
అనంతపురం, సాక్షి : వైఎస్సార్‌సీపీ కార్యకర్త కందుకూరు శివారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు సాకే బాలకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. శివారెడ్డి హత్య కేసులో మాజీ మంత్రి పరిటాల సునీత అనుచరులు, వారి కుటుంబ సభ్యులపై గతంలో కేసు నమోదయ్యింది. అయితే గత కొన్ని నెలలుగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకొని తిరుగుతున్న ప్రధాన నిందితుడు, పరిటాల సునీత వర్గీయుడు సాకే బాలకృష్ణను సోమవారం బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. మొహరం పండుగ సందర్భంగా కందుకూరులో జరిగిన గొడవను ఆసరాగా చేసుకొని... ద్విచక్ర వాహనంపై వెళ్తున్న శివారెడ్డి గత ఏడాది దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ద్విచక్ర వాహనంపై ఇటుకుల పల్లి నుంచి కందుకూరు వెళుతున్న అతడిని... దుండగులు కాపుకాసి వేట కొడవళ్లతో నరికి చంపారు.
చదవండి: అట్టుడికిన అనంత
హత్యకు గురైన వైఎస్సార్ సీపీ కార్యకర్త శివారెడ్డి (ఫైల్ ఫోటో)
Comments
Please login to add a commentAdd a comment