తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక జైన్ క్షమాపణలు చెప్పింది. కొద్దిరోజుల క్రితం బుల్లితెర నటుడు శివకుమార్, ప్రయాంక ఇద్దరూ తిరుమలకు వెళ్లారు. అలిపిరి నడక మార్గం ద్వారా కొండపైకి వెళ్లే క్రమంలో ఏడో మైలురాయి వద్ద చిరుతపులి కనిపించింటూ ఇద్దరూ కలిసి ఒక ప్రాంక్ వీడియో తీయడం ఆపై తమ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. శ్రీవారి దర్శనం కోసం నడక మార్గంలో వెళ్తుండగా చిరుత పులి దాడి అంటూ వీడియో అప్‌లోడ్ చేశారు. అయితే, అది భక్తులను భయాందోళలకు గురి చేసేలా ఉండటంతో చాలామంది నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో వారిద్దరిపై చర్యలు తీసుకునేందుకు కూడా టీటీడీ సిద్ధమైంది. ఈ క్రమంలో వారిద్దరూ క్షమాపణలు చెప్పారు.
'మేము షేర్ చేసిన వీడియోపై చాలామంది శ్రీవారి భక్తులు అభ్యంతరం తెలిపారు. మేము తెలియకనే ఈ తప్పు చేశాం. మీ మనోభావాలను గాయపరిచినట్లయితే మీలో ప్రతి ఒక్కరికి క్షమాపణలు చెబుతున్నాము. ఉద్దేశపూర్వకంగా అయితే వీడియో చేయలేదు. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్ కోసం మాత్రమే చేశాం. అయితే, ఇలా అవుతుంది అని మేము ఏమాత్రం ఊహించలేదు. ఇంతమందిని ఈ వీడియో హర్ట్ చేస్తుంది అంటే అసలు చేసేవాళ్లమే కాదు.
తిరుమల దేవస్థానం ప్రతిష్టను మేము తక్కువ చేయాలని అనుకోలేదు. భక్తులలో భయం కలగేలా చేసి వారి మనోభావాలను కించపరిచేలా వంటి పొరపాట్లు మేము చేయం. తెలియకుండా జరిగిన ఈ తప్పును మీరందరూ క్షమిస్తారని ఆశిస్తున్నాం. మమ్మల్ని విశ్వసించండి. మరోసారి ఈ తప్పు జరగదు.' అని వారు ఒక వీడియోతో పంచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment