
ప్రభాస్.. ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ వన్ హీరో. అందులో నో డౌట్. ఆయన ప్లాప్ సినిమా కూడా దాదాపు రూ.500 కోట్లు కలెక్షన్స్‌ని రాబడుతున్నాయి. ఇక హిట్ టాక్ వస్తే ఎలా ఉంటుందో ‘కల్కి’ సినిమానే చెప్పింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.1180 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అంతేకాదు గతంలో బాలీవుడ్ హీరోల ఖాతాలో ఉన్న రికార్డులన్నీ బద్దలు కొట్టాడు ప్రభాస్. దీంతో ప్రభాస్‌తో పాటు దక్షిణాది హీరోలపై బాలీవుడ్‌లో అసూయ పెరిగింది. సౌత్ సినిమాలు, హీరోలపై నెగెటివ్ కామెంట్స్ చేయడం ప్రారంభించారు. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు. ఆయనతో పాటు దక్షిణాది దర్శకులపై కూడా అక్కసు వెల్లగక్కుతున్నారు. తాజాగా అలాంటి వీడియోనే ఇప్పుడు నెట్టింట వైరల్ అయింది.
అంతా ఫేకేనా?
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ (prabhas) హీరోగా నటించిన చిత్రం ‘కల్కి’(Kalki 2898 AD). అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె కీలక పాత్రలు పోషించారు. గతేడాదిలో రిలీజైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఈ మూవీలోని యాక్షన్ సీక్వెన్స్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా అమితాబ్, ప్రభాస్‌ల మధ్య జరిగే ఫైట్ సీన్‌కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అయితే దీనికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఈ సినిమాలో ప్రభాస్ చేసిన యాక్షన్స్ సీన్స్ అన్ని ఫేకే అని ట్రోల్ చేస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్ కోసం బాడీ డబుల్స్, డీప్ ఫేక్ టెక్నాలజీని వాడినట్లు వీడియోలు చూపించారు. ప్రభాస్‌ని వాడుకోవడంలో నాగ్ అశ్విన్, ప్రశాంత్ నీల్ ముందు వరుసలో ఉంటారని, ఆయన క్లోజ్ షాట్స్ తీసుకొని 80 శాతం షూటింగ్ డూప్‌లతోనే కానిస్తారంటూ కామెంట్ చేస్తున్నారు.
(చదవండి: వేలంలోయువతి కన్యత్వం.. రూ.18 కోట్లకు కొనుగోలు చేసిన హీరో!)
ప్రభాస్ ఒక్కడే కాదుగా..
యాక్షన్ సీక్వెన్స్‌కి డూప్‌ని వాడడం ఇండస్ట్రీలో కామన్. స్టార్ హీరోలలో చాలా వరకు యాక్షన్ సీన్లను డూప్‌తోనే కానిస్తారు. ఈ కల్చర్ బాలీవుడ్ నుంచే మొదలైంది. షారుఖ్, సల్మాన్‌తో పాటు స్టార్ హీరోలంతా తమ సినిమాల్లోని యాక్షన్ సీన్లకు బాడీ డబుల్స్‌ని వాడుతారు. ప్రభాస్ కూడా అదే పని చేశాడు. తన సినిమాల్లో బాడీ డబుల్స్‌ని వాడుతుంటారు. కల్కిలోనూ వాడినట్లు తెలుస్తోంది. ట్రోల్ చేస్తున్న వీడియో ఎంతవరకు వాస్తవమో తెలియదు కానీ.. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం తీవ్రంగా మండిపడుతున్నారు. తమ హీరోపై అసూయతోనే ఇలాంటి పనులు చేస్తున్నారంటూ కామెంట్ చేస్తున్నారు. ‘షారుఖ్, సల్మాన్‌లు అయితే క్లోజ్ షాట్స్ కూడా బాడీ డబుల్స్‌తోనే చేయిస్తారు’, యాక్షన్ సీన్లకు ప్రభాస్ ఒక్కడే కాదు.. ఎవరైనా డూప్‌నే’ అంటూ కామెంట్ చేస్తున్నారు.
చదవండి: ‘దిల్ రూబా’ మూవీ రివ్యూ
క్షమాపలు చెప్పిన సురేఖవాణి కూతురు సుప్రీత.. ఎందుకంటే?
Comments
Please login to add a commentAdd a comment