
సాక్షి, అనంతపురం: వైఎస్సార్‌సీపీ ఏపీ రాజకీయాల్లో పెనుమార్పులు తెచ్చిందని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుళ్లిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చే శక్తి వైఎస్సార్‌సీపీకే ఉందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విలువలు,విశ్వసనీయతకు పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. ‘ఇచ్చిన మాటకు కట్టుబడే నైజం సీఎం వైఎస్ జగన్‌ది.. హామీలన్నీ నెరవేర్చిన ఘనత ఆయనదేనని’ తెలిపారు. అక్రమ కేసులకు భయపడేదిలేదని అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు.