ప్రభాస్‌ను ఇలా ఎప్పుడు చూడలేదు: కల్కిపై ఆర్జీవీ కామెంట్స్ Tollywood Director Ram Gopal Varma Comments On Kalki Movie | Sakshi
Sakshi News home page

Ram Gopal Varma: ఆయన వందరెట్లు ఎక్కువగా నటించారు: ఆర్జీవీ ట్వీట్ వైరల్

Published Thu, Jun 27 2024 7:50 PM | Last Updated on Thu, Jun 27 2024 7:59 PM

Tollywood Director Ram Gopal Varma Comments On Kalki Movie

రెబల్ స్టార్‌  ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్‌ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం 'కల్కి 2898 ఏడీ'. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ఈ సినిమాకు మొదటి రోజే పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. కల్కి అద్భుతంగా ఉందంటూ ఫ్యాన్స్‌తో పాటు ఆడియన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. దాదాపు రూ.600 కోట్లతో వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్‌ ఈ మూవీని నిర్మించారు. గురువారం ఉదయం నుంచే థియేటర్లలో కల్కి సందడి మొదలైంది. దీంతో ప్రభాస్ సక్సెస్‌ను థియేటర్ల వద్ద ఫ్యాన్స్‌ సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు.

తాజాగా ఈ మూవీపై సంచలన డైరెక్టర్‌ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ను కొనియాడారు. నీ ఆశయం, ఊహలకు నా అభినందనలు. ఇందులో అమితాబ్‌ బచ్చన్‌ వందరెట్లు ఎక్కువగా కనిపించారు. ప్రభాస్‌ను ఇంతకు ముందెప్పుడు ఇలాంటి లుక్‌లో చూడలేదు. అదేవిధంగా తొలిసారి నాకు నటించేందుకు అవకాశమిచ్చినందుకు ధన్యవాదాలు' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఇవాళ రిలీజైన కల్కి చిత్రంలో ఆర్జీవీ అతిథి పాత్రలో కనిపించారు. అంతే కాకుండా విజయ్‌ దేవరకొండ, మృణాళ్‌ ఠాకూర్‌, దుల్కర్‌ సల్మాన్‌ స్టార్స్ సైతం ఈ సినిమాలో మెరిశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement