siva reddy
-
పెళ్లింట్లో భారీ చోరీ
అనంతపురం: పెళ్లింట్లో దొంగలు పడ్డారు. సుమారు రూ.3.50 కోట్ల విలువైన బంగారం, రూ.20 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. అనంతపురం నగరంలోని ఓ ఇంట్లో బుధవారం వేకువజామున ఈ భారీ చోరీ జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. అనంతపురం మండలం కాట్నేకాలువ గ్రామానికి చెందిన కొండ్రెడ్డి వెంకటశివారెడ్డి నగరంలో స్థిరపడ్డారు. భూములు అధికంగా ఉండడంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. కొండ్రెడ్డి వెంకటశివారెడ్డి, కవిత దంపతులకు ఒక్కగానొక్క కుమార్తె సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. ఏలూరుకు చెందిన బుసిరెడ్డి ఆదినారాయణరెడ్డి కుమారుడితో ఆమెకు వివాహం నిశ్చయమైంది. ఫిబ్రవరి 7న అనంతపురం ఎంవైఆర్ కల్యాణ మండపంలో వివాహం జరిపేందుకు నిశ్చయించారు. ఈ నేపథ్యంలోనే పెళ్లి కుమార్తెకు బహుమతిగా ఇవ్వనున్న బంగారం, వెంకటశివారెడ్డి, కవిత దంపతులకు చెందిన బంగారంతో పాటు వెంకట శివారెడ్డి అత్త, మామ, వియ్యంకుల బంగారు ఆభరణాలు కలిపి సుమారు 5 కిలోల బంగారాన్ని ఇంట్లోని లాకర్లో ఉంచారు. కాగా.. శివారెడ్డి దంపతులు తెలంగాణలో ఉన్న తమ బంధువుల్ని పిలిచేందుకు వెళ్లగా.. ఇదే అదునుగా భావించిన దొంగలు బుధవారం వేకువజామున 4 గంటలకు ఇంట్లోకి చొరబడ్డారు. ఊచలు తొలగించి ఇంట్లోకి వెళ్లి తొలుత బీరువా తాళాలు పగులగొట్టారు. అందులో ఉన్న లాకర్ తాళం తీసుకుని.. లాకర్లోని సుమారు ఐదు కిలోల బంగారాన్ని, బీరువాలోని రూ.20 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. మొత్తం ఐదుగురు దొంగల ముఠా చోరీలో పాల్గొన్నట్టు సీసీ కెమెరాల ఫుటేజీలను బట్టి తెలుస్తోంది. ఇంట్లో సీసీ కెమెరాలు లేనప్పటికీ ఎదురింటి సీసీ కెమెరాల్లో ఆ దృశ్యాలు రికార్డయ్యాయి. మరో రెండు ఇళ్లలోనూ చోరీ కాగా.. వెంకటశివారెడ్డి ఇంటి పక్కనే ఉంటున్న డిప్యూటీ కమిషనర్ ఇంట్లో రూ.75 వేలు, మిస్టర్ ఛాయ్ నిర్వాహకుడు ఇంట్లోనూ చోరీ జరిగింది. వీరు ఇంకా ఇళ్లకు చేరుకోకపోవడంతో అందులో ఎంత మొత్తం చోరీ జరిగిందనే అంశంపై స్పష్టత రాలేదు. ఘటన స్థలంలో డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. ఈ చోరీ వెనుక తెలిసిన వారి హస్తం ఉందా? లేక రాటుదేలిన దొంగల ముఠా పనా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నిజంగా ఆశ్చర్యపోయా..
సాక్షి, అమరావతి: ‘ఆంధ్రప్రదేశ్‌లో సచివాలయ, ఆర్బీకే వ్యవస్థలు.. అవి అందిస్తున్న సేవల కోసం పత్రికల్లో చదవడమే తప్ప ఎప్పుడూ చూడలేదు. కానీ, ఇవి అందిస్తున్న సేవలు నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించాయి. ఈ శతాబ్దంలోనే ఓ గొప్ప విప్లవాత్మక మార్పు అని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు..’ అని నాబార్డు రిటైర్డ్ జనరల్ మేనేజర్ పి.సాంబశివారెడ్డి ప్రశంసించారు. ఎలాంటి సిఫార్సులు లేకుండా, పైసా భారం పడకుండా ఏపీ సచివాలయ వ్యవస్థ ద్వారా తాను పొందిన లబ్ధిని ఆయన స్వయంగా ‘సాక్షి’కి వివరించారు. ఆయన ఏమన్నారంటే..ఈ మార్పు చూసి ఆశ్చర్యపోయా..మాది ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా సింగనమల మండలం తూర్పు నరసాపురం. స్వగ్రామంలో మాకు వ్యవసాయ భూమి ఉంది. గ్రామంలోనే ఉంటున్న మా సోదరులు నా భూమిని సాగుచేస్తున్నారు. నేను బ్యాంకింగ్ రంగంలో దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా సేవలందించాను. నాబార్డులో వివిధ హోదాల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో పనిచేసి జనరల్ మేనేజర్‌గా 2013లో రాష్ట్ర విభజనకు ముందు రిటైరయ్యాను. కుటుంబంతో హైదరాబాద్‌లో స్థిరపడ్డాను.మా స్వగ్రామానికి వెళ్లి దాదాపు దశాబ్దం దాటిపోయింది. గ్రామంలో విశేషాలే కాదు.. రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు కూడా మా సోదరులు, బంధువుల ద్వారా తెలుసుకుంటుంటాను. గ్రామ సచివాలయాల ఏర్పాటు తర్వాత నేను మా గ్రామానికి వెళ్లలేదు. అయితే, గ్రామ సచివాలయ వ్యవస్థ గురించి వార్తా పత్రికలతోపాటు మా సోదరుల ద్వారా తెలుసుకున్నాను. సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఎలాంటి సిఫార్సులు లేకుండా అన్ని పనులు గ్రామంలోనే అయిపోతున్నాయని చెబుతుంటే ఆశ్చర్యమేసింది. ఆర్బీకేల ద్వారా గ్రామంలోనే విత్తనాలు, ఎరువులు ఇస్తున్నారు. పంట ఉత్పత్తులను కూడా గ్రామంలోనే కొంటున్నారని మా బంధువులు చెప్పగా విన్నాను. పత్రికల్లో కూడా అప్పుడప్పుడూ చూస్తున్నాను. ఇది నిజమేనా.. ఇంత మార్పు వచ్చిందా.. అని అనుకున్నాను. కానీ, స్వతహాగా నాకు ఎదురైన అనుభవంతో ఆశ్చర్యపోయాను.సిఫార్సుల్లేకుండా పరిహారం..గత శనివారం నా ఖాతాలో రూ.34వేలు జమైంది. ఆశ్చర్యపోయాను.. ఎక్కడో ఉన్న నా వివరాలు తెలుసుకుని నాకు ఫోన్ చేశారు. ఎంతో గౌరవంగా మాట్లాడారు. ఎలాంటి సిఫార్సులు లేవు.. ఎవరికీ రూపాయి ఇవ్వలేదు. నేరుగా నా ఖాతాలో కరువు సాయం జమైంది. ఏపీలో తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ ద్వారా అందిస్తున్న సేవలు చూస్తుంటే నిజంగా గొప్ప విప్లవాత్మక మార్పుగా అభివర్ణించొచ్చు. గతంలో విపత్తులు సంభవించిన సందర్భాల్లో పరిహారం కోసం రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేయాల్సి వచ్చేది. అడిగినంత దక్షిణ సమర్పిస్తే కానీ పరిహారం చేతికి వచ్చే పరిస్థితులు ఉండేవి కావు.కానీ, నేడు అవినీతికి తావులేకుండా సచివాలయ సిబ్బంది ఎంతో పారదర్శకంగా అందిస్తున్న సేవలు నిజంగా ప్రశంసనీయం. రైతులకు సంబంధించిన సేవలే కాదు.. పౌరసేవలు కూడా ఎలాంటి సిఫార్సులు లేకుండా ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత గ్రామ పొలిమేర దాటకుండానే సామాన్య పౌరులు పొందగలుగుతున్నారని తెలిసి నిజంగా సంతోషమేసింది. ఇలాంటి వ్యవస్థ కదా ప్రజలకు కావాల్సింది. ఈ వ్యవస్థను తీసుకొచ్చిన ప్రభుత్వానికి నా అభినందనలు.నమ్మశక్యం కాని రీతిలో..పోలింగ్ ముగిసిన తర్వాత ఒకరోజు తూర్పు నరసాపురం గ్రామ సచివాలయం నుంచి ఆర్బీకే సిబ్బంది (రాజారెడ్డి) ఫోన్‌చేశారు. మన సింగనమల మండలాన్ని కరువు పీడిత ప్రాంతంగా ప్రభుత్వం ప్రకటించింది. భూ యజమానికి కరువు సాయం జమవుతుంది. మీ ఆధార్ కార్డు, బ్యాంకు వివరాలు చెప్పండని అడిగారు. ముందు నమ్మలేదు.. మీకు నా ఫోన్ నంబరు, వివరాలు ఎవరిచ్చారు అని ఆరాతీస్తే.. గ్రామంలో మీ సోదరులిచ్చారని బదులిచ్చారు. ఆ తర్వాత వారితో క్రాస్ చెక్‌చేసుకున్న తర్వాత నమ్మకం ఏర్పడింది. అయినా ఆదాయపు పన్ను చెల్లించే నాకెందుకు కరువు సాయం వస్తుందని అడిగాను. లేదు సర్.. కరువు సాయం పంపిణీకి పన్ను చెల్లింపునకు సంబంధంలేదని బదులిచ్చారు. అయినా నమ్మకం కలగలేదు. లేదు సర్ మీ పేరిట ఉన్న 7.5 ఎకరాల వ్యవసాయ భూమిలో వేరుశనగ వేశారు. కరువు ప్రభావంతో పంట దెబ్బతిన్నది. ఇదే విషయాన్ని మేం రిపోర్టు చేశాం.. అందుకే కరువు సాయం మంజూరైందని వివరించారు. ఆ తర్వాత సిబ్బంది అడిగిన ఇతర వివరాలు చెప్పాను. -
వృద్ధురాలిని 8 ముక్కలుగా నరికి..
గార్లదిన్నె: బంగారు ఆభరణాలు తిరిగి ఇవ్వమన్నందుకు ఓ వృద్ధురాలు దారుణహత్యకు గురైంది. ఈ ఘటన అనంతపురం జిల్లా, గార్లదిన్నె మండలం యర్రగుంట్లకు చోటుచేసుకుంది. ఈ కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించి..నిందితులను రిమాండుకు తరలించారు. శుక్రవారం గార్లదిన్నె పోలీస్ స్టేషన్లో రూరల్ డీఎస్పీ వెంకట శివారెడ్డి మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ జిల్లా, సింహాద్రిపురం మండలం, కొత్తపల్లికి చెందిన ఓబులమ్మకు చాలా ఏళ్ల క్రితం వివాహమైంది. భర్త చనిపోగా, కుమార్తె హైదరాబాద్‌లో ఉంటోంది. తన అన్న కుమార్తె (మేనకోడలు) శివలక్ష్మికి యర్రగుంట్లలో దాదాపు ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూవిుని ఓబులమ్మ సాగుచేసుకుంటూ యర్రగుంట్లలోనే నివాసం ఉంటోంది. గురువారం ఉదయం నుంచి ఓబులమ్మ కనిపించకపోవడంతో గ్రామస్తులు అనంతపురంలో ఉంటున్న శివలక్ష్మికి సమాచారం అందించారు. దీంతో ఆమె గార్లదిన్నె పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా..హత్య వెలుగు చూసింది. ఆభరణాల కోసం.. ఓ శుభకార్యం నిమిత్తం ఓబులమ్మ వద్ద ఉన్న బంగారు గొలుసు, నాలుగు బంగారు గాజులు యర్రగుంట్ల గ్రామానికే చెందిన బీరే కృష్ణమూర్తి తీసుకున్నాడు. అనంతరం వాటిని ఓబులమ్మకు తెలియకుండా ఓ ప్రైవేట్ బ్యాంకులో కుదువ పెట్టాడు. ఆభరణాలు ఇచ్చి నెలరోజులు దాటుతున్నా తిరిగివ్వకపోవడంతో నగల కోసం ఓబులమ్మ కృష్ణమూర్తిపై ఒత్తిడి తెచ్చింది. వాటిని ఇవ్వకూడదనే దురుద్దేశంతో ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో గురువారం ఓబులమ్మ వద్దకు వెళ్లి బంగారు నగలు ఇస్తానంటూ నమ్మబలికాడు. ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని నేరుగా తాను కౌలుకు చేస్తున్న వరి మడి వద్దకు తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడున్న భార్య లక్ష్మీదేవి, కుమారులు భరత్‌కుమార్, లోక్‌నాథ్, కోడలు (మైనర్) సహకారంతో ఓబులమ్మను గొడ్డలితో నరికి చంపారు. తల, మొండెం, కాళ్లు, చేతులు..ఇలా శరీరాన్ని ఎనిమిది ముక్కలు చేశారు. రెండు సంచుల్లో వేసుకుని సొంత ట్రాక్టరులో తీసుకెళ్లి పెనకచెర్ల డ్యాం వద్ద కొనేపల్లి దారిలో పెన్నానదిలో పడేశారు. ఈ దృశ్యాన్ని దూరం నుంచి గమనించిన గొర్రెల కాపరులు విషయాన్ని పెనకచెర్ల డ్యాం గ్రామంలో తెలియజేశారు. చివరకు ఈ సమాచారం పోలీసులకు అందింది. వారు గురువారం అర్ధరాత్రి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. యర్రగుంట్ల ఇన్చార్జ్ వీఆర్వో గోవిందరాజుల సమక్షంలో నిందితులు లొంగిపోయారు. పోలీసులు వారిని రిమాండుకు తరలించారు. నేరానికి ఉపయోగించిన గొడ్డలి, ద్విచక్రవాహనం, ట్రాక్టర్ స్వా«దీనం చేసుకున్నారు. -
హీరోగా శివారెడ్డి.. ట్రైలర్ విడుదల
శివారెడ్డి, జాష్ణిని, వనితా రెడ్డి లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘రెంట్’. రఘువర్ధన్ రెడ్డి దర్శకత్వంలో ‘బలగం’ జగదీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి అతిథిగా వచ్చిన నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘రెంట్’ సినిమా ట్రైలర్ చాలా బాగుంది’’ అన్నారు. ‘‘చాలా రోజుల తర్వాత నేను హీరోగా చేసిన చిత్రం ‘రెంట్’. ఇందులో థ్రిల్లింగ్ కథ, కామెడీ, యాక్షన్, సందేశం ఉన్నాయి’’ అన్నారు శివారెడ్డి. ‘‘నాకు మంచి పాత్ర ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు వనితా రెడ్డి. -
ఫోన్ ట్యాపింగ్ డ్రామాపై కోటంరెడ్డి స్నేహితుడు రామశివారెడ్డి క్లారిటీ
సాక్షి, నెల్లూరు జిల్లా: ఎమ్మెల్యే కోటం రెడ్డి ఫోన్ టాపింగ్ డ్రామాపై ఆయన స్నేహితుడు రామశివారెడ్డి స్పష్టత నిచ్చారు. ఆ ఆరోపణలపై మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ‘‘నాది ఆండ్రాయిడ్ ఫోన్. నా ఫోన్ లో ప్రతీకాల్ రికార్డవుతుంది. కోటంరెడ్డి చెప్పింది ట్యాపింగ్ కాదు.. రికార్డింగ్ మాత్రమే. కేవలం యాదృచ్చికంగా కాల్ రికార్డయింది’’ అని చెప్పారు. ‘‘ఉద్ధేశపూర్వకంగా రికార్డ్ చేసిన కాల్ కాదు. ట్యాపింగ్ అంటూ ఇంత వివాదం అవుతుందని ఊహించలేదు. ట్యాపింగ్ అంటూ కోటంరెడ్డి ఇంత హంగామా చేసినందుకే వాస్తవాలు చెబుతున్నా.. నా ఫోన్‌ను ఫోరెన్సిక్‌కు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా’’ అని రామశివారెడ్డి తేల్చి చెప్పారు. ‘‘నేను ఎవరో సీఎం జగన్‌కు తెలీదు. ఏదో ఊహించుకుని దుష్ప్రచారం చేస్తున్నారు. మా ఇద్దరివీ ఐఫోన్లు అని కోటంరెడ్డి అబద్ధం చెప్పారు. నాపై ఎవరి ఒత్తిడీ లేదు.. వాస్తవం చెప్పేందుకే మీడియా ముందుకొచ్చా’’ అని రామశివారెడ్డి స్పష్టం చేశారు. తనకు 30 ఏళ్లుగా వైఎస్ కుటుంబంతో అనుబంధం ఉందన్నారు. వైఎస్ కుటుంబంపై విశ్వాసం ఉందని ఆయన అన్నారు. చదవండి: కోటంరెడ్డికి ఊహించని షాక్.. దెబ్బ అదుర్స్! -
నా ఫ్రెండ్ ఫ్యామిలీ రూ.70 లక్షలు తీసుకుని మోసం చేసింది
మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి వందకు పైగా సినిమాల్లో నటించాడు. దేశవిదేశాలు తిరుగుతూ స్టేజీ షోలు చేస్తూ నటీనటులను, రాజకీయ నాయకుల గొంతును ఇమిటేట్ చేస్తూ ప్రజలను ఎంటర్టైన్ చేసేవాడు. ఎంతో గొప్ప టాలెంట్ ఉన్న శివారెడ్డి ఈ మధ్య పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. కానీ ఒకానొక సమయంలో అటు సినిమాలతో ఇటు స్టేజీ షోలతో రెండు చేతులా సంపాదిస్తూ సుమారు రూ.70 లక్షల దాకా కూడబెట్టాడీ కమెడియన్. సంవత్సరాల తరబడి కష్టపడి సంపాదించిన ఈ డబ్బుతో హైదరాబాద్‌లో ఒక ఇల్లు లేదా భూమి.. ఏదైనా ఒకటి కొనాలని ఎన్నో కలలు కన్నాడు. కానీ అతడి కలలను చిన్నాభిన్నం చేస్తూ శివారెడ్డి ఫ్రెండ్ ఆ డబ్బు తీసుకుని ఉన్నదంతా వాడేశాడు. ఈ విషయాన్ని కమెడియన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 'ఫ్రెండ్స్ అంటే నాకు పిచ్చి. వాళ్లకోసం ఏదైనా చేస్తాను. హైదరాబాద్ వచ్చాక ఇక్కడ కూడా కొందరు ఫ్రెండ్స్ అయ్యారు. అందులో ఒక ఫ్రెండ్, అతడి కుటుంబం నన్ను మోసం చేశారు. నేను కూడబెట్టిన డబ్బుతో మొట్టమొదటిసారిగా ఏదైనా ఇల్లు లేదా కొన్ని ఎకరాల భూమి కొనుక్కుందామని సిటీలో తిరిగాను. అప్పుడు ఏ ఇల్లు చూసినా, ల్యాండ్ చూసినా ఇది బాలేదులే, వద్దులే అంటూ నన్ను మభ్యపెట్టాడో ఫ్రెండ్. ఇలా మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్న సమయంలో అమెరికాలో నాకు ప్రోగ్రాం ఆఫర్ వచ్చింది. ఒక నెలన్నర వరకు అక్కడే ఉండాల్సిన పరిస్థితి. అప్పటికి నేను బ్యాచ్‌లర్‌ను కావడంతో నా డబ్బును తీసుకుని వాళ్లింట్లో పెట్టుకున్నారు. తీరా నేను వెళ్లిపోయాక వాళ్ల అవసరాల కోసం ఉన్నదంతా వాడుకున్నారు. ఈ విషయం తెలియక నేను అమెరికా నుంచి రాగానే మళ్లీ ఇళ్లు చూడటం మొదలుపెట్టాను. డబ్బులు తీసుకుని వస్తే అక్కడికక్కడే డీల్ మాట్లాడుకోవచ్చని చెప్పి నా బ్యాగ్ తీసుకురమ్మన్నాను. అప్పుడు అతడు చిన్న సమస్య రావడంతో నీ డబ్బు వాడేసుకున్నామని అసలు విషయం బయటపెట్టాడు. ఐదారు రోజుల్లో తిరిగి ఇచ్చేస్తామన్నారు, కానీ ఈరోజు వరకు కూడా ఇవ్వలేదు. ఆ డబ్బులుండుంటే మణికొండలో నాకు రెండుమూడు ఎకరాలైనా ఉండేవి' అని చెప్తూ బాధపడ్డాడు శివారెడ్డి. -
పీవీ సింధును సత్కరించిన సినీ నటుడు శివారెడ్డి
సాక్షి, మణికొండ: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధును సినీ నటుడు శివారెడ్డి సత్కరించారు. ఆదివారం ఆమె నివాసానికి వెళ్లి వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించటం గర్వకారణమని అభినందించారు. రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలను సాధించాలని ఆకాంక్షించారు. ఆమె పతకం సాధించిన సందర్భంలోని ఫొటోను సింధుకు బహూకరించానని, తన కామెడీ ఎంతో బాగుంటుందని సింధుతో పాటు ఆమె కుటుంబ సభ్యులు తనను అభినందించారని శివారెడ్డి పేర్కొన్నారు. కాగా టోక్యో-2020 ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్ విభాగంలో తెలుగుతేజం పీవీ సింధు కాంస్య పతకం సాధించి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన సంగతి తెలిసిందే. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన అనంతరం ఇప్పుడు మూడో స్థానంతో మరో పతకాన్ని సొంతం చేసుకొని వరుసగా రెండో ఒలింపిక్స్‌లోనూ ఈ ఘట్టాన్ని ఆవిష్కరించిన రెండో భారత ప్లేయర్‌గా, తొలి మహిళగా నిలిచింది. -
‘అమరావతి’ నిర్ణయం ఏకపక్షం
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధానిని నిర్ణయించే విషయంలో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట నిబంధనల కింద అప్పటి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను గత తెలుగుదేశం ప్రభుత్వం తుంగలో తొక్కిందని న్యాయవాది శివారెడ్డి హైకోర్టుకు నివేదించారు. విజయవాడ–గుంటూరులో రాజధాని వద్దని ఆ కమిటీ చెప్పినప్పటికీ, టీడీపీ సర్కారు మాత్రం ఏకపక్షంగా అమరావతిని రాష్ట్ర రాజధానిగా నిర్ణయించిందని వివరించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రజల నుంచి ఎలాంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కోరలేదన్నారు. రాజధాని కోసం మంచి పంటలు పండే భూములు తీసుకోవద్దని, ప్రభుత్వ భూములను మాత్రమే రాజధాని కోసం వినియోగించాలని అప్పటి ప్రతిపక్ష నేత అసెంబ్లీ వేదికగా నాటి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయిందన్నారు. అవసరం లేకున్నా రైతుల నుంచి ల్యాండ్ పూలింగ్ ద్వారా 34 వేల ఎకరాలను సమీకరించిందని శివారెడ్డి అందులో వివరించారు. పాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ హైకోర్టులో పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. టీడీపీ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ కూడా పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంలో తనను ప్రతివాదిగా చేర్చుకుని తన వాదనలు వినాలంటూ శివారెడ్డి ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఆది నుంచి రాయలసీమ ప్రాంతానికి అన్యాయం జరుగుతూనే వస్తోందని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. రాయలసీమ వాణిని పట్టించుకోలేదు హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని రాయలసీమ ప్రాంతవాసులు, న్యాయవాదుల ఆందోళనలను గత ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదని ఆయనన్నారు. అప్పటి ప్రభుత్వం హడావుడిగా రాజధానిని, హైకోర్టును అమరావతికి తరలించి, తాత్కాలిక భవనాల్లో కార్యకలాపాలను ప్రారంభించడం చట్ట నిబంధనలకు విరుద్ధమే కాక, ఏకపక్ష నిర్ణయమన్నారు. కేవలం రెండు జిల్లాల అభివృద్ధి కోసం రాష్ట్రాభివృద్ధిని విస్మరించడం సరికాదన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి నిమిత్తం పాలనా వికేంద్రీకరణ బిల్లులను తీసుకొచ్చిందని శివారెడ్డి అందులో వివరించారు. అందులో భాగంగానే విశాఖలో కార్యనిర్వాహక రాజధాని, అమరావతిలో శాసన రాజధాని, కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేయాలని ప్రస్తుత ప్రభుత్వం సంకల్పించిందన్నారు. రాయలసీమ వాసిగా పాలనా వికేంద్రీకరణవల్ల తాను లబ్ధి పొందుతానని.. అందువల్ల ఈ వ్యాజ్యంలో తన వాదనలు వినాల్సిన అవసరముందని ఆయన వివరించారు. మెమోలు దాఖలు చేసిన కేంద్రం మరోవైపు.. రాజధాని ఎక్కడ ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో వ్యవహారమే తప్ప, అందులో తమకు ఎటువంటి పాత్ర లేదంటూ తాము దాఖలు చేసిన కౌంటర్‌ను అన్ని వ్యాజ్యాలకు అన్వయింపజేస్తున్నామని కేంద్రం హైకోర్టుకు తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ఎన్.హరినాథ్ మెమోలు దాఖలు చేశారు. గత విచారణ సమయంలో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల మేరకు కేంద్రం ఈ మెమోలు దాఖలు చేసింది. -
వైఎస్సార్సీపీ కార్యకర్త హత్య కేసులో సాకే బాలకృష్ణ అరెస్ట్!
అనంతపురం, సాక్షి : వైఎస్సార్సీపీ కార్యకర్త కందుకూరు శివారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు సాకే బాలకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. శివారెడ్డి హత్య కేసులో మాజీ మంత్రి పరిటాల సునీత అనుచరులు, వారి కుటుంబ సభ్యులపై గతంలో కేసు నమోదయ్యింది. అయితే గత కొన్ని నెలలుగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకొని తిరుగుతున్న ప్రధాన నిందితుడు, పరిటాల సునీత వర్గీయుడు సాకే బాలకృష్ణను సోమవారం బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. మొహరం పండుగ సందర్భంగా కందుకూరులో జరిగిన గొడవను ఆసరాగా చేసుకొని... ద్విచక్ర వాహనంపై వెళ్తున్న శివారెడ్డి గత ఏడాది దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ద్విచక్ర వాహనంపై ఇటుకుల పల్లి నుంచి కందుకూరు వెళుతున్న అతడిని... దుండగులు కాపుకాసి వేట కొడవళ్లతో నరికి చంపారు. చదవండి: అట్టుడికిన అనంత హత్యకు గురైన వైఎస్సార్ సీపీ కార్యకర్త శివారెడ్డి (ఫైల్ ఫోటో) -
కవి శివారెడ్డికి సరస్వతి సమ్మాన్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ తెలుగు కవి డా. కె. శివారెడ్డికి సరస్వతి సమ్మాన్ పురస్కారం వరించింది. కేకే బిర్లా ఫౌండేషన్ ప్రదానం చేసే అత్యున్నత వార్షిక పురస్కారానికి 2018 ఏడాదికిగానూ ఆయన రచించిన ‘పక్కకి ఒత్తిగిలితే’కవితా సంపుటి ఎంపికైంది. శనివారం ఢిల్లీలో జరిగిన ఫౌండేషన్ 28వ సరస్వతి సమ్మాన్ వార్షిక అవార్డుల ప్రదానోత్సవంలో శివారెడ్డికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పురస్కారాన్ని ప్రదానం చేశారు. జ్ఞాపికతోపాటు అవార్డు కింద ఫౌండేషన్ ఇచ్చే రూ. 15 లక్షల నగదు పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షురాలు శోభనా భారతీయ, డా. సుభాష్ కశ్యప్ పాల్గొన్నారు. భాష సంస్కృతికి జీవనాడి: ఉపరాష్ట్రపతి భాష అనేది మన సంస్కృతికి జీవనాడి లాంటిదని ఉపరాష్ట్రపతి వెంకయ్య అన్నారు. భాష, సంస్కృతి, వారసత్వాన్ని పరిరక్షించుకుంటే ప్రతి ఒక్కరి జీవితం ఫలప్రదం అవుతుందన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ కన్న తల్లిని, పుట్టిన ఊరిని, మాతృ భాషను ఎల్లప్పు డూ కాపాడుకోవాలన్నారు. వైవిధ్యతలో తన సమన్వయాన్ని వ్యక్తం చేస్తూ శివారెడ్డి రచించిన ‘పక్కకి ఒత్తిగిలితే’కు పురస్కారం వరించడం సంతోషకరమన్నారు. భాష, సంస్కృతి పరిరక్షణకు కేకే బిర్లా ఎనలేని కృషి చేశారని, దేశవ్యాప్తంగా రచనా రంగాన్ని ప్రోత్సహించేందుకు పురస్కారాలు ప్రదానం చేస్తున్నారని కొనియాడారు. మనిషికి జీవశక్తినిచ్చేది సాహిత్యం: శివారెడ్డి మనిషికి కావాల్సిన జీవశక్తిని ప్రసాదించేది సాహిత్యమని, జీవితం నుంచి వచ్చిన సాహిత్యమే తిరిగి జీవితాన్ని ఇస్తుందని కవి శివారెడ్డి అన్నారు. ఈ పురస్కారం తెలుగు భాషకు దక్కిందని, తనకు ఈ పురస్కారం ఇవ్వడంతో శ్రమ జీవులకు, కార్మిక వర్గాలకు గుర్తింపు వచ్చిందన్నారు. మరిచిపోయిన వాటిని గుర్తు చేయడం, జీవితానికి అవసరమైన వాటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించడంలో సాహిత్యం ప్రధానపాత్ర పోషిస్తుందన్నారు. గుంటూరు జిల్లాలో రైతు కుటుంబంలో జన్మించిన కె.శివారెడ్డి గత 40 ఏళ్లుగా సాహిత్య రంగంలో విశేష సేవలందిస్తున్నారు. -
పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి
ప్రొద్దుటూరు కల్చరల్ : పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ప్రొద్దుటూరు తాలూకా పెన్షనర్స్ అసోసియేషన్ కార్యదర్శి బి.శివారెడ్డి పేర్కొన్నారు. స్థానిక ఎన్జీఓ హోంలో మంగళవారం శివారెడ్డి ప్యానల్ తరఫున మెంబర్స్ ఎంపిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిటైర్డు ఉద్యోగులకు రుణాలు, లైఫ్ సర్టిఫికెట్, ఇన్‌కం ట్యాక్స్ సమస్యలను పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. తమ ప్యానల్‌ను గెలిపిస్తే ప్రతి ఏడాది వైద్య శిబిరం, పెన్షనర్లు చనిపోతే వారికి రావాల్సిన మొత్తం, బకాయిలను వెంటనే ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయానికి కటాంజనాన్ని విరాళంగా ఇచ్చిన రిటైర్డు ఎంపీడీఓ నరసింహులు, పుట్టిన రోజు సందర్భంగా విశ్రాంత పీఈటీ రామాంజులరెడ్డిను సన్మానించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డు ఉద్యోగులు ప్రసాదరెడ్డి, వీరాస్వామి, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివారెడ్డి ప్యానల్‌కు సంబంధించి అధ్యక్షునిగా బి.శివారెడ్డి, కార్యదర్శిగా రామాంజులరెడ్డిను ఎన్నుకున్నారు. -
సారస్వత పరిషత్ అధ్యక్షుడిగా శివారెడ్డి
సినారె స్థానంలో శివారెడ్డి ఎన్నిక హైదరాబాద్: తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షుడిగా తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్స్‌లర్, ప్రముఖ సాహితీవేత్త ఆచార్య ఎల్లూరి శివారెడ్డి ఎన్నికయ్యారు. 24 ఏళ్లుగా పరిషత్‌కు అధ్యక్షుడిగా వ్యవహరించిన జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి ఇటీవల కీర్తిశేషులు కావడంతో ఆయన స్థానంలో శివారెడ్డి ఎన్నికయ్యారు. పరిషత్ కార్యవర్గం, సర్వసభ్య మండలి సమావేశమై శివారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఇప్పటివరకు పరిషత్ ట్రస్టు కార్యదర్శిగా కొనసాగిన శివారెడ్డి ఆ స్థానానికి రాజీనామా చేశారు. ప్రస్తుతం పరిషత్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న డాక్టర్ జె.చెన్నయ్య ట్రస్టు కార్యదర్శిగా కూడా కొనసాగేలా నిర్ణయం తీసుకున్నారు. శనివారం శివారెడ్డి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. సినారె అందించిన స్ఫూర్తితో పరిషత్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా పాటుపడతానని శివారెడ్డి తెలిపారు. ఇందుకు అందరి సహకారం తీసుకొని పరిషత్‌ను తెలంగాణ ఆకాంక్షలకు అనుగుణంగా తీర్చిదిద్దుతానన్నారు. -
వేధింపులతో ఫైర్‌మన్ ఆత్మహత్య
ఉన్నతాధికారుల వేధింపులతో ఫైర్ స్టేషన్ సిబ్బంది ఒకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. గౌలిగూడలోని ఫైర్ స్టేషన్లో పనిచేస్తున్న శివారెడ్డి శుక్రవారం తన రూంలో ఉరి వేసుకుని, చనిపోయారు. తన మరణానికి ఫైర్ ఆఫీసర్ జె.రాజ్‌కుమార్ వేధింపులే కారణమంటూ రాసిన మూడు పేజీల సూసైడ్ నోట్ ఆయన వద్ద లభించింది. ఈ మేరకు ముషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం అనంతరం శివారెడ్డి స్వగ్రామం మెదక్ జిల్లా సదాశివపేటకు తరలించారు. -
వేధింపులపై ఆర్టీసీ కార్మికుల ధర్నా
డిపో సమస్యలను పరిష్కరించాలని, అధికారులు వేధింపులు ఆపాలని జమ్మలమడుగులో ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. సోమవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో డిపో గ్యారేజి ఎదుట బైఠాయించారు. ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ శివారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి గంగిరెడ్డి సహా 40 మంది కార్మికులు పాల్గొన్నారు. -
సాంస్కృతిక దాడులు ప్రమాదకరం
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శివారెడ్డి మలికిపురం: భౌతికదాడుల కంటే సాంస్కృతిక దాడులు అత్యంత ప్రమాదకరమైనవని ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శివారెడ్డి పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో ప్రపంచ తెలుగు కవిత్వోత్సవం శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. రికార్డు స్థాపించే లక్ష్యంతో 30 గంటల 30 నిమిషాల 30 సెకన్ల పాటు నిర్వహిస్తున్న ఈ కవిత్వోత్సవంలో శనివారం నాటికి 1,620 మంది కవులు పేర్లు నమోదు చేరుుంచుకున్నారు. అంతకు ముందు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శివారెడ్డి మాట్లాడుతూ.. దేశంలో సాంస్కృతిక దాడులు అధికమయ్యాయన్నారు. అధికార భాషా సంఘం అధ్యక్షుడు పొట్లూరి హరికృష్ణ మాట్లాడుతూ సంస్కృతీ సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లేది భాష ఒక్కటేనన్నారు. ఐక్యరాజ్యసమితిలో ఆరు భాషలున్నాయని, ఏడో భాషగా తెలుగు చేరేందుకు మన కృషి చాలా అవసరమన్నారు. -
భోగాపురం విమానాశ్రయం నిర్మాణంపై పిల్
హైదరాబాద్: విజయనగరం జిల్లా, భోగాపురం వద్ద గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ జీవోల అమలును నిలిపేసి, భోగాపురం ప్రజలను వారి భూముల నుంచి ఖాళీ చేయించకుండా అధికారులను ఆదేశించాలని కోరుతూ భోగాపురం మండలం, రావివలస గ్రామ సర్పంచ్ ఉప్పాడ శివారెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి, పౌర విమానాయశాఖ కార్యదర్శి, డెరైక్టర్ జనరల్, నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ గ్రామ సభలు తీర్మానాలు చేసినా, వాటిని ఖాతరు చేయకుండా ప్రభుత్వం ముందుకెళుతోందని పిటిషనర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సారవంతమైన భూములను రైతుల నుంచి వారి ఇష్టానికి విరుద్ధంగా తీసుకుంటూ, భూ మాఫియా, రియల్టర్లకు సాయం చేస్తోందని ఆరోపించారు. భోగాపురం వద్ద అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన పరిస్థితులు లేవని ఓ నిపుణుల కమిటీ తేల్చిందని, ఇందుకు సంబంధించి పత్రికల్లో కూడా కథనాలు వచ్చాయన్నారు. భోగాపురం బదులు కాకినాడ సమీపంలోని ఎస్.రాయవరం విమానాశ్రయ నిర్మాణానికి అనుకూలంగా ఉంటుందని ఆ నిపుణుల కమిటీ తెలిపిందన్నారు. -
కూకట్‌పల్లిలో రెజినా సందడి
-
‘గ్రౌండ్’వర్క్ పూర్తి
సీఎస్ఏ సౌత్ ఇండియా స్పోర్ట్సమీట్కు ఖమ్మంలోని గుట్టలబజార్ సెయింట్ జోసెఫ్ పాఠశాల క్రీడా మైదానం ముస్తాబవుతోంది. ఈనెల 21,22,23 తేదీల్లో జరుగనున్న ఈ పోటీల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు చెందిన 17 ఉన్నత పాఠశాలలు, 11 ప్రాథమికోన్నత పాఠశాలలకు చెందిన 1,500 మంది క్రీడాకారులు హాజరుకానున్నారు. వీరికి పాఠశాలలోనే భోజనం, వసతి కల్పించనున్నారు. ఈ పోటీలు ఆరు అంశాల్లో జరగనున్నాయి. సీనియర్ బాలబాలికలు, జూనియర్ బాలబాలికలు విభాగంలో నిర్వహించనున్నారు. సీనియర్ బాలబాలికల విభాగంలో బాస్కెట్‌బాల్, వాలీబాల్, ఖోఖో, అథ్లెటిక్స్ పోటీలు జరుగుతాయి. సీనియర్ బాలుర విభాగంలో కబడ్డీ, బాలికల విభాగంలో త్రోబాల్ పోటీలు నిర్వహిస్తారు. జూనియర్ బాలబాలికల విభాగంలో ఖోఖో, అథ్లెటిక్స్‌లోని 100మీ, 200మీ పరుగుపందెం పోటీలు జరుగుతాయి. బాలురకు మాత్రమే కబడ్డీ పోటీలు నిర్విహ స్తారు. ఈ టోర్నీకి ఆర్గనైజింగ్ సెక్రటరీగా పాఠశాల ఉపాధ్యాయురాలు రెవరెండ్ సిస్టర్ ఎన్.నక్షత్రం, ముఖ్య పర్యవేక్షకులుగా పాఠశాల సీనియర్ పీఈటీ శివారెడ్డి వ్యవహరిస్తున్నారు. -
చిరంజీవికి పెద్ద ఫాన్ అయ్యాను
వేములవాడ : 'నవ్వించటం నా జీవనోపాధి... అంతకు మించి నేను మనసారా నవ్వుకునేంతటి సందర్భమెప్పుడూ రాలేదు. బతుకంతా ఎదురీతగానే సాగింది. ఇంకా నిత్యవిద్యార్థిగా బతకుపాఠాలు నేర్చుకుంటూనే ఉన్నాను' అంటారు సినీ హాస్యనటుడు శివారెడ్డి. తనది కరీంనగర్ జిల్లా అని చెప్పుకునేందుకు గర్వంగా ఉందంటారు. వారి మూడో కూతురుకు రాజన్న ఆశీర్వాదం పొందేందుకు వేములవాడ విచ్చేశారు. బాల్యం కష్టాల కడలి.... మాది రామగుండం స్వస్థలం. మధ్యతరగతి కుటుంబం. చిన్నప్పుడే నాన్న పోయారు. అమ్మే అన్ని తానే సాధింది. మేము అయిదుగురం అన్నదమ్ములం, ఇద్దరు అక్కయ్యలు. అందరం స్థిరపడ్డాం. బాల్యమంతా కష్టాల కడలే. ఏటా బద్దిపోచమ్మ తల్లికి బోనాలూ సమర్పించుకుంటాం. నాన్న పోయక ఇల్లు గడవని పరిస్థితి. ఇంట్లోని పాత్రలు సైతం అమ్ముకోవాల్సి వచ్చింది. ఏ బల్లా మీదనైతే నాన్న చనిపోయాడో దానిని సైతం అమ్ముకునేంత దారిద్ర్యం వెంటాడింది. కన్నీళ్లు రాని రోజంటూ లేదు. ఏదోలా రోజు గడిచేది. అదొక్కటే జీవితం కాదు కాబట్టి ....ఏ అవసరం తీరాలన్నా డబ్బు కావాలి. వేదమంత్రాల ఇమిటేషన్ తో మొదలు... జంతువుల అరుపులు అనుసరించడంతో మిమిక్రి మొదలయింది. చిన్నప్పుడు నాన్నతో గుడికి వెళ్లినప్పుడు అయ్యవారు మంత్రలు చదివే విధానాన్ని గమనించేవాడిని. అచ్చు ఆయనలాగే చదివేవాడిని. మాదాల రంగారావుగారి సినిమాలోని 'జజ్జనకరి జనారే' పాటకు పెండ్లి భరాత్లల్ల డాన్స్ చేసేటోన్ని. టీవీలో ఎన్టీఆయర్, ఏఎన్నార్, కృష్ణా డైలాగ్‌లను చూసి ఇమిటేట్ చేసేవాడిని. ఆతర్వాత చిరంజీవికి పెద్ద ఫానయ్యాను. ప్రత్యేకంగా మిమిక్రీలో గురువంటూ ఎవరూ లేరు. ఇన్స్ట్రుమెంట్లు మోయడంతో... ఉపాధి వెతుక్కుంటూ రామగుండం వెళ్లాను. గాయకుడు నెల్లుట్ల ప్రవీణ్ చందర్ పరిచయంతో దూరదర్శన్‌లో అవకాశం వచ్చింది. ఆయన ద్వారానే గాయకులు వరంగల్ శంకర్, సారంగపాణి పరిచయం అయ్యారు. వాళ్ల ఆర్కెస్ట్రా గ్రూప్ లో ఇన్స్ట్రుమెంట్లు మోసేవాడిని. క్రమంగా సింగర్‌గా, మిమిక్రీ ఆర్టిస్ట్‌గా ఎదిగాను. తొలుత పది రూపాయలిచ్చినోళ్లే ప్రోగ్రాంకు ఇంత అని ఫిక్స్ చేశారు. కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో ఇచ్చిన మిమిక్రీ ప్రోగ్రామ్స్ పేరు తెచ్చిపెట్టాయి. మిత్రలు సలహాతో హైదరాబాద్ వచ్చాను. సానా యాదిరెడ్డి గారి పరిచయంతో 'పిట్టలదోర', 'ప్రేమపల్లకి'లో పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు. 'బ్యాచ్లర్స్' సినిమాతో బ్రేక్ వచ్చింది. 'ఈతరం ఫిలిమ్స్' అధినేత పోకూరి బాబూరావు తన ఆఫీసుకు పిలిపించి హీరోయిన్ మీనా పక్కన 'అమ్మాయి కోసం' సినిమాలో హీరోగా అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. -
శివన్న స్వరహేళ