PARITALA Sriram
-
లోకేశ్ తీరుతో టీడీపీలో కొత్త ట్విస్ట్.. తెరపైకి పరిటాల ఫ్యామిలీ పాలిటిక్స్!
నారా లోకేశం పాదయాత్ర తెలుగుదేశం పార్టీలో గందరగోళం రేపుతోంది. ఇప్పటివరకు తాను పర్యటించిన చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించేశారు లోకేశం. చాక్లెట్ల మాదిరి టిక్కెట్లు పంచిపెట్టడాన్ని కొందరు ఆశావహులు తప్పుపడుతున్నారట. చంద్రబాబు ఆదేశాలతో ప్రకటిస్తున్నారా? లేక సొంతంగా ఇచ్చేస్తున్నారా అని సందేహపడుతున్నారని టాక్. నారా లోకేశం కామెడీపై ఓ లుక్కేద్దాం.. తెలుగుదేశం అనే ప్రాంతీయ పార్టీకి జాతీయ ప్రధానకార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ పాదయాత్ర ఆ పార్టీ నాయకుల్లోనే టెన్షన్ క్రియేట్ చేస్తోంది. చిన్న పిల్లలకు చాక్లెట్లు ఇచ్చేసినట్లుగా.. అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించేస్తున్నారు. తనకు కావాల్సినవారి పేర్లు ప్రకటిస్తూ.. వారిని ఆశీర్వదించాలని కేడర్‌ను కోరుతున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో టిక్కెట్లు ఆశిస్తున్న నేతలు లోకేశ్ తీరుతో గందరగోళానికి గురవుతున్నారు. తాజాగా శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం అభ్యర్థిగా పరిటాల శ్రీరాం పేరును నారా లోకేష్ ఖరారు చేశారు. శ్రీరాం చేతిని పట్టుకుని పైకెత్తి మరీ ఆశీర్వదించాలంటూ కోరారు. 2014లో ధర్మవరం ఎమ్మెల్యేగా గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి గెలిచారు. 2019 ఎన్నికల్లోనూ టీడీపీ నుంచి పోటీ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత కొన్ని రోజులకే వరదాపురం సూరి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ధర్మవరం సీటు పరిటాల శ్రీరామ్‌కు.. ఇక, మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ధర్మవరం టిక్కెట్ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నారు వరదాపురం సూరి. త్వరలోనే వరదాపురం సూరి టీడీపీలో తిరిగి ప్రవేశించబోతున్నారని.. ఆయనకు ధర్మవరం టిక్కెట్ కూడా ఖరారు అయిందని టీడీపీ వర్గాల్లోనే కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇంతలో పాదయాత్రలో భాగంగా ధర్మవరం వచ్చిన నారా లోకేష్ ఏకంగా మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరాంను అభ్యర్థిగా ప్రకటించేశారు. గత ఎన్నికల్లో రాప్తాడు నుంచి పోటీ చేసిన శ్రీరాం.. వైఎస్ఆర్సీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేతిలో ఘెరంగా ఓటమి చెందారు. వరదాపురం సూరి బీజేపీలోకి వెళ్లిన తర్వాత ఖాళీ అయిన ధర్మవరంలోకి అడుగుపెట్టారు పరిటాల శ్రీరాం. తన తల్లి పరిటాల సునీతకు తిరిగి రాప్తాడు అప్పగించి ధర్మవరం టీడీపీ ఇంఛార్జిగా శ్రీరాం కొనసాగుతున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో రాప్తాడు నుంచి పరిటాల సునీత, ధర్మవరం నుంచి పరిటాల శ్రీరాం పోటీ చేస్తున్నట్లు నారా లోకేష్ స్పష్టం చేశారు. లోకేశ్ ప్రకటనతో టీడీపీలో చర్చ.. లోకేశ్ ప్రకటన తర్వాత ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరికి రెండు టిక్కెట్లు ఎలా ఇస్తారంటూ తెలుగుదేశం పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఇదే నిజమైతే మాకు అలాగే ఇవ్వాలని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం నుంచి డిమాండ్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి తాడిపత్రి అసెంబ్లీ నుంచి, దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి అనంతపురం పార్లమెంటు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వచ్చే ఎన్నికల్లో కేవలం తాడిపత్రికే పరిమితం కావాలని జేసీ కుటుంబానికి చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది. ఇప్పుడు పరిటాల కుటుంబానికి రెండు టిక్కెట్లు ఖరారు కావటంతో తమ గళం వినిపించేందుకు జేసీ ఫ్యామిలీ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దీనికితోడు పరిటాల కుటుంబానికి రెండు టిక్కెట్లు ఇవ్వటం పట్ల అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాలకు చెందిన పలువురు టీడీపీ సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యత పెంచుతూ పోతుంటే.. చంద్రబాబునాయుడు మాత్రం సొంత సామాజిక వర్గానికి మాత్రమే పట్టం కట్టడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. దీంతో, మొత్తం మీద చంద్రబాబు తనయుడు లోకేశ్ పాదయాత్ర వల్ల టీడీపీకి లాభం కలిగించకపోగా.. పార్టీ నాయకుల్లోనే విభేదాలు పెంచుతోంది. అసలు లోకేశ్ ప్రకటిస్తున్న టిక్కెట్లు నిజమేనా.. లేక ఉత్తిత్తి టిక్కెట్లా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. -
పరిటాల పాపం.. రైతులకు శాపం
టీడీపీ హయాంలో తమ కాంట్రాక్ట్ పనులకు అవసరమైన మట్టి కోసం పరిటాల కుటుంబం జంగాలపల్లి చెరువుపై కన్నేసింది. చెరువు స్వరూపం దెబ్బతీసేలా అధునాతన యంత్రాలతో మట్టిని తవ్వేశారు. కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. చెరువు ఆయకట్టులో ఊట పడటానికి కారకులయ్యారు. పంటలు దెబ్బతినడంతో పాటు జమ్ము గడ్డి ఏపుగా పెరిగి ఇకపై సాగు చేయడానికి వీలులేని పరిస్థితి నెలకొంది. పరిటాల కుటుంబానికి కాసులు.. ఆయకట్టు రైతులకు కన్నీళ్లు మిగిలాయి. రాప్తాడు రూరల్: అనంతపురం మండలం జంగాలపల్లి చెరువు (కందుకూరు చౌడు చెరువు) 33 ఏళ్ల తర్వాత నిండింది. తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఎమ్మెల్యే కాగానే ఆయా గ్రామస్తులు పట్టుబట్టి ధర్మవరం కుడి కాలువ ద్వారా కృష్ణా జలాలను చెరువుకు తెప్పించుకున్నారు. చెరువుకు నీళ్లు రాగానే భూగర్భజలాలు పెరిగి బోరుబావులు రీచార్జ్ అవుతాయని ఆయకట్టు రైతులు ఆశపడ్డారు. అయితే వారి అశలు అడియాసలయ్యాయి. గత టీడీపీ పాలకులు చేసిన పాపం ఆయకట్టు రైతులకు శాపంగా మారింది. అప్పట్లో చెరువులో జరిపిన తవ్వకాల వల్ల కింది భాగం మట్టి లూజు అయ్యింది. ఫలితంగా ఊటలు ఏర్పడి సాగు చేసిన పంటల్లో నీరు ప్రవహిస్తోంది. తుడిచిపెట్టుకుపోయిన పంటలు ఈ చెరువు ఆయకట్టు దాదాపు 275 ఎకరాల దాకా ఉంది. నీటి ఊట కారణంగా 150 ఎకరాల పంటలు దెబ్బతిన్నాయి. కృష్ణారెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, రవిశేఖర్‌రెడ్డి, రాంభూపాల్‌రెడ్డి, పరుశురాం, వెంకటరాముడు, చరణ్‌రెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి, సతీష్‌రెడ్డి, వెంకటరామిరెడ్డి తదితర రైతులు సాగు చేసిన చీనీ, అరటి, బొప్పాయి, స్వీట్ ఆరెంజ్, కాయగూరల పంటలు తుడిచి పెట్టుకుపోయాయి. రైల్వే పనులకు చెరువు మట్టి గత టీడీపీ ప్రభుత్వంలో పరిటాల కుటుంబం కాంట్రాక్ట్ చేసిన రైల్వే పనులకు అవసరమైన కోట్లాది రూపాయల విలువైన మట్టిని జంగాలపల్లి చెరువు నుంచే తరలించింది. దాదాపు 30 అడుగుల లోతు ఇష్టారాజ్యంగా హిటాచీల సాయంతో తవ్వేశారు. జీడిబంక మట్టి అంతాపోయింది. ఇసుక, గరుసు వచ్చేవరకు తవ్వకాలు జరిపారు. టిప్పర్లు కింది నుంచి పైకి వచ్చేందుకు ప్రత్యేకంగా రన్‌వే ఏర్పాటు చేశారంటే ఏ స్థాయితో తవ్వకాలు చేపట్టారో అర్థం చేసుకోవచ్చు. ఉబికి వస్తున్న నీళ్లు చెరువు ఆయకట్టులో నీళ్లు ఉబికి వస్తున్నాయి. ఉన్న పంటలు నష్టపోవడంతో పాటు కొత్తగా పంటలు సాగు చేసేందుకు కూడా వీలు కావడం లేదని రైతులు వాపోతున్నారు. బోర్లలో నుంచి నీరు బయటకు వస్తోంది. నీటి ప్రవాహంతో పెద్ద ఎత్తున జమ్ము పెరిగింది. చేపల చెరువులకు లీజుకు ఇచ్చిన రైతులు నీటి ఊటతో పంటలు సాగు చేసేందుకు ఏమాత్రం అవకాశం లేకపోవడంతో తొలిసారి చేపల చెరువులకు లీజుకు ఇచ్చారు. ఆయకట్టు కింద వెంకటరామిరెడ్డి, చరణ్‌కుమార్‌రెడ్డి వరి సాగు చేసేవారు. మంచి దిగుబడి వచ్చేది. ఈసారి నీటి ప్రవాహం కారణంగా పంట సాగు చేసేందుకు వీలు కాకపోవడంతో తమ భూమిని నెల్లూరు జిల్లా వాసులకు చేపల చెరువుల కోసం లీజుకు ఇచ్చారు. మట్టి తవ్వకాలతోనే ఈ దుస్థితి.. టీడీపీ పాలనలో చెరువులో జరిపిన మట్టి తవ్వకాలతోనే ఈ దుస్థితి నెలకొందని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ దుగుమర్రి గోవిందరెడ్డి, సర్పంచ్ ప్రశాంత్‌కుమార్, ఎంపీటీసీ సభ్యులు రాగే రేవతి, పెద్దప్ప, ఉపసర్పంచ్ ఓబులేసు, పార్టీ గ్రామ కమిటీ చైర్మన్ గోవర్దన్‌రెడ్డి, నరసింహారెడ్డి, సుధీర్‌రెడ్డి తదితరులు తెలిపారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఎంతో కష్టపడి కృష్ణాజలాలతో చెరువును నింపించారన్నారు. చెరువు అడుగు భాగం బాగా దెబ్బతినడంతో ఊటలు ఏర్పడి ఆయకట్టు అంతా నీరుపారుతోందన్నారు. ఇప్పటికే 60 శాతం దాకా నీళ్లు బయటికిపోయాయని, గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఆయకట్టులో జమ్ము గడ్డి పెరిగిందన్నారు. దీంతో ఇకపై పంటలు పెట్టేందుకు వీలుకాదని తెలిపారు. వ్యవసాయ పంటలకు దెబ్బ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చెరువుకు 75 శాతం నీళ్లు వచ్చినా ఏరోజూ ఊట పడలేదు. ఆనందంగా వరి సాగు చేసి.. 450 ప్యాకెట్ల ధాన్యం తీసేవాళ్లం. ఇప్పుడు ఆయకట్టులో భారీగా నీళ్లు ఊరుతున్నాయి. నా జీవితంలో ఎప్పుడూ ఆయకట్టులో జమ్ము గడ్డి పెరగడం చూడలేదు. ఇప్పుడా పరిస్థితి రావడంతో వ్యవసాయ పంటలకు పెద్ద దెబ్బ పడింది. – చరణ్‌కుమార్‌రెడ్డి, రైతు, జంగాలపల్లి మోటార్లతో నీళ్లు తోడుతున్నాం ఆయకట్టు కింద నాలుగు ఎకరాల్లో చీనీ పంట, మూడెకరాల్లో అరటి సాగు చేశాను. ఊట దిగడంతో అరటి పంట మొత్తం దెబ్బతింది. అరటిపంటలో మొత్తం జమ్ము పెరిగింది. నాలుగున్నరేళ్ల వయసున్న చీనీచెట్లను కాపాడుకునేందుకు తంటాలు పడుతున్నా. రోజూ మోటార్లతో నీళ్లు తోడిస్తున్నా. ఏం జరుగుతుందో చూడాలి. గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి లేదు. చెరువు అంతా పెద్ద పెద్ద గుంతలు తవ్వడం వల్లే నీటి ఊటలు ఏర్పడ్డాయి. – కృష్ణారెడ్డి, చెరువు ఆయకట్టు దారుల సంఘం మాజీ అధ్యక్షుడు ఊటలోనే 12 ఎకరాలు.. చెరువు ఆయకట్టు కింద 19 ఎకరాలు ఉంది. అరటి, బొప్పాయి, చీనీచెట్లు సాగు చేశాం. ఊట ఏర్పడి రెండెకరాలు మినహా తక్కిన పంటలన్నీ పూర్తిగా ఎత్తిపోయాయి. ఏడెనిమిది నెలలవుతున్నా 12 ఎకరాల భూమి నీళ్లలోనే ఉంది. 15 ఏళ్ల వయసున్న చీనీచెట్లు, కోతకు వచ్చిన అరటి, బొప్పాయి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. దాదాపు రూ. 20 లక్షల పైనే నష్టం వాటిల్లింది. గతంలో చెరువులో నీళ్లు ఉన్నా...ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. – సోమశేఖర్‌రెడ్డి, రైతు, కందుకూరు -
పరిటాల శ్రీరామ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు
-
పరిటాల శ్రీరామ్ తనకు కజిన్ అంటూ..
జల్సాల కోసం ఓ ప్రబుద్ధుడు మోసాల బాటపట్టాడు. మాయమాటలతో యువతీ యువకులకు టోపీ పెట్టాడు. తనకు ఎంతో పరపతి ఉందని, పరిటాల శ్రీరామ్ కజిన్ అవుతాడని, బెంగళూరులో రిసార్టులు ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రచారం చేసుకున్నాడు. ఉద్యోగాలిప్పిస్తానని యువకులకు...సినిమాల్లో వేషాలిప్పిస్తానని యువతులకు గాలం వేశాడు. వారి నుంచి రూ.కోట్లు దండుకున్నాడు. సాక్షి, హైదరాబాద్ : ఖరీదైన అద్దెకార్లలో తిరుగుతూ.. సూటు బూటు వేసుకొని స్టార్ హోటళ్లలో బస చేస్తూ.. తాను పరపతి ఉన్న వాడినని ప్రముఖ సినీ, రాజకీయ, అధికారులతో దిగిన ఫొటోలతో సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ, ఉద్యోగాలు ఇప్పిస్తానని యువకులను, సినిమాల్లో వేషాలు ఇప్పిస్తానని పలువురు యువతులకు టోకరా వేసిన మాటల మాంత్రికుడిని మంగళవారం జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్‌రావు, జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ కె.బాలకృష్ణారెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. అనంతపురం జిల్లా, పుట్టపర్తి మండలం, రాచవారిపల్లి గ్రామానికి చెందిన కొండూరి రాజేష్ అలియాస్ కె.రమేష్‌బాబు, అలియాస్ విష్ణువర్ధన్‌రెడ్డి బికాం చదివి ఖాళీగా ఉండేవాడు. తన తెలివితేటలను పెట్టుబడిగా పెట్టి రూ. కోట్లు సంపాదించాలని పథకం పన్నాడు. ఈ నేపథ్యంలో ప్రశాసన్‌నగర్‌కు చెందిన కోగంటి నౌషిక అనే ఫ్యాషన్ డిజైనర్‌తో గత ఏడాది ఫిబ్రవరిలో ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకున్న అతను తానో సినీ నిర్మాతనని, కొత్త సినిమా తీస్తున్నానని, కాస్ట్యూమ్ డిజైనర్ కావాలని పరిచయం పెంచుకున్నాడు. తనకు అనంతపురంలో చాలా స్థలాలు ఉన్నాయని, పరిటాల శ్రీరామ్ తనకు కజిన్ అవుతాడని, బెంగళూరులో రిసార్ట్లు ఉన్నట్లు నమ్మించాడు. బీహెచ్ఈఎల్లో జూనియర్ ఇంజినీర్ పోస్టు ఖాళీగా ఉన్నట్లు చెప్పడంతో ఆమె తన తమ్ముడికి ఆ ఉద్యోగం ఇప్పించాలని రూ.4 లక్షలు ఇచ్చింది. అంతటితో ఆగకుండా మరోసారి రూ.10.36 లక్షలు వసూలు చేశాడు. ఉద్యోగం ఇప్పించేందుకు మరింత ఖర్చవుతుందని చెప్పడంతో ఆమె మరోసారి రూ.13.65 లక్షలు ఇచ్చింది. ఇలా ఆమె నుంచి 15 దఫాలుగా రూ.36.44 లక్షలు వసూలు చేశాడు. అయితే ఉద్యోగం ఇప్పించకపోగా కొన్ని రోజులుగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ముఖం చాటేయడంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు ఈ నెల 3న జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు మంగళవారం నిందితుడిని అరెస్ట్ చేశారు. వందల మందికి బురిడీ నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు అతను గత మూడేళ్లుగా జల్సాల కోసం పలువురు యువకులను ఉద్యోగాల పేరుతో మోసం చేసినట్లు తేలింది. గతంలో ఇదే తరహా కేసులో మాదాపూర్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. వందలాది మంది నిరుద్యోగుల నుంచి రూ.కోటి దాకా వసూలు చేసినట్లు తేలింది. బంజారాహిల్స్‌లో ఆఫీసు నిందితుడు బంజారాహిల్స్ రోడ్ నెంబర్–5లో హలో ‘భారత్ ఎంటర్టైన్మెంట్స్’ పేరుతో ఓ కార్యాలయం తెరిచి తాను సినిమా నిర్మాతనని, ప్రముఖ హీరోలతో దిగిన ఫొటోలు చూపుతూ హీరోయిన్ వేషాలు ఇప్పిస్తానని యువతులను మభ్యపెట్టి డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. బెంజ్ కార్లు..ప్రముఖులతో పార్టీలు మోసాల ద్వారా సంపాదించిన సొమ్ముతో రాజేష్ జల్సా జీవితం అనుభవించేవాడు. ఖరీదైన దుస్తులు వేసుకొని, అద్దెకు తీసుకున్న బెంజ్ కార్లలో తిరుగుతూ రూ. లక్షల విలువైన మొబైల్ ఫోన్లు వాడుతూ, స్టార్ హోటళ్లలో బస చేస్తూ, ప్రముఖులతో పార్టీల్లో మునిగి తేలేవాడని పోలీసులు తెలిపారు. అటు యువకులను ఉద్యోగాల పేరుతో, ఇటు యువతులను సినిమా వేషాలు పేరుతో నమ్మించి మోసాలకు పాల్పడుతున్న అతను ఇన్నాళ్లు పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరిగాడు. నిందితుడిపై వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 14 కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్, కేపీహెచ్‌బీ, ఎస్ఆర్నగర్, బంజారాహిల్స్, చైతన్యపురి, మాదాపూర్ పోలీస్స్టేషన్లలో కేసులు ఉన్నాయని, ఎఫ్ఐఆర్ కాని కేసులు కూడా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆగని పరిటాల వర్గీయుల ఆగడాలు
సాక్షి, అనంతపురం : అధికారం కోల్పోయినా మాజీ మంత్రి పరిటాల సునీత వర్గీయుల ఆగడాలు ఆగడం లేదు. రాప్తాడు నియోజకవర్గంలోని కనగానపల్లి మండలం గుంతపల్లిలో పరిటాల శ్రీరామ్ అనుచరులు రెచ్చిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రతాప్‌కు ఫోన్ చేసి చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారు. రాయలేని అసభ్య పదజాలంతో బాంబులు వేస్తామని, కొడవళ్లతో నరికి చంపేస్తామంటూ శ్రీరామ్ అనుచరుడు అమర్నాథ్, మరో ముగ్గురు బెదిరింపులకు దిగారు. ప్రతాప్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ బెదిరింపులకు సంబంధించిన ఆడియో ఫైల్‌ను పోలీసులతో పాటు మీడియాకు కూడా అందజేశారు. పరిటాల వర్గీయులు ఫోన్లో బెదిరించిన ఆడియో -
రేయ్.. అడ్డంగా నరుకుతాం
అనంతపురం: ఎన్నికల్లో ప్రజలు పరిటాల కుటుంబాన్ని ఓట్ల రూపంలో తిరస్కరించినా.. వారి అనుచరుల దౌర్జన్యాలు, బెదిరింపులకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. తాజాగా రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలం గుంతపల్లికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త చాకలి ప్రతాప్‌ను పరిటాల శ్రీరామ్ అనుచరులు బెదిరించిన ఆడియో టేపులు హల్చల్ చేస్తున్నాయి. మీ ఇంటి ముందు బాంబులేస్తాం. మీ ఊరిలోనే నిన్ను అడ్డంపెట్టి నరుకుతామంటూ శ్రీరామ్ అనుచరుడు భానుకోటకు చెందిన బాలా అమర్నాథ్ యాదవ్ బెదిరించారు. గుంతపల్లికి చెందిన వినోద్‌కుమార్ యాదవ్, అక్కులప్ప, భానుకోటకు చెందిన రవితేజతో కలిసి అమర్నాథ్ బెదిరిస్తున్నాడని బాధితుడు వాపోతున్నాడు. ఫోన్లో బెదిరింపుల వివరాలు ఇలా... ‘రే పూ.. నేను కాలువ వద్ద ఉన్నాను. నీ బలగం ఎంతుందో అందర్నీ పిలుచుకురా తేల్చుకుందాం. తోటలో బోర్లు వేయించుకున్నావు, అక్కడ నీ డ్రిప్ పైపులు, బోరును ధ్వంసం చేస్తా. ఎవరనుకుంటున్నావ్ రా నన్ను. ఇంటికాటికి వచ్చి చంపుతా లం.. కొడకా. మేము అనుకుంటే నిన్ను తగరకుంటలోనైనా చంపుతాం. ఇద్దరు బిడ్డలున్నారు బతకాలని ఉందా లేదారా? నా కొడకా. బట్టలు ఉతికేదాంట్లో వేస్తాం. ఈడ్చిఈడ్చి కొడతాం. మడసంగా ఉంటే ఉండు, లేదంటే నువ్వు దొరికినావంటే చంపుతాం రే. మాకు పోలీసులు, లాయర్లున్నారు. అడ్డంపెట్టి నరుకుతాం. మొన్న వచ్చినాం కొట్టేందుకు, ఏమంటే మీరు అక్కడ లేరు. కానిస్టేబుల్ కూడా వద్దని చెప్పాడు. ఎక్స్‌ట్రాలు దెం...నారో ఐదేళ్లే మీ ప్రభుత్వం. తర్వాత నిన్నే ఫస్టు చంపేది. నాకు పెళ్లికూడా కాలేదు. మాట చెబుతున్నా చూడు కచ్చితంగా బాంబులేసి చంపుతా. మీరు భానుకోట బోయొళ్లకు చెప్పినా వారంతా నా ఫ్రెండ్సే. కిట్టప్ప కొడుకులు, ఎవరైనా సరే అందరూ నాకు తెలిసినోళ్లే’ నంటూ బెదిరించడం కలకలం రేపుతోంది. ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు రెండు రోజుల కిందట బాధితుడు చాకలి ప్రతాప్ కనగానపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. బెదిరింపు టేపులు, బెదిరించిన వారి వివరాలు అందజేసినా కేసుకూడా కట్టలేదు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ మండల నాయకులు పోలీసులతో మాట్లాడగా.. బెదిరింపులకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు. ఆడియో టేపులతోసహా ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, పైగా తమపైనే బైండోవర్ కేసు నమోదు చేశారని బాధితుడి సోదరుడు చాకలి నరసింహులు వాపోయాడు. కేసు నమోదు చేస్తాం: ఎస్ఐ వేణుగోపాల్ బాధితుడి ఫిర్యాదు తీసుకున్నాం. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. బాధితుడి సోదరుడితో మాట్లాడాను తప్ప బైండోవర్ కేసు పెట్టలేదు. విచారించి నిందితులపై కేసు నమోదు చేస్తాం. -
ఐదేళ్లూ.. హత్యా రాజకీయాలే!
ప్రజా సమస్యలు పక్కనపెట్టారు.. ప్రశ్నించే నాయకులను అంతమొందించారు. అవినీతి ఏరులై పారించారు. రూ.కోట్లు కూడబెట్టుకున్నారు. బాధ్యత గల పదవుల్లో ఉంటూ బరితెగించారు. పాలించమని అధికారమిచ్చిన ప్రజల ప్రాణాలు తీస్తూ తమకు ఎదురేలేదని పరమానందపడ్డారు. ఐదేళ్లూ..హత్యారాజకీయాలే చేశారు. ఎన్నికల వేళ నోట్లు జల్లుతూ ఓట్లు కొల్లగొట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. పచ్చ పథకం పారితే... ‘అనంత’ రక్తచరిత్ర మళ్లీ పునరావృతమవుతుందన్న ఆందోళన అందరిలోనూ నెలకొంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యతో అది మరింత పెరిగింది. సాక్షి, అనంతపురం సెంట్రల్: అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఐదేళ్ల కాలంలో టీడీపీ నేతలు హత్యారాజకీయాలు చేశారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నాయకులనే టార్గెట్‌గా చేసుకొని హత్యల పరంపరను కొనసాగించారు. తాజాగా సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా అలజడి సృష్టించేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేశారు. దీంతో టీడీపీ హత్యారాజకీయాలు మరోసారి తెరపైకి వచ్చాయి. చర్యలు శూన్యం బాధితులు లిఖిత పూర్వకంగా టీడీపీ నేతలపై ఫిర్యాదు చేస్తున్నా... చర్యలు తీసుకోవడంలో పోలీసులు వెనుకంజ వేస్తున్నారు. కనీసం కోర్టు విచారణకు కూడా రాకుండా అడ్డుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు. దీన్ని బట్టి చూస్తే అధికారపార్టీకి పోలీసులు ఏ స్థాయిలో కొమ్ము కాస్తున్నారో అర్థం చేçసుకోవచ్చు. కేవలం హత్యలే కాదు... దాడులు కూడా ఈ ఐదేళ్ల కాలంలో అనేకం చోటు చేసుకున్నాయి. 2016 మే 30న కనగానపల్లి మండలం కుర్లుపల్లిలో వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ నేత లు దాడి చేశారు. తీవ్రంగా గాయపడి అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నా పరిటాల మూకలు వదల్లేదు. రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త ప్రకాష్‌రెడ్డిపై కూడా దాడికి యత్నించారు. 2016 సెప్టెంబరు 2న వైఎస్సార్ వర్ధంతి రోజున కనగానపల్లి మండలం యలకుంట్లలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతలు దాడికి దిగారు. 2016 నవంబర్ 16న రాప్తాడు మండలం బండమీదపల్లిలో మంత్రి లోకేశ్ పర్యటనలో సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చించేశారనే సాకుతో యర్రగుంటలో ఓ మహిళపై టీడీపీ నేతలు దాడికి దిగారు. 2017 నవంబర్‌లో గొందిరెడ్డిపల్లిలో భూ సమస్యలతో సర్పంచ్ కుమారుడు బాబయ్య, బం ధువులపై టీడీపీ నేతలు దాడికి దిగారు. వన్న క్క అనే మహిళపై దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనల్లో అధికారపార్టీ నాయకులపై ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం. వివేకా హత్యపై భగ్గుమన్న ‘అనంత’ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఘటనపై ‘అనంత’ భగ్గుమంది. టీడీపీ హత్యారాజకీయాలను వైఎస్సార్ సీపీ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. సౌమ్యుడిగా, ప్రజానాయకుడిగా గుర్తింపు ఉన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య చేయడం దారుణమన్నారు. శనివారం జిల్లా వ్యాప్తంగా నిరసన ర్యాలీలు నిర్వహించారు. అనంతపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖరరెడ్డి అధ్యక్షతన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేతలంతా నల్ల చొక్కాలు, నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి పాల్గొని హత్యారాజకీయాలను నిరసించారు. గుంతకల్లులో పట్టణ అధ్యక్షుడు సుంకప్ప ఆధ్వ ర్యంలో నల్లబ్యాడ్జీలతో నిరసన ర్యాలీ చేశారు. హిందూపురంలో పార్లమెంట్ అధ్యక్షులు నవీన్‌నిశ్చల్, నాయకులు కొండూరు వేణుగోపాల్‌రెడ్డిల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు చేపట్టారు. పుట్టపర్తిలో నియోజకవర్గ సమన్వయకర్త దుద్దకుంట శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. రాయదుర్గంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి ఆధ్వర్యంలో శాంతిర్యాలీ నిర్వహించారు. కణేకల్లులో మండల నాయకులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. రాప్తాడు నియోజకవర్గంలో చెన్నేకొత్తపల్లిలో తోపుదుర్తి శైలజ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నిందితులను శిక్షించాలని కోరారు. టీడీపీ నేతల హత్యాకాండలు కొన్ని... 2015 ఏప్రిల్ 29: రాప్తాడు తహసీల్దార్ కార్యాలయంలోని ఆర్ఐ ఛాంబర్‌లోనే పట్టపగలు వైఎస్సార్సీపీ నేత భూమిరెడ్డి ప్రసాద్‌రెడ్డిని టీడీపీ నేతలు వేటకొడవళ్లతో అతి కిరాతకంగా నరికి చంపారు. ఈ హత్య ‘అనంత’తో పాటు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. వైఎస్సార్సీపీ శ్రేణుల్లో భయాందోళనలు కలిగించి.. పార్టీని బలహీనపరడమే లక్ష్యంగా మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరాం, టీడీపీ మండల కన్వీనర్ దగ్గుబాటి ప్రసాద్‌లు ఈ హత్య కు నిందితులను ఉసిగొల్పారని బాధితుల బంధువులు అప్పట్లో ఆరోపించారు. 2010 మార్చి 30: రాప్తాడు నియోజకవర్గం కందుకూరుకు చెందిన శివారెడ్డిని హతమార్చారు. ఈ హత్య వెనుక కూడా మంత్రి పరిటాల సునీత, ఆమె కుమారుడు పరి టాల శ్రీరామ్ హస్తం ఉందని బాధితులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. 2015 మార్చి 31: పెద్దవడుగూరు మండలం కిష్టిపాడు సింగిల్ విండో అధ్యక్షుడు విజయభాస్కర్‌రెడ్డిని కూడా టీడీపీ నేతలు పొట్టన పెట్టుకున్నారు. కార్యాలయంలో సమావేశముందని పిలిపించి మరీ దారుణంగా హత్య చేశారు. విజయభాస్కర్‌రెడ్డి, ప్రసన్నాయపల్లి ప్రసాద్‌రెడ్డి హత్య చేసేందుకు ప్రభుత్వకార్యాలయానే ఎంచుకోవడాన్ని చూస్తే టీడీపీ నాయకులు ఎంతకు బరితెగించారో అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఘటనలోనూ పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించింది. 2019 మార్చి 16: కనగానపల్లి మండలంలోని మద్దెలచెరువు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త మనేరు ఆంజనేయులు(25)ను రాత్రి దారి కాచి హత్య చేశారు. -
పరిటాల శ్రీరామ్ పేరు చెప్పి...
