సంక్రాంతికి వస్తున్నాం ఖాతాలో మరో రికార్డు.. 'డాకు..' కలెక్షన్స్‌ ఎంతంటే? | Sankranthiki Vasthunnam Movie Break RRR Record And Daku Maharaj Movie Collections, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

ఆర్‌ఆర్‌ఆర్‌ రికార్డు బద్దలు కొట్టిన వెంకీ మామ.. మరి డాకు మహారాజ్‌ పరిస్థితేంటి?

Published Mon, Jan 20 2025 1:44 PM | Last Updated on Mon, Jan 20 2025 2:38 PM

Sankranthiki Vasthunnam Movie Break RRR Record, Daku Maharaj Movie Collections

సంక్రాంతి బరిలో దిగిన గేమ్‌ ఛేంజర్‌ సినిమా సైలెంట్‌ అయిపోయింది. మొదట్లో డాకు మహారాజ్‌ (Daaku Maharaaj Movie) బాక్సాఫీస్‌ దగ్గర అదరగొట్టగా దాన్ని సైతం వెనక్కు నెడుతూ టాప్‌ ప్లేస్‌లో నిలబడింది సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam Movie). జనవరి 14న విడుదలైన ఈ సినిమా కలెక్షన్ల వరద పారిస్తోంది. ఐదు రోజుల్లోనే ఈ చిత్రం రూ.165 కోట్లకు పైగా రాబట్టింది. ఆరో రోజు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్స్‌ వసూలు చేసిన సినిమాగా రికార్డుకెక్కిందని చిత్రయూనిట్‌ ప్రత్యేకంగా పోస్టర్‌ రిలీజ్‌ చేసింది. 

ఆరో రోజు ఎక్కువ షేర్‌ (రూ.9.54 కోట్ల షేర్‌) సాధించిన సినిమాగా ఆర్‌ఆర్‌ఆర్‌ పేరిట రికార్డు భద్రంగా ఉండేది. నిన్నటితో సంక్రాంతికి వస్తున్నాం ఆ రికార్డును బద్ధలు కొట్టింది.  విక్టరీ వెంకటేశ్‌ (Venkatesh Daggubati) కెరీర్‌లోనే ఈ సినిమా ఆల్‌టైం హిట్‌గా నిలిచింది. ఇప్పటికే రూ.100 కోట్ల షేర్‌ కూడా వచ్చేసిందని తెలిపింది. అటు నార్త్‌ అమెరికాలోనూ సినిమా జోరు ఏమాత్రం తగ్గడం లేదు. అక్కడ ఇప్పటివరకు 2.1 మిలియన్‌ డాలర్ల గ్రాస్‌ వసూలు చేసింది. యూకెలో 1,95,628 పౌండ్లు వసూలు చేసింది. ఈ బ్లాక్‌బస్టర్‌ సినిమాకు సీక్వెల్‌ కూడా ఉంటుందని ప్రకటించాడు దర్శకుడు అనిల్‌ రావిపూడి. అది కూడా మళ్లీ సంక్రాంతికే రిలీజ్‌ చేస్తామని తెలిపాడు.

డాకు మహారాజ్‌ కలెక్షన్స్‌ ఎంత?
డాకు మహారాజ్‌ సినిమా విషయానికి వస్తే.. నందమూరి బాలకృష్ణ నటించిన ఈ చిత్రానికి ఎనిమిది రోజుల్లో రూ.156 కోట్లు వచ్చాయి. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధికారిక పోస్టర్‌ ద్వారా వెల్లడించింది. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్‌, శ్రద్ధా శ్రీనాథ్‌ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఐటం సాంగ్‌లో మెరిసింది. తమన్‌ సంగీతం అందించగా నాగవంశీ నిర్మాతగా వ్యవహరించాడు.

 

 

చదవండి: వర్మ కళ్లు తెరిపించిన సత్య.. ఒట్టు, ఇకపై అలాంటి సినిమాలు చేయను!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement