ఏపీ మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరాం వివాహానికి హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులు
అనంతపురం: ఏపీ స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్ వివాహం ఆదివారం అనంతపురం జిల్లా రామగిరి మండలం వెంకటాపురంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హాజరయ్యారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా హాజరై శ్రీరామ్, జ్ఞాన దంపతులను ఆశీర్వదించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడ కలుసుకుని కరచాలనం చేసుకున్నారు. తర్వాత కేసీఆర్ వేదిక వద్దకు వచ్చి నూతన దంపతులను ఆశీర్వదించారు.