
విక్కీ కౌశల్(Vicky Kaushal), రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ఛావా’(Chhaava Movie). మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథతో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి..తొలి రోజే హిట్ టాక్‌కి అందుకుంది. విక్కీ యాక్టింగ్‌తో పాటు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ మేకింగ్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా అద్భుతంగా తీశారని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. పాజిటివ్ టాక్ రావడంతో తొలి రోజే ఈ చిత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టింది.
మొదటి రోజు ఈ చిత్రం దాదాపు రూ.31 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాల అంచనా వేశాయి. ఈ ఏడాదిలో బాలీవుడ్‌లో ఇదే బిగ్గెస్ట్ ఓపెనింగ్. విక్కీ కౌశల్ కెరీర్‌లోనే ఈ స్థాయి ఓపెనింగ్స్ రాబట్టిన తొలి చిత్రంగా ‘ఛావా’ నిలిచింది. గతంలో విక్కీ నటించిన సినిమాలలో తొలి రోజు అత్యధికంగా బాడ్ న్యూజ్(2024) రూ.8.62 కోట్లు, సామ్ బహదూర్ రూ.5.75 కోట్లు, జరా హాట్కే జరా బచ్కే రూ.5.49 కోట్లు సాధించాయి. ఛావా సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్‌లో కలెక్షన్స్ భారీగా పెరిగే చాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
విక్కీపై ప్రశంసలు..
‘ఛావా’విజయంలో విక్కీ కౌశల్ కీలక పాత్ర పోషించాడు. శంభాజీగా విక్కీ కౌశల్‌ను తప్ప మరొకరిని ఊహించుకోలేని విధంగా నటించాడని పలు వెబ్‌సైట్స్ తమ రివ్యూలో తెలిపాయి. వార్ యాక్షన్స్ అదరగొట్టేశాడట. క్లైమాక్స్ ఫైట్ సీన్‌లో వీక్కీ రుద్ర తాండవం చేశాడని చెబుతున్నారు. శంభాజీ భార్య ఏసుబాయిగా రష్మిక కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది. ఉటేకర్ ఎంచుకున్న పాయింట్‌లో గొప్ప కథ, ఊహించని ట్విస్ట్‌లు లేకపోయినా శంభాజీ పాత్ర, యాక్షన్ సీక్వెన్స్ సినిమాను నిలబెట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment