ఆ కాలేజీలో జీన్స్, లెగ్గిన్స్ నిషేధం!
ఆ కాలేజీలో జీన్స్, లెగ్గిన్స్ నిషేధం!
Published Fri, Oct 21 2016 2:26 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 PM
కేరళ : తిరువనంతపురంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో బాలికల డ్రస్ కోడ్పై ప్రత్యేక ఆదేశాలు జారీఅయ్యాయి. జీన్స్, లెగ్గిన్స్, ఇతర శబ్దాలు చేసే ఆభరణాలు ధరించి విద్యార్థులు కాలేజీకి రావడానికి వీల్లేదని, డ్రస్ కోడ్లో భాగంగా వాటిని నిషేధిస్తున్నట్టు పేర్కొంది. కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ గురువారం ఈ సర్క్యూలర్ను జారీచేశారు. రెగ్యులర్ అటెండెన్స్, ఫైనల్ ఇంటర్నెల్ మార్కులపై నిబంధనలు జారీచేసిన ఆయన, డ్రస్ కోడ్పై కూడా ఆదేశాలు విద్యార్థులకు పంపారు. ఈ సర్క్యూలర్ల్లో అబ్బాయిలు, అమ్మాయిలు కాలేజీలో చేసివి, చేయకూడని విషయాలను పేర్కొన్నారు. కాలేజీకి వచ్చే ముందు కచ్చితంగా ఫార్మల్ డ్రస్ వేసుకుని రావాలని వైస్ ప్రిన్సిపాల్ ఆదేశించారు. అబ్బాయిలు చక్కగా, శుభ్రమైన దుస్తులు ధరించాలని, ఫార్మల్ డ్రస్, షూతో కనిపించాలని వైస్ ప్రిన్సిపాల్ ఈ సర్క్యూలర్లో తెలిపారు.
ఇక అమ్మాయిల విషయానికి వస్తే చుడీదార్ లేదా చీరలోనే కాలేజీకి రావాలని చెప్పారు. జడలను కూడా వదులుగా కాకుండా, గట్టిగా కట్టుకుని రావాలని పేర్కొన్నారు. అయితే కేరళలో మొదటిసారేమీ డ్రస్ కోడ్పై ఇలాంటి ఆదేశాలు జారీ కాలేదు. ఈ ఏడాది మొదట్లో కోజికోడ్లోని ఓ కాలేజీ కూడా అమ్మాయిలు కాలేజీకి జీన్స్ వేసుకోని రాకూడదని ఆదేశించింది. మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలపై డ్రస్ కోడ్లపై వస్తున్న ఆదేశాలపై అమ్మాయిలు అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. చీరలను హ్యాండిల్ చేయడం కొంచెం కష్టతరమని, ఎగ్జామ్స్, ప్రాక్టికల్స్ సమయాల్లో ముఖ్యంగా దుప్పటాతో ఇబ్బంది పడాల్సి వస్తుందంటున్నారు.
Advertisement
Advertisement