
టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ శివారెడ్డి వీరజవాన్‌కు నివాళులర్పించారు. ఇండియా-పాకిస్తాన్ మధ్య జరిగిన వార్‌లో అమరుడైన మురళి నాయక్‌కు చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. జవాన్ స్వగ్రామం శ్రీసత్యసాయి జిల్లా కల్లి తండాలో వెళ్లిన శివారెడ్డి వీర జవాన్‌ను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా జవాన్ మాతృమూర్తి కాళ్లకు ఆయన నమస్కరించారు.
పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది భారతీయులు మరణించారు. ఆ తర్వాత పాకిస్తాన్‌పై భారత్ మెరుపు దాడులు చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్‌లో ఉగ్ర స్థావరాలపై వరుస దాడులతో విరుచుకుపడింది. ఈ యుద్ధ సమయంలోనే మన జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. ఆ వీరుడిని తలచుకుంటూ భారతీయులంతా దేశవ్యాప్తంగా నివాళులర్పించారు.