అనంతపురం: ఎన్నికల్లో ప్రజలు పరిటాల కుటుంబాన్ని ఓట్ల రూపంలో తిరస్కరించినా.. వారి అనుచరుల దౌర్జన్యాలు, బెదిరింపులకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. తాజాగా రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలం గుంతపల్లికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త చాకలి ప్రతాప్‌ను పరిటాల శ్రీరామ్ అనుచరులు బెదిరించిన ఆడియో టేపులు హల్‌చల్ చేస్తున్నాయి. మీ ఇంటి ముందు బాంబులేస్తాం. మీ ఊరిలోనే నిన్ను అడ్డంపెట్టి నరుకుతామంటూ శ్రీరామ్ అనుచరుడు భానుకోటకు చెందిన బాలా అమర్‌నాథ్ యాదవ్ బెదిరించారు. గుంతపల్లికి చెందిన వినోద్‌కుమార్ యాదవ్, అక్కులప్ప, భానుకోటకు చెందిన రవితేజతో కలిసి అమర్‌నాథ్ బెదిరిస్తున్నాడని బాధితుడు వాపోతున్నాడు.
ఫోన్‌లో బెదిరింపుల వివరాలు ఇలా...
‘రే పూ.. నేను కాలువ వద్ద ఉన్నాను. నీ బలగం ఎంతుందో అందర్నీ పిలుచుకురా తేల్చుకుందాం. తోటలో బోర్లు వేయించుకున్నావు, అక్కడ నీ డ్రిప్ పైపులు, బోరును ధ్వంసం చేస్తా. ఎవరనుకుంటున్నావ్ రా నన్ను. ఇంటికాటికి వచ్చి చంపుతా లం.. కొడకా. మేము అనుకుంటే నిన్ను తగరకుంటలోనైనా చంపుతాం. ఇద్దరు బిడ్డలున్నారు బతకాలని ఉందా లేదారా? నా కొడకా. బట్టలు ఉతికేదాంట్లో వేస్తాం. ఈడ్చిఈడ్చి కొడతాం. మడసంగా ఉంటే ఉండు, లేదంటే నువ్వు దొరికినావంటే చంపుతాం రే. మాకు పోలీసులు, లాయర్లున్నారు. అడ్డంపెట్టి నరుకుతాం. మొన్న వచ్చినాం కొట్టేందుకు, ఏమంటే మీరు అక్కడ లేరు. కానిస్టేబుల్ కూడా వద్దని చెప్పాడు. ఎక్స్‌ట్రాలు దెం...నారో ఐదేళ్లే మీ ప్రభుత్వం. తర్వాత నిన్నే ఫస్టు చంపేది. నాకు పెళ్లికూడా కాలేదు. మాట చెబుతున్నా చూడు కచ్చితంగా బాంబులేసి చంపుతా. మీరు భానుకోట బోయొళ్లకు చెప్పినా వారంతా నా ఫ్రెండ్సే. కిట్టప్ప కొడుకులు, ఎవరైనా సరే అందరూ నాకు తెలిసినోళ్లే’ నంటూ బెదిరించడం కలకలం రేపుతోంది.
ఫిర్యాదు చేసినా పట్టించుకోని పోలీసులు
రెండు రోజుల కిందట బాధితుడు చాకలి ప్రతాప్ కనగానపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. బెదిరింపు టేపులు, బెదిరించిన వారి వివరాలు అందజేసినా కేసుకూడా కట్టలేదు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ మండల నాయకులు పోలీసులతో మాట్లాడగా.. బెదిరింపులకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చారు. ఆడియో టేపులతోసహా ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, పైగా తమపైనే బైండోవర్ కేసు నమోదు చేశారని బాధితుడి సోదరుడు చాకలి నరసింహులు వాపోయాడు.
కేసు నమోదు చేస్తాం: ఎస్‌ఐ వేణుగోపాల్
బాధితుడి ఫిర్యాదు తీసుకున్నాం. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. బాధితుడి సోదరుడితో మాట్లాడాను తప్ప బైండోవర్ కేసు పెట్టలేదు. విచారించి నిందితులపై కేసు నమోదు చేస్తాం.
రేయ్.. అడ్డంగా నరుకుతాం
Published Tue, Jun 4 2019 7:28 AM | Last Updated on Tue, Jun 4 2019 12:03 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment