ఊహించిందే నిజమైంది. ‘కల్కి 2898 ఏడీ’ రూ. 1000 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. ఈ సినిమా విడుదలకు ముందే రూ. 1000 కోట్ల కొల్లగొట్టడం గ్యారెంటీ అని సినీ విశ్లేషకులు అంచనా వేశారు. ఇప్పుడు ఆ అంచనాలే నిజమైయ్యాయి. ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’చిత్రం రెండు వారాల్లోనే రూ. 1000 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి రికార్డుని సృష్టించింది.
నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రిలీజ్ రోజే(జూన్ 27) హిట్‌టాక్ వచ్చింది. ఫలితంగా మొదటి రోజు రూ. 191 కోట్లను వసూలు చేసి మరోసారి తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటింది. నాలుగు రోజుల్లోనే రూ. 500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఇప్పటికి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 1000 కోట్ల వసూళ్లు వచ్చాయాని మేకర్స్ ప్రకటించారు.
(చదవండి: వేరే వాళ్లనయితే చెప్పుతో కొట్టి ఉండేదాన్ని.. జర్నలిస్ట్‌పై నటి రోహిణి ఫైర్)
రిలీజ్ అయి రెండు వారాలు దాటినా..ఇప్పటికీ సక్సెఫుల్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ప్రభాస్, అమితాబ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. పురాణాల్లోని పాత్రలను తీసుకొని, దానికి ఫిక్షన్ జోడించి సరికొత్తగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. హాలీవుడ్ మార్వెల్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు.
ఏడో చిత్రంగా ‘కల్కి’
ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల్లో కల్కి 2898 ఏడీ ఏడోది. అంతకు ముందు దంగల్ (2016) రూ.2024 కోట్లు, బాహుబలి2 (2017) రూ.1810 కోట్లు, ఆర్‌ఆర్‌ఆర్ (2022) 1387 కోట్లు, కేజీయఫ్2 (2022) రూ.1250 కోట్లు, జవాన్ (2023) రూ.1148 కోట్లు, పఠాన్ (2023) రూ.1050 కోట్లు వసూలు చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment