ఉన్నతాధికారుల వేధింపులతో ఫైర్ స్టేషన్ సిబ్బంది ఒకరు బలవన్మరణానికి పాల్పడ్డారు.
ఉన్నతాధికారుల వేధింపులతో ఫైర్ స్టేషన్ సిబ్బంది ఒకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. గౌలిగూడలోని ఫైర్ స్టేషన్‌లో పనిచేస్తున్న శివారెడ్డి శుక్రవారం తన రూంలో ఉరి వేసుకుని, చనిపోయారు. తన మరణానికి ఫైర్ ఆఫీసర్ జె.రాజ్‌కుమార్ వేధింపులే కారణమంటూ రాసిన మూడు పేజీల సూసైడ్ నోట్ ఆయన వద్ద లభించింది. ఈ మేరకు ముషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం అనంతరం శివారెడ్డి స్వగ్రామం మెదక్ జిల్లా సదాశివపేటకు తరలించారు.