
శివారెడ్డి, జాష్ణిని, వనితా రెడ్డి లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘రెంట్’. రఘువర్ధన్ రెడ్డి దర్శకత్వంలో ‘బలగం’ జగదీష్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలవుతోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి అతిథిగా వచ్చిన నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘రెంట్’ సినిమా ట్రైలర్ చాలా బాగుంది’’ అన్నారు.
‘‘చాలా రోజుల తర్వాత నేను హీరోగా చేసిన చిత్రం ‘రెంట్’. ఇందులో థ్రిల్లింగ్ కథ, కామెడీ, యాక్షన్, సందేశం ఉన్నాయి’’ అన్నారు శివారెడ్డి. ‘‘నాకు మంచి పాత్ర ఇచ్చిన దర్శక–నిర్మాతలకు థ్యాంక్స్’’ అన్నారు వనితా రెడ్డి.