
Kavya Kalyan Ram Body Shaming: ఇండస్ట్రీలో హీరోయిన్స్ అందరూ బయటకు సంతోషంగానే కనిపిస్తుంటారు. కానీ వాళ్లలో కొందరు సినిమా ఛాన్సుల కోసం చాలా కష్టపడుంటారు. అయితే వాటి గురించి పెద్దగా బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడరు. కెరీర్ సక్సెస్ లో ఉన్నప్పుడు అసలు చెప్పరు. కానీ 'బలగం' హీరోయిన్ కావ్య కల్యాణ్ రామ్ మాత్రం తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'సామజవరగమన'.. ఆ రోజే రిలీజ్!)
బాలనటిగా
చైల్డ్ ఆర్టిస్టుగా టాలీవుడ్‌లోకి వచ్చిన కావ్య కల్యాణ్ రామ్‌ది ఖమ్మం. 'గంగోత్రి' మూవీలో వల్లంగి పిట్టగా నటించింది. ఆ తర్వాత ఠాగూర్, బన్నీ, అడవిరాముడు తదితర చిత్రాలతో పేరు సంపాదించింది. పెరిగిన పెద్దయిన తర్వాత 'మసూద'లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టింది. 'బలగం'తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయింది.
'మసూద'తో హీరోయిన్‌గా
ఈమె నటించిన 'ఉస్తాద్' రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ ప్రమోషన్స్‌లో మాట్లాడిన కావ్య.. 'కెరీర్ మొదట్లో ఓ ఆడిషన్ కి వెళ్తే దర్శకనిర్మాతలు నన్ను బాడీ షేమింగ్ చేశారు. మీరు లావుగా ఉన్నారు. ఇలా ఉంటే ఛాన్సులు రావు, సన్నగా అవ్వండి అని హేళన చేశారు. కానీ నేను వాటిని పట్టించుకోకుండా సినిమాలు చేస్తున్నాను' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.
(ఇదీ చదవండి: రూల్స్ బ్రేక్ చేసిన హీరో విజయ్.. పోలీసులు సీరియస్)