తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్ చేశారు. ఈ విషయంలో సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి మొట్టికాయలు పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి ట్వీట్ చేసిన ప్రకాశ్ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
'కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ కదా ?. … ఇక చాలు… ప్రజల కోసం చెయ్యవలసిన పనులు చూడండి' అంటూ తెలుగులో ట్వీట్ చేశారు. కాగా.. ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తిరుమల లడ్డు విషయంలో దీక్షలు చేస్తానంటూ మీడియా ముందుకొచ్చి మరీ ప్రకటించారు. లడ్డూ ప్రసాదం వివాదం గురించి ఇప్పటికే పవన్ కల్యాణ్‌కు ప్రకాశ్ రాజ్ పలుసార్లు కౌంటరిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సుప్రీం వ్యాఖ్యలతో మరోసారి పవన్‌కు తనదైన శైలిలో చురకలంటించారు.
(ఇది చదవండి: 'జస్ట్ ఆస్కింగ్' అంటూ మరోసారి ట్వీట్ చేసిన ప్రకాశ్ రాజ్)
సోమవారం సుప్రీం కోర్టులో లడ్డు అంశంపై విచారణ జరిగింది. దేశ ప్రజలు ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను సుప్రీం కోర్టు తీవ్రంగా పరిగణించింది. లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలున్నాయా..? అంటూ కోర్టు ప్రశ్నించింది. కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరంగా ఉంచాలంటూ హెచ్చరించింది. సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై వెంటనే నటుడు ప్రకాశ్ రాజ్ రియాక్ట్ అయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోటోలు షేర్ చేస్తూ.. 'దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి' అంటూ పోస్ట్ చేశారు.
కొత్త భక్తుడికి పంగనామాలెక్కువ ! .. కదా ?. … ఇక చాలు… ప్రజల కోసం చెయ్యవలసిన పనులు చూడండి … Enough is Enough .. Now will you please focus on what is important to the Citizens.. #justasking
— Prakash Raj (@prakashraaj) October 1, 2024
Comments
Please login to add a commentAdd a comment