ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మణికంఠ
ధర్మవరం అర్బన్ : మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్ పేరు చెప్పి..పంచాయితీ చేస్తామని డబ్బులు తీసుకొని, తిరిగి ఇవ్వమన్నందుకు బాధితులపైనే రాళ్లు కట్టెలతో దాడి చేసిన ఘటన పట్టణంలోని చెరువు కట్టవద్ద శనివారం చోటుచేసుకుంది. పట్టణంలోని గూడ్స్‌షెడ్‌కొట్టాలకు చెందిన శంకర్, మణికంఠ అన్నదమ్ములు. శంకర్‌కు కొత్తపేటలో ఇల్లు ఉంది. ఆ ఇంటిని పూసల వెంకటరమణ అనే వ్యక్తికి రిజిష్టర్ తాకట్టు పెట్టాడు. తిరిగి తన ఇల్లు రిజిష్టర్ చేయమని అడిగితే చేయనంటూ బెదిరించారు. చిన్నూరు బత్తలపల్లికి చెందిన టీడీపీ కార్యకర్తలు మధుసూదన్‌నాయుడు, పురుషోత్తంచౌదరి తమకు పరిటాల శ్రీరామ్ బాగా తెలుసు.. మీ ఇల్లు మీకు ఇప్పిస్తామని నమ్మబలికారు. దీంతో శంకర్, అతని తమ్ముడు మణికంఠ రూ.80 వేలు ఇచ్చారు. పంచాయితీ చేయకపోవడంతో డబ్బులు వెనక్కి ఇవ్వాలని అడిగారు.
దీంతో శనివారం సాయంత్రం చెరువు కట్ట వద్దకు వస్తే డబ్బులు ఇస్తామని మధుసూదన్‌నాయుడు, పురుషోత్తంచౌదరి చెప్పారు. మరోపది మందితో కలిసి రాళ్లు, కట్టెలతో దాడి చేశారు. అక్కడే ఉన్న మణికంఠ స్నేహితులు బాధితుడిని ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రూ.23 వేలు తీసుకుని పంచాయితీ చేస్తామని చెప్పి, డబ్బులు తిరిగి ఇవ్వలేదని కొత్తపేటకు చెందిన నాగేశ్వరమ్మ అనే బాధితురాలు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment