దీపికా పదుకొణెకు మరో బిగ్‌ సినిమా ఛాన్స్‌ | Deepika Padukone Will Got A Big Movie Chance After Prabhas Kalki, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

దీపికా పదుకొణెకు మరో బిగ్‌ సినిమా ఛాన్స్‌

Sep 27 2025 7:45 AM | Updated on Sep 27 2025 11:49 AM

Deepika Padukone Will got A Bigg Movie Chance After Kalki

దీపికా పదుకొణె(Deepika Padukone) పాన్‌ ఇండియా రేంజ్‌ను దాటేసి ప్రపంచ స్థాయిలో అభిమానులను ఇప్పటికే తెచ్చుకుంది. రీసెంట్‌గా కల్కి2 నుంచి ఆమె తప్పుకున్నా సరే తన క్రేజ్‌ మాత్రం తగ్గలేదు. అట్లీ దర్శకత్వంలో నటిస్తున్న దీపిక... తాజాగా హాలీవుడ్‌ సినిమాలో కూడా ఛాన్స్‌ దక్కించుకుంది. తెరపై హీరోలకు దీటుగా యాక్షన్‌ సన్నివేశాలు చేస్తూ ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచే  దీపికాకు హాలీవుడ్‌లో కూడా భారీగానే ఫ్యాన్స్‌ ఉన్నారు. ‘ట్రిపుల్‌ ఎక్స్‌: రిటర్న్‌ ఆఫ్‌ జాండర్‌ కేజ్‌’ అనే తన తొలి హాలీవుడ్‌ సినిమాతో అదరగొట్టింది. దర్శకుడు డీజే కరుసో తెరకెక్కించిన ఈ చిత్రం 2017లో విడుదలైంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ రానుంది. అందులో ఆమెకు మరోసారి ఛాన్స్‌ దక్కినట్లు సమాచారం.

ట్రిపుల్‌ ఎక్స్‌ స్పై యాక్షన్‌ చిత్రంలో హాలీవుడ్‌ టాప్‌ హీరో  విన్‌ డీసెల్‌తో కలిసి దీపిక నటించింది. ఇందులో నినా డోబ్రేవ్, రూబీ రోజ్‌ తదితరులు ప్రముఖ పాత్రలలో కనిపించారు. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్‌ రాబట్టిన ఈ చిత్రానికి సీక్వెల్‌ రానున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ చిత్రంలో కూడా దీపికా పదుకొణె కూడా భాగం కానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమెతో చర్చలు కూడా జరిగిపోయాయట. 

ఆమె కోరిక మేరకు సినిమా షూటింగ్‌ కూడా ముంబైలో ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. తన కుమార్తెకు దగ్గరగా ఉండేందుకు దీపిక ఈ నిర్ణయం తీసుకున్నారట. అందుకు చిత్ర యూనిట్‌ కూడా ఓకే చెప్పేసిందట. త్వరలో దీనికి సంబంధించిన ప్రకటన కూడా రావచ్చని తెలుస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ఓ అరుదైన గౌరవాన్ని కూడా దీపిక సొంతం చేసుకుంది. ‘హాలీవుడ్‌ వాక్‌ ఆఫ్‌ ఫేమ్‌ స్టార్‌ 2026’కు ఎంపికైన తొలి భారతీయ హీరోయిన్‌గా రికార్డ్‌ క్రియేట్‌ చేసిన విషయం తెలిసిందే. హాలీవుడ్‌లో ఆమెకు ఉన్న క్రేజ్‌ను అంచనా వేసే  ‘ట్రిపుల్‌ ఎక్స్‌: రిటర్న్‌ ఆఫ్‌ జాండర్‌ కేజ్‌’ సీక్వెల్‌కు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement