నిబంధనలు జారీచేసిన ఆయన, డ్రస్ కోడ్‌పై కూడా ఆదేశాలు విద్యార్థులకు పంపారు. ఈ సర్క్యూలర్ల్లో అబ్బాయిలు, అమ్మాయిలు కాలేజీలో చేసివి, చేయకూడని విషయాలను పేర్కొన్నారు. కాలేజీకి వచ్చే ముందు కచ్చితంగా ఫార్మల్ డ్రస్ వేసుకుని రావాలని వైస్ ప్రిన్సిపాల్ ఆదేశించారు. అబ్బాయిలు చక్కగా, శుభ్రమైన దుస్తులు ధరించాలని, ఫార్మల్ డ్రస్, షూతో కనిపించాలని వైస్ ప్రిన్సిపాల్ ఈ సర్క్యూలర్‌లో తెలిపారు. ఇక అమ్మాయిల విషయానికి వస్తే చుడీదార్ లేదా చీరలోనే కాలేజీకి రావాలని చెప్పారు. జడలను కూడా వదులుగా కాకుండా, గట్టిగా కట్టుకుని రావాలని పేర్కొన్నారు. అయితే కేరళలో మొదటిసారేమీ డ్రస్ కోడ్‌పై ఇలాంటి ఆదేశాలు జారీ కాలేదు. ఈ ఏడాది మొదట్లో కోజికోడ్‌లోని ఓ కాలేజీ కూడా అమ్మాయిలు కాలేజీకి జీన్స్ వేసుకోని రాకూడదని ఆదేశించింది. మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలపై డ్రస్ కోడ్లపై వస్తున్న ఆదేశాలపై అమ్మాయిలు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. చీరలను హ్యాండిల్ చేయడం కొంచెం కష్టతరమని, ఎగ్జామ్స్, ప్రాక్టికల్స్ సమయాల్లో ముఖ్యంగా దుప్పటాతో ఇబ్బంది పడాల్సి వస్తుందంటున్నారు. -
మగవాళ్లు, మహిళల చెల్లింపుల్లో మరీ ఇంత తేడానా?
లండన్: ప్రపంచ క్రీడారంగంలో అత్యంత ఎక్కువ సంపాదన కలిగిన వ్యక్తి ప్రముఖ అథ్లెట్ క్రిస్టినో రొనాల్డో కాగా, మహిళల్లో ఫుట్‌బాల్ ప్లేయర్ అలెక్స్ మోర్గాన్. ఎండార్స్మెంట్లు, స్పాన్సర్‌షిప్‌లు, క్రీడారంగం చెల్లింపుల ద్వారా రొనాల్డో ఆదాయం ఏడాదికి 880 లక్షల డాలర్లు కాగా, అలెక్స్ మోర్గాన్‌కు వచ్చేది ఏడాదికి కేవలం 28 లక్షల డాలర్లు మాత్రమే. క్రీడారంగంలో మహిళలు, మగవాళ్ల మధ్య ఆర్థిక వ్యత్యాసం ఎంతో ఉందనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. 14,500 కోట్ల డాలర్ల విలువైన ప్రపంచ క్రీడారంగం నిర్వహణలో మగవాళ్ల ఆధిపత్యం కొనసాగడం ఇందుకు ముఖ్యకారణంకాగా, క్రీడారంగంలో ప్రైవేటు భాగస్వామ్యం, మహిళా క్రీడల పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి తక్కువగా ఉండడం ఇతర కారణాలని యుకే, ఆస్ట్రేలియాకు చెందిన ‘విమెన్ ఆన్ బోర్డ్స్’ అనే గ్రూప్ ఓ నివేదికలో వెల్లడించింది. ప్రధానంగా బాస్కెట్‌బాల్, క్రెకెట్, గోల్ఫ్, ఫుట్‌బాల్ క్రీడల్లో చెల్లింపుల మధ్య మహిళలు, మగవారి మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉందని ఆ నివేదిక తెలిపింది. ప్రపంచ కప్ ప్రైజ్ మనీ విషయంలో కూడా ఇద్దరి మధ్య ఎంతో వ్యత్యాసం కొనసాగుతోంది. 2014లో జరిగిన ఫిఫా మెన్స్ వరల్డ్‌కప్‌కు ప్రైజ్ మనీని 57.60 కోట్ల డాలర్లుగా నిర్ణయించగా, అదే 2015లో జరిగిన ఫిఫా విమెన్స్ వరల్డ్‌కప్ ప్రైజ్ మనీని 1.50 కోట్ల డాలర్లుగా నిర్ణయించారు. ప్రపంచవ్యాప్తంగా క్రీడల నిర్వహణ బోర్డు లేదా సంస్థల్లో మహిళల ప్రాతినిధ్యం బాగా తక్కువగా ఉండడం, మగవాళ్ల ఆదిపత్యం ఎక్కువగా ఉండడమే ప్రధాన కారణమని నివేదిక అభిప్రాయపడింది. రియో డీ జెనీరోలో జరిగిన ఇటీవలి ఒలింపిక్స్‌కు ముందున్న లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్ గవర్నింగ్ బాడీల్లో మహిళల ప్రాతినిధ్యం 30 శాతంకన్నా తక్కువగా ఉంది. ‘ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఎగ్జిక్యూటివ్ బోర్డు’లో మొత్తం 15 మంది సభ్యులుండగా నలుగురు మహిళలు ఉన్నారు. ఈ ఎగ్జిక్యూటివ్ బోర్డు చరిత్రలోనే మొదటిసారిగా 2013లో నలుగురు మహిళలను తీసుకోగా, మూడేళ్లు గడిచినా వారి సంఖ్య పెరగలేదు. ప్రపంచవ్యాప్తంగా 28 అంతర్జాతీయ క్రీడా సమాఖ్యల్లో 18 శాతం మాత్రమే మహిళలు ఉండగా, 129 జాతీయ ఒలింపిక్ కమీటీల్లో 16.6 శాతం మహిళలు మాత్రమే ఉన్నారు. కనీసం వీటిల్లో 20 శాతం మహిళలకు ప్రాతినిధ్యం ఉండాలని 2005లోనే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్దేశించింది. మాలవి, ఆస్ట్రేలియా, బెర్ముడా, నార్వే, న్యూజిలాండ్, కిరిబతి, సమోవా, టువాలు దేశాల ఒలింపిక్ బోర్డులు, కమిటీల్లో 40 శాతం కన్నా ఎక్కువగా మహిళలు ఉన్నారు. ఆ తర్వాత అమెరికాలో 31.3 శాతం, బ్రిటన్‌లో 26.7 శాతం మహిళలు ఉన్నారు. ఒక్క టెన్నీస్ క్రీడా కమిటీల్లోనే మహిళ భాగస్వామ్యం 2014 నుంచి పెరుగుతూ వస్తోంది. ప్రపంచ క్రీడారంగంలో మహిళలు, మగవాళ్ల మధ్యనున్న ఆర్థిక చెల్లింపుల వ్యత్యాసం, క మిటీల ప్రాతినిథ్యంలోవున్న వ్యత్యాసాన్ని ఓ పద్ధతి ప్రకారం తొలగించేందుకు కృషి చేయాలని కమిటీ ప్రపంచదేశాలకు ఆ నివేదికలో పిలుపునిచ్చింది. -
ఆరోగ్యకరమైన జీవనశైలితో హార్ట్ ఎటాక్‌లకు చెక్!
కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 21 ఏళ్లు. డిగ్రీ పూర్తి చేసి ఈమధ్యే కొత్తగా మార్కెటింగ్ ఉద్యోగంలో చేరాను. గత కొన్ని రోజుల నుంచి నన్ను ఒక అంశం అస్తమానం కలచివేస్తోంది. రెండు నెలల క్రితం మా నాన్నగారు తీవ్రమైన గుండెపోటుతో మృతిచెందారు. నా చిన్నప్పుడు మా తాతగారు కూడా ఇలాగే హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయారు. ఇలా వీళ్లిద్దరూ ఒకే కారణంతో చనిపోవడంతో నాలో కాస్త భయం చోటుచేసుకుంది. షుగర్, బీపీ, హార్ట్ ఎటాక్ లాంటి వ్యాధులకు హెరిడిటీ (వంశపారంపర్యంగా రావడం) ఒక కారణమంటారు. నాకు భవిష్యత్తులో గుండెపోటు వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ ఉంటే దయచేసి దాని నివారణకు సంబంధించిన సలహాలు, సూచనలు ఇవ్వగలరు. - కౌశిక్, హైదరాబాద్ గుండెపోటుకు అనేక కారణాలున్నాయి. అందులో హెరిడిటీ లేదా జీన్స్ కూడా ఒక కారణమని చెప్పవచ్చు. కానీ అదొక్కటే కారణం కాదు. మీరు సరైన ఆరోగ్యకరమైన జీవనశైలి ఏర్పరచుకోవడం ద్వారా మీ గుండెకు సంపూర్ణ రక్షణ ఇవ్వవచ్చు. సాధారణంగా గుండెకు రక్తసరఫరా నిలిచిపోయినప్పుడు గుండెపోటు వస్తుంది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో (ధమనుల్లో) కొవ్వు, కొలెస్ట్రాల్ తదితర పదార్థాలు పేరుకుపోయి రక్తసరఫరా మార్గం క్రమేపీ మూసుకుపోతుంది. దీనివల్ల రక్తసరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడి శరీరానికి ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని అందించడంలో గుండె విఫలమవుతుంది. రక్తంలో ఎల్డీఎల్, హై బ్లడ్‌ప్రెషర్, రక్తంలో పరిమితికి మించిన చక్కెర శాతం లాంటివి హానికరమైన కొవ్వు పదార్థాలు. ఇవి ప్రమాదకరస్థాయికి చేరితే గుండెపోటు వస్తుంది. అలాగే జీవనశైలిలో మార్పులు, కూర్చున్నచోట నుంచి కదలని ఉద్యోగం, వ్యాయామం లేకపోవడం, ఊబకాయం, పొగతాగడం, మద్యం అలవాటు, జంక్ఫుడ్స్, మానసిక ఒత్తిడి లాంటి అలవాట్ల వల్ల రక్తనాళాలు మూసుకుపోయి గుండెకు చేటు వాటిల్లుతుంది. మీరు అనుకుంటున్నట్లుగా హెరిడిటీ, జీన్స్ కంటే కూడా హానికరమైన అలవాట్ల వల్ల ఎక్కువ శాతం గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. ఒకవేళ మీరు పైన చెప్పిన అలవాట్లు కలిగి ఉంటే హెరిడిటీ, జీన్స్‌తో సంబంధం లేకుండా కూడా గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉంది. మీరు ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడం వల్ల హార్ట్ ఎటాక్‌ను నివారించవచ్చు. ముఖ్యంగా షుగర్, హైబీపీ, కొలెస్ట్రాల్‌తో జాగ్రత్తగా ఉండాలి. వీటిబారిన పడకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. రోజులో కనీసం అరగంట పాటు వాకింగ్ చేయడం, తాజా పండ్లు, కూరగాయలతో కూడిన సంపూర్ణ ఆహారం తీసుకోవడం వంటివి చేయాలి. దురలవాట్లకు దూరంగా ఉండటంతో పాటు అవసరాన్ని బట్టి, డాక్టర్ సూచనలను బట్టి తగిన వ్యవధిలో షుగర్, బీపీ, కొలెస్ట్రాల్‌కు సంబంధించిన టెస్ట్‌లు చేయించుకొని వ్యాయామం చేయడం మేలు. మీరు ఎలాంటి టెన్షన్లూ పెట్టుకోకుండా ఈ సూచనలు, సలహాలు పాటిస్తే కచ్చితంగా ఎలాంటి ఆరోగ్యకరమైన ఇబ్బందులూ రావు. డాక్టర్ రవికాంత్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, యశోద హాస్పిటల్, సోమాజిగూడ, హైదరాబాద్ ఐబీఎస్ అంటే..? హోమియో కౌన్సెలింగ్ నా వయసు 29 ఏళ్లు. అప్పుడప్పుడూ తిన్న వెంటనే కడుపు ఉబ్బినట్లుగా ఉండి తేన్పులు వచ్చి, మల విసర్జనకు వెళ్లవలసి వస్తోంది. ఈ సమయంలో నొప్పి కూడా ఉంటోంది. డాక్టర్‌ను సంప్రతిస్తే అన్ని పరీక్షలు చేసి, ఎలాంటి సమస్యలూ లేవని చెప్పారు. దీని గురించి నాకు సరైన అవగాహన లేదు. దయచేసి నాకు హోమియోలో శాశ్వత పరిష్కారం చెప్పగలరు. - నరేశ్‌కుమార్, అమలాపురం ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్) అనేది జీర్ణమండలానికి సంబంధించిన వ్యాధి. మనం ఆహారం తీసుకున్న తర్వాత అది నోరు, జీర్ణాశయం, చిన్నపేగు, పెద్దపేగు ద్వారా ప్రయాణం చేస్తుంది. ఈ ప్రక్రియలో పచన క్రియ (ఆహారాన్ని జీర్ణం చేయడం) చివరలో మల విసర్జన క్రియ జరుగుతుంది. మనం భోజనం చేసిన తర్వాత ఆహారం జీర్ణాశయం వదిలి పేగుల్లోకి వెళ్లడానికి సుమారు ఆరు గంటల సమయం పడుతుంది. ఆహారం పేగుల్లోకి ప్రయాణం చేస్తున్నప్పుడు పేగుల కదలికల్లో తేడా వస్తే రకరకాల సమస్యలు తలెత్తుతాయి. వాటిల్లో ఐబీఎస్ చాలా సాధారణమైన సమస్య. కారణాలు : ఈ సమస్యకు కచ్చితమైన కారణం అంటూ ఏమీ లేదు. కానీ అంతర్గత, బాహ్య అంశాల ప్రేరణ వల్ల పేగుల కదిలికలలో తేడాలు రావడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. చిన్నపేగు, పెద్ద పేగు కదలికలను చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి. వాటిల్లో ముఖ్యమైనవి మానసిక ఒత్తిడి, మాదక ద్రవ్యాలు ఎక్కువగా తీసుకోవడం, ఆహారంలోని లోటుపాట్లు, హార్మోన్ల అసమతుల్యత, అస్తవ్యస్తమైన ఆహారపు అలవాట్లు. లక్షణాలు : పేగుల కదలికలను బట్టి లక్షణాలు కనిపిస్తాయి. పేగుల కదలికలు త్వరత్వరగా జరిగితే విరేచనాలు అవుతాయి కదలికలు నెమ్మదిగా ఉంటే మలబద్దకం ఉంటుంది ఒక్కోసారి ఈ కదలికలకు నొప్పి కూడా కలుగుతుంది ఎక్కువ ఆందోళన పడినప్పుడు కూడా విరేచనాలు కలగవచ్చు ఐబీఎస్ లక్షణాలైన మలబద్దకం, అతిసారం, నొప్పి ఎప్పుడూ ఉండవు. కానీ వస్తూపోతూ ఉంటాయి. కొందరిలో ఇవే కాకుండా పొట్ట ఉబ్బడం కూడా కనిపిస్తుంటుంది. ఈ లక్షణాలు మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఆలోచనలను బట్టి వ్యక్తి వ్యక్తికీ మారుతూ ఉంటాయి. నిర్ధారణ: ఐబీఎస్ ఉన్న వ్యక్తులకు రక్తం, మలం వంటివి పరీక్షించినా సాధారణంగా ఏ దోషాలూ కనిపించవు. అంతేకాకుండా పేగులలో కూడా ఎలాంటి తేడా కనిపించదు. పేగుల కదలికల్లో మాత్రమే తేడా కనిపిస్తుంది. అందువల్ల ఈ ఐబీఎస్‌కు చికిత్స చేయడంలో రోగి మానసిక, శారీరక లక్షణాలనూ, వారి జీవనశైలి, ఆహారపుటలవాట్లు, ఆలోచనలను పరిగణనలోకి తీసుకుంటారు. రకాలు : ముఖ్యంగా ఈ ఐబీఎస్ రెండు రకాలుగా ఉంటుంది. కొందరిలో విరేచనాలు ఎక్కువగా కావడం గానీ లేదా మలబద్దకంతో ఉండి, మలంలో జిగురు కనిపిస్తుంది. మెలిపెట్టినట్లుగా కడుపు నొప్పి ఉండి తేన్పులు, కడుపు ఉబ్బరం, వికారం, తలనొప్పి వంటివి కనిపిస్తాయి. కొందరిలో విరేచనాలు, మలబద్దకం ఉంటాయి గానీ నొప్పి ఉండదు. కొందరిలో నిద్ర లేచిన వెంటనే, భోజనం చేసిన వెంటనే మలవిసర్జన అవుతుంది. కానీ తేన్పులు, నొప్పి, కడుపు ఉబ్బరం వంటివి కనిపించవు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు : ఎక్కువ పీచు పదార్థం ఉన్న ఆహారం తీసుకోవాలి. పొగతాగడం, మాదక ద్రవ్యాల వాడకానికి దూరంగా ఉండాలి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి వ్యాయామం చేయాలి మంచి ఆహారపు అలవాట్లను పాటించాలి జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. చికిత్స : హోమియోలో కాన్స్టిట్యూషన్ థెరపీ ద్వారా వ్యక్తి రోగ లక్షణాలను, మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. దీని ద్వారా రోగ లక్షణాలను, వ్యాధి తీవ్రతను తగ్గిస్తూ పూర్తిగా తగ్గించడం జరుగుతుంది. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి సీనియర్ డాక్టర్, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
లూప్డ్ ట్విస్ట్ పోనీ
సిగ సింగారం దీన్ని లూప్డ్ ట్విస్ట్ పోనీ అంటారు. ఈ హెయిర్ స్టయిల్ చాలా సింపుల్‌గా ఉంటుంది. ఇది అన్ని రకాల డ్రెస్సుల మీదకు నప్పుతుంది. ముఖ్యంగా జీన్స్, స్కర్ట్స్, పంజాబీ డ్రెస్సులకు బాగా సూట్ అవుతుంది. ఈ రకం పోనీని వేసుకోవడానికి జుత్తు మరీ ఒత్తుగా ఉండాల్సిన అవసరం లేదు. మరో విశేషం ఏమిటంటే.. ఈ హెయిర్ స్టయిల్‌ను నూనె పెట్టిన జుత్తుతో కూడా వేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ లూప్డ్ ట్విస్ట్ పోనీని మీరూ ట్రై చేయండి. ఎలా అంటే... 1. ముందుగా జుత్తునంతటినీ ఎడమ చెవి వైపుకు తీసుకొచ్చి, చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. 2. ఇప్పుడు ఆ జుత్తుకు రబ్బర్ బ్యాండ్ పెట్టి పోనీ వేసుకోవాలి. 3. తర్వాత బ్యాండ్పైన జుత్తును ఫొటోలో కనిపిస్తున్న విధంగా చేతి వేళ్లతో దూరం చేయాలి. 4. పోనీని ఇప్పుడు అందులోంచి పై నుంచి కిందకు తీయాలి. 5. కింద భాగంలో మిగిలిన జుత్తును చిక్కులు లేకుండా మళ్లీ దువ్వుకోవాలి. కావాలంటే హెయిర్ స్ప్రే చేసుకోవచ్చు. 6. ఫొటోలో కనిపిస్తున్న విధంగా బ్యాండ్ పైన జుత్తును మెల్లిగా కదిలిస్తూ, వదులు చేసుకోవాలి. 7. తర్వాత ఫస్ట్ లూప్‌కు కాస్త కింది భాగంలో మరో బ్యాండ్ పెట్టి, స్టెప్ 3ను రిపీట్ చేయాలి. 8. ఇప్పుడు మిగిలిన పోనీని స్టెప్ 4 లాగే బ్యాండ్ పైన జుత్తులోంచి పై నుంచి కిందకు తీయాలి. తర్వాత ఆ లూప్‌ను కూడా వదులు చేసుకోవాలి. 9. అలా మీ జుత్తు పొడవును బట్టి లూప్స్‌ను వేసుకుంటూ పోవాలి. చివరగా కాస్త జుత్తును వదిలేసి బ్యాండు పెట్టుకోవాలి. కావాలంటే ఈ హెయిర్ స్టయిల్ కుడివైపు కూడా వేసుకోవచ్చు. -
ఇంటికి - ఒంటికి
గులాబి పువ్వై... గులాబి పూలను ఇష్టపడని వారెవరుంటారు చెప్పండి. చాలామందికి వాటిని తల్లో పెట్టుకోవడం కన్నా.. వాటిని చూస్తూ ఉండటమే ఇష్టం.. అందుకే ఇంట్లో ప్లవర్ వాజుల్లో వాటిని పెట్టుకుంటారు. కానీ ఒరిజినల్ పూలు ఒక్కరోజుకు మించి తాజాగా ఉండవు. కాబట్టి ప్లాస్టిక్ లేదా పేపర్ గులాబీలతో అడ్జస్ట్ కాక తప్పదు. అలాంటి పేపర్ గులాబీలను ఇకపై షాపుల్లోంచి కొనుక్కురాకుండా ఇంట్లోనే తయారు చేసుకుందాం.. ఇందులో ఇంకో సౌలభ్యం కూడా ఉంది. బయట దొరికే ఒరిజినల్ గులాబీలో లేని రంగులనూ మీ పేపర్ గులాబీల్లో చూసుకోవచ్చు. వీటి తయారీని చూద్దాం. కావలసినవి: రంగురంగుల పేపర్లు, పెన్, కత్తెర, గ్లూ, స్టిక్స్ తయారీ: ముందుగా మీకు నచ్చిన రంగుకాగితంపై ఫొటోలో కనిపిస్తున్న విధంగా సర్కిల్స్ గీసుకోవాలి. ఎన్ని సైజుల్లో కావాలంటే అన్ని సర్కిల్స్ గీసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని కత్తెర సాయంతో స్ప్రింగ్స్‌లా కట్ చేసుకోవాలి. ఎన్ని గులాబీలు కావాలనుకుంటే అన్ని కాగితాలను ఒకదానిపై ఒకటి లేయర్స్‌గా పెట్టుకోవాలి. ఇప్పుడు విడిగా ఒక్కో స్ప్రింగ్ పేపర్‌ను తీసుకొని రోల్ చేసుకుంటూ పోవాలి. అది గులాబి షేప్‌లోకి రాగానే.. వాటి కింది భాగంలో ఓ స్టిక్ పెట్టి, గ్లూతో అతికించాలి. తర్వాత ఈ గులాబీలను ప్లవర్వాజుల్లో పెట్టి అలంకరించుకోవచ్చు. అంతేకాదు.. ఈ గులాబీలతో విండ్చైమ్స్ను అందంగా తయారుచేసుకోవచ్చు. అలాగే ఫొటోల్లో కనిపిస్తున్న విధంగా వీటితో ఇంటిని ఎలాగైనా అలంకరించొచ్చు. జీన్స్‌కు జోడీ... అలంకరణ విషయంలో యువత ఒకప్పటిలా లేదు.. ఎలాంటి డ్రెస్‌కి ఎలాంటి జ్యుయెలరీ వేసుకోవాలనే విషయంలో క్లారిటీతో ఉంది. అంతే కదా.. చుడీదార్లకు సెట్ అయ్యే జ్యుయెలరీ జీన్స్ మీదకు అసలు సూట్ అవదు. అలాగే జీన్స్ తరహానే వేరు. ఒక్కసారి పక్కనున్న ఫొటోలను చూడండి.. జీన్స్ మీదకు ఎలాంటి నెక్లేస్, బ్రేస్లెట్, స్కార్ఫ్‌లు సెట్ అవుతాయో మీకే అర్థమవుతుంది. ఫ్యాషనబుల్‌గా కనిపిస్తున్న వీటికి పైసా ఖర్చు చేయాల్సిన పని లేదు. ఇంట్లోనే.. అదీ పాతబడిన టీ-షర్ట్స్‌తో సింపుల్‌గా తయారు చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.. కావలసినవి: పాత టీ-షర్ట్స్, కత్తెర, బ్రేస్లెట్ హుక్స్, ఓల్డ్ బ్యాంగిల్స్ తయారీ: టీ-షర్ట్‌ను ఫొటోలో కనిపిస్తున్న విధంగా కత్తెరతో అడ్డంగా సన్నగా కట్ చేసుకోవాలి. అలా అండర్ ఆర్మ్ వరకు కట్ చేసుకొని, ముక్కలను ఒక బంచ్‌గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ బంచ్లోని రింగ్స్‌ను తీసుకొని జ్యుయెలరీ స్కార్ఫ్‌గా మార్చుకోవచ్చు. అలా వివిధ రంగుల రింగ్స్‌ను ఎంచుకొని మెడలో వేసుకుంటే ఆ అందమే వేరు. అలాగే బ్రేస్లెట్ల కోసం మూడు సన్నని ముక్కలను తీసుకొని.. జడలా అల్లి చివర్లో ఒక హుక్ పెడితే సరి. అలాగే ఓల్డ్ బ్యాంగిల్స్‌కు ఈ టీ-షర్ట్ ముక్కలను చుడితే.. ఆ గాజులు భలేగా ఉంటాయి. అంతేకాదు, కావాలంటే వీటికి పూసలను చేర్చుకోవచ్చు. ఇకపై రంగు రంగుల పాత టీ షర్ట్స్‌ను భద్రంగా దాచుకుంటారు కదూ... -
మనిషి చచ్చినా.. అవి చావవు..
ఒక వ్యక్తి గుండె కొట్టుకోవడం నిలిచిపోయింది... మెదడు కూడా పనిచేయడం లేదు... ఆ మనిషి చనిపోయాడని చెప్పేందుకు ఇవి చాలు.. అంతా ముగిసిపోయినట్లే అనుకుంటాం.. అయితే మన శరీరంలో జీవం మరణంతో ఆగిపోదని అంటున్నారు శాస్త్రవేత్తలు అవును.. ఇది అక్షరాలా నిజం ఈ వారం ప్రముఖ జర్నల్స్‌లో ప్రచురితమైన రెండు పరిశోధన వ్యాసాలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. మరణంతో శరీరంలోని చాలా అవయవాలు పనిచేయడం మానేసినా కొన్ని మాత్రం కొన్ని రోజుల పాటు పని చేస్తూనే ఉంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది అవయవదానం విషయంలోనూ, మరణ సమయాన్ని నిర్వచించడంలోనూ మార్పులు తీసుకురాగలవని శాస్త్రవేత్తల అంచనా. - సాక్షి, హైదరాబాద్ మరణించిన 12 గంటల తరువాత కూడా మనిషిలోని కొన్ని జన్యువులు క్రియాశీలకంగా ఉండటాన్ని శాస్త్రవేత్తలు గతంలోనే గుర్తించారు. వర్సిటీ ఆఫ్ వాషింగ్టన్కు చెందిన మైక్రోబయాలజిస్ట్ పీటర్ నోబెల్ దీనిపై పరిశోధనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన మరణించిన ఎలుకలు, జీబ్రాఫిష్లలో జన్యుక్రియలు ఎలా ఉంటున్నాయో పరిశీలించారు. మరణం తరువాత కూడా వీటిల్లోని దాదాపు వెయ్యి జన్యువులు పని చేస్తూండటం మాత్రమే కాకుండా బతికి ఉన్నప్పటి కంటే ఎక్కువ క్రియాశీలకంగా ఉన్నట్లు నోబెల్ గుర్తించారు. ఎలుకల్లోనైతే మరణించిన మరుసటి రోజు కూడా దాదాపు 515 జన్యువులు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తూంటే, జీబ్రాఫిష్‌లో 4 రోజుల తరువాత కూడా 548 జన్యువులు ప్రొటీన్లను ఉత్పత్తి చేస్తూనే ఉన్నాయి. మెసెంజర్ ఆర్ఎన్ఏ మోతాదుల్లోని హెచ్చుతగ్గులను బట్టి నోబెల్ బృందం జన్యుక్రియ కొనసాగుతూ ఉండటాన్ని గమనించగలిగారు. ఏ కణంలో ఏ ప్రొటీన్ ఉత్పత్తి కావాలన్న సమాచారం ఈ మెసెంజర్ ఆర్ఎన్ఏలో నిక్షిప్తమై ఉంటుంది. ఒక కణంలో ఈ ఆర్ఎన్ఏ ఎక్కువగా ఉంటే జన్యువులు క్రియాశీలకంగా ఉన్నట్లన్నమాట. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బతికున్నప్పుడు అత్యవసర సమయాల్లో ఏ జన్యువులైతే ఎక్కువ క్రియాశీలకమవుతాయో వాటిల్లో అత్యధికం మరణం తరువాత కూడా అంతే చైతన్యంతో పనిచేస్తాయి. ఒత్తిడిని తగ్గించేవి, రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసేవి, ఇన్ఫ్లమేషన్ను ప్రేరేపించేవి వీటిల్లో ఉండటం గమనార్హం. పిండ దశలో మాత్రమే ప్రొటీన్లు ఉత్పత్తి చేసిన జన్యువులు కొన్ని మరణం తరువాత మళ్లీ ఆ పనినే చేయడాన్ని తాము గమనించామని నోబెల్ అంటున్నారు. మరణం తరువాత మళ్లీ పిండ దశ నోబెల్ పరిశీలనలో వ్యక్తమైన జన్యువుల్లో శరీరానికి పనికొచ్చేవి మాత్రమే లేవు. కేన్సర్‌కు కారణమవుతున్న జన్యువులు మళ్లీ ప్రేరేపితమవుతున్నట్లు గుర్తించారు. దీన్నిబట్టి మరణం తరువాత శరీరం కణస్థాయిలో మరోసారి పిండ దశకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు నోబెల్ తెలిపారు. ‘‘ఇది ఓ కొత్త శరీరాన్ని నిర్మించేందుకు జరుగుతున్న విఫలయత్నం కావచ్చు’’ అని అంటున్నారు. ఎలుకల్లో లేదా జీబ్రాఫిష్ ఆఖరికి మనిషిలోనూ మళ్లీ జీవం నింపేందుకు ఈ కొన్ని వందల జన్యువుల శక్తి సరిపోక పోవచ్చు గానీ ఈ మొత్తం వ్యవహారాన్ని అర్థం చేసుకోవడం వల్ల అవయవ గ్రహీతలకు మేలు చేస్తుందని అంచనా. దాతల నుంచి అవయవాలు పొందిన వారికి 32 రకాల కేన్సర్లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మందులతో రోగ నిరోధక వ్యవస్థను పూర్తిస్థాయిలో పనిచేయకుండా చేయడం దీనికి కారణం. దీంతోపాటు మరణం తరువాత కూడా క్రియాశీలకంగా ఉండే జన్యువులు ఈ కేన్సర్లకు కారణం కావచ్చునని నోబెల్ అంచనా వేస్తున్నారు. నోబెల్ బృందం పరిశోధనల తాలూకూ వివరాలు ప్రసిద్ధ జర్నల్ సైన్స్ ప్రీప్రింట్ వెర్షన్లో ప్రచురితమయ్యాయి. అయితే నోబెల్ బృందం ఈ వ్యాసాలను ఆన్లైన్లో ప్రచురించడం ద్వారా లోటుపాట్లను గుర్తించే ప్రయత్నం చేస్తోం ది. ఎలుకలు, జీబ్రాఫిష్‌ల జన్యుక్రమానికి, మనిషికి ఎన్నో పోలికలు ఉన్నప్పటికీ మరిన్ని పరిశోధనల ద్వారా మానవుడు మరణం తరువాత కూడా కొన్ని జన్యువులు చైతన్యం తో ఉంటాయన్న విషయాన్ని రూఢీ చేసుకోవాల్సి ఉంది. -
స్కూల్ టీచర్లకు ఇక నో జీన్స్!
చండీగఢ్: ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇక జీన్స్ వేసుకోకూడదంటూ నిబంధనలు తీసుకొచ్చింది హర్యానా ప్రభుత్వం. ఉపాధ్యాయులు సమాజంలో ఆదర్శంగా ఉండాలని, అయితే కొందరి డ్రెస్సింగ్ విధానం అభ్యంతరకరంగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకొచ్చామని వెల్లడించింది. ఈ మేరకు ప్రైమరీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆర్ఎస్ కర్బ్ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించే ఉపాధ్యాయులు జీన్స్ లాంటి వస్త్రాలు ధరించడం మూలంగా ప్రజల్లో వారిపట్ల సరైన భావన ఉండటం లేదని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే ఒడీషా లాంటి రాష్ట్రాల్లో పాఠశాల టీచర్లకు యూనిఫామ్స్ ఉన్నటువంటి విషయాన్ని స్కూల్ ఎడ్యుకేషన్ చీఫ్ సెక్రెటరీ పీకే పీకే దాస్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయితే హర్యానాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 50 శాతానికి పైగా ఉన్నటువంటి 40 ఏళ్ల లోపు టీచర్లు ఈ నిబంధనతో అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బీజేపీ పాలిత రాష్ట్రంలో గతంలోనే భగవత్ గీతను పాఠ్యపుస్తకాల్లో చేర్చిన విషయం తెలిసిందే. -
ట్యూనిక్... ‘ట్యూన్’ మార్చేయచ్చు...
న్యూలుక్ అమ్మాయిలు జీన్స్ మీదకు ధరించే ట్యూనిక్స్లో ఎన్నో విభిన్న మోడల్స్ వచ్చాయి. అయితే అవన్నీ ఒకే తరహా డిజైన్ని పోలి ఉంటాయి. కొంత సృజనను జోడిస్తే మీ పాత ట్యూనిక్‌ను ఇలా అందంగా, అధునాతనంగా మార్చేయవచ్చు. ప్లెయిన్ లాంగ్ స్లీవ్స్ లేదా షార్ట్ స్లీవ్స్ ట్యూనిక్‌ను తీసుకోవాలి. పెద్దా, చిన్న ప్రింట్లు ఉన్న మల్టీకలర్ క్లాత్‌ను తీసుకోవాలి. దీంతో పాటు మరొక గ్రే కలర్ లేస్‌ను ఎంచుకోవాలి. ట్యూనిక్ నెక్ నుంచి కింద వరకు సైడ్ స్ట్రిప్‌గా మల్టీకలర్ ప్రింట్ క్లాత్‌ను కత్తిరించి, బెల్ట్‌లా కుట్టి జత చేయాలి. అదే విధంగా నెక్ డిజైన్ చేయాలి. మల్టీకలర్ క్లాత్‌ని కుచ్చులుగా పెట్టి టాప్‌కి ట్యునిక్ కింది భాగాన జత చేయాలి. దీని కింద గ్రే కలర్ లేస్‌ను పెద్ద పెద్ద కుచ్చులు పెట్టి జత చేయాలి. పాత సాదా సీదా నలుపురంగు టాప్ ఆకర్షణీయమైన పార్టీవేర్‌గా మారిపోయింది. -
ప్యాంట్... బేబీ గౌన్
న్యూలుక్ కార్గో ప్యాంట్స్, జీన్స్ మగ - ఆడ - పిల్లలు తేడా లేకుండా అందరూ వాడేస్తున్నారు. వాటిలో ఏళ్లకేళ్లుగా వాడినా పాడవని ప్యాంట్స్ ఉంటుంటాయి. విసుగొచ్చి పక్కన పడేసినవీ, పిల్లలకు పొట్టిగా మారిన ఈ ప్యాంట్స్‌ను ఉపయోగపడేలా మార్చుకోవచ్చు. అందమైన హ్యాండ్ బ్యాగ్ ప్యాంట్ నడుము భాగాన్ని తీసుకొని, హ్యాండ్ బ్యాగ్స్గానూ, ఫోన్ పౌచ్లుగానూ రూపొందించవచ్చు. తీసుకున్న క్లాత్‌ని బ్యాగ్ నమూనా వచ్చేలా కట్ చేసి, ఫొటోలో చూపిన మాదిరిగా కుట్టాలి. పాకెట్స్‌తో గౌన్: ప్యాంట్స్‌కు పెద్ద పెద్ద పాకెట్స్ (జేబులు) ఉంటాయి. పాకెట్స్తోనే ఓ డిజైన్ సృష్టిస్తే.. అది పిల్లలకు మంచి డ్రెస్ అవుతుంది. ప్యాంట్ పెద్ద జేబులు ఉన్న భాగాలను తీసుకోవాలి. పాకెట్ క్లాత్‌కు పూర్తి కాంట్రాస్ట్ ఫ్యాబ్రిక్‌ను ఎంచుకోవాలి. పిల్లల చర్మం సున్నితంగా ఉంటుంది కాబట్టి మెత్తని క్లాత్ తీసుకుంటే మంచిది. కుట్టడానికి వీలైన వస్తువులను తీసుకోవాలి. పిల్లల కొలతలకు తగ్గట్టు స్కర్ట్ లేదా గౌన్ డిజైన్ చేసుకొని కుట్టేసి ప్యాంట్ పాకెట్‌ను జత చేస్తే కొత్త డ్రెస్ రెడీ. -
జీన్స్ వేసుకోలేకపోతున్న హీరోయిన్!
లాస్ ఏంజెల్స్: ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో ఉన్న దుస్తులను ధరించలేకపోతున్నందుకు తెగ బాధపడిపోతోంది నటి ఒలివా విల్డే. తన కాళ్లు బాగా సన్నగా ఉండటంతో జీన్స్‌ను ధరించలేకపోతున్నానని తెలిపింది ఈ 32 ఏళ్ల సుందరి. నేటి కాలంలో ఆహారంలో వచ్చిన మార్పుల తనపై బాగా ప్రభావాన్ని చూపాయని బాధను వ్యక్తం చేసింది. జీన్స్ సన్నగా పొడుగ్గా ఉన్నవాళ్లకు మాత్రమే.. తాను ఎప్పుడైనా బాయ్‌ఫ్రెండ్ జీన్స్ వేసుకోవడానికి ప్రయత్నించినా కుదరడంలేదని వివరించింది. -
జీన్స్ మళ్లీ మళ్లీ కొత్తగా!
► అత్యంత ప్రజాదరణ పొందిన వస్త్రం డెనిమ్. జీన్స్ పేరుతో ప్యాంట్లు, ఓవర్ కోట్స్ ఎన్నో మోడల్స్‌లో మన నట్టింటికి వచ్చాయి. కాలేజీలకు వెళ్లే అబ్బాయిలు, అమ్మాయిల తప్పనిసరి వస్త్ర జాబితాలో జీన్స్ ముందుంటుంది. అంతేకాదు మన్నికలోనూ జీన్స్ అన్ని ఫ్యాబ్రిక్స్లలో ఫస్ట్‌న ఉంటుంది. అయితే, కొన్నాళ్లుగా వేసుకున్న జీన్స్ బోర్ కొట్టినా, లేక కొద్దిగా పాడైనా, ఔట్‌డేటెడ్ అయినా వాటిని తిరిగి ఉపయోగించుకునే సదుపాయమూ ఉంది. అదెలాగో ఈ వారం చూద్దాం.. ► ప్యాంట్‌ను రెండు భాగాలు చేసి యాప్రాన్గా తయారుచేసుకోవచ్చు. వంట చేసేటప్పుడు ఛాతి భాగానికి వేడి తగలకుండా కిచెన్‌లో చాలా వరకు కాటన్ యాప్రాన్లను ధరిస్తుంటారు. వాటి బదులుగా జీన్స్‌ను ఇలా యాప్రాన్గా మార్చేసి వాడుకుంటే ఉపయోగాలు తెలుస్తాయి. ► నాలుగైదు రంగు జీన్స్ ప్యాంట్లు విప్పదీసి, డిజైన్‌గా మలచి కుడితే పొడవాటి కుచ్చుల గౌన్ సిద్ధం. ► పిల్లల ప్యాంట్లు కొన్నాళ్లయ్యాక పొట్టిగా అయిపోతాయి. అలాంటి వాటిని రెండింటిని తీసుకొని పిల్లలకు గౌన్ని తయారుచేయవచ్చు. ► జీన్స్‌తో హ్యాండ్ బ్యాగులు, దుస్తుల అలంకరణకు పువ్వులను తయారుచేసుకోవచ్చు. ప్రయత్నించడం మొదలుపెడితే ఇలాంటి ఎన్నో సృజనాత్మక ఆలోచనలు మీకూ రావచ్చు. వాడిన దుస్తులతో కొత్త తరహా డ్రెస్సులను రూపొందిస్తే వాటిని సాక్షి ఫ్యామిలీ చిరునామాకు ఫొటోలు తీసి పంపించండి. -
పాకెట్ లో పాకెట్... ఆ జీన్స్ మతలబేంటి
హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా జీన్ ప్యాంట్ల గురించి తెలియని వారుండరు. ఈ ఫ్యాషన్ ప్రపంచంలో పిల్లలు, యువతీ యువకులతో పాటు వృద్ధులు సైతం జీన్స్ అంటే ఒక క్రేజ్ ఉంది. అందరూ ధరిస్తున్న జీన్స్ లో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. అందరూ సాధారణంగా గమనించేదే... కానీ అదెందుకు ఉంటుందన్న విషయం చాలా మందికి తెలియదు. సాధారణంగా ఎవరైనా దర్జీ వద్ద షర్ట్, ప్యాంటు ఇంకేదైనా కుట్టిస్తే రహస్యంగా కొన్ని పాకెట్స్ కుట్టించుకునే అలవాటు ఉన్న వారు కూడా ఉంటారు. కానీ జీన్స్ విషయంలో అలా కాదు. అదేమంటే... జీన్స్ ముందు భాగంలో ఉంటే (పాకెట్) జేబులో మరో చిన్న పాకెట్ కూడా ఉంటుంది. అది కూడా ప్యాంటు కుడివైపు ఉండే పాకెట్ లో మాత్రమే. ప్రపంచంలో ఏ జీన్స్ చూసినా ముందుండే పెద్ద పాకెట్ లో పైకి కనిపించే విధంగా ఓ చిన్న పాకెట్. అది చతురస్రాకారంలో కనిపిస్తుంటుంది. ఆ చిన్న పాకెట్ కు కూడా రెండు వైపులా బలమైన బటన్స్ తో ఉంటుంది. అది జీన్స్ ప్రత్యేకత. అయితే ఆ చిన్న పాటి పాకెట్ ఎందుకోసం. ఈ విషయం చాలా మందికి తెలియదు. దాని ఉపయోగమేంటో కూడా తెలియదు. దీనిపై లోతుగా వెళితే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జీన్స్ అభిమానులకు ఈ విషయంపై పెద్దగా అవగాహన లేదని తేలింది. ఒక మిస్టరీగా మారిన ఈ చిన్న సైజు పాకెట్ పై అమెరికాకు చెందిన ఒక ఫోరం తన బ్లాగ్ ద్వారా దీనిపై ఒక సర్వేను నిర్వహించింది. ఇంతకూ ఆ బుల్లి పాకెట్ ఎందుకో తెలుసా... అందులో గడియారం (వాచ్) పెట్టుకోవడానికట. గతంలో వ్యాపారాలు చేసే వాళ్లు తమ జాగ్రత్త కోసం, లేదా పశువుల కాపరులు, గుర్రాలపై స్వారీ చేసే పనిలో ఉండే వాళ్లు, కౌబాయ్ లా తిరిగేవాళ్ల అవసరాల కోసం తమ గడియారాన్ని భద్రపరుచుకోవడానికి వీలుగా ప్రముఖ జీన్స్ సంస్థ లెవిస్ స్ట్రాస్ ఈ బుల్లి పాకెట్ కు శ్రీకారం చుట్టిందట. పూర్వం 1800 శతాబ్దంలో కౌవ్ బాయ్స్ పొడవాటి చైన్ తో కూడిన వాచ్ లను వాళ్లు ధరించే కోటులోపలి పాకెట్ లో వేసుకోవడం అలవాటు. అయితే అప్పట్లో పదే పదే వాటిని తీసి చూసుకోవడంలో తలెత్తిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ బుజ్జి పాకెట్ రూపకల్పన చేసినట్టు లెవిస్ తెలియజేసింది. పాత కాలంలో చైన్ కలిగి ఉండే వాచ్ లను ఈ బుల్లి పాకెట్ లో దాచుకోవడం అలవాటుగా ఉండేది. ఇప్పుడు చైన్ వాచ్ లకు కాలం చెల్లింది. ఈ తరం వారికి ఆ విషయం పెద్దగా తెలియకపోవచ్చు... కానీ చాలా మంది కుర్రకారుకు ఇప్పుడు ఆ బుల్లి పాకెట్ మరో రకంగా ఉపయోగపడుతోంది. నాణాలను అందులో కుక్కేస్తున్నారు. భద్రంగా ఉంటుందని... కీ చైన్ లేకుండా ఉండే కీ ఉన్నా.. ఎస్డీ కార్డు, సిమ్ కార్డు, యూఎస్బీ వంటి చిన్నచిన్నవెన్నో ఆ బుల్లి పాకెట్ లో వేసుకుంటున్నారు. ఏదేమైనా... ఏళ్లు గడిచినా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఆ బుల్లి పాకెట్ మాత్రం ఉపయోగ పడుతూనే ఉంది. -
షాపింగ్‌కి వెళితే అవి కొనకుండా ఉండలేను!
శ్రుతీహాసన్ ఫిజిక్ చాలా బాగుంటుంది. మోడ్రన్ దుస్తుల్లోనూ బాగుంటారు.. సంప్రదాయ దుస్తుల్లోనూ లవ్లీగా ఉంటారు. ఫ్యాషన్ ప్రపంచంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, అందుకు అనుగుణంగా డ్రెస్సులు సెలక్ట్ చేసుకుంటారామె. ఆ విషయం గురించి శ్రుతీహాసన్ మాట్లాడుతూ - ‘‘నాకు తెలిసి బట్టలు, నగలు ఇష్టపడని అమ్మాయిలు ఉండరు. నగల సంగతెలా ఉన్నా డ్రెస్సులంటే నాకు పిచ్చి. షాపింగ్ మాల్‌లోకి అడుగుపెట్టానంటే బట్టలు కొనకుండా ఉండలేను. జనరల్‌గా నాకు జీన్స్, టీ-షర్ట్ ఇష్టం. అవే సౌకర్యవంతంగా అనిపిస్తాయి. అయినప్పటికీ వేరే డ్రెస్సులు కూడా కొంటుంటాను. బట్టల పిచ్చి మాత్రమే కాదు.. నాకు పాదరక్షల పిచ్చి కూడా ఉంది. షాపింగ్‌కి వెళ్లినప్పుడు షూస్ కొనకుండా ఉండలేను. ఇప్పటివరకూ నా దగ్గర యాభై, అరవై షూస్ ఉన్నాయి. అన్నేం చేసుకుంటావని ఫ్రెండ్స్ అడుగుతుంటారు. నవ్వేసి ఊరుకుంటాను. సీజన్‌కి తగ్గట్టుగా, వేసుకున్న డ్రెస్‌కి మ్యాచింగ్‌గా షూలు వేసుకుంటాను’’ అని చెప్పారు. -
జీన్స్ వేసుకుందని భార్యను చంపేశాడు
పుణె: ఆధునికతకు అనుగుణంగా జీన్స్ ప్యాంటు, టీ షర్ట్ ధరించడమే ఆమె చేసిన నేరమైంది. సంప్రదాయ విరుద్ధంగా దుస్తులు వేసుకుందని ఆమెను కట్టుకున్న భర్తే కడతేర్చాడు. పుణెలోని గుల్తెకేడి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. జీన్స్ ప్యాంటు, టీ షర్ట్ ధరిస్తున్న విషయమై భార్య పూజ(21)తో రంజీత్ నిషాద్ (24) గొడవ పడేవాడు. ఒక రోజు ఇదే విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో రంజీత్ పూజపై దాడి చేసి చంపేశాడు. ఆమె మృతదేహాన్ని ఇంట్లో పెట్టి తాళం వేసి పరారయ్యాడు. గత శుక్రవారం ఇంటిలోని మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వస్తుండటంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదుచేసుకొని, నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
జీన్స్‌తో జర జాగ్రత్త!
బహుశా ఫ్యాషన్ ప్రపంచంలో జీన్స్‌ప్యాంట్ పొందినంత ప్రాచుర్యం మరే ఇతర దుస్తులూ పొంది ఉండవు. రఫ్ అండ్ టఫ్‌గా ఉపయోగించడానికి అనువైనవి కావడంతోపాటు సౌకర్యమూ ఉండటం వల్ల ఈ ఆధిపత్యం ఇలాగే కొనసాగుతోంది. అయితే జీన్స్ ప్యాంట్ల వల్ల కలిగే అనర్థాలపై జరిగిన అధ్యయనాల్లోని అనేక అంశాల్లో ఒకటి కాస్త ఆందోళన గొలిపేదిగానే ఉంది. జీన్స్ వేసుకొని కింద కూర్చోవడం, అందునా జీన్స్ ప్యాంట్లు తొడిగి బాసిపట్లు వేయడం (సక్లముక్లం వేసి కూర్చోవడం) ఆరోగ్యానికి అంత మేలు కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. జీన్స్ ప్యాంట్ తొడుక్కొని ఇలా కూర్చోవడం వల్ల కండరాలు, నరాలు దెబ్బతింటాయనీ, ఇది మరీ విషమిస్తే ఒక్కోసారి జీన్స్ ప్యాంట్లతో బాసిపట్లు (సక్లంముక్లం) వేసుకుని కూర్చునేవారు అస్సలు నడవలేని పరిస్థితి కూడా రావచ్చని హెచ్చరిస్తున్నారు. వ్యాయామం చేసే సమయంలోనూ జీన్స్ వేసుకొని ‘స్క్వాటింగ్’ చేయవద్దని హెచ్చరిస్తున్నారు. ఈ అంశాలన్నింటినీ ‘జర్నల్ ఆఫ్ న్యూరాలజీ, న్యూరోసర్జరీ, సైకియాట్రీ’ అనే మెడికల్ జర్నల్‌లో పరిశోధకులు ప్రచురించారు. కొత్త పరిశోధన -
దీర్ఘాయుష్షుకు కారణం ఇదేనా!
లండన్: కొందరు పిల్లలు పుట్టుకతోనే తెలివి గలవారుగా పుడుతారు. మరికొందరేమో పరిస్థితులు, జీవితంలో ఎదురైన అనుభవాలతో తెలివిగలవారుగా తయారవుతారు. తెలివిగల వారుగా పుట్టడానికి జన్యువులే కారణమని శాస్త్రవేత్తలు ఇది వరకే తెలిపారు. అయితే తెలివికి కారణమయ్యే ఆ జన్యువులే దీర్ఘాయుష్షును కూడా కలిగిస్తాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది. తెలివితేటలు అధికంగా కలిగిన వారు ఇతరులతో పోలిస్తే ఎక్కువ కాలం జీవించగలరని, ఇందుకు మెదడులోని జన్యువులు కారణమని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. అమెరికా, స్వీడన్, డెన్మార్క్‌లకు చెందిన కవలలు, కవలలు కాని వారి ఆయుఃప్రమాణాలపై లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ పరిశోధకులు అధ్యయనం చేశారు. కవలలు అన్నిరకాల జన్యువులను పంచుకుంటుండగా, కవలలు కాని సోదరులు సగం మాత్రమే జన్యువుల్ని పంచుకుంటున్నారు. ఈ ఫలితాల ప్రకారం ఆయుఃప్రమాణం, తెలివితేటలు జన్యువులపై ఆధారపడి ఉంటాయని అధ్యయనం తెలిపింది. ఐక్యూ అధికంగా ఉండే పిల్లలు ఎక్కువ కాలం జీవిస్తారని ఈ పరిశోధనలో పాలుపంచుకున్న శాస్త్రవేత్త రోసాలిన్డ్ ఆర్డెన్ తెలిపారు. అంతేకాకుండా అలాంటివారు ఉద్యోగజీవితంలో కూడా మిగతావారితో పోలిస్తే ఉన్నత స్థానాల్లో ఉంటారని, ఎక్కువ కాలం జీవించే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థుల అకమిక్ నైపుణ్యాల్లో తేడాలకు కూడా జన్యువులు కూడా ఒక కారణమని ఈ అధ్యయనం తెలిపింది. -
కుర్రర్రర్రర్రర్రర్ర....తా!
ఎవరు వేసుకున్నా కుర్రగా కనిపిస్తారు కాబట్టి కుర్రర్రర్రర్రర్రతా.. అన్నారేమో! అది కాస్తా కాలక్రమేణా‘కుర్తా’ అయి ఉంటుంది. అమ్మాయిల నుంచి అమ్మమ్మల వరకు అందరికీ నచ్చడమే కాదు కుర్తా ఎంచక్కా నప్పుతుంది కూడా! లెగ్గింగ్, జెగ్గింగ్, జీన్స్, చుడీ, పటియాల... ఏ బాటమ్ అయినా నప్పే ఒక్క కుర్తా ఉంటే చాలు. ధర కూడా అందరికీ అందుబాటులో ఉండటం ఈ కుర్తా కున్న మరో విశేషం. సౌకర్యంగా, సింపుల్‌గా, స్టైల్‌గా, గ్రాండ్‌గా... అన్నీ ఒక్క కుర్తాతో సరిపెట్టేయచ్చు. అయితే, కుర్తా ఒకటే తరహాకు చెందినదైనా శరీరాకృతి మాత్రం ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది. అందంగా, హుందాగా, కుర్రర్రర్రర్రర్రగా కనిిపించాలంటే శరీరాకృతికి తగ్గ కుర్తానే ఎంచుకోవాలి. ఛాతి భాగం, నడము భాగం ఒకే పరిమాణంలో ఉండి, నడుము సన్నగా ఉండేవారు ఈ పరిధిలోకి వస్తారు.శరీరానికిఅంటిపెట్టుకున్నట్టుగా ఉండే మంచి ఫిటింగ్ కుర్తా ఈ షేప్ వారికి నప్పుతుందిఅన్ని రకాల నెక్‌లైన్స్ వీరికి నప్పుతాయి స్ట్రెయిట్, బూట్‌కట్ బాటమ్స్ సరైన ఎంపిక నడుము కింది భాగం కొద్దిగా వదులుగా ఉండే కుర్తాను ఎంచుకోవాలి. వీటికి దూరం... మరీ వదులుగా, మరీ ఫిట్‌గా కుర్తా ఉండకూడదు ప్యాట్రన్స్ ఎక్కువున్న కుర్తా ధరిస్తే లావుగా కనిపించే అవకాశం ఉంది. ‘ఎ’ షేప్ భుజాలు, ఛాతి పరిమాణం తక్కువగా, పిరుదుల భాగం విశాలంగా ఉండే వారు ఈ కోవకు చెందుతారు. మన దేశంలో చాలామందిది ఇదే ఆకృతి. లేత రంగు కుర్తీ ధరిస్తే, ముదురు రంగు పటియాల లేదా లెగ్గింగ్‌తో కింది భాగాన్ని కవర్ చేయాలి బాగా కుచ్చులుగా ఉన్న కుర్తా/ అనార్కలీ కుర్తా వీరికి బాగా నప్పుతుంది కుర్తా కాలర్ బోట్‌నెక్ లేదా స్కేయర్నెక్ అయితే బాగుంటుంది ప్రింట్లు, పోల్కా డాట్స్, చారలు ఉన్న కుర్తీలు బెస్ట్ పొడవాటి కుర్తాలు బాగా నప్పుతాయి.వీటికి దూరం... శరీరానికి అతుక్కుపోయే ఫ్యాబ్రిక్స్ బిగుతుగా ఉండే బాటమ్స్. యాపిల్ శరీరాకృతి యాపిల్ షేప్‌లో ఉంటే లావుగా కనిపిస్తారు. అందుకని వీరు... ముదురు రంగులు ఎంచుకోవాలి కాటన్, సిల్క్ రెండింటి కలయికతో రూపొందిన ఫ్యాబ్రిక్ నప్పుతుంది నెక్లైన్ -’గ’ షేప్ ఉండేలా చూసుకోవాలి ఎంబ్రాయిడరీ అంటే ఇష్టం ఉంటే భుజాల దగ్గర వర్క్ ఉన్నవి ఎంచుకోవాలి కఫ్ స్లీవ్స్ (కుర్తా చేతుల చివరి భాగం మడతపెట్టినట్టుగా ఉండేవి) వీరికి బాగుంటాయి. వీటికి దూరం... షేప్ లేనివి, ఫిటింగ్ వదులుగా ఉన్న కుర్తా పొట్ట భాగంలో వదులుగా ఉన్న కుర్తా. మెడ కనిపించకుండా ఉండే యోక్డ్ స్టైల్ నెక్స్. త్రికోణం పై భాగం వెడల్పుగా, కింది భాగం సన్నగా కోన్ షేప్‌లో ఉన్నవారు ఈ పరిధిలోకి వస్తారు. కుర్తీని ఎంచుకునేటప్పుడు చేతుల క్లాత్ మృదువుగా ఉండేది ఎంచుకోవాలి. అప్పుడు పై భాగం ఎక్కువ కనిపించదు.కాలర్ లేనివి, ’్ఖ, గ’ నెక్‌లైన్స్ ఎంచుకోవాలి. నడుము కింది భాగం కుచ్చులుగా ఉండేదైతే బాగుంటుంది. వీటికి దూరం... నెక్ లైన్స్ మరీ పెద్దగా ఉండకూడదు.అలాగే కాలర్ దగ్గర ఎక్కువ వర్క్, ప్యాట్రన్స్ ఉండకూడదు. నలుచదరం డీప్ నెక్‌తో కింది భాగం విశాలంగా ఉన్న కుర్తాలు. కుర్తా పైన బెల్ట్ ధరిస్తే నడుము కింది భాగం విశాలంగా కనపడుతుంది. అనార్కలీ స్టైల్ లేదా ఎక్కువ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన కుర్తా బాగుంటుంది. లెగ్గింగ్స్, చుడీ.. వంటివి బాటమ్స్గా వీరికి బాగుంటాయి. వీటికి దూరం... {స్టెయిట్ కట్, బిగుతుగా ఉండే కుర్తాలు. మరీ వదులుగా ఉండేవి. -
ప్రశాంత్‌తో ఆస్ట్రేలియా అమ్మడు
జీన్స్ చిత్రంలో ప్రశాంత్‌తో అందాలరాశి ఐశ్వర్యారాయ్ రొమాన్స్ చేసిన విషయం ఆ చిత్రంతో ఆ జంట హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అదే ప్రశాంత్‌తో తాజాగా ఆస్ట్రేలియా అందగత్తె అమండా డ్యూయెట్స్ పాడుకోవడం విశేషం. చార్మింగ్ హీరో ప్రశాంత్ తాజాగా నటిస్తున్న భారీ చిత్రం సాహసం. పలు విశేషాలతో కూడిన ఈ చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకుందని స్టార్ మూవీస్ అధినేత సీనియర్ నటుడు త్యాగరాజన్ వెల్లడించారు. నవ దర్శకుడు అరుణ్‌రాజ్ వర్మ మెగాఫోన్ పట్టిన ఈ చిత్రంలో నటించే హీరోయిన్ గురించి పలువురు ప్రముఖ నటీమణుల పేరు ప్రచారంలో ఉన్నాయి. దీంతో అసలు చిత్ర హీరోయిన్ ఎవరన్న రహస్యాన్ని నిర్మాత త్యాగరాజన్ శుక్రవారం బయటపెట్టారు. ఈ సందర్భంగా చిత్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరోయిన్ను హీరో ప్రశాంత్ పరిచయం చేశారు. ఆస్ట్రేలియా బ్యూటీ : హీరోయిన్ పేరు అమండా. ఆస్ట్రేలియా వాసి. తల్లి ఇండియన్, తండ్రి ఇంగ్లాడ్ దేశస్థుడు. 19 ఏళ్ల అమండా పెరిగింది ఆస్ట్రేలియాలో. అందం, అభినయం మెండు గా గల ఈమె ఒక బాలే డాన్సర్. ఈ నృత్యంలో పలు బహుమతులను గెలుచుకున్న ఈ బ్యూటీ నటనా పాఠశాలలో శిక్షణ పొందారు. ఈ సుందరికి సంబంధించిన కొన్ని వివరాలు ఇవి . ఈ అవకాశం అదృష్టం : ప్రశాంత్ లాంటి ప్రముఖ హీరో సరసన నటించే అవకాశం రావడం నా అదృష్టం అని అమండా అన్నారు. కాగా ఈమె నటనను ఆ చిత్రంలో నటిస్తున్న మరో సీనియర్ న టుడు నాజర్ అభినందించారట. కోలీవుడ్‌కు లభించిన మరో చక్కని నటి అమండా అంటూ ప్రశంసలు పొందిన లక్కీ గర్ల్ అమండా. సుదీర్ఘ అన్వేషణ ఫలం : సాహసం చిత్ర హీరో ప్రశాంత్ మాట్లాడుతూ ఈ చిత్రంలో హీరోయిన్ కోసం చాలామందిని పరిశీలించామన్నారు. వందలాదిమంది అన్వేషణలో ఎంపికైన నటి అమండా అని అన్నారు. సాహసం చిత్రం కోసం అందం, అభినయం, నృత్యం తెలిసిన నటి అవసరం అయ్యారన్నారు. ఎనిమిది నెలల సుదీర్ఘ అన్వేషణ ఫలితం ఈ అమండా అని పేర్కొన్నారు. సాహసం చిత్రం విడుదలైనాంతరం అమండా గురించే ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటారన్నారు. పెద్ద పెద్ద సంభాషణలకు కూడా ఆమె బట్టీపట్టి చక్కగా చెప్పేశారన్నారు. ఈ చిత్రంలో ఇప్పటికే హాలీవుడ్ నటి నర్గీస్ బక్రి సింగిల్‌సాంగ్ ప్రశాంత్‌తో ఆడి దుమ్ములేపారు. విదేశాలలో గీతాలు: తాజాగా ఈ ఆస్ట్రేలియా బ్యూటీ సాహసం చిత్రం కోసం 40 రోజులు నటించారు. ఇప్పుడు ప్రశాంత్‌తో కలిసి జపాన్, మలేషియా, కొరియా దేశాల్లో యువళగీతాలు పాడుకోవడానికి సిద్ధం అవుతున్నారు. గ్రాండ్‌గా ఆడియో : ఎస్ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమాన్ని త్వరలో చాలా గ్రాండ్‌గా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర నిర్మాత కథనం, సంభాషణల కర్త త్యాగరాజన్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చిత్రం కోసం పాడిన మోహిత్ చాహాన్ శ్రీయ ఘోషల్, శంకర్ మహదేవన్, సంగీత దర్శకుడు అనిరుద్, నటుడు శింబు, లక్ష్మీమీనన్, ఆండ్రియా పాల్గొననున్నారని తెలిపారు. చిత్రాన్ని మేలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు. -
నా మనుమరాలికి నా జీన్సే వచ్చాయి!
అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్‌లకు ఆరాధ్య పుట్టినప్పట్నుంచీ అమితాబ్‌కి మనవరాలే లోకమైపోయింది. తీరిక సమయంలో ఎక్కువ శాతం ఆరాధ్యతో ఆడుకోవడానికే కేటాయిస్తున్నారు బిగ్ బి. మనవరాలి ముచ్చట్లను అందరితో పంచుకోవడానికి తెగ ఆరాటపడుతున్నారు. తాజాగా బ్లాగ్‌లో ఆయన ఆరాధ్య ముచ్చట్లను పోస్ట్ చేశారు. ‘‘మనుమలు, మునిమనుమలకు ఎక్కువ శాతం తాతల జీన్స్ వస్తాయి. అందుకు ఉదాహరణ నేను, అభిషేకే. నిజానికి మా అమ్మానాన్న అంత ఎత్తు కాదు. కానీ... మా అమ్మగారి నాన్న, మా తాత అయిన సర్దార్ ఖజాన్సింగ్ సూరి ఆరడుగుల ఎత్తు. ఆయన జీన్స్ నాకొచ్చాయి. నా ఎత్తు ఆరు అడుగుల రెండు అంగుళాలు. అలాగే మా అబ్బాయి అభిషేక్ కూడా ఆయన పోలికే. వాడు ఆరు అడుగుల మూడంగుళాలు. చిన్నప్పుడు అభిషేక్.. తన వయసున్న పిల్లలందరి కన్నా పొడుగ్గా ఉండేవాడు. నా కుమార్తె శ్వేతా బచ్చన్ కూడా అంతే. ఇప్పుడు అదే పోలిక ఆరాధ్యకు కూడా వచ్చింది. పాప కూడా తన వయసున్న పిల్లలందరిలోకీ హైట్’’ అని పేర్కొన్నారు అమితాబ్. -
యువత ఇష్టాలలో మార్పు!
యువత ఇష్టాలలో మార్పు రావడంతో జీన్ ఫ్యాంట్లకు రోజులు దగ్గరపడినట్లు అనిపిస్తోంది. గత ఇరవై ఏళ్ళుగా వస్త్ర ప్రపంచంలో జీన్స్ రారాజులుగా వెలుగొందాయి. ప్రస్తుత మార్కెట్లో అవి ఖంగుతింటున్నాయి. యువతని, ముఖ్యంగా కాలేజీ కుర్రాళ్ళను అమితంగా ఆకట్టుకున్న జీన్స్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫ్యాషన్‌తో పోటీ పడలేకపోతున్నాయి. కాలేజీలు, పార్టీలు, శుభకార్యాలు...సందర్భం ఏదైనా అబ్బాయిలు, అమ్మాయిలూ అందరూ ధరించేది జీన్స్‌నే. వారి ప్రధాన ఛాయిస్ జీన్స్‌గా ఉండేది. గార్మెంట్ రంగంలో రెండు దశాబ్దాలు తిరుగులేని విజయాన్ని చూసిన జీన్ ప్యాంట్లు ఇప్పుడు భారీ పోటీని ఎదుర్కొంటున్నాయి. ఇటీవల ఓ కొత్త ట్రెండ్ యువతని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఎప్పుడో సినిమాల్లో చూసి బయట ఫ్యాన్స్ ధరించిన అలనాటి కలర్ ఫ్యాంట్ల ఫ్యాషన్ మళ్ళీ తిరిగి వచ్చేసింది. సాధారణంగా జీన్ ఫ్యాంట్లు బ్లూ,బ్లాక్, బ్రౌన్, షేడెడ్ కలర్లో మాత్రమే ఉంటుంటాయి. అవి వచ్చిన తర్వాత ఇతర రంగురంగుల ఫ్యాంట్లను యువత పట్టించుకోలేదు. యువత దృష్టి మళ్ళీ వాటివైపు మళ్లింది. ఇటీవల కాలంలో కాలేజీ కుర్రాళ్ళకు రంగుల ఫ్యాంట్లపై మోజు పెరిగింది. దాంతో జీన్ ఫ్యాంట్లకు గిరాకీ బాగా తగ్గింది. షోరూమ్స్‌లో రంగుల ఫ్యాంట్ల అమ్మకాలు పెరిగాయి. దాంతో వ్యాపారులు, డిజైనర్లు ప్రస్తుత యువత క్రేజీని దృష్టిలో పెట్టుకుని రంగుల ఫ్యాంట్ల తయారీలో తమ క్రియేటివిటీని చూపుతున్నారు. రంగుల ఫ్యాంట్లను స్టైల్‌గా రూపొందిస్తున్నారు. ఒకే రంగులో పది వెరైటీ డిజైన్లు అందుబాటులోకి తెస్తున్నారు. యువతీ, యువకులు కూడా వీటిని ఎగబడి కొంటున్నారు. మనవారు 'ఓల్డ్ ఈజ్ గోల్డ్' అంటుంటారు. పురాతన డిజైన్లే కొంత కాలం కనుమరుగై, మళ్లీ అవే కొత్తగా దర్శనమిస్తుంటాయి. పాత ట్రెండ్‌కే కొత్త హంగులు అద్దుతుంటారు. అవే సంచలనం సృష్టిస్తుంటాయి. యువత వాటినే వేలం వెర్రిగా ఇష్టపడుతుంటారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే జీన్ ఫ్యాంట్ల తయారీ కంపెనీలకు గడ్డు కాలమే! ** -
కె.జె. యేసుదాసుపై మండిపడ్డ బాలీవుడ్ నటి
ఇండోర్:మహిళల వస్త్రధారణకు సంబంధించి వివాదస్పద వ్యాఖ్యలు చేసిన ప్రముఖ గాయకుడు కె.జె.యేసుదాసుపై బాలీవుడ్ నటి నేహా ధూపియా మండిపడ్డారు. ఆయన చేసిన తాజా వ్యాఖ్యలతో మహిళలను తక్కువ చేసినట్లేనని ఆమె విమర్శించారు.' ఇది నిజంగా దురదృష్టం. మహిళలు ఏది ధరించాలి. ఏది ధరించకూడదు' అని పేర్కొనడం సమాజానికే సిగ్గు చేటన్నారు. దేశం పురోగమనం సాధిస్తున్న దశలో ఈ వ్యాఖ్యలు ప్రముఖ స్థానంలో వ్యక్తి చేయడం బాధాకరమన్నారు. '21 టోపాన్ కీ సలామీ' చిత్ర ప్రమోషన్ కార్యక్రమానికి విచ్చేసిన నేహా ఈ వ్యాఖ్యలు చేశారు. గాంధీ జయంతి సందర్భంగా తిరువనంతపురంలో ఓ స్వచ్ఛంధ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళలు జీన్స్ ధరించడాన్ని యేసుదాసు తప్పుబట్టిన సంగతి తెలిసిందే. జీన్స్ ధరించడం భారత సంస్కృతికి విరుద్ధమని, మహిళలు జీన్స్ ధరించడం ద్వారా ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదన్నారు. నిండుదనంతో కూడిన వస్త్రాలనే ధరించాలని సూచించారు. నిరాడంబరత్వం, మంచితనం భారత మహిళల్లోని గొప్ప లక్షణాలని, వారు జీన్స్ ధరించడం భారత సంస్కృతికి వ్యతిరేకమని పేర్కొన్నారు. -
'మహిళలు జీన్స్ ధరించడం సంస్కృతికి విరుద్ధం'
తిరువనంతపురం: మహిళల వస్త్రధారణకు సంబంధించి ప్రముఖ గాయకుడు కె.జె. యేసుదాసు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం గాంధీజయంతి సందర్భంగా తిరువనంతపురంలో ఓ స్వచ్ఛంధ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యేసుదాసు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు జీన్స్ ధరించడాన్ని తప్పుబట్టారు. జీన్స్ ధరించడం భారత సంస్కృతికి విరుద్ధమని, మహిళలు జీన్స్ ధరించడం ద్వారా ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదన్నారు. నిండుదనంతో కూడిన వస్త్రాలనే ధరించాలని సూచించారు. నిరాడంబరత్వం, మంచితనం భారత మహిళల్లోని గొప్ప లక్షణాలని, వారు జీన్స్ ధరించడం భారత సంస్కృతికి వ్యతిరేకమని పేర్కొన్నారు. యేసుదాసు వ్యాఖ్యలపై మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన ర్యాలీ చేపట్టారు. ఆయన అభిప్రాయం ఆమోదయోగ్యం కాదని, ఇటువంటి వ్యాఖ్యలు మహిళల స్వేచ్ఛను హరించడం కిందకే వస్తాయని ఆరోపించారు. యేసుదాసు దేశం గర్వించదగ్గ గాయకుడు అనటంలో ఎటువంటి సందేహం లేదని, అయితే ఆయన నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం విచారకరమన్నారు. -
‘ప్లస్’ అయ్యే అలంకరణ
వయసు పైబడడం, ఆరోగ్యం, వంశపారంపర్యం, పని ఒత్తిడి... ఇలా రకరకాల కారణాల వల్ల అధిక బరువు ఓ బెడదలా ఇటీవల చాలామందిని వేధిస్తోంది. పెరిగిన బరువు అందానికి ‘మైనస్’ అనుకోవడం కన్నా.. దానినే ‘ప్లస్’గా మార్చుకుంటే మేలు అని భావించేవారి కోసమే ఈ కథనం... సాధారణంగా అన్ని షాపులలో జీరో (0) నుంచి ఫార్టీ (40) సైజ్ లోపు కొలతలలో రకరకాల దుస్తులు లభిస్తున్నాయి. నలభై కన్నా పై కొలతలలో ఉన్నవారిని ‘ప్లస్ సైజ్’ అంటారు. ఈ సైజ్ వారికి డ్రెస్సులు కావాలంటే మాత్రం ‘సారీ, టైలర్‌తో చెప్పి కుట్టించుకోండి..’ అని సలహా ఇస్తుంటారు. ఫ్యాషనబుల్‌గా కనిపించాలనుకుని సరైన కొలతలలో లేని దుస్తులు తెచ్చుకొని ఇబ్బంది పడటం, టైలర్ సరైన కొలతలలో డ్రెస్ కుట్టకపోవడం, తమ శరీరాకృతికి సరిపడా ఎలాంటి దుస్తులు వేసుకోవాలో, డిజైన్ చేయించుకోవాలో తెలియకపోవడం.. ఇవన్నీ అధికబరువు (ప్లస్ సైజ్) ఉన్నవారి ప్రధాన సమస్యలు. లావుగా ఉన్నా అందంగా, కాలానుగుణంగా వేషధారణ హుందాగా ఉండాలంటే... దుస్తుల ఎంపిక సరిగ్గా ఉండాలి. ఈ విషయాలపై అవగాహన పెంచుకుంటేమీ జీవనశైలి మరింత సులభంగా, మరింత సుందరంగా మారిపోతుంది. మీ శరీరాకృతి లావుగా ఉంటే... బాధాపడాల్సిన అవసరమే లేదు. ఫ్యాషన్ డిజైనర్లు. ప్లస్ సైజ్ ఉమన్ దుస్తుల ఎంపికకు ఇస్తున్న ఈ సూచనలు పాటించండి... బిగుతుగా ఉండే దుస్తులను కొనుగోలు చేయకూడదు/ధరించకూడదు. చిన్న సైజు, బిగుతుగా ఉండే దుస్తులు ధరిస్తే మరింత లావుగా కనిపిస్తారు. మరీ వదులుగా ఉండే దుస్తులను కొనుగోలు చేయకూడదు/ధరించకూడదు. ‘బాగా వదులుగా ఉండే దుస్తులు ధరిస్తే సన్నగా కనపడతాం’ అనుకోవడం అపోహ. వేలాడుతున్నట్టుగా ఉండే దుస్తులను ధరిస్తే మరింత లావుగా కనిపిస్తారు. అధికబరువున్న వారు ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ప్లస్ సైజ్ ఉమన్‌కు డిజైన్ చేసిన బ్రాండెడ్ దుస్తుల్లోనూ అన్నీ ఒకే తరహావి ఉంటాయి. ఒక్కోసారి ఆ డ్రెస్ కొలతలు మీకు నప్పకపోవచ్చు. అందుకని ఎంపిక చేసుకునేటప్పుడు ఒకసారి కొనుగోలు చేసే దుస్తులను వేసుకొని, అద్దంలో చూసుకొని, నప్పితేనే తీసుకోవాలి. లావుగా కనిపించే శరీర భాగాలలో ముదురు రంగులతో కవర్ చేసే డిజైన్లు గల దుస్తులను ఎంపిక చేసుకోవాలి. కాంతిమంతమైన/లేత రంగులకన్నా ఫ్యాషన్‌లో ముదురు రంగులు ఎప్పుడూ ముందుంటాయి. లావుగా ఉన్నవారు వీటిని నిరభ్యంత ధరించవచ్చు. అంతేకాదు ఈ రంగులు అధికబరువును తక్కువగా చూపిస్తాయి. వంగపండు, గోధుమ, బూడిద... రంగువి కూడా ముదురు రంగులలో ఎంపిక చేసుకోవచ్చు. అయితే టాప్ (నడుము పై భాగంలో) కలర్ ముదురు రంగులో ఎంపిక చేసుకుంటే బాటమ్ (నడుము కింది భాగంలో) లేత రంగులో తీసుకోవాలి. అధికబరువు ఉన్నవారు దుస్తులతో ఇంకాస్త బరువును పెంచుకోకూడదు. దుస్తులకు వచ్చే పెద్ద పెద్ద బటన్స్, పెద్ద పాకెట్స్, వెడల్పాటి కుచ్చులు.. ఎదుటివారి దృష్టి పడేలా చేస్తాయి. అందుకని దుస్తులపై డిజైన్స్ ఇలా అన్నీ పెద్ద పెద్దగా ఉండేవి ఎంచుకోకూడదు. ప్యాంట్స్ అయితే బ్యాక్ పాకెట్స్‌పై, టాప్స్ అయితే చేతులు లేని జాకెట్‌పై ఎంబ్రాయిడరీ లేకుండా జాగ్రత్తపడాలి. మీ వార్డ్రోబ్ నుంచితొలగించాల్సినవి..! చాలా పొట్టిగా ఉండే షార్ట్స్ వదులుగా ఉండే ట్రౌజర్స్ పొట్టి లంగాలు (మినీ స్కర్ట్స్) మామ్ జీన్స్ (నడుము, పిరుదుల భాగం ఎక్కువ వదులు ఉండేవి) రిప్డ్ జీన్స్ (అక్కడక్కడా చిరుగులు ఉన్న జీన్ ప్యాంట్స్), కార్గో ప్యాంట్స్ బ్యాగీ జీన్స్ (పూర్తి వదులుగా ఉండేవి) ఫిట్‌గా లేని బ్లేజర్స్ బ్యాగీ స్వెట్స్ పొడవు లంగాలు మెరిసే రాళ్లు, కుందన్స్, చమ్కీతో చేసిన డిజైన్లు గల దుస్తులు ఎక్కువ కుచ్చులు ఉన్న డ్రెస్సులు పెద్ద పెద్ద ప్రింట్లు ఉన్న దుస్తులు రంగురంగులుగా ఉండే కౌబాయ్ బూట్లు. ‘ప్లాట్’గా పై నుంచి కిందకు ఒకే విధంగా ఉండేలాంటి దుస్తులు తీసుకోకూడదు. మహిళలు సాధారణం గా తమ వేషధారణ ఒకే రంగు (మ్యాచింగ్)లో ఉండాలనుకుంటారు. మ్యాచింగ్ అధికమైతే ఇంకాస్త లావుగా కనిపిస్తారు. ‘కాంట్రాస్ట్’ (ఒకదానితో ఒకటి పోలిక లేనివి) కలర్స్ దుస్తులు వేసుకుంటే మేలు. ఉదా: స్కర్ట్/ప్యాంట్స్ వేసుకునేవారు అదే రంగు టీ షర్ట్ వేసుకోకూడదు. టీ షర్ట్‌పైన వేసుకునే ఓవర్‌కోట్ స్కర్ట్/ప్యాంట్ ఒకే రంగులో ఉండేలా ఎంపిక చేసుకోవాలి. సైజ్ చార్ట్! ఛాతీ పరిమాణం 41-45, నడుము పరిమాణం 33-37 హిప్ (పిరుదుల)పరిమాణం 43-47 ఉన్నవారు XXSసైజ్ దుస్తులను ... ఛాతీ పరిమాణం 77-83, నడుము 71-78 హిప్ (పిరుదుల)పరిమాణం 80-90 ఉన్నవారు XXLసైజ్ దుస్తులను ఎంపిక చేసుకోవాలి. ప్లస్ సైజ్ వారు ఆన్లైన్ చార్ట్‌ను అనుసరించవచ్చు. అలంకరణ అనేది వస్తువుల స్థాయిని పెంచాలి. మీరు లావుగా ఉంటే ధరించే ఆభరణా లు సన్నగా ఉంటే ఏ మాత్రం కనిపించవు. అందుకని మధ్యస్థం- పెద్ద సైజున్నవి ఎంచుకోవాలి. మీ కాళ్లకు తగిన మందపాటి హీల్ ఉన్న చెప్పులు ధరించాలి. అలాగే పెద్ద పర్స్/బ్యాగ్ వెంట తీసుకెళ్లాలి. ఈ తరహా ఇతర అలంకరణ వస్తువులు మిమ్మల్ని సన్నగా చూపిస్తాయి. నోట్: మరీ పెద్ద పెద్దవి కాకుండా... మీరు ఉన్న లావును కొద్దిగా అధిగమించేలా మాత్రమే మీ ఇతర అలంకరణ వస్తువులు ఉండాలనే విషయం మర్చిపోవద్దు. అలంకరణ సమయంలో మీ బరువు, మీ ఎత్తు సైజ్, ఎముక సామర్థ్యం.. ఇవన్నీ దృష్టిలోపెట్టుకోవాలి. మీ వార్డ్రోబ్లోఉండాల్సివి..! వి నెక్ గల తెల్లటి చొక్కా (బటన్ డౌన్ షర్ట్) శరీరాకృతికి సరిగ్గా సరిపడే నలుపు రంగు డ్రెస్. ఫిట్‌గా ఉండే లాంగ్ ప్యాంట్స్ ఫిటెడ్ బ్లేజర్స్ ప్రస్తుత కాలానికి తగ్గ దుస్తులు మీకు మాత్రమే ప్రత్యేకం అనిపించే స్టైల్ దుస్తులు హాఫ్ స్కర్ట్(మోకాళ్ల వరకు ఉండేది) ఎంపిక సరైనది పొట్టను కవర్ చేసే డిజైనర్ దుస్తులు. (వీటి ఎంపికలో డిజైనర్/షాప్/ ఆన్లైన్ సాయం తీసుకోవచ్చు) శరీరాకృతికి సరిగ్గా నప్పేవి, సరైన ఫిట్‌తో ఉన్న లో దుస్తులు బెల్ట్‌లు, ఆభరణాలు, పాదరక్షలు.. వీటితోనూ మీ దుస్తుల్లో కొత్త మార్పులు తీసుకురావచ్చు. దుస్తులు కుట్టించుకోవాలంటే... కుర్తా, టాప్స్ టైలర్‌తో కుట్టించుకునేటప్పుడు ‘సైడ్ ఓపెన్స్’ పిరుదుల పై భాగం వరకు పెట్టించుకోవాలి. దీని వల్ల కూర్చునేటప్పుడు డ్రెస్ ముందు భాగం పొట్టమీదకు రాకుండా ఉంటుంది. వెయిస్ట్ భాగంలో బిగుతుగా ఉండే డ్రెస్ వల్ల మరింత లావుగా కనిపించే అవకాశం ఉంది. జాకెట్టు చేతులు కుచ్చులున్నవి డిజైన్ చేయించుకుంటే చేతులు మరింత లావుగా కనిపిస్తాయి. లావుగా ఉన్నవారికి బ్రాడ్, ఓవర్ నెక్స్ సరిగ్గా నప్పుతాయి. నోట్: లావుగా ఉన్నప్పటికీ పొడవుగా ఉన్నవారు... స్లీవ్స్, ప్యాంట్స్, లెగ్గింగ్స్ సరైన ఫిట్‌తో ఉండేవి తీసుకోవచ్చు. పొట్టిగా ఉంటే నిలువు చారలు ఉన్నవి, విభిన్న రకాల రంగుల్లో ఉన్న డ్రెస్సులను ఎంచుకోవాలి. చీరలు కట్టుకునేవారు కాటన్ చీరలు కట్టుకుంటే మరింత లావుగా కనిపించే అవకాశం ఉంది. 42 - 62 అంగుళాల పరిమాణంలో ఉన్నవారి కోసం సాధారణ దుస్తుల నుంచి పార్టీవేర్ వరకు ప్లస్ సైజ్ స్టోర్లలో అన్ని రకాల బ్రాండ్లలో (టాప్స్, కుర్తీస్, లెగ్గింగ్స్, జీన్స్, టీ షర్ట్స్, పార్టీవేర్, వెస్ట్రన్‌వేర్, ట్రెడిషనల్ వేర్..) నాణ్యమైన దుస్తులు లభిస్తున్నాయి. ఇవన్నీ కాటన్, టెరీకాటన్, సిల్క్, సింథటిక్... మెటీరియల్స్‌లో లభిస్తున్నాయి. - నిర్మలారెడ్డి కర్టెసీ ప్లస్ సైజ్, పంజగుట్ట, హైదరాబాద్ -
ఈ పాటకు ట్యూన్ తెలుసా?
ఈ పాటకు ట్యూన్ తెలుసా? పల్లవి : అతడు: రావె నా చెలియా రావె నా చెలియా రయ్యంటు రావె చెలి వారెవ్వా చెలియా వయసైన చెలియా ఊరంతా గోల చెయ్యి ఆమె: మమతకు నువ్వు ప్రతిబింబం తల్లికన్నా గారాబం చిననాటి అనురాగం వయసైతే అనుబంధం అ: ఏ అవ్వా నా గువ్వా నువ్వింకా అందం దోచెయ్యి ॥॥ చరణం : 1 అ: జీన్స్ పాంటు వేసుకో లిప్ స్టిక్కు పూసుకో నిజమైన తలనెరుపే డై వేసి మార్చుకో...ఓ... యే... ఆ: ఓలమ్మో ఏమి చోద్యం నా వయసే సగమాయే అ: క్లింటన్ నంబరు చేసిస్తాను గలగలమంటూ ఐ లవ్ యూ నువ్ చెప్పెయ్యి ఆ: నువ్వెవరంటే మిస్ వరల్డ్ కాదు మిస్ ఓల్డని చెప్పేయి ॥ చరణం : 2 ఆ: ఓ... కంప్యూటర్ పాటలకు పులివేషం నువ్వాడు అ: ఎంటీవీ ఛానెల్లో శక్తి స్తోత్రం నువ్ పాడు టూ పీసు డ్రస్ వేసి సన్ బాతూ చెయ్యి బామ్మా డిస్నీలాండులో కళ్లాపి జల్లి బియ్యపు పిండితో ముగ్గులు వేద్దాం రాబామ్మా రోడ్డు మధ్యలో కొట్టేపెట్టి గారెలు వేసి అమ్ముదామా ॥ చిత్రం : జీన్స్ (1998) రచన : ఎ.ఎం.రత్నం, శివగణేష్ సంగీతం : ఎ.ఆర్.రెహమాన్ గానం : సోను నిగమ్, హరిణి -
గీత స్మరణం
పల్లవి : పాపమ పనిపమ పనిపమ గమపా సగసని పనిపమ గమగసగమపా ॥ తకడ తకడ తక ధిమ్ (2) తకడ త కడతక ధిమ్ తక ఝం ॥ కన్నులతో చూసేవీ గురువా కనులకు సొంతమౌనా... కనులకు సొంతమౌనా కన్నుల్లో కనుపాపై నీవు కన్ను విడిపోలేవూ... ఇక నను విడిపోలేవూ ॥ చరణం : 1 జలజల జలజల జంట పదాలు గలగల గలగల జంట పెదాలు ఉన్నవిలే తెలుగులో ఉన్నవిలే విడదీయుటయే న్యాయం కాదు విడదీసేస్తే వివరం లేదు రెండేలే రెండు ఒకటేలే ధినక ధినక ధిన ధిల్లిల్లాన నాదిర్తాని తొందిరతాని దినతోం (2) రేయీ పగలు రెండైనా రోజు మాత్రం ఒకటేలే కాళ్లు ఉన్నవి రెండైనా పయనం మాత్రం ఒకటేలే హృదయాలన్నవి రెండైనా ప్రేమ మాత్రం ఒకటేలే ॥ చరణం : 2 క్రౌంచ పక్షులు జంటగ పుట్టును జీవితమంతా జతగా బ్రతుకును విడలేవూ వీడిమనలేవూ కన్ను కన్ను జంటగ పుట్టును ఒకటేడిస్తే రెండోదోదార్చును పొంగేనా ప్రేమే చిందేనా ॥ ఒక్కరు పోయే నిద్దురలో ఇద్దరి కలలను కంటున్నాం ఒక్కరు పీల్చే శ్వాసలలో ఇద్దరి జీవనమంటున్నాం తాళికొరకు మాత్రమే విడివిడిగా వెతుకుతున్నాం ॥ మమగగ మమసస గగసస గగనిని సగగ సమమ సగగ సపప సగగ సనిని సగసస సానిదపమగా గమపని సగా రిసా సానిదపామగారీ సగమ ॥ పపనినిసాస గగమమ పపనిని సాస నిసగమపని దపమా గామ పని సగరిద నిసమగరిసనిద ॥ రీరీ సనిస రిరిస సరిరినిని సాస గరిస నిసగరిసని దప పాప నిదప మగసరి నిసగా సగమ గమపా నిదపప మపనీ పపని సగరిస గరిసని సానిదపామా గమపమ ॥ చిత్రం : జీన్స్ (1998) రచన : ఎ.ఎం.రత్నం, శివగణేష్ సంగీతం : ఎ.ఆర్.రెహమాన్ గానం : నిత్యశ్రీ నిర్వహణ: నాగేశ్ -
అత్తయ్య ఐతేనేం?కత్తుల రత్తయ్య ఐతేనేం?
