పవన్‌ తిరుమల పర్యటన.. పూనమ్‌ ట్వీట్‌ వైరల్‌ | Poonam Kaur Tweet On Pawan Kalyan | Sakshi
Sakshi News home page

పవన్‌ కల్యాణ్‌ తిరుమల పర్యటన.. పూనమ్‌ ట్వీట్‌ వైరల్‌

Published Wed, Oct 2 2024 2:59 PM | Last Updated on Wed, Oct 2 2024 4:01 PM

Poonam Kaur Tweet On Pawan Kalyan

హీరోయిన్ పూనమ్ కౌర్ గురించి టాలీవుడ్‌ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు సినిమాల్లో నటించకపోయినా.. సోషల్‌ మీడియా ద్వార నిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటునే..సమాజంలో జరుగుతున్న సంఘటనలపై తన అభిప్రాయాన్ని ధైర్యంగా తెలియజేస్తుంది. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, డైరెక్టర్‌ త్రివిక్రమ్‌లపై ఆమె పెట్టే పోస్టులు వైరల్‌ అవుతుంటాయి. వారిద్దరిని విమర్శిస్తూ గత కొన్నాళ్లుగా ఆమె ట్వీట్స్‌ చేస్తోంది. కొన్ని ప్రత్యేక్షంగా, మరికొన్ని సార్లు పరోక్షంగా ట్వీట్లు చేస్తూ తనకు జరిగిన అన్యాయాన్ని గుర్తు చేస్తుంటుంది. పవన్‌ కల్యాణ్‌పై ఆమె చేసిన ట్వీట్లు గతంలో దుమారం రేపాయి. తాజాగా మరోసారి పవన్‌ని విమర్శిస్తూ ట్వీట్‌ చేసింది పూనమ్‌.  

నిబంధనలకు విరుద్ధంగా పవన్‌ పర్యటన
డిప్యూటీ సీఎం పనన్‌ కల్యాణ్‌ తన చిన్న కుమార్తె పొలెనా అంజనకి తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్‌ ఇచ్చారు. అనంతరం ఇద్దరు కూతుళ్లతో కలిసి మహాద్వార ప్రవేశం చేశారు. వాస్తవానికి భార్యకు మాత్రమే మహా ద్వార ప్రవేశం ఉంటుంది. కానీ నిబంధనలకు విరుద్దంగా పవన్‌ కల్యాణ్‌ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి మహాద్వార ప్రవేశం చేశారు. అలాగే నిషేదంలో ఉన్న వావనాలను కొండపైకి అనుమతి ఇస్తూ అధికారులు కూడా అత్యుత్సాహం ప్రదర్శించారు. డిప్యూటీ సీఎం హాదాలో తిరుమలకు వచ్చిన పవన్‌కు సీఎం స్థాయిలో ప్రోటోకాల్ కల్పించడంపై భక్తులు విమర్శలు గుప్పిస్తున్నారు.

(చదవండి: టీటీడీ నిబంధనలు తుంగలో తొక్కేసిన పవన్‌..)

ప్రతి ఒక్కరికి కూతురు ముఖ్యమే: పూనమ్‌ కౌర్‌
పవన్ తిరుమల పర్యటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిప్యూటీ సీఎం దర్శనం కోసం సాధారణ భక్తులను గంటల కొద్ది క్యూలో నిలబెట్టడం సరికాదంటున్నారు నెటిజన్స్‌. పవన్‌ ఆశిస్సుల కోసం అధికారులు అత్యత్సాహం ప్రదర్శించారని విమర్శిస్తున్నారు. మరోవైపు కూతుళ్లతో కూడా రాజకీయం చేస్తున్నాడని నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. ఇక పవన్‌పై తరచు విమర్శలు చేసే పూనమ్‌ కౌర్‌ కూడా పరోక్షంగా తిరుమల పర్యటనను తప్పుపట్టింది. ఇద్దరు కూతుళ్లతో కలిసి పవన్‌ తిరుమల పర్యటన చేసిన నేపథ్యంలో ‘ప్రతి ఒక్కరికి కుమార్తె  ముఖ్యమే’ అంటూ పూనమ్‌ తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించే పూనమ్‌ ఈ ట్వీట్‌ చేసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌ అవుతుంది. పవన్‌ తన రాజకీయ ప్రయోజనాలకు కోసం కూతుళ్లను కూడా వాడుకుంటాడని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement