Bodyshaming
-
శరీరాకృతిపై వ్యాఖ్యలూ లైంగిక వేధింపులే
కొచ్చి: మహిళ రూపురేఖలను వర్ణిస్తూ ద్వంద్వార్థం ధ్వనించేలా వ్యాఖ్యలు చేసినా, ఎస్ఎంఎస్ సందేశాలు పంపినా లైంగిక వేధింపుల సెక్షన్ల కింద అవి నేరంగా పరిగణించబడతాయని కేరళ హైకోర్టు స్పష్టంచేసింది. ఒకే కార్యాలయంలో పనిచేసిన కాలంలో తోటి మహిళా ఉద్యోగిపై తాను చేసిన వ్యాఖ్యల కుగాను నమోదైన లైంగిక వేధింపుల కేసులను కొట్టేయాలంటూ కేరళ రాష్ట్ర విద్యుత్ బోర్డ్ మాజీ ఉద్యోగి చేసిన అభ్యర్థనను జస్టిస్ ఏ.బధారుద్దీన్ సారథ్యంలోని ధర్మాసనం కొట్టేసింది. ఎర్నాకులం జిల్లాలో కేఎస్ఈబీ ఆఫీస్‌లో పనిచేసిన కాలంలో 2013 ఏడాది నుంచి తనతో అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారని, 2016–17 కాలంలో మొబైల్ ఫోన్‌కు తన రూపురేఖలను వర్ణిస్తూ ఎస్ఎంఎస్లు పంపారని, వాయిస్ కాల్స్ చేశారని బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదుచేసింది. ఆ తర్వాత సైతం అతని నుంచి ఎస్ఎంఎస్లు, ఫోన్‌కాల్స్ ఆగలేదు. దీంతో భారత శిక్షాస్మృతిలోని 354(ఏ)(1)(4), 509 సెక్షన్లతోపాటు కేరళ పోలీస్ చట్టంలోని 120(ఓ) సెక్షన్ కింద సదరు ప్రభుత్వ ఉద్యోగిపై కేసు నమోదైంది. అందంగా ఉందని మాత్రమే ఎస్ఎంఎస్లు పంపానని, ఆ సందేశాల్లో ఎలాంటి తప్పుడు ఉద్దేశంలేదని అతని తరఫు న్యాయవాది చేసిన వాదనలను కోర్టు తిరస్కరించింది. లైంగిక వేధింపుల సెక్షన్లను తొలగించాలంటూ ఆ ఉద్యోగి వేసిన పిటిషన్‌ను కొట్టేస్తూ జడ్జి తీర్పు చెప్పారు. -
అందమైన శరీరాకృతికి బీబీఎల్ సర్జరీ: అంటే ఏంటి..?
మోడల్స్, ప్రముఖులు, సెలబ్రిటీలు మంచి తీరైన శరీరాకృతి కోసం ఏవేవో సర్జరీలు చేయించుకుంటుంటారు. శరీర ఒంపు సొంపులు పొందికగా శిల్పాంలా కనిపించాలని ఆరాటపడుతుంటారు. అందుకోసం చేయించుకునే కాస్మెటిక్ సర్జరీలో అత్యంత ప్రసిద్ధిగాంచింది బ్రెజిలియన్ బట్ లిఫ్ట్ (బీబీఎల్). బొటాకస్, ఫిల్లర్, ఫేస్ లిఫ్ట్‌లు వంటి కాస్మెటిక్ విధానాలు గురించి విన్నాం. కానీ ఇలా తీరైన ఆకృతి కోసం చేసే ఈ బీబీఎల్ సర్జరీ అంటే ఏంటీ..?. నిజంగానే మంచి విల్లు లాంటి ఆకృతిని పొందగలమా అంటే..విదేశాల్లోని మోడల్స్, ఇన్ఫ్లుయెన్సర్లు, హీరోయిన్లు ఎక్కువుగా ఈ బీబీఎల్ కాస్మొటిక్ సర్జరీని చేయించుకుంటుంటారు. ఇది అక్కడ అత్యంత సర్వసాధారణం. అయితే దీనితో అందంగా కనిపించడం ఎలా ఉన్నా..వికటిస్తే మాత్రం ప్రాణాలే కోల్పోతాం. అలానే ఇటీవల 26 ఏళ్ల బ్రిటిష్ మహిళ ఈ ప్రక్రియతో ప్రాణాలు కోల్పోయింది. సోషల్ మీడియాలో ఈ బీబీఎల్ సౌందర్య ప్రక్రియ గురించి విని టర్కీకి వెళ్లి మరీ చేయించుకుంది. అయితే ఆపరేషన్ చేసిన మూడు రోజుల్లోనే మరణించింది. ఈ ప్రక్రియలో ఏం చేస్తారంటే..లైపోసెక్షన్ మాదిరిగానే ఉంటుంది. కాకపోతే ఇందులో కొవ్వుని అంటుకట్టుట చేస్తారు. ఇందేంటి అనుకోకండి. యవ్వనంగా, వంపుగా కనిపించేలా ఆయా ప్రాంతాల్లో కొవ్వుని ఇంజెక్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మొదటి దశలో శరీరంలోని తొడలు లేదా పార్శ్వాలు వంటి భాగాల్లో అదనపు కొవ్వును తొలగిస్తారు. ఆ తర్వాత లైపోసెక్షన్ టెక్నిక్ ఉపయోగించి శుద్ది చేయబడిన కొవ్వుని ఇంజెక్ట్ చేస్తారు. ఈ క్రమంలో కొన్ని దుష్పరిణామాలు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే..ఈ ఇంజెక్ట్ చేసిన కొవ్వు రక్తప్రవాహంలోకి ప్రవేశించి రక్తనాళాలను అడ్డుకుంటే మాత్రం అప్పుడే పరిస్థితి ప్రాణాంతకంగా మారింది. అదీగాక ఈ సర్జరీకి అందరి శరీరాలు ఒకవిధంగా స్పందించవు. ఇక ఆ బ్రిటిష్ మహిళ సర్జరీ చేయించుకున్న తదుపరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంత మరణించిందన సమాచారం. నిజానికి ఇలాంటి.. సౌందర్యానికి సంబంధించిన కాస్మెటిక్ సర్జరీలు చేయిచుకునేటప్పుడు అనుభవజ్ఞుడైన వైద్యుడి పర్యవేక్షణలోనే చేయించుకోవడం అనేది ఎంద ముఖ్యమో, అలానే ఆ తదుపరి కూడా అంతే కేర్‌ఫుల్‌గా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. కాగా, ఈ బీబీఎల్ శస్త్ర చికిత్స 1960లలో బ్రెజిలియన్ సర్జన్ ఐవో పిటాంగి పరిచయం చేశారు. అయితే 2010 నుంచి ఈ శస్త్ర చికిత్స అత్యంత ప్రజాదరణ పొందింది.(చదవండి: హతవిధీ..! నిద్రలో పళ్ల సెట్ మింగేయడంతో..!) -
మూవీ కోసం స్పీడ్‌గా బరువు తగ్గిన రణదీప్..తలెత్తుతున్న దుష్ప్రభావాలు!
బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా స్వాతంత్య్ర వీర్ సావర్కర్ కోసం విపరీతంగా బరువుత తగ్గిపోయాడు. అదికూడా తక్కువ వ్యవధిలోనే కిలోల కొద్ది బరువు తగ్గాడు. చూడటానికి కూడా గుర్తుపట్టలేనంతంగా అతడి శరీర ఆకృతి మారిపోయింది. ఈ విషయమై కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందారు కూడా. దీంతో అతడు వీలైనంత తొందరగా యథాస్థితికి వస్తానని వారికి హామీ ఇచ్చి మరీ ఇందుకు ఉపక్రమించాడు రణదీప్. అలా అతడు ఏకంగా 18 కిలోల వరకు తగ్గిపోయాడు. అంతవరకు బాగానే ఉంది. ఇక్కడే అసలు సమస్య మొదలయ్యింది. అతడు మళ్లీ యథాస్థితికి వచ్చే క్రమంలో శరీరం సహకరిచటం లేదు. పైగా తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాడు. నిజానికి ఇలా వేగంగా బరువు తగ్గటం మంచిదేనా? తలెత్తే దుష్ప్రభావాలేంటీ..? పోషకాహార లోపాలు వేగంగా బరువు తగ్గడానికి ఫ్యాడ్ డైట్లను అనుసరిస్తే, పోషకాహార లోపానికి దారితీస్తుంది. అటువంటి ఆహారాన్ని అనుసరిస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోనక తప్పదు. బరువు తగ్గడం కోసం ముఖ్యంగా పాలు, పాల ఉత్పత్తులను వేరే వాటితో భర్తి చేస్తే.. మరింత సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది. జుట్టు రాలడం శరీరం స్పీడ్‌గా తగ్గే ప్రయత్నంలో విటమిన్లు, ఖనిజాల కొరతకు దారితీస్తుంది. దీంతో జుట్టు రాలు సమస్యను ఎదుర్కొంటారు. బరువుతగ్గే క్రమంలో పోషకాలను అస్సలు పరిమితం చేయకూడదు. కండరాల నష్టం క్యాలరీ-నిరోధిత ఆహారంలో కొవ్వు తగ్గడం ఎలా ఉన్నా..కండరాలపై తీవ్ర ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. ఇది నెమ్మదిగా కండరాలను తినడం ప్రారంభిస్తుంది.అంతేగాదు వేగంగా బరువు కోల్పోవడం వల్ల కండరాల తిమ్మిర్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. స్లో మెటబాలిజం బరువు వేగంగా తగ్గడానికి ప్రయత్నిస్తున్నప్పుడు.. జీవక్రియ కూడా నెమ్మదిస్తుంది. ఎందుకంటే.. చాలా తక్కువ కేలరీలు తీసుకోవడం వల్ల ఇది జరుగుతుంది. అలాగే హార్మోన్లలో మార్పులకు దారితీస్తుంది. ఈ రెండు కారణాల వల్ల జీవక్రియ మందగించి.. మెటబాలిజం దెబ్బతింటుంది. డీహైడ్రేషన్ బరువు తగ్గే క్రమంలో డీహెడ్రేషన్‌కు అనుమతించకూడదు. ఇలా ద్రవాలను తక్కువగా తీసుకునే యత్నం చేస్తే..ఇది చర్మాన్ని పొడిగా చేసి.. నిస్తేజంగా మార్చేస్తుందని వెల్లడించారు. ఇతర సమస్యలు.. శక్తి తగ్గడం పెళుసైన జుట్టు, గోర్ల పెరుగుదల లోపం విపరీతమైన అలసట రోగనిరోధక వ్యవస్థ బోలు ఎముకల వ్యాధి తలనొప్పి చిరాకు మలబద్ధకం ఇలాంటి భయానక దుష్ప్రభావాలు ఎదురవ్వుతాయి. అందువల్ల మెల్లగా బరువు తగ్గడమే మంచిదని నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నారు. కానీ చాలామంది మూవీ కోసం, అందం కోసం వేగంగా బరువుతగ్గి చేజేతులారా సమస్యలు కొని తెచ్చుకుని ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసుకుంటున్నారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: డైట్లో ఇది చేర్చుకుంటే..మందులతో పనిలేకుండానే బీపీ మాయం!) -
'అందంగా లేవు.. లావు తగ్గాలన్నారు'.. మృణాల్‌పై బాడీషేమింగ్ కామెంట్స్!
సీతారామం సినిమాతో క్రేజీ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ నటిస్తోంది. బుల్లితెర నుంచి వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ మొదట మరాఠీ చిత్రాల్లో నటించింది, ఆ తర్వాత హిందీ చిత్రాల్లో నటించింది. అక్కడ పెద్దగా ఆకట్టుకోలేకపోయినా టాలీవుడ్ సీతారామం చిత్రం ద్వారానే ఫేమ్ వచ్చింది. ఆ చిత్రం సక్సెస్ మృణాల్ ఠాగూర్‌ను ఒక్కసారిగా మార్చేసింది. ఇటీవల నాని సరసన నటించిన 'హాయ్ నాన్న' చిత్రం హిట్ కూడా ఈమె ఖాతాలో పడింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన మృణాల్ ఇండస్ట్రీలో ఎదుర్కొన్న ఇబ్బందులను పంచుకుంది. తాను బాడీ షేమింగ్‌కు గురయ్యానని వెల్లడించింది. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం. అయితే ముఖ్యంగా బాలీవుడ్ చిత్రాల్లో నటించే రోజుల్లో ఇబ్బందులకు గురైనట్లు తెలిపింది. నాకు నటించేందుకు అవకాశాలు ఇచ్చినప్పటికీ.. మరొకరితో పోలుస్తూ మీరు వారిలా చేయలేదంటూ కామెంట్స్ చేశారని పేర్కొంది. అందుకే నేను అక్కడే స్థిరపడాలని అనుకోలేదని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. తాను తల్లి, సోదరి లాంటి పాత్రలు చేసేందుకు కూడా భయం లేదని తెలిపింది. గతంలో ఓ ఈవెంట్లో పాల్గొన్నప్పుడు తన బాడీని ఉద్దేశించి కామెంట్స్ చేశారని మృణాల్ ఠాకూర్ తెలిపింది. 'మీరు అస్సలు సెక్సీగా లేరు' అని అన్నారని వెల్లడించింది. మీరు చేసిన పాత్ర సెక్సీగా ఉందని.. కానీ మీరు ఆ పాత్రకు అంత దగ్గరగా కనిపించలేదని దారుణంగా మాట్లాడారని పేర్కొంది. ఓ ఫోటోగ్రాఫర్ నా పాత్రను చూడకుండానే కామెంట్ చేశాడు. మరాఠీలో మాట్లాడుతూ.. ఈ పల్లెటూరి అమ్మాయి ఎవరు? అని కామెంట్ చేశాడని తెలిపింది. కానీ ఆ తర్వాత అతను నాకు క్షమాపణ చెప్పాడని వివరించింది. నేను ఏదైనా ప్రాజెక్ట్‌లో నటించే సమయంలో తనలాగే ఉండేందుకు ఇష్టపడతానని మృణాల్ తెలిపింది. అప్పుడే ఆ పాత్రను సులభంగా చేయగలనని వెల్లడించింది. ఓ సాంగ్ చేసినప్పుడు కొందరు ఏకంగా తనను బరువు తగ్గమని కూడా సలహా ఇచ్చారని పేర్కొంది. దీనికి బదులిస్తూ నా శరీర బరువుతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు.. మీరు ఎందుకు ఫీలవుతున్నారు? కాస్తా గట్టిగానే ఇచ్చిపడేశానని వివరించింది. ఈ విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో బాడీ షేమింగ్‌కు గురైన అనుభవాలను సీతారామం బ్యూటీ పంచుకుంది. ఇక సినిమాల విషయాకొనిస్తే గతేడాది నాని సరసన హాయ్ నాన్నతో హిట్ కొట్టింది. కొత్త ఏడాదిలో విజయ్ దేవరకొండతో కలిసి ఫ్యామిలీ స్టార్ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. గతేడాది సౌత్‌తో పాటు బాలీవుడ్లో జెర్సీ, పిప్పా వంటి చిత్రాలలో మృణాల్ ఠాకూర్ నటించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఏఆర్ మురుగదాస్ శివకార్తికేయన్ హీరోగా నటించనున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించనున్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీంతో పాటు ప్రముఖ టాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ నిర్మించనున్న చిత్రంలో కూడా మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించే విషయంపై చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. -
అమ్మపై దారుణ కామెంట్స్.. ఇప్పుడు కూడా: బుల్లితెర నటి
సినీ ఇండస్ట్రీతో పాటు బాడీ షేమింగ్ సంఘటనలు మనం చూసే ఉంటాం. నటీమణులు బాడీ షేమింగ్‌కు గురి కావడం కాస్తా ఎక్కువే. ముఖ్యంగా హీరోయిన్స్‌పైనే ఎక్కువగా ఇలాంటి ట్రోల్స్ వస్తుంటాయి. తాజాగా బాలీవుడ్ బుల్లితెర నటి వాబిజ్ దోరాబ్జీ తనకు ఎదురైన సంఘటనను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. తన తల్లిని ఉద్దేశించి కామెంట్స్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇది చూసిన తన తల్లి ఏడవడం.. తీవ్రంగా ప్రభావితం చేస్తుందని ఆమె గుర్తుచేసుకున్నారు. (ఇది చదవండి: టాయిలెట్స్ శుభ్రం చేసేవాడిని.. సల్మాన్ కామెంట్స్ వైరల్!) బాలీవుడ్ నటి వాబిజ్ దోరాబ్జీ ఇన్‌స్టాలో రాస్తూ..'ఈ అంశం చాలా సున్నితమైంది. ఎందుకంటే ఇది చాలా వ్యక్తిగతం కూడా. మా అమ్మ ఒకప్పుడు మిస్ పూణేగా నిలిచింది. ఆమె చాలా అందంగా ఉండేది. కానీ నాకు, సోదరుడికి జన్మనిచ్చిన తర్వాత అమ్మ బరువు పెరిగింది. ఆ తర్వాత చాలా మంది మా అమ్మను కామెంట్ చేయడం చూశా. ఆమె ఏడవడాన్ని దగ్గరి నుంచి చూశా. అయినప్పటికీ ఈ విషయాలు బయటకు చెప్పలేకపోయింది.' అంటూ చెప్పుకొచ్చింది. అయితే నాకు కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు రావడంతో బరువు పెరిగానని వెల్లడించింది. వాబిజ్ తనపై ట్రోల్స్ గురించి రాస్తూ..' నా కెరీర్ ప్రారంభించినప్పుడు చాలా సన్నగా ఉండేదాన్ని. కానీ కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా కొంచెం బరువు పెరిగా. ఆ తర్వాత చాలా విమర్శలు ఎదుర్కొన్నా. ఆ దశలో నాకు చాలా కష్టమనిపించింది. నాపై నాకే నమ్మకం తగ్గిపోయింది. నేను దాని గురించే ఆలోచిస్తూ విలవిల్లాడిపోయా. నా గురించి నేను తెలుసుకోవడానికి చాలా ఏళ్లు పట్టింది. అంత ఈజీగా బరువు తగ్గలేననే వాస్తవం నుంచి బయటికొచ్చా. చివరికి నా శరీరం పట్ల నా అవగాహన కూడా మారింది. నన్ను నేను గౌరవించడం ప్రారంభించా. అప్పుడే చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ నన్ను గౌరవించడం ప్రారంభించారు. ఇప్పుడిప్పుడే నాపై ట్రోల్స్ రావడం తగ్గింది.' అని పేర్కొంది. ఇది చూసిన నాలాగే చాలా మంది మహిళలు తమ అనుభవాల గురించి తనకు ఎలా మెసేజ్ చేస్తారని తెలిపింది. అంతే కాదు.. ఇది కేవలం నటీనటులకు సంబంధించిన సమస్య కాదని వాబిజ్ తెలిపింది. ఏ స్త్రీ అయినా ఇలాంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని వెల్లడించింది. సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ గురించి రాసినప్పుడు.. చాలా మంది మహిళలు ఇలాంటి సంఘటనలు ఎలా ఎదుర్కొనేందుకు ముందుకొస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. వారిలో కొందరికైనా తమ కోసం తాము నిలబడే నమ్మకాన్ని అందించగలిగితే నాకు సంతోషం అని తెలిపింది. (ఇది చదవండి: ప్రియురాలిని పరిచయం చేసిన హైపర్ ఆది.. పేరు విహారిక!) కాగా.. వహిజ్ దొరాబ్జీ.. ప్యార్ కీ యే ఏక్ కహానీతో సీరియల్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సావిత్రి, సరస్వతీచంద్ర సీరియల్స్‌లో కీలక పాత్రలు పోషించింది. ప్యార్ కీ యే ఏక్ కహానీకి ఉత్తమ సహాయ పాత్రకు అవార్డు కూడా గెలుచుకుంది. ఆ తర్వాత బహు హమారీ రజనీ కాంత్‌లో సీరియల్లో నటించింది. మహారాష్ట్రలోని పూణేలో జన్మించిన దొరాబ్జీ 2013లో ప్యార్ కీ యే ఏక్ కహానీ సహనటుడు వివియన్ ద్సేనాను వివాహం చేసుకున్నారు. వారు 2017లో విడాకులు తీసుకున్నారు. View this post on Instagram A post shared by Vahbiz Dorabjee (@vahbz) -
శరీరాకృతిపై కామెంట్.. భయంతో బయటకు రాలేదు: సమీరారెడ్డి
ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించిన చాలామంది నటీమణులు పెళ్లి తర్వాత సినిమాలకు సినిమాలకు గుడ్‌బై చెప్పి వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. అలాంటి వారిలో నటి సమీరా రెడ్డి ఒకరు. అశోక్, జై చిరంజీవ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన ఈ భామ.. 2014లో అక్షయ్‌ని వివాహం చేసిన ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పింది. పెళ్లి తర్వాత ఆమె శరీరంలో మార్పులు వచ్చాయి. (చదవండి: టాప్ హీరోయిన్.. 18 ఏళ్లకే గదిలో శవమై.. మెడపై ఉరితాడు గుర్తులు!) గర్భం దాల్చిన సమయంలో కాస్త బరువు పెరిగారు. ఆ సమయంలో ఎవరికైనా ఈ మార్పులు సహజం. కానీ తనపై మాత్రం దారుణంగా విమర్శలు చేశారని సమీరా రెడ్డి చెప్పుకొచ్చారు. చివరకు కూరగాయలు అమ్మే వ్యక్తి కూడా బాడీ షేమింగ్ చేశారని బాధపడ్డారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో వివాహం తర్వాత తనపై వచ్చిన విమర్శల గురించి చెప్పుకొచ్చారు. ‘2014లో అక్షయ్‌తో నాకు పెళ్లి జరిగింది. చాలా సింపుల్‌గా వివాహం చేసుకున్నాం. అయితే కొంతమంది మాత్రం నేను ప్రేగ్నెంట్ అయ్యాయనని, అందుకే ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారని పుకార్లు సృష్టించారు. అలా ఎందుకు పుట్టించారో ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. ఇక నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ సమయంలో కూడా చాలా విమర్శలు ఎదుర్కొన్నాను. 2015లో బాబు పుట్టాక నా శరీరాకృతిలో మార్పులు వచ్చాయి. బరువు పెరిగాను. దీంతో చుట్టు పక్కల వాళ్లు నా శరీరాకృతిపై కామెంట్ చేశారు. చివరకు కూరగాయలు అమ్మే వ్యక్తి కూడా ‘ఇది మీరేనా?, ఇలా మారిపోయారేంటి?’అని అన్నారు. వారి మాటలు నాకు చాలా బాధ కలిగించాయి. మీడియాకు కనిపించకూడదనే ఉద్దేశంతో కొంతకాలం బయటకు కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాను. అభిమానులతో కనెక్ట్ కావాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాను. ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసుకున్న తర్వాత దానిని ప్రమోట్ చేయాలని ఇండస్ట్రీలోని స్నేహితులను కోరితే..ఒక్కరు కూడా సాయం చేయలేదు. చాలా బాధపడ్డాను’ అని సమీరారెడ్డి చెప్పుకొచ్చారు. -
'ఎవరితోనైనా కమిట్ అయితేనే అలా..' బుల్లితెర నటిపై దారుణ కామెంట్స్!
ఆర్ఆర్ఆర్ భామ ఆలియా భట్, రణ్వీర్ కపూర్ జంటగా నటించిన చిత్రం 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ'. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. రిలీజైన ఎనిమిది రోజుల్లోనే రూ.80 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ తెరకెక్కించారు. అయితే ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్ సోదరిగా తనదైన నటనతో అందరినీ ఆకర్షించింది బుల్లితెర నటి అంజలి ఆనంద్. రణవీర్ సింగ్ సోదరిగా గాయత్రీ రంధవా పాత్రలో కనిపించిన ఆమె ఇటీవలే ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది. (ఇది చదవండి: వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ప్రిన్స్.. ఫోటోలు పంచుకున్న నమ్రత!) బుల్లితెర నటి అంజలి ఆనంద్ తాను కూడా బాడీ షేమింగ్‌కు గురైనట్లు వెల్లడించింది. బాలీవుడ్లో కెరీర్ ప్రారంభంలో యాక్టింగ్ స్కూల్లో చేరినప్పుడు.. తనను శరీర బరువును కించపరిచేలా కొందరు మాట్లాడారని తెలిపింది. తనకు సినిమా ఛాన్స్‌లు రావనీ.. కేవలం బర్గర్లు తినే పాత్రలు, ఫ్రెండ్ క్యారెక్టర్స్ వస్తాయని ఎద్దేవా చేశారని వివరించింది. తాను లావుగా ఉన్నందున కొందరు దారుణంగా కామెంట్స్ చేశారని చెప్పుకొచ్చింది. అంతకుముందు 'ధై కిలో రెమ్','కుల్ఫీ కుమార్ బజేవాలా' వంటి హిట్ టీవీ షోలతో తనదైన ముద్ర వేసింది. "కుల్ఫీ కుమార్ బజేవాలా"లో ప్రధాన పాత్రలో ఆమె తనదైన నటనతో అభిమానులను అలరించింది. కానీ అప్పట్లో ఆ పాత్రకు ప్రశంసల కంటే.. విమర్శలే ఎక్కువ వచ్చాయని తెలిపింది. లావుగా ఉన్న అమ్మాయి లీడ్ రోల్ ఎలా చేస్తుందని.. పలువురు తన క్యారెక్టర్‌ను కించపరిచేలా సందేశాలు పంపారని వెల్లడించింది. అంతేకాకుండా తీవ్ర అభ్యంతరకరమైన పదాలు వినియోగించారని తెలిపింది. 'లావుగా ఉన్న అమ్మాయికి సెకండ్ షోలో ప్రధాన పాత్ర ఎవరు ఇచ్చారు? బహుశా ఆమె ఎవరితోనైనా కమిట్ అయినందువల్లే అయి ఉండొచ్చు' అని దారుణంగా కామెంట్స్ చేశారని అంజలి వెల్లడించింది. అయితే వీటిపై తాను అదేస్థాయిలో స్పందించినట్లు వివరించింది. మనం ఇలాంటి వారి గురించి మాట్లాడటం మూర్ఖత్వమని విమర్శించింది. (ఇది చదవండి: 'అలాంటివాళ్లు దయచేసి ఈ ఫోటోలు చూడొద్దు'.. స్టార్ హీరోయిన్ పోస్ట్ వైరల్!) కాగా.. ప్రస్తుతం 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ'లో అంజలి గాయత్రి పాత్రకు ప్రశంసలు వస్తున్నాయి. నటనకు కావాల్సింది టాలెంట్ అని.. శరీర బరువుతో సంబంధం లేదని అంజలి నిరూపించింది. అలా విమర్శలు చేసేవారికి తన నటనతోనే సరైన సమాధానమిచ్చింది. సినిమా ఇండస్ట్రీలో విజయమనేది అంకితభావం, కృషిపై ఆధారపడి ఉంటుందని తెలిపింది. View this post on Instagram A post shared by ✨Anjali Anand✨ (@anjalidineshanand) -
స్టార్ హీరోయిన్‌పై బాడీ షేమింగ్.. ఆయన వల్ల!
హీరోయిన్ల జీవితం పైకి కనిపించినంత అందంగా ఉండదు. బయటకు నవ్వుతూ, గ్లామర్‌తో ఎంటర్టైన్ చేస్తున్నట్లు కనిపిస్తారు కానీ కొందరికి మాత్రం చేదు అనుభవాలు ఎప్పటికప్పుడు ఎదురవుతుంటాయి. పనిగట్టుకుని మరీ కొందరు నెటిజన్స్, సదరు ముద్దుగుమ్మల్ని వేధిస్తుంటారు. సోషల్ మీడియా కల్చర్ పెరిగిన తర్వాత ఈ సమస్య మరీ ఎక్కువైపోయింది. ఇప్పుడు అలానే ఓ స్టార్ హీరోయిన్ తనకెదురైన బాడీ షేమింగ్ గురించి బయటపెట్టింది. (ఇదీ చదవండి: 'రంగబలి' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఆ రోజే) హిందీ సినిమాలు చూసేవాళ్లకు నటి-హీరోయిన్ హ్యుమా ఖురేషి తెలిసే ఉంటుంది. 'గ్యాంగ్స్ ఆఫ్ వస్సీపూర్' మూవీతో నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈమె.. ఆ తర్వాత బోల్డ్ రోల్స్‌తో ఫేమస్ అయిపోయింది. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ నటిస్తూ ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. గతంలో ఈమె చేసిన ఓ సినిమా రిలీజ్ తర్వాత, యాక్టింగ్ గురించి పక్కనబెట్టి ఈమె బరువు గురించి ఓ రివ్యూయర్ కామెంట్ చేశారట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పి హ్యుమా తెగ బాధపడింది. 'మీకు సినిమా నచ్చకపోతే నో ప్రాబ్లమ్. ఎందుకంటే అది మీ ఛాయిస్. కానీ కొందరు ఎందుకు వ్యక్తిగతంగా ట్రోల్స్ చేస్తారు? నాకైతే ఇలా చాలాసార్లు జరిగింది. ఓసారి నా మూవీ రిలీజైన తర్వాత ఓ రివ్యూయర్.. నా బరువు గురించి రాశారు. హీరోయిన్లకు ఉండాల్సిన దానికంటే ఐదు కిలోలు ఎక్కువగా ఉన్నారని అన్నారు. దీంతో నాలోనే ఏమైనా లోపం ఉందా అనే డౌట్ వచ్చింది. ఇంకా చెప్పాలంటే సినిమాలకు రివ్యూల రాయట్లేదు. వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మరీ మమ్మల్ని కిందకు లాగుతున్నారు' అని హ్యుమా ఆవేదన బయటపెట్టింది. (ఇదీ చదవండి: BRO Movie Review: ‘బ్రో’మూవీ రివ్యూ) -
ఎగతాళి చేద్దామనుకున్నాడు.. చివరికి నవ్వులపాలై..
వైరల్: భారీ కాయం వలన అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా ప్రయాణాల్లో ఎదురయ్యే సమస్యలు మరీ ఎక్కువ. కూర్చోవడంలో అసౌకర్యం సంగతి అటుంచితే ఎదుటివారు ఏమనుకుంటారోనన్న ఆత్మన్యూనతా భావం సగం కుంగదీస్తుంది. అలాంటి సందర్భాల్లో వారు చాలా అవమానంగా కూడా ఫీలవుతూ ఉంటారు. అచ్చంగా అలాంటి పరిస్థితినే విమానం ప్రయాణంలో ఎదుర్కొంది భారీ కాయమున్న ఓ ప్రయాణికురాలు. ఆమె పక్క సీటులో కూర్చొని ప్రయాణించాల్సిన వ్యక్తి ఆమెను ఎగతాళి చేయడమే కాకుండా ఆమె ఫోటోను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. పైగా దానికి ఒక క్యాప్షన్ కూడా జతచేశాడు... ఇలాంటి దృశ్యాన్ని చూసినప్పుడు నాకు కేటాయించిన మధ్య సీటులో కూర్చోవడమెలా? మీరేమంటారు? అని ప్రశ్నించాడు. అతడికి మద్దతుగా కామెంట్లు వస్తాయనుకుంటే అది కాస్తా రివర్స్ లో ఫైర్ అయ్యింది. అందరూ ఆ మహిళకు మద్దతుగా కామెంట్లు చేసి సదరు ప్రయాణికుడికి చురకలు అంటించారు. అతడి ఉద్దేశ్యాన్ని గ్రహించిన నెటిజన్లు అతడి పోస్ట్ పై అంతే సున్నితంగా స్పందించారు. అదసలు సమస్యే కాదు.. నేనైతే నోరు మూసుకుని వెళ్లి నా సీటులో కూర్చుని అడ్జస్ట్ అవుతాను అని ఒకరు రాయగా.. మరొకరు, గతంలో నాక్కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది.. అప్పుడైతే ఆ వ్యక్తి ఏం అనుకోకండి నన్ను పిల్లోలా వాడుకోమని చెప్పిన సరదా సన్నివేశాన్ని షేర్ చేశారు.. ఇంకొకరైతే, మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాను.. ఈ విషయాన్ని రచ్చ చేయడం కంటే వేరే ఫ్లైట్ చూసుకోవచ్చు కదా భయ్యా అంటూ వెటకారం చేశాడు. ఆ విధంగా ఆ ప్యాసింజరు తోటి ప్రయాణికురాలిని నవ్వులపాలు చేద్దాం అనుకుని తానే నవ్వులపాలయ్యాడు. ఇది కూడా చదవండి: కూతురు అబార్షన్‌కు సాయం చేసిన తల్లి.. అలా పోలీసులకు దొరికిపోయింది! -
రామాయణ నటికి బాడీ షేమింగ్.. 'చిన్న ఏనుగు' అంటూ!
బాలీవుడ్ బుల్లితెర నటి డెబినా బోనర్జీ ప్రస్తుతం మదర్‌హుడ్‌ను ఎంజాయ్ చేస్తోంది. గతేడాది నవంబర్‌లో రెండో బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. టీవీ సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ భామ నటుడు గుర్మీత్ చౌదరి ప్రేమ వివాహాం చేసుకుంది. తెలుగులోనూ అమ్మాయిలు- అబ్బాయిలు చిత్రంలో కనిపించింది. అంతే కాకుండా జగపతిబాబు మూవీ సిక్స్ చిత్రంలో ఓ ఐటం సాంగ్‌లో కనిపించింది. ఏప్రిల్ 2022లో మొదటి బిడ్డ జన్మించగా.. మరో ఏడు నెలల్లోనే రెండో బిడ్డకు తల్లయ్యింది. అయితే తన యూట్యూబ్ వ్లాగ్స్‌లో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ప్రతి విషయాన్ని షేర్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. అయితే తాజాగా చేసిన వ్లాగ్స్‌లో తాను బాడీ షేమింగ్‌కు గురైనట్లు చెప్పుకొచ్చింది డెబినా బెనర్జీ. తన శరీర బరువు పట్ల విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయని తెలిపింది. నెటిజన్స్ చాలా మంది తనను "మినీ హాతీ"(చిన్న ఏనుగు) కామెంట్స్ చేస్తున్నారని చెప్పింది. అయితే నేను వాటిని పట్టించుకోనని చెబుతోంది. త్వరలోనే బికిినీ ధరించి మీ ముందుకొస్తానని అంటోంది. (ఇది చదవండి: చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. కేసు నమోదు చేసిన పోలీసులు!) డెబినా మాట్లాడుతూ.. 'సమాజం మిమ్మల్ని ద్వేషించినప్పుడు వాటిని సానుకూలంగా తీసుకోవాలి. అప్పుడే మరింత ఉత్తమంగా పని చేస్తారు. ప్రస్తుతం నేను చాలా లావుగా ఉన్నా. తగ్గడం చాలా కష్టమైన పనే కానీ నేను ప్రయత్నిస్తాను. నాపై ట్రోల్స్ వచ్చినా పర్లేదు. ఇంకా వాటి నుంచి నేను మరింత ప్రేరణ పొందుతా.' అని పేర్కొంది. కాగా.. 'రామాయణం' సీరియల్లో డెబినా సీతగా నటించింది. రాముడి పాత్రలో గుర్మీత్ కనిపించారు. ఆ సీరియల్ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఫిబ్రవరి 15, 2011న వివాహం చేసుకున్నారు. దాదాపు పెళ్లయిన పదేళ్ల తర్వాత ఈ జంట తల్లిదండ్రులయ్యారు. (ఇది చదవండి: హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. అప్పుడే గేమ్ మొదలెట్టారా?) View this post on Instagram A post shared by Debina Bonnerjee (@debinabon) View this post on Instagram A post shared by Debina Bonnerjee (@debinabon) View this post on Instagram A post shared by Debina Bonnerjee (@debinabon) -
'బలగం' హీరోయిన్‌కి అవమానం!
Kavya Kalyan Ram Body Shaming: ఇండస్ట్రీలో హీరోయిన్స్ అందరూ బయటకు సంతోషంగానే కనిపిస్తుంటారు. కానీ వాళ్లలో కొందరు సినిమా ఛాన్సుల కోసం చాలా కష్టపడుంటారు. అయితే వాటి గురించి పెద్దగా బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడరు. కెరీర్ సక్సెస్ లో ఉన్నప్పుడు అసలు చెప్పరు. కానీ 'బలగం' హీరోయిన్ కావ్య కల్యాణ్ రామ్ మాత్రం తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సామజవరగమన'.. ఆ రోజే రిలీజ్!) బాలనటిగా చైల్డ్ ఆర్టిస్టుగా టాలీవుడ్లోకి వచ్చిన కావ్య కల్యాణ్ రామ్‌ది ఖమ్మం. 'గంగోత్రి' మూవీలో వల్లంగి పిట్టగా నటించింది. ఆ తర్వాత ఠాగూర్, బన్నీ, అడవిరాముడు తదితర చిత్రాలతో పేరు సంపాదించింది. పెరిగిన పెద్దయిన తర్వాత 'మసూద'లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టింది. 'బలగం'తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయింది. 'మసూద'తో హీరోయిన్గా ఈమె నటించిన 'ఉస్తాద్' రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ ప్రమోషన్స్‌లో మాట్లాడిన కావ్య.. 'కెరీర్ మొదట్లో ఓ ఆడిషన్ కి వెళ్తే దర్శకనిర్మాతలు నన్ను బాడీ షేమింగ్ చేశారు. మీరు లావుగా ఉన్నారు. ఇలా ఉంటే ఛాన్సులు రావు, సన్నగా అవ్వండి అని హేళన చేశారు. కానీ నేను వాటిని పట్టించుకోకుండా సినిమాలు చేస్తున్నాను' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Kavya Kalyanram (@kavya_kalyanram) (ఇదీ చదవండి: రూల్స్ బ్రేక్ చేసిన హీరో విజయ్.. పోలీసులు సీరియస్) -
అతన్ని పెళ్లి చేసుకోవడమే నేను చేసిన తప్పా? : ప్రియమణి
కథానాయకిగా నటి ప్రియమణికి మంచి పేరు ఉంది. బెంగళూరుకు చెందిన ఈ బ్యూటీ కన్నడ తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటించి పాపులర్ అయ్యారు. ముఖ్యంగా తమిళంలో పరుత్తివీరన చిత్రంలో నటనకుగాను జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు. అదేవిధంగా తెలుగులో నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, జగపతిబాబు వంటి స్టార్ హీరోల సరసన నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ మధ్య నటించిన ఫ్యామిలీమెన్ వెబ్‌సిరీస్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే వివాహానంతరం నటనకు చిన్న గ్యాప్ ఇచ్చి మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రీఎంట్రీ అయ్యారు. ప్రియమణి ముస్తఫారాజా అనే వ్యాపారవేత్తను 2017లో ప్రేమవివాహం చేసుకున్నారు. బెంగళూరులో రిజిస్టర్ పెళ్లి జరిగింది. ప్రస్తుతం సినిమాలో, టీవీ కార్యక్రమాలతో బిజీగా వున్న ప్రియమణి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను వివాహానంతరం పలు విమర్శలను ఎదుర్కొన్నానని చెప్పారు. ముఖ్యంగా పెళ్లి విషయంలో పలువురు విమర్శించారని ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లి కోసం మతం మారారా, ముస్లిం వ్యక్తిని ఎందుకు పెళ్లిచేసుకున్నారు? మీది లవ్ జీహాద్ అని, మీ పిల్లలు జీహాదీయులుగా పుడతారా అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధించే వారన్నారు. అలాంటి వారందరికీ తాను చెప్పేది ఒకటేనన్నారు. ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం తప్పా? అని ప్రశ్నించారు. కొంచెం బుద్ధితో ఆలోచించాలని హితవు పలికారు. ఇకపోతే తాను, తన భర్త చాలా సంతోషంగా ఉన్నామంటూ విడాకులపై స్పష్టత ఇచ్చారు. కరోనా సమయంలో తాను బరువు తగ్గినా విమర్శిస్తున్నారని, అంతకుముందు లావుగా ఉన్న విమర్శించే వారని అందుకే తాను అలాంటి వాటిని పట్టించుకోవడం మానేసానని పేర్కొన్నారు. -
ఫోటోలు షేర్ చేసి ట్రోలర్స్‌కు గట్టిగానే రిప్లై ఇచ్చిన నటి
టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ సతీమణి 'భీమవరం' బ్యూటీ వితికా షేరు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తనపై వస్తున్న దారుణమైన ట్రోల్స్‌కు ఒక్క వీడియోతో ఫుల్ స్టాప్ పెట్టేసింది నటి వితికా. హీరోయిన్గా పరిచయం అవడానికి ముందే మోడల్‌గా పాపులర్ అయిన ఈ భామ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి వరుణ్ సందేశ్‌ను పెళ్లాడింది. ఆపై సినిమాలకు గ్యాప్ రావడంతో వీళ్లిద్దరు కలిసి బిగ్ బాస్ షోలోకి జంటగా ఎంట్రీ ఇచ్చారు. ఈ షోతో వితిక మరింత పాపులర్ అయ్యింది. ఇదీ చదవండి: (ఇదీ చదవండి: స్కూల్ రోజుల్లో లవ్.. కానీ నా బెస్ట్ ఫ్రెండ్‌ను కూడా: దియా మీర్జా) సోషల్ మీడియాతో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటూనే.. యూట్యూబ్‌లో వ్లాగ్స్ చేస్తూ ఫ్యాన్స్‌ను మెప్పిస్తుంది. అంతే కాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫొటోలను, షార్ట్ వీడియోలను పంచుకుంటుంది. ఈ క్రమంలో తన స్నేహితులతో కలిసి రితిక చేసిన ఓ రీల్‌ను షేర్ చేసింది. అయితే, ఆ వీడియోకు దారుణమైన కామెంట్లను ఆమె ఎదుర్కొవాల్సి వచ్చింది. బాగా లావు అయిపోయావ్.. నువ్వు హీరోయిన్ అంటే నమ్మ బుద్ధి కావడం లేదనే కామెంట్లు వచ్చాయి. ఇలా నెటిజన్ల నుంచి బాడీ షేమింగ్‌కు గురైంది. దీంతో పట్టుదలతో వితిక వర్కౌట్స్ చేసి సుమారు 15 కేజీలు బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ ఫొటోలను అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేసింది. వాటిని చూసిన ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. (ఇదీ చదవండి: రాజకీయ నాయకుడి కుమారుడిని పెళ్లాడనున్న టాలీవుడ్ హీరోయిన్) -
ప్రముఖ నటుడి కుమార్తెపై ట్రోలింగ్.. గట్టిగానే ఇచ్చి పడేసింది!
సోషల్ మీడియా వచ్చాక నెటిజన్స్ కామెంట్లకు అడ్డులేకుండా పోయింది. ముఖ్యంగా సినీ కారలు, వారి కుటుంబసభ్యులు తరచూగా కామెంట్స్ చేస్తూనే ఉంటారు. అయితే ఓ తాజాగా ఓ ప్రముఖ నటుడి కుమార్తె ట్రోలింగ్ గురయ్యారు. ఆమెను బాడీ షేమింగ్ చేస్తూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అసలేం జరిగిందంటే.. మలయాళ నటుడు సురేశ్ గోపీ కుమార్తె భాగ్య ఇటీవలే కెనడాలోని ఓ కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆమె పట్టా అందుకున్న ఫోటోలను తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేశారు. ఆమె ఈ ఫోటోల్లో సంప్రదాయ దుస్తులైన చీరలో కనిపించింది. (ఇది చదవండి: ఎన్టీఆర్ కోసం ఎవరూ ఊహించని హీరోయిన్!) అయితే ఇది చూసిన ఓ నెటిజన్.. 'కంగ్రాట్స్.. మీరు చీరలు పక్కనపెట్టి వెస్ట్రన్ డ్రెస్సులు వేసుకోండి. ఎందుకంటే లావుగా ఉన్న వాళ్లకు శారీ సెట్ కాదు. ఫ్యాషన్ దుస్తుల్లోనే మీరు చాలా స్మార్ట్‌గా ఉంటారు.' అంటూ కామెంట్ చేశాడు. ముందు నీ పని చూసుకో అయితే ఇది చూసిన భాగ్య అతనికి కాస్తా గట్టిగానే రిప్లై ఇచ్చింది. మీరిచ్చిన ఉచిత సలహాకు థ్యాంక్స్.. నా బరువుతో మీకేం పనిలేదు. మీరు అనవసరంగా ఆందోళన పడొద్దు. నాకు నచ్చిన దుస్తులు వేసుకుంటా. పట్టా అందుకున్నప్పుడు సంప్రదాయ దుస్తులే ధరించా. అందరిలాగా పాశ్చాత్య సంస్కృతిని ఫాలో అయ్యే వ్యక్తిని కాదు. నా గురించి కామెంట్ చేయడం మాని.. ముందు మీ పనిపై దృష్టి పెట్టండి.' ఘాటూగానే బదులిచ్చింది. కాగా.. మలయాళ నటుడు సురేశ్ గోపీ తెలుగువారికి సుపరిచితులే. ఆయన పోలీస్ పాత్రలో నటించిన పలు మలయాళీ చిత్రాలు తెలుగులోనూ డబ్ అయ్యాయి. (ఇది చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న కస్టడీ, ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?) View this post on Instagram A post shared by Bhagya (@bhagya_suresh) -
అలాంటి ఛాన్స్ మరొకరికి ఇవ్వొద్దంటున్న కోలీవుడ్ భామ
బుల్లితెర యాంకర్‌గా పరిచయమై ఆ తరువాత వెండితెర కథానాయకిగా ఎదిగిన నటి ప్రియా భవానీ శంకర్. తొలి చిత్రం మేయాదమాన్‌తోనే విజయం వరించడంతో ఆ తరువాత ఈమెకు వరుసగా అవకాశాలు వరించడం మొదలెట్టాయి. ప్రస్తుతం బిజీ కథానాయికల్లో ప్రియ భవానీ శంకర్ ఒకరు. ఇటీవల ఈమె జయంరవికి జంటగా నటించిన అఖిలన్, శింబుతో జతకట్టిన పత్తుతల, తాజాగా రాఘవలారెన్స్ సరసన నటించిన రుద్రన్ చిత్రాలు వరుసగా తెరపైకి వచ్చాయి. ఈ సందర్భంగా ఆమె ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మన శరీర రంగును పరిహాసం చేస్తూ కొందరు మిమ్మల్ని గాయపరుస్తారన్నారు. అయితే మీరు ఎవరు? మీరు ఏం కావాలనుకుంటున్నారు? అనే విషయాలను ఇతరులు మాట్లాడి నిర్ణయం తీసుకునే అవకాశం వారికి ఇవ్వొద్దని సూచించారు. ఇక్కడ అందానికి నిర్వచనం అంటూ ఏదీ ఉండదు. స్కిన్ కేర్, తమ అందాలను మెరుగుపరచుకోవడానికి తారలు చాలా ఖర్చు చేస్తుంటారన్నారు. అయితే ఓ సాధారణ కళాశాల విద్యార్థికి అలా చేయడం సాధ్యం కాదన్నారు. అయితే రూపం, రంగు, శరీర సౌష్టవం వంటి వాటి గురించి చింతించాల్సిన అవసరం లేదన్నారు. కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు చూసి ఒక నిర్ణయానికి రాకూడదన్నారు. ఇప్పుడు తాను తయారు కావడానికి 10 మందితో కూడిన ఒక బృందం ఉందన్నారు. అయితే ఇదే సౌందర్యం అని చెప్పడానికి నిర్వచనం ఏదీ లేదన్నారు. కాబట్టి శారీరక అందం గురించి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదని.. మానసిక వేదనకు గురి కాకుండా జీవితాన్ని పరిపూర్ణంగా గడపాలన్నారు. డబ్బు ఉంటే కాకి కూడా కలర్‌గా మారుతుందని కొందరు చెబుతుంటారని.. అయితే డబ్బు ఎవరికి ఊరకనే రాదని మీరు ప్రపంచంతో పోరాడి కోరుకున్నది గెలవాల్సి ఉంటుందని నటి ప్రియ భవానీ శంకర్ పేర్కొన్నారు. -
డబ్బు కోసమే చరణ్ నన్ను పెళ్లి చేసుకున్నాడని విమర్శించారు : ఉపాసన
టాలీవుడ్ స్టార్ దంపతులు రామ్‌చరణ్-ఉపాసన త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. దాదాపు పెళ్లైన 11 ఏళ్ల తర్వాత తొలిసారిగా వీళ్లు పేరెంట్స్‌గా ప్రమోట్ కాబోతున్నారు. దీంతో మెగా ఫ్యామిలీ సహా అభిమానులు పుట్టబోయే బిడ్డ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ మీడియాతో ముచ్చటించిన ఉపాసన పెళ్లైన కొత్తలో తాను ఎదుర్కొన్న విమర్శల గురించి చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ.. 'చరణ్, నేను కామన్ ఫ్రెండ్స్ ద్వారా కలుసుకున్నాం. మా స్నేహం ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాం. మా ఇద్దరి కుటుంబ నేపథ్యాలు వేరు. ఒకరిపై ఒకరికున్న నమ్మకం, గౌరవం, ప్రేమతో ఆ బంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నాం. చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరూ నన్ను ఏదో ఒక విషయంలో జడ్జ్ చేస్తూనే ఉండేవారు. సమాజంలో చాలామంది ఇలాంటి విమర్శలను ఎదుర్కొన్నవారే. నా పెళ్లైన కొత్తలో నేనూ బాడీ షేమింగ్ ఎదుర్కొన్నా. నేను బాగా లావుగా ఉన్నానని, అందంగా లేనని కామెంట్స్ చేశారు. ఇంకొంతమంది అయితే చరణ్ డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడని కూడా విమర్శించారు. కానీ నేను ఆ సమయంలో కుంగిపోలేదు. ధైర్యంగా వాటిని జయించా. ఆరోజు నన్ను ట్రోల్ చేసినవాళ్లే నేడు ప్రశంసిస్తున్నారు' అంటూ ఉపాసన పేర్కొంది. -
బాడీ షేమింగ్ చేస్తారు,చాలా బాధేస్తుంది.. హనీరోజ్ ఆసక్తికర కామెంట్స్
హీరోయిన్ హనీరోజ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరసింహారెడ్డి సినిమాతో ఒక్కసారిగా ఓవర్‌నైట్ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది.ఈ ఒక్క సినిమాతో తెలుగులో బోలెడంత పాపులారిటీని దక్కించుకుంది. నిజానికి ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌కి చాలా ఏళ్ల క్రితమే ఎంట్రీ ఇచ్చింది. ఆలయం,'ఈ వర్షంసాక్షిగా' అనే సినిమాల్లో నటించినా వీరసింహారెడ్డితో సాలిడ్ హిట్‌ను అందుకుంది. ముఖ్యంగా యూత్‌లో తిరుగలేని పాపులారిటీని సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో పలు షాప్ ఓనెనింగ్స్కి చీఫ్ గెస్టుగా హాజరై సందడి చేస్తుంది. తాజాగా ఓ షోరూం ఓపెనింగ్‌లో పాల్గొన్న హనీరోజ్.. బాడీ షేమింగ్ అంశంపై మాట్లాడింది. సినిమాల్లో పాత్రకు తగ్గట్లు నా డ్రెస్సింగ్ ఉంటుంది. నాకు నచ్చినట్లుగా కనిపించడానికి ఇష్టపడతా. ఎలాంటి దుస్తులు ధరించాలి, ఏ విధంగా కనిపించాలన్నది నటీనటుల పర్సనల్ ఛాయిస్. హీరోయిన్లు కాస్త బరువు పెరిగినా జనాలు ట్రోల్స్ చేస్తుంటారు. ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ చేస్తూ మానసికి ఒత్తిడిని కలిగిస్తాయి. ఇలాంటివి చూసినప్పుడు చాలా బాధగా ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది. -
సోషల్ మీడియా శాడిస్టులపై గవర్నర్ గరం గరం
-
పాక్ క్రికెటర్ ఓవరాక్షన్.. లావుగా ఉన్న సహచర సభ్యుడిని ఎగతాళి చేస్తూ..!
Naseem Shah-Azam Khan: పాకస్తాన్ క్రికెటర్, ఆ జట్టు యువ పేసర్ నసీం షా తమ దేశ క్రికెటర్లకు మాత్రమే సాధ్యమయ్యే ఓవరాక్షన్ చేసి పరువు పోగొట్టుకున్నాడు. నసీం.. లాపుగా ఉన్న సహచర సభ్యుడు, పాక్ దిగ్గజ వికెట్‌కీపర్ మొయిన్ ఖాన్ తనయుడు ఆజం ఖాన్‌తో అసభ్యంగా ప్రవర్తించాడు. బాడీ షేమింగ్ చేస్తూ ఎగతాళి చేయడమే కాకుండా, అతన్ని ఢీకొట్టాడు. తమ దేశ క్రికెటర్‌తో పరాయి గడ్డపై అభ్యంతరకరంగా ప్రవర్తించి, తనతో పాటు తన దేశ పరువునూ బజారుకీడ్చాడు. Naseem Shah teasing Azam Khan at the Bangladesh Premier League #BPL2023 #Cricket pic.twitter.com/IsJgBLcE0i — Saj Sadiq (@SajSadiqCricket) January 31, 2023 ఈ ఘటన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్లో చోటు చేసుకుంది. ఈ లీగ్‌లో వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహించిన ఈ ఇద్దరు క్రికెటర్లు మైదానంలో ఎదురెదురు పడిన సందర్భంలో ఆజం శరీరాన్ని నసీం అవహేళన చేశాడు. ఆజం బ్యాటింగ్ చేసేందుకు మైదానంలోకి వస్తుండగా నసీం ఎదురెళ్లి అతని శరీర తత్వాన్ని వెక్కిరిస్తూ, అతనిలా నడుస్తున్నట్లు ఇమిటేట్ చేశాడు. ఇంతటితో ఆగకుండా ఆజంను ఢీకొట్టి, అతని శరీరంపై వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేశాడు. అయితే ఇవేవి పట్టించుకోని ఆజం ఖాన్, నసీంను నెట్టేసి క్రీజ్వైపు వెళ్లాడు. వెళ్తున్నప్పుడు కూడా నసీం ఓవరాక్షన్ అలాగే కొనసాగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవగా, నెటిజన్లు ఆ దేశం, ఈ దేశం అన్న తేడా లేకుండా నసీం షాను వాయించేస్తున్నారు. తమ వాడితో ఇలా ప్రవర్తించావు కాబట్టి సరిపోయింది, పరాయి దేశస్తుడితో ఇలా ప్రవర్తించి ఉంటే నీకు కచ్చితంగా దేహశుద్ధి అయ్యేది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏ దేశస్తుడైనా బాడీ షేమింగ్ చేయడం కరెక్ట్ కాదని మరికొందరు నసీంకు చురకలంటిస్తున్నారు. ఇంకొందరైతే.. షేమ్, షేమ్ నసీం షా.. షేమ్, షేమ్ పాకిస్తాన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ ఘటన జరిగిన మ్యాచ్‌లో ఖుల్నా టైగర్స్ తరఫున ఆజం ఖాన్, కొమిల్లా విక్టోరియన్స్ తరఫున నసీం షా బరిలోకి దిగారు. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో కొమిల్లా విక్టోరియన్స్ ఘన విజయం సాధించింది. విండీస్ వీరుడు జాన్సన్ చార్లెస్ 56 బంతుల్లో 5 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో అజేయమైన 107 పరుగులు చేసి కొమిల్లా విక్టోరియన్స్ చారిత్రక విజయాన్ని అందించాడు. -
క్షమించండి.. ఇకపై అలా జరగదు.. స్టార్ హీరో
ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి సోషల్‌మీడియా వేదికగా నెటిజన్లకు క్షమాపణలు చెప్పారు. తన తప్పును తెలియజేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అసలు విషయమేమిటంటే.. 2018లో కేరళలో వచ్చిన వరదల ఆధారంగా 2018 పేరుతో సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి 'ఓ శాంతి ఓషాన' సినిమాతో మంచిపేరు తెచ్చుకున్న జూడో ఆంథనీ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల మూవీ టీజర్ విడుదల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మమ్ముట్టి దర్శకుడిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలను కొందరు నెటిజన్లు తప్పుపట్టారు. ఈవెంట్లో దర్శకుడి హెయిర్ స్టైల్‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మమ్ముట్టి మాట్లాడుతూ..'జూడ్ ఆంథోనీ తలపై వెంట్రుకలు లేకపోయినా, అసాధారణమైన మెదడు కలిగిన అత్యుత్తమ ప్రతిభావంతుడైన దర్శకుడు' అని అన్నారు. దీంతో దర్శకుడిని బట్టతల వ్యక్తి అంటూ అవమానించారని నెటిజన్లు భావించారు. ఇలా మాట్లాడడం బాడీ షేమింగ్‌తో సమానమంటూ పోస్టులు చేశారు. దీనిపై మమ్ముట్టి క్షమాపణలు చెబుతూ.. తన అధికారిక సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. 'డియర్ ఆల్.. దర్శకుని ప్రశంసించేందుకు నేను వాడిన కొన్ని పదాలు మిమ్మల్ని బాధపెట్టాయని తెలిసింది. ఉత్సాహంతో అలాంటి మాటలు మాట్లాడినందుకు క్షమించండి. మరోసారి ఇలా జరగకుండా జాగ్రత్త పడతా. ఈ తప్పును గుర్తుచేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు’ అని రాసుకొచ్చారు. మమ్ముట్టి చేసిన తప్పును వెంటనే అంగీకరించి వెంటనే సోషల్ మీడియా పోస్ట్‌తో క్షమాపణలు చెప్పినందుకు నెటిజన్లు ఇప్పుడు మమ్ముట్టిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. -
కొందరు చాలా అసభ్యంగా మాట్లాడేవారు.. నటి సయామి ఖేర్ ఆవేదన
బాలీవుడ్ నటి సయామీ ఖేర్ పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఆమె టాలీవుడ్ సినిమాతో చిత్రపరిశ్రమలోకి 2015లో ఎంట్రీ ఇచ్చింది. 'రేయ్' మూవీతో సినీరంగ ప్రవేశం చేసింది మరాఠీ భామ. తాజాగా ఆమెకు కెరీర్ ప్రారంభంలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని వెల్లడించింది. తాను కూడా బాడీ షేమింగ్‌కు గురైనట్లు సయామి ఖేర్ ఆవేదన వ్యక్తం చేసింది ముద్దుగుమ్మ. (ఇది చదవండి: సాంగ్ రిలీజ్ ఈవెంట్.. ముద్దుల్లో మునిగిపోయిన బాలీవుడ్ జంట) సయామి ఖేర్ మాట్లాడుతూ.. 'తాను కెరీర్ ప్రారంభంలో కొందరు లిప్ అండ్ నోస్ జాబ్ చేయాలంటూ వెటకారంగా మాట్లాడేవారు. కానీ నేను వాటిని పట్టించుకోలేదు. ఎవరైనా శరీరం గురించి మాట్లాడితే చాలా బాధగా ఉంటుంది. తాను మందంగా ఉన్నందున అలాంటి వ్యాఖ్యలకు బాధ పడలేదు. కానీ అలాంటి అసహ్యకరమైన వ్యాఖ్యలు చేయడం చాలా విచారకరం.' అంటూ వాపోయింది బాలీవుడ్ భామ. ఇతరుల బాడీ గురించి మాట్లాడేటప్పుడు మరింత సున్నితంగా ఉండాలని సయామి సూచించారు. సమాజంలో చాలా సెన్సిటివ్‌గా ఉండేవారూ ఉన్నారు. మనం ఒకరితో ఒకరు మాట్లాడుకునే విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని.. లేకపోతే ఎంతో ప్రతికూలత ఉంటుందని సయామి అన్నారు. కాగా.. ప్రస్తుతం అశ్విని అయ్యర్ తివారీ వెబ్ సిరీస్ ఫాదు: ఎ లవ్ స్టోరీలో సయామి కనిపించనుంది. ఈ సిరీస్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కించారు. ఈ సిరీస్ డిసెంబర్ 9 నుంచి సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. -
నన్ను డస్కీ అని పిలిచేవారు.. ప్రియాంక చోప్రా ఆవేదన
బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్ నటీమణుల్లో ఆమెది ప్రత్యేక స్థానం. పెళ్లి తర్వాత భర్తతో కలిసి లాస్ ఏంజెల్స్‌లో సెటిలైంది బాలీవుడ్ భామ. ఇటీవలే ఆమె దాదాపు మూడేళ్ల విరామం తర్వాత భారత్‌కు వచ్చారు. అయితే తాజాగా ఆమె కెరీర్లో జరిగిన కీలక సంఘటనలను మీడియాతో పంచుకున్నారు. కెరీర్ ప్రారంభంలో బాడీ షేమింగ్‌కు గురైనట్లు నటి వెల్లడించారు. ఆమెను డస్కీ అని పిలిచేవారని వాపోయారు. తొలి రోజుల్లో సహ నటుల కోసం సెట్లో గంటల తరబడి వేచి ఉండేదాన్ని అని ప్రియాంక చోప్రా చెప్పింది. 'డస్కీ' అంటే ఏమిటో నాకు తెలియదు? నేను తగినంత అందంగా లేనని అప్పుడు అనిపించిందని తెలిపింది. అంతేకాకుండా ఆమెను నల్లపిల్లి అని వెటకారంగా పిలిచేవారని బాలీవుడ్ నటి ఆనాటి అనుభవాలను వివరించింది. (ఇది చదవండి: మూడేళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన ప్రియాంక చోప్రా) నేను చాలా కష్టపడి పని చేయాల్సిన ఉంటుందని నమ్మకంతో ఉండేదానిని అని వెల్లడించింది. అయినప్పటికీ తోటి నటుల కంటే కాస్త ఎక్కువ ప్రతిభావంతురాలిగా భావించానని తెలిపింది. అయితే సహనటులు పొందిన వేతనంలో 10 శాతం కూడా తాను పొందలేదని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో సహనటుడి కోసం వేచి ఉండటం సరైందేనని భావించినట్లు ఆమె పేర్కొంది. ప్రియాంక చోప్రా ఫ్యాషన్‌లో జాతీయ అవార్డును అందుకుంది. ఆమె బర్ఫీ, 7 ఖూన్ మాఫ్, మేరీ కోమ్, బాజీరావ్ మస్తానీ వంటి చిత్రాలలో నటనకు అవార్డులు గెలుచుకున్నారు. 2000 సంవత్సరంలో మిస్ ఇండియాగా నిలిచిన ప్రియాంక ఆ తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆమె 2002లో సన్నీ డియోల్‌తో ది హీరోతో అరంగేట్రం చేసింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా రాణించిన ప్రియాంక ‘బేవాచ్’తో 2017లో హాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అదే సమయంలో వయసులో తనకంటే పదేళ్లు చిన్నవాడైన ప్రముఖ పాప్ సింగర్ నిక్ జొనాస్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల డేటింగ్ అనంతరం 2018లో ఈ జంట పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. ప్రియాంక ప్రస్తుతం సిటాడెల్లో కనిపించనుంది. బాలీవుడ్లో, ఆమె ఫర్హాన్ అక్తర్ మూవీ జీ లే జరాలో అలియా భట్, కత్రినా కైఫ్‌తో కలిసి నటించనుంది. -
పెళ్లి ఫోటోల్లో లావుగా ఉందంటూ హీరోయిన్‌పై ట్రోల్స్
కోలీవుడ్ లవ్‌బర్డ్స్ మంజిమా మోహన్- హీరో గౌతమ్ కార్తిక్ ఇటీవలె పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. బంధుమిత్రులు, సినీ ప్రముఖులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం వైభవంగా జరిగింది. పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఇదే సమయంలో మంజిమా మోహన్ లుక్‌పై ట్రోల్స్ కూడా అదే స్థాయిలో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ హీరోయిన్న ఇలా ట్రోల్ చేయడం ఇదేం మొదటికాదు కాదు.. గతంలోనూ పలుమార్లు మంజిమను బాడీ షేమింగ్ చేస్తూ దారుణంగా ట్రోల్ చేశారు. అయితే పెళ్లిలోనూ తన బరువుపై కామెంట్స్ చేశారని మంజిమా మోహన్ పేర్కొంది.పెళ్లి తర్వాత తొలిసారి ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. శరీరాకృతి గురించి ఎప్పటినుంచో ట్రోల్స్ ఎదుర్కుంటున్నా. మా పెళ్లి ఫోటోల్లోనూ నా లుక్‌పై చాలామంది మిమర్శలు చేశారు. దీనికి తోడు నా పెళ్లికి వచ్చిన వాళ్లలో కూడా కొంతమంది నేను లావుగా ఉన్నానంటూ కామెంట్స్ చేవారు. మొదట్లో ఇలాంటివి విన్నప్పుడు బాధపడేదాన్ని కానీ ఇప్పుడు పట్టించుకోవడం మానేశాను. నా బాడీ గురించి నాకెలాంటి బాధాలేదు. ప్రస్తుతం నేను ఫిట్‌గా,సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నాను. నాకు బరువు తగ్గాలనిపిస్తే అప్పుడు తగ్గుతాను. ఇక నా కెరీర్ విషయానికి వస్తే పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తాను అంటూ చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Gautham Karthik (@gauthamramkarthik) -
ప్రెగ్నెంట్ లేడీపై అలాంటి జోకులా?.. రణ్‌బీర్‌పై నెటిజన్స్ ఫైర్
బాలీవుడ్ స్టార్ హీరో, ఆలియా భట్ భర్త రణ్‌బీర్ కపూర్‌పై నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఆలియా భట్‌పై అలాంటి కామెంట్ ఎలా చేస్తావని మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటిస్తున్న భారీ ఫాంటాసి యాక్షన్ ఎంటర్ టైనర్ ‘బ్రహ్మాస్త్ర’. ఈ సినిమా తెలుగులో "బ్రహ్మాస్త్రం" గా రిలీజ్ కానుంది. ఈ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబచ్చన్ తో పాటు టాలీవుడ్ కింగ్ నాగార్జున, నాగిన్ బ్యూటీ మౌనీ రాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రణ్‌బీర్ వరుసగా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. (చదవండి: కరీనాకు ‘ది కశ్మీర్ ఫైల్స్’ డైరెక్టర్ చురక, ఆమె కామెంట్స్‌పై ఘాటు స్పందన) తాజాగా రణ్‌బీర్, ఆలియా భట్, ఆయన్ ముఖర్జీ ఇన్‌స్టా లైవ్‌లో నెటిజన్స్‌తో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఓ నెటిజన్ ‘పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న ‘బ్రహ్మాస్త్ర’సినిమాకు ఆ స్థాయిలో ప్రచారం చేయడం లేదేంటి?’అని ప్రశ్నించాడు. దీనిపై ఆలియా సమాధానం ఇస్తుండగా.. రణ్‌బీర్ మధ్యలో కలగజేసుకొని ‘మా చిత్రాన్ని ఎందుకు భారీగా ప్రమోట్ చేయడం లేదంటే ఇక్కడ ఒకరు భారీగా పెరుగుతున్నారు’అంటూ ఆలియా బేబీ బంప్వైపు చూశాడు. రణ్‌బీర్ మాటలతో ఆలియా ఒక్కసారిగా షాక్‌కు గురవ్వగా... ‘జస్ట్ జోక్ చేశా’అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు రణ్‌బీర్. అయితే ఈ విషయాన్ని ఆలియా లైట్ తీసుకుంటే.. నెటిజన్స్ మాత్రం రణ్‌బీర్‌పై మండి పడుతున్నారు. ‘రణ్‌బీర్ నీకు బుద్దుందా..? ఒక ప్రెగ్నెంట్ మహిళని బాడీ షేమింగ్ చేస్తావా?; ఆలియా కంటే పదేళ్లు పెద్ద..అయినా చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తున్నాడు. పబ్లిక్‌లో ఇలాంటి జోకులు వేయడం ఏంటి? ఈ టైమ్‌లో ఆలియా నీకు బార్బీ బొమ్మలా కనిపించాలా? గతంలో కూడా కత్రినా గురించి హేళన చేస్తూ మాట్లాడావు.. ఇప్పుడు ఆలియాని బాడీ షేమింగ్ చేస్తున్నావు.. కొంచైమనా బుద్ది ఉండాలి’అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. View this post on Instagram A post shared by Ranbir Kapoor✨ (@ranbirkapoor143_) -
శ్రీదేవి నుంచి సమంత దాకా ఎవరెవరు సర్జరీ చేసుకున్నారంటే?
‘అందం’ అనే భావన గతంలో ఒకలా ఉండేది. ఇప్పుడు మరోలా ఉంది. ఏవో కొన్ని కొలతల్లో ఇమిడితేనే అందం అంటున్నారు. ఆ కొలతల కోసం ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తెచ్చుకుంటున్నారు. గతంలో తెలుగు నటి ఆర్తి అగర్వాల్ అమెరికాలో ఈ కారణం చేతనే మరణించింది. ఇప్పుడు మరో కన్నడ నటి. ఈ భావజాలానికి విరుగుడు కనిపెట్టాలి. దక్షిణాదిలో మొదటగా కాస్మెటిక్ సర్జరీని శ్రీదేవి పరిచయం చేసింది. ఆమె తన ముక్కును ‘సరి చేసుకోవడం’ ద్వారా సగటు గృహిణులకు కూడా అటువంటి సర్జరీలు ఉంటాయని తెలియచేసింది. అంతవరకూ దక్షణాదిలో ‘బొద్దు’గా ఉండటం లేదా సహజ రూపంలో సౌందర్యాత్మకంగా ఉండటం సినీ పరిశ్రమలో సమ్మతంగా ఉండేది. ప్రేక్షకులు అటువంటి హీరోయిన్లు ఆదరించారు. అంజలీదేవి, సావిత్రి, కె.ఆర్.విజయ, బి.సరోజా దేవి, రాజశ్రీ, జయలలిత, దేవిక... వీరందరూ పూల తీవల్లాగా సుకుమారంగా తెర మీద కనిపించేవారు కాదు. ఆరోగ్యంగా, నిండుగా ఉండేవారు. దక్షిణాది స్త్రీలు తమను వారిలో పోల్చుకునేవారు. అయితే శ్రీదేవి ఉత్తరాదికి వెళ్లి నటించాలనుకున్నప్పటి నుంచి, ఉత్తరాదిలో కొత్తతరం వచ్చి ‘కాస్ట్యూమ్స్’ అధునాతనంగా మారి, ఫ్యాషన్ డిజైనర్స్ వచ్చి కొలతలను నిర్థారించడం మొదలెట్టినప్పటి నుంచి ఈ కాస్మెటిక్ సర్జరీల ధోరణి పెరిగింది. నేటికి అది శ్రుతి మించి ప్రాణాలకు ప్రమాదం తెచ్చే స్థాయికి చేరింది. లబ్ధి పొందినవారు ఉన్నారు కాస్మెటిక్ సర్జరీల వల్ల లబ్ధి పొందిన వారు ఉన్నారు. తమను తాము కొత్తగా మార్చుకున్నవారు ఉన్నారు. దానివల్ల కెరీర్లో ఎక్కువ రోజులు ఉండగలిగారు. అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఇలాంటి సర్జరీలను ఎంతవరకు ఉపయోగించాలో తెలుసుకున్నవారు సఫలం అయ్యారు. మీనాక్షి శేషాద్రి ముక్కును సరి చేసుకుని కొత్త రూపు పొందింది. హేమమాలిని ‘బ్లెఫరోప్లాస్టీ’ (కంటి ముడుతలు, సంచులు తొలగించే సర్జరీ), బొటాక్స్ల ద్వారా వృద్ధాప్య ఛాయలు కనపడకుండా చేసుకోగలిగిందనే వార్తలు ఉన్నాయి. ఇక అమితాబ్ తన తల వెంట్రుకలను, దవడలను ‘కరెక్ట్’ చేసుకుని ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’తో కొత్తరూపులో వచ్చాడు. గతంలో రజనీకాంత్‌కు పెదాల మీద మచ్చలు ఉండేవి. ఆయన కాస్మెటిక్ సర్జరీ ద్వారానే వాటిని పోగొట్టుకున్నాడు. ప్రియాంక చోప్రా నుంచి అనుష్కా శర్మ వరకు ఎందరో ఈ సర్జరీల దారిలో నేటికీ ఉన్నారు. తెలుగులో సమంత మునుపటి రూపానికి ఇప్పటి రూపానికి తేడా చూస్తే ఆమెలో కాస్మటిక్ మార్పులను గమనించవచ్చు. షారూక్ ఖాన్ భార్య గౌరి ఖాన్ కూడా తన రూపం కోసం ఈ ట్రీట్మెంట్ తీసుకుంది. వికటించిన వైనాలు కాని ప్రకృతి సిద్ధంగా వచ్చిన రూపాన్ని ఒకసారి కత్తిగాటు కిందకు తీసుకువచ్చాక అద్దంలో చూసుకున్న ప్రతిసారి ఇంకా మారుద్దాం ఇంకా మారుద్దాం అని అనిపించే మానసిక స్థితి వచ్చి శరీరానికి పెనువిపత్తు, రూపానికి విఘాతం కలిగే అవకాశం ఉంది. మైకేల్ జాక్సన్ తన రూపాన్ని మార్చుకుంటూ మార్చుకుంటూ వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. శ్రీదేవి లెక్కకు మించిన సర్జరీలతో ‘ఇంగ్లిష్ వింగ్లిష్’ సమయానికి ఎంతో బలహీనంగా తెర మీద కనిపించడం అభిమానులు చూశారు. రాఖీ సావంత్ వంటి వారు ఈ సర్జరీలతో గత రూపం ఏమిటో తెలియనంతగా మారిపోయారు. జూహీ చావ్లా చేయించుకున్న ప్లాస్టిక్ సర్జరీ ఆమె సహజ రూపాన్ని పూర్తిగా దెబ్బ తీసింది. కత్రీనా కైఫ్, వాణి కపూర్లకు ఈ సర్జరీలు అంతగా లాభించలేదు. ఆయేషా టకియాకు ఈ సర్జరీలు బాగా నష్టం చేశాయి. ఊహించని మరణాలు తెర మీద సన్నగా కనిపించడానికి లైపోసక్షన్ చేయించుకున్న పంజాబీ నటుడు వివేక్ షౌక్ 2011లో మరణించాడు. ఇండస్ట్రీలో మరోసారి అదృష్టం పరీక్షించుకోవడానికి అమెరికాలో ఇలాంటి సర్జరీలోనే 2015లో ఆర్తి అగర్వాల్ మరణించింది. తాజా 21 ఏళ్ల కన్నడ నటి చేతనా రాజ్ ఫాట్లాస్ సర్జరీతోనే ప్రాణం కోల్పోయింది. అనుభవం ఉన్న డాక్టర్లు చేయకపోవడం వల్ల కొంత, శరీరాలకు తట్టుకునే శక్తి లేకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు సంభవిస్తూ ఉన్నాయి. అలాంటి వీటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ప్రచారం లేదు. నా రూపమే నా సౌందర్యం తెర మీద నటించాలంటే మొదట నటన కావాలి... తర్వాత రూపం అవసరమవుతుంది అనే భావన చాలా ఏళ్లకు గాని రాలేదు. సీమా బిస్వాస్ వంటి నటీమణులు, నవాజుద్దీన్ సిద్ధఖీ వంటి నటులు నటనను ముందుకు తెచ్చి రూపాన్ని వెనక్కు తీసుకెళ్లారు. ముఖాన మొటిమలు ఉన్నా సాయి పల్లవి తన నటనతో కోట్లాది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒకప్పుడు వాణిశ్రీ– హీరోయిన్లు బంగారు వర్ణంలో ఉండాలన్న రూలును బద్దలు కొట్టింది. సుజాత, జయసుధ లాంటి వాళ్లు మోడ్రన్ దుస్తులు, విగ్గులు లేకపోయినా సుదీర్ఘ కెరీర్ సాధించవచ్చు అని నిరూపించారు. ఒకవైపు ఈ కాలపు అమ్మాయిలు బాడీ షేమింగ్లతో, ఫ్యాషన్ ఇండస్ట్రీ తెచ్చే కొత్త కొత్త కొలతలతో, కాస్మటిక్ ఇండస్ట్రీ విసిరే కొత్త కొత్త వలలతో సతమతమవుతుంటే తెర మీద కనిపించే నటీమణులు తమ రూపాలు మార్చుకుంటూ ‘ఇలా ఉండటమే కరెక్టేమో’ అనే సందేశాలు ఇవ్వడం మెల్లగా తగ్గాలి. సహజ రూపమే సౌందర్యాత్మకమైనది అనే భావనకు ప్రచారం రావాలి. అత్యంత అవసరమైన, సురక్షితమైన చిన్న చిన్న అవసరాలకు తప్ప ఈ కృత్రిమ రూపాలకు దూరంగా ఉండాలనే చైతన్యం కలగాలి. అప్పుడే ప్రతిభ ముందుకు వచ్చి రూపానికి రెండవ స్థానం లభించగలదు. అందుకు అందరూ ప్రయత్నించాలి. సహజమే... సౌందర్యం... నిజానికి బ్యూటీ కాంటెస్ట్‌లలో కూడా ‘ఇలా కనపడాలి... అలా కనపడాలి’ అంటూ ఏమీ నిబంధనలు ఉండవు. అయినా అమ్మాయిలు ఓవర్ కాన్షియస్ అయిపోయి ఏవేవో లోపాలు వెతుక్కుంటున్నారు. మంచి ఆహారపు అలవాట్లు, వర్కవుట్స్ తోనే గ్లో తెచ్చుకుని అందంగా కనిపించవచ్చు. ఏదైనా సరే సహజమైన పద్ధతులే తప్ప లేజర్ సర్జరీలు, ప్లాస్టిక్ సర్జరీలు వంటివి తప్పనిసరి పరిస్థితుల్లో ఆరోగ్యం కోసం అయితే ఓకే కానీ అందం కోసం చేయించుకోవడం సరైంది కాదు. – అభిమానిక తవి, ఫిట్నెస్ ట్రైనర్, బ్యూటీ పేజెంట్ గ్రూమింగ్ పోల్చుకోవడమే పెద్ద సమస్య... అందంగా కనిపించాలని ముందు మేకప్ చేసుకోవడం నుంచి మొదలుపెడతారు. తర్వాత బ్యూటీషియన్స్‌ని సంప్రదిస్తుంటారు. కాస్మెటిక్స్ ను విపరీతంగా వాడతారు. తర్వాత ప్లాస్టిక్ సర్జరీకి వెళతారు. ఇది బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్. వీరిలో సోషల్ యాంగ్జైటీ ఎక్కువ. నలుగురిలో తామే అందంగా కనిపించాలి. లేదంటే కామెంట్ చేస్తారేమో అని భయపడుతుంటారు కూడా. వేరే ఆలోచన ఉండదు. రోజులో ఎక్కువ మొత్తం ‘అందం’పైనే శ్రద్ధ పెడతారు. ఉన్నదున్నట్టుగా అంగీకరించడం వంటివి నేర్చుకునేలా కుటుంబంలోని వారంతా శ్రద్ధ చూపాలి. అందం ఉండటం కంటే ధైర్యంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఆహ్లాదంగా ఉండాలి అనే విషయంలో గైడెన్స్ ఇవ్వాలి. లేదంటే అందం కోసం సర్జరీల వరకు వెళ్లడం అనే ఆలోచన ఒక వైరస్‌లా అంటుకుపోతుంది. సూసైడల్ టెండెన్సీ, ఇంటి నుంచి వెళ్లిపోవడం, ఇతరుల మాటలకు ప్రభావితులు అవడం వంటివి జరుగుతాయి. – గీతా చల్ల, సైకాలజిస్ట్ చదవండి: సీరియల్ నటి వివాహం.. నెట్టింట వీడియో వైరల్ -
సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటే గర్భవతి అని తేల్చేశారు : హీరోయిన్
రాక్‌స్టార్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ నర్గీస్ ఫక్రి. తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత మాత్రం ఆ సక్సెస్‌ని కంటిన్యూ చేయలేకపోయింది. దీంతో బ్రేక్ తీసుకొని మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. అయితే కొంతకాలంగా కాశ్మీరి వ్యాపారవేత్త టోనీ బేగ్‌తో డేటింగ్ చేస్తున్నట్లు వస్తోన్న వార్తలపై ఈ బ్యూటీ స్పందించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. జీవితంలో అందరూ ప్రేమలో పడతారు. కానీ నేను సెలబ్రిటీ కావడంతో దాన్ని ప్రత్యేకంగా చూస్తారు. అంతేకాకుండా సెలబ్రిటీల శరీరాల గురించి మాట్లాడుకుంటారు. అనుకోకుండా నేను బ్రేక్ తీసుకుంటే మెటర్నిటీ లీవ్ అని తేల్చేశారు. నేను ఇండియాకు వచ్చిన కొత్తలో చాలా సన్నగా ఉండేదాన్ని. అప్పుడు బరువు పెరగాలని కొంతమంది సలహా ఇచ్చారు. దీంతో నేను కొంచెం బరువు పెరిగాను. అయితే కాస్త లావుగా కనిపించేసరికి నన్ను బాడీ షేమింగ్ చేశారు. నేను గర్భవతినంటూ ప్రచారం చేశారు. ఆ కామెంట్స్ నన్నెంతో బాధపెట్టాయి. ఇక నేనే రియలైజ్ అయ్యి నా ఆరోగ్యం కోసం బరువు తగ్గాను అంటూ చెప్పుకొచ్చింది. కాగా 2016లొ అజహర్ చిత్రం తర్వాత సుమారు మూడేళ్లు విరామం తీసుకున్న నర్గీస్ 2018లో మరలా 5 వెడ్డింగ్స్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది. చివరగా టొర్బాజ్ సినిమాలో నటించింది. ఇందులో సంజయ్ దత్, రాహుల్ దేవ్ ప్రధాన పాత్రల్లో నటించారు. త్వరలోనే పవన్‌కల్యాణ్‌తో 'హరిహర వీరమల్లు' చిత్రంతో తెలుగులోకి పరిచయం కానుంది. -
మిస్ యూనివర్స్‌కు బాడీ షేమింగ్.. ‘నేను ఆ వ్యాధితో బాధపడుతున్నాను’
బాడీ షేమింగ్.. ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల విషయంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఏ ఒక్కరు కొంచెం లావు అయినా కొంచెం సన్నపడినా బాడీ షేమింగ్ పేరుతో విమర్శలు చేస్తుంటారు. అయితే అందరూ ఈ విమర్శలను పెద్దగా పట్టించుకోరు. కానీ కొంతమంది మాత్రం సీరియస్‌గా తీసుకొని ఇబ్బంది పడుతుంటారు. తాజాగా ‘మిస్ యూనివర్స్ 2021’ కీరిటాన్ని గెలుచుకున్న భారతీయ యువతి, మోడల్ హర్నజ్ సంధు బాడీ షేమింగ్‌ను ఎదుర్కొన్నారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న హర్నాజ్ ఈ విషయాన్ని పంచుకున్నారు. తను బరువు పెరిగానంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయని తెలిపారు. కెరీర్ మొదట్లో చాలా సన్నగా ఉన్నారని, ఇప్పుడేమో లావుగా తయారయ్యారని వేధిస్తున్నట్లు తెలిపారు. అయితే ఆమె సెలియాక్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు వెల్లడించారు. తను ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు ఎవరికీ తెలియదన్నారు. సెలియాక్ వ్యాధి వల్ల గోధుమ పింటి లాంటి ఇతన అనేక ఆహార పదార్థాలను తినలేనని తెలిపారు. అయితే తన శరీరంపై ఎన్ని ట్రోల్స్ వచ్చినా ఎప్పుడూ నమ్మకంగా ఉంటానని , ఆత్మ విశ్వాసం సన్నగిల్లదని స్పష్టం చేశారు. చదవండి: హిజాబ్: మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు కామెంట్లు వైరల్ బొద్దుగా కనిపిస్తున్నావ్ కాగా ఇటీవల ముంబైలో జరిగిన లాక్మీ ఫ్యాషన్ వీక్‌లో హర్నాజ్ కౌర్ సంధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ర్యాంప్ వాక్ చేశారు. ఈ షోలో హాల్టర్ నెక్‌తో కూడిన ఆరెంజ్ గౌను ధరించి జాన్ జాకబ్స్ సన్ గ్లాసెస్‌తో కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు. వీడియోలు నెట్టింటా వైరల్ అయ్యాయి. దీంతో చాలామంది హర్నాజ్ బొద్దుగా కనిపిస్తోందని, బరువు పెరిగిందంటూ ట్రోల్ చేశారు. చదవండి: Viral Video: వైరల్‌గా మిస్ యూనివర్స్ 2021 డాన్స్ వీడియో.. View this post on Instagram A post shared by Miss Universe (@missuniverse) అయితే హర్నాజ్ సంధు శరీరంలో వచ్చిన మార్పుల కారణంగా కొందరు నెటిజన్స్ హర్నాజ్ ఆమెపై నెగిటివ్ కామెంట్ చేయడం మొదలు పెట్టారు. ఇంకొందరు మాత్రం 20 సంవత్సరాల తరువాత మిస్ యూనివర్స్ కిరీటాన్ని భారత్‌కు అందించిన యువతిని ఇలా బాడీ షేమింగ్ చేస్తూ కామెంట్ చేయడం కరెక్ట్ కాదంటూ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు ఏమిటీ సెలియాక్ వ్యాధి ఇది ఒక జన్యుపరమైన వ్యాధి. దిన్నే ఉదరకుహార వ్యాధి అని కూడా అంటారు. దీనిలో శరీర రోగనిరోధక వ్యవస్థ గ్లూటెన్ తీసుకోవడం పట్ల తీవ్రంగా స్పందిస్తుంది. ఇందులో గ్లూటెన్ కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బతినడం జరుగుతుంది. దీంతో జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి. వీళ్లు గ్లూటెన్ రహిత ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. గోధుమలు, రై, బార్లీ వంటి వాటికి దూరంగా ఉండాలి. -
యూట్యూబ్ ఛానల్స్‌కి గట్టి కౌంటర్ ఇచ్చిన యాంకర్ అనసూయ
Anasuya Strong Reply To Netizens Body Shaming Trolls On Her, Video Viral: యాంకర్ అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం బిజీ ఆర్టిస్ట్‌గా మారింది. బుల్లితెరపై గ్లామరస్ యాంకర్‌గా రాణిస్తున్న అనసూయ పాత్ర నచ్చితే అది గ్లామరైన, డీగ్లామరైన సై అంటుంది. ఇటీవలె పుష్ప సినిమాలో దాక్షాయణి పాత్రలో కనిపించింది. ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో తనపై చేస్తున్న ట్రోలింగ్‌పై అనసూయ ఘాటుగా స్పందించిది. తాజాగా ఇన్స్టాగ్రామ్ లైవ్‌లోకి వచ్చిన అనసూయ తనపై యూట్యూబ్‌లో అసభ్యకరంగా థంబ్నెయిల్స పెడుతున్నారంటూ మండిపడింది. ఈ మధ్యకాలంలో కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ పెట్టే థంబ్ నెయిల్స్ చూశాను. ఎంత లావు అయిపోయిందో చూడండి.. చూస్తే షాక్ అవుతారు అంటూ పెడుతుంటారు. ఇలాంటివి పట్టించుకోవద్దని అనుకుంటాను. కానీ అన్ని సందర్బాల్లోనూ స్ట్రాంగ్‌గా ఉండలేం కదా.. అందరికీ వీక్ మూమెంట్స్ ఉంటాయి. ఇక నేను బరువు పెరగడం లేదా తగ్గడం అన్నది నా ఇష్టం. కానీ మీ దిగజారుడుతనాన్ని ఎలా ఎత్తుకుంటారని నేను ఆ కామెంట్స్ చేసేవాళ్లని అడుగుతున్నా. నేను కూడా మీలా మాట్లాడగలను. హర్ట్ చేయగలను కానీ అది నా వ్యక్తిత్వం కాదు చురకలంటించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. -
ఆ ట్రీట్మెంట్ నా జీవితాన్నే నాశనం చేసింది: ప్రఖ్యాత మోడల్
లిండా ఎవాంజెలిస్టా దశాబ్దాలుగా ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన పేరు సంపాదించిన సూపర్ మోడల్. 80, 90లలో లిండా నవోమి కాంప్‌బెల్, కేట్ మోస్ వంటి ప్రఖ్యాత మోడల్‌లతో పాటు ర్యాంప్ వ్యాక్లో పాల్గొంది. దీంతో పాటు పలు ప్రఖ్యాత మ్యాగజైన్ కవర్లలో తన ఫోటోలు ప్రచురితమయ్యాయి. అంతటి పాపులర్ మోడల్ అయినప్పటికీ ఓ మోసపూరిత కాస్మెటిక్ ట్రీట్మెంట్ ఆమె జీవనోపాధిని నాశనం చేసిందని తాజాగా లిండా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. ఆ పోస్ట్‌లో.. ఐదు సంవత్సరాల క్రితం తాను చేసుకున్న కాస్మెటిక్ ట్రీట్మెంట్ వల్ల తాను శాశ్వతంగా వైకల్యం చెందినట్లు లిండా తెలిపింది. 56 ఏళ్ల ఈ మోడల్ ఓ సంస్థ సర్జరీ లేకండా ఫ్యాట్ కంటెంట్ తొలగిస్తామని నమ్మబలికి చివరికి ఆ వైద్యం దానికి విరుద్ధంగా జరిగిందని ఆరోపించింది. ఆ ట్రీట్మెంట్ సైడ్-ఎఫెక్ట్ తన జీవనాధారాన్ని పూర్తిగా నాశనం చేసిందని వివరిస్తూ.. ఇది నన్ను తీవ్ర నిరాశ, విచారం, నిరాశలోకి పంపిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియలో ఒంటరిగా మారిపోయానంటూ తన అవేదనను తెలిపింది. అయితే లిండా తనకు జరిగిన అన్యాయం పై చట్టపరంగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఫ్యాషన్, వినోద ప్రపంచంలోని సభ్యుల నుంచి లిండాకు మద్దతు లభిస్తోంది. ఇప్పటికి ఈ విషయమై పలువురు ఫ్యాషన్ రంగంలో పలువురు ప్రముఖులు ఆమెకు మద్దతు తెలుపుతూ సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. లిండా ఎవాంజెలిస్టా మోడలింగ్ కెరీర్ 1984లో ప్రారంభమైంది. చదవండి: నటి పుట్టినరోజు వేడుకల్లో అపశ్రుతి... కొంచెమైతే ఏమయ్యేదో.. -
‘నీ పర్సనాలిటీ చూసుకున్నావా.. నీ సైజ్‌కు సరిపోయే డ్రెస్ లేదు’
ముంబై: పెళ్లి గురించి ప్రతి అమ్మాయి ఎన్నో కలలు కంటుంది. అందుకోసం ప్రత్యేకంగా దుస్తులు, నగలు డిజైన్ చేయించుకుంటారు. పెళ్లిలో ధరించే ప్రతి దాని పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఇక చాలా మంది పెళ్లిలో నాజుకుగా కనిపించడం కోసం వివాహానికి కొన్ని రోజుల ముందు నుంచే డైటింగ్ వంటివి పాటిస్తుంటారు. ఇదంతా సరే. ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలను కాదనే హక్కు ఎవరికి లేదు. అలానే ఒకరి శరీరాకృతి గురించి విమర్శించే హక్కు కూడా ఎవరికి లేదు. కానీ ఈ విషయాన్ని ప్రముఖ డిజైనర్ తరుణ్ తహిలియాని మర్చిపోయినట్లున్నాడు. పెళ్లి లెహంగా కోసం వచ్చిన వైద్యురాలు, ఇన్‌స్టాగ్రమ్ ఇన్‌ఫ్లూయెన్సర్‌ని దారుణంగా అవమానించడట. ‘‘నీ ఆకారం చూసుకున్నావా.. నీ భారీ కాయానికి సెట్ అయ్యె డ్రెస్ మా దగ్గర లేదు’’ అన్నాడట. అతడి మాటలకు బాధపడిన సదరు డాక్టర్ ఇక జన్మలో అతడి స్టోర్‌కు వెళ్ల వద్దని నిర్ణయించుకుంది. మరో డిజైనర్ దగ్గరకు వెళ్లి డ్రెస్ కుట్టించుకుంది. పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడంతో పాటు తనకు జరిగిన అవమానాన్ని వెల్లడించింది. దీనిపై స్పందించిన తరుణ్ తహిలియాని సదరు వైద్యురాలికి క్షమాపణలు తెలిపాడు. ఆ వివరాలు.. సదరు డాక్టర్ పేరు తనయా నరేంద్ర. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె తన పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ.. ఇలా రాసుకొచ్చారు. ‘‘పెళ్లికి ముందు చాలా మంది మీద బరువు తగ్గమని ఒత్తిడి పెంచుతారు. నా విషయంలో కూడా అలానే జరిగింది. నువ్వు కూడా డైటింగ్ చేయోచ్చు కదా అని నా ఫ్రెండ్స్ అడిగారు. బరువు తగ్గడానికి చిట్కాలు కూడా చెప్పారు. కానీ నేను అవే పాటించలేదు. నన్ను నన్నుగా ప్రేమించుకోవడం నాకు బాగా తెలుసు. అందుకే వారి సూచనలు పట్టించుకోలేదు’’ అన్నారు. ‘‘పెళ్లి దుస్తుల విషయంలో నాకు చిన్నప్పటి నుంచే ఓ కోరిక ఉండేది. నా 12వ ఏట నుంచే నేను నా పెళ్లికి తరుణ్ తహిలియాని డిజైన్ చేసిన పెళ్లి లెహంగా ధరించాలని అనుకునేదాన్ని. ఆ ప్రకారమే పెళ్లికి నెల రోజుల ముందు అంబవట్టాలో ఉన్న తరుణ్ బ్రైడల్ స్టోర్‌కు వెళ్లాను. అక్కడ నాకు తీవ్ర అవమానం జరిగింది. నా శరీరాకృతి గురించి దారుణంగా మాట్లాడారు. నీ భారీ పర్సనాలిటీకి మా దగ్గర డ్రెస్ లేదు అనే సెన్స్‌లో కామెంట్ చేశారు. వారి మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి. ఇక జన్మలో అతడి స్టోర్‌కు వెళ్లకూడదని నిర్ణియంచుకున్నాను’’ అన్నారు. ‘‘పెద్ద శరీరం, వక్షోజాలు ఉంటే డిజైనర్లకు ఎందుకు అంత భయమో నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత నేను అనితా డోంగ్రే స్టోర్‌కు వెళ్లి నాకు కావాల్సిన లెహంగా గురించి వారికి వర్ణించాను. ఇవారు కేవలం మూడు వారాల వ్యవధిలోనే నాకు నేను కోరిన అందమైన లెహంగా డిజైన్ చేసి ఇచ్చారు. ఇందుకు తనను ఎంత పొగిడినా తక్కువే’’ అన్నారు. ‘‘నన్ను చూడండి. పెళ్లిలో నేను ఎంత సంతోషంగా ఉన్నానో. నాకు డబుల్ చిన్ ఉంది.. నా పొట్ట బయటకు కనిపిస్తుంది. కానీ ఇవన్ని నా సంతోషాన్ని పాడు చేశాయా.. లేదు కదా. ఎందుకంటే నా కుటుంబం, నా సన్నిహితులు, నా భర్త, నన్ను ప్రేమిస్తున్నాడు... మరీ ముఖ్యంగా నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నా పెళ్లి ద్వారా నేను నేర్చుకున్న అతి పెద్ద పాఠం ఇదే. ఆనందంగా ఉండండి. ఎందుకంటే సంతోషంగా ఉన్నవారే ఉత్తమ పెళ్లికుమార్తెలు’’ అంటూ షేర్ చేసిన ఈ స్టోరి ఎందరినో ఆకట్టుకుంది. ఇది చదివిన నెటిజనులు తరుణ్ తహిలియాని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో తరుణ్ తహిలియాని క్షమాపణలు తెలిపారు. తాను సదరు డాక్టర్ శరీరాకృతిని విమర్శించలేదని.. కరోనా కారణంగా ఆమెకు సెట్ అయ్యే డ్రెస్ తమ స్టోర్‌లో లేదని చెప్పాను అన్నారు. దాన్ని ఆమె తప్పుగా అర్థం చేసుకున్నారని వెల్లడించారు. ఇక మూడు వారాల్లో లెహంగా డిజైన్ చేయడం సాధ్యం కాదని.. ఒకవేళ చేసినా నాసిరకంగా ఉంటుందని తెలిపారు. -
సోషల్ మీడియాలో డిలీట్ చేశాం అనుకోకండి, స్క్రీన్ షాట్స్ కూడా సాక్ష్యమే
‘సరేలే బోండాం’ ‘నువ్వూ నీ తారుడబ్బా ముఖమూ’ ‘ఉఫ్పున ఊదితే ఎగిరిపోతావ్’ ఎవరినైనా ఉద్దేశించి ఇలా బాడీ షేమింగ్ చేయడం నేరం. సోషల్ మీడియాలో చేస్తే ఎవరు పట్టించుకుంటారు అనుకోవచ్చు. కాని కోలకతా నటి శ్రుతి దాస్ పోలీస్ కంప్లయింట్ పెట్టింది. రంగు నలుపు అంటూ ఆమె పై చేసే వ్యంగ్య వ్యాఖ్యల స్క్రీన్ షాట్స్ ఇప్పుడు పోలీసుల దగ్గరకు చేరాయి. మీ మిత్రులు ఇలాంటి కూతలు కూస్తుంటే మీరు హెచ్చరించాల్సిన సమయం వచ్చేసింది. హేళన చేయడం ద్వారా మనిషి కొంత ఆనందం పొందుతాడు. అయితే ఆ ఆనందం వికృత స్థాయికి చేరుకుంటే ఏం చేయాలి? హేళన ద్వారా మనిషిని బాధించడం, హాస్యం పుట్టించడం ఇవాళ చాలా వ్యాపారం అయిపోయింది. టీవీలలో వస్తున్న చాలామటుకు కామెడీ షోలు స్త్రీలను, వారి రూపాలను, వారి నడవడికను, లైంగిక ప్రవర్తనలను హేళన చేసేవే. బాడీ షేమింగ్ (శరీర అవయవాలను అవమానించడం), కలరిజం (శరీర వర్ణాన్ని బట్టి కామెంట్ చేయడం) నిజానికి ఇవన్నీ చట్టరీత్యా నేరం. ఆ సంగతి తెలియక చాలామంది సోషల్ మీడియాలో విమర్శ పేరుతో హేళన చేస్తున్నారు. అలాంటి వారు ఇబ్బందుల్లో పడక తప్పదని కోలకటాలో తాజా ఘటన నిరూపించింది. అక్కడి టీవీ నటి శ్రుతి దాస్ తన రంగు తక్కువ అంటూ హేళన చేస్తున్న వారిపై కేసు పెట్టింది. ఏం జరిగింది? కోల్కటాలో టీవీ నటిగా ఉన్న శ్రుతి దాస్ గత రెండు సంవత్సరాలుగా గుర్తింపు పొందింది. ఆమె నటించిన ‘త్రినయని’ అనే టీవీ సీరియల్ హిట్ అయ్యింది. ‘నేను ఆ సీరియల్ దర్శకుడితో అనుబంధంలో ఉన్నాను. కాని సోషల్ మీడియాలో ఆ ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ నా రంగు గురించి ప్రస్తావన చేస్తూ నన్ను హేళన చేస్తున్నారు’ అని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బెంగాల్లో నల్లగా ఉన్నవారిని ‘కాలో’(నల్లది), ‘మోయిలా’ (మాసినది) అని హేళన చేసేవాళ్లుంటారు. విమర్శ చేయాలంటే ఏ పాయింట్ లేనప్పుడు ఇలా రంగునో రూపాన్నో ప్రవర్తననో ముందుకు తెచ్చి కామెంట్ చేసి బాగా అన్నాం అని చంకలు గుద్దుకుంటారు కొందరు. కాని అలాంటివారిని వదిలేది లేదని ఆమె పోలీస్ కంప్లయింట్ ఇచ్చింది. స్క్రీన్ షాట్స్ కూడా సాక్ష్యమే సోషల్ మీడియాలో మనం ఏదైనా కామెంట్ చేస్తే దానికి శిక్షలు పడవనుకుంటే పొరపాటు. బాధింపబడినవారు పోలీస్ కంప్లయింట్ చేస్తే అలాంటి వారిని వెంటనే చట్టపరంగా శిక్షించడానికి కేసు నమోదు అవుతుంది. కొందరు కామెంట్ చేసి ఆ తర్వాత దానిని డిలీట్ చేయవచ్చు. కాని ఈలోపు ఆ బాధితులు ఆ కామెంట్‌ను స్క్రీన్ షాట్స్ తీసుకుంటే అవి కూడా సాక్ష్యాలుగా ఉపయోగపడతాయి. హేళన కూడా ఒక అణచివేత సాధనమే. ఎదుటివారిని అణచివేయడానికి హేళనను ఆయుధంగా వాడుతారు. కాని అలాంటి రోజులు పోయాయి. స్త్రీలను, వృద్ధులు, వికలాంగులను, ఇంకా ఎవరినైనా గాని రూపాన్ని బట్టి, భాషను బట్టి, రంగును బట్టి, నేపథ్యాన్ని బట్టి హేళన చేస్తే, మనసు గాయపరిస్తే, అగౌరవపరిస్తే వారంతా చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుంది. ‘కాళీ మాత కూడా నల్లగానే ఉంటుంది. ఆమెను కొలుస్తాం మనం. కాని హేళన సమయంలో మాత్రం ఎదుటివారిని నల్లగా ఉన్నారని అంటాం. ఇది ఎంత తప్పో అందరూ ఆలోచించాలి’ అని శ్రుతి దాస్ అంది. ‘నలుపు నారాయణమూర్తే గాదా’ అని ఒక దేశీయగీతం ఉంది. ఏ రంగైనా ప్రకృతి దృష్టిలో ఒకటే. సంస్కారలోపం ఉన్నవారే వర్ణఅంతరాన్ని చూస్తారు. -
ఎవరేమన్నా పట్టించుకోను!
సెలబ్రిటీలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వారికి నెటిజన్ల నుంచి ప్రశంసలు ఏ స్థాయిలో ఉంటాయో విమర్శలు కూడా ఆ స్థాయిలోనే ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్ల శరీరాకృతిని హేళన చేస్తూ (బాడీ షేమింగ్) రకరకాల కామెంట్లు పోస్ట్ చేస్తుంటారు. ఈ పోస్టులు సదరు సెలబ్రిటీలను బాధకు గురిచేస్తుంటాయి. గోవా బ్యూటీ ఇలియానా కూడా శరీరాకృతిపై వేధింపుల్ని ఎదుర్కొన్నారట.. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెబుతూ – ‘‘ఇన్ స్టాగ్రామ్‌లో నా శరీరాకృతి విషయంలో వేధింపులకు గురికావడం నాకు కొత్త కాదు. ఆ మాటకొస్తే ఇన్స్టాగ్రామ్ లేని రోజుల్లోనే.. నా బాల్యం నుంచే ఇలాంటి వేధింపులను భరిస్తూ వస్తున్నాను. కొన్నిసార్లు మాటల్లో చెప్పలేని విధంగా కామెంట్లు చేస్తుంటారు. నీ పిరుదుల సైజు ఎంత? సర్జరీ చేయించుకోవచ్చుగా? నీ కాళ్లు అలా ఎందుకున్నాయి? వంటి ప్రశ్నలను సంధిస్తుంటారు. సోషల్ మీడియాలో నాకు వచ్చే మెసేజెస్‌లో కనీసం 10 మెసేజ్‌లు ఇలాంటివే ఉంటాయి. ఆ ప్రశ్నలతో నా శరీరం మీద నాకే ఓ నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. కొన్నిసార్లు ఓ రకమైన భయానికి లోనయ్యేదాన్ని. ముఖ్యంగా మహిళల్లో హార్మోన్ల లోపం వల్ల శరీరంలో చాలా రకాలుగా మార్పులు సంభవిస్తుంటాయి. నా శరీరాకృతిపై అలాంటి కామెంట్లు చేసే ప్రతి ఒక్కరికీ ఒక్కో రకమైన శరీరాకృతి ఉంటుంది.. అది వారి లోపంగా భావించకూడదనే విషయాన్ని నెటిజన్లు తెలుసుకోవాలి. మాటల రూపంలో నెటిజన్లు పెట్టే హింసను పట్టించుకోవద్దని అనుకొంటాను.. కానీ కొన్నిసార్లు మానసికంగా వేదనకు గురయ్యే కామెంట్లు వినిపిస్తుంటాయి. వేధింపులను తట్టుకోలేక ఓ సందర్భంలో వైద్యులను సంప్రదించాను. ఈ రకమైన సమస్యను డిస్మార్ఫియా అంటారట. ఈ రుగ్మత వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ చూసేవాళ్లు కామెంట్ చేయడం వల్ల ఓ రకమైన మానసిక సంఘర్షణ ఏర్పడేది. అయితే ఈ మానసిక వేదన అంతా ఒకప్పుడు. ఇప్పుడు ఎవరేమన్నా పట్టించుకోను. ఎవరో ఏదో అన్నారని కుంగిపోకూడదు. మన గురించి మనం పాజిటివ్‌గా ఆలోచించుకోవాలి. అప్పుడు ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది’’ అని పేర్కొన్నారు ఇలియానా. కాగా ఇలియానా ప్రస్తుతం రణ్‌దీప్ హుడాతో కలిసి ‘అన్ ఫెయిర్ అండ్ లవ్లీ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ముచ్చటగా మూడోసారి ‘బాద్షా హో’ (2017), ‘రైడ్’ (2018) చిత్రాల్లో అజయ్ దేవగణ్, ఇలియానా జంటగా నటించారు. తాజాగా అజయ్, ఇలియానా మరోసారి జోడీ కట్టనున్నారనే టాక్ బీ టౌన్లో వినిపిస్తోంది. అజయ్ దేవగణ్ ‘రుద్ర’ అనే వెబ్ సిరీస్ అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో అజయ్, ఇలియానా జంటగా కనిపించనున్నారట. ఇది నిజమైతే వీరిద్దరూ ముచ్చటగా మూడోసారి జతకట్టినట్లు అవుతుంది. -
అసంపూర్ణం కూడా సంపూర్ణమే!
బాడీషేమింగ్ చేసేవాళ్లను ఉద్దేశించి ‘షేమ్ షేమ్’ అంటున్నారు సమీరా రెడ్డి. ‘‘మనం ఎలా ఉంటే అలా స్వీకరించడాన్ని నేర్చుకుందాం. మనల్ని మనం ఇష్టపడదాం. పోల్చుకోవడం మానేద్దాం. పోల్చి చూడటం ఆపేద్దాం’’ అని కూడా అన్నారు సమీరా. బాడీషేమింగ్ గురించి ఓ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేశారామె. ఇటీవలే తల్లి అయిన ఒక అమ్మాయి పంపిన మెసేజ్ చూసి ఈ విషయం మీద ఈ వీడియో చేసినట్టు తెలిపారు సమీరా. వీడియో సారాంశం ఈ విధంగా... ‘‘సమీరా.. ఈ మధ్యనే తల్లయిన నేను బరువు పెరిగాను. నా శరీరం నాకే నచ్చడం లేదు. అసహ్యంగా ఉన్నాను అనిపిస్తోంది’ అనే మెసేజ్ నాకు వచ్చింది. నాకు చాలా బాధ అనిపించింది. మన దగ్గర ఏం లేదో (జీరో సైజ్ అయినా ఇంకేదైనా..) దాని గురించే పదే పదే ఆలోచించి బాధపడటం మానేద్దాం. మన దగ్గర ఉన్నదానితో సంతోషపడటం నేర్చుకుందాం. చిన్నప్పటి నుంచి నన్ను మా అక్కయ్యలతోనో ఎవరో ఒకరితోనో పోలుస్తూనే ఉన్నారు. తను అలా ఉంది.. నువ్వు ఇలా ఉన్నావు అని. ఇక నేను పని చేసిన ఇండస్ట్రీ చేసే పనే అది.. పోల్చి చూడటం. దాంతో నేను చూడటానికి బావుండాలని చేయని ప్రయత్నం లేదు. మేకప్, లెన్స్, ప్యాడ్స్.. ఇలా అన్నీ వాడాను. ఇలాంటివి చేసినా సంతోషంగా ఉన్నానా? అంటే అస్సలు లేదు. మనం ఎలా ఉన్నాం అనేది ముఖ్యం కాదు. సంతోషంగా ఉన్నామా? లేదా? అన్నదే ముఖ్యం. చాలా ఏళ్లుగా ఇలాంటి షేమింగ్స్తో విసుగెత్తిపోయాను. పట్టించుకోవడం మానేశాను. మనం సంతోషంగా ఉన్నామా? లేదా అనే విషయం మీదే దృష్టి పెట్టాను. మీరు కూడా అదే పాటించండి. లావుగా ఉన్నారా? ఏం ఫర్వాలేదు.. మెల్లిగా తగ్గుతారు. కంగారుపడకండి.. కుంగిపోకండి. అనవసరమైన విమర్శలతో వేరే వాళ్లు కుంగిపోయేలా చేయకండి. సంతోషంగా ఉండటంపైనే ఫోకస్‌గా ఉండండి. అసంపూర్ణాన్ని కూడా ఆస్వాదిద్దాం. అసంపూర్ణం కూడా సంపూర్ణం అనుకుందాం. అప్పుడు చాలా బాగుంటుంది!’’ అని ఆ వీడియోలో సమీరా రెడ్డి చెప్పిన మాటలు చాలా అర్థవంతంగా, ధైర్యం నింపేలా ఉన్నాయి. సమీరా రెడ్డి ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చారు. తల్లయినప్పటి నుంచి తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇలాంటి విషయాలు చర్చిస్తూ, అవగాహన తీసుకొస్తూ, అభద్రతాభావంతో బాధపడేవాళ్లకు ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. -
లావుగా ఉన్నానని బయటకు పంపడం లేదు
లక్నో: తెలుగులో కొన్నేళ్ల క్రితం ఓ సినిమా వచ్చింది. దానిలో తల్లిదండ్రుల బలవంతం మేరకు హీరో లావుగా ఉన్న మహిళను వివాహం చేసుకోవాల్సి వస్తుంది. దాంతో వివాహం అయిన నాటి నుంచి ఆ మహిళను లావుగా ఉన్నావ్ అంటూ విమర్శించడమే కాక ఆమెతో కలిసి బయటకు ఎక్కడకు వెళ్లడు. సరిగా ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది ఘజియాబాద్‌కు చెందిన ఓ మహిళకు. భర్త వేధింపులతో విసిగిపోయిన సదరు మహిళ విడాకులు ఇప్పించాల్సిందిగా కోర్టును ఆశ్రయించింది. ఆ వివరాలు.. బిజ్నోర్కు చెందిన ఓ మహిళకు మీరట్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగితో 2014లో వివాహం అయ్యింది. కొద్ది రోజులు వీరి కాపురం బాగానే సాగింది. ఆ తర్వాత సదరు వ్యక్తి లావుగా ఉన్నావంటూ భార్యను వేధించడం ప్రారంభించాడు. తనతో పాటు ఎక్కడికి తీసుకెళ్లేవాడు కాదు. ఆమెను ఎక్కడికి పంపే వాడు కాదు. అంతేకాక ఇంటికి ఎవరైనా బంధువులు, స్నేహితులు వస్తే వారి ముందే ఆమెను అవమానించేవాడు. అంతటితో ఊరుకోక తనతో కలిసి మద్యం సేవించాల్సిందిగా సదరు మహిళను బలవంతం చేసేవాడు. అందుకు ఆమె అంగీకరించకపోతే కొట్టేవాడు. ఈ విషయాల గురించి బాధిత మహిళ తన తల్లిదండడ్రులకు, అత్తింటి వారికి కూడా చెప్పింది. కానీ అతడి ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. విసిగిపోయిన మహిళ భర్త పెట్టే టార్చర్‌ను తట్టుకోలేక పోతున్నాను.. విడాకులు ఇప్పించండి అంటూ ఘజియాబాద్ కోర్టును ఆశ్రయించింది. -
‘లావుగా ఉన్నావ్.. జిమ్‌కు వెళ్లు’
బాడీ షేమింగ్.. ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న మాట. కొద్ది రోజుల క్రితం విద్యాబాలన్ దీని మీద ఓ వీడియో కూడా చేశారు. సాధరణ వ్యక్తులతో పోలిస్తే.. సెలబ్రిటీల విషయంలో బాడీ షేమింగ్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం ఇలాంటి కామెంట్సే ఎదుర్కొంటున్నారు బాలీవుడ్ నటి అంజలి ఆనంద్. అయితే కామెంట్ చేసిన వ్యక్తికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు అంజలి. వివరాలు.. రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో అంజలి తన అభిమానులతో ముచ్చటించారు. ఆ సమయంలో ఓ మహిళ అంజలిని ఉద్దేశిస్తూ.. ‘మీరు చాలా లావుగా ఉన్నారు.. జిమ్‌కు వెళ్తే బాగుంటుంది’ అని అంజలికి ఓ ఉచిత సలహా ఇచ్చింది. ఈ కామెంట్లపై అంజలి చాలా హుందాగా స్పందించారు. ‘నేను కూడా ప్రజలను సరైన దారిలో నడిపించడానికి.. లేదా వారు వ్యాప్తి చేసే ద్వేషం గురించి వారిని హెచ్చరించడానికి సోషల్ మీడియాను వాడతానని ఎన్నడు అనుకోలేదు. నా జీవితాన్ని నాకు నచ్చినట్లు జీవిస్తేనే జనాలకు ఓ ఉదాహరణగా నిలవగలుగుతాను. ఈ క్రమంలో విమర్శలు ఎదుర్కొవాల్సి వస్తే.. నేను సిద్ధమే. వాటి గురించి మాట్లాడతాను.. చర్చిస్తాను. ఎందుకంటే విమర్శించే వారిలోనే సమస్య కానీ నాలో ఏలాంటి సమస్య లేదు. అలాంటి వారి పట్ల చాలా ప్రేమగా, దయగా వ్యవహరించి చంపేస్తాను’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు అంజలి. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కరెక్ట్‌గా డీల్ చేశారంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం అంజలి ఏక్తాకపూర్ నిర్మిస్తున్న ధాయ్ కిలో ప్రేమ్‌లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. -
సాయి వాణి యదార్థ భవిష్యవాణే
ఎన్ని అవయవాలు మన శరీరంలో దాగి ఉన్నా.. మనం ఎవరమో, ఎలాంటి లక్షణాలు కలవాళ్లమో ఎదుటివాళ్లకి తెలియపరచుకునేందుకు లేదా తెలిసేందుకు అదే విధంగా ఆ ఎదుటివాళ్లని గురించిన ఓ అవగాహన మనకి కలిగేందుకూ ప్రధానంగా సహకరించేది నోరు మాత్రమే. ఆ నోటి నుంచి వెలువడే మాట ప్రకారమే కార్యకలాపాలన్నీ సాగుతాయి.అయితే ఈ మాటని సంస్కృత భాషలో ‘వాక్కు’ అంటారు. ఆ వాక్కుని వినగానే దాని నుంచి వచ్చే భావాన్ని ‘అర్థం’ అంటారు. ఈ వాక్కు, అర్థం అనే రెండింటి గురించీ అలాగే రెండింటి మధ్య ఉండే సంబంధం కొద్దిపాటిగా తెలిస్తే తప్ప ఈ వ్యాసం, తద్వారా సాయితత్త్వం మనకి తెలియదు. కాబట్టి క్లుప్తంగా తెలుసుకోవలసిందే. లౌకికానాం హి సాధూనా మర్థం వాగనువర్తతేఋషీణాం పునరాద్యానాం వాచ మర్ధోను ధావతిఇది మహాకవి చెప్పిన మాట.లౌకికులమైన మనం ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు, అది ఏ విధంగా ఎదుటివాడికి అర్థాన్నియ్యాలో, ఎలా బోధపడాలో దాన్నంతా ముందుగా మనం ఆలోచించి, అనుకుని, అదే అర్థం వచ్చేలా దానికి సరిపోయిన మాటల్ని (వాక్కు) ఒకచోట చేర్చి ఆ మాటలనే మాట్లాడతాం.‘అయం ఘటః’ ఇది ఓ కుండ అని ఈ మాటకి అర్థం. ‘నల్లగా ఉన్నదీ, ఏదో ఓ వస్తువుని దానిలో ఉంచుకునేందుకు వీలైనదీ, మట్టితో చేయబడినదీ అయిన ఇది కుండ’ అని ఇంత అర్థాన్ని లోపల అనుకుని దానికి సరిపడిన ఘటం (కుండ) అనే వాక్కుని అంటాం. ఇది మనకి అనుభవంలో తెలిసిన విషయం– నిత్యవ్యవహారంలో సాగుతున్న అంశం కూడా.అదే మరి ఋషులుగానీ మాట్లాడవలసివస్తే.. వాళ్లు మనలా అర్థాన్ని లోపల కుదుర్చుకుని, దానికి సరిపడ్డా వాక్కులని (మాటల్ని) కూర్చుకుని మాట్లాడరట. వాళ్లు ముందుగా వాక్కుని (మాటని) అనేస్తారు. ఆ మీదట ఆ వాక్కుని బట్టి అర్థం ఏర్పడుతుందట. కద్దిగా వివరించుకుంటే.. ఓ ఋషి ఓ వ్యక్తిని ‘త్వం రాక్షసో భవ!’ నువ్వు రాక్షసుడివి అయిపోదువుగాక! అని అన్నట్లయితే, ఆ ఋషి ఈ వ్యక్తిని చూసి ముందుగా ఈ అర్థాన్ని లోపల అనుకుని దానికి సరిపోయినట్లుగా వాక్కులని అనడమన్నమాట. కడుపు మండిన ఆవేదనతో ఈ వాక్కులని అనగానే ఎదుటివ్యక్తిలో రాక్షస లక్షణాలు(కోరలూ, కొమ్ములూ మిడిగుడ్లూ, భయంకర వికృతదేహం, తుమ్మముళ్లు వంటి రోమాలూ, వికటాట్టహాసం...) అలా చూస్తూ ఉండగానే ఒకటికొకటిగా ప్రవేశిస్తూ క్షణాల్లో రాక్షసుడిగా అతడు కనిపించేస్తాడన్నమాట. ఇలాంటి సంఘటనలని మనం నిత్యం అనేక పురాణకథల్లో వింటూనే ఉంటాం కదా!సాయి చరిత్రతో ఏమిటి సంబంధం?ఇదేదో వినడానికి బాగానే ఉంది గానీ.. దీనికీ– సాయి చరిత్రకీ సంబంధమేమిటి? అని అనిపిస్తుంది కదా! ఏ ఋషులైతే రాబోయే సంఘటనలని తమ తపశ్శక్తితో ముందుకు ముందే దర్శించగలరో అలాంటి శక్తే సాయికి కూడా ఉందనే విషయాన్ని సాక్ష్యాధారాలతో నిరూపించడానికీ, అలా నిరూపించి సాయి తపశ్శక్తి స్థాయి ఎంతటిదో తెలియజేయడానికీనూ.ఈ తీరుగా నిరూపించని పక్షంలో– సాయికి రాబోయే కాలంలో ఏం జరగబోతోందో ఎలా తెలుసు? అని ఎవరైనా అడిగితే – ఆయన దేవుడు గదా! ఆయనకి తెలియనిదేముంటుంది? అని టక్కున సమాధానం చెప్పేస్తారు. ఇంకాస్త లోతుకి దిగి అవతలి వ్యక్తి ‘ఆయనే గనుక దేవుడయ్యుంటే ఎవరికీ కనిపించకుండా ఉండాలిగా!? తన దైవమహిమతో ఎవరికీ అసలు కష్టాలే రాకుండా చేసేయొచ్చు కదా!? అయినా కాలకృత్యాలు చేస్తుండే ఎవరూ దైవం కానేకాడంటూ మీ పురాణాలే చెప్పాయిగా!?’ అంటూ ప్రశ్నిస్తే సమాధానాన్ని చెప్పలేక – అలా మాట్లాడితే కళ్లుపోతాయి! అయినా ఇలాంటి దుర్విమర్శలని విన్నా కూడా పాపమే! అంటూ వెళ్లిపోతూ కనిపిస్తారు ఎందరో భక్తులు. ప్రతి పనికీ ఒక హేతువు ఉండి తీరుతుంది. ఆ దృష్టితో దాదాపుగా ఎవరూ ఆలోచించరు. సాయి నిజానికి మనిషే అయినా ఆ అతీంద్రియ శక్తి ఎలా వచ్చింది అనే ధోరణితో ఆలోచిస్తేనూ, ఆ అతీంద్రియశక్తికి సంబంధించిన సాక్ష్యాలని తెలుసుకుంటేనూ ఆయన ఎలా అందరికంటే ఉన్నతస్థితిని సాధించగలిగాడో మనకి అర్థమవుతుంది. దాంతో సాయి గురించి చేసే దుర్విమర్శలనీ, అలాగే వ్యతిరేక ప్రచారాలనీ తిప్పికొట్టగలగడమే కాక, హేతుబద్ధమైన సమాధానాలని చెప్పి సాయికున్న గొప్పదనాన్ని ధైర్యంగా నిరూపించగలం. అందుకే సాయికున్న అతీంద్రియశక్తి ఎలా ఆయనకి లభించిందో మనం తప్పక తెలుసుకుని ఉండాల్సిందే! ఈ దృష్టితో పరిశీలిస్తున్నాం కాబట్టి ముందుగా ఆయనకున్న అతీంద్రియ శక్తిని నిరూపించే ఒకటి రెండు సంఘటనలని వివరించుకుని, ఆ శక్తి లభించడం వెనకున్న కారణాన్ని తెలుసుకుందాం! ఆగవయ్యా బాబూ! ఆగు!! సాయి తన మసీదుకి ఎవరొచ్చినా జాతి, మత, కుల, స్త్రీ, పురుష, ముసలి, యువక, వితంతు భేదాలని వేటినీ పరిగణించకుండా అందరినీ – భోజనం చేసి మాత్రమే వెళ్లండి – అని చెప్పేవాడు. దాదాపుగా భోజన సమయానికి వచ్చి ‘రైలు వెళ్లిపోతుంది... అవతల పనుంది...’ అంటూ ఎవరైనా వెళ్లినట్లయితే అనుకున్న రైలు దాటిపోవడం లేదా ఆలస్యం కావడం కారణంగా ఇటు భోజనం అటు ప్రయాణమనే రెండూ సాగక కచ్చితంగా ఇబ్బందికి గురవుతూ ఉండేవారు భక్తులు. ఇది ఏ ఒక్కరికో కలిగిన అనుభవం కాదు. అందుకే సాయి మాటని వింటే దాన్ని ఓ ఆదేశంగానే భావించే వారు తప్ప ఎవరూ ధిక్కరించి వెళ్తూ ఉండేవారు కానే కాదు. అందరినీ ఉద్దేశించి చెప్పే మాట కంటే ప్రత్యేకంగా ఎవరితోనైనా సరే ఏదైనా చెప్తే ఇక ఆ మాటకి పర్యవసానం మరింత తీవ్రంగా ఉండేది. పాటిల్ తాత్యాకోతే అనే సాయి సన్నిహిత భక్తుడు వారం వారం జరిగే సంతకి వస్తూ ఉండేవాడు. ఆ వచ్చినప్పుడు సాయిని దర్శించి షిర్డీకి 3 మైళ్ల దూరంలోని కోపర్గావ్ సంతకి వెళ్తూండేవాడు. అలా ఒకసారొచ్చి వీధిలోనే టాంగాని నిలిపి సాయి వద్ద కొచ్చి పాదాభివందనం చేసి తాను వెళ్లడానికి అనుమతినీయవలసిందని సాయిని కోరాడు. సాయి చిరునవ్వు నవ్వుతూ – ‘ఎందుకలా తొందరపడుతూ టాంగాని కూడా అక్కడే నిలిపి.. వచ్చీ రాగానే వెళ్లిపోతావెందుకు? కాస్త ఆగవయ్యా బాబూ! ఆగు! ఒక్క నిముషం ఉండు! సంతదేముంది? ఎక్కడికీ పోదు! తర్వాత వెళ్దువుగానీ ఆగు! ‘ఇప్పుడు మాత్రం నువ్వు షిర్డీని దాటి ఊరు బయటికెళ్లకు!’ అని ఇంత వివరంగా అన్నాడు అతనితో. అయినా పాటిల్ తొందరని తన ముఖంలో చూపిస్తూ మళ్లీ ఓ నమస్కారాన్ని చేసి – తప్పనిసరిగా వెళ్లాల్సిందే! – అనే నిర్ణయంతో మసీదుమెట్లని దిగుతూ ఉంటే సాయి గమనించాడు. ‘సరే! తొందరగా వెళ్లాలంటున్నావుగా! శ్యామాని నీ వెంట తీసుకెళ్లు. ఒంటరిగా ప్రయాణం చెయ్యకు!’ అని మళ్లీ అన్నాడు సాయి. అలా రెండుమార్లు సాయి వద్దేవద్దని చెప్పడంలోని ఆంతర్యం పాటిల్‌కి అర్థం కాలేదు. సాయి కూడా వివరించి చెప్పనూ లేదు.సాయి మాటని ఓ ఆజ్ఞగా భావించే శ్యామా ఈ పాటిల్‌తో బయలుదేరడానికి సిద్ధపడుతూ ఉంటే.. అంత అవసరమేముంది? వద్దులే! అన్నట్లు చేసంజ్ఞ చేసి చెప్తూ తానొక్కడే బయలుదేరాడు కోపర్గావ్ అనే సంత జరిగే ప్రదేశానికి. టాంగాకున్న రెండు గుర్రాల్లో ఒక దాన్ని ఈ మధ్యే కొన్నాడు. దానికి వేగంగా పరిగెత్తి తన శక్తిని చూపించుకోవాలనే అత్యుత్సాహం తప్ప మరేదీ తెలియదు. టాంగాని అదిలించగానే బయలుదేరాయి గుర్రాలు.తీవ్రమైన వేగంతో గుర్రాలు పరుగెత్తడం ప్రారంభించాయి. ఎత్తుపల్లాల గురించి పాటిల్ పగ్గాలు లాగి వేగాన్ని తగ్గించాడు. మళ్లీ ఆ పల్లాన్ని దాటాక చురుగ్గా లాగవలసిందని సూచించడం కోసం గుర్రాలు రెండింటినీ తన చేతి కొరడాతో పెద్ద దెబ్బ తగులకుండా కొట్టాడు. మొదటి గుర్రానికి ‘కొరడా – దానితో కొడతారు’ అనే జ్ఞానముంది గానీ.. ఈ కొత్తగా వచ్చిన రెండో గుర్రానికి ఆ ఆలోచన లేదు– అదే ప్రథమానుభవం కావడంతో. అంతకుముందు రెండు మూడు సంతలకి వెళ్లిన కారణంగా ఆ తోవ ఈ రెండో గుర్రానికి తెలిసి అదే మార్గంలో వెళ్తున్నా – ఈ కొరడా దెబ్బ తనకి మొదటిసారి అయ్యేసరికి విపరీతమైన వేగంతో పరిగెట్టేది కాస్తా ఒక్కసారిగా మోకాళ్ల మీద కూచుండిపోయింది. దాంతో టాంగా మొత్తం ఓ పక్కకి ఒరిగిపోయింది. అకస్మాత్తుగా జరిగిన సంఘటన అయిన కారణంగా పాటిల్‌కి నడుము విరిగినట్లే అనిపించింది. ఏం జరిగిందో అర్థం కావడానికి రెండు మూడు నిమిషాలు పట్టింది.మెల్లగా టాంగాని దిగాడు పాటిల్. ఇక ఎవరూ తనకి గుర్తు రాలేదు. సాయి మాటలే చెవిలో వినపడసాగాయి. ‘ఆగవయ్యా బాబూ ఆగు!... పోనీ నీతో శ్యామాని కూడా తీసుకెళ్లుతోడుగా! ఒంటరిగా మాత్రం వెళ్లకు! ఊరుదాటి బయటికి వెళ్లకు!’ అనేవే. పాటిల్‌కి సాయి మాటల్లోని అర్థం, భావార్థం, తాత్పర్యం కూడా స్పష్టంగా తెలిసినట్లయింది. తానే తనలో చిరునవ్వు నవ్వుకున్నాడు– సాయిని గురించి తెలిసి కూడా ఇలా ఎందుకు చేశానా? అని. వెంటనే సాయినామస్మరణని అనేక పర్యాయాలు చేసుకుని, సంతపని చేసుకుని కృతజ్ఞతలని సాయికి మనసులోనే తెలియజేసుకుంటూ ఆ ప్రదేశాన్ని వీడి వెళ్లిపోయాడు. ఇదేమిటి? మళ్లీ చేశానా?ఈ సంఘటన జరిగి కొంతకాలం అయిపోయింది. మళ్లీ ఇదే పాటిల్ షిర్డీకి సమీపంలో ఉన్న ‘కొల్లార్’ అనే గ్రామానికి టాంగా మీద బయలుదేరాడు. మార్గం మధ్యలో ఉన్న షిర్డీకి వెళ్లి మసీదులో ఉన్న సాయిని దర్శించి పాదాభివందనం చేసి సాయి ఆజ్ఞ కోసం కళ్లలోకి చూస్తూ – ‘దేవా! ఇలా వెళ్లి అలా తిరిగొచ్చేస్తాను’ అన్నాడు నోరు తెరిచి. సాయి ఆ పాటిల్‌ని చూస్తూ ‘వెళ్లు అనలేదు, వెళ్లద్దు అని కూడా అనలేదు. వెళ్లద్దని కిందటిసారిలా అనలేదు. ‘అంతే కాకుండా మరొకరిని తోడుగా తీసుకెళ్లు అదీ కాక ఊరిని దాటి వెళ్లద్దు’ వంటి మాటలేమీ అనలేదు. దాంతో పాటిల్ దాన్ని సాయి వ్యతిరేకత అలాగే సాయి ఆజ్ఞా అనే రెండు లేనట్లుగా భావిస్తూ బయల్దేరాడు పూర్వంలాగానే. పూర్వపు టాంగా కాదిది. ఇది దానికంటే చిన్నది. అంతేకాక తేలికైనది కూడా. గుర్రాలు మాత్రం బలిష్ఠంగా ఉన్నవి. యవ్వనంలో కూడా ఉన్నవీ అయిన కారణంగానూ, టాంగా తమకి సరిపోయిన బలంగా ఉన్నది కాకపోయిన కారణంగానూ వేగంగా లాగుతూ పరిగెత్తసాగాయి. రెండింటికి రెండూ పోటీపడుతూ గోతులు, గొçప్పులు, చిన్న చిన్న నీటి కాలవలూ వచ్చినా కూడా లెక్కచేయకుండా పరిగెత్తేయడంతో పాటు వేగాన్ని తగ్గించడం కూడా లేకుండా సాగిపోతూ సాగిపోతూ పెద్ద గోతిలో కూలబడిపోబోయి ఓ క్షణంలో పక్కకి తిరిగి మార్గం పక్కన ఉన్న తుమ్మచెట్టుని గుద్దుకుని ఆగిపోయాయి. తుమ్మ చెట్టు విరిగిందంటే గుర్రాల వేగాన్ని లెక్కించుకోవచ్చు. టాంగా కూడా బాగా దెబ్బతింది. అక్కడి నుండి తిరిగి పాటిల్ తన గ్రామాన్ని చేరడానికి çపడ్డ శ్రమ ఇంతా అంతా కాదు.తన నడుం విరక్కుండా, కాళ్లూ చేతులూ ఇతర భాగాలకీ ఏ దెబ్బలూ తగలకుండా సాయిౖ దేవుడే రక్షించాలనే దృఢవిశ్వాసం కలిగిన పాటిల్ ఇక ఎప్పుడూ సాయి ఆజ్ఞని పాటించి తీరాల్సిందే! అని దృఢనిశ్చయానికి వచ్చేశాడు. సాయి మాట్లాడిన ప్రతి మాటనీ బాగా విశ్లేషించుకుని స్పష్టంగా అర్థం చేసుకున్నాకనే ఏ పనినైనా చేయాలని నిశ్చయించేసుకున్నాడు. అప్పుడనుకున్నాడు పాటిల్– ఇదేమిటి? ఒక్కసారి బుద్ధొచ్చాక కూడా మళ్లీ ఇదే తప్పు చేశానా? అని.మరొక్క సంఘటనఒకసారి ఒక ఆంగ్లేయుడు సాయి దర్శనానికొచ్చాడు. ఒకరి నుంచి సిఫారసు ఉత్తరం కూడా తీసుకొచ్చి బాబాను దర్శించుకోవాలనుకుంటున్నానని చెప్పాడు అక్కడి వారితో. వారంతా అన్నారు ‘సాయి అనుమతీ, ఆజ్ఞా లేనిదే మసీదు మెట్లని ఎక్కనేలేవు’ అని. మూడు మార్లు తీవ్ర ప్రయత్నం చేసినా సాయి అనుమతినీయలేదు.3 రోజుల పాటు ఓ గుడారాన్ని వేసుకున్నా అతనికి సాయి అనుమతి లభించనే లేదు. ఇక నిరాశతో ఇంటికి వెళ్లిపోదామనుకున్న వేళ – మెట్లు దిగి వెళ్తున్న సాయి దర్శనం అతనికి లభించింది. అనుమతిని కోరాడు సాయిని. – ‘అంత తొందరెందుకు? రేపు వెళ్లచ్చు కదా!’ అన్నాడు సాయి అతనితో. అయినా అతను ‘‘4 రోజుల పాటు ఉన్నాను. దర్శనం కూడా అయ్యింది. ఇంకా దేనికి ఉండటం?’’ అనుకుంటూ బయల్దేరబోతుంటే– భక్తులందరూ సాయి అనుమతిని పొందాకే వెళ్లడం మంచిదని ఏకగ్రీవంగా చెప్తూ ఒకటి రెండు దుస్సంఘటనలని వివరించి చెప్పారు కూడా! అయినా అతడు విరమించలేదు ప్రయాణాన్ని.ఆ ఆంగ్లేయుడు టాంగాని ఎక్కి వెళ్తూ ఉంటే గుర్రాలు మొదట్లో మెల్లగానే ప్రయాణించసాగాయి. తర్వాత వేగాన్ని పుంజుకున్నాయి. అలా వెళ్తూన్నప్పుడు ఓ వ్యక్తి సైకిలు మీద గుర్రాలకి అడ్డంగా మార్గాన్ని దాటుతూ వేగంగా వెళ్లిపోయాడు. ఎప్పుడూ అలాంటి రాకని ఎరుగని గుర్రాలు ఒక్కసారిగా బెదిరిపోయాయి. దాంతో టాంగా అదుపు తప్పింది. ఆంగ్లేయుడు నేలమీద పడిపోయాడు. లేచే సత్తువ లేకపోయింది. ఎవరో సహాయపడి మొత్తానికి అతడ్ని అతను కోరిన చోటుకి పంపారు. ఆసుపత్రిలో పడి కొంతకాలం పాటు చికిత్స చేయించుకున్నాడు కూడా.అప్పుడు అతనికి అర్థమైంది – సాయి వాక్కుకి ఉన్న శక్తి ఏమిటో!ఎక్కడిది ఈ శక్తి?‘మననాత్ త్రాయతే ఇతి మంత్రః’ ఏ దైవనామాన్నయితే నిరంతరం మననం చేస్తారో ఆ కారణంగా అలా మననం చేసిన వ్యక్తికి ఓ శక్తి వచ్చి చేరుతుంది. ఆ శక్తి ఆ తీరుగా మననం చేసిన వ్యక్తి మాటలోకి వెడుతుంది. దాంతో ఆ వ్యక్తికి జరగబోయే సంఘటనతో పాటూ తాను ఏదంటే అదే జరిగే అతీంద్రియశక్తి అబ్బుతుంది. అందుకే అలాంటి వ్యక్తులు మనలా కాక ఆచి తూచి మాట్లాడుతూ ఉంటారు.సాయి నిరంతరం ‘అల్లాహ్ హో మల్లిక్!’ అనే నామాన్నే ఒకప్పుడు 12 ఏళ్ల పాటు నేలమాళిగలో, ఆ మీదట వేపచెట్టు కింద, ఆ తర్వాత అడవిలో, ఆ తర్వాత కూడా ఎప్పుడూ విరామం దొరికితే అప్పుడు మననం చేస్తూ ఉండటంతో ఆ శక్తి వాక్కుకొచ్చింది. అదీ నిజమైన కారణం– అదే యథార్థ కారణం.పైవారం సాయి మసీదులో కనిపించే హిందూ సంప్రదాయాలు (సాయిలో సన్యాసధర్మం మసీదులో హైందవ ధర్మం).– సశేషం - డా. మైలవరపు శ్రీనివాసరావు -
మూగపిల్ల
అనగనగా ఒక బాలిక. పేరు సుభాషిణి. నామకరణం నాడే బిడ్డ మూగపిల్ల అవుతుందని ఏ తల్లిదండ్రులు ఊహించగలరు పాపం? ఆ బాలికకు ఇద్దరు అక్కలు ఉన్నారు. సుకేశిని, సుహాసిని అని వాళ్ల పేర్లు ముందే పెట్టారు. ఆ పేర్లలోని అనుప్రాసను తప్పనివ్వకుండా తల్లిదండ్రులు కడసారి బిడ్డకు సుభాషిణి అని పేరు పెట్టకున్నారు. క్లుప్తంగా ‘సుభా’ అని పిలవసాగారు.వరులను వెదకడంలోను, కట్నాలు కానుకలు ఇవ్వడంలోను– సర్వసాధారణంగా పెళ్లిళ్లలో పడే పాట్లన్నీ పడి ఎలాగో పెద్దపిల్లలిద్దరికీ పెళ్లిళ్లు చేసేశారు. ఇక కడగొట్టు బిడ్డే మిగిలి ఉంది. తల్లిదండ్రుల గుండెల మీద కనబడని బరువులా ఆ బాలిక ఈడేరి ఇంట్లో కూర్చుని ఉంది. ఆమెకు నోరు లోపించింది కనుక భావానుభూతి కూడా తప్పక లోపిస్తుందనే లోకం తలచినట్లుగా ఉంది. ఆ ధీమాతోనే ఆమె సమక్షంలోనే ఆమె భవిష్యత్తు గురించి చర్చించి ఆందోళన చెందేవాళ్లు. దాంతొ తన స్థితిని చిన్నతనంలోను సుభా అర్థం చేసుకుంది. అందువల్ల నలుగురిలోకీ రావడం మానుకుంది. ఆటల పాటల స్నేహాల ప్రసక్తే మానుకుంది. ఏకాంతంగా వేరుగా ఉండిపోయేది. తననెవరూ తలవకుండా మరచిపోతే చాలు, లోకం తనకు మహోపకారం చేసినట్టు అనుకునేది. కాని బాధను మరవడం ఎవరికి శక్యం? రాత్రింబగళ్లు ఈ బిడ్డను గురించిన ఆందోళనే తల్లిదండ్రుల మనసులను వేధించింది. తల్లి కళ్లల్లో ఆమె ఒక విరూపిగా ఉంది. కూతురిలోని వెలితి తల్లికి గౌరవహాని అనిపిస్తుంది. అందుకే సుభా అంటే తల్లికి తన శరీరం మీద ఏదో మచ్చలా ఏవగింపు. తండ్రి వాణీకాంతకు తన సంతానంలోకల్లా సుభా అంటేనే అనురాగం ఎక్కువ. సుభాకు మాట లోపించింది గాని, ధనురాకారంలో తీర్చిదిద్దిన పొడవాటి కనుబొమ్మలు అంచులుగా గల చారెడేసి కళ్లకు కొదవలేదు. ఆమె మనసులో మెదిలిన భావాలకు అనుగుణంగా ఆమె పెదవులు చిగురుటాకులా కంపించేవి. భావాలను వ్యక్తం చేసేటప్పుడు అనుగుణమైన భాష అంత సులువుగా పట్టుబడదు. అదొక అనువాద క్రమం. ఆ అనువాదం తరచు సంతృప్తికరంగా ఉండదు. భాషతో నిమిత్తం లేని ఆ నీలాల కళ్లకు అనువాదపు బెడదలుండవు. కళ్లల్లో మనస్సు నీడ సూటిగా ప్రతిఫలిస్తూ ఉంటుంది. భావం మనసులో విప్పారినా, ముడిగినా, మెరిసినా, ఇరులలో మాయమైనా– అస్తమించే పాలిపోయిన చంద్రవంకలా నిస్సత్తువగా కాసేపు నిలిచిపోయినా, ఆకాశం మూలమూలలనూ కనురెప్పపాటులో కాంతివంతం చేసే విద్యుల్లతలా కదిలినా– ఆ నీలాల కన్నుల్లో ఛాయలుగా తోచక విధి లేదు. పెదవులు కదపడం కన్నా వేరే భాష లేని పుట్టుమూగకు నేత్రభాష అలవడుతుంది. ప్రకృతిమాతలో కానవచ్చే ఏకాంత వైభవం మూగవారికి వశమవుతుంది. అందువల్లే పొరుగు పిల్లలు సుభా అంటే భయపడేవారు. ఎడంగా ఉండేవారు. ఆట పాటలకు కూడా కలిసేవారు కాదు. నిర్జనమైన మధ్యాహ్న సమయంలా ఆమె నిశ్శబ్దంగా, ఏకాకిగా చరించేది. ఆమె స్వగ్రామం చండీపూర్. అదొక చిన్న నది ఒడ్డున ఉంది. అసలు బెంగాల్‌లోని నదులన్నీ చిన్నవే. ఇల్లు వెడలని మధ్యతరగతి మర్యాదస్తుల కుటుంబంలో పుట్టి పెరిగిన ఆడబిడ్డలా కరకట్టలను మీరకుండా బిరబిరా ప్రవహిస్తూ తన దారిన తాను పోతుంటుంది. తన తీర పరిసర గ్రామాల్లో ప్రతి ఇంటికీ పనిగత్తెలా తన విధులు తీర్చుకుంటూ విశ్రాంతి ఎరుగని ప్రయాణం చేస్తుంది. ఏటికి ఇరుగట్లా ఇళ్లూ వాకిళ్లూ ఉన్నాయి.హాయిగా నీడనిచ్చే చెట్లు ఉన్నాయి. కొండ కోనలను దిగివచ్చి మైదానంలో పడినది మొదలు ఆ నదీ దేవత ఇంటింటికీ ఉద్యానవన దేవత అయింది. తన్ను తానే మరచిన పారవశ్యంలో పరుగెత్తిపోతూ దయామయంగా ఎంతో పరిచర్య చేస్తోంది. వాణీకాంత ఇంటిని ఏటిలోంచి చూడవచ్చు. ఆ ఊరిలోని ప్రతి గుడిసె, ప్రతి చావడి ఏటిలో ఓడ నడిపే నావికుల కనుచూపు నుంచి దాక్కోలేవు. సుభా రోజూ పని పూర్తి చేసుకోవడంతోనే బయలుదేరి చడీచప్పుడూ లేకుండా ఏటి తిన్నెకు వెళ్లి కూర్చునేది. ప్రాపంచికమైన జంఝాటంలో పడి ఏ నావికుడైనా ఏటి గట్టున ఈ బాలికను గమనిస్తున్నాడో లేదో చెప్పలేము.కాని ప్రకృతిమాత ఆ బాలికలోని మాట లోపాన్ని భర్తీ చేయడానికి ఆమెకు బదులుగా తానే మాట్లాడేది. సెలయేటి గుసగుసలు, జానపదుల సంభాషణలు, ఓడ సరంగు తీయని పల్లెపదాలు, పక్షుల కిలకిలలు, చెట్ల వీవనలు– అన్నీ కలసి ఆమె హృదయస్పందనతో ఏకీభూతమయ్యాయి. అవన్నీ ఒక అపూర్వ నాద తరంగమై అలసిన ఆమె గుండెలపై నినదిస్తున్నాయి. ప్రకృతిమాతకు చెందిన ఈ మార్మిక చలనమే ఆ మూగ బాలిక భాష. విల్లులాంటి కనుబొమ్మలంచు గట్టిన ఆ నీలనయనాల భాషే ఆమెను అక్కడ ఆవరించిన ప్రపంచంలోని భాష. మిట్టమధ్యాహ్న ఘడియల్లో నావికులు, బెస్తలు భోజనాలకు వెళ్లిపోతారు. గ్రామీణులు మాగన్నుగా పడుకుంటారు. పక్షులు నిశ్శబ్దమవుతాయి. రహదారి పడవలు విశ్రమిస్తాయి. బహు వ్యాపకాలతో వేగే ప్రపంచం ఒక్క క్షణం పని నిలిపి, హఠాత్తుగా ఏకాంతపు కొలువుదీర్చి బ్రహ్మరాక్షసిగా మారిపోతుంది. అప్పుడు విస్ఫార విశాలాకాశం కింద నిశ్శబ్దంగా ఇద్దరు కూర్చుంటారు: ఒకరు ప్రకృతి, మరొకరు మూగ బాలిక. ఒకరు చండభానుని కిందా– మరొకరు చిన్న చెట్టు పరచిన నీడపట్టున ఉంటారు. అలాగని సుభాకు స్నేహితులసలే లేరనుకోవద్దు. వాళ్ల దొడ్డో సర్భాషి, పంగుళి అనే రెండు గంగిగోవులు ఉన్నాయి. వాటి పేర్లు పెట్టి నోరారా ఆమె వాటిని ఏనాడూ పిలిచి ఎరుగదు. వస్తోందనగా ఆమె అడుగుల చప్పుడును బట్టి అవి ఆమె రాకను తెలుసుకునేవి. ఆమె మాటలు ఉచ్చరించలేకపోయినా మూగగా ముచ్చటగా గొణిగేది. స్ఫుటమైన ఉచ్చారణ కన్నా మృదువైన ఆ గొణుగుడే వాటికి సులభంగా బోధపడేది.ఆమె వాటిని గోముగా బుజ్జగించినా, కోపంతో కసరినా, బతిమాలినా మనుషుల కన్నా అవే చక్కగా అర్థం చేసుకునేవి. సుభా పశువులశాలకు వస్తుంది. వచ్చీ రావడంతోనే సర్భాషి మెడకు తన చేతులు చుట్టేస్తుంది. తన చెక్కిలిని గోవు చెక్కిలికి ఆనించి మెల్లగా పాముతుంది. ఇంతలో పంగుళి నాలుకసాచి ఆమె ముఖాన్ని నాకుతుంది. సుభా రోజుకు కనీసం మూడుసార్లు పశువుల కొట్టంలోకి వచ్చి వెళుతుంది. అది ఆమె నియమం. ఇంకా ఎక్కువసార్లు వచ్చి వెళ్లడం కూడా కద్దు. పరుషోక్తులు పడవలసి వచ్చి, మనసు గాయపడినప్పుడల్లా ఈ మూగ నేస్తాల దగ్గరకు వచ్చేస్తుంటుంది. అలా రావడానికి ఏవేళా అడ్డురాదు. ఆమె నిరాశాపూరితమైన చూపుల మూలంగా గోవులు ఆమె ఆత్మక్షోభను కనిపెట్టినట్లే అగుపిస్తాయి. గోవుమాణిక్యాలే ఆమెకు చేరువగా వచ్చి కొమ్ములతో ఆమె చేతులను రాసుకుంటాయి. మూగగా, ఉద్విగ్నంగా ఆమెను ఓదార్చబూనుకుంటాయి. గోవు నేస్తాలే కాకుండా, మేకపిల్ల, ఒక పిల్లికూన కూడా ఆమె స్నేహబృందంలో ఉన్నాయి. అయితే, అవి ఈమె పట్ల గట్టి బంధం ఏర్పరచుకున్నా, వాటి పట్ల ఆమెకంత ఆత్మీయత లేదు. అందులో ఆ పిల్లికూన రాత్రిగాని, పగలుగాని సమయం దొరికనప్పుడల్లా ఆమె ఒడిలోకి అట్టే దూరి నిద్రపోతుంది. సుభా దాని మెడా వీపూ వేళ్లతో నిమురుతూ నిద్రపుచ్చుతుంటుంది. అందుకు దాని తృప్తి వెల్లడిస్తుంటుంది. ఈ చతుష్పాద జంతువుల్లోనే కాకుండా, ద్విపాద జంతువుల్లో కూడా సుభాకొక నేస్తుడున్నాడు. అతనితో బంధం ఎలాంటిదో చెప్పడం కష్టం. అతనికి మాట ఉంది. అందువల్ల వారిద్దరికీ అర్థమయ్యే భాష లేకపోయింది. వాడు గోసాయనుల కడసారి కుర్రవాడు. పేరు ప్రతాప్. సోమరి. తల్లిదండ్రులు ప్రయత్నించి ప్రయత్నించి వాడు ఏనాటికైనా జీవనోపాధి చూసుకోగలడనే ఆశను వదులుకున్నారు. వాడొక తిరుగుబోతు. అత్మీయులైన వారు వాణ్ణి ఏవగించుకున్నప్పటికీ మిగిలిన ఊరివారందరితోనూ చనువుగా, మంచిగా ఉంటాడు. పనిపాటలు లేని ఇలాంటి వాళ్లు ఊరుమ్మడి సొత్తుగా పరిగణింపుకెక్కుతారు.షికారు వెళ్లి సేదదీరడానికి పట్నంలో బహిరంగ స్థలం అవసరమైనట్లే గ్రామానికి ఇద్దరు ముగ్గురు సదా తీరుబడి జీవాలు కావాల్సి ఉంటారు. వారి పుణ్యమా అంటూ అందరికీ కాలం వెళ్లమారుతుంది. ఏమీ తోచకపోతే, ఊసులాడుతూ పొద్దుగడిపే స్నేహితుడు కావాలంటే ఇటువంటి వాళ్లు సిద్ధంగా ఎల్లప్పుడూ బాతాఖానీ రాయుళ్ల చేతికి దొరుకుతారు. ప్రతాప్ పెట్టుకున్న వ్యాపకం చేపలను పట్టడం. కాలమంతా ఎక్కువగా ఈ వ్యాపకంతోనే గడిపేస్తాడు. ప్రతి మధ్యాహ్నం అతను ఆ పనిలోనే కనిపిస్తాడు. ఆ వ్యాపకం వల్లనే అతడు ప్రతినిత్యం సుభాను కలుసుకోగలుగుతాడు. అతడేమి తలపెట్టినా అందుకొక సలహాదారు, నేస్తం కావాలి. చేపలకు గాలమేసేటప్పుడు నిశ్శబ్దంగా కూర్చోగల నేస్తమైతే అన్నిటికంటే మంచిది. ఇంకేం, సుభాలో ఆ నిశ్శబ్ద స్వభావం ఉంది. ప్రతాప్ అందుకే ఆమె ఆ వేళ అక్కడ ఉండాలని కోరుకుంటాడు. ఆమెను అందరూ సుభా అని పిలిస్తే ప్రతాప్ ఆప్యాయత కొద్దీ ‘సూ’ అని పిలిచేవాడు. చింతమాను నీడలో సుభా కూర్చుంటే, ఇంకాస్త దూరంలో ప్రతాప్ కూర్చుని గాలం వేసేవాడు. ప్రతాప్ ఇన్ని ఆకులు తెచ్చేవాడు. వాటితో ‘సూ’ తాంబూలం సిద్ధపరచేది. కూర్చుని చాలాసేపు పరికిస్తూ ప్రతాప్‌కి ఏదో సాయపడాలని ఆందోళనపడుతూ ఉండేదని నా నమ్మకం. అలా సాయపడటం ద్వారా ఆమె భూమికి బరువు చేటు కాదని, నిరర్థకం కాదని నిరూపించుకోవాలనుకునేది. కాని తాను చెయ్యడానికేమీ లేదు.అప్పుడు ఆమె దేవదేవుని ప్రార్థించేది. అపురూప శక్తినేదో ప్రసాదిస్తే ఒక గొప్ప కార్యం ఘనంగా చేసి, ‘అమ్మో! మన ‘సూ’ ఇంత చేస్తుందని కలలో కూడా అనుకోలేదని ప్రతాప్ నోట ఆశ్చర్యార్థకం రాబట్టాలని ఉబలాటపడేది. సుభా జలదేవతే అయినట్లయితే, రసాతలంలోని నాగరాజు కిరీటంలోని మాణిక్యాన్ని పెకలించి దోసిట పెట్టుకుని జలాల్లోంచి నెమ్మదిగా ఒడ్డుకు చేర్చేది. అంతటితో పాడు చేపల వేట చాలించి ప్రతాప్ నీటిలో దూకి రసాతలంలోకి మునక ఈతలో వెళ్లి ఏడంతస్తుల వెండిమేడలో బంగారుతల్పం మీద ఒక యువతీమణి దర్శనభాగ్యం పొందేవాడు. ఆ యువతీమణి వాణీకాంత కూతురు, ‘సూ’ కన్నా అతనికి మరెవ్వరవుతారు? ధగధగాయమానంగా మెరిసే ఆ మాణిక్యనగరం రాజుగారి కుమార్తె ‘సూ’ను చూసేవాడు. కాని పాపం, ఇదొక్కడే సాధ్యంకాని పనిగాని తక్కినవన్నీ సుసాధ్యాలే. పాటలీపుత్ర రాజప్రాసాదంలో కాకుండా, ఆమె వాణీకాంత ఇంట పుట్టినదాయె! దాంతో గోసాయనుల కుర్రవాణ్ణి చకితుణ్ణి చేసే సాధన విశేషాలు దొరకక హతాశురాలయ్యేది. పెరిగి పెద్దదయింది. క్రమక్రమంగా తనను తాను తెలుసుకోవడం ప్రారంభించింది. పౌర్ణమినాడు సముద్రగర్భగోళం నుంచి ఎగసిపడే కెరటంలా చెప్పనలవికాని నూతన చేతన స్ఫూర్తి ఆమెలో అలముకుంది. తన ప్రశ్నకు తాను అర్థం చేసుకోగల సమాధానం లభించలేదు. ఒక పున్నమిరాత్రి నడిజామున లేచి, తన గది తలుపులు మెల్లగా తెరిచి వెన్నెల్లోకి కూడా పిరికిగా తొంగిచూసింది. రాకా చంద్రికలో సుభా వలెనే ప్రకృతి ఆదమరచి నిద్రిస్తున్న భూదేవిని తిలకిస్తోంది. అప్పుడు సుభాలో బలలీయమైన పడుచుదనం స్పందించింది. మోదఖేదాలు రెండూ ఆమెలో ముప్పిరిగొన్నాయి. పూర్వం చెప్పరానంత ఏకాకిగా భావించుకునేదేగాని ఈ నిమిషంలో అదే భావం తుది శ్రుతులకు చేరి పరాకాష్ఠ చెందింది. ఆమె హృదయం బరువెక్కింది, కాని వెలిబుచ్చలేదు. నిశ్శబ్ద వ్యథార్తమైన ప్రకృతిమాత సన్నిధానంలో లోలోపల కుమిలే ఆ ఆడపడుచు తలవంచింది. ఆమెకు వివాహం జరిపించడం ఎలాగన్నదే తల్లిదండ్రులను వేపుకు తినసాగింది. పిల్ల ఎదిగింది. ఈడేరిన పిల్ల నట్టింట పడి ఉండటంతో లోకం వారిని చీకొట్టింది. వెలివేస్తామని బెదిరించింది కూడా. వాణీకాంత జరుగుబాటు ఉన్న సంపన్న గృహస్థే. రెండుపూటలా చేపలవేపుడు రుచిచూడగలిగిన కుటుంబమే. కలిమి గలవాని మీద అసూయ కావలసినంత. అది లోకధర్మమే. అందుకే అతనికి విరోధుల కొరత లేదు.ఒకనాడు ఇరుగు పొరుగు అమ్మలక్కలు పిల్ల పెళ్లిని గురించి కలగజేసుకున్నారు. వాణీకాంత చెప్పులరిగేలా తిరిగి ఇంటికొచ్చాడు. ఇక కలకత్తా వెళితే తప్ప వీలులేదన్నాడు. కుటుంబం కుటుంబమంతా ప్రయాణమైంది. మంచెతెర కప్పిన ఉషస్సులాగ సుభా హృదయం అశ్రుపూర్ణాకులమైంది. ఇన్ని రోజుల నుంచి ఆమె బిక్కుబిక్కుమంటోంది. అలా పెనగొన్న భయంతోనే తల్లిదండ్రుల వెనుక మూగజంతువులా బయల్దేరింది. వారి కళ్లలోకి చూసి ఏదో తెలుసుకోవాలనుకుంది. కాని వారు ఆమెకు ఏమాటా విప్పి చెప్పలేదు. ఇలా జరుగుతూ ఉండగా ఒక మధ్యాహ్నం గాలం నడుపుతూ కూర్చున్న ప్రతాప్ ఇలా అన్నాడు: ‘అయితే, సూ.. నీకు మొగుణ్ణి చూశారన్న మాట. నీకు పెళ్లవుతుంది. నన్ను మరచిపోకేం’ అని గాలం ఆడిస్తూ మళ్లీ వేటలో నిమగ్నమయ్యాడు. ‘నీకు నేను చేసిన అపచారం ఏముంది?’ అని ఉచ్చులో చిక్కిన పావురం బోయవాని ముఖం చూసి దీనంగా అడుగుతుంది. అలాగే సుభా ప్రతాప్ వైపు దీనంగా చూసింది. ఇక ఆ రోజుకి చింతమాను కింద కూర్చోలేక తిరిగొచ్చింది. వాణీకాంత ఒక్క కునుకుతీసి లేచి పడకగదిలో హుక్కా పీలుస్తున్నాడు. ఇంతలో సుభా వచ్చి అతని కాళ్ల వద్ద పడి తండ్రి ముఖంలోకి చూస్తూ గావురుమంది. వాణీకాంత ఓదార్చబోయి తానే కంటతడి పెట్టసాగాడు. ఉదయమే కలకత్తా ప్రయాణం నిశ్చయమైపోయింది. పశువుల కొట్టంలోని తన బాల్య స్నేహితులందరి వద్దా సెలవు తీసుకునేందుకు వెళ్లింది. చేతితో వాటికి పచ్చమేత అందించింది. వాటి మెడలు వాటేసుకుంది. కళ్లలోకి చూసింది. ఆమె కళ్లు బాష్పాలు కురిశాయి. బాష్పాలే ఆమె భాష. గోవు మాణిక్యాలు అర్థం చేసుకున్నాయి. నాడు బహుళ దశమి రాత్రి. సుభా గది వెడలి వచ్చింది. ఏటి గట్టున తాను కూర్చునే తావున గరికపట్టు మీద బోర్లా పడుకుంది. భూదేవి ఆమెకు నిశ్శబ్ద, సుబల మాతృమూర్తి. ‘నువ్వు నన్ను ఎడబాయనివ్వొద్దు. తల్లీ, నిన్ను నేను కావులించుకున్నట్లే నువ్వూ నన్ను నీ గాఢ సమాలింగనంలో చిక్కబట్టుకో తల్లీ!’ అని నివేదించుకోవాలని యత్నించింది. కలకత్తా మహానగరంలో ఒక ఇంట్లో ఒకానొకనాడు సుభాకు తల్లి అలంకరించింది. బిగువుగా జడ అల్లింది. ఇన్ని ఆభరణాలను దిగవేసింది. ఆమె సహజ లావణ్యాన్ని చంపడానికి చేయాల్సినదంతా చేసింది.సుభా నీలలోచనాలు అశ్రుపూరితాలయ్యాయి. ఏడ్చి ఏడ్చి కళ్లు వాచిపోతాయని తల్లి భయపడి కసురుకొని తిట్టింది. కాని కన్నీళ్లు తిట్లకు వెరుస్తాయా?ఒక స్నేహితుణ్ణి వెంటబెట్టుకుని వరుడు పెళ్లిచూపులకు వచ్చాడు. తలుపువార నిలబడి, వరుడి ముందుకు పంపే ముందు కూతురికి తల్లి బిగ్గరగా సూచనలు ఇవ్వసాగింది. దాంతో ఆమె ఇంకా వెక్కివెక్కిఏడవసాగింది. ఆ మహాపురుషుడు ఆమెను ఎగాదిగా పరీక్షగా చూసి ‘అంత నాసికాదు’ అని స్వగతాన్ని పైకి అన్నాడు.ఆమె బాష్పాలు అతని మనసును ఆకర్షించాయి. ఆమెది సుకోమల హృదయమనుకున్నాడు. తల్లిదండ్రులను ఎడబాయడానికి కుములుతున్న ఆమె ఆర్ద్రహృదయం తనకెంతో ఉపకరిస్తుందని అనుకుంటూ,ఏడుపును ఆమె సుగుణంగానే లెక్కగట్టుకున్నాడు. పురోహితుడు వచ్చాడు. శుభాశుభాలు లెక్కించాడు. ఒక శుభదినాన వివాహం పూర్తయింది. నోరులేని బిడ్డను ఒకరి చేతుల్లోపెట్టి తల్లిదండ్రులు తమ ఇల్లు చేరారు. దేవుని దయవల్ల ఇహంలో వారి కులానికీ, పరంలో వారి భద్రతకు భంగం వాటిల్లకుండా తప్పింది. అల్లుడికి పశ్చిమబెంగాల్లో ఉద్యోగం అయింది. పెళ్లయిన కొద్దిరోజులకే భార్యను కాపురానికి తీసుకుపోయాడు.పట్టుమని పదిరోజులైనా గడవలేదు. పెళ్లికూతురు మూగదని అంతా కనిపెట్టారు. ఇంకా ఎవరైనా కనిపెట్టలేకపోతే, అది ఆవిడ తప్పుకాదు. ఇందులో ఆమె ఎవ్వరినీ మోసగించలేదు. ఆమె గుట్టంతా కళ్లే విప్పి చెప్పేశాయి. కాని ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోయారు. ఎవ్వరూ ఆమెను పలకరించలేదు. పుట్టినది మొదలు తనకు తెలిసిన మొహాలిప్పుడు కరువయ్యాయి. మూగపిల్ల భాషను ఎరిగిన వారంతా దూరమయ్యారు. ఆమె నీరవ హృదయం అంతమేలేని, వినబడని ఏడుపు చప్పుళ్లు నెలకొన్నాయి. అదెవ్వరికి తెలుసు అంతర్ద్రష్టకు తప్ప! - రవీంద్రనాథ్ టాగోర్ -
యాడ్లపై మహిళా క్రికెటర్ ఆగ్రహం
ఇస్లామాబాద్ : తెల్లగా ఉంటేనే అమ్మాయిలను చూస్తారని, అందంగా ఉండి... మంచి శరీరాకృతి ఉంటేనే అవకాశాలు వస్తాయంటూ... నిత్యం టీవీల్లో వచ్చే ప్రకటనలను చూస్తూంటాం. వాటి మాయలో పడి ఎత్తు పెరగడానికి, తెల్లగా మారడానికి శస్త్ర చికిత్సలు చేయించుకుని.. ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు లేకపోలేదు. అయితే మహిళలకు కావాల్సింది ఆత్మవిశ్వాసమే తప్ప.. తక్కువ చేసి చూపించే బ్యూటీ ఉత్పత్తుల కాదంటున్నారు పాక్ క్రికెటర్ సనా మిర్. బ్యూటీ ఉత్పత్తుల యాడ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫేస్బుక్లో ఆమె ఓ పోస్టును ఉంచారు. తాజాగా నటి మహీరా ఖాన్ ఓ హెయిర్ రిమూవల్ క్రీమ్ యాడ్‌లో నటించింది. అయితే ఆ యాడ్ అవమానకరంగా ఉందంటూ మిర్ తన ఫేస్బుక్లో ఓ సందేశం ఉంచారు. ‘మేము ఎప్పుడు వివిధ రంగాల్లో మహిళలకు ఎదురయ్యే ఆటంకాల గురించే మాట్లాడుకుంటాము. ఇలాంటి వ్యవహారాలు(యాడ్) మాకు చాలా ఆగ్రహం తెప్పించే అంశం. ఆడపిల్లలు ఆటలు ఆడాలంటే వారికి క్రీడల పట్ల అభిమానం, ప్రతిభ, నైపుణ్యం ఉంటే సరిపోదా? శరీరాకృతి, రంగే ప్రధానమా? నేను ఆడపిల్లలకు చెప్తున్నది ఒకటే మీరు క్రీడల్లో రాణించాలంటే మీకు ఉండాల్సింది సున్నితమైన చేతులు కాదు.. బలమైన చేతులు. ఒకసారి మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడండి. చాలామంది మహిళా క్రీడాకారులు వారి నైపుణ్య, కఠోర శ్రమ, ప్రతిభ వల్ల ఉన్నతంగా ఎదిగారు. అంతేతప్ప వారి శరీరాకృతి, రంగు వల్ల కాదు.. ..నా ఈ 12 ఏళ్ల క్రీడా ప్రయాణంలో చాలా సౌందర్య ఉత్పత్తుల కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రచారం చేయమని నన్ను సంప్రదించాయి. కానీ నేను ఒప్పుకోలేదు. ఎందుకంటే క్రీడల్లో రాణించాలనుకునే వారికి సౌందర్య సాధనాలతో పనిలేదన్నది నా అభిప్రాయం. నేను సెలబ్రిటీలను, స్పాన్సర్లను కోరుకునేది ఒక్కటే.. యువతులు వారి కలలను పూర్తి చేసుకోవడానికి కావల్సిన నమ్మకం, ఆత్మవిశ్వాసాన్ని అందించి వారి కాళ్ల మీద వారు నిలిచేలా సహకరించండి. అంతే తప్ప రంగు, శరీరాకృతి గురించి ప్రచారం చేసి వారిని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయకండి’ అంటూ ఓ సుదీర్ఘమైన పోస్ట్ ఉంచారు. సనా పాకిస్తాన్ జాతీయ మహిళ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడమే కాక అంతర్జాతీయ మ్యాచ్‌లలో 190 వీకెట్లు తీశారు. -
'కామెంట్లపై వార్నింగ్ ఇచ్చిన హీరోయిన్'
ముంబై: ఇకపై ఎవరైనా తనపై కామెంట్స్ చేసేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని విమర్శకులను హెచ్చరించింది బాలీవుడ్ హీరోయిన్ జరైన్ ఖాన్. తన బాధను వెల్లడించేందుకు ఇన్ స్టాగ్రామ్ ను మార్గంగా ఎంచుకుంది. తన స్కూలు డేస్, కాలేజీ రోజులలో ఎలా ఉండేదో తెలిపేందుకు ఫొటోలను ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'నా శరీరం నా ఇష్టం. నేను ఎలా ఉండాలో చెప్పేందుకు మీరేవరు. ఎవరి సమస్యలు వారికి ఉంటాయి' అని ఆగ్రహం వ్యక్తం చేసింది. గత కొంతకాలం నుంచి ఆమె శరీరాకృతి గురించి చాలా రకాల విమర్శలొస్తున్నాయి. ఆమె బాడీ బికినీకి ఒప్పేలా ఉందడని, ఆమె చాలా లావుగా ఉంటుందని అందుకే అవకాశాలు ఇవ్వాలంటే దర్శకనిర్మాతలు బెదురుతారంటూ వచ్చిన కామెంట్లపై తీవ్ర స్థాయిలో మండిపడింది. 2010లో సల్మాన్ ఖాన్ సరసన 'వీర్' మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హౌస్ ఫుల్, హేట్ స్టోరీ 3 మూవీలలో నటించింది. బాలీవుడ్ లో జీరో సైజ్ భామలకే గిరాకీ ఎక్కువని, కానీ జరైన్ ఈ ఇండస్ట్రీకి సెట్ అవ్వదంటూ విమర్శల నేపథ్యంలోనూ కొన్నిసార్లు అవకాశాలు కోల్పోయింది. 'ఇప్పటికే చాలా కేజీలు తగ్గాను. అయినా సన్నబడాలని, మెరుపుతీగలా తయారవ్వాలంటే నా వల్ల కాదు. ఒకసారి నా ఫొటోలు చూస్తే మీకే అర్థమవుతోంది. వైట్ డ్రెస్ 9వ తరగతి, పింక్ డ్రెస్ ఇంటర్ చదువుతున్నప్పుడు దిగిన ఫొటోలు. అప్పటికి, ఇప్పటికీ నన్ను నేను ఎలా మలుచుకున్నానో ఆ బాధలు నాకు తెలుసు. ఇక ఎవరి వ్యాఖ్యలు నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు' అని బొద్దుగుమ్మ తీవ్రంగా విరుచుకుపడింది. చాలా మంది హీరోయిన్లు లావుగా ఉన్నప్పటికీ ఆమెను లక్ష్యంగా చేసుకుని కామెంట్లు రావడంతో మనస్తాపానికి లోనై ఈ విధంగా జరైన్ ఖాన్ తన బాధను వెల్లగక్కింది.