చివరి ఘట్టానికి చేరుకున్న ప్రభాస్‌ 'కల్కి' | Kalki 2898 AD Grand Release on May 9th | Sakshi
Sakshi News home page

చివరి ఘట్టానికి చేరుకున్న ప్రభాస్‌ 'కల్కి'

Feb 5 2024 12:08 AM | Updated on Feb 5 2024 7:24 AM

Kalki 2898 AD Grand Release on May 9th - Sakshi

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న సైంటిఫిక్‌ ఫ్యూచరిస్ట్‌ ఫిల్మ్‌ ‘కల్కి 2898 ఏడీ’. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్, కమల్‌ హాసన్, దిశాపటానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హీరోలు నాని, విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌ కీలక పాత్రల్లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది.

కాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ మేజర్‌ షెడ్యూల్‌ ఈ నెల రెండో వారంలో చిత్రీకరించేలా ప్లాన్‌ చేశారట నాగ్‌ అశ్విన్‌. ప్రభాస్, కమల్‌ హాసన్, అమితాబ్‌ బచ్చన్, దీపికా పదుకొనె.. ఇలా ఈ సినిమా ప్రధాన  తారాగణమంతా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటారని సమాచారం. ఈ షెడ్యూల్‌తో ఈ సినిమా ప్రధాన భాగం చిత్రీకరణ పూర్తవుతుందని టాక్‌. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి.అశ్వినీదత్‌ నిర్మిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ సినిమా మే 9న విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement