ప్రభాస్‌కు అది రోటీన్‌.. కానీ నాకు మాత్రం.. అమితాబ్ ఆసక్తికర కామెంట్స్! | Amitabh Bachchan Comments On Prabhas Kalki Collects Rs 1000 Cr | Sakshi
Sakshi News home page

Amitabh Bachchan: ప్రభాస్‌కు అది కామన్.. నాకు మాత్రం: అమితాబ్

Published Wed, Jul 17 2024 4:05 PM | Last Updated on Wed, Jul 17 2024 4:28 PM

Amitabh Bachchan Comments On Prabhas Kalki Collects Rs 1000 Cr

ప్రభాస్- నాగ్ అశ్విన్‌ కాంబోలో వచ్చిన ఎపిక్‌ సైన్స్ ఫిక్షన్‌ యాక్షన్‌ చిత్రం కల్కి 2898 ఏడీ. దాదాపు నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత గతనెల థియేటర్లలోకి వచ్చింది. జూన్ 27న విడుదలైన ఈ చిత్రం మొదటి రెండు వారాల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. వైజయంతి మూవీస్ బ్యానర్‌లో అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రంంలో బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు.

తాజాగా ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కావడంపై అమితాబ్ బచ్చన్ స్పందించారు.  కల్కి మూవీకి ప్రపంచవ్యాప్తంగా వస్తోన్న విశేష ఆదరణ చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. ఈ విజయంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అయితే వెయ్యి కోట్ల రావడమనేది ప్రభాస్‌ కెరీర్‌లో రోటీన్‌ విషయమేనని అన్నారు. నా విషయానికొస్తే ఇంత పెద్ద సినిమాలో నటించినందుకు చాలా గర్వంగా ఉందని తెలిపారు. కల్కి చిత్రాన్ని ఇప్పటికే నాలుగు సార్లు చూశానని.. ప్రతిసారి ఏదో ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నానని అమితాబ్ బచ్చన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. 
 

కాగా.. కల్కి మూవీకి పార్ట్‌-2 కూడా ఉంటుందని నాగ్ అశ్విన్ ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రంలో  భైరవగా సందడి చేసిన ప్రభాస్‌.. సీక్వెల్‌లో కర్ణుడిగా కనిపించనున్నారు. దీంతో  పార్ట్‌-2పై అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. కాగా.. కల్కి 2898 ఏడీలో మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ అతిథి పాత్రల్లో మెరిసిన సంగతి తెలిసిందే.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement