ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంంబోలో తెరకెక్కించిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ. అభిమానుల భారీ అంచనాల మధ్య గురువారం థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే సూపర్ హిట్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. నైజాంలో కలెక్షన్ల పరంగా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని అధిమిగమించేసింది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.191.5 కోట్ల వసూళ్లు సాధించి ఆల్ టైమ్ రికార్డ్ నమోదు చేసింది. ఈ చిత్రంలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషించారు. తాజాగా కమల్ హాసన్ కల్కి సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ చిత్రంలో విలన్‌గా సుప్రీం యాస్కిన్ పాత్రతో ప్రేక్షకులను మెప్పించారు.
కమల్ హాసన్ మాట్లాడుతూ.. 'కల్కి రెండో పార్ట్‌లోనే నా పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఆ విషయం నాకు ముందే చెప్పారు. కేవలం ఓ అభిమానిగా పార్ట్-1 షూటింగ్‌లో పాల్గొన్నా. ప్రస్తుతం ఇండియన్ సినిమా గ్లోబల్ స్థాయికి చేరుకుంది. దర్శకుడు నాగ్ అశ్విన్‌కు ఓపిక చాలా ఎక్కువ. పురాణాలను సైన్స్‌ను ముడిపెట్టి కల్కిని అద్భుతంగా రూపొందించారు. చాలా ఓపిగ్గా కల్కి కథను రాసుకున్నారు. అంతే ఓపికగా తెరకెక్కించారు' అంటూ డైరెక్టర్‌పై ప్రశంసలు కురిపించారు. గతంలో విలన్‌గా నటించిన సినిమాల కంటే యాస్కిన్ పాత్ర భిన్నంగా కనిపించిందన్నారు. ఈ పాత్ర నేను చేయగలనా అనే సందేహం వచ్చిందని కమల్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment