
ఫ్యాషన్ ట్రెండ్ అనేది నిరంతరం మారుతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడూ లేటెస్ట్ ట్రెండ్ వచ్చేస్తుంటుంది. అయితే కొన్ని ఫ్యాషన్ డిజైన్‌లు చూస్తే అబ్బా ఇదేం ఫ్యాషన్ అని నెటజన్లు మండిపడేలా ఉంటాయి. అసలు వాటిని ఎలా ధరిస్తారురా బాబు అనే ఫీలింగ్ వచ్చేస్తుంటుంది కూడా. అయితే వాటి ధర చూస్తే అంత పలుకుతుందా అని నెటిజన్లు షాక్ అయ్యేలా ఉంటాయి. అలాంటి ఫ్యాషన్ ట్రెండ్ ప్రస్తుతం నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది.
ఇదేం పిచ్చి ఫ్యాషన్ అని తిట్టుకుంటున్నారు నెటిజన్లు. నిజంగా ఇది స్టైలిష్ ఫ్యాషనా..? లేక తెలియక ఏదో అలా డిజైన్ చేశారా..? అని నెట్టింట చర్చించుకుంటున్నారు. ఫ్రెంచ్ లగ్జరీ లేబుల్ కోపర్ని కలెక్షన్‌కి సంబంధించిన డిజైనర్‌వేర్ వన్ లెగ్డ్ జీన్స్ గురించి ఫ్యాషన్ ఇన్‌ఫ్లుయెన్సర్ క్రిస్టీ సారా వీడియో రూపంలో తన అభిప్రాయాన్నిషేర్ చేసింది. దీంతో ఈ డిజైనర్‌వేర్ నెట్టింట హాట్‌టాపిక్ మారింది ఇది.
ఆ వీడియోలో ఆమె భర్త సడెన్‌గా ఎంటర్ అయ్యి ప్రస్తుతం దీన్ని ఎవ్వరూ ధరించడం లేదని అన్నారు. అయితే సారా మాత్రం ఈ డిజైన్ నచ్చింది కానీ కాస్త పెద్ద సైజు కావాలన్నారు. అయితే దీని ధర మాత్రం రూ. 38 వేలు పైనే పలుకుతోందని తెలిపింది.
తక్కువలో దొరికితే ఇలాంటి డిజైన్‌లు ట్రై చేయగలమని తన అభిప్రాయాన్ని పంచుకుంది. కానీ నెటిజన్లు మూవీలో ఫన్ కోసం నటులు వేసుకున్నారనుకున్నాం. ఇది కూడా ఓ ఫ్యాషన్‌నే అంటూ మండిపడ్డారు. అసలు ఎలా ధరించి బయటకు రాగలరు. ఏ ఫ్యాషన్ అయినా చూసేవాళ్లకు, మనకు కూడా కంఫర్ట్ ఉండాలి కదా అని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: సమ్మర్‌లో స్లిమ్‌గా మారడం ఈజీ..! ఎలాగంటే..)
Comments
Please login to add a commentAdd a comment