sake krishna
-
వైఎస్సార్సీపీ కార్యకర్త హత్య కేసులో సాకే బాలకృష్ణ అరెస్ట్!
అనంతపురం, సాక్షి : వైఎస్సార్సీపీ కార్యకర్త కందుకూరు శివారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు సాకే బాలకృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. శివారెడ్డి హత్య కేసులో మాజీ మంత్రి పరిటాల సునీత అనుచరులు, వారి కుటుంబ సభ్యులపై గతంలో కేసు నమోదయ్యింది. అయితే గత కొన్ని నెలలుగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకొని తిరుగుతున్న ప్రధాన నిందితుడు, పరిటాల సునీత వర్గీయుడు సాకే బాలకృష్ణను సోమవారం బెంగళూరులో పోలీసులు అరెస్ట్ చేశారు. మొహరం పండుగ సందర్భంగా కందుకూరులో జరిగిన గొడవను ఆసరాగా చేసుకొని... ద్విచక్ర వాహనంపై వెళ్తున్న శివారెడ్డి గత ఏడాది దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ద్విచక్ర వాహనంపై ఇటుకుల పల్లి నుంచి కందుకూరు వెళుతున్న అతడిని... దుండగులు కాపుకాసి వేట కొడవళ్లతో నరికి చంపారు. చదవండి: అట్టుడికిన అనంత హత్యకు గురైన వైఎస్సార్ సీపీ కార్యకర్త శివారెడ్డి (ఫైల్ ఫోటో) -
అలిపిరి కేసు; మాజీ మావోయిస్టుకు విముక్తి
తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అలిపిరి వద్ద జరిగిన 2003 అక్టోబర్ 1న జరిగిన దాడి కేసులో కోర్టు తుదితీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మావోయిస్టు దామోదరం అలియాస్ సాకేకృష్ణను కోర్టు నిర్దోషిగా పేర్కొంది. ప్రాసిక్యూషన్ సరైన సాక్ష్యాధారాలు చూపించకపోవడంతో అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ తిరుపతి అదనపు సీనియర్ సివిల్ జడ్జి సందానందమూర్తి మంగళవారం తీర్పు వెలువరించారు. ఈ కేసులో 25వ నిందితుడిగా అభియోగాలు ఎదురొన్న దామోదరంను తిరుపతి టూటౌన్ పోలీసులు బెంగళూరులో 2014లో అరెస్ట్ చేశారు. ప్రాసిక్యూషన్ తరపున 52 మంది సాక్ష్యులు కోర్టులో సాక్ష్యం ఇచ్చారు. కేసులో 14వ సాక్షిగా ఉన్న సీఎం చంద్రబాబు, 13వ సాక్షిగా ఉన్న మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సాక్ష్యం చెప్పాలని కోర్టు సమన్లు పంపినా వారు కోర్టుకు హాజరు కాలేదు. దీంతో న్యాయమూర్తి ఆ ఇద్దరి సాక్ష్యాలను క్లోజ్ చేస్తూ ఇదివరకే ఉత్తర్వులు జారీ చేశారు. -
ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా ఖైదీ నిరశన
రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు ఎన్కౌంటర్ల పేరుతో ఒకేరోజు 25 మందిని హతమార్చడాన్ని మావోయిస్టు ఖైదీ సాకే కృష్ణ గర్హించారు. కడప సెంట్రల్ జైలులో ఉన్న ఆయన.. శేషాచలం, ఆలేరు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా మంగళవారం రాత్రి నుంచి నిరశన చేపడుతున్నట్లు జైలు సూపరింటెండెంట్ గోవిందరాజులుకు సమాచారం ఇచ్చారు. ఇదే విషయాన్ని జైలర్ మీడియాకు చెప్పారు. 2003లో అలిపిరి వద్ద నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై దాడి కేసులో సాకే కృష్ణ నిదితుడు.