Paritala Sunita
-
పరిటాల సునీత ఫ్యామిలీ భూ బాగోతం!
సాక్షి, అనంతపురం : మాజీ మంత్రి పరిటాల సునీత కుటుంబసభ్యుల భూ బాగోతం బయటపడింది. ఒక వ్యక్తి తీసుకున్న రూ. కోటి అప్పుకు అతడి నుంచి రూ.10 కోట్ల విలువైన భూమిని స్వాహా చేశారు. వివరాల్లోకి వెళితే... పరిటాల సునీత సోదరుడు మురళీ వద్ద వ్యాపారి మేడా చంద్రశేఖర్ కోటి రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఈ సందర్భంగా మురళీ తన మామ వేలూరు రామాంజపేయులు పేరుతో అగ్రిమెంట్‌ను రిజిస్టర్ చేయించాడు. ఈ నేపథ్యంలో కురుగుంట వద్ద చంద్రశేఖర్ పేరు మీద ఉన్న రూ.10 కోట్ల విలువైన వ్యవసాయ భూమిపై మురళీ కన్నేశాడు. అయితే తాను తీసుకున్న అప్పును తిరిగి చెల్లిస్తానని చంద్రశేఖర్ చెప్పినా.. మురళీ అతని నుంచి బలవంతంగా విలువైన వ్యవసాయ భూమిని అప్పు కింద జమ చేసుకున్నాడు. దీనికి తోడు నిబంధనలకు విరుద్ధంగా 2.75 రూపాయల వడ్డీతో అప్పు వసూలు చేసినట్లు తేలింది. తనను బెదిరించి భూమిని అక్రమంగా రిజిస్టర్ చేయించుకున్నారని బాధితుడు చంద్రశేఖర్ ఆరోపించాడు. ప్రస్తుతం పరిటాల సునీత కుటుంబం ల్యాండ్ డీల్ జిల్లాలో తీవ్ర ప్రకంపనలు రేపుతుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పరిటాల సునీత ఫ్యామిలీ భూబాగోతం!
-
వైఎస్సార్సీపీ కార్యకర్త హత్య కేసులో సాకే బాలకృష్ణ అరెస్ట్!
అనంతపురం, సాక్షి : వైఎస్సార్సీపీ కార్యకర్త కందుకూరు శివారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు సాకే బాలకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. శివారెడ్డి హత్య కేసులో మాజీ మంత్రి పరిటాల సునీత అనుచరులు, వారి కుటుంబ సభ్యులపై గతంలో కేసు నమోదయ్యింది. అయితే గత కొన్ని నెలలుగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకొని తిరుగుతున్న ప్రధాన నిందితుడు, పరిటాల సునీత వర్గీయుడు సాకే బాలకృష్ణను సోమవారం బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. మొహరం పండుగ సందర్భంగా కందుకూరులో జరిగిన గొడవను ఆసరాగా చేసుకొని... ద్విచక్ర వాహనంపై వెళ్తున్న శివారెడ్డి గత ఏడాది దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ద్విచక్ర వాహనంపై ఇటుకుల పల్లి నుంచి కందుకూరు వెళుతున్న అతడిని... దుండగులు కాపుకాసి వేట కొడవళ్లతో నరికి చంపారు. చదవండి: అట్టుడికిన అనంత హత్యకు గురైన వైఎస్సార్ సీపీ కార్యకర్త శివారెడ్డి (ఫైల్ ఫోటో) -
మాజీమంత్రి అండతో దా‘రుణ’ వంచన!
మాజీ మంత్రి పరిటాల సునీత అండ చూసుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు కొందరు అక్రమార్జనకు తెరలేపారు. సార్వత్రిక ఎన్నికల్లో కూడా తామే గెలుస్తామని ఏడాది కిందటే బీరాలు పలికి అమాయకులకు రుణాలు మంజూరు చేయిస్తామని ఆశ చూపి డబ్బు దండుకున్నారు. అనంతరం ఎన్నికల్లో టీడీపీ పరాజయం పొందడంతో రుణాలు మంజూరు చేయించలేక చేతులెత్తేశారు. బాధితులు ఈ విషయమై నిలదీస్తే వారిపైనే దురుసుగా ప్రవర్తిస్తున్నారు. సాక్షి, రామగిరి: గత తెలుగుదేశం పాలనలో వర్షాభావ పరిస్థితులతో పంటలు చేతికందక రైతులు ఆర్థికంగా దెబ్బతిన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. టీడీపీ నాయకులు పలువురు రైతులకు, ప్రజలకు రుణాలు ఇప్పిస్తామని నమ్మించి డబ్బు వసూలు చేసుకుని జల్సాలు చేశారు. మాజీ మంత్రి పరిటాల సునీత సొంత మండలమైన రామగిరిలో ఈ ఉదంతం వెలుగు చూసింది. రామగిరి మండలంలో పేరూరు మేజర్ పంచాయతీ. ఆ గ్రామం చుట్టుపక్కల కంబదూరు, కనగానపల్లి మండలాలలోనున్న గ్రామాల కంటే పెద్ద వ్యాపారకేంద్రం. వర్షాభావంతో వ్యవసాయంలో నష్టాలు చవిచూస్తున్న రైతులకు ప్రత్యామ్నాయ ఉపాధి కింద గొర్రెల యూనిట్ మంజూరు చేయిస్తామని, అలాగే ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల కింద రుణాలు మంజూరు చేయిస్తామని నమ్మబలికి ఒక్కొక్కరి నుంచి రూ.1600 చొప్పున వసూలు చేశారని బాధితులు బావన్న, హనుమంతు, నరసింహులు, గంగయ్య, లింగమయ్య, హనుమంతు, రాఘవేంద్ర తదితరులు వాపోయారు. పేరూరు పంచాయతీ పరిధిలోని ఏడుగురాకులపల్లి, దుబ్బార్లపల్లి, పేరూరు గ్రామాలలోనే వందలాదిమంది ఇటువంటి బాధితులు బయటపడ్డారు. గొర్రెలు లేకుండానే ఇన్సూరెన్స్ కార్డుల పంపిణీ డబ్బులు దండుకున్న టీడీపీ నాయకులు గొర్రెల యూనిట్ మంజూరు చేయించకపోగా.. ఇన్సూరెన్స్ చేయించిన కార్డులు పంపిణీ చేశారని బాధితులు తెలిపారు. మా అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఇలా అన్యాయం చేయడం నాయకులకు మంచిది కాదని వాపోయారు. రెండేళ్లుగా స్పందించలేదు గొర్రెల యూనిట్కోసం రూ.1600 డబ్బులు చెల్లిచాం. రెండేళ్లు పూర్తవుతున్నా మాకు గొర్రెలయూనిట్ మంజూరు కాలేదు. ఈ విషయంపై పలుమార్లు టీడీపీ నాయకుల చుట్టూ తిరిగినా ఎలాంటి స్పందనా లేదు. – ఎం.సి.కుళ్లాయప్ప, ఏడుగురాకులపల్లి డబ్బులు వెనక్కు ఇవ్వలేదు గొర్రెలు ఇప్పించి మీకందరికీ న్యాయం చేస్తాం అంటూ ఒక్కొక్కరితో రూ.1600 వ సూలు చేశారు. ఇం తవరకూ గొర్రెలు ఇవ్వకపోగా, కనీసం మేంకట్టిన సొమ్మును కూడా వెనక్కు ఇవ్వలేదు. – బాసి రామాంజి, ఏడుగురాకులపల్లి ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలీదు మా గ్రామంలో చాలామందితో గొర్రెలు ఇప్పిస్తామని ఒక్కొక్కరితో రూ.1600 చొప్పున టీడీపీ నాయకులు వసూలు చేశారు. యూనిట్ మంజూరు చేయలేదు. మా డబ్బులు వెనక్కు ఇవ్వలేదు. ఈ విషయంపై ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా తెలియడం లేదు. – అరక మారెన్న,ఏడుగురాకులపల్లి -
సొమ్ము ఒకరిది.. పేరు పరిటాలది
సాక్షి, రామగిరి(అనంతపురం) : రామగిరిలో అవినీతి రాజ్యమేలింది. ఇక్కడ వారు చెప్పిందే వేదం..చేసిందే చట్టం..అధికార పార్టీలో ఉన్నాం..ఏం చేసినా చెల్లుతుంది అనే ధోరణిలో గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. అభివృద్ధి అనే పూతపూసి.. అక్రమాల కాత కాపించారు. పురాతన పాఠశాల భవనంలో వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేసి, సుమారు రూ.2లక్షలు నిధులు దుర్వినియోగం చేసి, దాన్ని అప్పటి మంత్రి పరిటాల సునీత చేత ప్రారంభింపజేశారు. మండలంలోని పోలేపల్లిలో పరిటాల రవీంద్ర మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటుచేశారు. దీని ఏర్పాటుకు మెటీరియల్‌ను పరిటాల ట్రస్ట్ అందించగా..పక్కా భవనానికి రూ.2లక్షల పంచాయతీ రాజ్ నిధులను తెలుగు తమ్ముళ్లు కాజేసి పురాతన పాఠశాల భవనంలో వాటర్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. 2014 ఎన్నికల్లో మేం అధికారంలోకొస్తే ఫ్లోరైడ్ రహిత నీటిని ప్రజలకు అందించేందుకు వాటర్ప్లాంట్లను ఏర్పాటు చేస్తాం అని టీడీపీ హయాంలో అలవిగాని హామీలిచ్చారు. హామీల అమలులో భాగంగా స్థానిక తెలుగు తమ్ముళ్లు మంత్రి పరిటాల సునీత అండ చూసుకొని అధికారులతో పక్కాభవనం నిర్మించినట్లు నిధులను డ్రా చేశారు. వాటర్ ప్లాంట్‌ను ఎక్కడ ఏర్పాటు చేయాలన్నా ప్రభుత్వ ఖాళీ స్థలాన్ని గుర్తించాలి. అక్కడ ప్రభుత్వ నిధులతో పక్కా భవనాన్ని నిర్మించాలి.వాటర్‌ప్లాంట్‌కు సంబంధించి మెటీరియల్‌ను ఏర్పాటు చేసి, ప్రజలకు రక్షిత తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలి. కానీ రామగిరి మండలంలో మాత్రం ఇందుకు భిన్నంగా ప్రజాప్రతినిధులు వ్యవహరించారు. పోలేపల్లి సమీపంలో ఉన్న క్వారీని కర్నూలుకు చెందిన వారు నిర్వహిస్తున్నారు. క్వారీ యజమానులను స్థానిక టీడీపీ నాయకులు బెదిరించి వాటర్‌ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన సామగ్రి కోసం రూ.2లక్షలు లాక్కొని పరిటాల ట్రస్ట్ పేరుతో వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేసినట్లు వైఎస్సార్సీపీ నాయకులు ఆదిరెడ్డి, ఓబిరెడ్డి, నాగిరెడ్డి, జయచంద్రారెడ్డి, రామకృష్ణారెడ్డితోపాటు పలువురు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వాటర్ ప్లాంట్ విషయమై పంచాయతీరాజ్ జేఈ మల్లికార్జునను అడగ్గా తాను రామగిరి జేఈగా ఇటీవల బాధ్యతలు చేపట్టానన్నారు. ఎంఈఓ రాజశేఖర్‌ను వివరణ కోరగా తాను ఇటీవలే బాధ్యతలు తీసుకున్నానని, ఈ విషయంపై తనకేమీ తెలియదని దాటవేశారు. -
పరిటాల వర్గీయుల బెదిరింపులు.. పట్టించుకోని పోలీసులు
సాక్షి, అనంతపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి భద్రతపై అనుమానాలు నెలకొన్నాయి. అత్యంత సమస్యాత్మక ప్రాంతమైన ఈ నియోజకవర్గంలో పోలీసులు వైస్సార్సీపీ అభ్యర్థికి భద్రత కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని చంపుతామని మంత్రి పరిటాల సునీత వర్గీయులు బహిరంగంగానే ప్రకటిస్తున్నా.. పోలీసులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారు. తోపదుర్తి గ్రామం నుంచే రాకపోకలు సాగిస్తున్న ప్రకాష్ రెడ్డి ఆయన సోదరులు.. మదిగుబ్బ- బి.యాలేరు మధ్య చేపట్టిన కల్వర్టు నిర్మాణాలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దారిలో పోలీసు గస్తీ ఏర్పాటు చేయించాలని, వారం కిందటే జిల్లా కలెక్టర్, ఎస్పీలను వైఎస్సార్సీపీ నేతలు కలిసి విజ్ఞప్తి చేశారు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పోలీసుల తీరుపై రాప్తాడు వైఎస్సార్సీపీ నేత వెన్నపూస రవీంద్రారెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన రాజశేఖర్ యాదవ్, కురుబ నాగిరెడ్డిలతో కలిసి మీడియాతో మాట్లాడారు. మంత్రి పరిటాల సునీత హింసా రాజకీయాలకు పాల్పడుతున్నారని, కొడుకు శ్రీరామ్‌ను గట్టెక్కించేందుకు దేనికైనా తెగిస్తున్నారని తెలిపారు. తోపుదుర్తి బ్రదర్స్‌కు ప్రాణహాని ఉందని, అనుమానస్పద ప్రాంతాలపై ఫిర్యాదు చేసిన ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. మంత్రి పరిటాలకు కొందరు అధికారులు, పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. భద్రతా వైఫల్యంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. -
సెంటిమెంట్ గ్రామంలో సునీతకు చుక్కెదురు
సాక్షి, కనగానపల్లి: తన సెంటిమెంట్ గ్రామమైన ముత్తువకుంట్లలో కుమారుడు శ్రీరామ్‌తో కలిసి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన మంత్రి పరిటాల సునీతకు ఆరంభంలోనే చుక్కెదురైంది. ఆమె తన ఎన్నికల ప్రచారాన్ని ప్రతిసారీ కనగానపల్లె మండలంలోని ఈ గ్రామం నుంచే ప్రారంభిస్తారు. అదే విధంగా ఈసారి కూడా బుధవారం అక్కడి నుంచే ప్రచారం ప్రారంభించేందుకు ఆ గ్రామంలోని ఎస్సీ కాలనీకి వెళ్లారు. అక్కడ రోడ్డుపైన ఉన్న కాలనీవాసులు కొందరు ఆమె వద్దకు వెళ్లి తాము తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నా మీరు, మీ నాయకులు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఇన్ని రోజులూ తమ సమస్యలు పట్టించుకోకుండా ఓట్ల సమయంలో వస్తే ఎలా మద్దతు ఇస్తామని ఆ కాలనీకి చెందిన ఎస్సీ సెల్ నాయకులు, పలువురు మహిళలు ప్రశ్నించారు. అంతేకాకుండా అక్కడ దాదాపు అన్ని ఇళ్లకూ వైఎస్సార్సీపీ జెండాలు కనిపించడంతో కంగుతిన్న టీడీపీ నాయకులు ఆ కాలనీలోకే కూడా వెళ్లకుండా పక్క గ్రామానికి వెళ్లిపోయారు. అనంతరం కాలనీవాసులు పెద్దన్న, సూరప్ప, కుళ్లాయప్ప, ముత్యాలు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో తమకు ఏ విధంగానూ న్యాయం జరగటం లేదన్నారు. గ్రామంలో మూడు బోర్లున్నా స్థానిక టీడీపీ నాయకులు తాగటానికి కూడా నీరు వదలడం లేదన్నారు. దీంతో తాము ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి మద్దతు తెలపాలని అనుకుంటున్నామని చెప్పారు. -
ఐటీ ‘వార్’..!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: తెలుగుదేశంపార్టీలో ఆధిప్యతపోరు తారస్థాయికి చేరింది. ఇది ఒకరి ఆర్థిక వనరులను మరొకరు దెబ్బతీసే స్థాయికి చేరింది. దీంతో అంతర్గతపోరు బహిరంగమై ‘నువ్వా–నేనా’ అని పరస్పరం కత్తులు దూసేస్థాయికి నేతలు చేరారు. టీడీపీలో మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య కొంతకాలంగా ఆధిపత్యపోరు నడుస్తున్నా ఇటీవల దాఖలైన రోడ్డు టెండర్లలో మరోసారి బట్టబయలయ్యాయి. ముఖ్యంగా మంత్రి పరిటాల సునీత, ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి మధ్య నెలకొన్న విభేదాలపై జిల్లా వ్యాప్తంగా తీవ్రస్థాయిలో చర్చ నడుస్తోంది. సునీత ఆర్థిక వనరులు దెబ్బతీసేందుకు ప్రతీ పనిలో సూరి పోటీపడుతున్నారని సునీత వర్గం ఆరోపిస్తుంటే, సూరిని దెబ్బతీసేందుకు మంత్రి సునీత ఐటీదాడులు జరిగేలా పథకం రూపొందించారని సూరీ వర్గం ఆరోపిస్తోంది. రెండు నియోజకవర్గాల్లోనూ టెన్షన్ టెన్షన్ మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న విభేదాలతో రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లో కొంతకాలంగా ప్రశాంత వాతావరణం కరువైంది. వీరి విభేదాలు ఏ క్షణం ఎలాంటి గొడవలకు దారితీస్తాయో అని ఆందోళనలో ప్రజలు ఉన్నారు. ఇటీవల ధర్మవరం పరిధిలోని చెరువులకు నీరివ్వలేదని హంద్రీ–నీవా ఎస్ఈ కార్యాలయం ముందు సూరి ధర్నాకు దిగారు. ధర్మవరం చెరువులకు నీరివ్వకుండా సునీతనే అడ్డుపడుతున్నారని సూరి వర్గం ఆరోపించింది. ఈ క్రమంలో బత్తలపల్లి–అనంతపురం, అనంతపురం–కళ్యాణదుర్గం, కళ్యాణదుర్గం–రాయదుర్గం రోడ్డు విస్తరణ పనులకు సంబంధించి టెండర్లలో వీరిద్దరూ పోటీపడ్డారు. బత్తలపల్లి–అనంతపురం రహదారి పనుల్లో ఎక్కువగా ధర్మవరం నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. ఈ పనులకు సూరితో పాటు సునీత కూడా తమ అస్మదీయులతో టెండర్లు దాఖలు చేయించారు. ధర్మవరం నియోజకవర్గంలోని పనుల్లో సునీత జోక్యం చేసుకుని టెండర్లు వేయించడం సూరీకి మింగుడు పడలేదు. దీంతో అనంతపురం–కళ్యాణదుర్గం రోడ్డు పనులకు సూరి టెండర్లు వేయించాడు. ఈ రోడ్డు ఎక్కువగా రాప్తాడు పరిధిలో ఉంటుంది. ఇంతటితో ఆగకుండా ఈ ఇద్దరూ కళ్యాణదుర్గం– రాయదుర్గం రోడ్డు పనులకు కూడా టెండర్లు వేయించారు. టెండర్ల రోజునే ఐటీ దాడులు అనంతపురం–కళ్యాణదుర్గం రహదారి పనులకు ఈ నెల 15న టెండర్ల ప్రక్రియ ముగిసింది. అదేరోజు ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరీకి చెందిని నితిన్‌సాయి కన్స్ట్రక్షన్స్ కార్యాలయాలతో పాటు ఆయనకు సంబంధించి ఆఫీసుల్లో ఐటీ దాడులు జరిగాయి. బెంగళూరుకు చెందిన ఐటీ అధికారులు దాడులకు వచ్చినట్లు తెలుస్తోంది. నాలుగేళ్లలో సూరి ఆస్తులు భారీగా పెరిగాయని, అక్రమార్జన ద్వారా భారీగా అర్జించారని ఐటీ అధికారులకు మంత్రి వర్గీయులే సమాచారం అందించి దాడులు చేసేలా పథక రచర చేశారని సూరీ వర్గం ఆరోపిస్తోంది. అయితే నాలుగేళ్లలో సూరీ ఆస్తులు భారీగా పెరిగాయని, దీంతోనే ఐటీ అధికారులు దాడులు చేశారని, ఇందులో తమ ప్రమేయం లేదని సునీత వర్గం అంటోంది. ఎవరు దాడులు చేయించారనే సంగతి పక్కనపెడితే సూరీపై ఐటీ దాడుల అంశం రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. -
ఘనంగా పరిటాల శ్రీరామ్ వివాహం
అనంతపురం: ఏపీ స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్ వివాహం ఆదివారం అనంతపురం జిల్లా రామగిరి మండలం వెంకటాపురంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హాజరయ్యారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా హాజరై శ్రీరామ్, జ్ఞాన దంపతులను ఆశీర్వదించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడ కలుసుకుని కరచాలనం చేసుకున్నారు. తర్వాత కేసీఆర్ వేదిక వద్దకు వచ్చి నూతన దంపతులను ఆశీర్వదించారు. -
అనంత లాస్ట్
► పార్టీ పనితీరు ఆధారంగా జిల్లాలు, ► ఎమ్మెల్యేలకు ర్యాంకులు ప్రకటించిన టీడీపీ అధిష్టానం ► ఆఖరిస్థానంలోనిలిచిన అనంత ► వ్యక్తిగతంగా నంబర్ వన్ ర్యాంకులో వరదాపురం.. ► చివరన పయ్యావుల ► అనంత’లో పార్టీ పరిస్థితిపై చంద్రబాబు కలవరం సాక్షి ప్రతినిధి, అనంతపురం ఇద్దరు ఎంపీలు.. 12 మంది ఎమ్మెల్యేలు.. రాష్ట్రంలో టీడీపీ బలంగా ఉన్న జిల్లాల్లో ‘అనంత’ది మొదటిస్థానమంటూ ఆ పార్టీ నేతలు ఇన్నాళ్లూ చంకలు గుద్దుకున్నారు. జిల్లాకు వచ్చిన ప్రతిసారీ చంద్రబాబు కూడా ‘టీడీపీకి అనంతపురం కంచుకోట’ అని గొప్పలు చెప్పుకున్నారు. అయితే.. సీన్ రివర్స్ అయ్యింది. రాష్ట్రంలోని 13 జిల్లాలతో పోలిస్తే ‘అనంత’లో టీడీపీ పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉందని అధిష్టానమే తేల్చింది. పనితీరు ఆధారంగా ప్రకటించిన ర్యాంకుల్లో ‘అనంత’కు ఆఖరి స్థానం కేటాయించింది. ‘అనంత’ ఆఖరిస్థానంలో నిలవడంపై ఇటు జిల్లాలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో పాటు సీఎం చ ంద్రబాబు కూడా కలవరపాటుకు గురయ్యారని తెలుస్తోంది. ఈ పరిణామాలతో ‘అనంత’లో టీడీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని తేలిపోయింది. ఇసుక కుంభకోణాలు, అధికారులపై దాడులు, బదిలీల్లో మామూళ్లు, పింఛన్లలో అక్రమాలు.. ఇలా ఒకటికాదు.. రెండు కాదు ప్రతి సంక్షేమ పథకంలోనూ టీడీపీ నేతలు బరితెగించి దోచుకున్నారు. పోలీసు శాఖను చెప్పుచేతుల్లో ఉంచుకుని ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులపై అక్రమ కేసులు బనాయించారు. వీటన్నిటిపై పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. టీడీపీ అధిష్టానం సోమవారం మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు జిల్లాలకు ర్యాంకులు ప్రకటించింది. పనితీరు ఆధారంగా కేటాయించిన ఈ ర్యాంకుల్లో అనంతపురం చివరిస్థానంలో నిలిచింది. జిల్లాలో పార్టీ పనితీరును బేరీజు వేసి వందకు 54.36 మార్కులు వేశారు. ప్రెస్మీట్లు, పార్టీ సమావేశాల నిర్వహణను పరిగణనలోకి తీసుకుని 50.29 శాతం గ్రేడింగ్ ఇచ్చారు. ప్రాతిపదిక ఇదే ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లకు టీడీపీ అధిష్టానం ర్యాంకులు ఇచ్చేందుకు రెండు అంశాలను ప్రామాణికంగా తీసుకుంది. గ్రామస్థాయిలో పార్టీని ఎలా బలోపేతం చేస్తున్నారు? మండలస్థాయిలో పార్టీ పనితీరు ఎలా ఉంది? అనే అంశాలనే పరిశీలించి గ్రేడింగ్‌లు ఇచ్చారు. ఈ గ్రేడింగ్‌ల ఆధారంగా ర్యాంకులు ప్రకటించారు. పార్టీ నిర్వహించిన శిక్షణ కార్యక్రమాలకు ఎమ్మెల్యేలు హాజరైన శాతాన్ని లెక్కించారు. నియోజకవర్గంలో ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, గ్రామ కమిటీలు ఏ మేరకు పూర్తి చేశారు, మూన్నెళ్లకోసారి ఆ కమిటీలతో సమావేశాలను నిర్వహించారా అనే విషయాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఎన్నికలొస్తే ఫలితాలు తారుమారు ‘అనంత’లో పార్టీ పనితీరుపై కొందరి ముఖ్యనేతల వద్ద చంద్రబాబు అసహనాన్ని వెలిబుచ్చినట్లు తెలుస్తోంది. ‘ఉరవకొండ, కదిరి, మడకశిర నియోజకవర్గాల్లో ఎక్కడా మండల కమిటీలను ఏర్పాటు చేయలేదు. నియోజకవర్గస్థాయిలో గతేడాది ఆగస్టు నుంచి మార్చి వరకూ ఉరవకొండ, అనంతపురం నియోజకవర్గాల్లో ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదు. మరో ఐదు చోట్ల ఒక్కో సమావేశం నిర్వహించారు. పార్టీని నాశనం చేయాలనుకుంటున్నారా?’ అని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మంత్రుల ర్యాంకుల్లో పరిటాల సునీత 8, పల్లె 11వ ర్యాంకు దక్కించుకున్నారు. వీరితో పాటు చాలామంది ఎమ్మెల్యేల పనితీరు ఏమాత్రమూ ఆశాజనకంగా లేదని, వర్గపోరు, అక్రమ సంపాదనతో పార్టీ పరువు తీస్తున్నారని మండిపడినట్లు తెలుస్తోంది. ‘అనంత’ అంటే తనకు భరోసా ఉండేదని, ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని చెప్పినట్లు టీడీపీ వర్గాలు అంటున్నాయి. -
టీడీపీలో చేరకపోతే అంతు చూస్తాం
వైఎస్ఆర్ సీపీ నాయకులకు మంత్రి సోదరుడి బెదిరింపు అనంతపురం : పార్టీ ఫిరాయించాలని, లేకుంటే అంతు చూస్తామంటూ రాప్తాడు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నేతలను టీడీపీ నాయకులు బెదిరించారు. తమ మాట వినకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందంటూ హెచ్చరించారు. ఇందులో భాగంగా పోలీసులను రంగంలోకి దింపి ఒత్తిళ్లు పెంచారు. రాప్తాడు మండలం యర్రగుంటలో చెరువు స్థలాన్ని టీడీపీ, ఇతర పార్టీలకు చెందిన కొందరు సాగు చేసుకుంటున్నారు. వారం క్రితం వైఎస్ఆర్సీపీ నాయకుడు నరసింహారెడ్డి భూమి నుంచి మట్టిని తోలేందుకు టీడీపీ నేత నారాయణస్వామి సిద్ధమయ్యాడు. అతని చర్యలను నరసింహారెడ్డి అడ్డుకున్నారు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం నారాయణస్వామి మంత్రి పరిటాల సునీతను ఆశ్రయించాడు. సమస్య పరిష్కరించండంటూ ధర్మవరపు మురళీ తదితరులను మంత్రి ఆదేశించారు. రంగంలోకి దిగిన మంత్రి సోదరుడు మురళి బుధవారం ఉదయం నరసింహారెడ్డిని, సర్పంచ్ కుమారుడు సాకే వెంకటేష్‌ను చర్చల పేరుతో పిలిపించుకుని, తమ పార్టీలో చేరాలని కోరినట్లు తెలిసింది. ఆయన ఒత్తిళ్లకు తలొగ్గకపోవడంతో ఇటుకలపల్లి సీఐ రాజేంద్రనాథ్ యాదవ్‌ను రంగంలోకి దించారు. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు సీఐ తన సిబ్బందితో యర్రగుంటకు చేరుకుని చెరువులో సాగు చేసుకుంటున్న వైఎస్ఆర్ సీపీ మద్దతుదారులను మాత్రమే కలిసి వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించారు. ఆ సమయంలో ఇంటి వద్ద నరసింహారెడ్డి, పుల్లారెడ్డి, కేశవరెడ్డి, సాకే వెంకటేష్ లేకపోవడంతో వారిని సాయంత్రం ఐదు గంటలకు పోలీస్ స్టేషన్‌కు రప్పించుకున్నారు. చెరువు మట్టిని తరలించే సమయంలో అడ్డుకుంటే అరెస్ట్ చేస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై తహశీల్దార్ అందే హరికుమార్ మాట్లాడుతూ... వారం క్రితం గ్రామాన్ని పరిశీలించేందుకు వెళ్లిన సమయంలో చెరువు స్థలంలో గ్రామస్తులు సాగు చేసుకుంటున్న విషయం వెలుగు చూసిందన్నారు. ఆ స్థలాలను ఖాళీ చేయాలని వారికి నోటీసులు ఇచ్చి స్వాధీనం చేసుకోనున్నట్లు చెప్పారు. -
పరిటాల కోటకు బీటలు?
సొంత పార్టీలోనే తమ్ముళ్లకు విలువ లేకుండా పోయింది. మండలాలు, గ్రామాల్లో పార్టీ ఇన్చార్జిలు, జన్మభూమి కమిటీ సభ్యులను ఏర్పాటు చేయడం ద్వారా పరోక్షంగా ప్రజా ప్రతినిధుల అధికారాన్ని వాళ్లకు కట్టబెట్టినట్లైంది. వీరి పెత్తనాన్ని అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే భరించలేకపోతున్నారు. ఇందులో భాగంగానే కొంత కాలంగా అసమ్మతితో రగలిన తమ్ముళ్లు ఎట్టకేలకు తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదంతా రాష్ట్రమంత్రి పరిటాల సునీత ప్రాతినిథ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గంలోనే చోటు చేసుకోవడం గమనార్హం. * రాజకీయ పెత్తనం భరించలేకపోతున్న అధికార పార్టీ ప్రజాప్రతినిధులు * రాజీనామా బాటలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ కనగానపల్లి : పరిటాల కుటుంబానికి కంచుకోటగా ఉన్న రాప్తాడు నియోజకవర్గం టీడీపీలో అసమ్మతి రాజుకుంది. రాజకీయ పెత్తనాన్ని భరించలేని అధికార పార్టీకి చెందిన కనగానపల్లి ఎమ్పీపీ బిల్లే రాజేంద్ర, వైస్ ఎమ్పీపీ వెంకట్రామిరెడ్డి కొన్ని రోజులుగా ప్రభుత్వ, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. చివరకు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సైతం వీరు పాల్గొనలేదు. జన్మభూమి కమిటీలు, పార్టీ ఇన్చార్జిల ఏర్పాటుతో ప్రభుత్వ కార్యకలాపాల్లో వీరికి సరైన ప్రాధాన్యత దక్కలేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక మొదలు మండల స్థాయి సమావేశాల్లోనూ వీరికి ప్రాధాన్యత లేకుండా పోయింది. ఇదే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయింది. దీంతో వారు తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. వీరితో పాటు మరో ఇద్దరు ఎమ్పీటీసీలు కూడా టీడీపీని వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఎమ్పీపీ, వైస్ ఎమ్పీపీని వివరణ కోరగా వాస్తవమేనని ధ్రువీకరించారు. అడ్డదారులలో ఎంపీపీ దక్కించుకున్న అధికార పార్టీ: 2014లో కనగానపల్లి మండలంలో జరిగిన ఎమ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీకి ఆరు, టీడీపీ ఐదు స్థానాలు దక్కించుకున్నాయి. అయితే రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ సీపీకి చెందిన ఇద్దరు ఎమ్పీటీసీలను టీడీపీ నాయకులు లొంగదీసుకుని ఎమ్పీపీ పదవి దక్కించుకున్నారు. పదవులను కల్పించి వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా పార్టీ నాయకులే పెత్తనం చేస్తుండడంతో టీడీపీలో అసమ్మతి రాజుకుంది. అనుకున్న రీతిలో కనగానపల్లి ఎమ్పీపీ, వైస్ ఎమ్పీపీ తమ పదవులతో పాటు ఎమ్పీటీసీ స్థానాలకు రాజీనామా చేస్తే మండలంలో పలు రాజకీయ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.