ఈ దశాబ్దంలో నా ఫేవరేట్‌ మూవీ అదే: హీరో నాని కామెంట్స్ | Tollywood Hero Nani Comments His Favourite Movie | Sakshi
Sakshi News home page

Nani: ఆ సినిమా హీరో ఫ్యాన్‌గానే వచ్చా: నాని కామెంట్స్ వైరల్

Jul 16 2024 3:34 PM | Updated on Jul 16 2024 3:43 PM

Tollywood Hero Nani Comments His Favourite Movie

టాలీవుడ్ హీరో నాని గతేడాది హాయ్ నాన్నతో సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన సరిపోదా శనివారం అంటూ ప్రేక్షకులను పలకరించేందుకు వస్తున్నారు. ఈ పాన్‌ ఇండియా చిత్రానికి వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక అరుల్‌ మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. కోలీవుడ్ నటుడు ఎస్‌జే సూర్య, సాయికుమార్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 29న థియేటర్లలోకి రానుంది.

అయితే తాజాగా హైదరాబాద్‌లో జరిగిన డార్లింగ్‌ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో ప్రియదర్శిపై ప్రశంసలు కురిపించారు. ఈ దశాబ్దంలోనే తనకిష్టమైన సినిమా బలగం అని నాని అన్నారు. బలగం హీరో ఫ్యాన్‌గా ఈవెంట్‌కు వచ్చానని ఆసక్తికర కామెంట్స్ చేశారు. డార్లింగ్ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని.. నీ కెరీర్‌లో ఒక మైల్‌స్టోన్‌గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.

అనంతరం ప్రియదర్శి సైతం నాని గురించి మాట్లాడారు. సినిమా ఇండస్ట్రీలో నాలాంటి వారికి నాని అన్ననే ఆదర్శమని అన్నారు. ఎలాంటి బ్యాగ్‌గ్రౌండ్‌ లేకపోయినా ఇండస్ట్రీలో నిలబడిన వ్యక్తి అని కొనియాడారు. ఇప్పుడున్న యంగ్ హీరోలందరూ మిమ్మల్నే స్ఫూర్తిగా తీసుకుంటారని అన్నారు. సినిమాల్లో నువ్వు కృష్ణుడు అయితే.. నేను అర్జునుడిని అంటూ నానిపై ప్రశంసలు కురిపించారు. కాగా.. ప్రియదర్శి, నభా నటేశ్‌ జంటగా నటించిన డార్లింగ్ మూవీ ఈనెల 19న థియేటర్లలో సందడి చేయనుంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement