‘అర్జున్ రెడ్డి’ కి కలెక్షన్ల వర్షం..
వివాదాలు, ప్రశంసలతో ఓ ట్రెండ్ సృష్టించిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకెళ్తుంది. విజయ్ దేవరకొండ, శాలిని పాండే జోడిగా సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ తొలి వారంలోనే 30 కోట్ల మార్కును దాటింది. ఎలాంటి పెద్ద స్టార్లు లేకుండా ఆగస్టు 25న విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మంచి హిట్ టాక్ తెచ్చుకొంది. తాజా ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు అర్జన్‌రెడ్డి తొలి వారంలోనే 34.3 కోట్ల గ్రాసును వసూలు చేసింది. చిన్న బడ్డెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం డిస్టిబ్యూటర్లకు లాభాల పంట పండిస్తోంది.
ఇటీవల కాలంలో ఏ సినిమా లేనంతా నిడివితో రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి సినిమాకు మరో పది నిమిషాల సీన్స్ ను యాడ్ చేశారు. మూడు గంటల ఒక నిమిషం నిడివితో రిలీజ్ అయిన ఈ సినిమా ఇక పై మూడు గంటల పదకొండు నిమిషాల నిడివితో ప్రదర్శించనున్నారు. ఈ సీన్స్ ను సెకండ్ హాఫ్ లో యాడ్ చేయనున్నారట. సోమవారం నుంచి థియేటర్ల సంఖ్య కూడా పెరుగుతుండటంతో అదే రోజు ఈ సన్నివేశాలను యాడ్ చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే భారీ వసూళ్లతో దూసుకుపోతున్న అర్జున్ రెడ్డి.. కొత్త సీన్స్ యాడ్ చేసిన తరువాత మరోసారి సత్తా చాటుతుందని భావిస్తున్నారు మేకర్స్.