రెక్కలు టపటపలాడించడానికి.. రివ్వున ఎగిరిపోడానికీ... కాలం కాదిది. చలి ఎలా ఉందో చూశారు కదా! కత్తుల రత్తయ్యలా తిరుగుతోంది. కొత్త కోడలి అత్తగారిలా వణికిస్తోంది. బయటికి బయల్దేరినవారెవరైనా... నిండా స్వెటర్ కప్పుకుని బుద్ధిగా చేతులు కట్టుకుని భుజాలను దగ్గరకు బిగించుకుని ‘కృష్ణా, రామా...’ అనుకుంటూ వెళ్లిన దారినే వచ్చేయడం క్షేమకరం. కానీ మగువలు ఊరుకుంటారా! చలి గాలులకు జడిసి నిలబడిపోతారా?! చలి కోట్ల కింద అందమైన డ్రెస్‌లను దాచేసుకుని వేడుకలను వెలవెలబోనిస్తారా! నో... వే..! ఊలుతోనే సల్వార్ కమీజ్‌లు, ఊలుతోనే లెగ్గింగ్స్ డిజైన్ చేయించుకుని... వింటర్లో స్వేచ్ఛగా విహరిస్తున్నారు! మీరూ ఫాలో అవండి! అదే బెస్ట్. ఆల్ ది బెస్ట్. 1- లక్నో వర్క్ చేసిన జ్యూట్, కాటన్ మెటీరియల్‌తో తయారు చేసిన బ్లేజర్ చలిని ఆపుతుంది. దీనికి ఇన్నర్‌గా కాంట్రాస్ట్ స్పగెట్టి లేదా టీ షర్ట్ వేసుకొని, జీన్స్‌కి మ్యాచ్ అయ్యే బెల్ట్ వాడాలి. కార్పొరేట్ ఉద్యోగులు ఇలా రెడీ అయితే వింటర్లో సౌకర్యవంతంగానూ, స్టైల్‌గానూ కనిపిస్తారు. 2- లేత పచ్చపువ్వుల ప్రింట్ ఉన్న మందపు కాటన్ క్లాత్‌తో డిజైన్ చేసిన బ్లేజర్, లోపల స్పగెట్టి లేదా టీ షర్ట్ ధరించి బెల్ట్ వాడాలి. జెగ్గింగ్ లేదా జీన్స్ ధరిస్తే స్టైల్‌గా ఉంటుంది. ఈ డ్రెస్ చలిని తట్టుకునేవిధంగా ఉంటుంది. సింపుల్‌గా సౌకర్యవంతంగా అనిపించే ఇలాంటి స్టైల్స్‌ని మీరూ ట్రై చేయవచ్చు. 3- ఆరెంజ్ రా సిల్క్ టాప్ పైన వెల్వెట్ ఓవర్ కోట్ వాడాలి. వెల్వెట్ క్లాత్ మందంగా ఉంటుంది. చలి తట్టుకునే విధంగానూ, ఫ్యాషన్‌గానూ ఉంటుంది. టాప్‌కి వాడిన ముదురురంగు లైన్స్‌ను బట్టి జెగ్గింగ్ ఎంచుకుంటే పర్ఫెక్ట్ వింటర్ డ్రెస్ అవుతుంది. 4- జెగ్గింగ్ ధరించి, పైన టీ షర్ట్ వేసి ఆపైన ఊలు ఓవర్ కోట్‌ను వాడటంతో స్టైల్‌గా కనువిందుచేస్తోంది ఈ డ్రెస్. కాలేజీకెళ్లే అమ్మాయిలకు ఈ స్టైల్ బాగుంటుంది. 5- ఊలుతో డిజైన్ చేసిన డ్రెస్సులు చలిని ఆపుతాయి. అందుకని స్వెటర్స్ అల్లేవారితో సల్వార్ కమీజ్, లెగ్గింగ్స్ మన శరీర కొలతల ప్రకారం తయారుచేయించుకోవచ్చు. వంగపండు రంగు ఊలుతో డిజైన్ చేసిన ఈ సల్వార్ కమీజ్, నలుపు రంగు ఊలుతో తయారుచేసిన ఈ లెగ్గింగ్ అలా డిజైన్ చేసినవే! నెక్కి గోటా బార్డర్, బ్లాక్ అండ్ వైట్ వీవింగ్ వల్ల ఈ సల్వార్ కమీజ్ హైలైట్‌గా నిలిచింది. ఊలుకు సాగే గుణం ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈ డ్రెస్ పైన రెగ్యులర్ యాక్సెసరీస్ ఏవైనా వాడుకోవచ్చు. ట్రెడిషనల్‌గా ఉండాలంటే డ్రెస్‌లోని రంగులను బట్టి ఇయర్ రింగ్స్, చెప్పులు ధరించాలి. మోడల్స్: అశ్విని, సొనాలి ఫొటోలు: శివమల్లాల మంగారెడ్డి, ఫ్యాషన్ డిజైనర్ www.mangareddy.com -
అనంతరం : పేరు తండ్రిది... ప్రఖ్యాతి తనది!
తల్లిదండ్రుల పోలికలు పిల్లలకు వస్తాయని చెప్పవచ్చు. కానీ పిల్లలు తల్లిదండ్రుల అడుగుజాడల్లోనే నడుస్తారని మాత్రం చెప్పలేం. ఎందుకంటే, మొదటిది జీన్స్‌ని బట్టి జరుగుతుంది. రెండోది వాళ్లు పెరిగే పరిస్థితులు, పరిసరాలు, పెంచుకున్న ఆసక్తులను బట్టి జరుగుతుంది. ప్రముఖ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్ పిల్లల్ని చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దిలీప్ వెంగ్‌సర్కార్... ఒకప్పుడు దేశమంతా మోగిపోయిన పేరు. క్రికెట్ క్రీడకు వన్నె తెచ్చినవాళ్లలో ఈయన స్థానం ప్రముఖమైనదే. అంత గొప్ప ఆటగాడికి కొడుకు పుడితే... మరో గొప్ప క్రీడాకారుడు పుట్టాడు అన్నారంతా. ఆ మాటలకు వెంగ్‌సర్కార్ మురిసిపోయారు. అన్నాళ్లూ క్రికెట్ బ్యాట్‌ని అపురూపంగా చేతుల్లోకి తీసుకున్న ఆయన... తన వారసుడిని ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకున్నారు. కానీ ఆయన అప్పుడు ఊహించి ఉండరు... తన కొడుకు చేతిలో క్రికెట్ బ్యాట్ కాదు, కెమెరా ఉంటుందని. తన పేరు వెనుక వెంగ్‌సర్కార్ అనే ఓ గొప్ప క్రీడాకారుడి పేరు ఉన్నా... ఆ పేరును, ఆ పేరు గల వ్యక్తిని తప్ప ఆ క్రీడను ప్రేమించలేకపోయాడు నకుల్. అలాగని తనకి ఆటలంటే అనాసక్తి ఏమీ లేదు. స్కూల్లో గోల్ఫ్, బాస్కెట్‌బాల్, క్రికెట్ ఆడేవాడు. అయితే క్రికెట్ మీద దృష్టి కేంద్రీకరించాలన్న ఆలోచన మాత్రం అతడికెప్పుడూ రాలేదు. ఎందుకు అంటే చాలా స్పష్టమైన సమాధానం చెబుతారు నకుల్. ‘‘మారుమూల గల్లీలోకి వెళ్లినా, క్రికెట్ ఫీవర్‌తో ఊగిపోతుంటారంతా. ప్రతి కుర్రాడూ దేశం తరఫున ఆడేయాలని కలలు కంటూ ఉంటాడు. నాకూ క్రికెట్ అంటే ఇష్టమే. కానీ దాన్నే జీవితంగా మార్చుకునేంత ఇష్టం మాత్రం లేదు’’... ఇదీ నకుల్ సమాధానం. వెంగ్సర్కార్కి కొడుకు బ్యాట్ పట్టుకుంటే చూడాలన్న ఆశ అంతర్లీనంగా ఉన్నా... ఆ ఆశ తన కొడుక్కి బలహీనత కాకూడదని అనుకున్నారు. అందుకే అతడు ఆర్కిటెక్ట్ అవుతానంటే సరే అన్నారు. ఇటలీ వెళ్లి, ఆర్కిటెక్చర్ కోర్సులో చేరాడు నకుల్. కానీ అక్కడ అతడికెందుకో ఫొటోగ్రఫీ పట్ల ఆసక్తి కలిగింది. కనిపించిన ప్రతి దృశ్యాన్నీ లెన్సులో బంధించడం మొదలుపెట్టాడు. ఆర్కిటెక్చర్ పూర్తి చేసి ముంబై వచ్చినా... ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నా... అతడి మనసంతా ఫొటోగ్రఫీ మీదే. దాంతో తను తీసిన నలభై మూడు ఛాయాచిత్రాలతో ప్రదర్శన నిర్వహించాడు. వచ్చిన స్పందన అతడి తండ్రిని ఆశ్చర్యపరిచింది. ‘‘ఆ రోజు నాకింకా గుర్తుంది. వచ్చినవాళ్లంతా నా చిత్రాలను, నా ఫొటోగ్రఫీని పొగుడుతుంటే నాన్న కళ్లలో గర్వం! అప్పుడే అర్థమైంది... నేను ఎంచుకున్న మార్గం సరైనదేనని’’ అని చెబుతాడు నకుల్. ఒకవేళ తాను క్రికెటర్ కాలేదని నాన్నలో ఎక్కడైనా కాస్త బాధ ఉండి ఉంటే ఆ రోజు పూర్తిగా తొలగిపోయి ఉంటుంది అంటాడు. కానీ ఆయన అలా బాధపడే వ్యక్తి కాదు అన్నది వెంగ్‌సర్కార్ కూతురు పల్లవి అభిప్రాయం. పల్లవి కూడా తన సోదరుడు నకుల్లాగే వైవిధ్యంగా ఆలోచించింది. తండ్రి పేరుతో గుర్తింపు పొందడం కాదు, తనకంటూ ఓ గుర్తింపు ఉండాలని తపన పడిందామె. మోడల్ అయ్యి ఇంట్లోవాళ్లను ఆశ్చర్యపర్చింది. నాన్న తమ మనసు తెలుసుకునే నడుచుకున్నారు తప్ప, ఇది చెయ్యండి, ఇలా అవ్వండి అని ఏ రోజూ బలవంతపెట్టలేదు అంటుందామె. ఎవరి జీవితం ఎప్పుడే మలుపు తీసుకుంటుందో, ఎవరినెక్కడికి చేరుస్తుందో చెప్పలేమనడానికి నకుల్, పల్లవిలే మంచి ఉదాహరణ. బ్యాట్, బంతి, పిచ్, నెట్ ప్రాక్టీస్ అన్న పదాలే వింటూ పెరిగినా... వారినవి ఆకర్షించలేకపోయాయి. కానీ పెద్దయ్యాక పరిచయమైన ఆర్కిటెక్చర్, ఫొటోగ్రఫీ, మోడలింగ్ లాంటివి పెద్ద ప్రభావమే చూపాయి. వారిని సొంతగా ఎదిగేలా చేశాయి. తన ఇష్టాన్ని వారి మీద రుద్దకుండా, వారి నిర్ణయాలను గౌరవించిన వెంగ్‌సర్కార్ ఇప్పుడు తన బిడ్డల్ని చూసి ఎంతో గర్వపడుతున్నారు. వాళ్లు తన బాటలో నడవకపోయినా, తన పేరు నిలబెట్టారంటూ పొంగిపోతున్నారు! - సమీర నేలపూడి