దూసుకెెళ్తున్న 'బలగం' మూవీ.. అక్కడ కూడా అదే జోరు! | Balagam Movie Trending top 2 Position In Amazon Prime Video | Sakshi
Sakshi News home page

Balagam Movie: కలెక్షన్స్‌లో 'బలగం' దూకుడు.. ఎన్ని కోట్లంటే?

Published Mon, Mar 27 2023 9:34 PM | Last Updated on Mon, Mar 27 2023 9:37 PM

Balagam Movie Trending top 2 Position In Amazon Prime Video - Sakshi

కంటెంట్‌ బాగుంటే.. చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది ప్రేక్షకులు పట్టించుకోవట్లేదు. ఈ విషయం ‘బలగం’ సినిమాతో మరోసారి రుజువైంది. ఎలాంటి అంచనాలు లేకుండా మార్చి 3న ప్రేక్షకుల ముందుకొచ్చిన  ఈ చిత్రం  ఊహించని విజయాన్ని సాధించింది. తొలి రోజే పాజిటివ్‌ టాక్‌ సంపాదించుకొని.. కలెక్షన్స్‌ పరంగా దూసుకెళ్తోంది.  బలగం రిలీజై 23 రోజులు పూర్తయ్యేసరికి రూ.23.59 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాలో ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాన్ని తెరపై చక్కగా చూపించారని వేణుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. వేణు డైరెక్షన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియదర్శి పులికొండ, కావ్య కళ్యాణ్ రామ్ జోడిగా నటించారు. మార్చి 3న విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

(ఇది చదవండి: బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘బలగం’.. 9వ రోజు రికార్డు కలెక్షన్స్‌!)

ఓటీటీలోనూ అదే దూకుడు

ఓటీటీలోకి వచ్చేసిన బలగం సినిమా అక్కడ కూడా అదేస్థాయిలో దూసుకెళ్తోంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుండగా.. అక్కడ కూడా టాప్‌-2 లో ట్రెండింగ్‌లో ఉంది. అయితే ఈ సినిమా తీసేందుకు మొత్తం బడ్జెట్‌ రూ.2 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఈ లెక్కన చూస్తే బలగం కలెక్షన్స్‌ నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్నయి. చిన్న సినిమా అయినా బాక్సాపీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. వేణు ఈ మూవీతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. భీమ్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement