
సౌత్ ఇండియా పాపులర్ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj) మరోసారి ఏపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఆయన పలుమార్లు పవన్ రాజకీయ తీరుపై విమర్శలు చేసిని విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట మరింతగా వైరల్ అవుతున్నాయి.
పవన్ కల్యాణ్ కొద్దిరోజుల క్రితం సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేస్తానన్నారు కదా దానిపై మీ అభిప్రాయం చెప్పండి అంటూ ప్రకాశ్‌రాజ్‌ను కోరారు. అందుకు ఆయన ఇలా సమాధానం ఇచ్చారు. ' సనాతన ధర్మాన్ని కాపాడడానికి పవన్ ఎవరు..? అతనికి ఎలాంటి అర్హతలు ఉన్నాయో చెప్పాలి. అధికారంలో లేనప్పుడు ప్రజా సమస్యల గురించి పవన్ మట్లాడారు. కానీ, ఎప్పుడైతే ఎన్నికల్లో గెలుపొందారో వాటిని పక్కన పెట్టేశారు. రాష్ట్రంలో నిరుద్యోగత ఉంది. విపరీతమైన అవినీతితో నిండిపోయింది. ఎక్కడ చూసిన కూడా లంచాలే కనిపిస్తున్నాయి. ఆడబిడ్డల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. చాలాచోట్ల రోడ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించకుండా సెడెన్‌గా తను కాస్ట్యూమ్స్ మార్చేసి ఇలా సమయం ఎందుకు వృథా చేస్తున్నారు..? ఇలా రకరకాలుగా దుస్తులు మార్చేసి మాట్లాడటానికి ఇదేం సినిమా కాదు. అసలు అతను ఏపీ డిప్యూటీ సీఎం అని చెప్పడానికి నేను చాలా అన్ కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నాను. డెమోక్రసీలో అపోజిషన్ అనేది లేకుంటే ఎలా..? ప్రజల పక్షాన నిలబడి వారిని ఎవరు ప్రశ్నించాలి..?' అని ప్రకాశ్‌రాజ్ అన్నారు.

తిరుమల లడ్డూ వివాదంపై ప్రకాశ్ రాజ్
అదే ఇంటర్వ్యూలో ఆయన తిరుమల లడ్డూ వివాదం గురించి కూడా ఇలా మాట్లాడారు. 'సనాతన ధర్మానికి నేను వ్యతిరేకం కాదు. చాలా సున్నితమైన అంశాన్ని రాజకీయం చేస్తున్నారు. కోట్లమంది భక్తుల మనోభావాలకు సంబంధించించిన తిరుమల లడ్డూపై ఎవరైనా మాట్లాడే సమయంలో సరైన ఆధారాలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అలా కాకుండా నోటికొచ్చినట్లు మాట్లాడటం ఏంతమాత్రం కరెక్ట్ కాదు. లడ్డూ తయారీలో కల్తీ జరిగింటే అందుకు కారణమైన వారిని డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న మీరు కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోండి.' అంటూ ఆయన సూచించారు.
He has no vision. I'm feeling very uncomfortable with him being the Deputy Chief Minister.
- @prakashraaj about @PawanKalyan #PawanKalyan #SanatanaDharmaRakshanaBoard pic.twitter.com/AjZJWO77Ec— Telugu Chitraalu (@TeluguChitraalu) April 2, 2025