box office collection
-
బాక్సాఫీస్‌పై ‘ఛావా’ దండయాత్ర.. బిగ్గెస్ట్ ఓపెనింగ్స్!
విక్కీ కౌశల్(Vicky Kaushal), రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ఛావా’(Chhaava Movie). మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి..తొలి రోజే హిట్ టాక్‌కి అందుకుంది. విక్కీ యాక్టింగ్‌తో పాటు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ మేకింగ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా అద్భుతంగా తీశారని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. పాజిటివ్ టాక్ రావడంతో తొలి రోజే ఈ చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టింది. మొదటి రోజు ఈ చిత్రం దాదాపు రూ.31 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల అంచనా వేశాయి. ఈ ఏడాదిలో బాలీవుడ్లో ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్. విక్కీ కౌశల్ కెరీర్లోనే ఈ స్థాయి ఓపెనింగ్స్ రాబట్టిన తొలి చిత్రంగా ‘ఛావా’ నిలిచింది. గతంలో విక్కీ నటించిన సినిమాలలో తొలి రోజు అత్యధికంగా బాడ్ న్యూజ్(2024) రూ.8.62 కోట్లు, సామ్ బహదూర్ రూ.5.75 కోట్లు, జరా హాట్కే జరా బచ్కే రూ.5.49 కోట్లు సాధించాయి. ఛావా సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్లో కలెక్షన్స్ భారీగా పెరిగే చాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.విక్కీపై ప్రశంసలు..‘ఛావా’విజయంలో విక్కీ కౌశల్ కీలక పాత్ర పోషించాడు. శంభాజీగా విక్కీ కౌశల్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేని విధంగా నటించాడని పలు వెబ్‌సైట్స్ తమ రివ్యూలో తెలిపాయి. వార్ యాక్షన్స్ అదరగొట్టేశాడట. క్లైమాక్స్ ఫైట్ సీన్లో వీక్కీ రుద్ర తాండవం చేశాడని చెబుతున్నారు. శంభాజీ భార్య ఏసుబాయిగా రష్మిక కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది. ఉటేకర్ ఎంచుకున్న పాయింట్లో గొప్ప కథ, ఊహించని ట్విస్ట్‌లు లేకపోయినా శంభాజీ పాత్ర, యాక్షన్ సీక్వెన్స్ సినిమాను నిలబెట్టాయి. -
సంక్రాంతికి వస్తున్నాం ఖాతాలో మరో రికార్డు.. 'డాకు..' కలెక్షన్స్ ఎంతంటే?
సంక్రాంతి బరిలో దిగిన గేమ్ ఛేంజర్ సినిమా సైలెంట్ అయిపోయింది. మొదట్లో డాకు మహారాజ్ (Daaku Maharaaj Movie) బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టగా దాన్ని సైతం వెనక్కు నెడుతూ టాప్ ప్లేస్‌లో నిలబడింది సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam Movie). జనవరి 14న విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల వరద పారిస్తోంది. ఐదు రోజుల్లోనే ఈ చిత్రం రూ.165 కోట్లకు పైగా రాబట్టింది. ఆరో రోజు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా రికార్డుకెక్కిందని చిత్రయూనిట్ ప్రత్యేకంగా పోస్టర్ రిలీజ్ చేసింది. ఆరో రోజు ఎక్కువ షేర్ (రూ.9.54 కోట్ల షేర్) సాధించిన సినిమాగా ఆర్ఆర్ఆర్ పేరిట రికార్డు భద్రంగా ఉండేది. నిన్నటితో సంక్రాంతికి వస్తున్నాం ఆ రికార్డును బద్ధలు కొట్టింది. విక్టరీ వెంకటేశ్ (Venkatesh Daggubati) కెరీర్లోనే ఈ సినిమా ఆల్‌టైం హిట్‌గా నిలిచింది. ఇప్పటికే రూ.100 కోట్ల షేర్ కూడా వచ్చేసిందని తెలిపింది. అటు నార్త్ అమెరికాలోనూ సినిమా జోరు ఏమాత్రం తగ్గడం లేదు. అక్కడ ఇప్పటివరకు 2.1 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూలు చేసింది. యూకెలో 1,95,628 పౌండ్లు వసూలు చేసింది. ఈ బ్లాక్‌బస్టర్ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని ప్రకటించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అది కూడా మళ్లీ సంక్రాంతికే రిలీజ్ చేస్తామని తెలిపాడు.డాకు మహారాజ్ కలెక్షన్స్ ఎంత?డాకు మహారాజ్ సినిమా విషయానికి వస్తే.. నందమూరి బాలకృష్ణ నటించిన ఈ చిత్రానికి ఎనిమిది రోజుల్లో రూ.156 కోట్లు వచ్చాయి. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారిక పోస్టర్ ద్వారా వెల్లడించింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఐటం సాంగ్‌లో మెరిసింది. తమన్ సంగీతం అందించగా నాగవంశీ నిర్మాతగా వ్యవహరించాడు. #SankranthikiVasthunam is redefining MASS with it’s CLASS FAMILY ENTERTAINMENT🔥🔥🔥#BlockbusterSankranthikiVasthunam joins the elite 100Crore+ share club in just 6 days 💥💥💥ALL TIME HIGHEST FOR VICTORY @Venkymama ❤️🔥ALL TIME #2 HIGHEST FOR Hit Machine @AnilRavipudi ❤️🔥… pic.twitter.com/zjjrKwNoJk— Sri Venkateswara Creations (@SVC_official) January 20, 2025Victory @venkymama is firing on all cylinders with #SankranthikiVasthunam at the box office🔥🔥🔥#BlockbusterSankranthikiVasthunam has now become the ALL-TIME HIGHEST COLLECTED FILM IN AP & TS on its 6th day💥💥💥💥#BlockbusterSankranthikiVasthunam IN CINEMAS NOW 🫶… pic.twitter.com/dv97e3aeVl— Sri Venkateswara Creations (@SVC_official) January 20, 2025The KING OF SANKRANTHI roars louder with every passing day 🪓🔥#DaakuMaharaaj storms past 𝟏𝟓𝟔+ 𝐂𝐫𝐨𝐫𝐞𝐬 Gross Worldwide in 8 DAYS 💥Celebrate the unstoppable reign of 𝑮𝑶𝑫 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺 #NandamuriBalakrishna in cinemas near you ❤️🔥… pic.twitter.com/hHvfs5Ac28— Sithara Entertainments (@SitharaEnts) January 20, 2025 చదవండి: వర్మ కళ్లు తెరిపించిన సత్య.. ఒట్టు, ఇకపై అలాంటి సినిమాలు చేయను! -
సంక్రాంతికి వస్తున్నాం రికార్డు వసూళ్లు..3 రోజుల్లోనే భారీ మైల్ స్టోన్..
-
3 కోట్ల బడ్జెట్.. 136 కోట్ల కలెక్షన్స్.. ‘పుష్ప2’ని మించిన హిట్!
రపరపరపరప అన్నట్టుగా వరుసపెట్టి విలన్లను మాత్రమే కాదు అంతకు ముందు సినిమాలు నెలకొల్పిన ప్రతీ రికార్డ్నూ నరుక్కుంటూ పోయాడు పుష్ప2. అంతకు ముందు వరకూ ఠీవీగా నిలుచున్న అనేక మంది నెంబర్ వన్ హీరోలు సైతం తమ స్థాయి గురించి తాము సందేహించుకునేలా చేశాడు అల్లు అర్జున్. అయితే అసలైన హిట్ ఇది కాదని, కనీ వినీ ఎరుగని కలెక్షన్లు సాధించినప్పటికీ పుష్ప2 అత్యద్భుతమైన హిట్ గా చెప్పలేమని ట్రేడ్ పండితులు కొందరు తీర్మానిస్తున్నారు.అంతేకాదు ఆ మాట కొస్తే గత ఏడాది సినిమాల్లో కలెక్షన్ల పరంగా రికార్డ్స్ బద్ధలు కొట్టిన పలు సినిమాలు కూడా హిట్స్ కిందకు రావని అంటున్నారు. ఒకే ఒక సినిమా మాత్రం టాప్ హిట్‌గా స్పష్టం చేస్తున్నారు. దీనికి గాను వారు అందిస్తున్న విశ్లేషణ ఏమిటంటే...గత ఏడాది భారతీయ సినిమాకు చెప్పుకోదగ్గ అద్భుతమైన సంవత్సరంగా మార్చడంలో పలు టాప్ మూవీస్ కీలకపాత్ర పోషించాయి. ప్రపంచవ్యాప్తంగా రూ. 1,000 కోట్ల మార్కును అధిగమించిన రెండు సినిమాలు పుష్ప 2: ది రూల్, కల్కి 2898... రెండూ గత ఏడాదిలోనే విడుదలయ్యాయి. అదే విధంగా శ్రద్ధా కపూర్ రాజ్‌కుమార్ రావుల హర్రర్ కామెడీ స్ట్రీ 2 కూడా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 850 కోట్లకు పైగా వసూలు చేయడం ద్వారా గత ఏడాది అత్యధిక వసూళ్లు చేసిన హిందీ చిత్రంగా అవతరించింది.అయితే, ఒక దక్షిణ భారతీయ చిత్రం వాటన్నింటినీ అధిగమించి, భారతదేశపు అత్యంత లాభదాయకమైన చిత్రంగా నిలిచింది. విశేషం ఏమిటంటే ప్రధాన తారలు ఎవరూ కనిపించని ఈ చిత్రం కేవలం రూ. 3 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఆ మలయాళ చిత్రం పేరు ప్రేమలు. ఇటీవలి కాలంలో భారతదేశపు అత్యంత లాభదాయకమైన చిత్రంగా ప్రేమలు నిలిచింది. ఈ విషయానన్ని ప్రముఖ ఆంగ్లపత్రిక హిందుస్థాన్ టైమ్స్ వెల్లడించింది. గిరీష్ దర్శకత్వం వహించిన ప్రేమలు చిత్రం సచిన్ అనే యువకుడి చుట్టూ తిరిగే రొమాంటిక్ డ్రామా. హిందుస్థాన్ టైమ్స్ ప్రకారం, ఈ చిత్రం దాని నిర్మాణ బడ్జెట్లో 45 రెట్లు ఎక్కువ లాభాలను ఆర్జించింది. రూ. 3 కోట్ల పెట్టుబడితో నిర్మించిన ప్రేమలు ప్రపంచవ్యాప్తంగా రూ. 136 కోట్లు వసూలు చేసింది, తద్వారా గత ఏడాది అత్యధిక వసూళ్లు చేసిన మలయాళ చిత్రంగా నిలవడం మాత్రమే కాదు. అత్యంత లాభదాయకమైన భారతీయ చిత్రంగా కూడా నిలిచింది.మరోవైపు పుష్ప 2: ది రూల్, కల్కి 2898.. స్త్రీ 2 వంటివన్నీ భారీ బడ్జెట్ చిత్రాలనేవి తెలిసిందే. దీని వలన తయారీదారులు తమ ఉత్పత్తి ఖర్చులను త్వరగా రికవరీ చేసుకోవచ్చు. అగ్రతారలైన ప్రభాస్, దీపికా పదుకొనే, అమితాబ్ తదితరులు నటించిన కల్కి 2898.. బడ్జెట్ రూ. 600 కోట్ల పై మాటే. ఫలితంగా ప్రేమలుతో పోలిస్తే తక్కువ లాభాల శాతం వచ్చింది. అదేవిధంగా, అల్లు అర్జున్ పుష్ప 2: ది రూల్ బాక్స్ ఆఫీస్ హిట్ అయినప్పటికీ దాని నిర్మాణ బడ్జెట్ రూ. 350 కోట్లపై మాటే దాంతో భారీ పెట్టుబడి దీని లాభాల మార్జిన్‌ను తగ్గించింది. అత్యంత లాభదాయకమైన చిత్రాల్లో రెండో స్థానం సాధించిన స్ట్రీ 2 దాని బడ్జెట్‌కు పది రెట్లు సంపాదించింది. ఈ సినిమా రూ. 90 కోట్ల నిర్మాణ వ్యయంతో రూపొంది 850 కోట్లకు పైగా కలెక్షన్లు దక్కించుకుంది. -
బాలయ్య డాకు మహారాజ్.. తొలి రోజు ఎన్ని కోట్లంటే?
బాలయ్య నటించిన లేటేస్ట్ మూవీ డాకు మహారాజ్. సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలైన ఈ మూవీకి తొలి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈనెల 12న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. బాబీ కొల్లి డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ మాస్ ఎంటర్టైనర్ను సితార ఎంటర్టైన్మెంట్స్పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి రోజే సక్సెస్ టాక్ రావడంతో అందరి దృష్టి కలెక్షన్లపై పడింది.డాకు మహారాజ్ మొదటి రోజు వసూళ్ల పరంగా అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.56 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. దీంతో బాలకృష్ణ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల లిస్ట్‌లో డాకు మాహారాజ్ స్థానం దక్కించుకుంది. యూఎస్‌లో అరుదైన రికార్డ్..బాలకృష్ణ మూవీ డాకు మహారాజ్ అరుదైన ఘనత సాధించింది. తొలిరోజే యూఎస్ బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. మొదటి రోజే అమెరికాలో 10 లక్షల డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా డాకు మహారాజ్ మూవీ పోస్టర్‌ను షేర్ చేసింది.డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజైనప్పటి నుంచే అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.ఆకట్టుకుంటున్న బాలయ్య డైలాగ్స్బాలయ్య పవర్ఫుల్ డైలాగ్స్ ఆడియన్స్‌కు ఆకట్టుకుంటున్నాయి. 'రాయలసీమ మాలుమ్ తేరేకు.. వో మై అడ్డా' అనే డైలాగ్ ముఖ్యంగా మాస్ ఫ్యాన్స్‌ను కట్టిపడేసింది. 'సింహం నక్కల మీద కొస్తే వార్ అవ్వదు'.. 'వార్నింగ్ చంపేవాడు ఇవ్వాలి, చచ్చేవాడు కాదు’.. లాంటి డైలాగ్స్ నెట్టింట వైరలవుతున్నాయి.కాగా.. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్‌గా కనిపించారు. అంతేకాకుండా బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్, చాందిని చౌదరి కీలక పాత్రల్లో నటించారు.దేశీయంగా నెట్ వసూళ్లు ఎంతంటే?ఇండియా వ్యాప్తంగా చూస్తే రూ.22.5 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో కనిపించారు. ఈ మూవీలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్‌గా నటించారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా ప్రత్యేక పాత్రలో అభిమానులను అలరించింది. డాకు మహారాజ్ సక్సెస్ పార్టీ..డాకు మహారాజ్‌కు సక్సెస్ టాక్ రావడంతో చిత్రబృందం పార్టీ చేసుకుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ పార్టీలో మూవీ టీమ్ అంతా సందడి చేసింది. ఈ వేడుకల్లో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా మరోసారి సందడి చేసింది. దబిడి దిబిడి సాంగ్‌తో అలరించిన ముద్దుగుమ్మ బాలయ్యతో కలిసి స్టెప్పులు వేసింది. దీనికి సంబంధించిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది.సాంగ్‌పై విమర్శలు..డాకు మహారాజ్‌లోని దబిడి దిబిడి సాంగ్‌పై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఊర్వశి రౌతేలాతో అలాంటి స్టెప్పులు ఏంటని పలువురు నెటిజన్స్ ప్రశ్నించారు. ఈ పాట కొరియోగ్రఫీ అత్యంత చెత్తగా ఉందంటూ మండిపడ్డారు. యంగ్ హీరోయిన్‌తో బాలయ్య అలాంటి స్టెప్పులు వేయడమేంటని సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేశారు. #DaakuMaharaaj sets the box office on fire and owns SANKRANTHI with Thunderous BLOCKBUSTER ❤️🔥𝟓𝟔 𝐂𝐫𝐨𝐫𝐞𝐬+ 𝐖𝐨𝐫𝐥𝐝𝐰𝐢𝐝𝐞 𝐆𝐫𝐨𝐬𝐬 𝐨𝐧 𝐃𝐀𝐘 𝟏 🪓🔥#BlockbusterHuntingDaakuMaharaaj – THE BIGGEST OPENING for #NBK garu 🧨That’s how 𝑮𝑶𝑫 𝑶𝑭 𝑴𝑨𝑺𝑺𝑬𝑺… pic.twitter.com/nz3eSZM46a— Sithara Entertainments (@SitharaEnts) January 13, 2025 -
బెంగాల్లో తగ్గేదే లే!
‘తగ్గేదే లే’ అన్నది హీరో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా రెండు భాగాల్లోని డైలాగ్. సుకుమార్ దర్శకత్వంలో వై.రవిశంకర్, నవీన్ ఎర్నేని నిర్మించిన ఈ చిత్రం ఆ డైలాగ్‌కి తగ్గట్టే ఎక్కడా తగ్గడం లేదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ‘పుష్ప 2’ దాదాపు రూ.1800 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అలాగే హిందీలో ఏ స్ట్రయిట్ చిత్రం వసూలు చేయనంత అంటూ... దాదాపు రూ. 800 కోట్ల గ్రాస్‌ని వసూలు చేయడం విశేషం. ఇక బెంగాల్లో ఈ చిత్రం ఓ రికార్డ్ సాధించింది.మామూలుగా బెంగాలీ సినిమా మార్కెట్ చాలా చిన్నది. తక్కువ బడ్జెట్ చిత్రాలు రూపొందుతుంటాయి. ఈ నేపథ్యంలో ‘పుష్ప 2’ బెంగాల్లో రూ. 50 కోట్లు వసూలు చేసి, సంచలనం సృష్టించింది. కాగా ‘అమేజాన్ ఓబిజాన్’ (2017) అనే చిత్రం రూ. 48 కోట్ల వసూళ్లతో అప్పట్లో రికార్డ్ నెలకొల్పింది. ఇది స్ట్రయిట్ చిత్రం. ఆ రికార్డును తాజాగా ‘పుష్ప 2’ బ్రేక్ చేసింది. ఒక డబ్బింగ్ సినిమా ఇలా ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పడం అంటే మామూలు విషయం కాదు... మరి... ‘పుష్ప’ అంటే వైల్డ్ ఫైర్.... లోకల్ కాదు... ఇంటర్నేషనల్. -
ఆ దేశాన్నీ వదిలిపెట్టని పుష్పగాడు!.. ఏకంగా ఎన్ని కోట్లు వసూలు చేసిందో తెలుసా?
-
పుష్పగాడి ఊచకోత.. ఆరు రోజుల్లోనే బాక్సులు బద్దలు
-
రికార్డులు రప్పా రప్పా...
‘‘ఆ బిడ్డ మీద ఒక్క చిన్న గీత పడాలా... గంగమ్మ తల్లి జాతరలో యాటను నరికినట్లు రప్పా రప్పా నరుకుతా.. ఒక్కొక్కడిని రప్పా రప్పా రప్పా...’’ అంటూ విలన్లకి వార్నింగ్ ఇస్తాడు పుష్పరాజ్. ‘పుష్ప 2: ది రూల్’ చిత్రంలో హీరో అల్లు అర్జున్ చెప్పిన బోలెడన్ని పవర్ఫుల్ డైలాగ్స్‌లో ఇదొకటి. ఇక ఇక్కడ పేర్కొన్న డైలాగ్‌లానే రప్పా రప్పా అంటూ ఇప్పటివరకూ ఉన్న రికార్డులను చెరిపేసి, సరికొత్త రికార్డులను సృష్టించారు అల్లు అర్జున్.ఇప్పటివరకూ ఏ భారతీయ సినిమా సాధించని విధంగా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా రూ. 294 కోట్ల గ్రాస్ రాబట్టి సరికొత్త రికార్డులను సెట్ చేసింది ‘పుష్ప2: ది రూల్’ సినిమా.అల్లు అర్జున్, రష్మికా మందన్నా జోడీగా నటించిన చిత్రం ‘పుష్ప 2: ది రూల్’. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల ప్రత్యేక పాటలో నటించారు. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా గురువారం (డిసెంబరు 5)న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అయితే డిసెంబరు 4న రాత్రి 9:30 గంటల నుంచి ప్రారంభమైన ప్రీమియర్స్‌కి అనూహ్యమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 12,500 స్క్రీన్స్‌లో ఈ చిత్రం విడుదలైంది. భారతీయ సినీ చరిత్రలో ఇప్పటివరకూ ఏ సినిమా సాధించని విధంగా మొదటి రోజు రూ. 294 కోట్ల గ్రాస్‌తో ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించినట్లు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. ఇండియాలో ఇప్పటివరకు మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన చిత్రాల్లో ‘ఆర్ఆర్ఆర్’ (2022) రూ. 233 కోట్ల గ్రాస్‌తో ప్రథమ స్థానంలో ఉంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించారు. అయితే రూ. 294 కోట్ల గ్రాస్ వసూళ్లతో ‘ఆర్ఆర్ఆర్’ రికార్డును బ్రేక్ చేసింది ‘పుష్ప 2: ది రూల్’.అదే విధంగా నైజాంలోనూ రికార్డులను తిరగ రాసింది ‘పుష్ప 2’. ఇప్పటివరకూ మొదటి రోజు వసూళ్లలో రూ. 23కోట్ల గ్రాస్‌తో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం మొదటి స్థానంలో ఉండగా, రూ. 30 కోట్ల గ్రాస్ వసూళ్లతో సరికొత్త రికార్డుని సృష్టించి, మొదటి స్థానంలో నిలిచింది ‘పుష్ప 2: ది రూల్’. హిందీలోనూ తొలి రోజు రూ. 72 కోట్ల వసూళ్లతో ‘పుష్ప 2’ రికార్డు సృష్టించింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. బాలీవుడ్లో ఇప్పటివరకు మొదటిరోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా షారుక్ ఖాన్ నటించిన ‘జవాన్’ రూ. 65.5 కోట్లతో మొదటి స్థానంలో ఉంది. అయితే, తాజాగా ‘పుష్ప 2’ రూ. 72 కోట్ల వసూళ్లతో ‘జవాన్’ని రెండో స్థానానికి పరిమితం చేసింది. హిందీలో షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్స్‌కు కూడా సాధ్యం కాని రికార్డులను అల్లు అర్జున్ క్రియేట్ చేశారు. ‘పుష్ప: ది రైజ్’ (2021) చిత్రంలో తన అద్భుతమైన నటనకుగానూ జాతీయ అవార్డు అందుకున్నారు అల్లు అర్జున్. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ కావడం, ఆయనకి జాతీయ అవార్డు రావడంతో ఉత్తరాదిలోనూ అల్లు అర్జున్‌కి స్టార్డమ్, ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది. ఈ కారణంగానే హిందీలో ‘పుష్ప 2’కి భారీ ఓపెనింగ్స్ వచ్చాయని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. మరి... రానున్న రోజుల్లో రప్పా రప్పా అంటూ ‘పుష్ప 2’ ఇంకెన్ని రికార్డులు సాధిస్తుందో వేచి చూడాల్సిందే. -
బద్దలవుతున్న బాక్సాఫీస్ రికార్డులు..
-
టాలీవుడ్‌ని నిండా ముంచిన నవంబర్.. 22 సినిమాలు ఫ్లాప్!
టాలీవుడ్లో ఒక సెంటిమెంట్ ఉంది. నవంబర్ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు సక్సెస్ కావని భావిస్తారు. అందుకే ఈ నెలలో పెద్ద సినిమాలు చాలా తక్కువగా రిలీజ్ అవుతుంటాయి. ఈ సెంటిమెంట్ ఈ సారి కూడా వర్కౌట్ అయింది. గతేడాది మాదిరే ఈ ఏడాది నవంబర్ కూడా టాలీవుడ్‌కి కలిసి రాలేదు. ఈ నెలలో రిలీజైన సినిమాలేవి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.నవంబర్ మెదటి వారంలోనే దాదాపు 10 సినిమాలు విడుదలయ్యాయి. వాటిల్లో నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ మూవీ కూడా ఉంది. కానీ ఏ ఒక్క సినిమా కూడా హిట్ కొట్టలేదు. ఇక నిఖిల్ సినిమా అయితే భారీ ఫ్లాప్‌ని మూటకట్టుకుంది. జితెందర్ రెడ్డి సినిమాకు ఓ మోస్తారు టాక్ వచ్చినా.. కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయింది. ఇక మంచు లక్ష్మి ఆదిపర్వం, హెబ్బా పటేల్ ‘ధూంధాం’ లాంటి సినిమాలు ఫ్లాప్ టాక్‌నే మూటగట్టుకున్నాయి.ఇక రెండోవారంలో రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఒకటి మట్కా. మెగా ప్రిన్స్ వరుణ్ సందేశ్ నటించిన ఈ చిత్రం.. నవంబర్ 14న విడుదలై ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట ఫ్లాప్‌గా నిలిచింది. ఇక భారీ అంచనాలతో వచ్చి సూర్య ‘కంగువా’..ఘోర పరాజయాన్ని చవిచూసింది.(చదవండి: హైదరాబాద్‌లో ‘పుష్ప 2’ ఈవెంట్.. చివరి నిమిషంలో ప్లాన్ ఛేంజ్!)ఇక నవంబర్ మూడో వారం బాక్సాఫీస్ పోరులో యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సత్యదేవ్‌తో పాటు మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా కూడా పోటీ పడ్డారు. విశ్వక్ నటించిన మెకానిక్ రాకీ, సత్యదేవ్ నటించిన జీబ్రా రెండూ.. నవంబర్ 22న విడుదలయ్యాయి. వీటిలో మెకానిక్ రాకీ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. సెకండాఫ్ బాగున్నా.. ఫస్టాఫ్‌ని భరించడం కష్టమేనని రివ్యూస్ చెప్పాయి. అయితే కొంతవరకు అయినా కలెక్షన్స్ వస్తాయని భావించినా.. మూడో రోజు నుంచే సినిమా గురించి మాట్లాడుకోవడం మానేశారు. (చదవండి: చైనాలో 'మహారాజా' రెండు రోజుల కలెక్షన్స్.. భారీ రికార్డ్)ఇక సత్యదేవ్ జీబ్రా మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. రెండో రోజు నుంచి స్క్రీన్స్ కూడా పెరిగాయి. కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. వీకెండ్ తర్వాత ఆ జోష్ని కంటిన్యూ చేయలేకపోయారు. ఇక అశోక్ గల్లా నటించిన ‘దేవకీ నందన వాసుదేవ’ చిత్రమైతే ఘోరమైన అపజయాన్ని మూటగట్టుకుంది.ఇక నవంబర్ చివరి వారంలో మరో నాలుగైదు చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిల్లో రోటి కపడా రొమాన్స్ మూవీకి మంచి టాక్ లభించింది. సినిమా బాగున్నప్పటికీ.. అప్పటికే ప్రేక్షకులంతా పుష్ప 2 ఫీవర్‌లోకి వెళ్లారు. మొత్తంగా నవంబర్ నెల అయితే ఎప్పటి మాదిరే టాలీవుడ్‌ని నిండా ముంచేసింది. ఈ నెలలో వచ్చిన 22 సినిమాలు ప్లాప్ అయ్యాయి. ఇక డిసెంబర్లో మాత్రం టాలీవుడ్ బాక్సాఫీస్ పుంజుకునే అవకాశం ఉంది. పుష్ప 2తో పాటు మరిన్ని పెద్ద సినిమాలు ఈ నెలలో రిలీజ్ కాబోతున్నాయి. మరి ఈ ఇయర్ ‘క్లైమాక్స్’ ఎలా ఉంటుందో చూడాలి. -
బరిలోకి మహేశ్, చరణ్, సమంత.. అయినా ఫ్లాప్ తప్పలేదు!
సినీ ప్రేక్షకుడు మారాడు. ఒకప్పుడు తన అభిమాన నటీనటుల సినిమా ఎలా ఉన్నా సరే థియేటర్‌కి వెళ్లి చూసేవాడు. కానీ ఇప్పుడు హీరోహీరోయిన్ల మొఖం చూడట్లేదు. కథలో దమ్ముంటేనే సినిమా చూస్తున్నారు. స్టార్ హీరో సినిమా అయినా సరే.. టికెట్ తెగాలంటే మంచి కంటెంట్ ఉండాల్సిందే. లేదంటే అపజయం తప్పదు. దీనికి ఇటీవల విడుదలైన ‘జిగ్రా’ సినిమానే మంచి ఉదాహరణ.బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘జిగ్రా’. వేదాంగ్ రైనా, మనోజ్ పవా, రాహుల్ రవీంద్రన్ కీలక పాత్రలు పోషించారు. వాసన్ బాలా దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదలై తొలి రోజే ఫ్లాప్ టాక్ని మూటగట్టుకుంది. ఫలితంగా ఈ సినిమా కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. వీకెండ్ మొత్తంలో రూ. 20 కోట్ల కలెక్షన్స్‌ని కూడా రాబట్టలేకపోయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వారం మొత్తంలో హిందీలోనే కేవలం రూ. 18 కోట్ల మాత్రమే వసూలు చేసిందంటే..ఇక మిగతా భాషల్లో కలెక్షన్స్ ఎంత దారుణంగా ఉంటాయో ఊహించుకోవచ్చు.అపజయాన్ని ఆపలేకపోయినా స్టార్స్ఆలియా భట్ క్రేజ్ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేశారు. తెలుగులో హీరో రానా రిలీజ్ చేశాడు. వాస్తవానికి హిందీ తర్వాత ఈ చిత్రాన్ని బాగా ప్రమోట్ చేసింది తెలుగులోనే అనే చెప్పాలి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశాడు. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సోషల్ మీడియా వేదికగా తన మద్దతును ప్రకటించాడు. ఇక ఈ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్‌కి స్టార్ హీరోయిన్ సమంత, త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్యఅతిథులుగా హాజరై.. తన వంతు సాయం అందించారు. ఇలా స్టార్స్ అంతా తమకు తోచిన సహాయం అందించినా.. జిగ్రాకు విజయం అందించలేకపోయారు. తెలుగులో మూడు రోజుల్లో కేవలం 18 లక్షల వసూళ్లు మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. యావరేజ్ టాక్ వచ్చిన ఓ చిన్న సినిమాకు కూడా ఇంతకంటే ఎక్కువే వస్తాయని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. అయితే కథలో దమ్ము లేనప్పడు ఏ హీరో అయినా ఏం చేయగలడు? కాస్త బాగున్న సినిమాను ప్రచారం చేస్తే ఎంతో కొంత ఉపయోగపడుతుంది. కానీ కంటెంట్‌లేని సినిమాకు ఎంత ప్రచారం చేసిన బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. విషయం వీక్‌గా ఉన్నప్పుడు పబ్లిసిటీ పీక్స్‌లో ఉంటుందనడానికి ‘జీగ్రా’ మూవీ బెస్ట్ ఎగ్జాంపుల్. -
బాక్సాఫీస్ ని గడగడలాడిస్తున్న దేవర
-
Stree 2: రూ.50 కోట్ల బడ్జెట్.. రూ. 500 కోట్ల కలెక్షన్స్!
కంటెంట్ ఈజ్ కింగ్.. ఇప్పుడు ఇండియన్ చిత్ర పరిశ్రమలో వినిపిస్తున్న మాట ఇది. ఒకప్పుడు హీరోహీరోయిన్లను చూసి ప్రేక్షకులు సినిమా థియేటర్‌కి వెళ్లేవారు..కానీ ఇప్పుడు కథను నమ్మి వెళ్తున్నారు. కథ నచ్చితే హీరోహీరోయిన్లు ఎవరనేది పట్టించుకోకుండా సినిమాను హిట్ చేస్తున్నారు. స్త్రీ 2 చిత్రం ఆ కోవలోకి చెందినదే. బడా హీరోలెవరు ఈ చిత్రంలో లేరు. కానీ ఆ హీరోల సినిమాలకు మించిన కలెక్షన్స్‌ని రాబడుతోంది. కేవలం రూ.50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. రూ. 500 కోట్లకు పైగా వసూళ్లను సాధించి హిస్టరీ క్రియేట్ చేస్తోంది.ఊహించని విజయంశ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన స్త్రీ 2 చిత్రం ఆగస్ట్ 15న విడుదలైంది. రిలీజ్‌కి ముందు వరకు ఈ సినిమాపై పెద్దగా అంచనాల్లేవు. ట్రైలర్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ..ఈ స్థాయి విజయం సాధిస్తుందని ఎవరూ ఊహించలేదు. తొలి రోజు ఈచిత్రానికి రూ. 51 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఓ చిన్న చిత్రానికి ఈ మధ్యకాలంలో ఈ స్థాయి ఓపెనింగ్స్ రాలేదు. రిలీజ్ రోజే హిట్ టాక్ రావడంతో సినిమా కలెక్షన్స్ అమాంతం పెరిగిపోయాయి. మూడో వారంలోనూ ఈ చిత్రం మంచి వసూళ్లను సాధించింది. మొత్తంగా ఇప్పటి వరకు రూ. 509 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది.స్త్రీ 2 కథేంటంటే..2018 లో రిలీజై భారీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన హారర్ థ్రిల్లర్ స్త్రీ చిత్రానికి సీక్వెల్ ఇది. పార్ట్ 1లో స్త్రీ పీడా విరిగిపోయిందని చండేరీ ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. అయితే అప్పుడే సర్ ఖటా అనే విచిత్రమైన దెయ్యం ఒకటి ఊర్లోని అమ్మాయిలను మాయం చేయడం ప్రారంభిస్తుంది. అలా ఓ సారి విక్కీ (రాజ్ కుమార్ రావు) స్నేహితుడి ప్రియురాలిని సర్ ఖటా మాయం చేస్తుంది. దీంతో నలుగురు స్నేహితులు(రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపర్ శక్తి ఖురానా) కలిసి స్త్రీ(శ్రద్ధా కపూర్) సహాయం కోరతారు. విచిత్రమైన దెయ్యం సర్ ఖటా నుంచి చండేరీ ప్రజలను ‘స్త్రీ’ గ్యాంగ్ ఎలా రక్షించింది అనేది ఈ సినిమా స్టోరీ.#Stree2 is rock-steady at the #BO, firmly holding its ground on a working day [third Mon]... Mass circuits - particularly non-national chains + single screens at Tier-2 and Tier-3 centres - are driving its biz... Expected to enjoy a smooth, uninterrupted run right till #Dussehra.… pic.twitter.com/AdUGp3v4Ff— taran adarsh (@taran_adarsh) September 3, 2024 -
బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘స్త్రీ 2’.. ఇంతకీ ఈ మూవీలో ఏముంది?
కంటెంట్ బాగుంటే చాలు నటీనటులు, భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఆదరిస్తున్నారు నేటి ప్రేక్షకులు. ఏ భాషలోనే తెరకెక్కించినా చాలు.. హిట్ టాక్ వస్తే థియేటర్స్‌కి వెళ్లి చూస్తున్నారు. అలా ఇప్పుడు బాలీవుడ్ మూవీ స్త్రీ 2కి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదలై హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. రూ.50 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే రూ.135 కోట్ల కలెక్షన్స్‌ని రాబట్టింది.(చదవండి: బ్రదర్ అంటే బెస్ట్ ఫ్రెండ్: సితార ఘట్టమనేని)వాస్తవానికి ఈ సినిమాకి ప్రిమియర్ షో నుంచే హిట్ టాక్ వచ్చింది. తొలి రోజు ఏకంగా రూ. 51 కోట్ల కలెక్షన్స్‌ని రాబట్టింది. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు కూడా ఈ స్థాయి కలెక్షన్స్ రాలేదు. వరుసగా ఐదు రోజుల పాటు సెలవులు రావడం కూడా సినిమాకు ప్లస్ అయింది. దీనికి తోడు ఆగస్ట్ 15న విడుదలైన చిత్రాలన్నీ ప్లాప్ టాక్ మూటగట్టుకోవడం కూడా స్త్రీ 2కు కలిసొచ్చింది. స్త్రీ 2 కథేంటంటే..2018 లో రిలీజై భారీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన హారర్ థ్రిల్లర్ స్త్రీ చిత్రానికి సీక్వెల్ ఇది. పార్ట్ 1లో స్త్రీ పీడా విరిగిపోయిందని చండేరీ ప్రజలు ప్రశాంతంగా ఉంటారు. అయితే అప్పుడే సర్ ఖటా అనే విచిత్రమైన దెయ్యం ఒకటి ఊర్లోని అమ్మాయిలను మాయం చేయడం ప్రారంభిస్తుంది. అలా ఓ సారి విక్కీ (రాజ్ కుమార్ రావు) స్నేహితుడి ప్రియురాలిని సర్ ఖటా మాయం చేస్తుంది. దీంతో నలుగురు స్నేహితులు(రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపర్ శక్తి ఖురానా) కలిసి స్త్రీ(శ్రద్ధా కపూర్) సహాయం కోరతారు. విచిత్రమైన దెయ్యం సర్ ఖటా నుంచి చండేరీ ప్రజలను ‘స్త్రీ’ గ్యాంగ్ ఎలా రక్షించింది అనేది ఈ సినిమా స్టోరీ.(చదవండి: మమ్ముట్టి ‘టర్బో’ మూవీ రివ్యూ)దర్శకుడు అమర్ కౌశిక్ వైవిధ్యమైన స్క్రీన్‌ప్లేతో ఎక్కడా బోర్ కొట్టకుండా కథనాన్ని నడిపించాడు. సినిమా ఒకవైపు భయపెడుతూనే మరోవైపు నవ్వులు పంచుతోంది. కామెడీ, హారర్ రెండింటిని బ్యాలన్స్ చేస్తూ ఆసక్తికరంగా కథనాన్ని సాగించాడు. ఇక ప్రత్యేక పాటలో తమన్నా స్టెప్పులేయడం.. అక్షయ్ కుమార్ అతిథి పాత్ర లో కనిపించడం సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్. ఈ చిత్రం కచ్చితంగా 500 కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉందని సీనీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
‘కమిటీ కుర్రోళ్లు’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే..
నిహారిక కొణిదెల నిర్మించిన తొలి సినిమా ‘కమిటీ కుర్రోళ్లు’. 11 మంది కొత్త హీరోలతో తెరకెక్కిన ఈ చిత్రం నిన్న(ఆగస్ట్ 10)విడుదలై మంచి టాక్ని సంపాదించుకుంది. మంచి పల్లెటూరి వాతావరణంలో స్నేహం, ప్రేమ, కుటుంబంలోని భావోద్వేగాలను ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంలో చక్కగా తెరకెక్కించారని అందరూ ప్రశంసిచారు.ప్రశంసలతో పాటు సినిమాకు మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. వరల్డ్ వైడ్ ఈ చిత్రం తొలి రోజున రూ.1.63 కోట్లు గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. సీనియర్ నటీనటులతో పాటు 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ మేకర్స్ చేసిన ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ ప్రేక్షకులు సినిమాను ఆదరించారని ..ఇక వీకెండ్స్ అయిన శనివారం, ఆదివారం రోజుల్లో ఈ కలెక్షన్స్ మరింత పెరుగుతాయని ట్రేడ్ వర్గాలంటున్నాయి. -
గత పదిహేనేళ్లలో ఇలాంటి కలెక్షన్లు ఎవ్వరూ చూసుండరు..
-
రూ. 1000 కోట్ల క్లబ్‌లోకి ‘కల్కి’.. అరుదైన రికార్డు!
ఊహించిందే నిజమైంది. ‘కల్కి 2898 ఏడీ’ రూ. 1000 కోట్ల క్లబ్లో చేరిపోయింది. ఈ సినిమా విడుదలకు ముందే రూ. 1000 కోట్ల కొల్లగొట్టడం గ్యారెంటీ అని సినీ విశ్లేషకులు అంచనా వేశారు. ఇప్పుడు ఆ అంచనాలే నిజమైయ్యాయి. ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’చిత్రం రెండు వారాల్లోనే రూ. 1000 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి రికార్డుని సృష్టించింది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రిలీజ్ రోజే(జూన్ 27) హిట్‌టాక్ వచ్చింది. ఫలితంగా మొదటి రోజు రూ. 191 కోట్లను వసూలు చేసి మరోసారి తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటింది. నాలుగు రోజుల్లోనే రూ. 500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఇప్పటికి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 1000 కోట్ల వసూళ్లు వచ్చాయాని మేకర్స్ ప్రకటించారు. (చదవండి: వేరే వాళ్లనయితే చెప్పుతో కొట్టి ఉండేదాన్ని.. జర్నలిస్ట్‌పై నటి రోహిణి ఫైర్)రిలీజ్ అయి రెండు వారాలు దాటినా..ఇప్పటికీ సక్సెఫుల్ కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. ప్రభాస్, అమితాబ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. పురాణాల్లోని పాత్రలను తీసుకొని, దానికి ఫిక్షన్ జోడించి సరికొత్తగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. హాలీవుడ్ మార్వెల్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు.ఏడో చిత్రంగా ‘కల్కి’ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల్లో కల్కి 2898 ఏడీ ఏడోది. అంతకు ముందు దంగల్ (2016) రూ.2024 కోట్లు, బాహుబలి2 (2017) రూ.1810 కోట్లు, ఆర్ఆర్ఆర్ (2022) 1387 కోట్లు, కేజీయఫ్2 (2022) రూ.1250 కోట్లు, జవాన్ (2023) రూ.1148 కోట్లు, పఠాన్ (2023) రూ.1050 కోట్లు వసూలు చేశాయి. -
500 కోట్ల వైపు కల్కి పరుగులు.. హాలీవుడ్ మూవీని మించి కలెక్షన్స్
-
మరోసారి బాక్సాఫీస్ దగ్గర రికార్డుల ఫెస్టివల్..
-
దుమ్ము రేపుతున్న చిన్న మూవీ.. అప్పుడే సెంచరీ క్లబ్‌లోకి..
చిన్న సినిమా బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. బాలీవుడ్ బడా సినిమాల పోటీని తట్టుకుని నిలబడింది. హారర్ సినిమా ముంజా తాజాగా వంద కోట్ల క్లబ్‌లోకి చేరింది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారిక పోస్టర్ ద్వారా వెల్లడించింది. ఆదిత్య సపోట్‌దర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మోనా సింగ్, అభయ్ వర్మ, శార్వరి వాగ్ ప్రధాన పాత్రలు పోషించారు.జూన్ 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ ఈ మూవీకి ఓటేస్తున్నారు. అలా ఈ చిత్రం 17 రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే ఈ వసూళ్ల దూకుడికి గురువారం (జూన్ 27) అడ్డుకట్ట పడే అవకాశముంది. ఆ రోజు ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమా రిలీజవుతుండటంతో ముంజా రేసులో వెనకబడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ముంజా.. మిస్టర్ అండ్ మిసెస్ మహి, చందు ఛాంపియన్ వంటి భారీ చిత్రాలను వెనక్కు నెట్టి సెంచరీ సాధించడం గొప్ప విషయమనే చెప్పాలి! Munjya laughs and scares its way to 100 Cr! Thank you for the historic third weekend. We couldn’t have done it without you! ❤️Book your tickets now.🎟️ - https://t.co/z6yE2V5CHC#Munjya, a must-watch entertainer for families and kids, running successfully in cinemas now!… pic.twitter.com/1EJo4Beg8W— Maddockfilms (@MaddockFilms) June 24, 2024 -
‘గం..గం..గణేశా’తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే..?
ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గం..గం..గణేశా’. ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లు. ఈ సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించారు. ఉదయ్ శెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. భారీ అంచనాల మధ్య నిన్న (మే 31) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. (చదవండి: ‘గం..గం..గణేశా’ మూవీ రివ్యూ)ఫలితంగా తొలి రోజు ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్‌డే ఈ మూవీ 1.82 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వీకెండ్లో ఈ కలెక్షన్స్ మరింత పుంజుకునే అవకాశం ఉందని సినీ పండితులు చెబుతున్నారు. -
బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోలు
రూ.100 కోట్ల కలెక్షన్స్.. ఒకప్పుడు టాలీవుడ్‌కి ఇది రికార్డు కలెక్షన్స్. స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే ఆ రేంజ్ కలెక్షన్స్ వచ్చేవి. మాములు హీరోల సినిమాలకు రూ.20 కోట్లు వస్తేనే అది సూపర్ హిట్. కానీ ఇప్పుడు టాలీవుడ్ బాక్సాఫీస్ పరిస్థితి మారింది. కుర్రహీరోలు సైతం బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. రికార్డు స్థాయి కలెక్షన్స్‌ని రాబడుతున్నారు. ఇంకా చెప్పాలంటే స్టార్ హీరోలకు సైతం సాధ్యం కానీ కలెక్షన్స్‌ని యంగ్ హీరోస్ రాబడుతున్నారు. మన టాలీవుడ్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న యంగ్ హీరోలపై ఓ లుక్కేయండి -
సూర్య.. 1000 కోట్లు వసూలు చేస్తాడా?
ప్రస్తుతం స్టార్ హీరోలంతా పాన్ ఇండియా సినిమాలపై ఫోకస్ పెట్టారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అనే తేడా లేకుండా అంతటా పాన్ ఇండియా సినిమాల జోరు కొనసాగుతుంది. ఇక మన టాలీవుడ్ నుంచి అయితే చాలా సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో రాణిస్తున్నాయి. స్టార్ హీరోలు అందరూ కూడా పాన్ ఇండియా బ్రాండ్ తోనే తమ సినిమాలని రిలీజ్ చేస్తున్నారు. పక్కనే ఉన్న కోలీవుడ్ హీరోలు కూడా ఇప్పుడు మనవాళ్లనే ఫాలో అవుతున్నారు. తమ సినిమాలను కూడా అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు ఎలాగైనా పాన్ ఇండియా పోటీలో తాము కూడా పై చేయి సాధించాలని కసిగా ఉన్నారు. ఇప్పటి వరకు పాన్ ఇండియా స్థాయిలో రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన సినిమాల్లో టాలీవుడ్ పాటు కన్నడ సినిమాలు కూడా ఉన్నాయి. కానీ కోలీవుడ్ నుంచి ఒక్క సినిమా కూడా లేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు రూ. 1000 కోట్ల క్లబ్లో చేరాయి. ఇక కన్నడ నుంచి కేజీయఫ్, కేజీయఫ్ 2 చిత్రాలు కూడా రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. కోలీవుడ్ నుంచి జైలర్ కచ్చితంగా రూ. 1000 కోట్లు సాధిస్తుందని అంతా భావించారు. కానీ అది రూ. 600 కోట్ల దగ్గరకు వచ్చి ఆగిపోయింది. ఇక ఇప్పుడు కోలీవుడ్ ఆశలన్నీ సూర్యపైనే ఉన్నాయి. ఆయన నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం కంగువా రూ. 1000 కోట్లు సాధించి, అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుందని ధీమాగా ఉన్నారు. ఈ మధ్య విడుదలైన ప్రచార చిత్రాలు, గ్లింప్స్ చూస్తుంటే కచ్చితంగా 1000 కోట్లు కలెక్ట్ చేసే మొట్టమొదటి చిత్రం అవుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. చిత్ర నిర్మాతలు కూడా రూ. 1000 కోట్లే టార్గెట్‌గా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. డైరెక్టర్ శివ రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కంగువా పార్ట్ 1 ఈ ఏడాదిలో విడుదల కానుంది. ఇందులో సూర్య ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఇప్పటికే ఇందులోని పిరియడ్ కాల పాత్రకు సంబంధించిన ఆయన గెటప్, టీజర్ విడుదల చేయగా విశేష ఆదరణ పొందాయి. కాగా బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, యోగిబాబు, రెడిన్ కింగ్స్లీ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం, వెట్రి పళనిసామి ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 38 భాషలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
టిల్లు తుపాన్, 100 కోట్లు లోడింగ్..?
-
Tillu Square Box Office Collection: బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘టిల్లుగాడు’
లేట్‌గా వచ్చినా లేటెస్ట్గా వచ్చినంటోన్నాడు సిద్దు జొన్నలగడ్డ. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘టిల్లు స్వ్కేర్’. మార్చి 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజే హిట్ టాక్ సంపాదించుకుంది. టిల్లుగాడి మ్యానరిజం, పంచ్ డైలాగ్స్‌కి సినీ ప్రేక్షకులు మరోసారి ఫిదా అయ్యారు. ఫలితంగా తొలిరోజు భారీ కలెక్షన్స్ వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి ఫస్ట్‌డే రూ.23.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. (చదవండి: ‘టిల్లు స్వ్కేర్’ మూవీ రివ్యూ) అలాగే అమెరికాలో ఈ చిత్రం తొలిరోజు 1 మిలియన్ డాలర్స్‌కి పైగా వసూళ్లను రాబట్టింది. హిట్ టాక్ రావడంతో వీకెండ్లో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ సినిమా కచ్చితంగా రూ. 100 కోట్లకు పైగా వసూలు చేస్తుందని నిర్మాత నాగవంశీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. 2022లో వచ్చిన డీజే టిల్లు చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన చిత్రమే ‘టిల్లు స్వ్కేర్’. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది. Tillu Registers a 𝐃𝐎𝐔𝐁𝐋𝐄 𝐁𝐋𝐎𝐂𝐊𝐁𝐔𝐒𝐓𝐄𝐑 Start at the Box-Office with 𝟐𝟑.𝟕 𝐆𝐑𝐎𝐒𝐒 on 𝐃𝐀𝐘 𝟏 🔥 Our Starboy 🌟 is shattering the records all over! 💥💥 Book your tickets here - https://t.co/vEd8ktSAEW #Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala… pic.twitter.com/Dz7hqglg5Z — Sithara Entertainments (@SitharaEnts) March 30, 2024 -
మాట మీద నిలబడ్డ నాగ్! నా సామిరంగకు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
మల్టీస్టారర్ సినిమాలకున్న క్రేజే వేరు. ఇద్దరు హీరోలు తెరమీద కనిపిస్తే చూడటానికి రెండు కళ్లు చాలవు. అలాంటిది ఈ సంక్రాంతికి ముగ్గురు హీరోలు కలిసి ఒకే సినిమాతో సందడి చేశారు. అగ్ర హీరో అక్కినేని నాగార్జున యువ హీరోలు అల్లరి నరేశ్, రాజ్ తరుణ్‌లతో కలిసి నా సామిరంగ సినిమా చేశాడు. ఈ మూవీలో ఆషిక రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సర్ ధిల్లాన్ హీరోయిన్లుగా నటించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించాడు. మూడు రోజుల్లోనే అన్ని కోట్లా? 'పొరింజు మరియమ్ జోస్' అనే మలయాళ సూపర్ హిట్ చిత్రానికి రీమేక్‌గా ఇది తెరకెక్కింది. విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ మూవీ జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సంక్రాంతికి వస్తున్నాం.. బ్లాక్‌బస్టర్ కొడుతున్నాం అని చెప్పిన నాగ్ తన మాటను నిలబెట్టుకునేలా కనిపిస్తున్నాడు. మూడు రోజుల్లోనే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.24.8 కోట్లు (గ్రాస్) రాబట్టింది. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లో.. వసూళ్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం చాలా ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్‌కు దగ్గరగా ఉందని వెల్లడించింది. నాగార్జున జోరు చూస్తుంటే మరో రెండు,మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ దాటేసి హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా నాగార్జున.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అలాగే తమిళ డైరెక్టర్ నవీన్‌తో సినిమా చేయనున్నాడు. ‘బ్రహ్మస్త్ర 2’ లోనూ భాగం కానున్నాడు. Sankranthi KING #NaaSaamiRanga STORM at BO on Kanuma Day!🔥🔥 Total 3 Days WW gross is 24.8 crores💥 Festive celebrations in theatres will continue on Day 4 too🥳#NaaSaamiRangaJaathara 🎟 https://t.co/1i8BJmy6kJ KING👑 @iamnagarjuna @allarinaresh @mmkeeravaani @vijaybinni4u… pic.twitter.com/ayPwBdQk19 — BA Raju's Team (@baraju_SuperHit) January 17, 2024 చదవండి: హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా, యాంకర్‌గా.. ఈ నెలలో ప్రియుడితో పెళ్లి -
సలార్ కి 1000 కోట్లు కష్టమే..
-
500 కోట్ల క్లబ్ లో చేరిన సలార్..
-
వీకెండ్ దాటినా సలార్ అదే జోరు..500 కోట్లతో బాక్సాఫీస్ షేక్
-
సలార్ కూడా వెయ్యి కోట్లు కొడతాడా ?
-
అందుకే నా సినిమా కలెక్షన్స్ తగ్గుతున్నాయి: సల్మాన్ ఖాన్
సల్మాన్ ఖాన్ హీరోగా ‘షేర్షా’ ఫేమ్ విష్ణువర్ధన్ దర్శకత్వంలో ‘ది బుల్’ అనే సినిమా తెరకెక్కనుంది. కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ మార్చిలో ప్రారంభం కానుందని బాలీవుడ్ సమాచారం. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని, ఇందులో పారా మిలిటరీ ఆఫీసర్‌గా సల్మాన్ ఖాన్ నటిస్తారని టాక్. వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఇక తన సినిమాల వైఫల్యాల (‘అంతిమ్, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’లను ఉద్దేశిస్తూ..) గురించి కూడా సల్మాన్ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ‘నా సినిమాలు విడుదలైనప్పుడు, ఆ సినిమాల టికెట్ ధరలు తక్కువగా ఉంటున్నాయి. ఎక్కువ ధరలతో విడుదల చేస్తే ఆ సినిమాల కలెక్షన్స్ కూడా భారీగానే ఉంటాయి. నా తర్వాతి సినిమాను అలాగే రిలీజ్ చేయాలనుకుంటున్నాను’ అని సల్మాన్ అన్నారు. అంతేకాదు.. తక్కువ సినిమా టికెట్ ధరలతో ప్రజల డబ్బును మేం సేవ్ చేస్తున్న విషయం అందరికీ సరిగ్గా అర్థం కావడం లేదని కూడా సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు. -
లియో ఫస్ట్ వీక్ కలెక్షన్స్ 500 కోట్లు..
-
రూ.1000 కోట్ల కల.. డిసెంబర్ వరకు వెయిట్ చేయాల్సిందే!
ఈ ఏడాది పఠాన్, జవాన్ లాంటి వెయ్యి కోట్ల సినిమాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ ఫుల్లు దూకుడు మీదుంది. వీటి మధ్య లో వచ్చిన గదర్ 2 కూడా 500 కోట్లకు పైగానే రాబట్టింది.ఇక కోలీవుడ్ కూడా ముందు జైలర్ తో,ఇప్పుడు లియోతో రెండు సార్లు 500 కోట్ల వసూళ్లను చూసింది. కానీ టాలీవుడ్ మాత్రం ఈ ఏడాదిలో ఇంకా ఈ స్థాయిలో విజయాలను చూడలేదు. సంక్రాంతికి రిలీజైన వాల్తేరు వీరయ్య మూవీ ఒకటే 225 కోట్లు రాబ్టటింది.ఇప్పటికీ టాలీవుడ్స్ ఇయర్స్ బిగ్గెస్ట్ హిట్ గా కొనసాగుతోంది. ఇక ప్రభాస్ నటించిన ఆదిపురుష్ 400 కోట్లకు పైగా రాబట్టినా,ఆది బాలీవుడ్ ఖాతాలోకే వెళ్లిపోయింది. (చదవండి: హీరోయిన్‌తో రహస్యంగా లవ్..? సిగ్గుపడిపోయిన యంగ్ హీరో!) ఆశలన్నీ సలార్‌పైనే డిసెంబర్లో రిలీజ్ కాబోతున్న సలార్ మూవీపై టాలీవుడ్ కూడా భారీ అంచనాలు పెట్టుకుంది. ఈ చిత్రం కచ్చితంగా రూ. 1000 కోట్లు వసూలు చేస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకు కారణాలు కూడా చెబుతున్నారు. ఈ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజీయఫ్ 2తో ఇప్పటికే రూ.1200కోట్ల వసూళ్లను చూశాడు. అలాగే ప్రభాస్ ఫ్లాప్ సినిమాకు కూడా రూ. 400 కోట్ల వరకు కలెక్షన్స్ వస్తున్నాయి. ఒకవేళ హిట్ పడితే మాత్రం రూ.1000 కోట్ల కలెక్షన్స్ ఓ లెక్కనే కాదు. (చదవండి: ‘మార్టిన్ లూథర్ కింగ్’ మూవీ రివ్యూ ) భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ సలార్ చిత్రానికి భారీగా ప్రీరిలీజ్ బిజినెస్ అయినట్లు తెలుస్తోంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ దాదాపు రూ.175 కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం. అదే నిజమైతే మాత్రం టాలీవుడ్ నుంచే ఈ చిత్రం రూ. 300 కోట్ల వరకు రాబట్టాల్సి ఉంఉటంది. ఒక తెలుగు రాష్ట్రాల నుంచే రూ.300 కోట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఆ లెక్కలు ఈజీగా రూ. 1000 కోట్లు దాటుతాయి. మరి ఈ సినిమా ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో డిసెంబర్ 22 తర్వాత తెలుస్తుంది. -
10000 కోట్లు కొల్లగొట్టిన బాలీవుడ్..
-
రూ.1100 కోట్ల క్లబ్లో ‘జవాన్’.. చరిత్ర సృష్టించిన షారుఖ్!
కింగ్‌ఖాన్ షారుఖ్ ఖాన్ మళ్లీ పుంజుకున్నాడు. వరుస ప్లాఫులు రావడంతో కొన్నాళ్లకు సినిమాకు గ్యాప్ ఇచ్చి.. పఠాన్‌తో సాలిడ్ హిట్ అందుకున్నాడు. అదే జోష్‌లో ఈ ఏడాది ‘జవాన్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. ఇప్పటి వరకు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లను సాధించి.. షారుఖ్ సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. బాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి రూ. 1100 కోట్ల రూపాయలు(29 రోజుల్లో) వసూళ్లు సాధించిన చిత్రంగా జావాన్ నిలిచింది. సినిమా విడుదలై నెల రోజులు అయినప్పటికీ..దేశ వ్యాప్తంగా రోజులు దాదపు రూ.కోటి వసూళ్లను రాబడుతోందంటే.. జవాన్ సృష్టించిన సునామీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆమిర్ తర్వాతే షారుఖ్ జవాన్ ఎన్ని రికార్డులు సృష్టించిన.. కలెక్షన్ల పరంగా మాత్రం దంగల్ని అందుకోవడం కష్టమే. ప్రపంచ వ్యాప్తంగా జవాన్ కలెక్షన్స్ రూ. 1103 కోట్ల వద్ద ఉన్నాయి. కేజీయఫ్ 2 (రూ. 1215 కోట్లు), ఆర్ఆర్ఆర్ (రూ.1230 కోట్లు), బాహుబలి 2 (రూ. 1780 కోట్లు), దంగల్ (రూ. 2400 కోట్లు) సినిమాలతో పోలిస్తే.. జవాన్ ఇంకా వెనకబడే ఉంది. ఇంకా చైనాలో జవాన్ చిత్రాన్ని రిలీజ్ చేయలేదు కాబట్టి.. ఒక వేళ అక్కడ కూడా హిట్ అయితే మాత్రం కేజీయఫ్ 2, ఆర్ఆర్ఆర్ చిత్రాలను ఈజీగా క్రాస్ చేస్తుంది. ఈ చిత్రంలో షారుఖ్‌కి జోడిగా నయనతార నటించగా.. దీపికా పదుకొణె కీలక పాత్ర పోషించారు. విజయ్ సేతుపతి విలన్‌గా నటించాడు. జవాన్ రికార్డులు విడుదలైన వారం రోజుల్లో రూ. 600 కోట్ల మార్క్‌ని దాటిన తొలి హిందీ చిత్రం అతి తక్కువ రోజుల్లో రూ. 250 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన తొలి చిత్రం పఠాన్ తొలి రోజు రూ. 57 కోట్లు సాధిస్తే.. జవాన్ రూ. 75 కోట్లు వసూళ్లు రాబట్టింది ఒక హీరో నటించిన రెండు సినిమాలు.. తొలి రోజు రూ. 50 కోట్లకు పైగా వసూలు సాధించిన ఏకైన ఇండియన్ స్టార్‌గా షారుఖ్ చరిత్రకెక్కాడు. బాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి రూ. 1100 కోట్ల రూపాయలు(29 రోజుల్లో) వసూళ్లు సాధించిన చిత్రం Jawan 🤝 Making & breaking box office records every day! 🔥 Book your tickets now!https://t.co/B5xelUahHO Watch #Jawan in cinemas - in Hindi, Tamil & Telugu. pic.twitter.com/JCdsrHFp6r — Red Chillies Entertainment (@RedChilliesEnt) October 6, 2023 -
7 రోజులు.. రూ.600 కోట్లు.. ‘జవాన్’ సరికొత్త రికార్డు
సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీని సృష్టిస్తోంది. విడుదలైన తొలి రోజే రూ. 75 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద బాద్ షా స్టామినా ఏంటో నిరూపించింది. వీకెండ్‌తో పాటు వీక్ డేస్‌లో కూడా మంచి కలెక్షన్స్‌ని రాబట్టింది. కేవలం ఆరు రోజుల్లోనే రూ.570 కోట్ల వసూళ్లను సాధించి చరిత్రకెక్కింది. ఇక ఏడో రోజు కూడా జవాన్ మంచి వసూళ్లనే సాధించాడు. ఏడో రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 44 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. మొత్తంగా ఈ చిత్రం వారం రోజుల్లో రూ. 621 కోట్లు వసూళ్లు చేసి రికార్డు సృష్టించింది. జావాన్ ఖాతాలో అరుదైన రికార్డు విడుదలైన తొలి రోజు జవాన్ చిత్రానికి బ్లాక్‌బస్టర్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్స్ భారీగా పెరిగాయి. ముఖ్యంగా హిందీలో రోజు రోజుకి కలెక్షన్స్ సంఖ్య పెరుగుతోంది. దక్షిణాదికి చెందిన నటీనటులు కూడా ఈ చిత్రంలో నటించడంతో అక్కడ కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. మొత్తంగా వారం రోజుల్లో రూ. 600 కోట్ల మార్క్‌ని దాటిన తొలి హిందీ చిత్రంగా జవాన్ అరుదైన రికార్డుని సాధించింది. (చదవండి: మాట నిలబెట్టుకున్న విజయ్.. రూ. కోటి పంపిణీకి లిస్ట్ రెడీ!) అలాగే ఈ ఏడాదిలో షారుఖ్ నటించిన రెండు చిత్రాలు (పఠాన్, జవాన్) కూడా 500 కోట్లకు పైగా వసూళ్లను సాధించడం గమనార్హం. పఠాన్ తొలి రోజు రూ. 57 కోట్లు సాధిస్తే.. జవాన్ రూ. 75 కోట్లు వసూళ్లు రాబట్టింది. అలాగే ఒకే ఏడాదిలో ఒక హీరో నటించిన రెండు సినిమాలు.. తొలి రోజు రూ. 50 కోట్లకు పైగా వసూలు సాధించిన ఏకైన ఇండియన్ స్టార్‌గా షారుఖ్ చరిత్రకెక్కాడు. అంతేకాదు అతి తక్కువ రోజుల్లో రూ. 250 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన తొలి చిత్రం కూడా ఇదే. అంతకు ముందు బాహుబలి 2 హిందీ వెర్షన్ 250 మార్కును స్కోర్ చేయడానికి 8 రోజులు పట్టింది. ఆ తర్వాత కేజీయఫ్ 2, పఠాన్ చిత్రాలు ఐదు రోజుల్లో ఈ మ్యాజిక్ ఫిగర్‌ని చేరుకుంది. జవాన్ మాత్రం కేవలం నాలుగు రోజుల్లోనే ఈ ఘనత సాధించింది. -
బాక్సాఫీస్ వద్ద ‘ఖుషి’ జోరు.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
ఎట్టకేలకు విజయ్ దేవరకొండ ఖాతాలో హిట్ పడింది. లైగర్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన చిత్రం ‘ఖుషి’. సమంత హీరోయిన్. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం(సెప్టెంబర్ 1) విడుదలై.. తొలిరోజే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. విజయ్-సమంతల ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీకి సినీ ప్రియులు ఫిదా అయ్యారు. అద్భుతమైన పాటలు, బీజీఎం, విజువల్స్‌తో ‘ఖుషి’ విజయంలో కీలక పాత్ర పోషించాయి. (చదవండి: ‘ఖుషి’మూవీ రివ్యూ) ఫస్ట్ డేనే హిట్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి మంచి కలెక్షన్స్ వచ్చాయి. తొలో రోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.30.1కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఏరియాల వారిగా చూస్తే.. ‘నైజాం రూ.5.15 కోట్లు, సీడెడ్ రూ.91 లక్షలు, ఉత్తరాంధ్ర రూ.1.13 కోట్లు, ఈస్ట్ రూ.66 లక్షలు, వెస్ట్ రూ.63 లక్షలు, గుంటూరు రూ. 66 లక్షలు, కృష్ణా రూ. 44లక్షలు, నెల్లూరు రూ.29 లక్షలు, కర్ణాటక-రెస్టాఫ్ ఇండయాలో రూ.85 లక్షలు, ఇతర భాషల్లో రూ.45 లక్షల వసూళ్లను రాబట్టింది. యూస్‌లో ఖుషి జోరు ఇక యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఖుషి జోరు కనిపిస్తోంది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ వద్ద 8 లక్షల డాలర్స్ కలెక్షన్స్ అందుకుంది. వన్ మిలియన్ మార్క్ వైపు వేగంగా పరుగులు పెడుతోంది. ఖుషికి ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ చూస్తుంటే...మరిన్ని సర్ ప్రైజింగ్ బాక్సాఫీస్ నెంబర్స్ సాధిస్తుందని అనుకోవచ్చు. Families Kushi 🥰❤️ Box Office Kushi 🔥 Blockbuster Family Entertainer #Kushi ❤️ Sensational Day 1 with 30.1 CR GROSS WORLDWIDE and a super strong Day 2 on cards 🔥 Book your tickets now! - https://t.co/16jRp6UqHu#BlockbusterKushi 🩷@TheDeverakonda @Samanthaprabhu2… pic.twitter.com/EcD9AcAmoO — Mythri Movie Makers (@MythriOfficial) September 2, 2023 -
‘గాండీవధారి అర్జున’ కలెక్షన్స్.. వరుణ్ కెరీర్లోనే అతి తక్కువ..ఎంతంటే?
వరుణ్ తేజ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘గాండీవధారి అర్జున’. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో సాక్షి వైద్య హీరోయిన్గా నటించింది. ఓ మోస్తరు అంచనాల మధ్య శుక్రవారం(ఆగస్ట్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి తొలి రోజు నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. కథ, కథనంలో కొత్తదనం లేదని, దర్శకుడు మేకింగ్‌పై పెట్టిన దృష్టి బలమైన కథను రాయడంలో పెట్టలేదని విమర్శలు వచ్చాయి. పలు వెబ్సైట్లు కూడా ఈ చిత్రానికి నెగెటివ్ రివ్యూలే ఇచ్చాయి. దీంతో తొలి రోజు ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టడంలో ఈ చిత్రం విఫలమైంది. (చదవండి: సినిమాల్లో కూడా అవకాశాలొచ్చాయి.. కానీ: అభిషేకం సీరియల్ నటి) వరుణ్ కెరీర్లోనే అతి తక్కువగా కేవలం 1.9కోట్ల కనెక్షన్స్ మాత్రమే రాబట్టింది. ఏరియాల వారిగా చూస్తే..నైజాంలో రూ. 60 లక్షలు, సీడెడ్‌లో రూ.15 లక్షలు, ఆంధ్రాలో రూ.65లక్షలు, కర్ణాటక, రెస్టాఫ్ ఆఫ్ ఇండియాలో రూ.50 లక్షలు కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ.1.40 కోట్ల గ్రాస్, రూ. 75లక్షల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. (చదవండి: ‘గాండీవధారి అర్జున’ మూవీ రివ్యూ) వరుణ్ కెరీర్లోనే డిజాస్టర్‌గా మిగిలిన వరుణ్ గత సినిమా గని తొలి రోజు రూ. 3 కోట్లు రాబట్టడం గమనార్హం. ఈ లెక్కన వరుణ్ కెరీర్లోనే గండీవధారి అతిపెద్ద డిజాస్టర్‌గా మిగిలిపోయే అవకాశం మెండుగా ఉంది. ఇక ఈ చిత్రానికి రూ. 17 కోట్ల ప్రిరిలీజ్ బిజినెస్ జరిగినటట్లు సమాచారం. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ. 18 కోట్లు రాబట్టాలి. తొలి రోజే వసూళ్లు దారణంగా ఉండడంతో బ్రేక్ ఈవెన్ అసాధ్యమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా ‘భోళా శంకర్’.. అప్పుడే ఓటీటీలోకి..!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘భోళా శంకర్’. భారీ అంచనాల మధ్య ఆగస్ట్11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడింది. తొలి రోజు నుంచే నెగెటివ్ టాక్ రావడంతో చిరు కెరీర్లోనే భారీ డిజాస్టర్ చిత్రంగా నిలిచింది. దాదాపు రూ.110 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ కనీసం అందులో పావు వంతు కూడా కలెక్షన్స్ రాబట్టలేకపోయిందనే వార్తలు వినిపిస్తునాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రం ఇప్పటివరకు కేవలం రూ. 30 కోట్లను మాత్రమే వసూలు చేసింది. రూ.50 కోట్ల నష్టం! మెగాస్టార్ చిరంజీవి సినిమా కావడంతో భోళా శంకర్‌కి భారీగా ప్రిరిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 80 కోట్ల బిజినెస్ జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమా హిట్ అవ్వాలంటే మినిమమ్ రూ.82 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలి. ఇప్పటి వరకు కేలవం రూ.30 కోట్లు మాత్రమే వసూలు చేసింది. అంటే ఇంకా 50 కోట్లు కలెక్ట్ చేస్తేగానీ ఈ చిత్రం సేఫ్‌జోన్‌లోకి వెల్లదు. ఈ చిత్రం విడుదలే ఇప్పటికే పది రోజులు దాటింటి. పైగా తొలి రోజు నుంచే నెగెటివ్ టాక్. కాబట్టి ఇక ఈ సినిమా థియేటర్లలోనుంచి తీసేసే చాన్స్ ఎక్కువగా ఉంది. ఓవరాల్‌గా చూస్తే ఈ చిత్రానికి రూ.50 కోట్ల నష్టం ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. భారీ ధరకు ఓటీటీ రైట్స్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర్ నిర్మించిన ఈ చిత్రం కోసం పలు ఓటీటీ సంస్థలు పోటీ పడ్డాయట. కానీ చివరకు నెట్ఫిక్స్ ఓటీటీ రైట్స్‌ని దక్కించుకుంది. అది కూడా రూ. 30 కోట్లకు. అయితే ఇదంతా సినిమా రిలీజ్‌కు ముందు జరిగింది. మెగాస్టార్ గత చిత్రం వాల్తేరు వీరయ్య ఓటీటీ రైట్స్ కూడా ఈ సంస్థే దక్కించుకుంది. దానికి మంచి రిజల్ట్ రావడంతో.. భోళా శంకర్‌కి భారీ ధర చెల్లించి, ఓటీటీ హక్కులను కొనుగోలు చేసింది. అయితే సినిమా విడుదల తర్వాత ఫలితంగా దారుణంగా రావడంతో ఆ ఎఫెక్ట్ ఓటీటీపై కూడా ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఓటీటీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఏమేరకు ఆదరిస్తారో చూడాలి. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడు? సాధారణంగా ఏ చిత్రమైనా భారీ విజయం సాధిస్తే.. ఓటీటీలో కాస్త లేట్‌గా స్ట్రీమింగ్ అవుతాయి. మొదట ఫలానా డేట్‌కి స్ట్రీమింగ్ చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నా.. సినిమా ఫలితాన్ని బట్టి వాయిదా వేస్తారు. అదే డిజాస్టర్ టాక్ వస్తే మాత్రం అనుకున్నదానికంటే ముందే ఓటీటీలోకి వచ్చేస్తుంది. భోళా శంకర్ విషయంలోనూ అదే జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం విడుదలైన 8 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని తొలుత భావించారట. కానీ టాక్ దారుణంగా రావడంతో అనుకున్నదాని కంటే ముందే ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నారట. సెప్టెంబర్ 18న నుంచి నెప్ట్ఫ్లిక్స్లో ఈ చిత్రం స్క్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సింది. -
‘భోళా శంకర్’కు తొలి రోజు ఊహించని కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే..
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం ‘భోళా శంకర్’. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన వేదాళం చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. మెహర్ రమేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్గా నటించగా, కీర్తి సురేశ్, సుశాంత్ ఇతర కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(ఆగస్ట్ 11) విడుదలైన ఈ చిత్రానికి తొలిరోజే నెగెటివ్ టాక్ లభించింది. మెగాస్టార్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ చిత్రం పట్ల అసంతృప్తిగానే ఉన్నారు. ఫలితంగా తొలి రోజు ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. (చదవండి: భోళా శంకర్ మూవీ రివ్యూ) ‘భోళా శంకర్’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు ఈ చిత్రం రూ.28 కోట్ల గ్రాస్(రూ.18.61 కోట్ల షేర్) వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాలలో మొత్తంగా రూ. 15.51 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ఏరియాల వారిగా చూస్తే.. నైజాంలో రూ.4.50 కోట్లు, సీడెడ్- రూ.2 కోట్లు, ఈస్ట్-1.50 కోట్లు, వెస్ట్- రూ.1.85 కోట్లు, గుంటూరు- రూ.2.07 కోట్లు, కృష్ణా- రూ.1.02 కోట్లు, నెల్లూరు-రూ.73లక్షలు, కర్ణాటక, ఓవర్సీస్లో మొత్తంగా రూ. 3.1 కోట్లు వసూలు చేసింది. టార్గెట్ రూ.82 కోట్లు భోళా శంకర్ చిత్రానికి దాదాపు రూ. 80 కోట్ల ప్రిరీలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. సినిమా హిట్ అవ్వాలంటే మినిమమ్ రూ.82 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలి. తొలిరోజే నెగెటివ్ టాక్ రావడంతో అంత స్థాయిలో వసూళ్లను రాబట్టకపోవచ్చునని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు రజనీకాంత్ ‘జైలర్’సినిమాకు మంచి టాక్ రావడంతో ఆ ఎఫెక్ట్ కూడా ‘భోళా శంకర్’పై పడే అవకాశం ఉంది. చిరు గత సినిమాల కలెక్షన్స్ ఎంత? ఇక చిరంజీవి గత చిత్రాల వసూళ్లతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఇది కాస్త తక్కువనే చెప్పాలి. చిరంజీవి గత ఐదు సినిమాల ఫస్ట్‌డే వసూళ్లను పరిశీలిస్తే.. వాల్తేరు వీరయ్య-రూ.22.75 కోట్లు, గాడ్ ఫాదర్-రూ.12.83 కోట్లు, ఆచార్య- రూ.28.29 కోట్లు, సైరా- రూ. 36.37 కోట్లు, ఖైదీ నెం 150- రూ. 23.16 కోట్ల వసూళ్లను రాబట్టాయి. భోళా శంకర్‌కు తొలి రోజే నెగెటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ మరింత తగ్గే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నాయి. -
దుమ్మురేపిన ‘బేబీ’.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే..
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘బేబీ’. ‘కలర్ ఫోటో’ సినిమాకు కథ అందించిన సాయి రాజేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(జులై 14) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ట్రైయాంగిల్ లవ్‌స్టోరీగా వచ్చిన ఈ చిత్రానికి యువత బాగా కలెక్ట్ అయింది. ఫలితంగా తొలి రోజు భాకీ వసూళ్లను రాబట్టింది. తొలి రోజు ఈ చిత్రం రూ.7.1 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. ఇటీవల కాలంలో ఓ చిన్న చిత్రానికి ఈ స్థాయిలో ఓపెనింగ్స్ రాలేదు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి ఈ వీకెంట్లో కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. (చదవండి: బేబీ మూవీ రివ్యూ) ఇక ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రానికి రూ.7.40 కోట్ల ప్రిరిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.8 కోట్లుగా ఫిక్సైయింది. తొలి రోజే రూ.7.1 కోట్లు వసూలు చేసి, బ్రేక్ ఈవెన్‌కి దగ్గరగా వచ్చింది. రెండో రోజుతో ఈజీగా బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల బాట పడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బేబీ ఫస్ట్ డే కలెక్షన్స్ వివరాలు ► నైజాం -రూ. 2.3 కోట్లు ►సీడెడ్- రూ.54.7 లక్షలు ►ఈస్ట్: రూ.40.5 లక్షలు ►వెస్ట్: 21.6 లక్షలు ►వైజాగ్: రూ.80.08లక్షలు ►కృష్ణా: రూ.34.6లక్షలు ►గుంటూరు: రూ.29.3లక్షలు ►నెల్లూరు: రూ.17.83లక్షలు ►కర్ణాటక+ ROI: రూ.20.32లక్షలు ►ఓవర్సీస్: 1.74 కోట్లు ►మొత్తం : 7.1 కోట్లు Audience Love for CULT BLOCKBUSTER #BabyTheMovie has grossed a whopping 7.1CR Worldwide on DAY 1 💥 Book your tickets today 👇 🎟️ https://t.co/IUpZAiAOvH#CultBlockbusterBaby pic.twitter.com/YCU7ygrT32 — GSK Media (@GskMedia_PR) July 15, 2023 -
ఆదిపురుష్ కథ ముగిసినట్టే
-
దుమ్ములేపుతున్న 2018 మూవీ.. రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే..
కంటెంట్ నచ్చితే డబ్బింగ్ సినిమానా, రీమేక్ చిత్రమా అని చూడకుండా థియేటర్స్‌కి బారులు తీస్తారు తెలుగు ప్రేక్షకులు. అందుకే టాలీవుడ్లో ఇతర భాష చిత్రాలు ఎక్కువగా డబ్ అవుతుంటాయి. తాజాగా తెలుగులో విడుదలైన మలయాళ సూపర్ హిట్ ‘2018’ చిత్రానికి కూడా టాలీవుడ్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ చిత్రాన్ని మే 26న తెలుగులో విడుదల చేశాడు. ప్రస్తుతం ఈ సినిమాకి అనూహ్య స్పందన లభిస్తుంది. రోజు రోజుకు కలెక్షన్స్ పెరుగుతున్నాయి. మొదటిరోజు 1 కోట్లు వసూలు చేసింది. (చదవండి: 2018 మూవీ రివ్యూ) కేవలం మౌత్ టాక్ ఈ సినిమా రెండో రోజు 1.7 గ్రాస్ ను సాధించింది. మొదటి రోజు కంటే రెండవరోజు కలక్షన్స్ పెరగడం అతి తక్కువ సినిమాలకు జరుగుతుంది. 2018 సినిమాకి అమాంతం 70 కలక్షన్స్ పెరగడం శుభసూచకం. తెలుగు ప్రేక్షకులు ఒక గొప్ప సినిమాను ఆదరిస్తారు అని నమ్మిన ప్రముఖ నిర్మాత బన్నీవాసు నమ్మకం మరోసారి రుజువైంది. ఈ రెండు రోజులు గాను ఈ సినిమా మొత్తం కలక్షన్స్ 2.7 కోట్ల గ్రాస్ పైగా ఉంది. 2018 కేరళలో ఏర్పడ్డ వరదల ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. ఈ చిత్రంలో టోవినో థామస్, ఇంద్రన్స్, కుంచాకో బోబన్, అపర్ణ బాలమురళి, వినీత్ శ్రీనివాసన్, ఆసిఫ్ అలీ, లాల్, నరేన్, తన్వి రామ్, శ్శివద, కలైయరసన్, అజు వర్గీస్, సిద్ధిక్, మరియు జాయ్ మాథ్యూ, సుధీష్ ముఖ్య పాత్రలు పోషించారు. -
Custody Box Office Collection: ‘కస్టడీ’కి ఊహించని కలెక్షన్స్, ఎంతంటే..
నాగచైతన్య హీరోగా నటించిన తాజా చిత్రం ‘కస్టడీ’. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ చిత్రంలో అరవింద స్వామి, శరత్ కుమార్, ప్రియమణి ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ‘బంగార్రాజు’ తర్వాత కృతి శెట్టి మరోసారి నాగ చైతన్య సరసన నటిస్తుంది. పవన్ కుమార్ సమర్పణలో ‘శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్’ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నాగ చైతన్య కెరీర్లోనే భారీ బడ్జెట్ తో నిర్మించాడు. (చదవండి: కస్టడీ మూవీ రివ్యూ) భారీ అంచనాల మధ్య శుక్రవారం(మే12) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి తొలి రోజు మిశ్రమ స్పందన లభించింది. ఫలితంగా తొలి రోజు అనుకున్న స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టలేకపోయింది. (చదవండి: రాజకీయాల్లోకి రీఎంట్రీ? కన్ఫర్మ్ చేసిన బండ్ల గణేశ్ ) ట్రేడ్ వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం ఈ చిత్రం తొలిరోజు దాదాపు రూ.4 కోట్లను మాత్రమే వసూలు చేసింది. ఆంధ్ర తెలంగాణలో రూ.2.5 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. ఇక ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ.22.95 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.23.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. -
‘ఏజెంట్’కు ఊహించని కలెక్షన్స్.. తొలి రోజు ఎంతంటే..?
అక్కినేని హీరో అఖిల్ నటించిన లేటెట్ మూవీ ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(ఏప్రిల్ 28) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సారి ‘అయ్యగారి’కి పక్కా హిట్ వస్తుందని అక్కినేని అభిమానులు ఆశపడ్డారు. కానీ వారి కోరిక నెరవేరలేదు. తొలిరోజు ఈ ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఫ్లాప్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద తొలి రోజు తక్కువ వసూళ్లను రాబట్టింది. ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ చిత్రం ఫస్ట్‌డే ప్రపంచ వ్యాప్తంగా కేవలం రూ. 7 కోట్ల గ్రాస్ వసూళ్లను మాత్రమే సాధించింది. అందులో తెలుగు రాష్ట్రాలలోనే రూ.4 కోట్లు వసూలు చేయడం గమనార్హం. (చదవండి: కొడుకుపై ట్రోలింగ్.. తొలిసారి రియాక్ట్ అయిన అమల అక్కినేని) ఇక ప్రాంతాల వారిగా చూస్తే నైజాంలో 1.33 కోట్లు, సీడెడ్ - రూ. 64 లక్షలు, ఉత్తరాంధ్ర - రూ. 54 లక్షలు, ఈస్ట్ - రూ. 29 లక్షలు, వెస్ట్ - రూ. 30 లక్షలు, గుంటూరు - రూ. 52 లక్షలు, కృష్ణా - రూ. 22 లక్షలు, నెల్లూరు - రూ. 16 లక్షలు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.అఖిల్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్(సుమార్ రూ.80 కోట్లు)తో తెరకెక్కిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వైడ్‌గా రు. 37 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే రు. 38 కోట్ల షేర్ వస్తేనే అఖిల్ బాక్సాఫీస్ దగ్గర గట్టెక్కుతాడు. (చదవండి: బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించిన పీఎస్ 2.. ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే..) కానీ తొలి రోజే ఇంత తక్కువ వసూళ్లను రాబట్టిందంటే.. బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టమేనని ట్రేడ్ పండితులు అంటున్నారు. అయితే అఫీషియల్‌గా ఫస్ట్ డే వసూళ్ల వివరాలు రాకపోయినా, ఈ రిపోర్ట్స్ చూస్తే మాత్రం నిజంగానే అఖిల్ కెరీర్లో ఏజెంట్ అతిపెద్ద డిజాస్టర్‌గా కాబోతున్నట్లు తెలుస్తుంది. కాగా, ఈ మూవీలో మలయాళం సూపర్ స్టార్ మమ్ముట్టి, డినో మోరియా ప్రధాన పాత్రలు పోషించారు. సాక్షి వైద్య హీరోయిన్ కాగా, హిప్ హాప్ తమిళ సంగీతం అందించాడు. -
బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించిన పీఎస్ 2.. ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే..
లెజెండరీ ఫిల్మ్ మేకర్ మణిరత్నం కలల ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించాడు. మొదటి భాగం గతేడాదిలో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. ఇక నిన్న (ఏప్రిల్28) రెండో భాగం పొన్నియన్ సెల్వన్ 2 రిలీజైంది. ఈ చిత్రానికి ఫస్ట్‌డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ వినిపించింది. ఫలితంగా తొలి రోజు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు రూ.54 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. (చదవండి: పొన్నియన్ సెల్వన్ 2 మూవీ రివ్యూ) వీటిలో ఒక్క తమిళనాడులోనే రూ.21 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ నమోదు చేసింది. కేరళలో రూ.2.8 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 2.80 కోట్లు, కర్ణాటకలో రూ.4.05 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ.2.55 కోట్లు, ఓవర్సీస్లో రూ.24.70 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఈ చిత్రం మొత్తంగా రూ.170 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.172 కోట్లు సాధించాలి. తొలి రోజే పాజిటివ్ టాక్ లభించింది. దీంతో వీకెండ్‌లోగా ఈజీగా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. (చదవండి: నాటు నాటు నా టాప్ సాంగ్స్ లిస్టులోనే లేదు: కీరవాణి షాకింగ్ కామెంట్స్) మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. విక్రమ్ చియాన్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మీ, శోభితా ధూళిపాల, ప్రకాశ్ రాజ్, శరత్ కుమార్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చారు. -
ఫుల్ ఖుషీలో సుకుమార్...
-
సినిమా అట్టర్ ప్లాప్.. కలెక్షన్ మాత్రం బీభత్సం
-
కాకి సెంటిమెంట్ తో వండర్స్ క్రీయేట్ చేస్తున్న విరూపాక్ష కలెక్షన్
-
బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘విరూపాక్ష’.. రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే..
చాలా కాలం తర్వాత సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ఖాతాలో మరో హిట్ పడింది. యాక్సిడెంట్ తర్వాత ఆయన నటించిన ‘విరూపాక్ష’ మూవీ ఈ నెల 21న విడుదలై హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. తొలి రోజు తెలుగు రాష్ట్రాలలో దాదాపు రూ.5 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం.. రెండో రోజు అంతకంటే ఎక్కువగా రూ5.80 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించింది. రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 13.65 కోట్ల షేర్, రూ. 24.60 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ని దక్కించుకుంది. ఈ మూవీకి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ రూ. 22 కోట్లకు జరిగింది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ. 23 కోట్లను వసూలు చేయాలి. రెండు రోజుల్లో రూ.13.65 కోట్లు సాధించింది. అంటే రూ. 9.35 కోట్ల 5 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబట్టాలి. మూవీకి వచ్చిన టాక్ని బట్టి చూస్తే.. మరో రెండు రోజుల్లో ఈజీగా బ్రేక్ ఈవెన్ సాంధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి సాయి తేజ్ రీఎంట్రీతోనే బిగ్ కొట్టాడని మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: 20 ఏళ్ల తర్వాత చిరంజీవితో శ్రియ.. ఏకంగా రూ. కోటి డిమాండ్!) ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్‌ప్లే అందించగా.. ఆయన శిష్యుడు కార్తిక్ దండు దర్శకత్వం వహించారు. కాంతారా ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. సాయితేజ్‌కి జోడిగా సంయుక్త మీనన్ నటించగా.. రాజీవ్ కనకాల, సునీల్, సాయిచంద్, బ్రహ్మాజీ ఇతర కీలక పాత్రలు పోషించారు. -
‘శాకుంతలం’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..
సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్.. భరతుడిగా అల్లు అర్జున్ ముద్దుల తనయ అర్హ నటించారు. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం (ఏప్రిల్ 14)విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. వీఎఫ్ఎక్స్ విషయంలో ఆడియన్స్ నిరాశకు గురయ్యారు. ఫలితంగా తొలి రోజు ఈ చిత్రం ఊహించినదానికంటే చాలా తక్కువ కలెక్షన్స్‌ని రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొలిరోజు రూ. 4.70 కోట్ల గ్రాస్, రూ. 2.24 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలలో రూ.2 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్‌ని రాబట్టింది. (చదవండి: ‘శాకుంతలం’ మూవీ రివ్యూ) ఏరియా వైజ్‌గా చూస్తే.. నైజాంలో రూ. 52 లక్షలు, సీడెడ్ రూ.10 లక్షలు, ఉత్తరాంధ్ర రూ. 15 లక్షలు, ఈస్ట్ గోదావరి రూ.8లక్షలు, వెస్ట్ గోదావరి రూ.4 లక్షలు, గుంటూరు రూ. 8 లక్షలు, కృష్ణ రూ. 8లక్షలు, నెల్లూరు రూ. 3లక్షలు చొప్పున వసూళ్లను రాబట్టింది. తమిళ్, కర్ణాటక, ఇతల ప్రాంతాలలో కలిసి రూ. 42 లక్షల కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల వెల్లడిస్తున్నాయి. ఈ వీకెండ్లో కలెక్షన్స్ కాస్త పెరిగే అవకాశం ఉంది. రూ. 60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ అయినట్లు తెలుస్తుంది. రూ.19 కోట్ల టార్గెట్ తో మార్కెట్లోకి వచ్చిన ఈ సినిమాకు ఫస్ట్ డే రూ 2.24 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చింది. అంటే ఈ సినిమా సేఫ్ జోన్లోకి వెళ్లాలంటే.. ఇంకా రూ. 16.76 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంటుంది. మరి సినిమా అనుకున్న టార్గెట్ ను ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తుందో చూడాలి. -
రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘దసరా’.. టీమ్ మెంబర్స్‌కు గోల్డ్ కాయిన్స్!
నేనురల్ స్టార్ నాని హీరోగా నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన చిత్రం ‘దసరా’. శ్రీరామనవమి సంద్భంగా మార్చి 30న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. రా అండ్ రస్టిక్ స్టోరీతో తెరకెక్కించన ఈ చిత్రంలో నాని ఊరమాస్ లుక్‌లో అదరగొట్టేశాడు. ఫలితంగా తొలి రోజే రూ.38 కోట్ల గ్రాస్ వసూలు చేసి నాని కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిసింది. రెండు రోజుల్లోన్లే రూ. 50 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం.. ఈజీగా వంద కోట్ల క్లబ్‌లోకి చేరుతుందని అంతా భావించారు. అనుకున్నట్లే దసరా సినిమా కేవలం వారం రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి అదరగొట్టింది. మార్చి 30న ఈ సినిమా రిలీజ్ అవ్వగా ఏప్రిల్ 5 నాటికి దసరా సినిమా రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. నాని కెరీర్లో రూ. 100 కోట్ల వసూళ్లను సాధించిన చిత్రంగా ‘దసరా’ నిలిచింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నానికి జోడిగా కీర్తి సురేశ్ నటించింది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. శ్రీకాంత్‌కు కి బీఎండబ్ల్యూ కారు ఇక దసరా విజయం చూసి నిర్మాత చెరుకూరి సుధాకర్ మురిసిపోతున్నాడు. వారం రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్బులోకి చేరడంతో.. తెగ ఆనందపడిపోతున్న నిర్మాత.. దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్‌గా ఇచ్చాడు.అలాగే ఈ మూవీ కోసం పనిచేసిన కీ మెంబర్స్ అందరికీ తలో 10 గ్రాముల గోల్డ్ కాయిన్స్ కూడా బహుమతిగా అందజేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Our effort. Your gift 🙏🏼 Cinema wins ♥️#Dasara pic.twitter.com/Rn0VR6nFkL — Nani (@NameisNani) April 5, 2023 -
‘దసరా’కు దిమ్మతిరిగే కలెక్షన్స్.. రెండు రోజుల్లో ఎంతంటే?
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం ‘దసరా’ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సునామీని సృష్టిస్తోంది. మార్చి 30న విడుదలైన ఈ చిత్రం..తొలి రోజే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. తెలంగాణ నేపథ్యంలో రా అండ్ రస్టిక్ స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రంలో నాని ఊరమాస్ నటనతో అదరగొట్టేశాడు. సినిమా చూసిన ప్రతి ఒక్కరు నాని, కీర్తి సురేశ్ నటనతో పాటు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పనితనంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. (చదవండి: ‘దసరా’మూవీ రివ్యూ) ఫలితంగా కలెక్షన్స్ పరంగా ‘దసరా’ దూసుకెళ్తోంది. తొలి రోజే రూ.38 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం.. రెండో రోజు రూ.15 కోట్ల కలెక్షన్స్‌ని రాబట్టి సత్తా చాటింది. మొత్తం రెండు రోజుల్లో దాదాపు రూ.53 కోట్లు గ్రాస్ వసూళ్లను సాధించింది. నైజాం ఏరియాలో ఈ సినిమా రూ. 10.25 కోట్లకు పైగా వసూలు చేసి బ్రేక్ ఈవెన్ సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఓవర్సీస్లోనూ ‘దసరా’దూసుకెళ్తోంది. రెండు రోజుల్లో అక్కడ 1.2 మిలియన్ డాలర్లను వసూలు చేసి నాని ఖతాలో నయా రికార్డును చేర్చింది. విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. కాబట్టి ఈ వీకెండ్లో కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నానికి జోడిగా కీర్తి సురేశ్ నటించింది. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. #Dasara's MASS RAMPAGE at the Box Office ❤️🔥 53+ CRORES Gross Worldwide in 2 days 💥🔥 - https://t.co/9H7Xp8jaoG#DhoomDhaamBlockbuster Natural Star @NameisNani @KeerthyOfficial @Dheekshiths @odela_srikanth @Music_Santhosh @NavinNooli @sathyaDP @saregamasouth pic.twitter.com/xPi31ks9Ir — SLV Cinemas (@SLVCinemasOffl) April 1, 2023 -
బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘బలగం’.. 9వ రోజు రికార్డు కలెక్షన్స్!
కంటెంట్ బాగుంటే.. చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది ప్రేక్షకులు పట్టించుకోరని ‘బలగం’తో మరోసారి రుజువైంది. ఎలాంటి అంచనాలు లేకుండా మార్చి 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. ఊహించని విజయాన్ని సాధించింది. తొలి రోజే పాజిటివ్ టాక్ సంపాదించుకొని.. కలెక్షన్స్ పరంగా దూసుకెళ్తోంది. ఈ వారం పెద్ద సినిమాలేవి లేకపోవడంతో థియేటర్స్ సంఖ్యని కూడా పెంచుకున్న ఈ సినిమా.. 9వ రోజు ఎవరూ ఊహించనవి విధంగా ఏకంగా రూ.1.77 కోట్లు గ్రాస్ కలెక్షన్స్‌ని రాబట్టింది. 9 రోజుల్లో ఈ చిత్రం మొత్తంగా రూ.9.15 కోట్లను వసూళ్లు చేసి నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఇప్పటి వరకూ ఈ సినిమా నైజాం ఏరియాలో రూ. 5.52 కోట్లు, సీడెడ్, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాల్లో కలిపి రూ. 3.63 కోట్లు వసూలు చేసింది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలుపుకుని రూ. 9.15 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 4.02 కోట్లు షేర్‌ను వసూలు చేసి సత్తా చాటుకుంది. జబర్దస్త్ వేణు ఈ మూవీతో దర్శకుడిగా పరిచయమవగా దిల్ రాజు నిర్మించాడు. ప్రియదర్శి, కావ్య కల్యాణ్‌రామ్ ముఖ్యమైన పాత్రల్లో నటించారు. భీమ్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చాడు. -
‘పఠాన్’ కొత్త చరిత్ర.. ‘బాహుబలి’ రికార్డు బద్దలైంది
హిందీలో ‘బాహుబలి’ని దాటేశాడు ‘పఠాన్’. షారుక్ ఖాన్ టైటిల్ రోల్లో రూపొందిన హిందీ చిత్రం ‘పఠాన్’. యశ్ రాజ్ ఫిలింస్ పతాకంపై ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం జనవరి 25న విడుదలైంది. ఇటీవల ఈ చిత్రం రూ. 1000 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించి, ఓ రికార్డును నమోదు చేసుకుంది. కాగా హిందీలో అత్యధిక నెట్ బాక్సాఫీస్ కలెక్షన్స్ సాధించిన టాప్ ప్లేస్ (దాదాపు రూ. 510 నెట్ కలెక్షన్స్)లో ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ కాంబినేషన్లో రాజమౌళి దర్శకత్వం వహించిన ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ ఉండేది. ఈ రికార్డును ‘పఠాన్’ చిత్రం అధిగమించింది. ‘‘హిందీలో నెట్ బాక్సాఫీస్ కలెక్షన్స్ పరంగా ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ రికార్డును అధిగమించిన షారుక్ ఖాన్, చిత్రదర్శకుడు సిద్దార్థ్ ఆనంద్, యశ్‌రాజ్ సంస్థకు శుభాకాంక్షలు. రికార్డులు ఉన్నది బ్రేక్ కావడం కోసమే’’ అని ట్వీట్ చేశారు ‘బాహుబలి’ నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ. ‘బాహుబలి’లాంటి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్స్. మేం మరింత కష్టపడటానికి ఆ సినిమా స్ఫూర్తిగా నిలిచింది’’ అని యశ్ రాజ్ సంస్థ ట్వీట్ చేసింది. Congratulations to @iamsrk sir, #SiddharthAnand @yrf and the entire team of #Pathaan on crossing @BaahubaliMovie 2 Hindi NBOC. Records are meant to be broken and I am happy it was none other than @iamsrk who did it! 😃 https://t.co/cUighGJmhu — Shobu Yarlagadda (@Shobu_) March 4, 2023 -
Mohanlal: వందల కోట్ల స్టార్ హీరోకి దారుణ పరిస్థితి!
మాలీవుడ్ స్టార్ హీరోల్లో మోహన్‌లాల్ ఒకరు. ఆరు పదుల వయస్సులో కూడా కుర్ర హీరోలు సైతం షాక్ అయ్యేలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. అక్కడ లాల్ నటించిన చిత్రాలను టాలీవుడ్లో రీమేక్ చేస్తున్నాం. అయితే ఇదంత కాయిన్‌కి ఒకవైపే. మరోవైపు మాలీవుడ్‌లో మోహన్‌లాల్ పరిస్థితి దారుణంగా ఉంది. ఒకప్పుడు లాల్ సినిమా అంటే వంద కోట్ల కలెక్షన్స్.. కాని ఇప్పుడు కనీసం కోటి రూపాయల కలెక్షన్స్ కూడా దాటడం లేదు. రెండేళ్ల క్రితం వరకు మోహన్‌లాల్ మాలీవుడ్ బాక్సాఫీస్‌ను శాసిస్తూ వచ్చాడు. పులి మురుగన్ సినిమాతో మాలీవుడ్‌కు రూ.100 కోట్లు, లూసీఫర్ తో రూ.150 కోట్ల వసూళ్లను చూపించాడు. అయితే కరోనా తర్వాత మోహన్‌లాల్‌కు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఈ స్టార్ హీరో గతేడాది మాన్స్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. ఇక ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేసిన అలోన్ (Alone) సినిమాకు అయితే తొలి రోజే గెటివ్ టాక్ రావడం అభిమానులను షాక్‌కు గురిచేసింది. అసలు ఇలాంటి కథను మోహన్‌లాల్ లాంటి స్టార్ హీరో ఎలా అంగీకరించారంటూ కొంత మంది విమర్శకులు కామెంట్ చేశారు. ఫలితంగా ఈ చిత్రం తొలి రోజు వసూళ్లు రూ.40 లక్షలు కూడా దాటలేదు. దీంతో లాల్ ఫ్యూచర్‌పై మాలీవుడ్‌లో టెన్షన్ మొదలైంది. కానీ ఈ బిగ్‌స్టార్ త్వరలోనే స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇస్తాడని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మోహన్‌లాల్ చేతిలో లూసీఫర్ 2, దృశ్యం3 చిత్రాలు ఉన్నాయి. అలాగే రజనీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. -
బాక్సాఫీస్‌పై ‘వీరయ్య’ వీరంగం.. 9 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..
జనవరి 15న సంక్రాంతి పండగ అయిపోయింది. కాని మెగాస్టార్ చిరంజీవి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో పండగ సంబరాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. పూనకాలు కూడా కొనసాగుతున్నాయి. జనవరి 13న సంక్రాంతి కానుకగా థియేటర్స్ లోకి వచ్చాడు వాల్తేరు వీరయ్య. చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి, రవితేజ కలిసి నటించిన చిత్రం కావడంతో వాల్తేరు వీరయ్యపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టే కలెక్షన్స్‌ని రాబడుతూ రికార్డులు సృష్టిస్తోంది. సంక్రాంతి పండక్కి బాస్ వస్తే బాక్సాఫీస్ పీస్ పీస్ అవుతుందని ఈ చిత్రం ద్వారా మరో సారి ప్రూవ్ అయింది. తొలి మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరిన వీరయ్య... తొమ్మిది రోజుల్లో రూ.182 కోట్ల గ్రాస్(106 కోట్ల షేర్) వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో ఏరియా వారిగా పరిశీలిస్తే.. నైజాంలో రూ.28.87కోట్లు, సీడెడ్‌లో రూ.15.30 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.13.24 కోట్లు, గుంటూరు రూ.6.72 కోట్లు, కృష్ణ రూ.6.47 కోట్లు, నెల్లూరులో రూ.3.38 కోట్లతో షేర్ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు ఓవర్సీస్ లో సైతం వాల్తేరు వీరయ్య మేనియా కనిపిస్తోంది. ముఖ్యంగా యూఎస్ఏలో చిరు జోరు కొనసాగుతోంది. అక్కడ కూడా వాల్తేరు వీరయ్య 2 మిలియన్ క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మెగాస్టార్ కు బ్లాక్ బస్టర్ పడితే అనకాపల్లి టు అమెరికా పూనకాలు కామన్ అనే విషయాన్ని మరోసారి నిజం చేసింది. -
బాక్సాఫీస్‌పై ‘ధమాకా’ మోత..రూ.50 కోట్ల మార్క్ దిశగా పరుగులు!
మాస్ మహారాజా ‘ధమాకా’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. శ్రీలీల హీరోయిన్గా నటించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ డిసెంబర్ 23ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తొలి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. రవితేజ ఎనర్జీ, యాక్షన్ ఎలిమెంట్స్.. శ్రీలీల గ్లామర్, డ్యాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. దీంతో ఈ సినిమా కలెక్షన్స్ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. తొలి రోజే రూ.10 కోట్ల గ్రాస్ వసూలు సాధించిన ఈ చిత్రం.. ఐదు రోజుల్లో మొత్తం రూ.49 కోట్ల కలెక్షన్స్ రాబట్టి క్రాక్ తర్వా త మళ్లీ ఆ రేంజ్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఇదే ఊపు కొనసాగితే ఈ వారాంతలో వంద కోట్ల గ్రాస్ మార్కును కూడా టచ్ అయ్య చాన్స్ ఉందని ట్రేడ్ వర్గాల చెబుతున్నాయి. ఈ సినిమాకు మాస్‌తో పాటు క్లాస్ సెంటర్స్‌లోనూ మంచి స్పందన రావడం విశేషం. మాస్ మహారాజా రవి తేజ డబల్ రోల్ పోషించిన ఈ చిత్రానికి నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రసన్న కుమార్ బెజవాడ కథ-స్క్రీన్‌ప్లే-మాటలు అందించారు. MassMaharaja @RaviTeja_offl 's MASSive 5️⃣ Days BoxOffice Rampage 💥#DhamakaBlockBuster in Cinemas Now 🥳🤩#Dhamaka Book your tickets nowhttps://t.co/iZ40p9utmY@sreeleela14 @TrinadharaoNak1 @vishwaprasadtg @vivekkuchibotla @KumarBezwada pic.twitter.com/7xAKb4X78o — People Media Factory (@peoplemediafcy) December 28, 2022 -
18 Pages Box Office Collection: ‘18 పేజెస్’ ఫస్ట్ కలెక్షన్స్ ఎంతంటే..
నిఖిల్ సిద్దార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన రెండో చిత్రం ‘18 పేజెస్’. ఈ చిత్రానికి పాన్ ఇండియా డైరెక్టర్ సుకుమార్ కథను అందించారు. ఆయన శిష్యుడు సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించాడు. వరుస హిట్ సినిమాలను నిర్మిస్తున్న ‘జీఏ 2’ పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజే ఈ మూవీ పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం..ఈ చిత్రం తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.3.45 కోట్ల(రూ.1.75 షేర్) కలెక్షన్స్ రాబట్టింది. అత్యధికంగా నిజాంలో రూ.1.05 కోట్లు, సీడెడ్‌లో రూ.0.25 కోట్లు, ఆంధ్రాలో రూ.1.05 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రానికి రూ.12 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.12.50 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. తొలిరోజు రూ.1.75 కోట్లు మాత్రమే సాధించింది. ఇంకో రూ.10.75 కోట్ల కలెక్షన్స్ రాబడితే ఈ చిత్రం సేఫ్ జోన్లోకి వెళ్తుంది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్ డేస్‌లో కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉందని, బ్రేక్ ఈవెన్ ఈజీగా సాధిస్తుందని సీనీ వర్గాలు చెబుతున్నాయి. -
బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతున్న ‘ధమాకా’.. ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే..
మాస్ మహారాజా హీరోగా నటించిన తాజా చిత్రం ‘ధమాకా’. శ్రీలీల హీరోయిన్గా నటించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఈ శుక్రవారం(డిసెంబర్ 23) ప్రేక్షకుల ముందుకు వచ్చి..తొలిరోజే మంచి టాక్ని సంపాదించుకుంది. రవితేజ ఎనర్జీ, యాక్షన్ ఎలిమెంట్స్.. శ్రీలీల గ్లామర్, డ్యాన్స్ ఈ సినిమాకు బాగా కలిసొచ్చాయి. రొటీన్ కథే అయినప్పటికీ.. రవితేజ నుంచి ఫాన్స్ ఏం ఆశిస్తారో అవన్నీ ఉండేలా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు త్రినాధ రావు నక్కిన. అందుకే ఈ సినిమా తొలి రోజు ఈ సినిమా భారీ కలెక్షన్స్‌ని రాబట్టింది. తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.10 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. (చదవండి: ధమాకా మూవీ రివ్యూ) ఈ సినిమా మాస్‌తో పాటు క్లాస్ సెంటర్స్‌లోనూ అనూహ్యంగా బిజినెస్ చేసింది. నైజాంతో సహా చాలా సెంటర్లలో రవితేజకి ధమాకా బిగ్గెస్ట్ డే వన్ గ్రాసర్‌గా నిలిచింది. నైజాంలో రూ.2.10 కోట్లు, సీడెడ్‌లో రూ.72 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.56 లక్షలు, ఈస్ట్ రూ.24 లక్షలు, వెస్ట్ 26 లక్షలు, గుంటూరు రూ.40 లక్షలు, కృష్ణాలో రూ.25 లక్షల చొప్పున వసూలు చేసింది. ఓవర్సీస్లో కూడా ఈ చిత్రానికి మంచి ఓపెన్సింగ్ వచ్చాయి. క్రిస్మస్ సెలవులు ఉండడంతో ఈ వీకెండ్ కలెక్షన్లు భారీగాపెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. MassMaharaja @RaviTeja_offl 's MASSive Box Office Rampage 💥#DhamakaBlockBuster in Cinemas Now 🥳🤩#Dhamaka Book your tickets nowhttps://t.co/iZ40p9utmY#DhamakaFromDec23@sreeleela14 @TrinadharaoNak1 @vishwaprasadtg @vivekkuchibotla @KumarBezwada pic.twitter.com/pr8bQO2z2R — People Media Factory (@peoplemediafcy) December 24, 2022 -
మరో మలయాళ సంచలనం..రూ.6 కోట్లతో తీస్తే.. రూ.42 కోట్ల కలెక్షన్స్!
సీనీ ప్రేక్షకులు ఆలోచన మారింది. ఒకప్పుడు స్టార్ హీరోహీరోయిన్ ఉంటే చాలు.. ఎలాంటి సినిమానైనా ఆదరించేవాళ్లు. తమ అభిమాన హీరో అయితే.. సినిమా బాలేకపోయినా థియేటర్స్‌కి వెళ్లి చూసేవాళ్లు. కానీ ఇప్పుడు వారి ఆలోచనలో మార్పు వచ్చింది. మంచి కంటెంట్ ఉంటే చాలు.. హీరో హీరోయిన్లు ఎవరనేది పట్టించుకోకుండా థియేటర్స్‌కి వెళ్తున్నారు. దానికి మంచి ఉదాహరణ ఇటీవల విడుదలైన ‘కాంతర’ చిత్రమే. ఈ సినిమాలో హీరోగా నటించిన రిషబ్ శెట్టి పెద్ద స్టార్ హీరో ఏం కాదు. కానీ ఆయన సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఆడింది. ఊహించని కలెక్షన్స్ తెచ్చిపెట్టింది. తాజాగా మలయాళ చిత్రం ‘జయ జయ జయహే’ కూడా అలాంటి విజయాన్నే సొంతం చేసుకుంది. పేరున్న నటీనటులేవరు అందులో లేకున్నా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. మలయాళంలో చిన్న సినిమాగా అక్టోబర్ 28న విడుదలైన ఈచిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం రూ.6 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తే.. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే రూ.42 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టిస్తోంది. బేసిల్ జోసెఫ్, దర్శన రాజేంద్రన్ జంటగా విపిన్ దాస్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాను కేవలం 42 రోజుల్లోనే తీయడం మరో విశేషం. ‘జయ జయ జయహే’ కథేంటంటే.. జయ భారతి(దర్శన రాజేంద్రన్) మధ్య తరగతికి చెందిన తెలివైన అమ్మాయి. స్వతంత్ర భావజాలం కలిగిన అమ్మాయి. ఆమె చదువు పూర్తి కాకముందే పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించుకుంటారు. పెళ్లి తర్వాత కూడా తాను చదువుకుంటానని, తన నిర్ణయాన్ని అంగీకరించిన వ్యక్తినే వివాహం చేసుకుంటానని చెబుతుంది. జయ నిర్ణయాన్ని అంగీకరించడంతో పౌల్ట్రీ యజమాని రాజేష్(బేసిల్ జోసెఫ్)తో పెళ్లి జరుగుతుంది. పెళ్ళి తర్వాత రాజేష్ జయ చదువు వాయిదా వేస్తూ ఇంట్లో జరిగే ప్రతిదీ తన ఇష్ట ప్రకారమే జరగాలని మొండిగా ఉంటాడు. ఆ తర్వాత జయను శారీరకంగా కూడా హింసిస్తాడు. అది సర్వ సాధారణ వ్యవహారంగా మారటంతో జయ తల్లిదండ్రుల మద్దతు కోరుతుంది. కానీ వారు సర్దుకుపొమ్మని చెబుతారు. తనకు సాయం చేసేందుకు ఎవరూ రారన్న నిజాన్ని గ్రహించి తదనుగుణంగా చర్యలు తీసుకుని తన కష్టాలకు ఎలా ముగింపు పలికింది అనేది మిగతా కథ. ఈ సినిమాను తెలుగులో డబ్ చేసి థియేటర్లలో రిలీజ్ చేయాలని ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ తెలుగు హక్కులను సొంతం చేసుకోవడం విశేషం. -
‘యశోద’ ఫస్ట్‌డే కలెక్షన్స్ .. సమంత క్రేజ్ మాములుగా లేదుగా!
స్టార్ హీరోయిన్ సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా 'యశోద'. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి హరి, హరీష్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య శుక్రవారం(నవంబర్ 11) విడుదలైన ఈ చిత్రానికి తొలి రోజు మంచి స్పందన లభించింది. సరోగసీ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో సమంత పోరాట ఘట్టాలు ప్రేక్షలను మెప్పించాయి. టీజర్, ట్రైలర్‌కు భారీ స్పందన లభించడంతో తొలిరోజు భారీ అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్నారు. ఫలితంగా ఫస్ట్‌డే ఈ చిత్రానికి మంచి వసూళ్లే వచ్చాయి. (చదవండి: ‘యశోద’ మూవీ రివ్యూ) ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం యశోద చిత్రం మొదటి రోజు దేశవ్యాప్తంగారూ. 3.25 కోట్లు కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాల విషయానికొసే.. నైజాంలో రూ.84 లక్షలు, సీడెడ్‌లో రూ.18 లక్షలు, ఆంధ్రాలో రూ.63 లక్షలు వసూలు చేసింది. ఇక ఇతర ప్రాంతాల విషయానికొస్తే.. తమిళనాడులో రూ.14 లక్షలు, మలయాళంలో రూ.10 లక్షలు, కర్ణాటక, రెస్టాఫ్ ఇండియాలో కలిసి రూ.20 లక్షల వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్లో రూ.84 లక్షలు కలుపుకుంటే ఈ చిత్రం మొత్తంగా రూ.3.25 కోట్లు వసూళ్లు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇది సమంత క్రేజ్‌కి ఎక్కువనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలకు సైతం తొలి రోజు ఈ స్థాయి కలెక్షన్స్ రావడంలేదు. ఆ విషయంలో సమంత సక్సెస్ సాధించనట్లే. కానీ యశోదకు అయిన బిజినెస్ దృష్ట్యా ఈ వసూళ్లు తక్కువని ఈ సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. యశోద చిత్రానికి రూ.21 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం రూ.22.5కోట్లు రాబట్టాల్సి ఉంటుంది. తొలి రోజు రూ.3.25 కోట్లు రాబట్టడంతో ఈ సినిమా ఇంకా రూ.19.25ట్లు వసూళ్లు చేయాల్సి ఉంటుంది. -
టాలీవుడ్లో దూసుకెళ్తున్న ‘కాంతార’.. తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే..
‘కేజీయఫ్’తర్వాత కన్నడ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో అలరిస్తున్నాయి. శాండిల్ వుడ్ చిత్రాలపై యావత్ భారత్ సీనీ ప్రేక్షకులకు ఆసక్తి పెరిగింది. అందుకే కన్నడ మేకర్స్ పాన్ ఇండియా స్థాయి సినిమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే కొన్ని చిత్రాలు మాత్రం కన్నడ ప్రేక్షకుల కోసమే రూపొందిస్తుంటే.. అవి కూడా మిగతా భాషల ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. ఫలితంగా చిన్న చిత్రాలు కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. చిన్న చిత్రంగా విడుదలై భారీ విజయం సాధించిన తాజా కన్నడ చిత్రం ‘కాంతార’.ఈ చిత్రం కన్నడ వెర్షన్ సెప్టెంబర్ 30న విడుదలై సంచలనం సృష్టించింది. (చదవండి: బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ‘కాంతర’ బడ్జెట్ ఎంతో తెలుసా..?) తాజాగా ఈ చిత్రం తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ మాదిరిగానే ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం సంచలనం సృష్టిస్తోంది. శనివారం(అక్టోబర్ 15)టాలీవుడ్లో రిలీజైన ఈ చిత్రం.. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ఫలితంగా తొలి రోజు భారీ వసూళ్లను రాబట్టింది. ఒక్క రోజే రూ.5 కోట్ల గ్రాస్ వసూళ్లని రాబట్టినట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి తెలుగులో రూ.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటికే రూ.114 కోట్ల షేర్ వసూళ్లని రాబట్టి రికార్డుని సృష్టించింది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరాంగదుర్ నిర్మించారు. -
బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ‘కాంతార’ బడ్జెట్ ఎంతో తెలుసా?
చిన్న చిత్రంగా వచ్చి భారీ విజయం సాధించిన చిత్రం ‘కాంతార’. సెప్టెంబర్ 30న కేవలం కన్నడలో విడుదలైన ఈ చిత్రం ఆక్కడ ప్రభంజనం సృష్టించింది. కేవలం 15 రోజుల్లోనే ఒక్క కన్నడలోనే రూ.92 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి కేజీయఫ్ రికార్డులను బద్దలు కొట్టింది. శాండిల్ వుడ్లో కేజీయఫ్2 తర్వాత ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన చిత్రం ‘కాంతారా’నే. ఓవర్సీస్లోనూ మంచి వసూళ్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 15 రోజుల్లో రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. (చదవండి: కాంతార మూవీ రివ్యూ) అంతటి సంచలన విజయం సాధించిన ఈ చిత్రాన్ని తాజాగా తెలుగులో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ ‘గీతాఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్’ ద్వారావిడుదల చేశారు. శనివారం(అక్టోబర్ 15)టాలీవుడ్లో రిలీజైన ఈ చిత్రం.. మంచి ఓపెనింగ్స్‌ని సాధించింది. ఈ సినిమా తెలుగు హక్కులు కేవలం రూ.2 కోట్లకు అమ్ముడు పోయాయి. అయితే తొలిరోజే హిట్ టాక్ రావడంతో రూ. కోటీ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా హీరో,హీరోయిన్లు ఎవరో కూడా తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియదు. కానీ కేవలం కథ మాత్రమే ఆడియన్స్‌ని థియేటర్స్‌కి రప్పిస్తుంది. అయితే ఈ సినిమాను థియేటర్స్‌లో చూస్తే భారీ బడ్జెట్‌తో నిర్మించినట్లు కనిపిస్తుంది. కానీ ఈ సినిమా మేకింగ్‌కి అయిన ఖర్చు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. వందల కోట్లు కొల్లగొడుతున్న ఈ చిత్రాన్ని రిషబ్ శెట్టి కేవలం రూ.16 కోట్ల బడ్జెట్‌తోనే తెరకెక్కించారట. ఈ లెక్కన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రానికి వచ్చిన హిట్ టాక్ చూస్తే.. కేవలం తెలుగులోనే బడ్జెట్‌కి పెట్టిన రూ.16 కోట్లు ఈజీగా వసూళ్లు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరాంగదుర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. -
బాక్సాఫీస్‌పై ‘గాడ్ ఫాదర్’ దండయాత్ర.. రెండో రోజూ భారీ కలెక్షన్స్
మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘గాడ్ ఫాదర్’. మలయాళం సూపర్ హిట్ ‘లూసిఫర్’కు తెలుగు రీమేక్ ఇది. దసరా సందర్భంగా అక్టోబర్ 5న విడుదలైన ఈ చిత్రం.. ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. చాలా కాలం తర్వాత చిరంజీవి రేంజ్‌కి తగ్గ సినిమా రావడంతో ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ ‘గాడ్ ఫాదర్’పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. దీంతో ఈ చిత్రం భారీ స్థాయిలో వసూళ్లను రాబడుతోంది. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.38 కోట్లు గ్రాస్ వసూళ్లను సాధించిన ‘గాడ్ ఫాదర్’.. రెండో రోజు కూడా అదే దూకుడు ప్రదర్శించింది. రెండో రోజు వరల్డ్ వైడ్‌గా రూ.31 కోట్లు కలెక్ట్ చేసింది. సాధారణంగా స్టార్ హీరోల సినిమాకు తొలి రోజు భారీ స్థాయిలో కలెక్షన్స్ రావడం సహజమే. సినిమాకు హిట్ టాక్ వచ్చినప్పటికీ ఫస్ట్ డేతో పోలిస్తే సెకండ్ డే 20 నుంచి 30 శాతం వసూళ్లు పడిపోతాయి. కానీ గాడ్ ఫాదర్ విషయంలో అలా జరగలేదు. రెండో రోజు కూడా భారీ వసూళ్లును సాధించి రికార్డు సాధించింది. రెండు రోజుల్లో మొత్తం రూ.69 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. సినిమాకు హిట్ టాక్ రావడం, దసరా సెలవులు కొనసాగుతుండడంతో వీకెండ్‌లోగా ఈ సినిమా ఈజీగా రూ.100 కోట్ల మార్క్‌ను దాటేస్తుందని సినీ పండితులు అభిప్రాయపడుతున్నారు. -
రూ.100 కోట్ల క్లబ్‌లోకి ‘పొన్నియన్ సెల్వన్’.. రెండో రోజు కలెక్షన్స్ ఎంతంటే..
లెజెండరీ ఫిల్మ్ మేకర్ మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన హిస్టారికల్ చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. ప్రముఖ తమిళ రచయిత కల్కి రాసిన నవల ఆధారంగా, చోళుల కథతో ఈ సినిమా తెరకెక్కింది. చియాన్ విక్రమ్, ‘జయం’ రవి, కార్తీ, ఐశ్వర్యా రాయ్, త్రిష, ఐశ్వర్యా లక్ష్మి, ప్రకాష్‌రాజ్, శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, శోభిత ధూళిపాళ, కీలక పాత్రల్లో నటించారు. భారీ అంచన సెప్టెంబర్ 30న విడుదలైన ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో మిశ్రమ స్పందన లభించగా, తమిళనాట మాత్రం హిట్ టాక్ వచ్చింది. దీంతో అక్కడ ఈ చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతూ రూ.100 కోట్ల క్లబ్లో చేరేందుకు పరుగులు పెడుతోంది. విడుదలైన రెండు రోజులకే ఒక్క తమిళనాడులోనే రూ.47 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రం రూ.9 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. కేరళలో రూ.6 కోట్లు, ఓవర్సీస్లో దాదాపు 60 కోట్ల పైగా వసూళ్లను రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో ఈ చిత్రం దాదాపు రూ.147 కోట్ల గ్రాస్, రూ.75 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ.130 కోట్ల ప్రిరిలీజ్ బిజినెస్ జరిగింది. తమిళనాడుతో పాటు ఓవర్సీస్లో కూడా మంచి టాక్ సంపాదించుకోవడంతో ఈజీగా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
‘బ్రహ్మాస్త్రం’ ఫస్ట్‌డే కలెక్షన్స్.. టాలీవుడ్లో సరికొత్త రికార్డు
బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన భారీ పాన్ ఇండియా చిత్రం `బ్రహ్మాస్త్ర`. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, అలియాభట్ జంటగా నటించనగా, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, నాగార్జున, షారూక్ ఖాన్ మౌనీ రాయ్ పలు కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(సెప్టెంబర్9) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. అయితే ఈ చిత్రంలో స్టార్ హీరోలు నటించడంతో తొలి రోజు మాత్రం రికార్డు స్థాయిలో వసూళ్ల రాబట్టినట్లు తెలుస్తోంది. (చదవండి: ‘బ్రహ్మాస్త్రం’ మూవీ రివ్యూ) ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం మొదటి రోజు రూ.75 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు చిత్ర నిర్మాత కరణ్ జోహర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. హాలీడే కాకపోయినప్పటికీ ఇండియా వైడ్‌గా రూ. 35-38 కోట్ల షేర్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక ఈ చిత్రానికి టాలీవుడ్లో కూడా మంచి స్పందన లభించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 6.7 కోట్లు గ్రాస్(రూ.3.7 కోట్ల షేర్) వసూళ్లను సాధించింది. తెలుగులోకి అనువాదమైన బాలీవుడ్ చిత్రాల్లో ఇది సరికొత్త రికార్డు. అంతకు ముందు ఆమిర్ ధూమ్ 3 చిత్రం రూ.4.7 కోట్లు సాధించింది. ఆ రికార్డుని బ్రహ్మాస్త్ర బద్దలు కొట్టింది. ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.4.55 కోట్ల థియేట్రికల్ బిజినెస్(హిందీ, తెలుగు వెర్షన్లతో కలిపి) జరిగింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.4.8 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంటుంది. Humbled…grateful…yet can’t control my excitement! Thank you♥️ #Brahmastra pic.twitter.com/00pl9PGO5K — Karan Johar (@karanjohar) September 10, 2022 -
Laal Singh Chaddha: సినిమా అట్టర్ ఫ్లాప్.. కలెక్షన్స్‌లో రికార్డు
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన తాజా చిత్రం 'లాల్‌సింగ్ చడ్డా’. ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’కు హిందీ రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రంపై బాలీవుడ్ భారీ ఆశలు పెట్టుకుంది. వరుసగా డిజాస్టర్లతో సతమతమవుతున్న బాలీవుడ్ బాక్సాఫీస్‌కు ఊపిరి అందిస్తుందని భావించారు. కానీ ఆగస్ట్ 11న విడుదలైన ఈచిత్రం భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఆమిర్ ఖాన్ ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. ఆ ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఇండియాలో దాదాపు రూ.60 కోట్లను మాత్రమే వసూలు చేసి ఆమిర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. (చదవండి: తారక్ వల్లే నా పెళ్లి జరిగింది: ప్రముఖ నిర్మాత కూతురు) అయితే విదేశాల్లో మాత్రం ‘లాల్‌సింగ్’ రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది విదేశాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన హిందీ చిత్రంగా ‘లాల్‌సింగ్ చడ్డా’ నిలిచింది. ఓవర్సీస్లో 7.5 మిలియన్ల డాలర్స్ కలెక్ట్ చేసి గంగూబాయి కతియావాడి (7.47 మిలియన్స్ డాలర్స్), భూల్ భూలయ్య 2(5.88 మిలియన్స్ డాలర్స్) పేరిట ఉన్న రికార్డును చెరిపేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఇప్పటి వరకు రూ.126 కోట్లను వసూలు చేసింది. అద్వెత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కరీనా కపూర్, అక్కినేని నాగ చైతన్య కీలక పాత్రలు పోషించారు. వైయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆమిర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. -
‘కార్తికేయ 2’ సంచలనం.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్!
చిన్న సినిమా వచ్చి పెద్ద విజయం అందుకున్న చిత్రం ‘కార్తికేయ 2’. నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 15.44 కోట్ల షేర్(26.50 కోట్ల గ్రాస్) కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.11.54 కోట్ల షేర్, 17.80 కోట్ల గ్రాస్ వసూలు సాధించింది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో రోజు రోజుకి థియేటర్స్ సంఖ్య పెరుగుతుంది. దీంతో ఈ చిత్రం తొలి మూడు రోజుల్లో వరుసగా.. 3.50 కోట్లు, 3.81 కోట్లు, 4.23 కోట్లు సాధించి, నిఖిల్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. (చదవండి: గుడ్‌న్యూస్ చెప్పిన స్టార్ హీరోయిన్, బేబీ బంప్‌తో సర్ప్రైజ్) సిని విశ్లేషకుల సమాచారం ప్రకారం... కార్తికేయ 2 చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.12.80 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.13.30కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉండగా.. మూడు రోజుల్లోనే ఆ మార్క్‌ని దాటేసి లాభాల బాట పట్టింది. తొలిరోజే హిట్ టాక్ రావడంతో ఈ వీకెండ్ వరకు కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కార్తికేయ2 మూడు రోజుల కలెక్షన్స్(ఏరియాల వారిగా) ► నైజాం -రూ.4.06 కోట్లు ► సీడెడ్ - రూ.1.83 కోట్లు ► ఈస్ట్ - రూ.99లక్షలు ► వెస్ట్ - రూ. 73 లక్షలు ► ఉత్తరాంధ్ర -రూ. 1.51 కోట్లు ► గుంటూరు- రూ. 1.14 కోట్లు ► కృష్ణా - రూ. 87 లక్షలు ► నెల్లూరు - రూ.41 లక్షలు ►కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా- రూ. 70 లక్షలు ►ఓవర్సీస్- రూ.2.60 కోట్లు ►నార్త్ ఇండియా-రూ.60లక్షలు ►మొత్తం రూ.15.44 కోట్లు(26.50 కోట్లు గ్రాస్) -
బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న ‘కార్తికేయ 2’ .. ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే..
నిఖిల్, అనుపమా పరమేశ్వరన్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కార్తికేయ 2’. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మించారు.ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ఇందులో కీలక పాత్ర పోషించాడు. భారీ అంచనాల మధ్య ఆగస్ట్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలి రోజే హిట్‌టాక్ సంపాదించుకుంది. (చదవండి: ‘ కార్తికేయ2 ’ మూవీ రివ్యూ) దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దూసుకెళ్తోంది. ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో థియేటర్స్ లభించనప్పటికీ.. తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.8.50 కోట్ల గ్రాస్, రూ.5.05 కోట్ల షేర్ వసూళ్లని రాబట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు రూ.5.30 కోట్ల గ్రాస్, రూ.3.50 కోట్ల షేర్ కలెక్షన్స్‌ని రాబట్టి.. నిఖిల్ కెరీర్లోనే ఫస్ట్‌డే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ‘కార్తికేయ2’ నిలిచింది. నిఖిల్ గత ఐదు సినిమాల తొలిరోజు వసూళ్లని పరిశీలిస్తే.. అర్జున్ సురవరం రూ.1.38 కోట్లు, కిర్రాక్ పార్టీ రూ.1.65 కోట్లు, కేశవా రూ.1.58 కోట్లు, ఎక్కడికి పోతావు చిన్నవాడా రూ.1.25 కోట్ల షేర్స్ అందుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కార్తికేయ2 తొలిరోజు కలెక్షన్స్(ఏరియాల వారిగా) ► నైజాం - రూ.1.24 కోట్లు ► సీడెడ్ -రూ.40 లక్షలు ► ఈస్ట్ - రూ.33 లక్షలు ► వెస్ట్ - రూ.20 లక్షలు ► ఉత్తరాంధ్ర - రూ.45లక్షలు ► గుంటూరు- రూ.44 లక్షలు ► కృష్ణా - రూ.27 లక్షలు ► నెల్లూరు - రూ.17 లక్షలు ► మెత్తం రూ. రూ.3.50 కోట్లు(షేర్) సిని విశ్లేషకుల సమాచారం ప్రకారం... కార్తికేయ 2 చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.17.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ.18 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాసం ఉండాలి. తొలిరోజే హిట్ టాక్ రావడంతో బ్రేక్ ఈవెన్ ఈజీగా దాటుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
మళ్లీ అదే మోసం.. ఆశలన్నీ ‘లైగర్’పైనే
బాలీవుడ్‌కు వరుసగా షాక్స్ తగులుతూనే ఉన్నాయి. అక్కడి హీరోలు వరుస పెట్టి ఉత్తరాది ఆడియెన్స్ కు షాక్స్ ఇస్తూనే ఉన్నారు. యంగ్ హీరోలు సరేసరి కనీసం స్టార్ హీరోలైనా కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ లో నటిస్తారు అంటే ఆమిర్ ఖాన్ లాంటి హీరో కూడా మోసం చేసేసాడు.మొత్తంగా నార్త్ సైడ్ ఫిల్మ్ బిజినెస్ ఇప్పట్లో గాడిన పడే అవకాశాలే కనిపించడం లేదు. (చదవండి: కావాలనే టార్గెట్ చేశారు.. అందుకే ఓపెనింగ్స్ తగ్గాయి: కరీనా కపూర్) కొన్నేళ్లుగా బాలీవుడ్ బాక్సాఫీస్ ను శాసిస్తున్న హీరోలు ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్. ఇండిపెన్డెన్స్ డే వీకెండ్ కావడంతో ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఒకేసారి బాక్సాఫీస్ ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 11న ఆమిర్ ఖాన్ ‘లాల్ సింగ్ చెడ్డా’గా వస్తే, అక్షయ్ ఏమో ‘రక్షా బంధన్’ అంటూ సెంటిమెంట్ మూవీ తీసుకొచ్చాడు. ఇద్దరు స్టార్ హీరో పూర్తిగా పడిపోయిన బాలీవుడ్ బిజినెస్ ను నిలబెడతారని అందరూ అనుకున్నారు. కానీ వీరిద్దరు తీసుకొచ్చిన సినిమాలు ఉత్తరాది వారికి అస్సలు నచ్చలేదు. దాంతో తొలి రోజు వసూళ్లు దారుణంగా వచ్చాయి. ఆమిర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా తొలి రోజు ఇండియా వరకు చూసుకుంటే 12 కోట్లు అట. మొత్తంగా శనివారం వరకు అంటే మూడు రోజుల్లో ఈ చిత్రం రూ. 27.5 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక అక్షయ్ కుమార్ రక్షా బంధన్ తొలి రోజు వసూళ్లు 8 కోట్లు దాటాయట. ఇప్పటి వరకు ఈ సినిమా రూ. 21.60 కోట్లు వసూలు చేసిందట. మొత్తంగా ఇద్దరు స్టార్ హీరోలు కలసి వచ్చినా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర తొలిరోజు పట్టుమని 20 కోట్లు దాటించలేకపోయారు. ముఖ్యంగా ఆమిర్ ఖాన్ ఈ రేంజ్ లో డిజప్పాయింట్ చేస్తాడని బీటౌన్ అస్సలు ఊహించలేదు. (చదవండి: ‘లాల్‌సింగ్ చడ్డా’ మూవీ రివ్యూ) ఈ సిచ్యూవేషన్ లో బాలీవుడ్ బాక్సాఫీస్ ను ఆదుకునేది ఎవరూ అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ నుంచి వెళ్తున్న మరో పాన్ ఇండియా ఫిల్మ్ ‘లైగర్’ తప్పకుండా హిందీ మార్కెట్ కు కొంత లైఫ్ ఇస్తుందని అక్కడి ఇండస్ట్రీ వర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. కరణ్ జోహర్ లాంటి పెద్ద నిర్మాత బ్యానర్ నుంచి మూవీ రిలీజ్ అవుతుండం, విజయ్ దేవరకొండ ప్రమోషన్స్ కు జనం ఎగబడుతుండటం చూస్తుంటే లైగర్ ఓపెనింగ్స్ వేరే లెవల్లో ఉండే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అందుకే లాల్ సింగ్ చద్దా, రక్షా బంధన్ నిరాశపరిచినా లైగర్ వస్తున్నాడు కదా అనే కాన్ఫిడెన్స్ బీటౌన్ ఎగ్జిబీటర్స్ లో కనిపిస్తోంది. -
'పోకిరి' స్పెషల్ షో.. దిమ్మతిరిగే కలెక్షన్స్ వసూలు
సూపర్ స్టార్ మహేశ్‌బాబు- మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం పోకిరి. 2006లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. మహేశ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది ఈ చిత్రం. తాజాగా ఆగస్ట్9న మహేశ్ బాబు బర్త్‌డే సందర్భంగా మరోసారి థియేరట్స్‌లో పోకిరి చిత్రం సందడి చేసిన సంగతి తెలిసిందే. అభిమానుల కోలాహాలం మధ్య ఈ సినిమాకి మరోసారి భారీ రెస్పాన్స్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. నైజాంలో రూ. 69 లక్షలు, గుంటూరులో రూ. 13 లక్షలు, కృష్ణాలో రూ. 10 లక్షలు, నెల్లూరులో రూ. 4లక్షలు ఇలా మొత్తంగా రూ. 1.5కోట్ల వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది.స్పెషల్ షోస్‌కు ఈ రేంజ్లో వసూళ్లు రావడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. -
Sita Ramam: రెండో రోజు పుంజుకున్న‘సీతారామం’ కలెక్షన్స్.. ఎంతంటే?
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, మరాఠి భామ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘సీతారామం’. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా కీలక పాత్ర పోషించింది. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య ఆగస్ట్ 05న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. (చదవండి: 'సీతారామం' ఫస్ట్ ఛాయిస్ పూజా హెగ్డేనే, కానీ ఏమైందంటే..) పోటీలో ఉన్న ‘బింబిసార’ ఉండటం.. ఆ చిత్రానికి కూడా హిట్ టాక్ రావడంతో తొలిరోజు ‘సీతారామం’ రూ.3.05 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. అయితే రెండో మాత్రం ఈ చిత్రానికి కలెక్షన్స్ పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రెండో రూ. 3.63 కోట్లు షేర్ వసూలు సాధించింది. గ్రాస్ పరంగా చూస్తే ఇది రూ. 7.25 కోట్లు. మొత్తంగా ఈ చిత్రం రెండు రోజుల్లో రూ.6.68 కోట్ల షేర్, రూ.13.30 కోట్ల గ్రాస్ వసూళ్లని రాబట్టంది. ‘సీతారామం’ క్లాసిక్ లవ్ స్టోరీ కాబట్టి ఏ సెంటర్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయింది. బీ,సీ సెంటర్లో ‘బింబిసార’ జోరు వలన కలెక్షన్స్ పరంగా ఈ చిత్రం కాస్త వెనకబడింది.అయితే ఇలాంటి క్లాసిక్ చిత్రాలకు కలెక్షన్స్ మెల్లి మెల్లిగాపెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రానికి మొత్తంగా రూ.16.20 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిందంట. చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.17 కోట్ల వరకు సాధించాల్సి ఉంటుంది. ‘సీతారామం’ రెండు రోజుల కలెక్షన్స్.. ► నైజాం - రూ.1.39 కోట్లు ► సీడెడ్ - రూ.37 లక్షలు ► ఈస్ట్ - రూ.34 లక్షలు ► వెస్ట్ - రూ. 20 లక్షలు ► ఉత్తరాంధ్ర - రూ.55లక్షలు ► గుంటూరు- రూ. 30 లక్షలు ► కృష్ణా - రూ.30 లక్షలు ► నెల్లూరు - రూ.13 లక్షలు ► కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా- రూ.35 లక్షలు ► ఇతర భాషలు రూ. 90 లక్షలు ► ఓవర్సీస్ రూ.1.85 కోట్లు ► ప్రపంచ వ్యాప్తంగా మెత్తం రూ.6.68 కోట్లు(రూ.13.30 కోట్ల గ్రాస్) -
Bimbisara: రెండో రోజు అదే జోరు.. ఊహించని కలెక్షన్స్!
చాలా రోజుల తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఈ శుక్రవారం (ఆగస్ట్ 05) విడుదలైన బింబిసార, సీతారామం చిత్రాలు రెండూ హిట్ టాక్‌తో దూసుకెళ్తున్నాయి. వీటిలో కలెక్షన్స్ పరంగా బింబిసార ఒకడుగు ముందు ఉంది. కల్యాణ్ రామ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ వశిష్ట్ దర్శకత్వం వహించాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ నిర్మించారు. కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. (చదవండి: హీరోగా, నిర్మాతగా అభినందనీయం.. కానీ ఆ ట్యాగ్?) నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతూ రికార్డులు సృష్టిస్తోంది. తొలి రోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.7.27 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టగా.. రెండో రోజు కూడా అదే జోరును కొనసాగింది. రెండో రోజు ఈ చిత్రం రూ.4.52 కోట్లను రాబట్టింది. ఈ చిత్రానికి రూ.15.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.16 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు ఈ చిత్రం రెండు రోజులకి రూ.12.37 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కు రూ.3.63 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఆదివారం కూడా ఇదే జోరు కొనసాగితే ఈజీగా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బింబిసార’ రెండు రోజుల కలెక్షన్స్.. ► నైజాం - రూ. 3.92 కోట్లు ► సీడెడ్ - రూ. 2.24 కోట్లు ► ఈస్ట్ - రూ. 70 లక్షలు ► వెస్ట్ - రూ.55 లక్షలు ► ఉత్తరాంధ్ర - రూ.1.55 కోట్లు ► గుంటూరు- రూ.89 లక్షలు ► కృష్ణా - రూ.59 లక్షలు ► నెల్లూరు - రూ.38 లక్షలు ► కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా- రూ. 0.50 లక్షలు ► ఓవర్సీస్ రూ.1.05 కోట్లు ► ప్రపంచ వ్యాప్తంగా మెత్తం రూ. 12.37 కోట్లు(రూ.20 కోట్ల గ్రాస్) -
Sita Ramam Movie Box Office Collection: ‘సీతరామం’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే..
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘సీతారామం’. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(ఆగస్ట్ 05) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి తొలి రోజే పాజిటివ్ టాక్ వచ్చింది. సీత, రామ్‌ల లవ్‌స్టోరీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. (చదవండి: ‘సీతారామం’ మూవీ రివ్యూ) అయితే బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ చిత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టలేకపోయింది. ట్రేడ్ వర్గాల సమాచారం తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో సీతారామం సినిమాకు రూ. 2.25 కోట్లు గ్రాస్(రూ.1.50 కోట్ల షేర్) కలెక్షన్స్ వచ్చాయి. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 5.60 కోట్ల గ్రాస్, రూ. రూ.3.05 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. ‘సీతారామం’ క్లాసిక్ లవ్ స్టోరీ అవ్వడంతో ఏ సెంటర్ ఆడియన్స్ బాకా కనెక్ట్ అయినప్పటికీ.. బీ, సీ సెంటర్ ‘బింబిసార’ జోరు వలన ఈ చిత్రం భారీ కలెక్షన్స్‌ని రాబట్టలేకపోయింది. అయితే ఇలాంటి చిత్రాలకు కలెక్షన్స్ మెల్లి మెల్లిగా పెరిగే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘సీతారామం’ చిత్రానికి మొత్తంగా రూ.16.20 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిందంట. చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.17 కోట్ల వరకు సాధించాల్సి ఉంటుంది. తొలి రోజు రూ.3.05 కోట్లు వసూలు చేసింది. ఇంకా రూ.13.95 కోట్ల కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. ఈ చిత్రానికి వచ్చిన టాక్ని బట్టి చూస్తే.. బ్రేక్ ఈవెన్ ఈజీగా సాధిస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘సీతారామం’ తొలి రోజు కలెక్షన్స్.. ► నైజాం - రూ.54 లక్షలు ► సీడెడ్ - రూ.16 లక్షలు ► ఈస్ట్ - రూ.15 లక్షలు ► వెస్ట్ - రూ.8లక్షలు ► ఉత్తరాంధ్ర - రూ.23 లక్షలు ► గుంటూరు- రూ.16లక్షలు ► కృష్ణా - రూ.13 లక్షలు ► నెల్లూరు - రూ. 5లక్షలు ► కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా- రూ.15 లక్షలు ► ఓవర్సీస్ రూ.1.05 కోట్లు ► ఇతర భాషలు రూ.35 లక్షలు ► ప్రపంచ వ్యాప్తంగా మెత్తం రూ. రూ.3.05 కోట్లు(రూ.5.60 గ్రాస్ వసూలు) -
Bimbisara Box Office Collection: బాక్సాఫీస్‌పై ‘బింబిసారుడి’ దాడి.. తొలి రోజు ఎంతంటే..
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘బింబిసార’. ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్ క్యాప్షన్.ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ వశిష్ట్ దర్శకత్వం వహించాడు. కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(ఆగస్ట్ 05) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. తొలి రోజే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. (చదవండి: 'బింబిసార' మూవీ రివ్యూ) దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం దూసుకెళ్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం తొలి రోజు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.6.30 కోట్లు వసూలు చేయగా.. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం రూ.7.27 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టింది (చదవండి: బాక్సాఫీస్ కళ కళ.. సంతోషంలో స్టార్ హీరోలు..ట్వీట్స్ వైరల్) కల్యాణ్ రామ్ కెరీర్లో ఫస్ట్‌డే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా ‘బింబిసార’ నిలిచింది. కల్యాణ్ రామ్ గత ఐదు చిత్రాల ఫస్ట్ డే ఓపెనింగ్స్ గమనిస్తే.. ఎంత మంచివాడవురా రూ.2.20 కోట్లు, 118 రూ.1.60 కోట్లు, నా నువ్వే రూ.0.75 కోట్లు, ఎంఎల్ఏ రూ. 2.72 కోట్లు, ఇజం 3.09 కోట్ల షేర్స్ అందుకున్నాయి. రూ.40 కోట్ల బడ్జెట్‌తో బింబిసార చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి రూ.15.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.16 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. తొలిరోజే హిట్ టాక్ రావడంతో బ్రేక్ ఈవెన్ ఈజీగా దాటుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘బింబిసార’ తొలి రోజు కలెక్షన్స్.. ► నైజాం - రూ.2.15 కోట్లు ► సీడెడ్ - రూ.1.29 కోట్లు ► ఈస్ట్ - రూ.43 లక్షలు ► వెస్ట్ - రూ.36 లక్షలు ► ఉత్తరాంధ్ర - రూ.90 లక్షలు ► గుంటూరు- రూ.54 లక్షలు ► కృష్ణా - రూ. 34 లక్షలు ► నెల్లూరు - రూ.26 క్షలు ► కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా- రూ.0.32 లక్షలు ► ఓవర్సీస్ రూ.65లక్షలు ► ప్రపంచ వ్యాప్తంగా మెత్తం రూ. 7.27 కోట్ల షేర్ (రూ.11.50 కోట్ల గ్రాస్) -
‘రామారావు ఆన్ డ్యూటీ’ ఫస్ట్‌డే కలెక్షన్స్.. రవితేజకు భారీ షాక్!
మాస్ మహారాజా రవితేజ నటించిన లెటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. యువ దర్శకుడు శరత్ మండవ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్ గా నటించారు. భారీ అంచనాల మధ్య జులై 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి తొలిరోజు మిశ్రమ స్పందన లభించింది.దీంతో ఈ చిత్రం తొలి రోజే బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. (చదవండి: ‘రామారావు ఆన్ డ్యూటీ’ మూవీ రివ్యూ) ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం కేవలం రూ.3.30 కోట్ల షేర్ ను రాబట్టింది. తెలుగు రాష్ట్రాలలో రూ.2.82 కోట్లను రాబట్టి..ఇటీవల కాలంలో రవితేజ కెరీర్లో ఫస్ట్‌డే అతి తక్కువ వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. రవితేజ గత ఐదు చిత్రాల ఫస్ట్ డే ఓపెనింగ్స్ గమనిస్తే... ఖిలాడీ రూ. 4.30 కోట్లు, క్రాక్ రూ. 6.25, డిస్కో రాజా రూ.2.54 అమర్ అక్బర్ ఆంటోని రూ. 3.40 కోట్ల షేర్స్ అందుకున్నాయి. ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రానికి రూ.17.72 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.18 కోట్ల షేర్ ను రాబట్టాలి. ‘రామారావు ఆన్ డ్యూటీ’ తొలి రోజు కలెక్షన్స్.. ► నైజాం - రూ.85 లక్షలు ► సీడెడ్ - రూ.52 లక్షలు ► ఈస్ట్ - రూ.31 లక్షలు ► వెస్ట్ - రూ.16 లక్షలు ► ఉత్తరాంధ్ర - రూ.45 లక్షలు ► గుంటూరు- రూ.24 లక్షలు ► కృష్ణా - రూ.17 లక్షలు ► నెల్లూరు - రూ.12 లక్షలు ► రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ - రూ.58 లక్షలు ► ప్రపంచ వ్యాప్తంగా మెత్తం రూ. 3.30 కోట్ల షేర్ -
‘థాంక్యూ’ ఫస్ట్ డే కలెక్షన్స్.. చైతూ కెరీర్లోనే తొలిసారి ఇలా..
నాగచైతన్య, రాశీఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘థాంక్యూ’. ‘మనం’లాంటి క్లాసిక్ హిట్ తర్వాత నాగచైతన్య, విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రమిది. అవికా గోర్, మాళవికా నాయర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. (చదవండి: ‘థాంక్యూ’ మూవీ రివ్యూ) భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(జులై 22) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. దీంతో తొలి రోజు ఆశించిన స్థాయిలో వసూళ్లని రాబట్టలేకపోయింది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు ఈ చిత్రం కేవలం రూ. 1.65 కోట్ల మాత్రమే వసూలు చేసింది. మొత్తంగా రూ. 2.16 కోట్లు షేర్ కలెక్షన్స్‌ని రాబట్టింది. ఈ చిత్రం దాదాపు రూ.24 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. హిట్ అని పించుకోవాలంటే దాదాపు రూ. 25 కోట్ల వసూళ్లని రాబట్టాలి. కానీ తొలి రోజు కేవలం రూ.2.23 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఇటీవల కాలంలో నాగచైతన్య నటించిన ఏ చిత్రానికి కూడా తొలి రోజు ఇంత తక్కువ కలెక్షన్స్ రాలేదు. తండ్రి నాగార్జునతో కలిసి నటించిన బంగార్రాజు చిత్రం తొలి రోజు రూ.9.06 కోట్లు వసూలు చేస్తే.. సోలో హీరోగా నటించిన లవ్‌స్టోరీ రూ. 7.13 కోట్లు, మజిలీ 5.6 కోట్లు వసూలు చేసింది. ‘థ్యాంక్యూ’ తొలి రోజు కలెక్షన్స్.. ► నైజాం - రూ. 72 లక్షలు ► సీడెడ్ - రూ. 20 లక్షలు ► ఈస్ట్ - రూ. 14 లక్షలు ► వెస్ట్ - రూ. 8 లక్షలు ► ఉత్తరాంధ్ర - రూ. 22 లక్షలు ► గుంటూరు- రూ. 10 లక్షలు ► కృష్ణా - రూ. 12 లక్షలు ► నెల్లూరు - రూ. 7 లక్షలు ► కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా- రూ.6 లక్షలు ►ఓవర్సీస్- రూ. రూ.45 లక్షలు ►మొత్తం- 2.16 కోట్లు షేర్, రూ.3.70 కోట్లు గ్రాస్ -
F3: సమ్మర్ సోగ్గాళ్లకు 40 రోజులు పూర్తి.. ఎన్ని కోట్లు వసూలు చేశారంటే..
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ హీరోలుగా నటించిన చిత్రం ఎఫ్3. తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించగా, రాజేంద్రప్రసాద్, మురళీ శర్మ, అలీ, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం మే 27న విడుదలై త్రిపుల్ బస్టర్‌గా నిలిచింది. వరుణ్, వెంకటేశ్‌ల కామెడీకి థియేటర్లలో ప్రేక్షకులు పగలబడి నవ్వారు. నేటితో ఈ చిత్రం 40 రోజులు పూర్తి చేసుకొని 50 రోజుల థియేట్రికల్ రన్ దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలలో 10 థియేటర్లపై పైగా విజయవంతంగా రన్ అవుతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. (చదవండి: ఏదైనా సూటిగా చెప్తా.. డబుల్ మీనింగ్ ఉండదు : నాగచైతన్య) సమ్మర్ సోగాళ్లు అంటూ వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో నవ్వులు పూయించడమే కాకుండా... నిర్మాతలకు కాసుల వర్షాన్ని కూడా కురిపించింది. ఒక్క నైజాంలో ఈ చిత్రం రూ.20 కోట్లకు పైగా షేర్ వసూళ్లను సాధించడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 134 కోట్ల గ్రాస్, రూ.70.94 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టింది. నిర్మాతల నిర్ణయం మేరకు దాదాపు 50 రోజుల తర్వాతే ఈ చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. జులై 22న ఈ చిత్రం సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. మరి థియేటర్లలో నవ్వులు పూయించిన ఈ చిత్రం.. ఓటీటీ వేదికపై ఎలాంటి రికార్డు క్రియేట్ చేస్తుందో చూడాలి. ఎఫ్3 క్లోజింగ్ కలెక్షన్స్ ► నైజాం - రూ.20.57 కోట్లు ► సీడెడ్ -8.58 కోట్లు ► ఈస్ట్ - 4.18 కోట్లు ► వెస్ట్ -3.14 కోట్లు ► ఉత్తరాంధ్ర - 7.48 కోట్లు ► గుంటూరు- 4.18 కోట్లు ► కృష్ణా -3.23 కోట్లు ► నెల్లూరు - 2.31 కోట్లు ► రెస్టాఫ్ ఇండియా- 2 కోట్లు ► ఓవర్సీస్- రూ.10 కోట్లు ► ఏపీ/తెలంగాణ వాటా- రూ.53.94 కోట్లు ► మొత్తం రూ.134 కోట్లు(గ్రాస్),రూ.70.94 కోట్లు(షేర్) #F3Movie Continues the Glorious Run of 40 DAYS in Theatres! 🥳✨ Sticked to the word of not releasing in OTT until 8 weeks & Running Successfully! 👍🏻✅#F3TripleBlockbuster 🔥🤩@VenkyMama @IAmVarunTej @AnilRavipudi @tamannaahspeaks @Mehreenpirzada @SVC_official @adityamusic pic.twitter.com/ne28cInzNO — Sri Venkateswara Creations (@SVC_official) July 5, 2022