సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam Movie).. సినిమా టైటిట్ ఏ ముహూర్తాన పెట్టారో కానీ సంక్రాంతి కళ మొత్తం బాక్సాఫీస్ వద్దే కనిపిస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్ చలో అంటూ థియేటర్‌కు క్యూ కట్టారు. సినిమాలంటే పెద్దగా ఇష్టపడని వాళ్లు కూడా కాసేపు సరదాగా నవ్వుకోవడానికైనా ఈ మూవీకెళ్దామని అనుకుంటున్నారు. అక్కడే అనిల్ రావిపూడి సక్సెస్ అయిపోయాడు.
సూపర్ హిట్‌గా సంక్రాంతికి వస్తున్నాం
2025 సంక్రాంతికి గేమ్ ఛేంజర్ (Game Changer Movie), డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు రిలీజయ్యాయి. రెండు రోజుల వ్యవధితో ఒక్కో సినిమా విడుదలైంది. జనవరి 10న వచ్చిన గేమ్ ఛేంజర్ ఎక్కువగా నెగెటివ్ టాక్ తెచ్చుకోగా జనవరి 12న రిలీజైన డాకు మహారాజ్ (Daaku Maharaaj Movie)కు స్పందన బాగుంది. చివరగా జనవరి 14న విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం మూవీ.. బ్లాక్‌బస్టర్ టాక్ సంపాదించుకుంది. వెంకటేశ్ కెరీర్‌లోనే అత్యధికంగా తొలి రోజే రూ.45 కోట్లు సంపాదించింది.
(చదవండి: మంచు మనోజ్ అభిమానులపై మోహన్‌బాబు బౌన్సర్ల దాడి)
గర్వంగా ఉంది
తాజాగా ఈ సినిమాపై హీరో మహేశ్‌బాబు (Mahesh Babu) స్పందించాడు. సంక్రాంతికి వస్తున్నాం అసలు సిసలైన పండగ సినిమా. ఈ మూవీ చూసి చాలా ఆనందించాను. వెంకటేశ్ సర్ మీరు అదరగొట్టారు. వరుస బ్లాక్‌బస్టర్స్ ఇస్తున్న అనిల్ రావిపూడిని చూస్తుంటే ఒకింత సంతోషంగా, ఒకింత గర్వంగా ఉంది. ఐశ్వర్య, మీనాక్షి తమ పాత్రల్లో అద్భుతంగా నటించారు. పిల్లాడు బుల్లిరాజు యాక్టింగ్ అయితే వేరే లెవల్. సినిమా యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు అని ట్వీట్ చేశాడు.
పొంగల్ విన్నర్?
ఇది చూసిన జనాలు సంక్రాంతికి వచ్చేస్తున్నాం సినిమాను పొంగల్ విన్నర్‌గా పేర్కొంటున్నారు. మరికొందరేమో మహేశ్‌బాబు.. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలకు ఎలాంటి రివ్యూ ఇవ్వకుండా కేవలం ఈ ఒక్క సినిమాకు ఇచ్చాడంటేనే ఏది హిట్టో తెలిసిపోతోందని కామెంట్లు చేస్తున్నారు. కాగా మహేశ్, వెంకటేశ్.. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో అన్నదమ్ములుగా నటించారు. ఇందులో వెంకటేశ్ పెద్దోడిగా, మహేశ్ చిన్నోడిగా యాక్ట్ చేశారు.
సినిమా విశేషాలు
సంక్రాంతి సినిమా విషయానికి వస్తే.. వెంకటేశ్ (Venkatesh Daggubati) హీరోగా నటించగా ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ సినిమాలో బాగా హైలైట్ అయిన పాత్రల్లో బుల్లిరాజు ఒకటి. బుల్లి రాజుగా చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ భీమల నటించాడు. అతడి పాత్రకు అద్భుతమైన స్పందన లభిస్తోంది.
గతేడాది సంక్రాంతికి డిజాస్టర్
వెంకటేశ్ కెరీర్‌లో సంక్రాంతికి వచ్చిన మెజారిటీ సినిమాలు విజయం సాధించాయి. కానీ గతేడాది మాత్రం ఈ సమయానికి డిజాస్టర్ మూటగట్టుకున్నాడు. సైంధవ్ చిత్రంతో ఫ్లాప్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈసారి మాత్రం అలాంటి పొరపాటు మళ్లీ జరగకుండా జాగ్రత్తపడ్డాడు. సంక్రాంతికి వచ్చేస్తున్నాంతో బ్లాక్‌బస్టర్ పొంగల్ సెలబ్రేట్ చేసుకుంటున్నాడు.
జీవిత సూత్రాలు
ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో నేటి తరానికి కొన్ని సూచనలు ఇచ్చాడు. జీవితాన్ని హాయిగా.. సంతోషంగా జీవించాలి. అత్యాశలకు పోకూడదు. అతిగా ఆలోచించకూడదు. మన ఆలోచనలు సానుకూలంగానే ఉండాలి. అదే సమయంలో మనం ఏదైనా కోరుకుంటున్నప్పుడు ఆ పనిని నిజాయితీతో చేయాలి. క్రమశిక్షణగా ఉండాలి... కష్టపడాలి. అప్పుడు సాధ్యమౌతుంది. లైఫ్‌లో ఎప్పుడూ హోప్‌ను కోల్పోకూడదు అని చెప్పాడు.
Enjoyed watching #SankranthikiVasthunam , A proper festive film... @VenkyMama sir is just terrific👌👌👌
So proud and happy for my director @AnilRavipudi
for giving consecutive Blockbusters 👍👍👍@aishu_dil @Meenakshiioffl were superb in their characters.
The kid "Bulli…— Mahesh Babu (@urstrulyMahesh) January 15, 2025
చదవండి: పీరియడ్స్ అన్నా పట్టించుకోరు... అతనొక్కడే...: నిత్యామీనన్
Comments
Please login to add a commentAdd a comment