‘గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీ ఊసందక నాప్రాణం... నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కబురందక నా లోకం...’’ అంటూ భావోద్వేగంతో సాగుతుంది ‘బుజ్జి త.ల్లీ..’ పాట. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన తాజా ప్రేమకథా చిత్రం ‘తండేల్’.
చందు మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాలోని ‘బుజ్జి తల్లీ...’ పాట వీడియోను శనివారం విడుదల చేశారు. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటను జావేద్ అలీ పాడారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ‘తండేల్’ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment