తిరుపతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అలిపిరి వద్ద జరిగిన 2003 అక్టోబర్ 1న జరిగిన దాడి కేసులో కోర్టు తుదితీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ మావోయిస్టు దామోదరం అలియాస్ సాకేకృష్ణను కోర్టు నిర్దోషిగా పేర్కొంది. ప్రాసిక్యూషన్ సరైన సాక్ష్యాధారాలు చూపించకపోవడంతో అతడిని నిర్దోషిగా ప్రకటిస్తూ తిరుపతి అదనపు సీనియర్ సివిల్ జడ్జి సందానందమూర్తి మంగళవారం తీర్పు వెలువరించారు.
ఈ కేసులో 25వ నిందితుడిగా అభియోగాలు ఎదురొన్న దామోదరంను తిరుపతి టూటౌన్ పోలీసులు బెంగళూరులో 2014లో అరెస్ట్ చేశారు. ప్రాసిక్యూషన్ తరపున 52 మంది సాక్ష్యులు కోర్టులో సాక్ష్యం ఇచ్చారు. కేసులో 14వ సాక్షిగా ఉన్న సీఎం చంద్రబాబు, 13వ సాక్షిగా ఉన్న మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సాక్ష్యం చెప్పాలని కోర్టు సమన్లు పంపినా వారు కోర్టుకు హాజరు కాలేదు. దీంతో న్యాయమూర్తి ఆ ఇద్దరి సాక్ష్యాలను క్లోజ్ చేస్తూ ఇదివరకే ఉత్తర్వులు జారీ చేశారు.
అలిపిరి కేసు; మాజీ మావోయిస్టుకు విముక్తి
Published Tue, Mar 8 2016 3:51 PM | Last Updated on Fri, Aug 17 2018 7:54 PM
Advertisement
Advertisement