ధర్మవరం అర్బన్ : మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్ పేరు చెప్పి..పంచాయితీ చేస్తామని డబ్బులు తీసుకొని, తిరిగి ఇవ్వమన్నందుకు బాధితులపైనే రాళ్లు కట్టెలతో దాడి చేసిన ఘటన పట్టణంలోని చెరువు కట్టవద్ద శనివారం చోటుచేసుకుంది. పట్టణంలోని గూడ్స్‌షెడ్‌కొట్టాలకు చెందిన శంకర్, మణికంఠ అన్నదమ్ములు. శంకర్‌కు కొత్తపేటలో ఇల్లు ఉంది. ఆ ఇంటిని పూసల వెంకటరమణ అనే వ్యక్తికి రిజిష్టర్ తాకట్టు పెట్టాడు. తిరిగి తన ఇల్లు రిజిష్టర్ చేయమని అడిగితే చేయనంటూ బెదిరించారు. చిన్నూరు బత్తలపల్లికి చెందిన టీడీపీ కార్యకర్తలు మధుసూదన్‌నాయుడు, పురుషోత్తంచౌదరి తమకు పరిటాల శ్రీరామ్ బాగా తెలుసు.. మీ ఇల్లు మీకు ఇప్పిస్తామని నమ్మబలికారు. దీంతో శంకర్, అతని తమ్ముడు మణికంఠ రూ.80 వేలు ఇచ్చారు. పంచాయితీ చేయకపోవడంతో డబ్బులు వెనక్కి ఇవ్వాలని అడిగారు. దీంతో శనివారం సాయంత్రం చెరువు కట్ట వద్దకు వస్తే డబ్బులు ఇస్తామని మధుసూదన్‌నాయుడు, పురుషోత్తంచౌదరి చెప్పారు. మరోపది మందితో కలిసి రాళ్లు, కట్టెలతో దాడి చేశారు. అక్కడే ఉన్న మణికంఠ స్నేహితులు బాధితుడిని ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రూ.23 వేలు తీసుకుని పంచాయితీ చేస్తామని చెప్పి, డబ్బులు తిరిగి ఇవ్వలేదని కొత్తపేటకు చెందిన నాగేశ్వరమ్మ అనే బాధితురాలు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఘనంగా పరిటాల శ్రీరామ్ వివాహం
అనంతపురం: ఏపీ స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్ వివాహం ఆదివారం అనంతపురం జిల్లా రామగిరి మండలం వెంకటాపురంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హాజరయ్యారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా హాజరై శ్రీరామ్, జ్ఞాన దంపతులను ఆశీర్వదించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అక్కడ కలుసుకుని కరచాలనం చేసుకున్నారు. తర్వాత కేసీఆర్ వేదిక వద్దకు వచ్చి నూతన దంపతులను ఆశీర్వదించారు. -
రాజకీయ క్రీ'నీ'డ
మొన్న పరిటాల శ్రీరాం అనుచరులు...ఇప్పుడు జేసీ పవన్ కుమార్‌రెడ్డి...టీడీపీ నేతల జోక్యంతో క్రీడారంగం తరచూ వివాదాస్పదమవుతోంది. నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణంలో శ్రీరాం అస్మదీయులు తెరపైకి వస్తే....ఒలింపిక్ అసోసియేషన్ నిధులు అక్రమంగా డ్రా చేశారని జేసీ పవన్ కుమార్‌రెడ్డిపై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టులో క్రిమినల్, సివిల్ కేసులు కూడా పెట్టారు. తాజా పరిణామాలు ‘అనంత’ క్రీడారంగంలో కలకలం రేపుతున్నాయి. సాక్షిప్రతినిధి, అనంతపురం : జిల్లాలోని సాఫ్ట్‌బాల్, ఫెన్సింగ్, జూడో అసోసియేషన్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించాయి. కనీసం కోర్టులో దిగకపోయినా మ్యాచ్ ఆడినట్లు చూపి సర్టిఫికెట్ల వ్యాపారం చేశాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న సాఫ్ట్‌బాల్, ఫెన్సింగ్ రాష్ట్ర కార్యదర్శులు వెంకటేశు, మురళీకృష్ణలు పరిటాల శ్రీరాంకు అస్మదీయులుగా మెలుగుతున్నారు. శ్రీరాం అండతోనే సర్టిఫికెట్ల వ్యాపారం సాగించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సర్టిఫికెట్ల వ్యవహారంలో ప్రముఖ వ్యక్తులు హస్తం కూడా ఉన్నట్లు స్పష్టమవుతోంది. గతంలో జిల్లాలో ఎస్పీగా పనిచేసిన ఓ అధికారి కుమారుడు ఆడకపోయినా ఫెన్సింగ్ ఆడినట్లు సర్టిఫికెట్ ఇచ్చారని సమాచారం. అలాగే న్యాయశాఖలో పనిచేసే ఓ వ్యక్తి కుమారుడికి కూడా ఆడకుండానే సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలిసింది. ఎంసెట్‌లో సీటు సాధించేందుకే ఈ సర్టిఫికెట్లను ఇచ్చినట్లు తెలుస్తోంది. కొన్నేళ్లు సర్టిఫికెట్ల వ్యాపారం చేస్తుండటంతో భవిష్యత్‌లో ఏదైనా ఇబ్బంది వస్తే ఇలాంటి ప్రముఖులు అండగా ఉంటారనే కారణంతోనే ముఖ్యమైన అధికారులు, రాజకీయనేతల పిల్లలకు ఇలా సర్టిఫికెట్లను కట్టబెట్టినట్లు తెలుస్తోంది. తెరపైకి జేసీ పవన్ ఎంపీ దివాకర్‌రెడ్డి కుమారుడు జేసీ పవన్‌కుమార్‌రెడ్డి నిధులు దుర్వినియోగం చేశారని ఒలింపిక్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పురుషోత్తం సోమవారం విజయవాడలో మీడియాకు వెల్లడించారు. దీంతో పవన్ కూడా 2016లోనే వివాదాల్లోకి వచ్చారని స్పష్టమవుతోంది. గల్లా జయదేవ్, ఎంపీ సీఎం రమేశ్ ఆధ్వర్యంలో వేర్వేరుగా ఒలింపిక్ అసోసియేషన్లు ఉన్నాయి. ఇందులో సీఎం రమేశ్ వర్గంలో జిల్లా అధ్యక్షునిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జేసీ పవన్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. గల్లా జయదేవ్ వర్గంలో పరిటాల శ్రీరాం జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు. ఒలింపిక్ అసోసియేషన్ వివాదాల్లో ఉన్న సమయంలో అసోసియేషన్‌కు సంబంధించి పలు బ్యాంకు అకౌంట్లను పురుషోత్తం వర్గం ఫ్రీజ్ చేసింది. అయితే 2016 జూన్ 9న ఫ్రీజ్ చేసిన అకౌంట్ల నుంచి రూ.18 లక్షలు డ్రా చేశారని జేసీ పవన్, సీఎం రమేశ్‌తో పాటు జీసీ రావు అనే మరో వ్యక్తిపై హైదరాబాద్‌లోని సైఫాబాద్ పోలీసుస్టేషన్లో అప్పట్లో ఫిర్యాదు చేశారు. దీంతో పాటు కోర్టులో కూడా సివిల్, క్రిమినల్ కేసు దాఖలు చేశారు. ‘అనంత’ పరువుకు భంగం సర్టిఫికెట్ల కుంభకోణం, నిధుల దుర్వినియోగం లాంటి అంశాలు తెరపైకి రావడం, ఇందులో ‘అనంత’ వాసులే ఉండటంతో జిల్లాతో పాటు రాష్ట్రస్థాయిలో అనంత పరువుకు భంగం వాటిల్లుతోంది. క్రీడలతో సంబంధం లేని వ్యక్తులు, ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తులు అసోసియేషన్లలోకి ప్రవేశించి శాసిస్తుండటంతోనే ఇలాంటి అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని మాజీ క్రీడాకారులు అంటున్నారు. ఫెన్సింగ్, జూడో, సాఫ్ట్‌బాల్, క్రికెట్‌తో పాటు చాలా క్రీడల్లో అవకతవకలు జరుగుతున్నాయని, ఇప్పుడు తెరపైకి వచ్చినవేకాకుండా...ఇంకా అంశాలు చాలా ఉన్నాయని, ప్రభుత్వం జోక్యం చేసుకుని వీటిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. క్రీడారంగంలో లేనివారికి అసోసియేషన్‌లో చోటు కల్పించకుండా నిషేధం విధించి, మాజీ క్రీడాకారులకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు -
ధర్మవరంలో ఉద్రిక్తత
⇒ మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యే సూరి వర్గాల బాహాబాహీ ⇒ ఇరు వర్గాల మధ్య రాళ్ల వర్షం.. పోలీసు జీపు అద్దాలు ధ్వంసం ధర్మవరం: అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు కారణంగా ధర్మవరం పట్టణంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ధర్మవరం పట్టణంలోని తారకరామాపురం సబ్‌స్టేషన్ వద్ద పరిటాల వర్గీయులు పవన విద్యుత్ కేబుల్ పనులు చేస్తున్నారు. కనగానపల్లి మండలం తల్లిమడుగుల గ్రామం వద్దనున్న గాలిమరల నుంచి ఉత్పన్నమయ్యే పవన విద్యుత్ (విండ్ పవర్)ను ధర్మవరం 220/122/33 సబ్‌స్టేషన్‌కు పంపేందుకు సరయు కంపెనీ టెండర్ సబ్‌కాంట్రాక్టు తీసుకుని ఈ పనులు చేస్తున్నారు.అనుమతులు లేకుండా పనులు చేస్తున్నారని, వాటిని ఆపివేయాలని ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి వర్గీయులు పరిటాల వర్గీయులకు సూచించారు. ఆ మాటలను ఖాతరు చేయకుండా శుక్రవారం చిగిచెర్ల రోడ్డు వద్ద పనులు కొనసాగించారు. ఈ క్రమంలో చిగిచెర్ల రోడ్డు విస్తరణ పనులను ఎమ్మెల్యే సూరికి చెందిన నితిన్‌సాయి కన్స్ట్రక్ష న్స్ చేస్తోంది. ఈ పనులను పరిశీలించడానికి వచ్చిన ఎమ్మెల్యే కేబుల్ పనులు చేస్తున్న వారిని పిలిచి మందలించి వెళ్లిపోయారు. అయినా వారు పనులు ఆపకపోవడంతో ఆర్అండ్బి, ట్రాన్స్‌కో, పోలీసులకు ఆయన ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో పట్టణ సీఐ హరినాథ్ అక్కడికి వెళ్లి పనులు చేస్తున్న పరిటాల వర్గీయులను అడ్డుకున్నారు. తోపులాట.. రాళ్ల దాడి..: మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరాం.. రామగిరి, చెన్నేకొత్తపల్లి నుంచి సుమారు 200 మంది అనుచరులను «ధర్మవరానికి పంపారు. అప్పటికే సూరి వర్గీయులు అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట, రాళ్లు రువ్వుకోవడం జరిగింది. అనంతపురం నుంచి వచ్చిన స్పెషల్ పార్టీ పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ క్రమంలో పోలీసు వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎమ్మెల్యే సూరి అనుచరులు దాదాపు 15 మంది గాయపడ్డారు. జరిగిన ఘటనపై ఎమ్మెల్యే వరదాపురం సూరి ఎస్పీ రాజశేఖరబాబుకు ఫిర్యాదు చేశారు.