ఆ ట్రీట్‌మెంట్‌ నా జీవితాన్నే నాశనం చేసింది: ప్రఖ్యాత మోడల్‌ | Supermodel Linda Evangelista Is Disfigured After Cosmetic Treatment Gone Wrong | Sakshi
Sakshi News home page

Model Linda Evangelista: ఆ ట్రీట్‌మెంట్‌ నా జీవితాన్నే నాశనం చేసింది

Published Fri, Sep 24 2021 4:11 PM | Last Updated on Fri, Sep 24 2021 4:33 PM

Supermodel Linda Evangelista Is Disfigured After Cosmetic Treatment Gone Wrong - Sakshi

లిండా ఎవాంజెలిస్టా దశాబ్దాలుగా ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన పేరు సంపాదించిన సూపర్‌ మోడల్‌. 80, 90లలో లిండా నవోమి కాంప్‌బెల్, కేట్ మోస్ వంటి ప్రఖ్యాత మోడల్‌లతో పాటు ర్యాంప్‌ వ్యాక్‌లో పాల్గొంది. దీంతో పాటు పలు ప్రఖ్యాత మ్యాగజైన్ కవర్‌లలో తన ఫోటోలు ప్రచురితమయ్యాయి. అంతటి పాపులర్‌ మోడల్‌ అయినప్పటికీ ఓ మోసపూరిత కాస్మెటిక్‌ ట్రీట్‌మెంట్‌ ఆమె జీవనోపాధిని నాశనం చేసిందని తాజాగా లిండా సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ షేర్ చేసింది.

ఆ పోస్ట్‌లో.. ఐదు సంవత్సరాల క్రితం తాను చేసుకున్న కాస్మెటిక్ ట్రీట్మెంట్ వల్ల తాను శాశ్వతంగా వైకల్యం చెందినట్లు లిండా తెలిపింది. 56 ఏళ్ల ఈ మోడల్‌ ఓ సంస్థ సర్జరీ లేకండా ఫ్యాట్‌ కంటెంట్‌ తొలగిస్తామని నమ్మబలికి చివరికి ఆ వైద్యం దానికి విరుద్ధంగా జరిగిందని ఆరోపించింది. ఆ ట్రీట్‌మెంట్‌ సైడ్-ఎఫెక్ట్ తన జీవనాధారాన్ని పూర్తిగా నాశనం చేసిందని వివరిస్తూ.. ఇది నన్ను తీవ్ర నిరాశ, విచారం, నిరాశలోకి పంపిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియలో ఒంటరిగా మారిపోయానంటూ తన అవేదనను తెలిపింది.

అయితే లిండా తనకు జరిగిన అన్యాయం పై చట్టపరంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఫ్యాషన్, వినోద ప్రపంచంలోని సభ్యుల నుంచి లిండాకు మద్దతు లభిస్తోంది. ఇప్పటికి ఈ విషయమై పలువురు ఫ్యాషన్‌ రంగంలో పలువురు ప్రముఖులు ఆమెకు మద్దతు తెలుపుతూ సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. లిండా ఎవాంజెలిస్టా మోడలింగ్ కెరీర్ 1984లో ప్రారంభమైంది.

చదవండి: నటి పుట్టినరోజు వేడుకల్లో అపశ్రుతి... కొంచెమైతే ఏమయ్యేదో..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement