
టాలీవుడ్‌లో చాలా రోజుల తర్వాత ఓ చిన్న సినిమా భారీ విజయాన్ని అందుకుంది. భారీ అంచనాలతో వచ్చిన కొన్ని పెద్ద సినిమాలు సైతం రెండు, మూడు రోజులకే ఢీలా పడుతున్నవేళ..ఈ చిన్న చిత్రం మాత్రం రోజు రోజుకి కలెక్షన్స్‌ని పెంచుకుంటూ రికార్డు దిశగా పరుగులు తీస్తోంది. ఆ చిత్రం పేరే ‘కోర్ట్’ (Court: State Vs Nobody). నాని (Nani) నిర్మించిన ఈ మూవీ ఈ నెల 14న విడుదలై తొలి రోజే పాజిటివ్ టాక్‌ని సంపాదించుకుంది.
ఫలితంగా మొదటి రోజే రూ. 8 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. పాజిటివ్ మౌత్‌టాక్‌తో వీకెండ్‌లో కలెక్షన్స్ భారీగా పెరిగాయి. మొత్తంగా రిలీజైన నాలుగు రోజులకే రూ. 28.9 కోట్లను రాబట్టి.. నానికి కాసుల వర్షం కురిపించిదీ చిత్రం. ఒక్క నాలుగో రోజునే 4.50 కోట్ల గ్రాస్ సాధించిదంటే.. ఈ చిన్న చిత్రం సత్తా ఎంటో అర్థం చేసుకోవచ్చు.
ఓవర్సీస్‌లోనూ ఈ సినిమా బాగా వసూళ్లు రాబడుతోంది. ఈ వీకెండ్‌లో ఓవర్సీస్ కలెక్షన్స్ 1 మిలియన్ డాలర్స్ దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కోర్ట్ విషయానికొస్తే.. రామ్ జగదీశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించగా.. శివాజీ కీలక పాత్ర పోషించాడు. చిన్న పిల్లల రక్షణ కోసం భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పోక్సో చట్టం గురించి ఈ చిత్రంలో చర్చించారు. కోర్ట్‌రూమ్ డ్రామా బాగా పండడం, ఎమోషనల్ సన్నివేశాలు హృదయాలను హత్తుకునేలా ఉండడం సినిమాకు విజయాన్ని అందించాయి.
#CourtTelugu continues its dominance at the box office this week ❤🔥
Collects a gross of 28.9+ CRORES WORLDWIDE in 4 days 💥💥
Book your tickets for #Court now!
▶️ https://t.co/C8ZZHbyhHW#CourtStateVsANobody ⚖️
Presented by Natural Star @NameisNani
Starring… pic.twitter.com/AiUSVO3RCD— Wall Poster Cinema (@walpostercinema) March 18, 2025
Comments
Please login to add a commentAdd a comment